తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటవైపుగా దూసుకొచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ: తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటవైపుగా దూసుకొచ్చారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికపై తమ ఉద్యమ జెండాను ఎగురవేశారు. బారికేడ్లు, లాఠీలు, టియర్ గ్యాస్ ఆందోళనల మధ్య ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు వీటన్నిటినీ అధిగమించి వేలాదిగా ఎర్రకోటకు చేరుకోవడం విశేషం. (బ్రేకింగ్: రైతులపై విరిగిన లాఠీలు)
మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్ల సాధనకోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా రిపబ్లిక్ డే సందర్భంగా వేలాది ట్రాక్టర్లతో రైతులు చేపట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ ఢిల్లీలోకి ఆందోళనకారులు చొచ్చుకురావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. పోలీసులు రైతులపై బాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీలతో విరుచుకు పడ్డారు. ఈ ఘర్షణలో అటు పోలీసులు, ఇటు రైతులు గాయపడిన సంగతి తెలిసిందే.
#WATCH A protestor hoists a flag from the ramparts of the Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/Mn6oeGLrxJ
— ANI (@ANI) January 26, 2021