Hoist
-
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అమిత్ షా
-
స్వాతంత్య్ర వేడుకల్లో సీమా హైదర్.. జేజేలు కొడుతూ..
లక్నో: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. ప్రియుడు సచిన్ కోసం స్వదేశం దాటిన ఈ వివాహిత తిరంగ జెండాను ఎత్తి నినాదాలు చేస్తోంది. యూపీలో 'హర్ గర్ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్‌తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. అయితే.. పాక్ దేశీయురాలు సీమా హైదర్‌కు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా(ఎమ్ఎన్ఎస్) సీమా హైదర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్‌ను తిరస్కరించానని తాజాగా ప్రకటించారు. #Pakistan national #SeemaHaider was seen hoisting the Tricolour at her house in #Noida as part of #HarGharTiranga campaign ahead of #IndependenceDay.https://t.co/NUvcWcZMeB — IndiaToday (@IndiaToday) August 14, 2023 తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చేరింది సీమా హైదర్. తన ప్రియుడు సచిన్‌తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తాను తన ప్రియునితోనే ఉంటానని పాక్ పంపించవద్దని రాష్ట్రపతికి కూడా ఇటీవల అప్పీల్ చేసింది. సీమా మిస్టరీ.. 2019లోనే సిమా హైదర్, సచిన్ ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత సచిన్ కోసం ఆమె దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వెళ్లింది. అక్కడి నుంచి భారత్ చేరుకుంది. పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరిపింది. సచిన్‌తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: అజిత్‌తో రహస్య భేటీ.. ఇంట్లో వ్యక్తిని కలిస్తే తప్పేంటన్న శరద్ పవార్ -
జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటవైపుగా దూసుకొచ్చారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికపై తమ ఉద్యమ జెండాను ఎగురవేశారు. బారికేడ్లు, లాఠీలు, టియర్ గ్యాస్ ఆందోళనల మధ్య ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు వీటన్నిటినీ అధిగమించి వేలాదిగా ఎర్రకోటకు చేరుకోవడం విశేషం. (బ్రేకింగ్: రైతులపై విరిగిన లాఠీలు)మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా రిపబ్లిక్ డే సందర్భంగా వేలాది ట్రాక్టర్లతో రైతులు చేపట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోకి ఆందోళనకారులు చొచ్చుకురావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. పోలీసులు రైతులపై బాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీలతో విరుచుకు పడ్డారు. ఈ ఘర్షణలో అటు పోలీసులు, ఇటు రైతులు గాయపడిన సంగతి తెలిసిందే.#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ— ANI (@ANI) January 26, 2021 -
‘లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తాం’
సాక్షి, జమ్మూ : ధైర్యముంటే లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేయండన్న ఫారుక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ‘ఫరుఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుంటున్నాం.. లాల్‌చౌక్‌లో జెండా ఎగరేస్తామని’ శివసేన జమ్మూ కశ్మీర్ విభాగం బుధవారం ప్రకటించింది. లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసేందుకు ఇప్పటికే ప్రత్యేకమైన టీమ్‌ను పంపినట్లు శివసేన జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్ డింపీ కోహ్లీ తెలిపారు. రేపు లాల్ చౌక్‌లో భారత జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దీనిని ధైర్యమున్నవారు ఆపొచ్చు అని ఆయన సవాల్ విసిరారు. -
'వారి వల్లే పాక్ జెండాలు ఎగురుతున్నాయి'
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ నేత జహంగీర్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం సరిగా పాలించకపోవడం, జమ్మూకాశ్మీర్ పై ప్రత్యేక దృష్టిని పెట్టకపోవడం వల్ల అక్కడి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు అంత తేలికగా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఎవరు పాకిస్థాన్ జెండాలు ఎగురు వేస్తున్నారో వారిపై ఒత్తిడిలు తీసుకురావాలని, వారిని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రత్యేక వాదులు ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో పాకిస్థాన్ జెండాలను కొందరు ఎగురవేస్తున్న విషయం తెలిసిందే.