లక్నో: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన అధికారిక నివాసంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ రోజున భారతదేశం తన రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా సార్వభౌమ, సంపన్న, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం దక్కించుకుంది. భారతదేశం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్‌ను రూపొందించే బాధ్యత బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్‌కు అప్పగించారు. ఆయన 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభకు ముసాయిదాను సమర్పించారు. 1950 జనవరి 26న భారతదేశం సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment