
సాక్షి, జమ్మూ : ధైర్యముంటే లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేయండన్న ఫారుక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ‘ఫరుఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుంటున్నాం.. లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తామని’ శివసేన జమ్మూ కశ్మీర్ విభాగం బుధవారం ప్రకటించింది.
లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసేందుకు ఇప్పటికే ప్రత్యేకమైన టీమ్‌ను పంపినట్లు శివసేన జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్ డింపీ కోహ్లీ తెలిపారు. రేపు లాల్ చౌక్‌లో భారత జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దీనిని ధైర్యమున్నవారు ఆపొచ్చు అని ఆయన సవాల్ విసిరారు.