
సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను ఆదివారం అభిమానులు ఆవిష్కరించారు. ఈ పరిణామం టీడీపీలో కలకలం రేపింది. ఇక్కడ నుంచి జూనియర్ పోటీ చేయాలంటూ పోస్టర్లు, ఫెక్సీలు వెలుస్తుండడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబుకు కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
జూనియర్ ఎన్టీఆర్‌ను బరిలో దించాలని శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించింది. దీంతో దిక్కుతోచని చంద్రబాబు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి అభిమానులు వినూత్నంగా తమ డిమాండ్‌ను జెండా రూపంలో ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి:
Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం
టీడీపీవి డైవర్షన్ పాలిటిక్స్
Comments
Please login to add a commentAdd a comment