Flag
-
ఆరు వందేభారత్‌లకు మోదీ పచ్చ జెండా
న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్బాద్లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్‌కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుమొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. #WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK— ANI (@ANI) September 15, 2024 -
Bangladesh: నిరసనల మధ్య.. జెండాల విక్రేత కథ వైరల్
సాధారణంగా ఎక్కడైనా నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు దానిలో పాల్గొన్నవారు జెండాలను, ప్లకార్డులను పట్టుకోవడాన్ని మనం చూస్తుంటాం. వీటిని ప్రదర్శించడం ద్వారా వారు తమ వాదనను బలంగా వినిపిస్తుంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విద్యార్థులు స్థానిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వీరికి జెండాలను, హెడ్ బ్యాండ్లను విక్రయిస్తూ ఓ వ్యాపారి అత్యధికంగా సంపాదిస్తున్నాడు.ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య రాజధాని ఢాకాలో జాతీయ జెండాలు, హెడ్బ్యాండ్లకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. దీనిని గుర్తించిన సుమన్(35) అనే వ్యాపారి నిరసనకారులకు అవసరమైన జెండాలను, హెడ్ బ్యాండ్లను విక్రయిస్తున్నాడు. 1989లో ఢాకాలో జన్మించిన సుమన్, బంగ్లాదేశ్ జెండాలతో పాటు మూడు వేర్వేరు సైజుల హెడ్బ్యాండ్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తాను రూపొందిస్తున్న బంగ్లాదేశ్ జాతీయ జెండాలకు, గ్రీన్ హెడ్బ్యాండ్లు విద్యార్థులు విరివిగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు.సుమన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఢాకాలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాను. నా పేరు విన్నవాళ్లంతా నా తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందిన వారని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు, మా ఇంటిపక్కన ఉండే ఓ హిందూ మహిళ నాకు సుమన్ అనే పేరు పెట్టింది. భారతీయ సంతతికి చెందిన నా తండ్రి 1971లో కలకత్తా నుండి ఢాకాకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. నేను పెరిగి పెద్దయ్యాక జాతీయ జెండాలు రూపొందిస్తూ, వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలి కాలంలో తాను 1,500 జెండాలు, 500 హెడ్బ్యాండ్లను విక్రయించానని’ తెలిపారు. సుమన్ తన జీవనోపాధి కోసం 2018 నుండి జెండాలు విక్రయిస్తున్నాడు. ఢాకాలో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో కూడా సుమన్ జాతీయ జెండాలను విక్రయిస్తుంటాడు. STORY | Meet Mohd Suman: Flag-seller who saw #Dhaka protests up, close and personalREAD: https://t.co/X303wK81Nj(PTI Photo) pic.twitter.com/Ux18GikLbg— Press Trust of India (@PTI_News) August 27, 2024 -
నటుడు విజయ్ ‘పొలిటికల్ పార్టీ’ జెండా ఆవిష్కరణ (ఫొటోలు)
-
టీవీకే జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రంలో ఆయన తల్లిండ్రులు, మద్దతుదారులు, ఫ్యాన్స్ పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.#WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag and symbol today.(Source: ANI/TVK) pic.twitter.com/J2nk2aRmsR— ANI (@ANI) August 22, 2024 #WATCH | Chennai, Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay takes pledge along with party workers and leaders at the party office in Chennai "We will always appreciate the fighters who fought and sacrificed their life for the liberation of our country… pic.twitter.com/amiti3rBC2— ANI (@ANI) August 22, 2024 -
Pakistan: జెండాలు విక్రయిస్తున్న దుకాణంపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
పాకిస్తాన్ ఈరోజు(ఆగస్టు 14)న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. అయితే ఈ సమయంలోనూ పాక్‌లో విషాదం చోటుచేసుకుంది. కొందరు ఉగ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాతీయ జెండాలు విక్రయిస్తున్న దుకాణంతో పాటు ఒక ఇంటిపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈ గ్రూప్ జాతీయ జెండాలను విక్రయించవద్దని, ఆగస్టు 14న సెలవుదినాన్ని జరుపుకోవద్దని దుకాణాల యజమానులను హెచ్చరించింది. కాగా ఈ దాడిలో గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందించాలన్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాడులు తీవ్రమయ్యాయి. 2022, 2023లలో కూడా పాక్ జెండాలను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు జరిగాయి. -
Independence Day 2024: ఎర్రకోటపై జెండా ఎగురవేయని ఇద్దరు ప్రధానులు
అది 1947.. ఆగస్టు 15.. భారతదేశం బ్రిటీషర్ల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. 200 ఏళ్లుగా బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉన్న యూనియన్ జాక్ జెండా అవనతం అయ్యింది. భారత జాతీయ జెండా రెపరెపలాడింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవాన భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.అయితే స్వతంత్ర భారతంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధానలు గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉన్నారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు.1964 మే 27 నుండి జూన్ 9 వరకు మొదటిసారి, 1966 జనవరి 11 నుండి జనవరి 24 వరకు రెండవసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన 1990 నవంబర్ 10 నుండి 1991, జూన్ 21 వరకు 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు. -
ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు
సాక్షి,హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
Independence Day 2024: 16 రాష్ట్రాలకు గ్వాలియర్ త్రివర్ణ పతాకాలు
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లో తయారైన త్రివర్ణ పతాకాలను 16 రాష్ట్రాల్లో ఎగురవేయనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 14 రాష్ట్రాలకు అందించేందుకు త్రివర్ణ పతాకాలను తయారు చేసేవారు. ఇప్పుడు కేరళ, కర్నాటక రాష్ట్రాలకు అందించేందుకు కూడా ఇక్కడే జాతీయ జెండాలను తయారుస్తున్నారు. గ్వాలియర్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎనిమిది వేల త్రివర్ణ పతాకాలను పంపించారు.తాజాగా మరో రెండు వేల త్రివర్ణ పతాకాలకు ఆర్డర్లు అందాయి. ఈ సందర్భంగా కేంద్ర భారత ఖాదీ యూనియన్ కార్యదర్శి రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం అనే ప్రభుత్వ నినాదం చురుగ్గా సాగుతున్నదన్నారు. గ్వాలియర్‌కు చెందిన 196 మందితో కూడిన బృందం త్రివర్ణ పతాకాలను రూపొందిస్తోంది. -
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
10 ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా!
దేశంలోని ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలను కూడా స్వాగతించారు. ‘రైల్వేని నరకం నుంచి బయటపడేశాం’ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. తమ ఈ పదేళ్ల కృషి కేవలం ట్రైలర్ మాత్రమేనని, మనం మరింత ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు. 10 రైళ్ల వివరాలు ఇవే.. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ సికింద్రాబాద్-విశాఖపట్నం మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై) పాట్నా- లక్నో న్యూ జల్పాయిగురి-పాట్నా పూరీ-విశాఖపట్నం లక్నో – డెహ్రాడూన్ కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు రాంచీ-వారణాసి ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. Honourable PM @narendramodi ji virtually flags off Second Vande Bharat Express between Secunderabad & Visakhapatnam, facilitating swift connectivity between #Telangana & #AndhraPradesh.#VandebharatExpress #ModiKiGuarantee pic.twitter.com/t8nDqOlqzi — Dr K Laxman (Modi Ka Parivar) (@drlaxmanbjp) March 12, 2024 ప్రారంభించిన కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. Live: Flagging off 4th Vande Bharat Train From Telangana, Secunderabad - Visakhapatnam (Train Number 20707), Secunderabad Railway Station. https://t.co/wkmmWP0wth — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 12, 2024 మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు అహ్మదాబాద్‌లోని సబర్మతిలోగల మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొచరబ్ ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నేడు (మంగళవారం) ప్రధాని మోదీ గుజరాత్, రాజస్థాన్‌లలో పర్యటిస్తున్నారు. #WATCH | Prime Minister Narendra Modi offers floral tributes to Mahatma Gandhi at Mahatma Gandhi Ashram at Sabarmati, in Ahmedabad, Gujarat. He will inaugurate Kochrab Ashram and launch the Master plan of Gandhi Ashram Memorial here. pic.twitter.com/x95WUUF7Tt — ANI (@ANI) March 12, 2024 -
స్టాలిన్ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్‌లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండా ఎగురవేసినందుకు.. కన్న కొడుకునే హత్య
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ కుటుంబంలో పార్టీ జెండా చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు నచ్చని పార్టీకి సంబంధించిన జెండాను ఇంటిపై ఎగురువేసినందుకు ఓ తండ్రి తన కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ శివార్లలో ఉన్న ఓ కుటుంబంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెషావర్ శివార్లలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి ఎంత వద్దని చెప్పినా కొడుకు తనకు నచ్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన జెండాను ఇంటిపై ఎగురవేశాడు. దీంతో తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకితో కొడుకును కాల్చాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేదు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొడుకును చంపిన తండ్రి పారారీలో ఉన్నారుని చెప్పారు. కొడుకును హత్య చేసిన తండ్రి కోసం వెతుకుతున్నామని పోలీసు అధికారి నసీర్ ఫరీద్ మీడియాకు వెల్లడించారు చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
Ayodhya: రాముని గుడి బయట గొడవ.. కాంగ్రెస్ జెండా ధ్వంసం
అయోధ్య: రామ మందిరం ముందు ఘర్షణ చోటు చేసుకుంది. గుడి బయట కొంత మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జెండాను చించి వేశారు. జెండాను చించి వేసిన వ్యక్తులకు, కాంగ్రెస్ నేతల మధ్య గొడవ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జాతీయ పార్టీ సీనియర్ నేతలు కొందరు మాత్రం మకర సంక్రాంతి పర్వదినాన సోమవారం అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. వీరు అక్కడికి చేరుకోక ముందే గొడవ జరిగింది. కాంగ్రెస్ జెండాను కొంత మంది ధ్వంసం చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మతం పేరుచెప్పి చెత్త రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ మండిపడ్డారు. #WATCH | Few people seen vandalising Congress flag outside Ayodhya Ram temple A Congress delegation comprising Ajay Rai and Deepender Hooda is on Ayodhya visit today pic.twitter.com/fTSOSUurpI — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇదీచదవండి.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు?
ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత జాతీయ జెండా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జెండాలు ఇతర దేశాల జెండాలకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ జెండాలలో ఓ ప్రత్యేకత ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలకు ఒక మూలన బ్రిటిష్ జెండా కనిపిస్తుంది. ఈ విధంగా ఏ దేశ జాతీయ జెండా కూడా ఉండదు. మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల జెండాలు ఎందుకు ఇలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మూలన యూనియన్ జాక్ ఎందుకు కనిపిస్తుందంటే..ఈ రెండు దేశాలు బ్రిటిష్ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. ఇవి బ్రిటిష్ కామన్వెల్త్ దేశంలో భాగంగా ఉన్నాయి. యూనియన్ జాక్ దీనికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. యూనియన్ జాక్ అనేది న్యూజిలాండ్ చారిత్రక పునాదిని గుర్తిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ జెండాలో ఆరు తెల్లని నక్షత్రాలు ఉన్నాయి. న్యూజిలాండ్ జెండాలో నాలుగు ఎరుపు నక్షత్రాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని యూనియన్ జాక్‌ను మొదటిసారిగా 1770, ఏప్రిల్ 29న కెప్టెన్ కుక్ స్టింగ్రే హార్బర్లో ఎగురవేశారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలు బ్రిటన్ను పోలివుంటాయి. ఇది కూడా చదవండి: చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది? -
ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది?
ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్‌తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు. భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు. ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్‌పై ఎందుకు ఆధారపడుతున్నారు? -
పార్టీ ఏదైనా..జెండా తయారయ్యేది అక్కడే
-
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్‌కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్‌కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
ఇంటిపై పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని ఒక ఇంటిపై పాకిస్తాన్ జండా ఎగురవేసిన ఉదంతం వెలుగు చూసింది. ఎవరో దీనికి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి పోలీసుల వరకూ చేరడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ పాక్ జెండాను అక్కడి నుంచి తొలగించడంతో పాటు ఇంటి యజమానితో పాటు అతని కుమారునిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ ఉదంతం భగత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుఢాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక వస్త్రవ్యాపారి ఇంటిపై పాక్ జండా ఎగురుతున్నదని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పాక్ జెండాను గమనించి దానికి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేశారు. అనంతరం జండాను తొలగించారు. అదే ఇంటిలో ఉంటున్న రయూస్(45), అతని కుమారుడు సల్మాన్(25)లను అరెస్టు చేశారు. వీరిద్దరిపై 153ఏ, 153బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి, విచారించిన అనంతరం కోర్టుకు అప్పగించారు. ఈ ఉదంతం గురించి ఎస్ఎస్పీ హెమరాజ్ మీణా మాట్లాడుతూ నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు? -
వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే..
స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్ట్ 15న చాలా మంది తమ వాహనాలపై త్రివర్ణ పతాకం పెట్టుకోవడాన్ని చూసేవుంటాం. అయితే ఇది చట్టవిరుద్ధం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని వివరాల ప్రకారం కొందరు ప్రముఖులకు మాత్రమే తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్న ఉంచే హక్కు ఉంది. వీరుకాకుండా మరెవరైనా తమ కారుపై త్రివర్ణ పతాకాన్ని తగిలించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఇంతకీ తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అర్హత కలిగినవారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002లోని సెక్షన్ IX ప్రకారం కొందరు ప్రముఖులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించే హక్కును కలిగి ఉంటారు. ఈ జాబితాలోని వారు వరుసగా.. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ విదేశాల్లోని భారతీయ మిషన్లు/ప్రతినిధులు, వారు నియమితులైన దేశాల్లో.. ప్రధాన మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప మంత్రులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప మంత్రులు స్పీకర్, లోక్‌సభ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ రాష్ట్రాలలోని శాసన మండలి స్పీకర్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల స్పీకర్లు రాష్ట్రాలలోని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్లు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుల న్యాయమూర్తులు ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్‌లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్‌లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్‌ల జాబితాలో భారత్‌కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్‌ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్‌లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు. బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్‌లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్ ఇస్తారు. బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు? 1985లో డెన్మార్క్‌లో ప్రారంభించిన ’ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’(ఎఫ్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్స్‌ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్‌లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్‌లు ఈ సర్టీఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రా న్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టీఫికెట్ లభించింది. బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కొమ్మాది(భీమిలి): రానున్న కాలంలో మరిన్ని బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. రుషికొండ బీచ్‌లో శనివారం బ్లూ ఫ్లాగ్‌ను జేసీ కె.ఎస్.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్ ఇండియా ఆపరేటర్ డాక్టర్ కురూప్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, సమాచారశాఖ జేడీ వి.మణిరామ్ పాల్గొన్నారు. మన దేశంలో 2018లో తొలిసారిగా.. భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని ’చంద్రబాగ్’ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్‌కు అప్పగించింది. తొలి సారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు.. మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్‌ను రెన్యువల్ చేస్తోంది. ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్‌లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్కోడ్, పడుబిద్రి బీచ్‌లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికోయ్ తుండి, కద్మత్ బీచ్‌లు బ్లూ ఫ్లాగ్ సర్టీఫికేషన్ దక్కించుకున్నాయి. -
బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ సమీపంలో జెండాలను తొలగించాం
-
రెండు వర్గాల మధ్య ఘర్షణ..జంషెడ్‌పూర్‌లో ఉద్రిక్తత..
జార్ఘండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్‌లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. #WATCH | Security forces conduct flag march in Jamshedpur's Kadma police station area following an incident of stone pelting and arson, in Jharkhand Section 144 CrPc is enforced in the area and mobile internet is temporarily banned. pic.twitter.com/NhPnWtkQhR — ANI (@ANI) April 10, 2023 (చదవండి: కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!) -
ఆరేళ్ల బాలుడి అద్భుత ప్రతిభ.. రెండున్నర నిమిషాల్లోనే..
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఒకటో తరగతి బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఆరు సంవత్సరాల నాలుగు నెలల వయసు గల నాదెళ్ల దియాన్‡్ష 128 దేశాల జాతీయ జెండాలను చూసి రెండు నిమిషాల 25 సెకన్లలో గుర్తించి చెప్పాడు. గత నెల 12వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షలో దియాన్‡్ష ఈ ఘనత సాధించాడు. ఆ బాలుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ సర్టిఫికెట్, మెడల్‌ను రెండు రోజుల క్రితం పంపారు. ఈ విషయాన్ని దియాన్‡్ష తల్లిదండ్రులు ప్రియాంక, గౌతంకృష్ణ శనివారం వెల్లడించారు. తమ కుమారుడు ఇప్పుడు 135 దేశాల జాతీయ జెండాలను గుర్తిస్తున్నాడని తెలిపారు. -
చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శుక్రవారం భద్రత లోపాల దృష్ట్యా సడెన్‌గా నిలిపివేసిన సంగతి తెలిసింది. ఆ తదనంతరం శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాల కట్టుదిట్టమైన భద్రత నడుమ పునః ప్రారంభమైంది. ఇక ఈ యాత్ర ముగుస్తున్న తరుణంలో రాహుల్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా తోపాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కేటాయించిన భద్రతను కాంగ్రెస్ నేతలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేగాదు గత రాత్రి నుంచే లాల్ చౌక్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి, వాహానాల రాకపోకలను నియంత్రించారు. ఈ యాత్ర బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎంఏ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యూకుమారి నుంచి ప్రారంభమై సుమారు 75 జిల్లాలు పర్యటించి దాదాపు 3,570 కి.మీ పాదయాత్ర చేశారు రాహుల్. #WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP — ANI (@ANI) January 29, 2023 (చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం)