Kuppam constituency
-
గంజాయి కుప్పం
కుప్పాన్ని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్ది, అగ్రపథాన నిలుపుతాం.. ఇవీ పాలకులు గొప్పలు.. అయితే గంజాయి సాగు..దిగుమతి.. విచ్చలవిడిగా విక్రయం..అక్రమ రవాణా.. యువత పెడదోవ.. ఇవీ వాస్తవ పరిస్థితులు. వెరసి దిగజారుతున్న కుప్పం ప్రతిష్ట.. పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు సుదూరంలోని కేరళలోనూ కుప్పం ప్రాంతవాసులపై గంజాయి రవాణా కేసులు నమోదే ఇందుకు నిదర్శనం.. ఇదీ నేడు కుప్పం దుస్థితి.శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో గంజాయి సాగు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు గంజాయి వ్యాపారం, వినియోగం చేస్తున్నారని అధ్యాపకులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నెల రోజుల్లోనే పురోగతిని సాధించారు. రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో రెండు ప్రాంతాల్లో సాగులోని గంజాయి పంటను గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు. 84 కిలోల పచ్చి గంజాయి, మరో 1.20 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవి ఇవే అయినా అటవీ ప్రాంతాలు, జన సంచారం లేని ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎంత మేర గంజాయి సాగు ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. గంజాయి ఆకులతో పాటు ద్రవ, సిగరెట్లు, చాక్లెట్ల రూపంలోనూ రవాణా, వినియోగం సాగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో విస్తరిస్తున్న గంజాయి సంస్కృతిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో వైపు పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయనే ప్రచారం సాగుతోంది. కొందరు పెద్దల పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడినా గుట్టుగా రిహాబిటేషన్ సెంటర్లలో చేర్చి, చికిత్స అందించారని అంటున్నారు. ప్రధానంగా యువకుల తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో దురలవాట్ల నుంచి తమ పిల్లలను ఎలా రక్షించుకోవాలనన్న ఆవేదనలో ఉన్నా రు. స్వలాభం కోసం కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలు ఈ తరం యువతపై తీవ్ర దుష్పరిణామాలు చూపుతున్నాయని అంటున్నారు.విచ్చల విడి వినియోగంయువత, అసంఘటిత రంగాల కార్మికులు లక్ష్యంగా కుప్పం ప్రాంతంలో గంజాయి వ్యా పారం సాగుతోంది. గుడుపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో కొందరు విద్యార్థుల ప్రవర్తనలో తేడా గుర్తించిన అధ్యాపకులు పో లీసులకు సమాచారం ఇవ్వడంతో గంజాయి వ్యాపారం గుట్టు బయటకు వచ్చింది. కొందరు విద్యార్థులు వ్యాపారం చేస్తే మరి కొందరు వినియోగదారులుగా మారారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి సరఫరా చేస్తున్న వారిపై కేసులు పెట్టారు. కానీ గత ఆదివారం రాత్రి కుప్పం పట్టణ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు గంజాయి మత్తులో రాత్రి పూట జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా విచ్చల విడిగా గంజాయి సేవించి, రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. తమ ఆశయాలను, విజ్ఞతను, తల్లిదండ్రుల ఆశలను బుగ్గిలో పోసి మత్తులో తేలారు.దిగుమతుల మాటేమిటి ?స్థానికంగా గంజాయి సాగుపై పోలీసులు నిఘా, నియంత్రణ పెంచినా ఇతర ప్రాంతాల నుంచి దిగు మతి అవుతున్న సరుకు సంగతి ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. కర్ణాటక నుంచి పలమనేరు ప్రాంతం మీదుగా కుప్పానికి గంజాయిని తరలి ముఠాను రెండు నెలల క్రితమే కన్నడ పోలీసులు పట్టుకున్నారు. మరో వైపు గంజాయి రవాణా చేస్తూ కడపల్లి పంచాయతీకి చెందిన వ్యక్తి కేరళ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జోరుగానే సాగుతున్న విషయం స్పష్టం అవుతోంది. దీనిపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపా ల్సి ఉంది. ఇందుకోసం పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. -
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
Kuppam: బాబుకు ఓటమి భయం!
కుప్పం కోటపై చంద్రబాబుకు నమ్మకం సడలుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా మోసిన జనం ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల సమర్థతపై అనుమానం మొదలైంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి సొంత మనుషులను కుప్పానికి తరలిస్తున్నారు. ఎలక్షన్ మేనేజర్ల పేరిట నేతల ఇళ్లలో తిష్ట వేయిస్తున్నారు. ప్రచారం నుంచి తాయిలాల పంపిణీ వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. బాబు వ్యవహారిశైలికపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను విశ్వసించకుండా బయటి వారిని తెచ్చిపెట్టడంపై లోలోపల రగిలిపోతున్నారు. శాంతిపురం : కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను నమ్మకుండా ప్రకాశం జిల్లా నుంచి తన సామాజికి వర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల వేళ సైతం గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూడా అపనమ్మకంతో సొంత మనుషులతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది మేనేజర్లు కుప్పంలో ఎన్నికల పర్యవేక్షణకు బయటి ప్రాంతాల నుంచి తన సొంత మనుషులు వందమందిని చంద్రబాబు మోహరిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి 3 పోలింగ్ కేంద్రాలకు ఒకరి చొప్పున ఎలక్షన్ మేనేజర్ల పేరుతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని టీడీపీ ఐటీ ఫోరమ్ ద్వారా బెంగళూరు, హైదరాబాదులో గుర్తించిన దాదాపు వంద మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం కుప్పానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దాదాపుగా రోజూ బెంగళూరు–కుప్పం మద్య చక్కర్లు కొడుతున్నారు. ఆయా మేనేజర్లు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలోని టీడీపీ నాయకుల బంధువులుగా చెప్పుకుని వారి ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారి బసకు ఇబ్బంది లేకుండా వసతులు ఉన్న నాయకుల ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. ఈ నెల 26 నుంచి మే 12వ తేదీ రాత్రి వరకూ బయటి వ్యక్తులు స్థానికంగా మకాం వేసి పార్టీ వ్యవహారాలను నడపనున్నారు. ప్రచారం సాగాల్సిన తీరును పర్యవేక్షిస్తూ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను వారు సమన్వయం చేయనున్నారు. తమపై పరిశీలకుల కన్ను ఉంటే పార్టీ క్యాడర్ రాజీ పడకుండా పనిచేస్తారని ఈ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిపే పంపకాలు కూడా వీరి ద్వారానే నిర్వహించి, పోలింగ్ ముందు రోజు రాత్రి వారంతా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేలా వ్యూహరచన చేసుకున్నారు. కానీ ఇంత కాలం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తమను ఎన్నికల వేళ నమ్మకుండా అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోగా కాలకేయుల్లాంటి నాయకులను ప్రోత్సహించిన తమ అధినేత, ఇప్పుడు తమను చేతకాని వాళ్లుగా నిలబెడుతున్నారని ఓ సీనియర్ కార్యకర్త వాపోయారు. చివరకు ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమి భయం రుచిచూస్తున్నారని వెల్లడించారు. తగ్గిన జనాదరణ కుప్పం నుంచి తొలుత 1989 ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు 52.65 శాతం ఓట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి తన దారికి తెచుకోవడం ద్వారా నియోజకవర్గంపై క్రమంగా పట్టు బిగించారు. 1994లో గరిష్టంగా 75.49 శాతం ఓట్లు సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కుప్పంలో కూడా బాబు ప్రభ తగ్గడం మొదలైంది. 2014లో 62.59 శాతం ఓట్లు రాగా, 2019లో 55.18 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అనంతరం వివక్ష లేని సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. కుప్పం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు సైతం వైఎస్సార్సీపీకే జైకొట్టారు. దీంతో అసలు సంగతి చంద్రబాబుకు బోధపడింది. ఇక కల్లబొల్లి కబుర్లును కుప్పం వాసులు నమ్మరని అర్థమైంది. అందుకే తరచూ కుప్పంలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సైతం తన సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా నామినేషన్ వేయించారు. ఆమె కూడా కుప్పంలోనే మూడు రోజులపాటు తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
తాత నోట.. మళ్లీ పాత పాట!
ఎక్కడ సింగపూరు.. ఎక్కడ కుప్పం.. బెంగళూరు అభివృద్ధి ఎక్కడ.. కుప్పంలో అభివృద్ధి ఎంత..? ఇవి విపక్ష నేత చంద్రబాబుకు తెలియంది కాదు.. ఓట్ల వేటలో నోటికొచ్చిన హామీలు గుప్పించి అమాయక కుప్పం ప్రజలను బురిడీ కొట్టించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. 35 ఏళ్లుగా వారిని మభ్యపెట్టిన బాబు ఇప్పుడూ అదేపాట అందుకున్నారు. ‘కుప్పాన్ని మరో సింగపూర్ చేస్తా.. బెంగళూరు జనం చదువు, పనుల కోసం కుప్పానికి వచ్చేటట్లు మారుస్తా..’ నంటూ అలవిగాని హామీలు గుప్పించేశారు. రెండు రోజులుగా తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి హామీల వర్షంలో కుప్పం ప్రజలను తడిపి ముద్దచేశారు. వీటి అమలు ఎంత.. బాబు హామీల్లో నిజం ఎంత అని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం నీడన ఉన్న చల్లదనం.. సైకిలు ఎక్కితే వచ్చిందా..? అని చర్చించుకుంటున్నారు. బాబు హామీలు.. వాటి విధివిధానాలపై జనం చర్చించుకుంటున్నారు. కుప్పం/కుప్పంరూరల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు అలవిగాని హామీలు గుప్పించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎం హోదా ఉన్నప్పుడు కుప్పాన్ని అభివృద్ధి చేయని తాత మరో అవకాశం ఇస్తే చేస్తానంటూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈసారి అయితే మరో అడుగు ముందుకేసి బెంగళూరు జనం కుప్పం వచ్చేలా చేస్తానంటూ అమలుకు యోగ్యం కాని హామీలు గుప్పించి స్థానికులకు విసుగు తెప్పించారు. ఆయన హామీలపై మీరే ఓ లుక్కేయండి..! రికార్డు అరిగిపోయింది బాబూ! ♦ కుప్పాన్ని దేశానికే ఆదర్శం చేస్తా ♦ పారిశ్రామికవాడ చేసి యువకులకు ఉపాధి కల్పిస్తా ♦ కుప్పం పట్టణాన్ని శాటిలైట్ సిటీ చేసి, ప్రతి పంచాయతీకి కోటి, మేజర్ పంచాయతీకి రెండు కోట్ల నిధులు కేటాయిస్తా. ♦ గ్రామాల్లో అభివృద్ధి పనులు స్థానికులే చేసుకునే విధంగా అవకాశం ♦ ప్రతి గ్రామానికీ రోడ్డు, ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయితో పాటు పొలాలకు సిమెంట్ రోడ్లు వేయిస్తా ♦ కుప్పాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు బెంగళూరుకు ఫోర్వే రోడ్డుతో పాటు ప్రత్యేక విమానాశ్రయం ఏర్పాటు చేస్తా ♦ కుప్పంలో ప్రతి ఎకరాకు బిందుసేద్యం పరికరాలు ఇచ్చి వ్యవసాయ హబ్‌గా తయారు చేస్తా ♦ శాశ్వత తాగు, సాగునీటికి హంద్రీ–నీవా జలాలు తీసుకువస్తా ♦ ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలను అనుసంధానం చేస్తా. ♦ ప్రతి మహిళకు నాలుగు ఆవులు ఇచ్చి పాడి పరిశ్రమతో స్వయం ఉపాధి కలి్పస్తా గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా బాబూ? ♦ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చే వరకు కుప్పంలో కనీసం డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయని బాబు చదువుల హబ్‌గా ఎలా మారుస్తారని స్థానికులు నిలదీస్తున్నారు. ♦ పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వంతో కలిసి కోర్టులకు వెళ్లింది చంద్రబాబు కాదా..? అని కుప్పం ప్రజలు గళమెత్తుతున్నారు. ♦ గతంలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని నిరీ్వర్యం చేసి ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలతో అనుసంధానం చేస్తామంటే ఎలా నమ్మేదని ధ్వజమెత్తుతున్నారు. ♦ 2004లో కుప్పాన్ని మరో సింగపూర్ చేస్తామన్న హామీ ఇచ్చి, ఆపై సీఎం హోదాలో మరిచిపోయిన సంగతి గుర్తులేదా..? అంటున్నారు. ♦ 2001లో పారిశ్రామిక వాడ కోసం అనిమిగానిపల్లి వద్ద శంకుస్థాపన చేసి.. ఇప్పుడు యువతకు ఉద్యోగాలిస్తామనడం తప్పు కాదా అని ప్రశి్నస్తున్నారు. ♦ 2018లో ఎయిర్పోర్ట్ కోసం శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది నువ్వు కాదా అని మండిపడుతున్నారు. ♦అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు గొప్పలు చెప్పి మరో అవకాశం ఇవ్వాలంటూ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ నమ్మకానికి మారుపేరు సీఎం జగన్మోహన్రెడ్డి అని కుప్పం ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కుప్పం పట్టణాన్ని అప్‌గ్రేడ్ చేసి మున్సిపాలిటీ హోదా కల్పించాలని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలాగే కుప్పాన్ని రెవెన్యూ, పోలీసు డివిజన్లుగా తీర్చిదిద్దారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం అభివృద్ధి సీఎం జగనన్నతోనే సాధ్యమని నినదిస్తున్నారు. కలగా మారిన హంద్రీ–నీవాను పూర్తిచేసి కుప్పానికి నీళ్లిచ్చిన ఘనత జగనన్నదని నమ్ముతున్నారు. అదేవిధంగా పాలారు ప్రాజెక్టు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి అడుగులు వేయడం అభివృద్ధికి సంకేతమని చెబుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం ఎవరి హయాంలో పూర్తయ్యాయో బాబు చెప్పాలని నిలదీస్తున్నారు. మరోమారు జగనన్నను గెలిపించుకుంటే కుప్పం రూపురేఖలు మారడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సారి కుప్పంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని ముక్తకంఠంతో హోరెత్తిస్తున్నారు. కుప్పంకు బాబు చేసిందేమీ లేదు చంద్రబాబు కుప్పం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా ఆయన చేసింది ఏమీ లేదు. కనీసం కుప్పంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు. పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి డిగ్రీ కళాశాల పెడితే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణంలో అండర్ బ్రిడ్జీ్జల నిర్మాణం పూర్తిచేశారు. కుప్పంలో శాశ్వత అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆయన వస్తే కుప్పం రూపురేఖలు మారతాయని మా నమ్మకం. – మాధవన్, డీకే పల్లి, కుప్పం మండలం ఇంతకాలం ఎందుకు చెయ్యలేదు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ఇంకో అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 పర్యాయాలు సీఎంగా ఉండి ఎందుకు చేయలేదు?. కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయారు. ఆయనను ఇకమీదట ఇక్కడి ప్రజలు నమ్మరు. జగన్మోహన్రెడ్డి కుప్పానికి చేసిన అభివృద్ధి ఏమిటో జనం ప్రత్యక్షంగా చూశారు. ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ–నీవా కాలువ నిర్మాణం పూర్తి చేసి కుప్పానికి నీళ్లిచ్చారు. రెవెన్యూ, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేసి కుప్పం రూపురేఖలే మార్చేశారు. మరోమారు జగన్మోహన్రెడ్డికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. – కుమార్, డీకే పల్లి, కుప్పం మండలం -
చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్ మారిందా?
సాక్షి, చిత్తూరు: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహంలా సింగిల్‌గా వస్తుంటే.. చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు. మరోవైపు.. చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం వెడుతోంది. వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టిసారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లను ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారు. ఇక, గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల హాడావుడి మొదలవగానే మొదటగా కుప్పంపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు. ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లలో మార్పు కనిపించింది. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మోజార్టీ భారీగా తగ్గింది. దీంతో బాబు సైతం షాకయ్యాడు. ఇక, తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లను తొలగించడంతో అటు చంద్రబాబు, ఇటు టీడీపీలో వణుకు మొదలైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతుండటంతో ఓటర్లు సైతం మార్పును కోరుకుంటున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుతో భయం మొదలైంది. -
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్‌లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లు
-
ప్రత్యర్థి శిబిరంతో సీఎం జగన్ చెడుగుడు
సాధారణంగా రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థికి చెందిన నియోజకవర్గంలో పర్యటించేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎంతసేపూ తమకు చెల్లుబాటు అయ్యే ప్రాంతాలు, తమకు ఆదరాభిమానాలు మెండుగా ఉండే చోట్లకు మాత్రమే వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా వైరిపక్షమన్న పేరుతో ఆయా నియోజకవర్గాలకు పనులు చేయని సందర్భాలూ గతంలో కోకొల్లలు. రాజకీయ వైరి అయిన నాయకుడి ఇలాకాలోకి వెళ్ళడానికి ఇష్టపడరు.. ఎందుకంటే అక్కడి ప్రజల అప్పటికే తన ప్రత్యర్థిని తమ నాయకుడిగా ఎన్నుకుని ఆదరించారని, తాను ఇప్పుడు అక్కడికి వెళ్లినా తనను అక్కడి ప్రజలు ఆత్మీయంగా రిసీవ్ చేసుకోరని, పైగా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల నుంచి తిరస్కారం.. వ్యతిరేకత వంటి అనుభవాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న సందేహంతో అక్కడికి వెళ్లరు. వెళ్లినా ఎక్కువసేపు అక్కడ గడపడానికి ఇష్టపడరు.. ఇలా వెళ్లి అలా సేఫ్‌గా వచ్చేద్దాం అనుకుంటారు.. అయితే ఇప్పుడు రాజకీయం మారిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రాజకీయ ప్రత్యర్థి బాబు ఇలాకాలోనే సింహనాదం చేశారు. చంద్రబాబును 1989 నుంచి వరుసగా గెలిపిస్తూ వస్తున్న కుప్పంలో కాసేపటి క్రితం పర్యటించారు. హంద్రీ నివా కాలువ ద్వారా కుప్పానికి సాగు నీరుతోబాటు నాలుగైదు లక్షలమందికి తాగునీరు అందించే ప్రాజెక్టును ప్రారంభించారు. అంతేకాకుండా ఆ తరువాత అయన సుదీర్ఘంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్న ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వాడుకుని వదిలేశారు..? వాళ్ళను ఎలా మోసం చేస్తూ వచ్చింది అన్నది పూసగుచ్చినట్లు జగన్ వివరించారు.. కుప్పాన్ని తమ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేసిందీ... అప్పట్లో కేవలం పంచాయతీగా ఉన్న కుప్పాన్ని తామే మున్సిపాలిటీగా,, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా.. పోలీస్ డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేసిన విషయాన్నీ అయన వివరించారు. అంతేకాకుండా బాబు హయాంలో ప్రాజక్టుల పనులను చంద్రబాబు , అయన అనుచరులు ఏ విధంగా వాడుకుని లబ్ది పొందినది చెబుతూనే తాము వచ్చాక పథకాలు, సంక్షేమం ఇంటింటికీ ఎలా అందిస్తున్నది ప్రతి పాయింటునూ వివరించారు. జగనన్న ఇళ్ళు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధి వ్యవసాయం, రైతుభరోసా కేంద్రాలు... చిత్తూరు డైరీ ఇలా ప్రతి అంశంలోనూ తన ప్రభుత్వ పనితీరును, దాని ద్వారా లబ్ధిపొందిన విధానాన్ని లెక్కలతో వివరించారు. తాను చంద్రబాబు మాదిరిగా తనవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగించే నాయకుడిని కాదని, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ అందర్నీ సమదృష్టితో చూస్తూ అందరికీ ప్రభుత్వ సేవలు, పథకాలు అందిస్తాం అని చెబుతూ వారి నుంచి చప్పట్ల రూపంలో మద్దతు పొందారు. అంతేకాకుండా మీ నియోజకవర్గానికి ఏమీ ఉపయోగపడని చంద్రబాబును ఇన్నేళ్లు మోసిన ప్రజలకు జోహార్లు అనడం ద్వారా మీరంతా ఇలాంటి పనికిరాని నాయకుడిని ఇన్నాళ్లూ ఎలా మోశారబ్బా అనే ప్రశ్న కూడా వేసినట్లయింది. ఇక ఆయన్ను వదిలించుకోవాలని, సమర్ధుడైన భరత్‌ను గెలిపించుకుని కుప్పాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని కోరారు. భరత్ గెలిస్తే ఆయనకు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా కుప్పాన్ని తన సొంత ప్రాంతంగా భావిస్తానని చెప్పేసారు. తాను ఎన్నడూ కుప్పం ప్రజలను పల్లెత్తు మాట అనలేదు కానీ చంద్రబాబు మాత్రం నిత్యం రాయలసీమతోబాటు పులివెందుల ప్రజలను చిన్నచూపు చూస్తూ కించపరుస్తుంటారు అని గుర్తు చేసారు.. అలా చెప్పడం ద్వారా 'చూసారా... అయన మన ప్రాంతాన్ని ఎలా అవమానిస్తున్నారో' అని ప్రజలకు గుర్తు చేసారు.. ఫైనల్ గా జగన్ కుప్పంలో అడుగుపెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే చంద్రబాబును కడిగిపారేశారు. :::సిమ్మాదిరప్పన్న -
ఇక్కడ ఏమీ చేయని బాబు.. ఎమ్మెల్యేగా అర్హుడేనా?: సీఎం జగన్
Live Updates 12:30PM, Feb 26th, 2024 సీఎం జగన్ ప్రసంగించడానికి వచ్చిన సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ దద్దరిల్లిన సభా ప్రాంగణం సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి భరత్ గెలిచిన తర్వాత మంత్రిని చేస్తాను కేవలం అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు ఎందుకు? ప్రజలనె మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు మీ బిడ్డను గెలిపిస్తేనే పేదవారికి మంచి జరుగుతుంది కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు.. ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా? మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదు చంద్రబాబు పేరు చెబితే గుర్తుచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా? కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమం కుప్పంలో జరుపుకుంటున్నాం ఒక పండుగ వాతావారణంలో జరుపుకుంటున్నాం కొండలు,గుట్టలు దాటుకుని, ఏ రకంగా 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించింది. ఎక్కడ కుప్పం.. ఎక్కడ శ్రీశైలం 672 కి.మీ దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి, ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించడం కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజే 2022, సెప్టెంబర్ 23వ తేదీన, ఇదే కుప్పంలో జరిగిన బహిరంగ సభకు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఆనాటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే .. ఈరోజు మన ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసింది కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా, మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేయడానికి మరో రెండు రిజర్వాయులు ప్రారంభించడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అందుకు సంబంధించి పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే 14 ఏళ్లు సీఎంగా కూడా పని చేశారు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు కుప్పం బ్రాంచ్ కెనాల్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడు. అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ లాభాల కోసం మూసివేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్‌ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించేలా ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్.. వెల్లూరు సీఎంసీ మెడికల్ కాలేజ్ దాన్ని అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు ఈ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టును ముందుకు వెళ్లకుండా చేస్తే.. దాన్ని పునః ప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేసింది రూ. 14 వందల కోట్లు. రూ. 14 వందల కోట్లును ఈ కుప్పం నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం ఇక్కడున్న ప్రతీ ఒక్కరికి చెబుతున్నా మీరు బ్యాంకులకు వెళ్లండి.. చంద్రబాబు పాలనకు సంబంధింది ఐదేళ్లు స్టేట్మెంట్, మీ బిడ్డ జగన్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ తీసుకోండి బాబుగారి పాలనలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని చూసుకోమని అడుగుతున్నా అదే మీ బిడ్డ ప్రభుత్వ పాలనలో మీకు జమ అయిన నగదును కూడా ఆ స్టేట్మెంట్లో చూసుకోమని చెబుతున్నా.. మరి ఎవరిది మనసున్న పాలన.. ఎవరిది పేదల ప్రభుత్వమన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా కుప్పం ప్రజలంతా మా వాల్లేనని గర్వంగా చెబుతున్నా కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం కులం, మతం, ప్రాంతం,పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించాం కుప్పంలో 44,888 మహిళలకు రూ. 172 కోట్లు ఇచ్చాం పెన్షన్ల కోసం క్యూలెన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం ప్రతినెలా ఇంటికే వచ్చివలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచి 45,374 మందికి ఈ కుప్పం నియోజకవర్గంలో అందిస్తున్నాం కుప్పంలో 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్సన్ ఇచ్చారు.. అది కూడా వెయ్యి రూపాయలే. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎటువంటి వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 1400 వలంటీర్లతో సేవలు అందిస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 76 విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం కుప్పంలో 44, 640 రైతులకు రూ. 214 కోట్లు రైతు భరోసా ఇచ్చాం చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ. 26వేల కోట్లు అందించాం కుప్పంలో 35951 మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి ఇచ్చాం కుప్పంలో 15, 727 మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చాం ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని చెప్పడానికి గర్విస్తున్నా వైఎస్సార్ చేయూత ద్వారా 19, 921 మందికి రూ. 85 కోట్లు ఇచ్చాం నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింప చేశాం కుప్పంలో 108 వాహనాలు అందించాం కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17552 మందికి ఆరోగ్య సేవలు అందించాం ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాం 12:10PM, Feb 26th, 2024 వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్ ఆ తర్వాత సీఎం జగన్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 12:02PM, Feb 26th, 2024 కుప్పం శాంతిపురం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ 11:22AM, Feb 26th, 2024 హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు కృష్ణమ్మ స్వర్శతో పరవశించిపోతున్న కుప్పం 11:18AM, Feb 26th, 2024 కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ 11:01AM, Feb 26th, 2024 కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 10:04AM, Feb 26th, 2024 ► కాసేపట్లో కుప్పానికి సీఎం జగన్ ►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ 9:21AM, Feb 26th, 2024 ►కుప్పం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ►కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్న ముఖ్యమంత్రి జగన్ ►కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ►కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ►ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. -
Kuppam: ఐదేళ్లలో కుప్పంలో ఏం జరిగింది?
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజక వర్గాన్ని మూడున్నర దశాబ్ధాలుగా పట్టించుకోలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పానికి మహర్దశ పట్టిందంటున్నారు స్థానికులు. ఇంతకీ కుప్పంలో గత ఐదేళ్లలో వచ్చిన మార్పేంటీ? ఏడు సార్లు చంద్రబాబును కుప్పం ప్రజలు గెలిపించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అయితే తన నియోజక వర్గాన్ని ఆయన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే నియోజక వర్గం సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తనకు అన్ని నియోజక వర్గాలూ సమానమే అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల తరహాలోనే తన రాజకీయ ప్రత్యర్ధి ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజక వర్గానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం నాలుగున్నరేళ్ల పాలనలోనే కుప్పాన్ని మున్సిపాలిటీని చేశారు. రెవిన్యూ డివిజన్‌గా మార్చారు. డిఎస్పీని నియమించారు. గ్రామ సచివాలయాలతో నియోజక వర్గంలో ప్రతీ ఇంటికీ పాలనను చేరువ చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పార్టీలు, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించారు. అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించారు. చూస్తూండగానే కుప్పం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. కుప్పం ప్రజల చిరకాల కోరిక హంద్రీ నీవా కాలువల ద్వారా కుప్పానికి సాగు తాగునీరు అందించడం. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. నాలుగున్నరేళ్ల పాలనలోనే హంద్రీ నీవాని కుప్పానికి తెచ్చి కుప్పం ప్రజల దాహాన్నీ.. పంట పొలాలకు సాగునీటి సదుపాయాన్నీ అందించి చూపించారు జగన్మోహన్రెడ్డి. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం రేషన్ కార్డు కావాలన్నా.. పింఛను రావాలన్నా.. సంక్షేమ పథకాలు అందాలన్నా జన్మభూమి కమిటీలు ఆమోద ముద్ర వేస్తేనే పని అయ్యేది లేదంటే అంతే సంగతులు. ఇపుడు అటువంటి పరిస్థితి లేనే లేదంటున్నారు కుప్పం వాసులు. కుప్పం తలరాత మారిపోయింది. కళ్లముందరే నియోజక వర్గానికి రాజయోగం పట్టింది. తమ జీవితాలల్లో మార్పులు తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పం ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏనాడూ తమని పట్టించుకోని చంద్రబాబు నాయుడికి ఇక సెలవిచ్చేస్తాం అంటున్నారు ఇదీ చదవండి: అన్నీ లాగేసుకుని.. ఇదేం లిస్ట్ బాబూ..? -
కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్లు
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కొండలు, గుట్టలు దాటుకుని ప్రవహిస్తూ.. 672 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గలగలమని పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు కాలువ వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి కృష్ణా జలాలు తరలించడంలో విఫలమయ్యారు. 2022 సెప్టెంబర్ 23న కుప్పంలో జరిగిన సభకు హాజరైన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన కుప్పం కాలువ పనులను పూర్తి చేస్తామని, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇస్తే సస్యశ్యామలం అవుతుందని ప్రకటించారు. అన్నట్టుగానే మాట నిలుపుకున్నారు. కృష్ణా జలాలు కుప్పం ఉపకాలువలో ప్రవహిస్తూ బుధవారం ఉదయం 11 గంటలకు రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద (కుప్పం ఉపకాలువ కిలోమీటర్ 64.278 వద్ద) కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. జనం తండోపతండాలుగా తరలివచ్చి ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. కృష్ణమ్మకు హారతులు పట్టి ఆహా్వనించారు. శ్రీశైలం నుంచి 27 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ కుప్పానికి తరలిస్తున్నారు. బుధవారానికి శ్రీశైలం నుంచి కుప్పం సరిహద్దు వరకు 672 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ కృష్ణమ్మ కుప్పం నేలను తడిపింది. సముద్ర మట్టానికి 758 మీటర్ల ఎత్తున నీటిని తరలిస్తూ కాలువలోకి ప్రవహింపజేస్తున్నారు. ప్రస్తుతం చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అసంపూర్తి పనులను పూర్తి చేసి.. టీడీపీ హయాంలో 2015లో జరిగిన టెండర్లలో కుప్పం కాలువ పనులను మూడు కాంట్రాక్టు సంస్థల జాయింట్ వెంచర్ 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరందించే పనులు పూర్తి చేయాలి. ఈ పనులను ఇష్టారీతిన నిర్వహించి 2018 నుంచి అసంపూర్తిగా వదిలేశారు. 2019 నుంచి పనులు పూర్తి చేయించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టి కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు. సీఎం చొరవతో భూ సేకరణకు రూ.40 కోట్లు మంజూరు చేశారు. 4.80 కిలోమీటర్ల పెండింగ్ కాలువ, 103 స్ట్రక్చర్స్, 1,43,130 క్యూబిక్ మీటర్ల మట్టిపని, 22,933 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, గుడిపల్లె మండలంలో రైల్వే క్రాసింగ్ టన్నెల్ పనులు 45 మీటర్లు జరగాల్సి ఉండేది. వీటి పనులు పూర్తి చేయించడమేకాక గత కాంట్రాక్టర్ల పనుల్లో లోపాలను సరిచేయించి కాలువలో నీటి తరలింపునకు ఇబ్బందులు తొలగించడంతో ప్రస్తుతం కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. ఎందుకు నీళ్లివ్వలేదు బాబూ! కుప్పానికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు తన హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 2019 జనవరి 21న ప్రారంభమై ఏప్రిల్ 11 వరకు పుంగనూరు ఉపకాలువలో కృష్ణా జలాలు పారించారు. 82 రోజులు పారించినా పనులు పూర్తి చేయించకపోవడంతో కుప్పం కాలువలోకి నీళ్లు పారలేదు. బాబు పాలనలో వచి్చన కృష్ణా జలాలు 775 ఎంసీఎఫ్‌టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్స్) మాత్రమే. ఈ నీటిలో 207 కిలోమీటర్ల పుంగనూరు ఉపకాలువ (గడ్డంవారిపల్లె నుంచి బొమ్మరాజుపల్లె వరకు) లో 742.19 ఎంసీఎఫ్‌టీలు, 43 కిలోమీటర్ల కుప్పం కాలువలో 32.81 ఎంసీఎఫ్‌టీల నీరు పారింది. 123 కిలోమీటర్లు మేర ఉండే కుప్పం కాలువలో పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె నుంచి 43వ కిలోమీటర్‌లోని వి.కోట మండలం నారి్నపల్లె వరకు జలాలు సాగి ఆగిపోయాయి. తన పాలనలో కుప్పం కాలువ పనులు పూర్తి చేయించలేకపోయిన చంద్రబాబు.. వైఎస్ జగన్ పనులు చేయించలేదని గగ్గోలు పెట్టారు. అయితే.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనులు పూర్తి చేయించి కుప్పానికి కృష్ణా జలాలు పారిస్తున్నారు. -
టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. కుప్పం ప్రజలు.. చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్‌వారే ఇందుకు కారణమని సమాచారం. ఇక, తాజాగా కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదని అటు సర్వేలు కూడా చెబుతున్నాయి. తాజా సర్వేతో కుప్పం టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవికాని హామీలిచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల హడావిడిగా శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుప్పం టీడీపీలో గ్రూప్ రాజకీయాలతో చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇంఛార్జిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం కుప్పంను చాలా అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కుప్పంకు ఈ నెలలోనే హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక, టీడీపీకి చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. చిత్తూరు, జీడి నెల్లూరు, పూతల పట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో, సర్వేల్లో కూడా టీడీపీ తప్పదని నివేదికలు చెబుతున్నాయి. -
కుప్పంలో ఇప్పటికీ లెక్క తేలని 36 వేల ఓట్లు
సాక్షి, కుప్పం(చిత్తూరు జిల్లా) : మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలోని బోగస్ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రాంత వాసులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న సంబంధాలతో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓట్లుండగా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా ఆధార్ కార్డులతో లింక్ అయిన వారు 1.83 లక్షల మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 17 శాతం అంటే.. ఇంకా 36 వేల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారిందని, ఈ ఓటర్లు ఎక్కడి వారో, ఎక్కడ ఉన్నారో తేల్చలేకపోతున్నారని చెప్పారు. రామకుప్పం మండలం విజలాపురంలో కుమార్ అనే వ్యక్తికి విజలాపురంలో ఓటు హక్కు ఉందని, ఇతను పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోనూ ఓటు వినియోగించుకుంటున్నాడని మిథున్‌రెడ్డి చెప్పారు. కంగుంది గ్రామానికి చెందిన అమ్మణ్ణమ్మ కంగుందిలో, పక్కనే ఉన్న విజలాపురం పంచాయతీలోనూ ఓటు వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి బోగస్ ఓట్లతో చంద్రబాబు ఏళ్ల తరబడిగా కుప్పంలో గెలుస్తున్నారని.. కుప్పంలోని బోగస్ ఓట్లపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్ తదితరులున్నారు. చదవండి: (రోడ్లపై సభలు, రోడ్‌షోల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
‘కుప్పంలో బాబు జెండా పీకేస్తారు’
సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పండగ పూట కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటమి భయంతోనేన చంద్రబాబు ఇలా విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడీఆ వైఎస్సార్సీపీ విజయం ఖాయం అని అన్నారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చిత్తూరు జిల్లాలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతోందని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఈసారి కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తారు. 2019 నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబుకు నచ్చదు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీకి విజయం ఖాయం. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా టీడీపీకి భవిష్యత్ ఉండదు. ఓటమి భయంతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. నాపై చంద్రబాబు చేసినవి నిరాధారమైన ఆరోపణలు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి. కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కుప్పం, చంద్రబాబుపై మంత్రి అంబటి ఆసక్తికర కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు యాగీని, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తీరును ప్రజలు పరిశీలిస్తున్నారు అని అన్నారు. కాగా, మంత్రి అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తెచ్చిన జీవో అన్ని పార్టీకు వర్తిస్తుంది. చంద్రబాబు రోడ్‌షోలతో ఒరిగేది ఏమీ ఉండదు. చంద్రబాబు కాలుపెట్టిన చోట జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో జీవో తీసుకువచ్చింది. ప్రభుత్వ జీవోపై చంద్రబాబు యాగీ చేస్తున్నారు. కుప్పంలో టీడీపీ సమాధి కావడం ఖాయం. కుప్పం ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానిస్తున్నారు. కుప్పం ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘన విజయం అందించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పదే పదే కుప్పం వెళ్తున్నారు. చంద్రబాబుకు కుప్పంలో కనీసం ఇళ్లు లేదు, ఓటు లేదు. చంద్రబాబు యాగీని ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో1 వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే జీవో1ను తీసుకువచ్చాము’ అని కామెంట్స్ చేశారు. -
బాబు వాడుకున్నారు.. జనం ఆడుకున్నారు
సాక్షి, అమరావతి: జనాదరణ పోయింది. పిలిచినా సభలకు రావటం లేదు. దీంతో ఒకరోజు ఇరుకు సందుల్లోనే సభ పెట్టబోయారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ సాహసానికి.. పాపం 8 మంది అమాయకులు బలైపోయారు. జనం రద్దీ బాగా కనిపించే డ్రోన్షాట్ల కోసం ఇరుకు రోడ్లోకి వాహనాన్ని పోనిచ్చి... అక్కడ చంద్రబాబు మాట్లాడబోగా, అప్పటికే ఉన్న జనం వెనక్కివెళ్లే తొందర్లో ఒకరిపై ఒకరు పడి... పాపం ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాన్ని రప్పించడానికి వారికి కానుకల ఆశ చూపించారు చంద్రబాబు. విలువైన చీర, ఇతర సరుకులు ఇస్తామని నమ్మబలికి టోకెన్లు పంచి మరీ వేల మందిని రప్పించారు. కానీ చౌకబారు చీరలతో నాసిరకం కానుకలిచ్చారు. అది కూడా టోకెన్లున్న వారందరికీ ఇవ్వకపోవటంతో అక్కడా తోపులాట తప్పలేదు. పాపం.. మరో ముగ్గురు బలైపోయారు. ఎలాగైనా తమకు జనాదరణ తగ్గలేదని చూపించడానికి చంద్రబాబు ముఠా ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా మరో దుస్సాహసానికి దిగింది. చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను ఈ ముఠా వైరల్ చేసింది. ‘కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా’ అనే నినాదాలతో విపరీతంగా జనం కనిపిస్తున్న ఆ ఫొటోలను కొన్ని ఎల్లో చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ ఫొటోలను షేర్ చేస్తూ శివాలెత్తిపోయింది. బాబును ప్రభుత్వం ఎంతలా అడ్డుకున్నా జనం ఆయన వెంటే ఉన్నారంటూ కామెంట్లు కూడా ఊదరగొట్టేశారు. కానీ నిజమేంటో తెలుసా? ఆ ఫొటోలు కుప్పంలోనివి కాదు. అసలు చంద్రబాబుకే కాదు.. ఈ రాష్ట్రానికే సంబంధం లేని ఫొటోలు. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖుడిగా గుర్తింపు పొందిన సిద్ధేశ్వర స్వామి సోమవారం మరణించగా.. ఆయన అంతిమ యాత్రకు దాదాపు 2 లక్షల మంది భక్తులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. లింగాయత్ సంప్రదాయానికి చెందిన సిద్ధేశ్వర స్వామి.. దశాబ్దాల పాటు సమాజానికి విశేష సేవలు అందించి కర్ణాటక వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందటంతో జనం తండోపతండాలుగా వచ్చారు. భక్తుల్లో చాలామంది పసుపు రంగు దుస్తులు ధరించి ఉండటం.. వాహనానికి కూడా పసుపు రంగు ఉండటంతో ఇది తమకు సరిగ్గా మ్యాచ్ అవుతుందనుకున్న టీడీపీ వర్గాలు.. ఆ ఫొటోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి తమ బాబు సభకు వచ్చిన జనం అంటూ వైరల్ చేసేశాయి. ఏకి పారేసిన నెటిజన్లు.. ఆ ఫొటోల లోగుట్టును నెటిజన్లు క్షణాల్లోనే పట్టేశారు. ఆ ఫొటోలు కుప్పంలో చంద్రబాబు పర్యటనవి కావంటూ నిజాన్ని నిగ్గు తేల్చారు. చుట్టుపక్కల పరిసరాలు, ఆ ఫొటోల్లో ఉన్న ప్రజల ఆహార్యాన్ని గుర్తించిన ప్రజలే.. ఇవి ఫేక్ అంటూ ఎండగట్టే సరికి పచ్చ గ్యాంగ్‌కు దిమ్మ తిరిగిపోయింది. ‘బాబు మరీ ఇంత ఫేకా’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. నిజానికి 1989 నుంచీ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం స్థానంలో ఇపుడు టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న తరుణంలో మూడు రోజుల పర్యటనకు గాను చంద్రబాబు బుధవారం కుప్పంలో అడుగుపెట్టారు. బాబు వస్తున్నారని వారం పది రోజులుగా ఎంత ప్రచారం చేసినా, అక్కడి ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించ లేదు. దీంతో ఫొటోల మార్ఫింగ్‌కు దిగారు టీడీపీ ఘనులు. అయినా జనం వచ్చేది నాయకులు చేసే మంచిని చూసి. మరి చంద్రబాబు ఏం చేశారని వస్తారు?. -
బాబు.. జనం బాదితే గానీ అర్థం కాదా?
తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ కావడానికి కారణమేంటి.? బాదుడే బాదుడు పక్కన పెట్టి ఇదేం కర్మ అనే కొత్త కార్యక్రమాన్ని టీడీపీ ఎందుకు ప్రారంభించింది..? బాదుడే బాదుడు కార్యక్రమం కనీసం చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గాల్లో అయినా సక్సెస్ అయ్యాయా? టీడీపీ విస్తృత స్థాయి సమావేశం వేదికపై నుంచి బాదుడే బాదుడు గురించి పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చెప్పిన నిజాలు ఏంటి?.. ఎల్లో రేటింగ్.. ఆపై గ్రేడింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో ఎండగడతామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అనేక సందర్భాల్లో చంద్రబాబు తమ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. బాదుడే బాదుడు జరిగిన తీరుపై ఏ బీ సీ డీ పేరిట నాలుగు గ్రేడులుగా విభజించి రేటింగ్స్ ఇవ్వాలని ప్రోగ్రామ్ కమిటీని చంద్రబాబు ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన తీరు ఆధారంగా అక్కడి నాయకులకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. ఇదేం కర్మ బాబూ? ఒక పక్కన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలనుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని డప్పు కొట్టుకుంటూ.. హఠాత్తుగా ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఇదేం కర్మ అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని టీడీపీ తెరపైకి తీసుకువచ్చింది. బాదుడే బాదుడుకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పుకుంటున్న టీడీపీ ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి?. బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విధానాన్ని ఇటీవల చంద్రబాబు సమీక్షించారట. చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గాలతో సహా ఎక్కడా అనుకున్నంత స్థాయిలో బాదుడు కార్యక్రమం జరగలేదట. చంద్రబాబు స్వయంగా పాల్గొన్న సమావేశాలకు కూడా జనాలు కరువయ్యారు. కొన్నిచోట్ల చంద్రబాబు ప్రసంగించే సమయానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఏ గ్రేడ్‌లో సున్నా.. చంద్రబాబు బాధ భరించలేక ఈ కార్యక్రమానికి జనాలను సమీకరించడం కోసం టీడీపీ నేతలు నానా హైరానా పడ్డారు. టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జనాలు పట్టించుకోలేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో నియోజకవర్గ స్థాయిలో ఏ నాయకుడు కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా నిర్వహించలేదు. ఎల్లో మీడియాకు పోజుల కోసమే ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించేవారు. మరికొన్ని చోట్ల అటెండెన్స్ కోసమే ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు హాజరయ్యేవారు. బాదుడే బాదుడు కార్యక్రమంపై సర్వే చేసిన టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీకి దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా ఏ గ్రేడ్ సాధించలేదట. A-గ్రేడ్ లో 0, B-గ్రేడ్ లో 9, C-గ్రేడ్ లో 80, D-గ్రేడ్ లో 86 నియోజకవర్గాలు నిలిచాయి. మంగళగిరి బాటలో కుప్పం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి కూడా A-గ్రేడ్‌లో నిలవలేకపోయింది. తండ్రీ కొడుకుల నియోజకవర్గాలు కూడా C గ్రేడులో నిలిచాయి. దీంతో, ఇక బాదుడే బాదుడు కార్యక్రమానికి స్వస్తి పలకాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ నివేదికను బయటపెట్టింది తెలుగుదేశం ప్రత్యర్థులు కాదు.. స్వయంగా టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీలో పని చేసే స్వాతి. ఆమె.. టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సమక్షంలో బయట పెట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేనపుడు.. టీడీపీ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టిన అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!
సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడాల్సిన దుస్థితి వచ్చింది. కుప్పం నుంచి సత్యవేడు వరకు అనుచరులు, టీడీపీ శ్రేణులకు ఫోన్ ఇన్, తదితర కార్యక్రమాల పేరుతో సంప్రదిస్తున్నా ఆశించిన స్పందన లేకపోవడంతో అధినేతకు కంటి మీద కునుకు దూరమవుతోంది. దీనికి తోడు టీడీపీ పరిస్థితిపై ఇటీవల నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలియటంతో మరింత ఆందోళన చెందుతున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. సర్వేలో బూత్‌కమిటీలే లేవనే విషయం స్పష్టం కావడం ఆ పార్టీ దీనావస్థకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కమిటీలు లేకపోతే ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయమై నియోజకవర్గ ఇన్‌చార్జీలపై బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారని సమాచారం. బూత్ లెవల్ కమిటీల ఏర్పాటుకు అవస్థలు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీలు బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు విషయంలో తలలు పట్టుకుంటున్నారు. మెంబర్లుగా ఉండేందుకు తమ్ముళ్ల కాళ్లావేళ్లా పడు తున్నా ఫలితం లేకపోతోంది. పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉండి చేసిందేమీ లేదని, ఎన్నికలు దగ్గరకొస్తుండటంతో ఇప్పుడు తాము గుర్తుకొచ్చామా? అంటూ నిలదీస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. గెలవని పార్టీకి బూత్‌లెవల్ కమిటీ మెంబర్లుగా తామెందుకు ఉండాలని ప్రశ్నిస్తుండటంతో నాయకులు చుక్కలు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. చదవండి: (సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్) మొక్కుబడిగా జోనల్ కమిటీ సమావేశం రాష్ట్రంలోనే కాకుండా.. చంద్రబాబు సొంత ప్రాంతమైన రాయలసీమలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత తెలిసిందే. మొన్నటి కర్నూలు పర్యటనతో వ్యతిరేకత మరింత అధికం కాగా.. రేణిగుంటలో గత మంగళవారం టీడీపీ నేతలతో రాయలసీమ జోనల్ కమిటీ సమావేశం ఏర్పా టు చేశారు. అయితే ఆ సమావేశానికి టీడీపీ నాయకులు మొక్కుబడిగా హాజరయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు తప్ప, మిగిలిన జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులెవ్వరూ అన్నుకున్న స్థాయిలో హాజరుకాకపోవడంతో సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు. ఇదిలాఉంటే.. సర్పంచ్‌లను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని టీడీపీ మరో ప్రయత్నం చేసింది. నిధులను రాష్ట్ర ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలకు మళ్లించిందని చెప్పుకుంటూ సర్పంచ్‌లకు పిలుపునిచ్చింది. తిరుపతి అలిపిరి వద్ద సర్పంచ్‌లకు మద్దతుగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రచారం చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున సర్పంచ్‌లు తరలివస్తారని భావించింది. అయితే పట్టుమని పది మంది కూడా రాకపోవటంతో టీడీపీ నేతలు ఉసూరుమన్నారు. ఈ పరిస్థితుల్లో తోక పార్టీ సీపీఐ జతకట్టినా.. అనుకున్న ఫలితం దక్కక ఎవరికి వారు ఇంటిముఖం పట్టడం గమనార్హం. కుప్పంపై ఆందోళన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం పర్యటన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలపై కుప్పం వాసులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిస్థితులను గమనించిన ఆయన ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నాలకు తెరతీశారు. తెరపైకి జియో ట్యాగింగ్ వైఎస్ఆర్సీపీ సర్కారుపై కుప్పం వాసుల ఆదరణను చూసి ఓర్వలేక పోతున్న చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు జియోట్యాగింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఎందుకని ప్రజలు నిలదీస్తుండగా ‘చంద్రబాబు నాయుడు పంపారు. మీ సమస్యలు ఏమై నా ఉన్నాయా? ఉంటే చెబితే వెంటనే పరిష్కరిస్తాం’ అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కాలం దొంగ ఓట్లతో కుప్పంలో నెగ్గుకొస్తున్న చంద్రబాబు మరోసారి అలాంటి ప్రయత్నాలనే నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. -
జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా
సాక్షి, కుప్పం: జనసేన కుప్పం ఇన్చార్జి మద్దిరాల వెంకటరమణ తన పదవికి, పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను కుప్పం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చూస్తుంటే పీఏసీ కమిటీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (అమరావతిపై విచారణకు తిరస్కరించిన సీజేఐ) -
‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్
సాక్షి, చిత్తూరు: ప్రజలను పట్టించుకోకుంటే ఏం జరుగుతుందో ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇప్పుడు అర్థమవుతోంది. కార్యకర్తలను కేవలం మెట్లుగానే ఉపయోగించుకుంటే పరిస్థితి ఎలా తారుమారవుతుందో అవగతమవుతోంది. అభివృద్ధి ఫలాలను అందించకుండా మాయమాటలకే పరిమితమైతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలిసివస్తోంది. కుప్పం కోట చేజారిపోయిందనే బెంగ రోజురోజుకూ పెరిగిపోతోంది. దశాబ్దాలుగా మోసిన తమ్ముళ్లు సైతం జారిపోతుంటే ఆందోళన అధికమవుతోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా పార్టీ గ్రాఫ్ దిగజారిపోతుండడంతో దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. ఈ మేరకు గురువారం విజయవాడలో కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది. చదవండి: పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల కుప్పంలో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత పడిపోయింది. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి కూడా నియోజకవర్గం వైపు చూడని చంద్రబాబుకు ఇప్పుడు కలలో కూడా కుప్పమే కనిపిస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోటలా మార్చుకున్న నియోజకర్గం చేజారిపోతుందేమో అనే దిగులు చందబ్రాబును వెంటాడుతోంది. డీలా పడిన టీడీపీ అభివృద్ధి చూడాలంటే కుప్పం రండి అంటూ ఒకప్పుడు చంద్రబాబు జబ్బలు చరుచుకునేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో కుప్పం ప్రజలకు తెలిసిపోయింది. ఇంతకాలం మాటలతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గంపగుత్తగా గెలిపించారు. ప్రతిపక్షనేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమాత్రం వివక్ష చూపకుండా అభివృద్ధిని పరుగులు తీయిస్తుండడంతో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,149 కోట్లు మంజూరు చేయడంతో అభిమానం రెండింతలైంది. ఈ క్రమంలోనే సెపె్టంబర్ 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభకు ప్రజానీకం తండోపతండాలుగా తరలివచ్చింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపూ హర్షధ్వానాలతో మద్దతు పలికింది. దీంతో అటు చంద్రబాబుకు, ఇటు స్థానిక టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు విషయం అర్థమయ్యేసరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పరువు కోసం పాట్లు! గత సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. కుప్పంలో తన ప్రభ మసకబారుతోందని అర్థమైంది. దీనికితోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటించగానే బాబులో మరింత గుబులు మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారని టీడీపీ నేతలే చెబుతున్నారు. అందులో భాగంగానే 25 మంది కుప్పం నేతలను గురువారం విజయవాడకు పిలిపించుని మాట్లాడినట్లు వెల్లడించారు. కార్యకర్త నుంచి నేతల వరకు అందరూ సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ ఇన్చార్జి పీఎస్ మునిరత్నంపై పలువురు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని, వెంటనే ఇన్చార్జిని మార్చాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనిపై చంద్రబాబు దృష్టి సారించారని, త్వరలోనే కొత్త ఇన్చార్జిని నియమించనున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. సీఎం వరాలపై జనంలో చర్చ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలో డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు, నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు మొత్తంగా రూ.1,149 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కుప్పం వాసులు సైతం ముఖ్యమంత్రి కురిపించిన వరాలపై చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి గెలిపిస్తే చంద్రబాబు చేసింది శూన్యమని, మూడున్నరేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తోందని ప్రశంసిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ!
కుప్పంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గతనెల 23న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెగ్గొట్టి టీడీపీ కేడర్ మొత్తం వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. బాబుకు బైబై చెప్పి అధికారపారీ్టలో పొలోమని చేరిపోతోంది. విషయం పసిగట్టిన టీడీపీ అధిష్టానం పార్టీ కేడర్‌ను కాపాడుకునేపనిలో పడింది. అధినేత చంద్రబాబుతోపాటు తనయుడు చినబాబు రోజూ టెలీకాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడి నేతలను బుజ్జగిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. అయినా కుప్పం ప్రజానీకం మార్పును కోరుకుంటుండడంతో వైఎస్సార్సీపీ సమరోత్సాహంతో ముందుకు సాగుతోంది. సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. పార్టీ అధినాయకత్వం నియోజకవర్గ నేతల తీరుతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. రోజూ పార్టీ నాయకులు, ఓటు బ్యాంకు ఉన్న కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ పరువు కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 23న కుప్పంలో మూడవ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయనకు అపూర్వ స్పందన లభించింది. సీఎం వైఎస్ జగన్‌కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో ముఖ్యమంత్రికి లభించిన ఆదరణ చూసి చంద్రబాబు అండ్ కో షాక్‌కి గురయ్యారు. అప్పటివరకు చంద్రబాబు, స్థానిక నేతల తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న టీడీపీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ పర్యటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ద్వితీయ, తృతీయశ్రేణి నేతలతోపాటు కార్య కర్తలు వైఎస్సార్సీపీలో చేరిపోతున్నారు. ఇటీవల గుడుపల్లె మండలానికి చెందిన 50 కుటుంబాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. టీడీపీలో కలవరం సీఎం వైఎస్ జగన్ పర్యటన తర్వాత టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరేందుకు ఉత్సాహం చూపు తున్న విషయాన్ని పసిగట్టిన తమ్ముళ్లలో కలవరం మొదలైంది. గుడుపల్లె మండలానికి చెందిన వారి చేరికతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కుప్పంలో జెండా మోసేందుకు ఒక్కరూ మిగలరని భావించిన టీడీపీ నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటనే చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు స్పష్టమవుతోంది. పార్టీలో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో వివరాలు సేకరించి.. అందులో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలను విభజించారు. ముందుగా నియోజకవర్గ స్థాయి నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టి.. వారితో చంద్రబాబు ఓ సారి, లోకేష్ బాబు మరోసారి విడివిడిగా ఫోన్లలో మాట్లాడుతూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి ఏకరువు పెడుతుండడంతో ఎవరిని తిట్టాలో, ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థంగాక చంద్రబాబు తలపట్టుకుంటున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తల అసంతృప్తికి దారితీసిన కారణాలపై ఎవరిని బాధ్యులను చేయాలో అర్థంగాక చంద్రబాబు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? ఎవరిని దగ్గరికి తీసుకోవాలనే దానిపై పార్టీ ముఖ్యనాయకులతో చర్చించినట్లు సమాచారం. కులం పేరుతో రెచ్చగొడుతున్న బాబు ఆగస్టులో మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో టీడీపీ శ్రేణులు కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. రామకుప్పం మండలం కొల్లుపల్లి, కుప్పంలో వైఎస్సార్సీపీ జెండా లు చించివేసి పార్టీ శ్రేణులపై రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు గాయాలపాలయ్యారు. టీడీపీ శ్రేణుల తీరుతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దాడులకు కారకులైన కొందరు టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసులు నమోదైన వారితో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘మీ కులం వారిపై వైఎస్సార్సీపీ వారు కావాలనే కేసు నమోదు చేశారు. మిమ్మల్ని మండలంలోనే ఉండకుండా చేయాలని చూస్తున్నారు. మీరంతా ఏకమవ్వాల్సిన సమయం దగ్గరపడింది. మీకు అండగా నేను ఉంటాను’. అంటూ కులాన్ని రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారన్న చర్చ మొదలైంది. చంద్రబాబు తీరుతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుండడం గమనార్హం. అందుకే బాబును నమ్మడంలేదు ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోశాం. కష్టాలు పడ్డాం. అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ ఆయన (చంద్రబాబు) మాలాంటి వాళ్లను నమ్మలేదు. కొంతమంది మాటలే వింటూ.. అన్ని పదవులు వారికే కట్టబెట్టారు. ఇప్పుడు అధికారం లేదని చినబాబు, పెదబాబు బేరాలు ఆడుతున్నారు. రోజూ ఫోన్లు చేసి బుజ్జగిస్తూ.. అండగా ఉంటామని నూరిపోస్తున్నారు. కానీ మళ్లీమళ్లీ మోసపోకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాం. అందుకే ఆ పార్టీ (టీడీపీ) కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాం. పార్టీలకతీతంగా అందరి సంక్షేమం కోరుకుంటున్న వైఎస్సార్సీపీని ఈసారి గెలిపించాలనుకుంటున్నాం. – మునస్వామినాయుడు (పేరు మార్చాం), టీడీపీ నాయకుడు, కుప్పం టీడీపీ నామ రూపాల్లేకుండా పోతోంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమందినే నమ్మారు. నిజమైన కార్యకర్తలను దూరంగా పెట్టారు. అధికారమదంతో కన్నుమిన్నూ కానకుండా ప్రవర్తించారు. ఇప్పుడు అధికారం పోయిందని కల్లబొల్లిమాటలు చెబుతున్నారు. రోజూ మీటింగ్‌ల పేరుతో చావగొడుతున్నారు. కానీ ఆయన మాటలు నమ్మేందుకు ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. 30 ఏళ్లుగా కష్టపడ్డ వాళ్లందరూ ఇప్పుడు ఫ్యాన్గాలికింద సేదతీరాలని భావిస్తున్నారు. ఈసారి కుప్పంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుంది. – గణేష్ (పేరు మార్చాం), టీడీపీ నాయకుడు, కుప్పం -
కూలిన కుప్పం పచ్చకోట.. ఆందోళనలో చంద్రబాబు!
కుప్పం పచ్చకోట కూలిపోతుందా? కుప్పం నా అడ్డా అన్న చంద్రబాబు వేరే దారి చూసుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ తర్వాత తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారా? అక్కడ పచ్చ పార్టీ పని ముగిసిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. కుప్పంలో సీఎం జగన్ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాల్లో జరిగిన మార్పులేంటో పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు పచ్చ పార్టీకి కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కుప్పంకు నాన్‌లోకల్‌గా పేరుపడ్డ చంద్రబాబు ఏనాడు కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. కుప్పం మున్సిపాలిటీ అయింది. చంద్రబాబు ఏలుబడికంటే.. సీఎం జగన్ పాలనలోనే తమ జీవితాలు బాగవుతున్నాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అందుకే జగన్ వచ్చాక జరిగిన ఎన్నికలన్నింటిలో టీడీపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 30 సంవత్సరాలు కుప్పం నా అడ్డా అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబును అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఇక కుప్పంలో నిర్మించుకున్న పచ్చ కోటలన్నీ కుప్పకూలిపోతుండటంతో కళ్లు తెరచిన చంద్రబాబు కొంతకాలం క్రితం అక్కడకు వెళ్లినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పచ్చ పార్టీ నేతలు గుండాగిరి కూడా చేయించారు. కుప్పం ప్రజలు తనను మరిచిపోతున్నారనే భయం, ఆందోళన చంద్రబాబులో మొదలయ్యాయి. వారం కిత్రం ముఖ్యమంత్రి జగన్ టూర్‌తో ఆ నియోజకవర్గంలో టీడీపీ పతనం పరిపూర్ణం అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ సభకు వచ్చినంత ప్రజలు గతంలో ఏనాడు చంద్రబాబు సభలకు రాలేదని అందరూ ఏకోన్ముఖంగా చెప్తున్నారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం మాదిరిగా అభివృద్ధి చేస్తానని జగన్ ఇచ్చిన హామీతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభ సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసిన గత వారం రోజులుగా సీఎం సభ గురించే చర్చ జరుగుతుండటం విశేషం. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పంలో నిర్వహించిన సభలకు ఏనాడూ ఇంతమంది జనం హాజరుకాలేదని టీడీపీ కార్యకర్తలు చెప్పకుంటున్నారు. కుప్పంతోనే నా రాజకీయ జీవితం ముడిపడిఉందని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని నేతలు, కార్యకర్తలు సమరోత్సాహంలో ఉన్నారు. గతం కంటే సీఎం సభ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుప్పంలో సీఎం సభ సక్సెస్ కావడంతో టీడీపీ నాయకుల్లో గుబులు ప్రారంభమైంది. చంద్రబాబు అడ్డాలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడే పరిస్థితులు కనిపిస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్నదానిపై టీడీపీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కుప్పంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారని పచ్చ పార్టీలో టాక్ నడుస్తున్నట్టు సమాచారం. -
పొలిటికల్ కారిడార్ : కుప్పంకు నాన్ లోకల్ గా పేరుపడ్డ చంద్రబాబు
-
Kuppam: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన
కులం లేదు.. మతం లేదు.. పార్టీలతో సంబంధం లేదు.. అర్హులైతే చాలు, పథకం తలుపు తడుతోంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలకు.. ఇళ్ల మధ్యనున్న సచివాలయం సాదర స్వాగతం పలుకుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ‘నవ’రత్న పథకాలతో ప్రతి కుటుంబం వేల నుంచి లక్షల రూపాయల లబ్ధి పొందుతోంది. ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఇంటి వద్దకే వస్తున్న వలంటీర్లు.. లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘గడప గడప’కు వెళ్తున్న నేతలు.. సంక్షేమ పాలనలో ఊరూవాడా అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. చిత్తూరు కలెక్టరేట్/కుప్పం: సంక్షేమ పాలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందం నింపుతోంది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయినా సరే.. సీఎం సొంత నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. కుప్పం వాసుల చిరకాల కోరికలైన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాము ప్రజల పక్షమని నిరూపించింది. చంద్రబాబు తన నియోజకవర్గంలో సర్కారు బడులను మూసివేసి ఓ కార్పొరేట్ పాఠశాలకు అనుమతిచ్చి విద్యను వ్యాపారం చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు మొదటి దశలో 121 సర్కారు పాఠశాలల రూపురేఖల మార్పునకు రూ. 31.23 కోట్లు, రెండవ దశలో 267 పాఠశాలలకు రూ.101.48 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇళ్లు లేని పేదలకు టీడీపీ పాలనలో 3,800 మందికి పట్టాలు ఇవ్వగా.. 4,691 మందికి ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 15,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలను నిర్మిస్తోంది. కుప్పం ప్రజలను చంద్రబాబు తన రాజకీయ లబ్ధికి వాడుకోగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుండడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చెందిన ఈమె పేరు అమ్ములు. భర్త మంజునాథ్ వ్యవసాయ కూలీ. టీడీపీ కార్యకర్త. వీరికి ఇద్దరు పిల్లలు హృతిక్(4), దివ్య(3). కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఒక్క ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని జీవించేవారు. టీడీపీ పాలనలో ఈ కుటుంబానికి ఎలాంటి లబ్ధి కలగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కుటుంబం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.18,400, వెలుగులో రూ.50 వేల రుణం పొందింది. ప్రభుత్వ పథకాల సహాయంతో రామకుప్పం మండలంలో మురుకుల తయారీ కేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారం సజావుగా సాగుతుండంతో నెలకు అన్ని ఖర్చులు పోను రూ.8 వేల నుంచి రూ.10 వేల ఆదాయం వస్తోంది. వీరి జీవనం సాఫీగా సాగుతోంది. కుప్పం పట్టణంలోని పాత పోస్టాపీసు వీధికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. భర్త మురుగన్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ప్రియదర్శిని, భూమిక. వీరిని చదివించేందుకు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా అమ్మ ఒడి ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివిస్తోంది. రామకుప్పం మండలం విజలాపునికి చెందిన సాగరాభి(65) కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. సాగరాభి వృద్ధాప్యం, హనీష్(45) దివ్యాంగుడు కావడంతో నిత్యం నరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూలీలుగా మారారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక, సాగరాబీకి రూ.2,500, దివ్యాంగుడు హనీష్కు రూ.3వేల పింఛను ప్రతి నెలా వస్తోంది. ఈ మూడేళ్లలో ఆ కుటుంబానికి రూ.1.92 లక్షలు అందింది. గుడుపల్లె మండలం సంగనపల్లెకు చెందిన ఈయన పేరు నారాయణప్ప. 2.5 ఎకరాల పొలం ఉంది. అటవీ సరిహద్దు పొలాలు కావడంతో వ్యవసాయం చాలా కష్టం. విత్తనాల కొనుగోలుకు, ఎరువులు.. పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఆయన్ను ఆదుకుంది. మూడేళ్లలో ప్రభుత్వం రూ.41 వేలు ఆయన ఖాతాలో జమచేయడంతో సాగు సాఫీగా సాగుతోంది. కుప్పం మండలం జరుగు పంచాయతీ పోరకుంట్లపల్లెకు చెందిన మళ్లికమ్మ, భర్త గోవిందప్ప టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో పక్కా గృహం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ స్వయంగా ఇంటి పట్టాను తెచ్చివ్వడంతో ఆ దంపతుల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జగనన్న కాలనీలోనే నిసిస్తుండడం విశేషం. గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామానికి చెందిన ఈయన పేరు వెంకటాచలం. సాగునీరు లేక వ్యవసాయం వదిలి బెంగళూరులో కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బిసానత్తం వద్ద ఉన్న కల్లివంక కాలువ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతంలోని పొలాలు సస్యశ్యామలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటాచలం తిరిగి తమ గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులతో ఉపాధి పొందుతున్నాడు. నీటి చెరువుల అనుసంధానంతో కుప్పం రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. -
నారా వెన్నులో ఓటమి వణుకు
సాక్షి, చిత్తూరు: చెప్పిందే చెప్పడం.. మాట మాటకు రెచ్చగొట్టే ప్రయత్నం.. ఆగ్రహంతో ఊగిపోవడం.. అడుగడుగులో తీవ్ర అసహనం.. కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆద్యంతం ఇదే తీరు. ప్రశాంత కుప్పంలో అలజడి సృష్టించి.. వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొలిపి ఎప్పటిలానే రాజకీయ చలికాచుకున్నారు. చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడం.. వైఎస్సార్సీపీ పాలనలో కుప్పం అభివృద్ధి బాట పట్టడం జీర్ణించుకోలేని బాబు.. ఈ విడత దాడు లు, వ్యక్తిగత విమర్శలతో సరిపెట్టారు. ఇన్నేళ్లు ఆదరించిన కుప్పంలో సొంత ఇల్లు కూడా లేని ఆయన.. షరామామూలుగా ప్రజలను తిట్టిపోసి, అధికార పార్టీపై నోరు పారేసుకొని ఇక్కడి నుంచి జారుకున్నారు. తాను చేసిందే అభివృద్ధి అని, రాష్ట్ర ప్రభుత్వం కుప్పానికి ఏమీ చేయలేదని చెప్పిన మాటలతో ప్రజల్లో నవ్వులపాలయ్యారు. సర్వే ఫలితాలతో వెన్నులో వణుకు చంద్రబాబు మాటల తడబాటు వెనుక సొంత సర్వేల్లో ఓటమి సంకేతాలే కారణంగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుప్పం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు సైతం ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతుండడం, వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడటంతో బాబులో ఉలికిపాటు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ విడత కుప్పం పర్యటనలో తనలోని కుట్ర కోణానికి పదును పెట్టారనే విషయం స్పష్టమైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనం. ♦ బుధవారం వచ్చీరాగానే ఫ్లెక్సీల పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. ♦ గురువారం కూడా అలాంటి పరిస్థితులే కలి్పంచారు. అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు. ♦ ఇక ఆఖరిరోజు శుక్రవారం తన ప్రసంగంలో రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. ప్రతి మాటలో అసహనం వ్యక్తమైంది. వ్యక్తిగత దూషణలతోనే పర్యటన ముగించారు. ‘మీ ఇంటికొచ్చి కొడతా.. తోకలు కత్తిరిస్తా.. కన్నెర్ర చేస్తా.. ఇక్కడే ఉంటా.. దమ్ముంటే రండి..’’ ఇలాంటి మాటలు ఆయనలో ఎక్కడలేని అసహనాన్ని, ఓటమి భయాన్ని బయటపెట్టాయి. ఎప్పటిలానే ఎల్లో మీడియా తప్పుదారి కుప్పంలో జరిగింది ఒకటైతే, ఎప్పటిలానే ఎల్లో మీడియా తప్పుదారి పట్టించింది. అధికార పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడింది టీడీపీ వర్గీయులైతే ‘పచ్చ’పాతం చూపింది. వైఎస్సార్సీపీతో పాటు పోలీసులపై దుమ్మెత్తి పోస్తూ, వాస్తవానికి విరుద్ధంగా విషం చిమ్మింది. పోలీసు పహారాలో కుప్పం ప్రశాంత కుప్పంలో రాజకీయ లబ్ధి కోసమే చంద్ర బాబు నిప్పును రాజేశారు. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఈ నెపాన్ని వైఎస్సార్సీపీతో పాటు పోలీసులపై నెట్టి చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. ► కుప్పం నుంచి ఇప్పటికీ బెంగళూరుకు వలసలు నిత్యకృత్యం. ఉపాధి లేకపోవడంతో రోజూ సుమారు 15వేల మంది కార్మికులు ఆ ప్రాంతంలో పొట్ట పోసుకుంటున్నారు. ► కనీసం గార్మెంట్స్ పరిశ్రమ నెలకొప్పినా వలసలకు అడ్డుకట్ట పడుతుందని ఆ పార్టీ శ్రేణులు నెత్తీనోరు కొట్టుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. ► అదిగో, ఇదిగో పరిశ్రమలంటూ అరచేతిలో వైకుంఠం చూపడంతోనే ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలం గడిచిపోయింది. ► శాంతిపురం మండలంలోని కర్లగట్ట, కోతులగుట్ట, కుప్పం మండలంలోని గణే‹Ùపురం, గుడుపల్లి మండలంలోని పొగురుపల్లె ప్రాంతాలలో క్రిటానియా పరిశ్రమ కోసం ఆ సంస్థ ప్రతినిధులు సర్వే చేశారు. అయితే, బాబుకు అత్యంత సన్నిహితులైన కుప్పం టీడీపీ నాయకులు ఆ కంపెనీల్లో తమకు వాటాలు కావాలనే డిమాండ్లతో ఆ కంపెనీ వెనక్కు మళ్లింది. ►శాంతిపురం మండలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతోపాటు కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రామాపురం, అమ్మవారి పేట, 121 పెద్దూరు గ్రామాల వద్ద భూసేకరణ చేసినా బాబు చొరవ చూపకపోవడంతో అదీ చీకట్లో కలిసిపోయింది. ► శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు వద్ద వైష్ణవి మెగాఫుడ్ పార్క్‌కు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కేటాయించారు. అయితే రైతులకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారు. ► నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణం కూడా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. ► కుప్పం అభివృద్ధిలో కీలకమైన రైల్వేస్టేషన్లో 13 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెండు నిముషాలను కూడా నిలిపించలేకపోయారు. ► గుడుపల్లె మండలంలోని బిసానత్తం గని, చిగురుకుంట గోల్డ్ మైనింగ్ గనులు మూతపడి 1800 మంది కారి్మకులు రోడ్డున పడినా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తెరిపించే ప్రయత్నం చేయలేకపోవడం గమనార్హం. సొంత ఇల్లు ఎక్కడ బాబూ.. మూడు దశాబ్దాలకు పైగా కుప్పంలో పాతుకుపోయిన చంద్రబాబు ఇప్పటివరకు సొంతిల్లు నిర్మించుకోలేదు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయం కూడా లేకపోవడం గమనార్హం. చుట్టపుచూపుగా ఆర్నెల్లకో, ఏడాదికో వచ్చి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో రెండు రోజులు ఉండి వెళ్లిపోవడం చంద్రబాబుకు రివాజుగా మారింది. ‘పెద్దాయన’ అడుగుల్లో అడుగులై! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంతో సమానంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే కుప్పంకు మున్సిపాలిటీ హోదా కలి్పంచడం, రెవెన్యూ డివిజన్ చేయడం.. తాజాగా ఒక్క పట్టణ అభివృద్ధికే రూ.65 కోట్ల నిధులు విడుదల చేయడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. అభివృద్ధిలో ఇది ఒక కోణం కాగా.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథ కం రాజకీయాలకు అతీతంగా కుప్పంలోనూ తలుపుతడుతోంది. ఇదే సమయంలో విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గ ప్రజలకు తనదైన శైలిలో భరోసా కలి్పంచడం, ప్రతి విషయంలో అండగా నిలవడం.. స్థానిక నాయకుడైన ఎమ్మెల్సీ భరత్ గడప గడపకూ తిరుగుతుండటం వైఎస్సార్సీపీ పట్ల ఆదరణ రెట్టింపయింది. ఈనేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి అభివృద్ధికి జైకొడుతున్నారు. ఇటీవల కుప్పం, గుడుపల్లె మండలాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ నేతలు ఆ పారీ్టకి గుడ్‌బై చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో టీడీపీ సభ్యత్వ కార్డులు చూపుతూ వైఎస్సార్సీపీ కండువాలు వేసుకొని తమ మద్దతు ప్రకటించడం విశేషం. -
కుప్పంలో టీడీపీ గూండాగిరి
సాక్షి, చిత్తూరు: ఇన్నేళ్లు మభ్యపెట్టి ఓట్లు దండుకుంటూ వచ్చిన చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం ప్రజల్లో వచ్చిన చైతన్యం కంటగింపుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టడంతో పాటు శ్రేణులు క్రమంగా పార్టీకి దూరమవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఆయన ఏకంగా పార్టీ శ్రేణుల్ని భౌతిక దాడులకు ఉసిగొల్పుతున్నారు. బుధ, గురువారాల్లో ఆయన తన కార్యకర్తలను రెచ్చగొట్టిన తీరుచూస్తే.. నయానో భయానో నియోజకవర్గ ప్రజలను లొంగదీసుకోవాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవైపు తన అనుచరులను రెచ్చగొడుతూనే.. మరోవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలే దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగుతున్నారు. నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా.. స్థానిక టీడీపీ నేతలు ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నారు. దీంతో ఉపాధి లేని ప్రజలకు వలసలే దిక్కు అయ్యాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి ప్రారంభమైంది. కుప్పంను మున్సిపాలిటీగా ప్రకటించటంతో పాటు ప్రత్యేకంగా రూ.65 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం.. రెవెన్యూ డివిజన్‌గా మార్పుచేయడం చంద్రబాబు అసహనానికి కారణమైంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతుండటంతో నియోజకవర్గం నుంచి వలసలు పూర్తిగా నిలిచిపోయాయి. వాస్తవం బోధపడి టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టాయి. దీంతో కుప్పం చేజారిపోతుందని అర్ధమయ్యే చంద్రబాబు ఇప్పుడు కల్లోలం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత రెండ్రోజుల్లో ఇక్కడ చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతుంది. ఉనికి కోల్పోతామనే భయంతోనే అరాచకాలు అసలు చంద్రబాబు హయాంలో కుప్పంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. అయితే, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ప్రతిష్ట మసకబారింది. నానాటికీ దిగజారిపోతోంది. ప్రత్యేకించి స్థానిక ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తన సీటుకే ఎసరు వచ్చే ప్రమాదాన్ని చంద్రబాబు గ్రహించారు. దీంతో కుప్పంలోనైనా తన ప్రాభవాన్ని నిలుపుకోవాలనే తాపత్రయంలో అరాచకాలకు తెరతీశారు. ప్రణాళికలు సిద్ధంచేసి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఆ నెప్పాన్ని వైఎస్సార్‌సీపీపైకి మళ్లించే వ్యూహాన్ని రచించారు. బాబు డైరెక్షన్లోనే అల్లర్లు ఇక చంద్రబాబు బుధవారం రామకుప్పం మండలంలో ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లకు తెరతీశారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో వైఎస్సార్సీపీ శ్రేణులనేæ టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడ్డారు. వారి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఆఖరికి రెండేళ్ల చిన్నారిని కూడా గాయాలపాల్జేశారు. ఎప్పుడో ఏర్పాటుచేసుకున్న వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలను బూచిగా చూపించి రాజకీయంగా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. పైగా తమ వాళ్లపైనే వైఎస్సార్సీపీ దాడులు చేసిందంటూ ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం చేయించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలనే సంకేతాలను టీడీపీ కేడర్‌కు పంపారు. ప్రాణభయంతో మహిళా ఎంపీపీ పరుగులు అలాగే, చంద్రబాబు గురువారం కూడా కొత్త నాటకానికి తెరతీశారు. మీడియా దృష్టి కోసం బస్టాండ్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అన్న క్యాంటీన్ పేరుతో నానా రభస చేశారు. మీడియా ఫొటోసెషన్, వీడియో షూట్ తర్వాత కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ‘‘వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపైకి తానే వెళ్తాను.. వారి అంతుచూస్తాను’’.. అంటూ మాట్లాడడంతో తెలుగు తమ్ముళ్లు కర్రలతో కుప్పం వీధుల్లో స్వైరవిహారం చేశారు. విచక్షణా రహితంగా దాడులు చేస్తూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా కర్రలతో దాడిచేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగక.. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అశ్విని ఉన్న సమయంలోనే రాళ్లవర్షం కురిపించారు. దీంతో ఆమె ప్రాణభయంతో పరుగులు తీశారు. అయినప్పటికీ ఆమెనే లక్ష్యంగా చేసుకుని కర్రలు, రాళ్లు విసిరారు. మరోవైపు.. లక్ష్మీపురంలో వైఎస్సార్సీపీ నేత మణి ఇంటి వద్ద ఉన్న బ్యానర్లు, పార్టీ తోరణాలను టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ఒంటరిగా ఉన్న వారినీ వదిలిపెట్టలేదు. కుప్పం వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు అల్లరి మూకలు వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీకీ అడ్డంకులు టీడీపీ నేతలు, కార్యకర్తల చేతుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న భయ్యారెడ్డి, నారాయణరెడ్డితోపాటు మరికొందరి బాధితులకు సంఘీభావంగా గురువారం వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి కూడా టీడీపీ వర్గీయులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల సూచనతో వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా ర్యాలీ సాగించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద బైఠాయించి టీడీపీ దౌర్జన్యాలపై నిరసన తెలిపారు. టీడీపీ గూండాల చేతుల్లో గాయపడిన బాధితులను ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌లు పరామర్శించారు. నేడు బాబు రోడ్‌షో.. మళ్లీ అల్లర్లకు కుట్ర? తొలి రెండ్రోజుల తరహాలోనే మూడోరోజైన శుక్రవారం కూడా తీవ్రస్థాయిలో అల్లర్లు చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ వ్యూహం పన్నినట్లు.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీపై నెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తును పటిష్టం చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. -
కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు సవాల్ చేస్తారా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ 8వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. కుప్పానికే పరిమితమైన చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను పిలిపించుకుని నానా అల్లరి చేస్తున్నాడని మండిపడ్డారు. ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు ఆఖరికి కుప్పంలో పోరాడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాష్ట్రంతో పాటు, కుప్పంలో కూడా చంద్రబాబు పీడ విరగడ అవుతుందన్నారు. కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డులేని చంద్రబాబు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఏ రకంగా సవాల్ విసురుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాక తప్పదన్నారు. ఎవరికోసమో, ఎవరో అడిగారనో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. చదవండి: (చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని) -
కుప్పంలో అసలు ఏం జరిగింది?.. చంద్రబాబు హై డ్రామా ఆ భయంతోనేనా..?
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. కుప్పంలో తెలుగుదేశం గూండాల దాడులకు అనుగుణంగా చంద్రబాబు వీరంగం ఆడారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎలా కాపురాలు చేస్తారో చూస్తానని బెదిరించారు. పార్టీ శ్రేణులను శాంతియుతంగా ఉండాలని తాను చెప్పలేనని పార్టీ నేతలు యోధుల్లా ధైర్యంగా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా మంత్రులను ఉద్దేశించి ఖబడ్దార్ దమ్ముంటే కుప్పం రండి తేల్చుకుందాం అంటూ తొడగొట్టారు. రాజకీయాల్లో అర్ధ శతాబ్ధిగా ఉన్న నాయకుడు ఇటువంటి నేలబారు రౌడీ భాష మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’ కుప్పం నియోజక వర్గం తన చేజారిపోతోందేమోనన్న భయంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల్లో కుప్పం ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకూ ఎదురుగాలి తప్పదని కంగారు పడుతోన్న వేళ కుప్పం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించడంతో చంద్రబాబు వెన్నులో చలిమొదలైంది. ఈనేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ శ్రేణుల చేత గూండాగిరీ చేయించిన చంద్రబాబు వారికి వత్తాసుగా తాను కూడా వీరంగం ఆడేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిపైనా, పోలీసులపైనా నోటికొచ్చింది అనేశారు. సీనియర్ పొలిటీషయన్ అని చెప్పుకునే చంద్రబాబు భాష చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యమంత్రీ ఖబడ్దార్.. ఏయ్ డీజీపీ జాగ్రత్త.. ఎస్పీ...ఏమనుకుంటున్నావ్? తమాషాగా ఉందా?. కుప్పంలో కాపురాలు చేస్తారా? చెయ్యండి చూద్దాం. పోలీసుల కతలు రెండు నిముషాల్లో తేల్చేస్తా. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అందరి అంతు చూస్తాం. ఇవీ నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర మూటకట్టురకున్న పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి నేలబారు మాటలు. టీడీపీ కార్యకర్తలకూ కోపం వస్తుంది. ఓ స్థాయి దాటితే ఆ కోపాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. కార్యకర్తలను పిరికిగా ఉండమని చెప్పలేను ప్రతీ కార్యకర్తా ఒక యోధుడిలా తయారు కావాలి. యువత ముందుకు రావాలి. ఇవీ హుందాగా మెలగాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈ చౌకబారు రౌడీ భాష అంతా కూడా చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలోనివే. విషయం ఏంటంటే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మరో పక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజక వర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు నడుం బిగించింది. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి కుప్పం తలరాత మార్చారు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్ననే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ అభివృద్ధి పథకాలు పూర్తి అయితే కుప్పం ప్రజలు తనని అటకెక్కించేస్తారని కంగారు పడుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కుప్పం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం చాలా కష్టమని తేలినట్లు సమాచారం. ఆయన ఆ టెన్షన్లో ఉంటే.. మరో వైపు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంలో భాగంగా కుప్పం నియోజక వర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కుప్పం కూడా తనకు మిగలదన్న భయం చంద్రబాబు నాయుడికి కొద్ది రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో తరుచుగా పర్యటిస్తోన్న చంద్రబాబు బుధవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు వీధి గూండాల్లా ఊరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డొచ్చిన వారిని చితక బాదారు. రాళ్ల దాడి చేశారు. మొత్తం మీద రచ్చ రచ్చ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తోంటే చంద్రబాబు నాయుడు వారించలేదు. తమాషా చూశారు. ఈ సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. టీడీపీ గూండాయిజానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ పార్టీ శ్రేణుల దాడులను చూస్తూ గడిపిన చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడులు చేశారని గగ్గోలు పెట్టారు. కుప్పంలో ఎన్నడైనా రౌడీయిజం చూశామా? ఎన్నడైనా ఇలాంటి దాడులు చూశామా? అంటూ బుగ్గలు నొక్కుకుంటూ చంద్రబాబు హై డ్రామా నడిపారు. టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయి దాడులు చేస్తోంటే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో చంద్రబాబు కోపం అంతా పోలీసులపై పడింది. పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? నేను తలచుకుంటే మీ ఇంటిని కొట్టలేనా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. ‘మీ ఇళ్లు కూలిస్తే .. మీ కుటుంబ సభ్యులను నడి రోడ్డుపై అవమానిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ‘ అంటూ తన స్థాయి మరిచి హెచ్చరించారు. ఈ పోలీసులకన్నా బ్రిటిష్ వాళ్లే నయం అంటూ చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కొవ్వెక్కిపోయిందన్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో నేను వీధుల్లోకి వస్తా ఎవరొస్తారో చూస్తా అంటూ వీధి రౌడీలా సవాల్ చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఇంటికి వస్తా వేలమందిని వేసుకుని వస్తా మీ అంతు చూస్తా అంటూ బాలయ్య సినిమా టైప్ డైలాగ్ వదిలారు చంద్రబాబు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిని పరోక్షంగా రెచ్చగొట్టారు చంద్రబాబు. ‘ మీకూ కోపం వస్తుంది. దాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. ఆ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకుంటే వారికే మంచిది అని హెచ్చరిక స్వరంతో అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ప్రభుత్వ సలహాదారులంతా దమ్ముంటే కుప్పానికి రండి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. అందరి అంతూ తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందరికీ కాలం చెల్లిందంటూ దిగజారుడు భాష ప్రయోగించారు. అసలు కుప్పంలో మీరంతా కాపురాలు ఎలా చేస్తారో నేనూ చూస్తా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలను హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్ధం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన వాడిన భాష చూస్తోంటే ఆయనకు మతి స్థిమితం తప్పలేదు కదా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఆయన పరుష పదజాలాన్ని చూస్తోంటే ఆయన ఎంతకైనా దిగజారగలరని అర్ధం అవుతోందని వారంటున్నారు. రౌడీయిజం చేసింది తెలుగుదేశమే. హింసాయుత ఘటనలతో బీభత్సం సృష్టించింది ఎల్లో గూండాలే. వారిని రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌పై దాడులు చేయించింది చంద్రబాబే. అన్నీ వారే చేసి కుప్పంలో ఏదో జరిగిపోతోందన్నట్లు హై డ్రామా ఆడుతోందీ చంద్రబాబే అంటున్నారు పాలక పక్ష నేతలు. తన స్థాయికి కానీ తన హోదాకు కానీ తగని విధంగా చిల్లరగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు వారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలే చేసి ప్రజల నుండి నిరాకరణకు గురయ్యారని అందుకే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్వకుండా మరింత పాతాళానికి దిగజారుతున్నారని వారు దుయ్యబడుతున్నారు. చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని -
టీడీపీతో ప్రాణహాని: కన్నీరు పెట్టిన MPP అశ్విని
-
చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని
సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో రెండవరోజూ టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. టీడీపీ కార్యకర్తలు కర్రలు, ఇనుపరాడ్లతో వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మండల పరిషత్ కార్యాలయంపై రాళ్లదాడికి దిగారు. మొదట వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చింపేసి అనంతరం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. టీడీపీ అల్లరి మూకల దాడిలో మండల పరిషత్ అధ్యక్షురాలు అశ్వినితో పాటు జూనియర్ అసిస్టెంట్ వినయ్‌కి గాయాలయ్యాయి. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని నన్ను చంపడానికి టీడీపీ గుండాలు వచ్చారని.. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని మండల పరిషత్ అధ్యక్షురాలు అశ్విని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సమక్షంలోనే దాడి జరిగిందని ఎంపీపీ అశ్విని తెలిపారు. రామకుప్పం: కుప్పం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలం రోజురోజుకూ పుంజుకుంటున్న నేపథ్యంలో జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పచ్చనేతలు దాడులు చేశారు. చదవండి: (చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం.. కీలక అరెస్టులు) తొలుత కొంగనపల్లి చంద్రబాబు రోడ్‌షో ప్రారంభించే క్రమంలోనే వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్ల వద్ద నానా హంగామా చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని దూషిస్తూ వీరంగం సృష్టించారు. దీనిని అడ్డుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు జై జగన్ అంటూ ప్రతి స్పందించారు. దీంతో మూకుమ్మడిగా తెలుగు తమ్ముళ్లు ఆ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. మహిళలు అడ్డుపడినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా వెంబడించి కొట్టారు. అయితే పోలీసులు రంగ ప్రవేశంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అనంతరం చంద్రబాబు రోడ్‌షో చెల్లిగానిపల్లి వరకు చేరుకుంది. అక్కడా తమ్ముళ్లు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ జెండా, బ్యానర్లను పీకేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వైఎస్సార్సీపీ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. అదునుకోసం వేచి చూస్తున్న తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పింది. పచ్చనేతలు ఒక వైపు సీఎం డౌన్ డౌన్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీనికి ప్రతి స్పందనగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి చేయి దాటి పోయింది. ముందుగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. ఈ రాళ్ల దాడిలో కొంగనపల్లికి చెందిన భయ్యారెడ్డికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇతనితోపాటు వాణి రెండేళ్ల చిన్నారి గాయపడింది. ఇదంతా శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజల్లో సానుభూతి పొందాలనే డీటీపీ ఈ కుట్రకు పాల్పడిందనే వాదనలు గట్టిగా వినిపించాయి. కుప్పంలో డీటీపీ నేతలు టార్గెట్ చేసి వైఎస్సార్సీపీపై దాడులు చేశారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. చదవండి: (స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం
ఇంటిని చక్కదిద్దుకోలేని నాయకుడు రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేస్తాడో కుప్పం నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకున్న చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రి కాగలిగినా.. వాళ్ల బాగోగులను ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నా ఆ స్థాయిలో ఉండి కూడా మొండిచేయి చూపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత నియోజకవర్గం అయినప్పటికీ అభివృద్ధికి మారుపేరుగా కుప్పంను తీర్చిదిద్దుతుండటం విశేషం. కుప్పం: రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. ఏళ్ల తరబడి పాలించిన టీడీపీ నేతలు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడికక్కడ సమస్యలు తాండవిస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల తో స్థానికులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. ప్రధానంగా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతోనే అభివృద్ధికి తొలి అడుగు పడింది. తాజాగా మున్సిపాలిటీ అభివృద్ధికి ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.66 కోట్ల నిధులు విడుదల చేయడంతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. ప్రస్తుతం డికే పల్లి చెరువు నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. అయితే మున్సిపాలిటీ పరిధి పెరగడంతో అన్ని ప్రాంతాలకు పూర్థిస్థాయిలో నీరు అందని పరిస్థితి. ప్రస్తు తం తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. రూ.3.67 కోట్లతో నూతన బోర్లు, పైపులైన్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నా రు. అనిమిగానిపల్లె, తంబిగానిపల్లె, పరమసమద్రం, చీగలపల్లె, కమతమూరు గ్రామాల్లో నూతన బోర్ల డ్రిల్లింగ్‌తో పాటు ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. రూ.43.5 కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్లు పట్టణంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో పాటు సి మెంట్ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలో అటవీ సరిహద్దు ప్రాంతం నారాయణపురం సైతం కలవడం వల్ల అక్కడ కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు భారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో రెండో వార్డు చీగలపల్లె, చిన్న చీగలపల్లె, నారాణపురం గ్రామాల్లో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు వేయనున్నారు. దీంతో పాటు దాదాపు అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నూతన శోభ పట్టణం విస్తరిస్తున్నా శివారు కాలనీల్లో కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో కొత్త వెలుగులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు రూ.1.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాజావారి పార్కుతో పాటు దళవాయి కొత్తపల్లె పార్కుల అభివృద్ధికి రూ.2.55 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం చెరువు నిండి మొరవ పారుతుండడంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది. పార్కు అభివృద్ధి చెందితే పట్టణం నూతన శోభను సంతరించుకోనుంది. ఇక శ్మశాన వాటికను కూడా రూ.1.38 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. పట్టణంలోని నాలుగు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ, మహిళా కమ్యూనిటీ భవనాలకు రూ.69 లక్షలు కేటాయించడంతో వీటన్నంటికీ మంచిరోజులు రానున్నాయి. ఇలా కుప్పంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇది పట్టణ నడిబొడ్డులోని డి.కె.పల్లి చెరువు వద్దనున్న ఉద్యానవనం. పేరుకే ఇది ఉద్యానవనం కానీ ఇక్కడ మచ్చుకైనా ఆహ్లాదకర వాతావరణం కనిపించదు. ఇదే కాదు, పట్టణంలోని రాజువారి పార్కులోనూ కనీస సౌకర్యాలు లేక పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఇంత పెద్ద పట్టణంలో ప్రజలు ఉదయం, సాయంత్రం కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామనుకున్నా గత ప్రభుత్వం ఆ మేరకు తీర్చిదిద్దలేకపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఈ రెండు పార్కులకు మంచి రోజులు రానున్నాయి. రూ.2.55 కోట్లతో పార్కులకు మహర్దశ చేకూరనుంది. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కుప్పం నియోజక వర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసిన వెంటనే అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కుప్పం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలు మెచ్చేలా సౌకర్యాలు మెరుగుపరుస్తాం. – డాక్టర్ సుధీర్, చైర్మన్, కుప్పం మున్సిపాలిటీ -
సీఎం జగన్ నిర్ణయంతో చిగురుకుంట బంగారు గనులకు మహర్దశ
సీఎం జగన్ మాట బంగారు బాట కానుంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో దాగిన బంగారు ఖనిజాన్ని వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో చిగురుకుంట బంగారు గనులకు మోక్షం లభించనుంది. 1,500 మంది కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పంచాయతీలకు రాబడి పెరగనుంది. 20 ఏళ్ల పాటు సొంత నియోజకవర్గంలోని బంగారు గనులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బంగారాన్ని వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్ఎండీసీ సంస్థ రూ.450 కోట్లతో టెండర్ దక్కించుకుంది. కుప్పం రూరల్/ గుడుపల్లె: దేశంలోనే పేరుగాంచిన చిగురుకుంట బంగారు గనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మహర్దశ రానుంది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బంగారు గనులు మూతపడడంతో వెయ్యి మంది కార్మిక కుటుంబాలు వీధిన పడినా అప్పటి సీఎం చంద్రబాబు స్పందించలేదు. ఫలితంగా కార్మికుల గోడు అరణ్యరోదనగా మారింది. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గమైనా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనులను తెరిపించే దిశగా అడుగులు వేశారు. ఈ నెల 4న కుప్పం ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏడాదిలోపు చిగురుకుంట బంగారు గనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఈ ప్రాంతానికి మహర్దశ రానుంది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బంగారు గనుల ప్రస్థానం గుడుపల్లె మండలం బిసానత్తం గనిని 1968లో, దశాబ్దం తరువాత చిగురుకుంట గనిని 1978లో ఎంఈసీఎల్ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ పదేళ్లపాటు క్వార్జ్ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్)లోని బీజీఎంఎల్ (భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్)కు అందజేస్తూ వచ్చింది. కాలక్రమేణా ఎంఈసీఎల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్ 1982లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీసే పనిని చేపట్టింది. దీంతో గనులు లాభాల బాట పట్టాయి. కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్ నిర్వహిస్తున్న చాంపియన్ గని నష్టాల్లో పడింది. కొంత మంది స్వార్థపరులు చిగురుకుంట, బిసానత్తం గనులు నష్టాల్లో సాగుతు న్నట్లు తప్పుడు లెక్కలు చూపించడంతో లాక్అవుట్ అయ్యాయి. ఇంత పెద్ద నష్టం తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుముడుచుకుని కూర్చున్నారు. దీంతో గనులు మూతపడ్డాయి. మరో ఏడాదిలో ప్రారంభం మూతపడ్డ గనులను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల తరువాత ఇక్కడ బంగారు కోసం అన్వేషించాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. జియో సంస్థ మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కి.మీ. మేర పరిశోధనలు చేసి 263 హెక్టార్లను ఎంపిక చేసింది. 150 బోర్లు డ్రిల్ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేపట్టింది. ఇక్కడ దొరికిన సల్ఫేట్ మట్టిని బెంగళూరుకు తరలించి ల్యాబ్‌లో పరీక్షించారు. పరీక్షల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. నివేధికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బిడ్లను పిలిచింది. ఈ బిడ్లకు ఆదాని, వేదాంత వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరో సంవత్సరంలో గనులు ప్రారంభిస్తామని చెప్పడం శుభపరిణామం. స్థానికులకు ఉపాధి గనులు ప్రారంభిస్తే స్థానికులకు ఉపాధితో పాటు పంచాయతీలకు ఆదాయం రానుంది. గనులు లాక్ అవుట్ చేసే నాటికి 1500 మంది పని చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో గనులు సాగాలంటే 3 వేల మంది సిబ్బంది అవసరమవుతుంది. వీరిలో 1500 గని కార్మికులు మరో 1500 నిపుణులు, ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఓఎన్ కొత్తూరు పంచాయతీకి నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేదని కార్మికులు తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆదాయం నాలుగింతలు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. పారదర్శకతతో నిధులు వినియోగిస్తే రెండు పంచాయతీల అభివృద్ధితో పాటు కుప్పం నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లే. వినియోగంలోకి కోట్లాది రూపాయల సామగ్రి గనుల్లో మూలన పడిన కోట్లాది రూపాయల సామగ్రి వినియోగంలోకి రానుంది. అక్కడ ఉన్న జనరేటర్లు, లిఫ్టులు, ట్యాంకర్లు, మోటార్లు తుప్పుపట్టిపోయాయి. గనులు ప్రారంభిస్తే పరికరాలు వినియోగంలోకి వచ్చి కోట్ల రూపాయలు ఆదా కానుంది. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉండగా, ఇందులో రెండు మార్గాలు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి, మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటికి తీయడానికి వినియోగించనున్నారు. సొరంగాలకు వినియోగించే భారీ టవర్లు వినియోగంలోకి రానున్నాయి. 8.5 టన్నుల బంగారం ఉత్పత్తే లక్ష్యం 263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండవచ్చని ఎన్ఎండీసీ అధికారుల అంచనా. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. మొత్తం 8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఖర్చు పెట్టనుంది. గనుల ప్రదేశంలోనే బంగారుశుద్ధి ప్లాంటుకు ఎన్ఎండీసీ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. (క్లిక్: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్) యువతకు ఉపాధి ఇప్పటికే కుప్పం నియోజక వర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి దయతో గనులు ప్రారంభమైతే మాలాంటి వారికి స్థానికంగానే ఉపాధి లభించనుంది. అంతే కాకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందనుంది. కుప్పంకు రాష్ట్రంలో గుర్తింపు వస్తుంది. చంద్రబాబు చేయలేని పని జగగన్న చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – సంపంగి, సంగనపల్లి పంచాయతీలకు ఆదాయం గనులు ప్రారంభమైతే చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా సంగనపల్లి, ఓఎన్ కొత్తూరు పంచాయతీలకు సెస్సుల రూపంలో రాబడి పెరిగే అవకాశం ఉంది. సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ గనులకు మోక్షం లభించడం ఆనందకరమే. ఇప్పటికైనా మా ప్రాంత గనులను గుర్తించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – అమర్నాథ్, సర్పంచ్, సంగనపల్లి -
'టార్గెట్ 175' కుప్పం నుంచే తొలి అడుగు
గత సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి కంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది. వచ్చే రెండు రోజుల్లో కుప్పం మునిసిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం. భరత్ అడిగాడు, సీఎం వైఎస్ జగన్‌గా నేను చేయిస్తున్నాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పని జరుగుతోంది. ఏడాది లోపు దాన్ని పూర్తి చేసి, కుప్పంకు కృష్ణా జలాలను తెస్తాం. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేసే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ కార్యకర్తలకు ఉద్బోధించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై.. ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేశారు. కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని, కార్యకర్తలకు కష్టసుఖాల్లో తోడు, నీడగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆ నియోజకవర్గంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించి, ఆశీర్వదించడమే ఈ విజయానికి కారణం అని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని, ఇంటింటా మనం చేసిన మంచి కన్పిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రతి కార్యకర్త కాలరెగరేసుకుని ఇంటింటికీ వెళ్లి.. ‘అక్కా.. మీకు ఈ మంచి చేశామా? లేదా?’ అని అడిగే స్థాయిలో.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మంచి చేశామని చెప్పారు. ప్రజల ఆశీస్సులను ఓట్ల రూపంలోకి మార్చే బృహత్తర బాధ్యత మీదేనని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ‘మూడేళ్లుగా భరత్ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. భరత్‌కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని రండి.. మంత్రిని చేస్తాను.. కుప్పం అభివృద్ధికి మరింతగా ఉపయోగపడతాడు’ అని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సీఎం ఏమన్నారంటే.. బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం కుప్పం ► కుప్పం టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటి నుంచో చంద్రబాబుకు మద్దతుగా ఉందని బయట ప్రపంచం అంతా అనుకుంటారు. వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం. బీసీలకు మంచి చేస్తున్నాం అంటే.. అది ప్రతి పనిలోనూ కనిపించాలి. ► బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ రిటైర్డు అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం. దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమయ్యారు. ఆ కుటుంబాన్ని వదిలేయకుండా, ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం. చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో ఆయన్ను పరామర్శించేందుకు నేను ఆస్పత్రికీ వెళ్లాను. ► ఆరోజు భరత్ నాకు పరిచయమయ్యాడు. భరత్‌ను ప్రోత్సహిస్తానని నేను ఆరోజే చెప్పాను. ముందుండి ప్రతి అడుగులోనూ అతనికి అండగా నిలబడుతున్నా. మీరు కూడా అతనిపై అదే ఆప్యాయత చూపించారు. దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు. అతన్ని ఇదే స్థానంలో నిలబెడతారా? లేక పై స్థానంలోకి తీసుకువెళ్తారా? అన్నది మీ మీదే ఆధారపడి ఉంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి ► కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తాను. అన్ని రకాలుగా మద్దతు ఇస్తాను. గతంలో కుప్పంలో గెలుస్తామా? అంటే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని అద్భుతాలు జరిగాయి. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేశాం. ఇవాళ ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ► ఇవాళ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. పథకాలన్నీ అందాయా? అని అడుగుతున్నాం. అందాయని ప్రజలు చెబుతున్నారు. రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతోంది. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు రాజకీయ నాయకుడిగా మనకు ఉత్సాహం వస్తుంది. ► ఇవాళ కాలర్ ఎగరేసుకుని.. మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీది. 175కు 175 స్థానాలు గెలిచే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలి. మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యత పెడుతున్నాను. మీపై నాకు ఆ నమ్మకం ఉంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి. కార్యకర్తలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తా. ► ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఎక్కువ అభివృద్ధి ► ‘కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు.. ఆయన సీఎం అవుతారు.. కుప్పం అభివృద్ధి చెందుతుంది’ అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలోనే ఆ నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది. ► స్కూళ్లలో నాడు–నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, ప్రతి గ్రామంలో సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీ కూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు. ఇప్పుడు మన కళ్లెదుట కన్పిస్తున్నాయి. నాడు – నేడుతో బడుల రూపు రేఖలు మారుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అమల్లోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే తొలి సీటు కుప్పం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్.. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొదటి గెలుపు కుప్పం కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షను నిజం చేయడానికి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలందరం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలవటం కష్టం కాదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన కుప్పం కార్యకర్తలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు కావాలని సీఎం సూచించారని తెలిపారు. పార్టీ క్యాడర్‌ను ఉత్తేజ పరిచారని, భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లోనూ వివరించాలని సూచించారని తెలిపారు. కార్యకర్తలందరితో ఆప్యాయంగా మాట్లాడారని, అన్ని వేళలా నియోజకవర్గానికి తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారని చెప్పారు. టీడీపీ తరహాలో కక్ష సాధింపు రాజకీయాలు వద్దేవద్దని స్పష్టం చేశారని వివరించారు. వైఎస్సార్సీపీకి మైలేజ్ వస్తుందని హంద్రీ–నీవా కాలువ (కుప్పం బ్రాంచ్ కెనాల్)ను సీఎం రమేష్ మూడేళ్లుగా పూర్తి చేయడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వేరే వారికి కాంట్రాక్టు ఇచ్చి ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. -
కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరొందిన కుప్పంలో ఆ పార్టీ బీటలువారుతోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి వెన్ను విరిగింది. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న సంక్షేమ పాలనకు ఆకర్షితులైన ఆ పార్టీ శ్రేణులు భారీగా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం, స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పని చేసేందుకు టీడీపీ ‘తమ్ముళ్లు’ క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఉనికి కుప్పంలో ప్రశ్నార్థకమవుతోంది. చదవండి: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం జిల్లాలోనే కుప్పం నియోజవర్గం కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కోటకు బీటలు వారాయి. ఇప్పుడు క్రమంగా ఆ కోట కాస్తా కూలుతోంది. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో 100 మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. వీరందరూ ఈనెల 5వ తేదీన తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శనివారం చిత్తూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మరో 234 మంది పార్టీలో చేరారు. అందరికీ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి ఆహా్వనించారు. ఇక మున్ముందు ఇదే తరహాలో ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి వలసలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గుడికి అని చెప్పి తీసుకోలేదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 234 మంది పార్టీ కండువా వేసుకున్నారు. సీఎం జగన్ చేసిన మంచి కార్యక్రమాలు, మంత్రి పెద్దిరెడ్డి మీద నమ్మకంతో టీడీపీకి గుడ్‌బై చెప్పేసి, వైఎస్సార్సీపీలో చేరారు. అయితే టీడీపీ తరహాలో మేము గుడికి అని తీసుకెళ్లి పార్టీ కండువాలు కప్పలేదు. ఇప్పుడు మల్లారం నుంచి 156 మంది స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ఇదొక గుణపాఠం. – భరత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం చంద్రబాబు సీఎంగా అనేక సార్లు ఉన్నా కుప్పం అభివృద్ధి జరగలేదు. అలాంటి కుప్పంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కుప్పంలో బీసీలు ఎక్కువ. సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు. ఈసారి బీసీ అభ్యర్థి భరత్‌ను తప్పక గెలిపిస్తాం. – మురుగేష్, కుప్పం వైఎస్సార్సీపీ కన్వీనర్ టీడీపీలో మేలు జరగలేదు 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను. ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. నన్ను కనీసం గుర్తించలేదు. కానీ, జగనన్న సీఎం అయ్యాక సంక్షేమ పథకాల ద్వారా నాకు లక్షకుపైగా నగదు అందింది. అందుకే ఈ పార్టీలో చేరాను. – కుప్పన్, మల్లనూరు మాజీ వార్డు సభ్యుడు 37 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా టీడీపీలో 37 సంవత్సరాలుగా ఉన్నాను. గతంలో ఎంపీటీసీగా పోటీ చేశాను. కానీ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక చేపట్టిన అభివృద్ధి పనులు నచ్చా యి. ఆయన వల్ల కుప్పం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉంది. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. – నారాయణస్వామి -
కుప్పంలో టీడీపీకి షాక్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పంలో తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు మరోసారి షాక్ ఇచ్చారు. వందమందికిపైగా నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో గుడిపల్లి మండలంలోని అగరం, కుప్పిగానిపల్లి, పోగురుపల్లి, గుండ్లసాగరం, కనమనపల్లి, ఓఎన్ కొత్తూరు పంచాయతీల్లోని టీడీనీ క్రియాశీలక కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్డులు సైతం తీసుకొచ్చి మరీ వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో మాజీ సర్పంచ్ వెంకటేష్, నేతలు సి.బి.సుబ్రమని, యల్లప్ప, సంపంగి తదితరులున్నారు. బాబు ఓటమి తథ్యం: మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి.. టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీకి ఆకర్షితులయ్యారని చెప్పారు. ఈ మూడేళ్లలో కుప్పంలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోను టీడీపీకి ఘోర పరాభవం, వైఎస్సార్సీపీకి అఖండ విజయం కలిగాయని గుర్తుచేశారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని, రానున్న రోజుల్లో కుప్పంలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, 2024లో బాబు ఓటమి తథ్యమని పేర్కొన్నారు. -
Vishal: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు విశాల్
చెన్నై: 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా సినీ నటుడు విశాల్ అంటూ గత కొద్ది రోజులుగా ఎల్లో మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లపై విశాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. రాజకీయ ప్రవేశంపై నన్ను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదు. అసలు ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యం కానీ, కుప్పం నుంచి పోటీ చేసే ఆలోచన కానీ తనకు లేదని' సినీ నటుడు విశాల్ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే, నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లాఠీ. నటి సునయ ననాయికగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని రాణా ప్రొడక్షన్స్ పతాకంపై విశాల్ మిత్రులు, నటులు, రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 🖊 pic.twitter.com/vt7fQM2PD9 — Vishal (@VishalKOfficial) July 1, 2022 -
కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
సాక్షి, చిత్తూరు జిల్లా: ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సిఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించాం. ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించట్లేదు. విద్య, వైద్యంకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలరు అని సీఎం గుర్తించారు. ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చదవండి: (దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం) కుప్పంలో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్ జగన్‌కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) -
చంద్రబాబు రివర్స్ డ్రామా.. ఇదీ వాస్తవం
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట. అవసరానికి ఎన్ని అబద్ధాలైనా అవలీలగా ఆడేస్తారు. చెప్పిన అబద్ధాన్నే వందసార్లు వల్లించి అదే నిజమని నమ్మించేందుకు యత్నిస్తుంటారు. తాను చేస్తేనే సక్రమం.. ఇతరులు చేస్తే అక్రమం.. ఇదే ఆయన నైజం. ఇంతా ఎందుకంటే.. కుప్పంలో ఇటీవల పర్యటించిన బాబు ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై బురద చల్లారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ నేతలు మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తీరా అసలు ‘ఘనులు’ టీడీపీ నాయకులే అని తెలియడంతో ప్లేటు మార్చేశారు. తమ పార్టీ వాళ్లు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకులంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. కథ అంతటితో అయిపోలేదు.. మళ్లీ తమ్ముళ్లను ఉసిగొల్పి నిరసన నాటకాలు ఆడించారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు. ప్రతిపక్షనేత ఎందుకిలా మాట్లాడుతున్నారు.. కుప్పంలో మైనింగ్కి సంబంధించి అసలేం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. సాక్షి, తిరుపతి: 2019కి ముందు.. సరిగ్గా చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గం అక్రమ మైనింగ్‌కు అడ్డా చంద్రబాబు హయాంలో పచ్చచొక్కాల నాయకులు అడ్డూ అదుపు లేకుండా ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకున్నారు. జిల్లా మొత్తంమీద అక్రమ మైనింగ్ ఎక్కువ జరిగింది ఎక్కడంటే స్వయంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే కావడం గమనార్హం. ఇక్కడి టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు ప్రధాన ఆదాయ వనరు అడ్డగోలు తవ్వకాలే. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ మైనింగ్‌కు బ్రేకులు పడ్డాయి. గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు అక్రమ క్వారీలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి దాడులు నిర్వహించారు. లెక్కకి మించి కేసులు పెట్టి జరిమానాలు విధించారు. టీడీపీ నేతల క్వారీలోనే నిలుచుని వైఎస్సార్సీపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ ప్రెస్మీట్లో మాట్లాడుతున్న చంద్రబాబు(ఫైల్) ఇప్పుడు కొత్త నాటకం మాటలు.. చేతలతో ప్రజలను బురిడీ కొట్టించే విద్యలో ఆరితేరిన చంద్రబాబు అండ్ కో తాజాగా మరో నాటకానికి తెర లేపారు. ఎప్పుడో ఆగిపోయిన క్వారీలు ఇంకా సాగుతున్నాయని రెండు రోజుల క్రితం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు చిత్తూరులో నిరసన తెలిపారు. దీనికి కొనసాగింపుగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. ముద్దనపల్లె గ్రామంలో అక్రమ మైనింగ్ యథేచ్చగా జరుగుతోందని, దీని వెనుక వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఇదీ వాస్తవం కుప్పం ప్రాంతంలో అక్రమ క్వారీల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికార యంత్రాంగం 2021 అక్టోబర్ నుంచి తనిఖీలు ముమ్మరం చేసింది. మహా చెక్ పేరిట అన్ని క్వారీల అనుమతులు, పరిధి, తరలిస్తున్న బ్లాకుల సమాచారాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించింది. ముద్దనపల్లెలో సాగుతున్న దందాను పూర్తిస్థాయిలో కట్టడి చేసింది. కడప, అనంతపురం నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పించి అనధికారిక క్వారీలపై ఉక్కు పాదం మోపింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 550 పైగా క్వారీ బ్లాకులను సీజ్ చేసింది. చంద్రబాబు పర్యటన అనంతరం జనవరి 13న రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి నేరుగా ఇక్కడి క్వారీలను పరిశీలించారు. బాబు రివర్స్ డ్రామా అక్రమ మైనింగ్‌కు అలవాటు పడిన టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ చంద్రబాబును ఆశ్రయించారు. దీంతో ఆయన రివర్స్ డ్రామాకు తెరతీశారు. గత నెల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు మైనింగ్ అంశాన్ని తీసుకువచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు సంధించారు. శాంతిపురం మండలం ముద్దనపల్లె రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 104, 213లోని అటవీ భూముల్లో వైఎస్సార్సీపీ నేతలు అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నాంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జనవరి 8న బాబు ఈ క్వారీలను సందర్శించి అధికార పార్టీపై నిందలు మోపేందుకు ఆపసోపాలు పడ్డారు. అదీ టీడీపీ ఎంపీటీసీ నామాలప్ప, ఆయన మామ వెంకటేశుకు చెందిన క్వారీలోనే నిలబడి మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఆ సమయంలోనే పక్కన ఉన్న నాయకులు ఇది మన పార్టీ వారిదేనని బాబుగారి చెవిన వేశారు. అంతే.. వెంటనే మాట మార్చేశారు. ఇక్కడ క్వారీలు మన వాళ్లు చేసుకుంటే పర్వాలేదు. బయటి వ్యక్తులు మాత్రం వ్యాపారాలు చేయకూడదని ప్లేటు ఫిరాయించారు. అధినేత మాటలకు ఉత్సాహం పుంజుకున్న అక్రమార్కులు, టీడీపీ నేతలు వెంటనే గజమాలతో బాబును సత్కరించారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు అవాస్తవం ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు వందశాతం అవాస్తవం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కుప్పం నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలోనే అక్రమ మైనింగ్ సాగడం లేదు. ఎవరైనా అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. – పి.వేణుగోపాల్, మైనింగ్ శాఖ ఏడీ -
కుప్పం నియోజకవర్గంలో.. ‘బాబు’కు ఝలక్!
ఇన్నేళ్లలో పక్కా ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు సారూ అంటూ వీర్నమలకు చెందిన అమ్మాయమ్మ.. మీ పాలనలో ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారా అంటూ ఓ యువకుడి నిలదీత.. మంత్రి పెద్దిరెడ్డి ఉన్నంత వరకు కుప్పంలో గెలిచే పరిస్థితే లేదంటూ భూపతి అనే టీడీపీ కార్యకర్త స్పష్టీకరణ.. ఇవీ కుప్పం పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎదురైన తిరస్కారాలు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే పక్కా ఇళ్లు కట్టిస్తానని, పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తానని, అధికారంలోకి వచ్చాక అందరి సంగతీ తేలుస్తానని చెప్పి తప్పించుకోవాల్సిన దుస్థితి నలభై ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడిగా ఘనత వహించిన చంద్రబాబుకు ఏర్పడింది. (చదవండి: ‘ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం.. రామోజీరావు దిగజారిపోయారు’ ) సాక్షి,పలమనేరు(చిత్తూరు): కంచుకోటలా భావించిన కుప్పం నియోజకవర్గంలో వరుస ఓటములతో ఘోర పరాభవం ఎదురవడంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఈ పర్యాయం కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయరనే ప్రచారం ముమ్మరం కావడంతో తాను బరిలోనే ఉన్నానని చెప్పేందుకే మూడు రోజుల పర్యటన పెట్టుకున్నట్లు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. గడ్డు పరిస్థితిని అధిగమించి తిరిగి పట్టు సాధించడం కోసం కుప్పంలో ఆయన గురువారం నుంచి పర్యటన ప్రారంభించారు. కుప్పం మండలంలోని దేవరాజపురం, రామకుప్పం మండలంలోని ఆరిమానుపెంట, వీర్నమల, వీర్నమల తాండా, గట్టూరు తాండా, రామాపురం తాండా, ననియాల తదితర గ్రామాల్లో ప్రసంగించారు. కేవలం కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే తన ప్రసంగాల్లో ప్రాధాన్యమిచ్చారు. ప్రతి చోటా రెచ్చగొట్టేలా మాట్లాడడం గమనార్హం. నక్కిన నాయకులు! కుప్పం పురపాలక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యనేతలే కారణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాల్లో పదే పదే ఈ విషయమే ప్రస్తావించారు. కీలక నాయకులు వైఎస్సార్సీపీ అమ్ముడుపోయారని, అలాంటి వారిని ఏరిపారేసేందుకే వచ్చానని చెప్పుకొచ్చారు. బాబు ప్రసంగాలు విన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి మునిరత్నం, పీఏ మనోహర్ సైతం మీటింగ్ ప్రాంతాల్లో కనపడకుండా దూరంగా తచ్చాడుతూ కనిపించారు. బోరు కొట్టిన ప్రసంగాలు చంద్రబాబు తన రొటీన్ ప్రసంగాలతో ప్రజలకు విసుగు తెప్పించారు. చెప్పిందే చెబుతూ ఉండడంతో సభలకు హాజరైన వారు బోరు ఫీలయ్యారు. ఈ విషయం గ్రహించిన బాబు అక్కడకు వచ్చిన వారికి మైక్ ఇచ్చి మాట్లాడించారు. ఇది కూడా ఆయనకు తిరగబడింది. మైక్ అందుకున్న వారు ప్రశ్నలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. -
కుప్పం చెప్పింది.. బై బై బాబూ!
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, తిరుపతి: దన బలం, దౌర్జన్యాలు, అక్రమ ఓటర్లతో ముప్పై ఏళ్లకు పైగా కుప్పాన్ని గుప్పిట్లో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి అక్కడి ప్రజలు బై బై చెప్పారు. మూడు దశాబ్దాల అనైతిక రాజకీయాలపై తిరుగుబాటు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభంజనానికి చంద్రబాబు కంచుకోటకు ఇటీవలి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనే బీటలు వారగా, సోమవారం జరిగిన కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆ కోట బద్దలైపోయింది. 2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి చంద్రమౌళిపై 30,722 ఓట్ల ఆధిక్యంతో చంద్రబాబు విజయం సాధించారు. స్థానిక సంస్థలు, మునిసిపాలిటీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీపై వైఎస్సార్సీపీ 64,851 ఓట్ల ఆధిక్యాన్ని సాధించడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే.. రెండున్నరేళ్లలోనే చంద్రబాబుకు.. కుప్పం ప్రజలు బై బై చెప్పేసినట్లు స్పష్టమవుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీని ప్రజలు ఆదరిస్తున్న తరహాలోనే కుప్పం ప్రజలు కూడా అక్కున చేర్చుకున్నారు. కుప్పం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గాను.. ఒక వార్డులో వైఎస్సార్సీపీ ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగాయి. బుధవారం నిర్వహించిన కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ 18 వార్డులను కైవసం చేసుకోగా, టీడీపీ 6 వార్డులే గెలిచింది. వలస వచ్చి.. దౌర్జన్యంగా గెలుస్తున్న బాబు వాస్తవంగా చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె. అది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. 1983 ఎన్నికల్లో తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఘోరపరాజయం పాలయ్యారు. దీంతో తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఎన్టీ రామారావు నటించిన సినిమాలను అత్యంత ఎక్కువగా ఆదరించే కుప్పం నియోజకవర్గానికి ఆయన వలస వెళ్లారు. తనకు అనుకూలురైన ఇతర ప్రాంతాల ప్రజలను కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా ఓటర్లుగా చేర్పించారు. రౌడీ మూకలతో అలజడి సృష్టించి.. పోలింగ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకుని.. ధనాన్ని వెదజల్లడం, ఓట్లను సైక్లింగ్ చేసుకోవడం వంటి అనైతిక చర్యలతో 1989 ఎన్నికల్లో కుప్పంలో తొలిసారిగా విజయం సాధించారు. ఆ తర్వాత కూడా ఇవే విధానాల్ని మరింత వాడిగా ప్రయోగిస్తూ 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో 18 వేల అక్రమ ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇప్పటికీ పది వేలకు పైగా అక్రమ ఓటర్లు కుప్పం నియోజకవర్గంలో ఉన్నట్లు అంచనా. అయితే, ఈసారి కుప్పం ప్రజలు చంద్రబాబు దౌర్జన్యాలకు, అనైతిక రాజకీయాలకు చరమగీతం పాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలనకు పట్టం కట్టారు. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే టీడీపీ అధినేతకు షాక్ తగిలింది. ఓ రకంగా చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఆయన గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు గెలిపించిన కుప్పంలో 2019 ఎన్నికల్లో రెండు రౌండ్లలో వెనకబడ్డారు. ఆ తర్వాతి రౌండ్లలో మెజార్టీ రావడంతో ఎలాగోలా బయటపడ్డారు. ఆ తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దారుణ పరాజయమే మిగిలింది. కుప్పం మునిసిపాలిటీలోనూ ఘోర పరాజయంతో చంద్రగిరిని వీడిన తరహాలోనే.. ఇప్పుడు కుప్పంను వీడి మరో నియోజకవర్గానికి చంద్రబాబు వలస వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒంగి ఒంగి దండాలు పెట్టినా బాబును ఛీకొట్టిన కుప్పం 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ, పధ్నాలుగేళ్ల పాటు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఆ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఎప్పటికీ మారుమూల పంచాయతీగానే ఉంచాలని భావించారు. తన ‘వర్గ’ ప్రయోజనాలు తప్పించి ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే కుప్పంకు మునిసిపాలిటీ హోదా ఇచ్చారు. రోడ్లు, మంచినీటి పైపుల ఏర్పాటు వంటి కనీస మౌలిక సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇటీవలి పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తుడిచి పెట్టుకుపోగా వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. అయితే ఆ ఎన్నికలకు తాము దూరంగా ఉన్నామని బీరాలు పలికిన చంద్రబాబు.. గెలిచిన ముగ్గురు ఎంపీటీసీలకు మాత్రం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన చంద్రబాబు.. నోటిఫికేషన్‌కు నాలుగు రోజుల ముందు కుప్పంలో పర్యటించారు. ఎప్పుడూ లేని విధంగా ఒంగి ఒంగి దండాలు పెట్టారు. అర్ధరాత్రి వరకూ మారుమూల వీధులు కూడా కలియతిరిగారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తాను బహిష్కరించానని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి పరువు నిలబెట్టాలని అభ్యర్ధించారు. చంద్రబాబు ఎంతగా ఒంగి ఒంగి దండాలు పెట్టినా, టక్కుటమార విద్యలు ఇకపై చెల్లవంటూ వైఎస్సార్సీపీకి ఘనమైన విజయాన్ని అందించారు. కుప్పం ఎప్పుడొచ్చినా బాబు స్థానిక ప్రజలనుద్దేశించి మీ రుణం తీర్చుకోలేనంటూ సినిమాటిక్ డైలాగులు చెబుతుంటారు. అభివృద్ధి మాత్రం చేయరు. తాజా ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు కుప్పంతో రుణం తీరినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచే బాబు హైడ్రామా నోటిఫికేషన్‌కు ముందు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అక్కడ హైడ్రామా సృష్టించారు. ఆయన మీటింగ్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వద్ద బాంబు ఉందంటూ ఆ పార్టీ శ్రేణులు అతన్ని చితకబాదారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే తనపై బాంబు వేసేందుకు పంపించారంటూ బహిరంగ సమావేశంలో చంద్రబాబు ఊగిపోయారు. చివరకు అతను ఉద్యోగి అని, పైగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని తెలిసి నోరెత్తలేకపోయారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ నాయకులపై పెద్ద ఎత్తున విషప్రచారం చేశారు. ఆ తరువాత నారా లోకేశ్‌ని ప్రచారానికి పంపారు. రెండు రోజుల పాటు లోకేశ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలీసుల పట్ల సైతం అవమానకరంగా మాట్లాడారు. కుప్పం చంద్రబాబు అడ్డా.. ఇక్కడ ఎవ్వరూ ఏం పీకలేరంటూ అసభ్యంగా మాట్లాడారు. అయినా ఓడిపోతామని తెలియడంతో దొంగ ఓట్లకు, దౌర్జన్యాలకు దిగారు. స్థానికేతరులను కుప్పంలో దింపి దొంగ ఓట్లు వేయించేందుకు యత్నించారు. ఆ అవకాశం లేకపోవటంతో... టీడీపీ శ్రేణులను పోలింగ్ బూత్‌లోకి పంపించి వైఎస్సార్సీపీ దొంగ ఓటర్లంటూ నానా హంగామా చేయించారు. దొంగ ఓటర్లంటూ బస్టాండులో ప్రయాణికులపై దాడులు చేశారు. పోలింగ్‌కు ముందూ.. స్థానికేతరులైన మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులను కుప్పానికి రప్పించారు. వారిని పోలీసులు నియోజకవర్గం నుంచి బయటకు పంపడాన్ని తప్పుబడుతూ రోడ్లపై బైఠాయించి ప్రయాణికులను అడ్డుకుని రచ్చ రచ్చ చేశారు. -
దొంగ రాతలు దొంగ మాటలు
‘దొంగ ఓట్ల దందా’ అంటూ మొదటిపేజీ పతాక శీర్షికలో సోమవారం ‘ఈనాడు’ వేసిన ఫొటో ఇది. దొంగ ఓటర్లను పట్టుకున్న పోలీసులు... అంటూ చంద్రబాబుకు మద్దతుగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేసింది ఆ పత్రిక. కానీ ఈ ఫొటోలోని ఇద్దరూ ఎవరో తెలుసా? పోలీసు అధికారి ఎడమ చేతివైపు ఉన్నది అక్కడి గుడుపల్లి మండలం దిన్నేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత నారాయణ. పక్క ఫొటోలో ఈయన్ను టీడీపీ కండువాతో చూడొచ్చు కూడా. ఇక పోలీసు అధికారికి కుడివైపున్నది టీడీపీ మాజీ జెడ్పీటీసీ. పేరు మామ కృష్ణప్ప. ఇది చూస్తే తెలియటం లేదా? టీడీపీ పెద్ద ఎత్తున స్థానికేతరులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించిందని. ఎన్ని చేసినా తాము ఓడిపోతున్నామని తెలియటంతో... తిరిగి వైఎస్సార్సీపీ వైపు వేలు చూపించి దొంగ ఓట్ల డ్రామా ఆడిందని!. ఆ డ్రామాకు బాబు అనుకూల పత్రికలు వంత పాడాయని!!. సాక్షి, తిరుపతి: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. ఇక్కడ సోమవారం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు వేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోయినా.. ఎవరి నుంచీ ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా ఆ పార్టీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. నిజానికి.. టీడీపీ శ్రేణులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తినట్లు ఈ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా టీడీపీ నాయకులే వారి అనుచరులను పట్టుకుని వైఎస్సార్సీపీకి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగకుండా.. కుప్పం మీదుగా వెళ్లే ప్రయాణికులు.. పాఠశాలలో పనిచేసే సిబ్బందిపైనా దొంగ ఓటర్లుగా ముద్ర వేసి తమ అనుకూల మీడియా ద్వారా వారిపై విషప్రచారం చేశారు. వాస్తవానికి కుప్పం ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు పోలవ్వలేదు. అయినా, దొంగ ఓటర్లు వచ్చారంటూ ఆందోళనలకు దిగడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారీ పోలింగ్‌తో బాబులో వణుకు.. అల్లర్లకు ఆదేశం కుప్పం మున్సిపాలిటీ ఏర్పడ్డాక సోమవారం మొదటిసారి ఎన్నికలు జరిగాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. భారీ పోలింగ్‌కు తోడు మహిళలు ఎక్కువ సంఖ్యలో బారులు తీరడంతో చంద్రబాబులో వణుకు మొదలైంది. వెంటనే ఎన్నికల్లో అలజడులు సృష్టించాలని జిల్లా టీడీపీ నాయకులను ఆదేశించారు. నిమిషాల్లో స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు కుప్పంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి అమరావతి నుంచి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ శ్రేణులు నేరుగా 16, 17 వార్డులకు చేరుకున్నాయి. 16వ వార్డులోకి గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన కార్యకర్తలను రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. గుడుపల్లి మాజీ జెడ్పీటీసీ బేటప్పనాయుడు మామ ఓఎం కొత్తూరుకు చెందిన కృష్ణప్ప, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బాబు అనుచరుడు దిన్నేపల్లికి చెందిన నారాయణ, మరికొంత మందిని పోలింగ్ బూత్‌లోకి పంపారు. వారు బూత్‌లోకి వెళ్తుండగా టీడీపీ వారే దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్నారంటూ కేకలు వేశారు. నిజానికి.. పోలింగ్ బూత్‌లోకి స్థానికేతరులు చొరబడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికేతరులను పంపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కృష్ణప్ప, నారాయణ, మరికొందరు పోలింగ్ బూత్‌లోకి చొరబడుతుండగా స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగించారు. అదే విధంగా మరో 15 మంది టీడీపీ శ్రేణులను కూడా స్టేషన్లో అప్పగించారు. ప్రయాణికులు.. స్కూలు సిబ్బందిపైనా దాడి ఇక విజయవాణి స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది పోలింగ్ రోజు సెలవు కావడంతో అక్కడే ఉన్నారు. వారిని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు స్కూల్లోకి చొరబడి వారిపై దాడిచేశారు. తాము దొంగ ఓటర్లు కాదని మొత్తుకుంటున్నా టీడీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వారిని ఫొటోలు, వీడియోలు తీసి విస్తృతంగా ప్రచారం చేసేశారు. ఇలా తమ పరువు తీశారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. బస్టాండ్‌కు వెళ్లే ఇద్దరు ప్రయాణికులను పట్టుకుని వైఎస్సార్సీపీకి దొంగ ఓట్లేసేందుకు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వారిని టీడీపీ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి చితక్కొడుతుంటే గమనించిన స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. విచారించి వారిని క్షేమంగా బస్సెక్కించారు. ఇక 17వ వార్డులో ఎవ్వరూ దొంగ ఓట్లు వేసేందుకు రాకపోయినా.. దొంగ ఓటర్లు అంటూ స్థానికులను చూపిస్తూ ఏకంగా పోలింగ్ బూత్‌లోని కుర్చీలను కూడా విరగ్గొట్టి నానా హంగామా చేశారు. లోకేష్ సూచించిన నేతలే ఏజెంట్లు ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన నారా లోకేశ్.. ఏయే బూత్‌లలో ఎవరెవరు ఏజెంట్లు కూర్చోవాలో నిర్ణయించారు. లోకేశ్ నిర్ణయం మేరకే బూత్‌లలో టీడీపీ ఏజెంట్లను కూర్చోబెట్టారు. వీరంతా సీనియర్ నేతలే కూడా. దొంగ ఓట్లు వేసే అవకాశమే లేకుండా ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఏజెంట్ల వద్ద ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా ఇచ్చారు. ఓటు వేసే వారు కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చి ఏజెంట్లకు చూపించి ఓటు వేశారు. ఎక్కడైనా ఎవరికైనా అనుమానం వస్తే వెనక్కు పంపేందుకు పక్కాగా ఏర్పాట్లుచేశారు. మరోవైపు.. కుప్పంలో ఎక్కడా ఒకరి ఓటు ఒకరు వేసినట్లు ఫిర్యాదులు అందలేదు. అయినా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ రచ్చరచ్చ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. -
పెళ్లి పందిరి నుంచి పోలింగ్ కేంద్రానికి..
కుప్పం: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుప్పం 23వ వార్డు మునస్వామిపురానికి చెందిన దిలీప్‌కు, మంకలదొడ్డికి చెందిన రజినీతో సోమవారం ఉదయం పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో వివాహం జరిగింది. మునిసిపాలిటీలో దిలీప్‌కు ఓటు ఉండడంతో పెళ్లి పందిరి నుంచి పెళ్లి దుస్తులతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. 23వ వార్డు పోలింగ్ జరుగుతున్న ఆర్ పేట పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకుని ఓటుపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. -
పరువు కోసం టీడీపీ అడ్డదారులు
సాక్షి, తిరుపతి/అనంతపురం/పెనుకొండ/పలమనేరు (వి.కోట): వరుస ఓటములతో తీవ్ర పరాభవాల్ని మూటగట్టుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం కుప్పం మున్సిపాల్టీలోనైనా పరువు నిలుపుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. అలజడులు సృష్టించి.. ప్రలోభాలకు గురిచేసైనా పార్టీని నిలబెట్టుకోవాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. ఇక్కడ అల్లర్లు సృష్టించి తద్వారా సానుభూతి ఓట్లు రాబట్టుకోవాలని పథక రచన చేశారు. ఇందులో భాగంగానే.. ప్రచారం ముగిశాక స్థానికేతరులందరూ కుప్పం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన ఉన్నా టీడీపీ నేతలు దానిని ఏమాత్రం లెక్కచేయకుండా అక్కడే తిష్టవేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్, పలమనేరుకు చెందిన మాజీమంత్రి అమర్నాథరెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మరో 230 మంది స్థానికేతరులు కుప్పంలోనే మకాం వేశారు. ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు పంచుతున్నారు. తమ అసలు మొబైల్ ఫోన్లను పోలీసులు ట్రాక్ చేస్తారనే ఉద్దేశంతో తాత్కాలికంగా వేరే నెంబర్లతో తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. వీరందరి కొత్త నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేశారు. దీనికి అడ్మిన్లుగా చంద్రబాబు, లోకేశ్ ఉంటూ ఎప్పటికప్పుడు ఏం చేయాలనే దానిపై వీరికి దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు.. ఓటర్లకు పెద్దమొత్తంలో డబ్బులు పంచేందుకు కూన రవికుమార్ ఆదివారం కుప్పానికి చేరుకున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పోలీసులను అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నందుకు నానా యాగీ ఇక మాజీమంత్రి అమర్నాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని కుప్పంలోకి వస్తుండగా పీఈఎస్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి రచ్చరచ్చ చేశారు. టీడీపీ నేతలను కొడుతున్నారంటూ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించారు. కుప్పం టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని గొడవను మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ నేతలు ఇంటికొచ్చి తనపై దాడిచేశారంటూ హడావుడి చేశాడు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కుప్పానికి వచ్చిన ఉద్యోగులను చంద్రబాబు పీఏ మనోహర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలిస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. పెనుకొండలో బరితెగింపు అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడ గెలవాలన్న ధ్యేయంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సోమవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రలోభాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలు పెనుగొండ చుట్టుపక్కల మకాం వేసి మద్యం, డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వచేశారు. అలాగే, ఇప్పటికే విచ్చలవిడిగా మద్యంతోపాటు ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పంచారు. అయినా.. చాలాచోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నామని గ్రహించిన ఆ పార్టీ నేతలు రెండోసారి డబ్బు పంపిణీకి పూనుకున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంటికీ ముక్కు పుడకలు కూడా అందించినట్లు తెలిసింది. ఆదివారం మరింత ఎక్కువగా ఈ ప్రలోభాలను కొనసాగించారు. ఇలా నిబంధనలను ఉల్లంఘించిన పార్టీ నేతలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల శ్రీరామ్ మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. మరికొందరు నేతలపైనా ఇలాగే కేసులు నమోదు చేశామని.. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు.. చిలమత్తూరు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సోమఘట్ట గ్రామంలో వలంటీర్లను బెదిరించారు. అలాగే, వైఎస్సార్సీపీ నేత నసనకోట ముత్యాలును ‘నువ్వెందుకురా ఇక్కడికొచ్చావ్.. చంపుతా’ అంటూ కాలర్ పట్టుకుని బెదిరించారు. -
కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి టెన్షన్ రోజురోజుకీ ఎక్కువవుతుండడంతో ఆ పార్టీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు. ఇలాగైనా పరువు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండడంతో డబ్బులు, మందు పంపిణీ పూర్తిచేయడంతో పాటు దొంగ ఓట్లు వేయించి లబ్ధిపొందాలని ప్రలోభాలకు తెరలేపారు. నిజానికి.. కుప్పంలో పనులు దొరక్క అనేకమంది బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. వారిలో సుమారు 35 వేల మందికి అటు కుప్పంలోనూ.. ఇటు బెంగళూరులోనూ ఓటు హక్కు ఉంది. అలాగే, వీరికి అక్కడ ఇక్కడ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. పింఛను, బియ్యం రెండుచోట్లా తీసుకుంటున్నారు. దీంతో వీరిలో అధిక శాతం మందిని టీడీపీ నేతలు తీసుకొచ్చి ఓట్లు వేయిస్తుండడంతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయాన్ని 2019 ఎన్నికల్లో అప్పటి వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత చంద్రమౌళి గుర్తించారు. పక్కా వివరాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో 25 వేల ఓట్లను తొలగించారు. మరో 10వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించలేదు. వారందరినీ టీడీపీ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పిలిపిస్తున్నట్లు సమాచారం. దొంగ ఓటర్లకు ప్రత్యేక శిక్షణ బెంగళూరు, కేజీఎఫ్, పలమనేరు నుంచి మరో 5 వేల మందితో దొంగ ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ నేతలు రవాణా సదుపాయాలుఏర్పాటుచేశారు. ఇలా వచ్చేవారి కోసం కుప్పానికి దూరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డులు, స్లిప్పులు సిద్ధంచేసినట్లు సమాచారం. వాటితో సోమవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాక ఏం చేయాలో టీడీపీ నేతలు శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లు చేరుకున్నాక.. వారిని ఎవరైనా గుర్తిస్తే వైఎస్సార్సీపీ వారు పంపించారని చెప్పమని తర్ఫీదు ఇచ్చారు. ఎవరూ అడ్డుకోకపోతే సైకిల్ గుర్తుకు ఓటేయమంటున్నారు. వలంటీర్లకు బెదిరింపులు టీడీపీ నేతలు వలంటీర్ల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ తన అనుచరులతో శుక్రవారం రాత్రి ఓ మహిళా వలంటీర్ ఇంటికి వెళ్లి తీవ్రస్థాయిలో బెదిరించారు. శనివారం మరో ముగ్గురు మహిళా వలంటీర్ల నివాసాలకు టీడీపీ నేతలు వెళ్లి బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు. కొత్తదారుల్లో నగదు పంపిణీ ఇక ఎన్నికల్లో డబ్బులు పంపిణీని ఇప్పటివరకూ నేరుగా ఇళ్లకు వెళ్లి ఇవ్వడమే చూశాం. కానీ, కుప్పంలో టీడీపీ నేతలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న చిల్లర దుకాణాలు, చిన్నచిన్న బంకులు, మెడికల్ షాపులు, టీ బంకులను కేంద్రాలుగా ఎంచుకున్నారు. టీడీపీ అభ్యర్థులు ఈ దుకాణాల్లో డబ్బులు, పేర్లు, కోడ్ నంబర్లు స్లిప్పై వేసి ఇస్తారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లకు ఓ నంబర్ కోడ్‌తో ఉన్న స్లిప్ ఇస్తారు. దానిని వారు చెప్పిన దుకాణంలో ఇస్తే డబ్బులు ఇచ్చేస్తారు. ఈ తరహా డబ్బుల పంపిణీ శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రారంభం కానున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. టీడీపీ నేతలు అన్ని వార్డులకు రెబల్ అభ్యర్థులుగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయించారు. వీరంతా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా రెబల్ అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటిస్తారు. వీరిపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదు. దీనిని టీడీపీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వేలు టీడీపీ అభ్యర్థి తరఫు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి రూ.50,500 స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్రులుగా ఉన్న టీడీపీ అభ్యర్థుల ద్వారా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే.. ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగిన వారికి పెద్దమొత్తంలో డబ్బులు లేదా బహుమతులు ఇవ్వటానికి టీడీపీ అన్ని ఏర్పాట్లుచేసినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. -
గెస్ట్ ‘హౌస్’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ
వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే.. 1989 నుంచి 2024 వరకు.. అంటే దాదాపుగా 35ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా అవకాశం కల్పించిన ఊరు.. వాస్తవానికి సొంతూరు పొమ్మన్నా.. ఊరి కాని ఊరు ఆదరించింది. అలాంటి ఊరి కోసం ఎవరైనా ప్రాణం పెట్టేస్తారు. ఏమైనా చేసేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు.. చంద్రబాబునాయుడు.. అదే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు.. ఆయన గురించి చెప్పేదేముంది.. ఆ పేరు ప్రస్తావన వస్తేనే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటుకు పేటెంట్ హక్కని విపక్ష నేతల విమర్శలు ఎదుర్కొనే ఆయన ఇప్పుడు తనను మూడు దశాబ్దాలకుపైగా ఆదరించిన కుప్పం పట్ల కూడా అదే రీతిన వెన్నుపోటు పొడిచారనే చెప్పాలి. కుప్పానికి ఇన్నేళ్లలో నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడమే తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదంటే బాబు గారికి ఈ ప్రాంతం పట్ల.. ఇక్కడి ప్రజల పట్ల ఏ మేరకు ‘‘కృతజ్ఞత’’ ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి పక్కనపెడితే కనీసం ఇన్నేళ్లలో అక్కడ సొంతిల్లు కూడా లేకుండానే నెట్టుకొచ్చిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. (చదవండి: ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు) సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముప్పై ఏళ్ల పాటు ఒకే నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలవడం.. ప్రజలు గెలిపించడం అంటే.. నిజంగా సామాన్యమైన విషయమేమీ కాదు. సగటు జీవితకాలంలో సగ భాగానికి పైగా ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించిన, ఆదరించిన ఆ ప్రాంతంపై ఎవరికైనా అనుబంధం ఏర్పడుతుంది. అక్కడే ఇల్లు కట్టుకుని ఆ ఊరితో విడదీయరాని బంధం పెనవేసుకుంటారు. కానీ చంద్రబాబు రూటే సపరేటు కదా.. తనను మూడు దశాబ్దాలకుపైగా ఆదరిస్తున్న కుప్పంలో బాబు కనీసం ఇప్పటివరకు సొంతిల్లు కూడా కట్టుకోలేకపోయారు. దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నేతగా దశాబ్దాల కిందటే పేరు మార్మోగిన బాబుకి కుప్పంలో చిన్నపాటి ఇల్లు కొనుగోలు చేయడం, లేదా నిర్మించుకోవడం అంటే వెంట్రుకవాసి పని. అసలు ఇంటి వ్యవహారం ఆయన కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన పనిలేదు. బాబు ఆదేశిస్తే చాలు.. తెలుగుదేశం నాయకులే కాదు ఓ సామాన్య కార్యకర్త సైతం కుప్పంలో ఇల్లు చూసే పరిస్థితి ఉంది. కానీ బాబుకి ఈ ప్రాంతం మీద ఇక్కడి ప్రజల మీద కనీస ప్రేమాభిమానాలు లేవు. అందుకే ఈ ముప్పైరెండున్నరేళ్ళలో చుట్టపుచూపుగా ఆర్నెల్లకో ఏడాదికో వచ్చి.. ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో రెండు రోజులు ఉండి వెళ్ళిపోవడం మినహా సొంతిల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కేవలం ఇక్కడి ప్రజలను ఓటర్లుగా మాత్రమే బాబు పరిగణిస్తున్నారనే వాదనకు ఇన్నేళ్ళలో కనీసం ఇల్లు కాదు కదా.. క్యాంపు కార్యాలయం కూడా లేకపోవడమే ప్రబల నిదర్శనం. జిల్లాలోని ఇన్ని నియోజకవర్గాలు ఉండగా.. బాబు ఈ కుప్పం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారో కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. కుప్పం ఎందుకంటే.. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన బాబు 1983లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. వెనువెంటనే టీడీపీలో చేరిన బాబు 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. 1989 ఎన్నికలు వచ్చేసరికి సురక్షిత నియోజకవర్గం వేటలో పడ్డారు. అప్పుడే ఆయన దృష్టి కుప్పంపై పడింది. ఈ ప్రాంతంలో సైకిల్ గుర్తు ప్రభావం టీడీపీ ఆవిర్భావం ముందు నుంచే ఉంది. 1983కి ముందే కుప్పం పంచాయతీ సమితి అధ్యక్షుడు డి.వెంకటేష్ సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా రెండుమార్లు గెలిచారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985ల్లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఎన్.రంగస్వామి నాయుడు వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే బాబు కుప్పంపై కన్నేశారు. (చదవండి: బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ) రంగస్వామి నాయుడుకి వెన్నుపోటు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఊపు మీద ఉన్న రంగస్వామి నాయుడుకి చంద్రబాబునాయుడు రూపంలో ఊహించని షాక్ తగిలింది. అక్కడి ప్రజలకు సైకిల్ గుర్తు మీద ఉన్న సెంటిమెంట్, టీడీపీ మీద ఉన్న అభిమానం చూసి.. బాబు కుప్పంకు షిఫ్ట్ అయిపోయారు. దరిమిలా రంగస్వామి నాయుడుని తొక్కేసి.. చివరికి కన్నుమూసే వరకు రాజకీయ తెరపై లేకుండా చేసేశారు. ఇన్నేళ్లలో గంగమ్మ జాతర చూడని బాబు కుప్పం ప్రజల పట్లనే చిన్నచూపు ఉన్న చంద్రబాబుకి ఆ ప్రజల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి పైనా కనీస భక్తిభావం లేదు. నిర్లక్ష్యం.. లెక్కలేనితనం ఉందనేందుకు నిదర్శనం ఇంతవరకు ఆయన ఒక్కసారిగా కూడా గంగమ్మ జాతరకు రాకపోవడమే. కుప్పంలో కొలువైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంకి మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగునే ఉన్న తమిళాడు, కర్ణాటకల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ప్రతి ఏడాది మే మూడో మంగళవారం అత్యంత వైభవంగా.. ఘనంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతరకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు. ఇంతటి విశేషమైన పర్వదినానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా చంద్రబాబు రాలేదంటే.. కుప్పం పట్ల, ఇక్కడి ప్రజల మనోభావాల పట్ల బాబుకు ఎంతటి గౌరవాభిమానం ఉందో అర్థమవుతోంది. పీఏకి ప్యాలెస్ ఉంది కానీ.. చంద్రబాబు పీఏ, ఓ రకంగా చెప్పాలంటే చాలాకాలంగా కుప్పం ‘అనధికార’ ఎమ్మెల్యే మనోహర్‌కి మాత్రం ఇక్కడ ప్యాలెస్ తరహా ఇల్లు ఉంది. సకలసౌకర్యాలతో అధునాతన ఇంటిని ఆయన నిర్మించుకున్నారు. కానీ బాబు బస మాత్రం ఎప్పుడొచ్చినా ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌసే కావడం గమనార్హం. లోకేష్ పెళ్లికి వస్తామన్నా పిలుపు లేదు.. ఈ ప్రాంతంపై నారా వారికున్న చిన్నచూపునకు ఇంత కంటే ఉదాహరణ అక్కరలేదు. లోకేష్, బ్రాహ్మణి వివాహానికి కుప్పం ప్రజల మాట అటుంచి కనీసం ఇక్కడి టీడీపీ నేతలకు కూడా ఆహ్వానాలు అందలేదు. దీంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రెండు బస్సులు వేసుకుని పెళ్లికొస్తామని అడిగినా అటు నుంచి పక్కాగా అనుమతి గానీ ఆహ్వానం గానీ రాకపోవడంతో మిన్నకుండిపోయారు. అయినా సరే నొచ్చుకోని టీడీపీ నేతలు లోకేష్, బ్రాహ్మణిల జంటను కుప్పం తీసుకువచ్చి ఫంక్షన్ చేయాల్సిందిగా అభ్యర్థిచారు. కానీ బాబు ఆ అభ్యర్థనను అస్సలు పట్టించుకోలేదు. పెళ్లయిన కొత్తలో ఆ జంటను మామ గారి ఊరు కృష్ణాజిల్లా నిమ్మకూరుకు తీసుకువెళ్లి బ్యాండ్ బాజా మోగించిన చంద్రబాబు తనను ఇన్నేళ్లుగా గెలిపించిన కుప్పంలో మాత్రం అడుగుపెట్టనీయలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. కుప్పంపై బాబు కపట ప్రేమకు! ఈ ప్రాంతంపై ఎంత చిన్నచూపంటే... కుటుంబసభ్యులు కూడా ఎప్పుడూ రాలేదు.. కేవలం తనను గెలిపించే నియోజకవర్గంగానే కుప్పంను బాబు చూస్తూ వచ్చారు.. సెంటిమెంట్ డైలాగులు వల్లె వేసి ఇక్కడి ప్రజలను ఏమార్చడం తప్పించి మరే ఇతర అనుబంధం కూడా ఈ ప్రాంతంతో పెట్టుకోలేదు. సంక్రాంతి పండుగలకు, పబ్బాలకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చి సేద తీరే బాబు కుటుంబం ఆయనను ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న కుప్పంకు మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. కుప్పంలోనే ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీకి బాబు సతీమణి భువనేశ్వరి ఒకటి రెండుసార్లు ఎవరికీ తెలియకుండా గోప్యంగా వచ్చి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.. కానీ కుప్పం సందర్శన గానీ.. ఇక్కడి ప్రజలతో మాటామంతీ గానీ పొరపాటున కూడా లేవంటే ఈ ప్రాంతంపై వారికి నిజమైన అనుబంధం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ
సొంతూరు చంద్రగిరి ఓడగొట్టినా.. తనను ఆదరించిన కుప్పం పట్ల కూడా కనీస కృతజ్ఞత చూపించని చంద్రబాబు అప్పనంగా ఆ నియోజకవర్గాన్ని అక్కడి టీడీపీ నేతలకు అప్పగించేశారు. ♦అంతే తడవుగా.. తెలుగుదేశం నేతలు కుప్పంను పూర్తిగా ఊడ్చేశారు. ♦చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం పాత సామెత.. బాబు పేరు చెప్పుకుని భూములు దోచేయడం.. అడ్డగోలుగా కాంట్రాక్టులు కొట్టేయడం.. అందిన కాడికి వసూళ్లు చేయడం... కుప్పం టీడీపీ నేతలు కొత్త రివాజుగా మొదలుపెట్టారు. ♦ముప్పై ఏళ్లుగా బాబు హయాంలో కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంటని అడిగితే టీడీపీ నేతల్లో ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పలేని దుస్థితి. ♦కానీ అదే ముప్పై ఏళ్లలో టీడీపీ నేతల అభివృద్ధి చూస్తే.. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. ♦సరిగ్గా తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి రూ.కోట్లకు ఎగబాగిన కుప్పంలోని బాబు తాబేదార్ల గురించి ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. ♦పీఏ మనోహర్ మొదలు ఏడుగురు టీడీపీ నేతల అవినీతి ప్రస్థానం నిన్న ఒకింత పరికించే ప్రయత్నం చేశాం.. ఇవాళ మిగిలిన నేతల చిట్టా చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పుడప్పుడు.. నిజం చెప్పాలంటే ఎక్కడా, ఏ పనీ లేనప్పుడు.. వీలున్నప్పుడు.. చంద్రబాబునాయుడు కుప్పం వచ్చి వెళ్తుంటారు. మనస్ఫూర్తిగా కాకుండా మొహమాటపు పర్యటనలకే శ్రీకారం చుడుతుంటారు. వచ్చినప్పుడు మాత్రం కాస్త సెంటిమెంట్ డైలాగులే వల్లిస్తుంటారు. కుప్పం అంటే నాకు చాలా అది.. ఇది అంటూ ఒకింత ఎమోషనల్ టచ్ ఇస్తుంటారు. అక్కడితో అంతే సంగతులు.. మళ్లీ పర్యటనకు వచ్చినప్పుడు సేమ్ సీన్ రిపీట్. ఇలా ముప్పై ఏళ్లుగా నెట్టుకొచ్చేస్తున్న బాబు ఇక్కడి పరిస్థితి ఏంటీ.. టీడీపీ నేతల వ్యవహారశైలి ఎలా ఉందని కూడా కనిపెట్టలేకపోయారు. అందుకే ఆయన పేరు చెప్పుకుని ఇక్కడి టీడీపీ నేతలు రెచ్చిపోతుంటారు. పీఏ మనోహర్ మొదలు కుప్పం పట్టణానికి చెందిన చోటామోటా నేతలు సైతం అడ్డగోలు సంపాదన రుచి మరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంను చెరబట్టేశారు. సుధాకర్, వంద పడకల అస్పత్రి చైర్మన్, టీడీపీ నేత.. ప్రస్తుతం కుప్పం వందపడకల ఆస్పత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుధాకర్ చిట్టా కూడా తక్కువేమీ లేదు. కుప్పం మేజర్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పంచాయతీ నిధులు దురి్వనియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వంద పడకల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా డ్రా చేశారన్న విమర్శలు ఉన్నాయి. తన భూమికి ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకోవడం, డీకేటీ భూముల దురాక్రమణ, కనమానపల్లి శ్రీనివాస స్వామి దేవస్థానానికి చెందిన భూములు, నకనపల్లి వద్ద దేవదాయ భూముల ఆక్రమణల్లోనూ సుధాకర్ ప్రమేయంపై ఆరోపణలున్నాయి. త్రిలోక్ నాయుడు, కుప్పం మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన త్రిలోక్‌ను త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఇందులో టీడీపీయేతర వర్గాలకు వచ్చిన అభ్యంతరం లేదు కానీ ఎన్నో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన త్రిలోక్‌ను ఎంపిక చేయడంపై స్వయంగా టీడీపీ వర్గాలే భగ్గుమంటున్నాయి. అనిమిగానిపల్లి సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో త్రిలోక్ పంచాయతీ డబ్బులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డీకేటీ భూములను కూ డా విక్రయించారనే విమర్శలున్నాయి. టీడీపీ నేత పీఎస్ మునిరత్నం అటవీ భూముల్లో నిర్మించుకున్న చెక్‌డ్యాం కుప్పంలోని టూరిజం హోటల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకుని రియల్ దందా చేశారన్న నిందారోపణలు ఉన్నాయి. ఇక టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్వర్క్ నడిపి ఇష్టానుసారంగా దోచేశారన్న అప్రతిష్ట మూటకట్టుకున్నారు. పట్టణంలో కేబుల్ నెట్వర్క్ని దెబ్బతీసి ఏపీ ఫైబర్‌ను బలవంతంగా అంటకట్టి.. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును మింగేశారని ఈయనపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. ఇంతటి ‘ఘన’మైన చరిత్ర కలిగిన త్రిలోక్‌ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంపై టీడీపీ వర్గాలే ఈసడించుకుంటున్నాయి. మాజీ సర్పంచ్ వెంకటేష్ బహుళ అంతస్తుల భవనం మణి, మాజీ సర్పంచ్, డీకే పల్లి, టీడీపీ నేత ఒక్కసారి సర్పంచ్‌గా పనిచేస్తే చాలు.. ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించవచ్చనే విషయానికి ఉదాహరణ చూపించాలంటే టీడీపీ నేత డీకే పల్లి మాజీ సర్పంచ్ మణిని చూపిస్తే చాలని స్వయంగా టీడీపీ వర్గాలే అంగీకరిస్తాయి. సర్పంచ్ హోదాను అడ్డుపెట్టుకుని రియల్ వ్యాపారంతో అడ్డగోలు సంపాదనకు తెరలేపారు. కుప్పం పట్టణానికి డీకేపల్లి కూతవేటు దూరంలో ఉండటంతో భూముల విలువ పెరగడంతో ఈయన డీకేటీ స్థలాలు, మోడల్ కాలనీ ప్లాట్లు, హౌసింగ్ పట్టాలు విచ్చల విడిగా విక్రయించేశారు. అక్కడితో ఆగకుండా ఓ రిటైర్డ్ తహశీల్దార్ పేరిట నకిలీ పట్టాలు కూడా విక్రయించారనే ఆరోపణలున్నాయి. ఇక సర్పంచ్‌గా ఇష్టారాజ్యంగా డబ్బులు డ్రా చేశారన్న విమర్శలనూ మూటకట్టుకున్నారు. టీడీపీ నేత పి.గోపీనాథ్ బినామీ పేర్లతో అద్దెకు ఇచ్చిన పంచాయతీ దుకాణాలు ఆర్ఆర్ రవి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్, టీడీపీ నేత.. ఈయన పట్టణంలో పేరొందిన వడ్డీ వ్యాపారి. అధిక వడ్డీలతో పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేసే వడ్డీ రవిగా పేరు. టీడీపీ హయాంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్‌గా పని చేసి చివరికి అమ్మవారికి వచ్చిన విరాళాలు కూడా దురి్వనియోగం చేశారనే అపకీర్తిని సాధించుకున్నారు. కేవి శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు.. కుప్పంలో గ్రానైట్ అక్రమ వ్యాపారానికి తెర తీసిన వ్యక్తి ఎవరంటే మొదటగా టీడీపీ నేత కేవీ శ్రీనివాసులు పేరే చెబుతారు. అనుమతుల్లేకుండానే.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమంగా గ్రానైట్ తరలింపులో ఈయన చాలా పేరు గడించారు. కుప్పం వారధి వద్ద నిబంధనలను అతిక్రమించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. వీళ్లే కాదు.. ఇంకా చాలామంది చోటామోటా టీడీపీ నేతలు కూడా ఇదే దారిలో ఉన్నారు. పాతపేట సోమేశ్వరస్వామి దేవాలయం భూములను టీడీపీ నేత ఆర్ఆర్ రవి ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆయనకు పట్టణ నడి»ొడ్డున ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా దేవాలయం భూమేనన్న వాదనలున్నాయి. టీడీపీకే చెందిన మాజీ సర్పంచ్ ప్రతాప్ డీకేటీ భూములు, కాలువ గట్టు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారనే విమర్శలున్నాయి. మాజీ ఎంపీటీసీ వేలుపై తమిళనాడులో ఎన్నో పోలీసు కేసులు ఉన్నాయి. ఇక మంజునాథ్, జిమ్ దాము అనే టీడీపీ నేతలు మీటర్ వడ్డీ వ్యాపారం, సెటిల్మెంట్లలో మునిగితేలుతుండటం గమనార్హం. -
Kuppam: చంద్రబాబు అడగగానే రూ.కోటి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏపాటి విలువ ఉండేదో అందరికీ తెలిసిందే. శాసనసభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం మొదలు.. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదల వరకు పూర్తిస్థాయిలో వివక్ష కొనసాగింది. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం చూడబోం అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగానే పాలన సాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాయగానే కుప్పం నియోజకవర్గానికి రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. పనులు కూడా మొదలయ్యాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నిధులు కేటాయించడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు విడుదల ఓ ప్రçహసనంగా ఉండేది. 2014–19 కాలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డిఎఫ్) కింద బాబు తన ఇష్టానుసారం నిధులు విడుదల చేయించారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు మంజూరయ్యాయి.అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. కానీ రెండేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకం పేరును ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్)గా మార్పు చేసి.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పనుల కోసం అడిగిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నిధులు మంజూరు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు కోరిన వెంటనే కుప్పానికి రూ.కోటి నిధులు మంజూరు చేశారు. బాబు లేఖలు రాయగానే రెండు దఫాలుగా నిధులు 2020 మే 16న సీఎండీఎఫ్ కింద నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు మొదటి లేఖ రాశారు. ఆ లేఖ అందిన వెంటనే అప్పటి కలెక్టర్ నారాయణభరత్‌గుప్త రూ.70.85 లక్షలను విడుదల చేశారు. ఆ నిధులతో శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పం మండలాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 32 తాగునీటి పనులు చేపట్టారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ మూడో తేదీన బాబు లేఖ రాయడంతో అధికారులు రూ.29.15లక్షలు విడుదల చేశారు. మొత్తంగా రూ.కోటి నిధులతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రధానంగా తాగునీటి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా గుక్కెడు నీటికి నోచుకోని జనం సంబరాలు చేసుకున్నారు. రాజకీయాలకతీతంగా కుప్పం అభివృద్ధి 30 ఏళ్లుగా వెనుకబడిన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ఇన్నేళ్లకు గాడిన పడింది. రాజకీయాలకతీతంగా అన్ని నియోజకవర్గాలనూ ప్రగతిబాట పట్టించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు రెండేళ్లలోనే నియోజకవర్గ స్వరూపం మారిపోయింది. పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి. కేఆర్జే భరత్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తీరిన తాగునీటి సమస్య వర్షాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామంలోని తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. సుమారు 150కి పైగా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల వ్యయంతో మూడు బోర్లు వేయించారు. ఇప్పుడు తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. సురేష్, కృష్ణదానపల్లె, కుప్పం మండలం -
టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా!
సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను ఆదివారం అభిమానులు ఆవిష్కరించారు. ఈ పరిణామం టీడీపీలో కలకలం రేపింది. ఇక్కడ నుంచి జూనియర్ పోటీ చేయాలంటూ పోస్టర్లు, ఫెక్సీలు వెలుస్తుండడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబుకు కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌ను బరిలో దించాలని శ్రేణుల నుంచి డిమాండ్ వినిపించింది. దీంతో దిక్కుతోచని చంద్రబాబు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరోసారి అభిమానులు వినూత్నంగా తమ డిమాండ్‌ను జెండా రూపంలో ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం టీడీపీవి డైవర్షన్ పాలిటిక్స్ -
ఆ ముగ్గురే ముంచారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీల్లో టీడీపీ ఘోర పరాభవానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ ఇన్చార్జి మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్ కారణమని ఓడిన సర్పంచ్ అభ్యర్థులు చంద్రబాబు ఎదుట ఏకరువు పెట్టారు. దీటైన పోటీ ఇచ్చేందుకు ఆ ముగ్గురూ సహకరించలేదని తెలిపారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబును వేర్వేరుగా కలిసిన రామకుప్పం, శాంతిపురం మండలాల పార్టీ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు ఆ ముగ్గురిపైనా ఫిర్యాదులు చేశారు. అధికారంలో ఉండగా ఆ ముగ్గురి వల్ల ఆర్థికంగా లబ్ధి పొందిన వ్యక్తులను పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దించలేదని తెలిపారు. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి తమకు లేకపోయినా పార్టీపై గల అభిమానంతో పోటీ చేశామని వివరించారు. ఆ ముగ్గురినీ ఇంకా నమ్ముకుంటే అసలుకు ఎసరు తప్పదని చంద్రబాబు ఎదుట తేల్చి చెప్పారు. చంద్రబాబు వారికి బదులిస్తూ.. అన్నీ తెలుసుకున్నానని, ఇకనుంచి క్రమం తప్పకుండా తాను లేదా లోకేశ్ కుప్పంలో పర్యటిస్తామని బుజ్జగించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో వైఫల్యాలను సమీక్షించుకుని పార్టీలో పునరుత్తేజం నింపుతారని భావించిన కార్యకర్తలకు నిరుత్సాహమే మిగిలింది. తానెంతో గొప్పవాడినని చెప్పుకోవడానికి, ఎదుటి వారిపై నిందలు వేయడానికే చంద్రబాబు పరిమితమయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నుంచే ప్రజా చైతన్య యాత్ర రామకుప్పం, రాజుపేట రోడ్డు, శాంతిపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచే ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడవటం లేదని, పులివెందుల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి అరాచక పాలన చేస్తుంటే యువకులుగా మీరేం చేస్తున్నారు, నిద్రపోతారా అంటూ రెచ్చగొట్టారు. తాను కూడా పట్టించుకోకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందోననే బాధ ఉందని చెప్పుకొ చ్చారు. పోలీసు వ్యవస్థతో పోరాటం చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని, అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి డబ్బు నాన్న బుడ్డికి సరిపోయిందంటూ ప్రభుత్వ పథకాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం
కుప్పం (చిత్తూరు జిల్లా): నియోజకవర్గంలో రాజకీయ చరిత్ర తిరగబడింది. టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఫలితాలు చంద్రబాబును భయపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో అయి తే టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. కొన్ని పంచాయతీల్లో టీడీపీ త్రిబుల్ డిజిట్ దాటలేకపోయింది. గుడుపల్లె మండల గుండ్లసాగరం పంచాయతీల్లో కేవలం 15 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి, దాసమానపల్లెలో 98 ఓట్లు, కెంచనబళ్ల పంచాయతీల్లో 39 ఓట్లు, 121 పెద్దూరు 197 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చింది. కంచుకోటగా ఉన్న కుప్పం నియోజవవర్గంలో టీడీపీ ఎదురు దెబ్బతగిలింది. కరోనాలో కన్నెత్తి చూడని బాబు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో సొంత నియోజకవర్గం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. ఆ ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆయనకు సొంత నియోజక వర్గం గుర్తుకు వచ్చింది. ఫలితాలు వెలువడిన వారం తిరక్కముందే కుప్పం పర్యటనకు పరుగులు తీయడం బాబు అధైర్యానికి నిదర్శంగా తెలుస్తోంది. 35 ఏళ్లు రాజకీయ భవిష్యత్ కల్పించిన కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించని బాబు కేవలం పార్టీ దెబ్బతింటే మాత్రం ప్రజలు గుర్తుకు వచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 25,26 తేదీల్లో చంద్రబాబు కుప్పం రాక రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపారు. రెండు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. చదవండి: ఉరకలేస్తున్న వైఎస్సార్ సీపీ.. నిస్తేజంలో టీడీపీ బాబు గారూ ఇంకా ఎందుకు అబద్దాలు -
కూలిన ‘దేశం’ కంచు కోటలు
సాక్షి, అమరావతి: తొలి రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలే మూడో విడతలోనూ పునరావృతం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మొదలు.. శ్రీకాకుళం జిల్లా వరకు అన్నింటా టీడీపీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడున్నర దశాబ్దాల కాలంలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాగా వేసిన కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. అధిక పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు డిపాజిట్లు కోల్పోయారు. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్సీపీ అభిమానులు 75 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ మద్ధతుదారులు మాత్రం కేవలం 14 స్థానాలకే పరిమితం అయ్యారు. అదే 2013లో 93 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అప్పట్లో 12 చోట్ల మాత్రమే వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆ సీన్ రివర్స్ అయ్యింది. నియోజకవర్గంలోని గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం ఇలా నాలుగు మండలాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు తిరుగులేని విజయం సాధించారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) కుప్పంలో మొత్తంగా 30 వేల మెజార్టీ ♦కుప్పం నియోజకవర్గంలో వైస్సార్సీపీ అభిమానులకు వచ్చిన ఓట్లను లెక్కిస్తే 30 వేలకు పైగానే మెజార్టీ దాటింది. వివిధ కారణాలతో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించి ఉంటే మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉండింది. ♦టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న అమర్నాథ్రెడ్డికి చెందిన పలమనేరు నియోజకవర్గంలో 90 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 76 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, కేవలం 13 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ♦అమర్నాథ్రెడ్డి మరదలు అనీషరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో ఒక్క స్థానంలో కూడా టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. మొత్తం 85 పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ‘అనంత’లోనూ భంగపాటు ♦ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 117 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్సీపీ అభిమానులు 93 స్థానాల్లో, టీడీపీ 20, ఇతరులు రెండు చోట్ల మాత్రమే గెలుపొందారు. ♦ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండలం కెకె అగ్రహారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్వగ్రామం. ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ అభిమానే విజయం సాధించడం విశేషం. ♦తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు పంచాయతీ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 85 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఇందులో 53 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, 28 చోట్ల టీడీపీ, నాలుగు చోట్ల ఇతరులు గెలుపొందారు. ♦ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని 68 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 52 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు, కేవలం 13 చోట్ల టీడీపీ, రెండు చోట్ల ఇతరులు విజయం సాధించారు. ♦ రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రభావం ఏమీ కన్పించలేదు. 38 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ మద్దతుదారులు కేవలం 4 స్థానాలకే పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీ అభిమానులు 34 చోట్ల ఘన విజయం సాధించారు. ♦ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 3 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్సీపీ అభిమానులే ఘన విజయం సాధించారు. ♦ గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించిన 68 పంచాయతీల్లో 55 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. టీడీపీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. చదవండి: (కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది) స్పీకర్ తమ్మినేని సతీమణి విజయం ♦ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి, మాజీ చీప్ విప్ కూన రవికుమార్‌కు ఎదురుగాలి వీచింది. 108 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 75 చోట్ల వైఎస్సార్సీపీ, 33 స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తొగరాం సర్పంచ్‌గా స్పీకర్ తమ్మినేని సీతారం సతీమణి తమ్మినేని వాణి విజయం సాధించారు. ♦ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన స్వగ్రామం చల్లవానితోట పంచాయతీకి ఆయన మనుమడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తారకరామ నాయుడు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో మొత్తం 207 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 174 స్థానాల్లో వైఎస్సార్సీపీ, కేవలం 32 స్థానాల్లో టీడీపీ, ఒక చోట ఇతరులు గెలుపొందారు. కర్నూలులోనూ అదే జోరు ♦ కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ పప్పులేవీ ఉడకలేదు. ఈ నియోజకవర్గంలో 81 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 69 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, 11 స్థానాల్లో టీడీపీ, ఒక చోట ఇతరులు విజయం సాధించారు. ♦ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గమైన పత్తికొండలోనూ టీడీపీకి ఎదురుగాలి వీచింది. 87 పంచాయతీలకుగాను 55 చోట్ల వైఎస్సార్సీపీ, 26 చోట్ల టీడీపీ, 6 చోట్ల ఇతరులు విజయం సాధించారు. ♦ టీడీపీ నాయకులు గౌరు చరిత, వెంకటరెడ్డి దంపతులు, బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిల నియోజకవర్గమైన నందికొట్కూరులో ఊహించని ఫలితాలొచ్చాయి. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామం ముచ్చుమర్రిలో వైఎస్సార్సీపీ అభిమాని విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో 77 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 62 చోట్ల వైఎస్సార్సీపీ, 12 స్థానాల్లో టీడీపీ, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. గుంటూరు, కృష్ణాలో ‘దేశం’ డీలా ♦ గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం మంచికల్లులో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 57 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 53 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 3 స్థానాల్లో టీడీపీ, జనసేన మద్దతుదారులు ఒక చోట విజయం సాధించారు. ♦ మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు నిర్వహించిన రెండు స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న అన్నపురెడ్డి అంజిరెడ్డి ఎక్కడా కూడా తన ప్రభావం చూపలేకపోయారు. ♦ టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ నియోజకవర్గమైన కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభిమానులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. 71 పంచాయతీలకుగాను 45 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, 18 చోట్ల టీడీపీ, 5 స్థానాల్లో జనసేన, 3 చోట్ల ఇతరులు గెలుపొందారు. ♦ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గమైన మచిలీపట్నంలో టీడీపీ మద్దతుదారులు కేవలం 6 స్థానాలకే పరిమితం అయ్యారు. 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు, రెండు చోట్ల జనసేన మద్దతుదారులు గెలుపొందారు. -
కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: చంద్రబాబు
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం టీడీపీ మద్దతుదారులే గెలుపొందారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఓడిందన్నారు. విశ్వసనీయత, శాంతి, నీతి, నిజాయితీలకు కుప్పం మారు పేరు అని.. అలాంటి ప్రాంతాన్ని ఉన్మాదంతో కలుషితం చేస్తారా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందన్నారు. పోలీసులే రౌడీల్లా తయారయ్యారని దూషించారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బెదిరిస్తున్నారని.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు కూడా సహకరించలేదని చెప్పారు. సాయంత్రం వరకు టీడీపీ మద్దతుదారులకు అత్యధిక స్థానాలొచ్చాయని.. రాత్రి ఏడున్నర నుంచి పరిస్థితి మొత్తం మారిపోయిందన్నారు. అర్ధరాత్రి తర్వాత ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. పోలీసులు కౌంటింగ్ బూత్‌లలోకి వెళ్లారని.. పవర్ కట్ చేసి ఫలితాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ఎస్ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారు కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నదేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ గళం ఎత్తడం వల్లే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారన్నారు. మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39 శాతం, మూడో విడతలో 40 శాతం స్థానాల్లో టీడీపీ గెలుపొందిందని చెప్పారు. చదవండి: కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ
సాక్షి, అమరావతి: ఏపీలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు భారీ షాక్ తగిలింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కుప్పంలో ఆ పార్టీ కుప్పకూలిపోయింది. వైఎస్సార్సీపీ అభిమానులు విజయభేరి మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ప్రభంజనం కొనసాగుతోంది. తొలి రెండు విడతల్లో మాదిరే బుధవారం మూడో విడతలోనూ పల్లె ప్రజలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ కంచుకోటలను ప్రజలు తమ ఓటుతో బద్దలు కొట్టారు. ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల తీర్పు ఒక్కటే అన్నట్టుగా మూడో విడతలోనూ 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ అభిమానులు గెలుచుకున్నారు. మూడో విడత మొత్తం 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 579 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో చోట సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు స్థానాలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,639 సర్పంచి స్థానాలకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. కందుకూరు నియోజకవర్గం కొండికందు కూరులో వైఎస్సార్సీపీ సంబరాలు ఆ నియోజకవర్గాల్లో రికార్డు విజయం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడింది. మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒక పంచాయతీలో గెలుపొందారు. గుంటూరు జిల్లాలో మూడవ విడతలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 78 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. లెక్కింపు అనంతరం ఈ మూడు స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలకు గాను 85లో వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరంలో అత్యధికంగా 87.09% పోలింగ్‌కు 3.30 గంటల వరకు అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం ఒంటిగంట లోపే దాదాపు ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు విజయనగరం జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణ అధికారులు తెలిపారు. మూడో విడతలో మొత్తం 80.71 శాతం ఓటింగ్ పోలవగా, మధ్యాహ్నం 12.30 గంటలకే 67% నమోదు అయింది. ఆఖరి గంటలో కేవలం 4% మందే ఓటు వేశారు. ఇప్పటి వరకు మూడు విడతల పాటు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఈ విడతలో విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలో ఈ విడత 207 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఆయా గ్రామాల్లో మొత్తం 3,60,181 మంది ఓటర్లకు గాను 3,13,679 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేగంగా కౌంటింగ్ పూర్తయ్యేలా చర్యలు ఈ విడతలో ఎన్నికలు జరిగిన వాటిలో 448 గ్రామ పంచాయతీలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో పోలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకే ముగియడంతో అక్కడ కౌంటింగ్ రెండు గంటలకే మొదలైందని అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టారు. కాగా, గత రెండు విడతల ఎన్నికల్లో మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ఓట్ల లెక్కింపు కొనసాగడంతో ఈసారి వేగంగా కౌంటింగ్ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు 5 వేలకు పైబడి ఓటర్లు ఉండే గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణకు పలు చోట్ల ఇద్దరు చొప్పున తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన వార్డులన్నింటికీ ఒకే సారి లెక్కింపు పూర్తి చేసేలా రెండు టేబుళ్ల ద్వారా ప్రత్యేక ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించారు. అర్ధరాత్రి 12 గంటల లోపే దాదాపు అన్ని చోట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యేలా తగిన చర్యలు చేపట్టారు. కుప్పం నియోజక వర్గం దాసిమానుపల్లిలో వైఎస్సార్సీపీ అభిమానుల విజయోత్సాహం తూర్పుగోదావరి జిల్లాలో ఏపీవో మృతి తూర్పు గోదావరి జిల్లా చింటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అసిస్టెంట్ పోలింగ్ అధికారిణి దేవకృపావతి విధి నిర్వహణలో మృతి చెందినట్టు ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెకు గుండె పోటు రాగా, వెంటనే వైద్య చిక్సిత కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామ పంచాయతీలో మూడో వార్డులో నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి పేరును సైతం చేర్చి, అధికారులు బ్యాలెట్ పేపర్‌ను సిద్ధం చేయడంతో ఆ వార్డు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగల గ్రామంలో రెండు వార్డుల బ్యాలెట్ పేపరులో గుర్తు ముద్రణలో తప్పులు దొర్లడంతో ఆ రెండు వార్డులలోనూ ఎన్నికను నిలిపివేశారు. చెదురుమదురు ఘటనలు కూడా లేవు : ఎస్ఈసీ నిమ్మగడ్డ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం వర్గీకరించిందని తెలిపారు. అందుకనుగుణంగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఎక్కడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బంధీగా పోలింగ్ నిర్వహించామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ‘చంద్రబాబును కుప్పం ప్రజలు ఛీకొట్టారు’ వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): వెన్నుపోటు, కుళ్లు కుతంత్రాలతో ఇన్నాళ్లూ మోసం చేస్తున్న చంద్ర బాబు నిజస్వరూపాన్ని గుర్తించిన కుప్పం ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛీకొట్టారని ఉపముఖ్య మంత్రి నారాయణస్వామి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 90% టీడీపీని వ్యతిరేకించి వైఎస్సార్సీపీ మద్దతుదారులకు పట్టం కట్టారని ఇ ది విశ్వాసం, నమ్మకానికి సంకేతమని స్పష్టం చేశా రు. బినామీ ఓట్లతో చక్రం తిప్పుతున్న బాబుకు ఈ ఫలితాలతో ప్రజలు షాక్ ఇచ్చినట్లు చెప్పారు. -
బాబు డీలా.. కుప్పంలో ఎలా?
అధికారంలో ఉన్నప్పుడు ఎదురులేదని విర్రవీగారు.. ఎంతో అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకున్నారు.. కుప్పం నియోజకవర్గం తమ దుర్భేద్య దుర్గమని గొప్పలు చెప్పుకున్నారు.. కోటకు బీటలు వారే సరికి బిక్కమొహం వేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేసింది శూన్యమని అర్థం కావడంతో డ్రామాలకు తెరదీస్తున్నారు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయితే టీడీపీ కథ కంచికి చేరినట్టే అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.. చంద్రబాబు నిర్లక్ష్యంతో ఆగిన ప్రగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగవంతం చేశారని వెల్లడిస్తున్నారు. రాబోయే రోజుల్లో కుప్పం కోటపై వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవడంతో చంద్రబాబులో సైతం ఆందోళన మొదలైంది. దీనికితోడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న వన్నెకుల క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక మహిళ వనితకు చైర్పర్సన్ పదవిని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టబెట్టారు. ఈ క్రమంలో కార్యకర్తల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తులను ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గుసగుసలాడుకుంటున్నారు. ఆయన నిర్లక్ష్య వైఖరితోనే జిల్లాలో టీడీపీ ఒక్క సీటుకే పరిమితమైందని తేల్చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. ప్రజలు వాస్తవాలు గుర్తించారని, తమ మాయమాటలు నమ్మరని తెలియడంతో బాబుకు కునుకు కరువైందని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. (చదవండి: పేదల ద్రోహి చంద్రబాబు) కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ కుప్పం బ్రాంచ్ కెనాల్ త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగా విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డీఈలను సైతం సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్స్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో సుమారు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావచ్చాయి. దళవాయిపల్లె వద్ద మరో అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మరోవైపు కల్లివంక ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యాయి. నాలుగు చెరువుల్లోకి నీరు చేరి, తాగు, సాగునీటి సమస్యలు తీరాయి. (చదవండి: ఓడి ఇంట్లో కూర్చొని ఇదేం వాదన బాబూ!) ఇదివరకు కుప్పం రూర్బన్ మిషన్ పేరుతో మంజూరైన రూ.14కోట్లను కేవలం కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో బాబు అండ్ కో వినియోగించ లేదు. 30 ఏళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతిని«థ్యం వహించినా కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేయలేకపోయారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేయడంతోపాటు గతంలో వినియోగించని రూ.14 కోట్లతో అండర్ డ్రైనేజీ పనులు చేపట్టింది. చంద్రబాబు హ యాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక పనులను సీఎం జగన్మోహన్రెడ్డి త్వరితగతిన పూర్తి చేయిస్తుండడంతో టీడీపీ వెన్నులో వణుకు మొదలైంది. భవిష్యత్‌లో కుప్పం కూడా వైఎస్సార్ సీపీ ఖాతాలోకే వెళ్లిపోతుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియోజకవర్గ అభివృద్ధిని జీరి్ణంచుకోలేని కొందరు నేతలతో డ్రామాలకు తెరతీస్తోంది. చంద్రబాబు దిశానిర్దేశంతో పాదయాత్ర పేరుతో చేపట్టిన నాటకాలకు ప్రజాస్పందన కరువైంది. కేవలం కొద్దిమంది పెయిడ్ ఆరి్టస్టులను వెంటేసుకుని హడావుడి చేస్తోంది. -
కుప్పం దూకుడు!
కుప్పం తలరాత మారుతోంది. అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతోంది. ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీ గ్రేడింగ్ సంపాదించుకున్న ఏకైక పంచాయతీ కుప్పం కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కుప్పంను మున్సిపాలిటీగా చేసి.. నిధులు సమకూర్చి.. అభివృద్ధిని పరుగులు పెట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కుప్పం: కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు కంచుకోట. ఇక్కడ ఆయన 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1996 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ తన నియోజకవర్గాన్ని కనీసం మున్సిపాలిటీగా కూడా మార్పు చేయలేకపోయాడు. నూతనంగా అధికారం చేపట్టిన వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో 52 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. అందులో కుప్పం ఒకటి. మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. రూరల్ అర్బన్ మిషన్‌కు మోక్షం గత ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.30 కోట్ల రూరల్ అర్బన్ మిషన్ నిధులు వృథా అయ్యాయి. ఇప్పటికీ రూ.18 కోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నేతలు, స్థానిక అధికారులు స్పందించి ఆ నిధులతో పట్టణంలో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. నాలుగు ప్రాంతాల్లో రూరల్ అర్బన్ మిషన్ కింద పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఈ నిధులను రెండేళ్లు బ్యాంకు ఖాతాల్లోనే ఉంచింది. మౌలిక వసతులు మెరుగు మున్సిపాలిటీ పరిధిలోని 8 పంచాయతీలతో పాటు పట్టణంలో పారిశుధ్య పనులు పుంజుకున్నాయి. 25 వార్డులకు గాను 10 వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. 8 పంచాయతీల్లో ప్రత్యేకంగా పది మంది పారిశుధ్య కార్మికులతో టీమ్‌గా ఏర్పాటు చేసి, రోజు మార్చి రోజు పనులు చేపడుతున్నారు. డ్రైనేజీల శుభ్రతతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రతి వీధిలోనూ బ్లీచింగ్, సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు. 15 కంటైన్మెంట్ జోన్లలో పూర్తిస్థాయి శానిటేషన్ జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ 130 నుంచి 140 వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారు. ఆరు నూతన బోర్లు వేశారు. వాటర్ సమస్య పరిష్కారం కోసం ప్రతినెలా రూ.10 నుంచి 15 లక్షలు వెచ్చిస్తున్నారు. సోషియల్ మీడియా ద్వారా సమస్య తెలిపిన వెంటనే సిబ్బంది స్పందించి తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నారు. భవన నిర్మాణ అనుతులకు ఆన్లైన్ విధానం గతంలో పంచాయతీ పరిధిలో భవన నిర్మాణాలకు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వ్యాపారులకు దుకాణ నిర్వహణ అనుమతులు, వాటర్ కనెక్షన్ కోసం బైలాన్ సిద్ధం చేశారు. విద్యుత్ స్తంభాల నిర్వహణకు ప్రత్యేక బైలాన్ ద్వారా మున్సిపాలిటీ నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతి ఇంటికీ డోర్ నంబర్లు ఇచ్చి జనాభా లెక్కలు తీసేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. వర్కర్లకు చేయూత మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఆక్యూపేషన్ హెల్త్ అలవెన్స్ ద్వారా శానిటేషన్ వర్కర్లు 70 మందికి ప్రతినెలా ఆరు వేల రూపాయల జీతంలో పాటు అదనంగా వచ్చే విధంగా చేపట్టారు. గతంలో ఈ స్కీమ్ ఉన్నా వర్కర్లకు అందేది కాదు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లకు అందిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి నూతనంగా ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే శాఖల వారీగా విభజించి పనులు వేగవంతం చేశారు. ప్రధానంగా తాగునీటి సమస్యపై వాట్సప్ గ్రూపులో సమాచారం అందించినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీటి పన్ను, ఇంటి పన్నులు చెల్లించి సహకరించాలి. – చిట్టిబాబు, కమిషనర్ కుప్పం మున్సిపాలిటీ -
కుప్పంలో నిలువునా చీలిన టీడీపీ
కుప్పం మండలం వేపూరు మిట్టపల్లెకు చెందిన ఖాదర్‌బాషా మాజీ సర్పంచ్. టీడీపీ గ్రామస్థాయి నాయకుడు. నిన్నటి వరకు ఆ పార్టీకి వీరాభిమాని. ఇతనికి ముగ్గురు కుమారులు. ఖాదర్‌బాషాతో పాటు కుమారులు యాసిన్, ముస్తఫా, ముబారక్ రైతు భరోసా కింద లబ్ధి పొందారు. యాసిన్ కుమార్తెకు అమ్మ ఒడి కింద మంజూరైంది. ఖాదర్‌బాషా భార్య ముబీనాకు జగనన్న చేయూత కింద ఆర్థిక సాయం అందింది. వారి కుటుబాల్లోని మహిళలు డ్వాక్రా గ్రూపులో ఉన్నారు. వారు గతంలో తీసుకున్న రుణానికి చెల్లించిన వడ్డీ మొత్తం రూ.26వేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి చెల్లించింది. దీంతో ఖాదర్ బాషా కుటుంబం మొత్తం జగన్‌కు జై కొడుతోంది. సాక్షి, తిరుపతి :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ మంత్రానికి చంద్రబాబు కోట బీటలు వారుతోంది. కుప్పంలో టీడీపీ నిలువునా చీలిపోతోంది. అపర చాణక్యుడిగా చెప్పుకునే ఆ పార్టీ అధినేతకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోంది. చంద్రబాబు హయాంలో అందని సాయం జగన్ ప్రభుత్వంలో అందడంపై తమ్ముళ్లలో ఆనందం వ్యక్తమవుతోంది. కార్యకర్తల్లో అనూహ్య మార్పును గుర్తించిన స్థానిక టీడీపీ నేతలు రాజీనామా బాట పట్టడంతో జిల్లా నాయకత్వం డైలమాలో పడింది. భవిష్యత్‌లో ఇక్కడ గెలుపు అంత సులువు కాదనే విషయం అధ్యక్షుడికి చేరవేసింది. ఖాదర్‌బాషా కుటుంబం ఒక్కటే కాదు.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ క్రమం తప్పకుండా అందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకు తప్ప వేరొకరికి సంక్షేమ పథకాలు అందేవి కావు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా పాలన సాగుతోంది. టీడీపీ కంచుకోట కుప్పం నిలువునా చీలుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్సీపీలో చేరుతానని ప్రకటించారు. ఆయనతో పాటు మరి కొందరు టీడీపీ నాయకులు సైతం సైకిల్ దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుప్పం అర్బన్ టీడీపీ అధ్యక్షుడు విద్యాసాగర్ చంద్రబాబుకు ఎప్పుడో గుడ్‌బై చెప్పేశారు. ముఖం చాటేస్తున్న తమ్ముళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరేందుకు వరుసకడుతున్నారు. ఇప్పటికే వందల మంది గ్రామస్థాయి నాయకులు టీడీపీ రాం రాం చెప్పేశారు. దీంతో పలువురు ముఖ్యనాయకులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సాక్షాత్తు చంద్రబాబు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడం లేదని విశ్వసనీయ సమాచారం. ఏం జరుగుతోంది? కుప్పంలో ఏం జరుగుతోంది? నాకు వెంటనే తెలియాలి? అని టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా నాయకులను అడిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు ఒకరు “సాక్షి’కి చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో కుప్పానికి చేరుకున్న కొందరు జిల్లా స్థాయి నాయకులకు టీడీపీ శ్రేణులు ముఖం చాటేసినట్లు సమాచారం. కార్యకర్తల్లో వచ్చిన అనూహ్య మార్పును గమనించిన జిల్లా నాయకులు కూడా డైలమాలో పడ్డారు. మొత్తం పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. -
మరిచారా బాబూ.. మీరే మా ఎమ్మెల్యే!
సాక్షి, తిరుపతి: ముప్పై ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్న కుప్పం వాసుల యోగ క్షేమాలు మరచి చంద్రబాబు హైదరాబాద్‌లో తన నివాసానికే పరిమితమయ్యారు. లాక్డౌన్ సమయంలో నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదు. దేశమంతా ఎమ్మెల్యేలు తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటు లో ఉంటూ సొంత డబ్బుతో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలతోపాటు విటమిన్ టాబ్లెట్లను పంపిణీ చేçస్తున్నారు. కుప్పం ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తనను గెలిపించిన కుప్పం, రాష్ట్రంతో సంబంధం లేనట్టు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన రాలేని పరిస్థితుల్లో స్థానిక నాయకులకు చెప్పి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉన్నా... ఆ దిశగా ప్రయత్నించలేదని కుప్పం వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుల, మత, పార్టీలకతీతంగా రూ.వెయ్యి పంపిణీతో పాటు ఉచితంగా రేషన్ అందించి ఆదుకుంటోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, దాతలు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు అందించి, పేదల ఆకలి తీరుస్తుండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు ప్రజలకు ఏ విధంగాను సాయం చేసిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అమరనాథ్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని నమ్ముకున్న వారిని కూడా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. బాబు మమ్మల్ని పట్టించుకోలేదు లాక్‌డౌన్‌తో నెలరోజులకు పైగా అంతా ఇళ్ల వద్దే ఉంటున్నాం. పనులు పోయాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయనున్న ముప్పై ఏళ్లుగా ఎన్నుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో చంద్రబాబు పట్టించుకోకపోవడం బాధగా ఉంది. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం.– ముత్తురాజ్, మోడ్రన్ కాలనీ, కుప్పం ప్రభుత్వమే సాయం చేస్తోంది ప్రభుత్వం రేషన్ కార్డుకు అదనంగా రూ.వెయ్యి ఇస్తోంది. పంచాయతీలో వైఎస్సార్ సీపీ నేతలు పేదలకు బియ్యం, పప్పు, ఉప్పు, కాయకూరలు అందజేస్తు్తన్నారు. ముప్పై ఏళ్లుగా ఓటేసి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నా మమ్మల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం అన్యాయం. – అరుణ్, డీకేపల్లె, కుప్పం మండలం చంద్రబాబు కనిపించలేదని ఫిర్యాదు కుప్పం: స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడి ఆచూకీ తెలిపాలని కుప్పం ముస్లిం మైనారిటీ అసోసియేషన్ అధ్యక్షు డు ఫైరోజ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సల హాలు, సూచనలు కుప్పం ప్రాంతానికి ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఆయన కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లేదన్నారు. చంద్రబాబును వెతికి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కుప్పం ప్రజలను ఆదుకునేలా చూడాలని కోరారు. -
కుప్పం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్, శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయన కుప్పం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి కుమారుడు భరత్ తెలిపారు. చంద్రమౌళి సేవలను పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. వివిధ శాఖల్లో సేవలు.. ► చంద్రమౌళి 1977లో ఏపీపీఎస్సీ ద్వారా సహకార శాఖలో అధికారిగా నియమితులయ్యారు. వివిధ శాఖల్లో పీడీగా, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారిగా పలు జిల్లాల్లో సేవలు అందించారు. ► 1990 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆయన విజయనగరం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టరుగా, వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ► డ్వాక్రా గ్రూపుల నిర్వహణ, ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన చర్యల్లో కీలకంగా వ్యవహరించారు. మహిళా స్వావలంబన, బాలల ఆరోగ్యంపై యూనిసెఫ్ కార్యక్రమ నిర్వాహకుడిగా ప్రశంసలు అందుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌గా, అపార్డ్ డైరెక్టర్‌గా ప్రత్యేకతను చాటుకున్నారు. ► ఉద్యోగ విరమణ అనంతరం వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు సార్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీనిచ్చారు. ► కుప్పం మండలం పెద్దబంగారునత్తం చంద్రమౌళి కుటుంబం స్వగ్రామం. ఆరేళ్లుగా కుప్పంలో ఉంటున్నారు. ఆయనకు భార్య పద్మజ, కుమారులు భరత్, శరత్ ఉన్నారు. సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కె.చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కలెక్టర్‌గా, రాజకీయ నేతగా అందించిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు. చంద్రమౌళి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంతాపం తెలిపారు. -
మాజీ సీఎం నియోజకవర్గం కుప్పం అక్రమాలపై విజిలెన్స్!
సాక్షి, బి.కొత్తకోట: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకెళ్లే కుప్పం ఉపకాలువ పనుల అంచనాకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లెక్కతేల్చే పనిలో పడింది. రూ.430.26 కోట్ల పనులకు నిబంధనలకు విరుద్ధంగా రూ.144.7 కోట్లు అదనంగా చెల్లించడంపై ఆగస్టు 13న ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలనలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పనులను విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రధానంగా కుప్పం కాలువ పనులను క్షేత్రస్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథరెడ్డి స్వయంగా పరిశీలించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సోమవారం కుప్పం ఉపకాలువ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ పరిశీలన వ్యవహరం అధికారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇష్టారాజ్యంగా దోచుకున్నారు కుప్పం కాలువలో అవినీతి వరద పారింది. పను ల అంచనా నుంచి అదనపు చెల్లింపు వ్యవహారం అంతా గత ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగింది. ఈపీసీ ద్వారా 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5 చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, 3 చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరు అందించే పనులు పూర్తి చేయాలి. ఈ మేరకు పనులు చేపట్టకపోగా, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకు భాగస్వామ్యం కల్పించడమేకాక ఒప్పందం మేరకు 9 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. దీనికితోడు ఈసీపీ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకు అదనపు చెల్లింపులు సాధ్యం కాదని... వెసులుబాటు కోసం 626, 68 జీవోలు జారీ చేసిన గత ప్రభుత్వం రెండు విడతల్లో అదనంగా రూ.144.7 కోట్లు చెల్లించింది. పనులు చేపట్టడంలోనూ కాంట్రాక్టు సంస్థలు ఇష్టారీతిన వ్యవహరించాయి. వారికి అనుకూలంగా పనులు చేసుకున్న అధికారులు ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ పనులపై గత ఆగస్టు 13వ తేదీ నిపుణుల కమిటీ పరిశీలనలు నిర్వహించగా.. కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదిక సమర్పించలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో విజిలెన్స్ ఉన్నత స్థాయి అధికారుల విచారణ చేపట్టి అక్రమాల నిగ్గు తేల్చనున్నారని తెలుస్తోంది. రెండు రోజులుగా రికార్డుల పరిశీలన కుప్పం ఉపకాలువ పనులకు సంబంధించిన రికార్డులను రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటుకు చెందిన డెప్యూటీ ఇంజినీర్, ముగ్గురు జేఈలు పరిశీలిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్ఈ కార్యాలయంలో శని, ఆదివారాలు వీరు ముమ్మరంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఏఏ పనులు రికార్డు చేశారు, నిబంధనల మేరకు పనులు జరిగాయా లేదా అనే వివరాలను ముందుగానే పరిశీలించారు. సోమవారం డైరెక్టర్ జనరల్ కాలువను పరిశీలించనుండటంతో ఆ శాఖ అధికారులు ముందస్తుగా నివేదికలు సిద్ధం చేసుకున్నారు. నేడు డీజీ, సీఈ రాక కుప్పం ఉపకాలువ పనులకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజేంద్రనాథరెడ్డి, చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి పరిశీలనలు నిర్వహించనున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో ఏఏ పనులు పరిశీలిస్తారో ముందుగా సమాచారం లేనందున ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎత్తిపోతలు, కాలువ, కాంక్రీటు నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. పనులు డీపీఆర్ మేరకు చేశారా లేదా, అంచనాలు ఎలా పెంచుకున్నారు, తదితర వాటిపై పరిశీలనలు చేసే వీలుంది. -
అంతా మీ వల్లే
సాక్షి, తిరుపతి : కుప్పంలో మెజారిటీ తగ్గటానికి స్థానిక టీడీపీ నేతలే కారణమని చంద్రబాబు అ సంతృప్తి వ్యక్తం చేశారు. సొంత జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందటానికి ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్థులు, జన్మభూమి కమిటీ సభ్యులే కారణమని తేల్చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నా యకులు ఇటీవల వరుసగా అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిసి వస్తున్నారు. మొన్న కుప్పం, తిరుపతి నియోజక వర్గానికి చెందిన నాయకులు చంద్రబాబును కలిశారు. అంతకు ముందు పలమనేరు, పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తికి చెందిన మరి కొందరు నాయకులు కలిసినట్లు సమాచా రం. చంద్రబాబును కలిసిన నాయకులతో రెండు మూడు మాటలు మాట్లాడి పంపేస్తున్నట్లు తెలి సింది. అది కూడా ఎందుకు ఓటమి పాలయ్యా ము? అందుకు కారణాలు? అనే విషయాలు అడుగుతున్నారు. నియోజక వర్గంలో ఓటమికి ప్రధాన కారణాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా కుప్పం నాయకులపై మా త్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచా రం. కుప్పంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారీగా మెజారిటీ తగ్గిందని, అందుకు ‘మీరే కా రణం’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఓ నాయకుడు వెల్లడించారు. స్థానికంగా ఉన్న భూములను ఆక్రమించుకోవటం, టెండర్లు దక్కించుకుని పనులు నాసిరకంగా చేయడం తదితర పనులు కొంప ముంచాయని గుర్తు చేసినట్లు తెలిసింది. టెలీ కాన్ఫరెన్స్‌లో అంతా బాగుందని చెబుతూ... మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరి విషయంలో స్థానిక నాయకులు టీడీపీ గెలుపు ఖాయమని పలుమార్లు చెప్పారని, తీరా చంద్రగిరిలో ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అవినీతి అక్రమాలు కొంప ముంచాయి నీరు–చెట్టు, హౌసింగ్, ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణ తదితర అవినీతి అక్రమాలే కొంప ముంచాయని సన్నిహితులు వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి తోడు జన్మభూమి కమిటీల ఆగడాలు అధికమయ్యాయని, లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లు చేసి జనం నుంచి తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని గుర్తుచేసినట్లు తెలిసింది. ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకోవటం, అధికారులను బెదిరించడం తదితర కారణాలు దెబ్బతీసినట్లు చర్చకు వచ్చాయి. అవినీతి అక్రమాలకు పాల్పడినా... ఓటర్లను కొనుగోలు చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయడం మరిచి, స్వార్థం చూసుకున్నామని, అయితే ఇవేమీ జనం పట్టించుకోరని భావించానని, అన్నింటినీ జనం గుర్తుపెట్టుకున్న విషయం గురించి ప్రధానంగా చర్చించనట్లు తెలిసింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తప్పు చేశామని పలమనేరు నాయకులు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి జనంలో ఉండడం, వారి సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిపై పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవేమీ తనకు తెలియకుండా అంతా బాగుందని చెప్పి, ఓటమికి కారణమయ్యారని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని జిల్లాకు వచ్చి నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని స్థానిక నాయకులకు చెప్పి పంపటం గమనార్హం. -
వసూళ్ల ‘సేన’
తిరుపతి (అలిపిరి): ఎన్నికల్లో ఖర్చుల కోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ జనసేన అభ్యర్ధి డాక్టర్ వెంకటరమణపై ఎన్టీఆర్ వర్సిటీ వీసీ విచారణకు ఆదేశించారు. గత నెలలోనే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న డాక్టర్ వెంకటరమణ కుప్పం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఎన్నికల ప్రచార నిమిత్తం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని, నగదును నేరుగా తన అకౌంట్లో వేయాలని పరోక్షంగా, ప్రత్యక్షంగా వేధించారని శ్రీకాళహస్తికి చెందిన లాయర్ కుమార్ ఎన్టీఆర్ వర్సిటీ వీసీకి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రభును వీసీ ఆదేశించారు. ఈ అంశంపై జనసేన తిరుపతి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ చెప్పలేదు ఎన్టీఆర్ వర్సిటీ ఆదేశాల మేరకు వెంకటరమణ డబ్బుల కోసం విద్యార్థులను వేధించారనే కోణంలో విచారణ చేపట్టాం. డబ్బులు వసూలు చేశారని ఎవరూ చెప్పలేదు. – డాక్టర్ రవి ప్రభు, ప్రిన్సిపాల్, ఎస్వీఎంసీ, తిరుపతి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే నేను జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించాను. కొందరు నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఫిర్యాదు చేశారు. లాయర్ ఫిర్యాదులో వాస్తవం లేదు. విద్యార్థుల వద్ద ఒక్క పైసా తీసుకోలేదు. – వెంకటరమణ, పీజీ వైద్య విద్యార్ధి, ఎస్వీఎంసీ, తిరుపతి -
ఎలక్షన్ పోస్ట్‌మార్టమ్
-
అపోహలు వద్దు.. త్వరలో తిరిగి వస్తా
శాంతిపురం : తన ఆరోగ్య పరిస్థితిపై అనవసరమైన అపోహలు, వదంతులను పట్టించుకోవద్దని వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళి ప్రజలు, పార్టీ శ్రేణులకు తెలిపారు. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మేరకు తెలుగు, తమిళ భాషల్లో రెండు వీడియోలను సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలోని చంద్రమౌళి మాటలు యథాతధంగా..‘కుప్పం ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోదర సోదరీమణులు, మిత్రులు అందరికీ నమస్కారాలు. రెండు రోజుల క్రితం జగన్మోహనరెడ్డిగారు నన్ను పరామర్శించటానికి ఆస్పత్రికి వచ్చిన సమయంలో పడుకుని ఉన్నాను. అదే ఫొటోలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి చాలా మంది నా ఆరోగ్యం క్షీణించిందని అపోహకు గురయ్యారని తెలిసింది. దీనిపై వస్తున్న అనేక కామెంట్లకు సరైన జవాబు ఇవ్వాలని అనుకుంటున్నాను. జగన్ గారు రావటానికి ముందే వైద్యచికిత్సలో భాగంగా ఓ ప్రక్రియకు వెళ్లిరావటంతో పడుకునే తనతో మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప, మరో ఇబ్బంది లేదు. ఆస్పత్రిలో నేను బాగా కోలుకుంటున్నాను. చికిత్స దృష్ట్యా దాదాపు నెల రోజులకు పైగా మీకు దూరంగా ఉంటున్నాను. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో మీ మధ్యకు వచ్చి అందరితో కలిసి కుప్పంలో పని చేస్తాను’. -
ప్రశాంతం రక్తసిక్తం
ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ని టీడీపీ నేతలు రక్తసిక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దళితులకు ఓటు వినియోగించుకునే అవకాశం లేకుండా అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపైనా దాడికి పూనుకున్నారు. వార్తల కవరేజ్‌కు వెళ్లిన పత్రికా విలేకరులు.. మీడియా ప్రతినిధులపైనా దాడిచేశారు. అనేక పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఇంత జరిగినా... చిత్తూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రీ పోలింగ్ నిర్వహించాల్సినఅవసరం లేదని ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు నివేదిక ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, తిరుపతి: ఎన్నికల సందర్భంగా ఈనెల 11న జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడిన విషయం జగమెరిగిన సత్యం. అయినా ప్రశాంతంగా సాగినట్టు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందినట్టు తెలిసింది. పోలింగ్ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉదయం నుంచి బారులు తీరడం టీడీపీ నేతలను కలవరానికి గురిచేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని గ్రహించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు దిగారు. కొందరుఅధికారుల సహకారంతో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కుప్పంలోనూ గుబులు దశాబ్దాల కాలంగా తమను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబు నిజస్వరూపాన్ని కుప్పం ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలామంది టీడీపీ వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఓటర్ల నాడి తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు కుట్రలకు తెరతీశాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధినేత బాబు నుంచి ఆదేశాలందాయి. రంగంలోకి దిగిన తమ్ముళ్లు కుప్పం పరిధిలోని 170, 173, 174, 175 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలను ధ్వంస చేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచాలని నిర్ణయించారు. ఓటింగ్ పూర్తయి అర్ధరాత్రి దాటాక ఆ బూత్‌లలోకి ప్రవేశించి వీవీ ప్యాట్లను పగులగొట్టారు. కుట్రలు బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలింగ్ బూత్‌లలో ఉన్న అధికారులందరినీ వెలుపలకు పంపి విధ్వంసానికి దిగినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పోలింగ్ బూత్‌ల వద్దకు రావడంతో జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ సోదరుడు సతీష్ దాడిచేశారు. అదే నియోజకవర్గంలోని దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. తంబళ్లపల్లెలో హత్య తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి శంకర్‌యాదవ్ సొంత ఊరు పీటీఎం మండలం టి.సదుంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఆర్పీ వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. శంకర్ సొంత గ్రామంలోనే వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయని భావించి టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఈ కిరాతకానికి పాల్పడ్డాయి. పూతలపట్టులో అభ్యర్థిపైనే హత్యాయత్నం పూతలపట్టులో ఈసారైనా పట్టు నిలుపుకోవాలని భావించిన టీడీపీ శ్రేణులు ఏకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అనుకూలంగా ఓట్లు వేస్తారని పొలకల కట్టకిందపల్లిలో దళితులను బూత్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబును బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి విచక్షణా రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడిచేశారు. ఎంఎస్ బాబు వాహనాన్ని ధ్వంసం చేశారు. మీడియా కెమెరామెన్ రమణపై దాడిచేశారు. అతని కెమెరాను పగులగొట్టారు. బందార్ల పల్లెలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. రామచంద్రాపురంలో యథేచ్ఛగా రిగ్గింగ్ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఓటర్లు ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదేవిధంగా సాగుతోందని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలంలోని పలు బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రామచంద్రాపురం మండలంలోని రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీ కండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లేస్తారని గ్రహించి స్థానికులను ఎవరినీ పోలింగ్ బూత్ వద్దకు రాకుండా రిగ్గింగ్ పాల్పడ్డారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. విలేకరులపై దాడులుచేసి తీవ్రంగా గాయపరిచారు. కెమెరాలు, ఐడీ కార్డులు లాక్కున్నారు. అదే మండలం సొరకాయలపాలెం, తుమ్మలగుంటలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేస్తూ టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. తాటితోపు కండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి పూర్ణిమపై దాడిగి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ నాయకుడు కేశువులునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు స్వతంత్ర మహిళా అభ్యర్థిని చుట్టుముట్టి దాడిచేసేందుకు యత్నించారు. గంటపాటు ఆమెను ఎటూ వెళ్లకుండా నిర్భందించి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. కుట్రలు కుతంత్రాలు సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీ పురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఎజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ, అధికారులు బెదిరింపులకు దిగారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఎజెంట్లను లోపల కూర్చోబెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఏర్పేడు మండలం గుడిమల్లంలో పోలింగ్ బూత్‌లో వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని భావించి టీడీపీ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా నొక్కి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జనాలుకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. సీసీ టీవీ పుటేజీల్లో కనబడవా? పోలింగ్ బూత్‌లలో సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తే టీడీపీ శ్రేణులు నిర్వాకం బయటపడుతుంది. జిల్లాలో పోలింగ్ రోజున హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్ జరిగాయి. అయితే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఈసీకి నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రీపోలింగ్ జరిపే అవకాశం ఉన్నా.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని నివేదిక ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సీఎం ఇలాఖాలో జగన్‌కు జేజేలు
చిత్తూరు, సాక్షి/ కుప్పం: సీఎం నియోజకవర్గం కుప్పం జనసంద్రమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బహిరంగ సభ. చెరువుకట్ట దగ్గర ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చెరువు కట్ట నుంచి ఎమ్మార్ రెడ్డి సర్కిల్ వరకు కార్యకర్తలతో కుప్పం కిక్కిరిసిపోయింది. జగన్‌కు సభాస్థలికి చేరుకోడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది. నవరత్నాలు.. మా జీవితాల్ని మారుస్తాయి కుప్పంలో జరిగిన సభలో జగన్ నవరత్నాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆలోచించండి మేలు జరుగుతుంది అంటూ కుప్పం ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ ఐదేళ్లలో రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పిల్లల్ని బడికి పంపితే చాలు నేరుగా డబ్బు అకౌంట్లో పడుతుందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.12,500 ఇస్తామని పేర్కొన్నారు. అవ్వాతాతలకు పింఛన్ రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామన్నారు. ఆలోచింపజేసేలా ప్రసంగం.. సభ ముగించుకుని కడపకు వెళ్లిన తర్వాత కూడా జగన్ ప్రసంగంపై కుప్పం ప్రజలు చర్చించుకున్నారు. ‘ఆలోచించండి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. కుప్పంకు ఒక్క మంచి పని అయినా చేశారా’ అనే ప్రశ్న వారిని కదిలించింది. ‘నిజమే కదా? ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇన్నాళ్లూ నెత్తిన పెట్టుకున్నాం. ఈసారి మంచి చేసే వారికే మా ఓటు’ అనుకుంటూ వెళ్లడం కనిపించింది. కుప్పంలో జగన్ సభ టీడీపీకి మరణశాసనమే అని విశ్లేషకులు అంటున్నారు. వెళ్లకండి.. రూ.200 తీసుకోండి.. వైఎస్.జగన్మోహన్రెడ్డి సభకు వెళ్లకుండా రెండు మూడు రోజుల నుంచే టీడీపీ నాయకులు పథకాలు పన్నుతున్నారు. పురుషులకు మందు, విందు ఏర్పాటు చేశారు. మహిళలకు పసుపు–కుంకుమ కింద రూ.200 పంపిణీ చేయాలని చూశారు. ప్రజలు వాటినేమీ పట్టించుకోకుండా జగన్ సభకు వచ్చారు. గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో సభకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేసులు పెడతామని బెదిరించినా సభకు తరలివచ్చారు. గెలుపుపై సందేహమే.. జగన్‌కు వచ్చిన ఆదరణ చూసి కుప్పం టీడీపీ నాయకుల్లో గుబులు మొదలైంది. చంద్రబాబునాయుడుకు కూడా ఇంతలా జనాలు రాలేదని టీడీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు. దీనికి తోడు జగన్మోహన్రెడ్డి కుప్పానికి దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేయడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. వన్నెకుల క్షత్రియులు మొత్తం చంద్రమౌళి వెంటే ఉన్నారని, వారి ఓట్లు ఈసారి టీడీపీకి ఒక్కటి కూడా పడవని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. గెలుస్తామా? గెలవమా? జగన్ సభ గ్రాండ్ సక్సెస్‌తో సీఎం ఇప్పటికే పలుసార్లు కుప్పం నాయకులతో మాట్లాడారు. సీఎం సతీమణి భువనవేశ్వరి వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకులతో మాట్లాడారు. ఇంటెలిజెన్స్‌తో రిపోర్టులు తెప్పించుకున్నారు. జగన్ సభకు దాదాపు 25 వేల మంది హాజరయ్యారని ఇంటెలిజెన్స్ వారు సీఎంకు తెలిపారు. వారిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇంత వ్యతిరేకత ఉందని ముందే ఎందుకు చెప్పలేదని చిందులేశారు. ఏం చేస్తే గెలుస్తామో చెప్పాలంటూ హుకూం జారీ చేశారు. -
కుప్పంలో ఎదురుగాలి? భువనేశ్వరి ఆడియో టేపులు వైరల్!
సాక్షి, కుప్పం : పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పెరుగుతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కోట బీటలు వారుతోందా? కుప్పంలో బాబుకు ఎదురుగాలి వీస్తోందా? కుప్పంలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలతో టీడీపీ అధినేత గుండెల్లో గుబులు పుట్టిందా? పులివెందులకు వెళ్లి తొడకొట్టిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గ పరిస్థితులే దడ పుట్టిస్తున్నాయా? పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఈసారి కుప్పంలో గట్టెక్కడమే కష్టమని బాబు కుటుంబానికి ముందే తెలిసిపోయిందా..? అందుకే 40 ఏళ్లలో ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడని ఆయన భార్య భువనేశ్వరి రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారా...? కుప్పం నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన భువనేశ్వరే తనకు కాన్ఫిడెన్స్ లేదని మాట్లాడటం దేనికి సంకేతం? భువనేశ్వరి ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కుటుంబ నిర్వహణ, వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న ఆమె ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నారు. ఏకంగా వందమంది నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లో ఎక్కడా కాన్ఫిడెన్స్ లేకపోవడంతో నేతల్లోనూ భయం పట్టుకుంది. మనం ఎన్ని చేసినా ఎక్కడో అనుమానం ఉందంటూ ఆమె అనడంతో నాయకులు, కార్యకర్తల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. కుప్పం నియోజకవర్గ నాయకులు కూడా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించడం చూస్తుంటే ఈ సారి అక్కడ టీడీపీ పరిస్థితి కష్టంగా ఉందని అర్థమైపోతోంది. తప్పులు జరిగాయని.. సరిచేసుకుందామంటూ అక్కడ ఇన్ఛార్జ్ నాయకులను కోరడం చూస్తుంటే వారిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ విభేదాలు పార్టీ అధినేతను ఏ రేంజ్లో కలవరపెడుతున్నాయో స్పష్టమవుతోంది. కుప్పం టీడీపీ నేతలతో భువనేశ్వరి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
కుప్పంలో ప్రజాశాంతి తరఫున టీడీపీ కార్యకర్త నామినేషన్
సాక్షి, కుప్పం: సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ తరఫున టీడీపీ కార్యకర్త నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఆఖరి రోజైన సోమవారం మధ్యాహ్నం 2:40 గంటలకు టీడీపీ నేతలు హఠాత్తుగా ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేయడంలో గల ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జనసంద్రాన్ని చూసి టీడీపీ నేతల్లో గుబులు పుట్టుకుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల గుర్తు హెలీకాఫ్టర్. ఈ గుర్తు వైఎస్సార్సీపీ పార్టీ గుర్తైన ఫ్యానుకు సామీప్యంగా ఉంటుంది. దీంతో ఓటర్లును అయోమయానికి గురిచేయాలన్న ఉద్దేశంతో ప్రజాశాంతి పార్టీ తరఫున టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాను గుర్తుకు వచ్చే ఓట్లను హెలీకాఫ్టర్ గుర్తుకు మళ్లించాలనే ఉద్దేశంతోనే ఈ పనికి పూనుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాలకుమార్ టీడీపీకి పూర్తిస్థాయి కార్యకర్త. ఈయనకు ధరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసిన న్యాయవాది, చంద్రబాబు నామినేషన్‌ను సరిచూసిన న్యాయవాది ఒక్కరే కావడం గమనార్హం. అంతేకాక పార్టీ అభ్యర్థిని ప్రతిపాదించినది కూడా శాంతిపురం మండలానికి చెందిన టీడీపీ నాయకులే. కుప్పం ప్రజలు ఫ్యాన్‌పై మొగ్గు చూపుతుండటంతో, వీరిని తప్పుదోవ పట్టించడానికి హెలికాఫ్టర్ గుర్తు కూడా బ్యాలెట్‌పై ఉంటే కొన్ని ఓట్లయిన తగ్గించవచ్చనే ఉద్దేశంతో టీడీపీ నాయకులే దగ్గరుండి నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కుప్పం నియోజకవర్గం
-
తుంబలిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారం
-
హై‘టెక్కు’ బాబూ.. కోతలు చాలించు!
అనంతపురం, రాయదుర్గం: ఆర్థిక లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న హై..టెక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల దుస్థితికి ఈ శ్రమజీవులే నిదర్శనమని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సొంతపనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లిన ఆయన అక్కడ కూలి పనులు చేస్తున్న కొంతమందిని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయన్నారు. వృద్ధాప్యం మీద పడుతున్న ఇద్దరు కూలీలు లక్ష్మయ్య, వెంకటాపురం వెంకటేశులు మాట్లాడుతూ తమది కుప్పం నియోజకవర్గమని చెప్పారన్నారు. వందలాది మంది కుప్పం నుంచి వలస వచ్చి దుర్భరమైన జీవితం గడుపుతున్నట్లు వాపోయారన్నారు. కరువును తరిమికొడతామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రజలనే రాష్ట్రం నుంచి తరిమి కొడుతున్నారని కాపు విమర్శించారు. చీమ చిటుక్కుమన్నా కంప్యూటర్ కోర్ డ్యాష్ బోర్డులో తనకు తెలిసిపోతుందని డప్పు కొట్టుకునే డబ్బా ముఖ్యమంత్రికి.. తన నియోజకవర్గంలోని వలసలు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. -
చంద్రబాబు ఇలాకాలో.. స్వైన్‌ఫ్లూ కలకలం
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృభిస్తోంది. గత వారం రోజులుగా స్వైన్‌ఫ్లూ బారిన పడి పలువురు మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. ఆరేళ్ల చిన్నారికి స్వైన్‌ఫ్లూ సోకినట్టుగా ఆదివారం వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆ పాపను కర్ణాటకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడంతో కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు భయాందోళ చెందుతున్నారు. దీంతో వైద్యులు కుప్పం, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం, వి కోట మండలాల్లో స్వైన్‌ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. -
వైఎస్సార్ సీపీలోకి 100 మంది టీడీపీ నాయకులు
రామకుప్పం : ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైఎస్సార్ సీపీలో చేరవచ్చునని ఆ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంను వదిలి తన స్వంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి పోటీ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవీ డిమాండ్ చేశారు. ఆదివారం వీర్నమలలో జరిగిన సభకు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి జీవితం అబద్ధాల పుట్టని విమర్శించారు. స్వంత నియోజక వర్గంలో గెలవలేకనే కుప్పం ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రవి నాయక్, చిన్నరాజు నాయక్, మోహన్ నాయక్, భాస్కర్ నాయక్, కుమార్, గోవిందప్ప, నారాయణస్వామి, బరకత్, రామేగౌడు, మునెమ్మ, ఇంద్రప్ప, మునెప్ప, గంగయ్య, సిద్ధప్ప, మురళి, అప్పి తదితరులు పాల్గొన్నారు. -
కాలువా.. కష్టాలు కనవా!
హంద్రీనీవా పనులకు భూములిచ్చిన రైతులు ►నష్టపరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూపులు ►కాళ్లరిగేలా తిరిగినా కనికరించని అధికారులు ► ఉపాధి కోసం పిల్లాపాపలతో పయనం ►8 గ్రామాల్లో జాడ లేని జనం ► ముఖం చాటేస్తున్న ఎస్వో కుప్పం నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. హంద్రీనీవా కాల్వ రాకతో భూములు కోల్పోయిన వీరు ఇప్పుడు ఉపా««ధి కూడా కోల్పోయారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలకు పరుగు తీస్తున్నారు. సాగు, తాగు నీరందించే కాలువ దగ్గరకొచ్చిందని సంబర పడాలో... లేక..నిలువ నీడ కరువై గూడు చెదిరి బతుకు దెరువు కోసం వలసలు వెళ్లాలో అర్థం కాక ఈ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎనిమిది గ్రామాల్లో 80 శాతం జనం ఊళ్లు వదిలి వలస వెళ్లారు. ఉన్నకొద్ది మందీ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. నేడో, రేపో నష్టపరిహారం చేతికందుతుందని నిరీక్షిస్తున్నారు. తిరుపతి/ కుప్పం : హంద్రీనీవా సుజల స్రవంతి పనుల్లో భాగంగా ప్రభుత్వం ఏడాది కిందట పేజ్–2 పనులు చేపట్టింది. ఇందులో భాగంగా పుంగనూరు బ్రాంచి కాల్వ నుంచి కుప్పం బ్రాంచి కాల్వ నిర్మా ణ పనులు చేపట్టింది. పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లి గ్రామం దగ్గరున్న పుంగనూరు బ్రాంచి కాల్వ 207వ కిలోమీటరు ఆఫ్‌టెక్ నుంచి ఈ కాల్వ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. 143 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ కాల్వ పెదపంజాణి, గంగవరం, బైరెడ్డిపల్లి, వీ. కోట, రామకుప్పం, శాంతిపురం, గుడు పల్లి, కుప్పం మండలాల పరిధిలోని 4.03 లక్షల మంది జనాభాకు తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యంగా నిర్ధేశించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 8 గ్రామాల పక్కనుండే 1,048 ఎకరాలను కాల్వ కోసం భూసేకరణ జరిపారు. ఏడాది నుంచి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 63 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ 45 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఎకరాకు కనిష్టంగా రూ.6 లక్షలు.. కాల్వ పనుల కోసం ఏడాది కిందటే ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసింది. కుప్పం,రామకుప్పం,గుడుపల్లి, శాంతిపు రం మండలాలకు చెందిన 307 మంది రైతులకు ఎకరానికి రూ.6 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. భూములైతే తీసుకున్న సర్కారు నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ఉదాసీనత కనబరుస్తోంది. ఇక్కడున్న కుప్పం ప్రత్యేక అధికారి (కడా) శ్యాం ప్రసాద్ రైతులకు అందుబాటులో ఉండకుండా, ఒకవేళ ఉన్నా సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ‘మదనపల్లె రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించండనే సమాధానమే శ్యాం ప్రసాద్ నుంచి ఎదురవుతోందంటున్నారు. నష్టపరిహారం అందుతుందో లేదోనన్న గుబులుతో పలువురు రైతులు అనారోగ్యానికి గురవుతున్నారు. పొలాలు పోయి.. గ్రామాలు ఖాళీ కాల్వ నిర్మాణం కోసం రైతుల పొలాలను తీసుకోవడమే కాకుండా వాటి పక్కనే ఉన్న కొద్దిపాటి మిగులు భూముల్లో కాల్వను తవ్వగా వచ్చిన మట్టి, ఇతర వ్యర్థాలను వేయడంతో రైతులకు సాగు చేసే భూములే లేకుండా పోయాయి. దీంతో జబ్జిగానిపల్లె, జోగిసలార్ల పల్లి, వడ్డిపల్లి, బిజ్జిగానిపల్లి, సీబండపల్లి, పెద్దవంక, 64 పెద్దూరు గ్రామా లు ఒక్కొక్కటీ ఖాళీ అవుతున్నాయి. కుప్పం మండలంలోని పది గ్రామాలకు చెందిన రైతులు సాగు చేసుకునే 99.57 ఎకరాల భూములు తీసుకున్నారు. 187 మంది రైతులకు రూ.5.79 కోట్ల నష్టపరిహారం అందాల్సి ఉంది. గుడుపల్లె మండలంలోని 173.46 ఎకరాలకు నష్టపరిహారం అందాల్సి ఉంది. రామకుప్పం మండలంలో 336 ఎకరాలకు 646మంది రైతుల పొలాలు హంద్రీ–నీవాకు తీసుకున్నారు. శాంతిపురం మండలంలోని 416 ఎకరాలను 720 మంది రైతుల నుంచి తీసుకున్నారు. ఇప్పటివరకుఏ పరిహారం అందలేదు. కొంతమందికి ఇచ్చామని అధికారులు చెబుతున్నా ఎవరికిచ్చారనే విషయం స్పష్టం చేయడం లేదు. -
పోస్టుల భర్తీకి పురిటినొప్పులు
సీహెచ్‌సీల్లో వేధిస్తున్న వైద్యుల కొరత వైద్యవిధాన ఆసుపత్రుల్లో భారీగా ఖాళీలు పడిపోతున్న ప్రసూతి సూచీలు అన్నీ తెలిసి చోద్యం చూస్తున్న ప్రభుత్వం ‘‘ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రి. ఒకప్పుడు ఏటా 2400 వరకు ఈ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రసవాల సంఖ్య 30 శాతం పడిపోయింది. కారణం ఇక్కడ రెండేళ్లుగా సివిల్ సర్జన్, ఫిజీషియన్, ఈఎన్టీలు లేరు. దీంతో ఇక్కడి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.’’ చిత్తూరు (అర్బన్):జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో ఖాళీ కుర్చీల రాజ్యమేలుతోంది. జిల్లా ఆసుపత్రి మినహా మిగిలిన సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడిగా వైద్యుల పోస్టులు భర్తీ కావడంలేదు. దీనికి తోడు ఇటీవల పీజీ విద్యను అభ్యసించడానికి చాలా మంది వైద్యులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత,శిశు మరణాలను అరికట్టి ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడటానికి ఏర్పాటు చేసిన వైద్యకేంద్రాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఖాళీలే ఖాళీలు... వాయల్పాడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనస్తీషియన్ (శస్త్ర చికిత్స సమయంలో మత్తుకుప్పం ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫిజీషియన్, ఈఎన్టీలతో పాటు సివిల్ సర్జన్ పోస్టులు మూడేళ్లుగా భర్తీకి నోచుకోలేదు. చిన్నగొట్టిగల్లు సీహెచ్‌సీలో గైనకాలజిస్టు, అనస్తీషియన్, జనరల్ మెడిసిన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడున్న వైద్యుల్లో కొందరు పీజీ అభ్యసించడానికి వెళ్ళిపోయారు. ఫలితంగా గత ఏడాది 600 కాన్పులు ఇక్కడ జరగాల్సి ఉండగా కేవలం 117తో సరిపెట్టాల్సి వచ్చింది. పుంగనూరులో అనస్తీషియన్, చిన్నపిల్లల వైద్యులు లేరు. కలికిరిలోనూ చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్టు లేరు. ఈ రెండు ఆసుపత్రుల్లో అయిదేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీలేరులో ఏడాదిగా సివిల్ సర్జన్ లేకపోవడంతో శస్త్రచికిత్సల పడిపోయాయి. పలమనేరులో సివిల్ సర్జన్ అనస్తీషయన్, గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీవీవీపీలో ప్రసవాలు ఇలా... జిల్లాలోని వైద్య విధాన ఆసుపత్రుల్లో గత అయిదేళ్లలో కాన్పుల సంఖ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడుతోంది. వైద్యులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మినహా ఇతర ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పరిశీలిస్తే... సంవత్సరం కాన్పుల లక్ష్యం జరిగిన కాన్పులు 2011-12 12,775 9,658 2012-13 16,200 11,141 2013-14 16,200 12,936 2014-15 16,200 13,001 2015-16 17,280 12,559 -
పాలకుల పాపం కంగుందికి శాపం
దుర్భర జీవనం గడుపుతున్న ప్రజలు నాటి పాలకుల తప్పిదాలు.. నేటి ప్రజాప్రతినిధులు, మండల అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామాల పాలిట శాపంగా మారింది. ఉన్నది తమిళనాడులో.. పాలన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో. దీంతో ఆ ఊర్లలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలంటే ఏమిటో తెలియ దు. ఆ పల్లెలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. విద్య కరువు. అరకొరగా చదివిన వారికి స్థానికత సమస్య. చివరకు వారిలో 95 శాతం మందికి తెలుగు రాదు. ఇదీ కుప్పం నియోజకవర్గంలోని కంగుంది పంచాయతీ దుస్థితి. కుప్పంరూరల్: కుప్పం నియోజకవర్గంలోని రిజర్వ్ ఫారెస్టు వెనుక తమిళనాడు సరిహద్దులో కంగుంది పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలో బ్రహ్మదేవరచేన్లు, తరగవాని మూల, వెంకటరాపురం, గొల్లపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ పల్లెల్లో సుమారు 2500 మంది జనాభా ఉంది. ఈ ఊర్లు తమిళనాడుకు ఆనుకుని, ఆంధ్రాకు విసిరేసినట్లు దూరంగా ఉన్నా యి. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రేషన్, పింఛన్లు తదితర సౌకర్యాలు అందడం లేదు. మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పాల కులు, అధికారులు చేసిన తప్పిదాలతోనే ఈ నాలుగు గ్రా మాల ప్రజలను అష్టకష్టాలు పడుతున్నారు. అప్పుట్లో ఈ గ్రామాలు తమిళనాడులోనే కలిపి ఉంటే నేడీ సమస్యలు వచ్చేవి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రానికి 45 కిలో మీటర్ల దూరం కంగుంది పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన కుప్పం పట్టణానికి రావాలంటే 25 కిలో మీటర్ల దూరం తమిళనాడులో ప్రయాణించిన అనంతరం అక్కడ బస్సు మారి మరో 20 కిలో మీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంది. కంగుంది రిజర్వు ఫారెస్టు వెనుక తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఇంత దూరం ప్రయాణం తప్పడం లేదు. గతంలో బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ రోడ్డు సక్రమంగా లేకపోవడం, కలెక్షన్ల పేరిట సర్వీసు రద్దు చేశారు. మండల కేంద్రం రావాలంటే తమిళనాడు బస్సులు, ఆటోలే శరణ్యం. ఒక వ్యక్తి బ్రహ్మదేవరచేన్లు నుంచి కుప్పం రావాలంటే రూ. 60 నుంచి 70 రూపాయలు వెచ్చించాల్సి ఉంది. వెక్కిరిస్తున్న ప్రభుత్వ పథకాలు నిరక్ష్యరాస్యులు, కూలీలే అధికంగా ఉన్న ఈ గ్రామాలకు సంవత్సరానికి ఒక మారు అయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. విద్యుత్ రీడింగ్‌ల కోసం ఒక రెస్కో లైన్మెన్ మాత్రం నెల మొదటి వారంలో ఒక రోజు వెళుతుంటాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ పథకాలైన పెన్షన్లు, రేషన్‌కార్డులు, పాసుపుస్తకాలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు ఒక్కటేమిటి ప్రతీది ఈ గ్రామాల ప్రజలకు అందక వెక్కిరిస్తున్నాయి. బీసీ, ఎస్సీ, కాపు లోన్లు అంటే ఏమిటవని ప్రశ్నిస్తున్నారు. పారిశుద్ధ్యం విషయానికి వస్తే గ్రామాల్లో ఎక్కడా కాలువలు, సిమెంట్ రోడ్లు గానీ లేకపోవడంతో వీధుల్లో నడవ లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో ఎక్కడ వెతికినా ఒక మరుగుదొడ్డి గానీ, గ్యాస్ ఉన్న ఇల్లు గానీ కనిపించదు. ఉపాధి హామీ పనులు అయితే మొదట్లో ఒకటి రెండు పనులు ఇచ్చారు, ప్రస్తుతం దాని జాడే లేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలు నగరాలకు వలసపోక తప్పడం లేదు. విద్యార్థులను వేధిస్తున్న స్థానికత కంగుంది పంచాయతీలోని నాలుగు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ప్రాథమిక విద్య బ్రహ్మదేవరచేన్లులో అభ్యసించవచ్చు. ఆ తరువాత ఉన్నత పాఠశాల కోసం తమిళనాడులోని నారాయణపురం, కళాశాల చదువులకు వాణియంబాడిని ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడ వారికి స్థానికత సమస్య ఎదురవుతోంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు దొరకని సందర్భాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి నిత్యం 120 మంది విద్యార్థులు నడక దారిన రాకపోకలు సాగిస్తూ చదువులు కొనసాగిస్తున్నారు. చదువులు పూర్తి చేసుకున్న వారికి కూడా వారు ఉపాధి పొందడానికి నాన్‌లోకల్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఎదురవుతుండడంతో కొంత మంది పాఠశాల దశలోనే చదువులు మాన్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు రాయడం, చదవడం, చివరకు 95 శాతం మందికి తెలుగు మాట్లాడడం రాకపోవడం కొసమెరుపు. మా గ్రామాలను తమిళనాడులో కలపండి కుప్పంకు వెళ్లిరావాలంటే బస్సు లు, ఆటోలు అయితే రూ.70, ద్విచక్రవాహనంలో అయితే 120 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదయం బయలుదేరితే తిరిగిరావడానికి సాయంత్రం పడుతుంది. మా ఊళ్ల కు ఏసారు రారు. దయవుంచి మమ్మల్ని తమిళనాడులో కలపండి అదే పదివేలు. -పెరుమాళ్, బ్రహ్మదేవరచేన్లు ఏ ప్రభుత్వ పథకమూ అందదు ఏ ప్రభుత్వ పథకమూ అందడం లేదు. ప్రభుత్వాస్పత్రికి రావాలంటే 45 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంది. రోడ్లు, ఆస్పత్రి నిర్మిస్తే మీకు పుణ్యం ఉంటుంది. - చిన్నతాయి, బ్రహ్మదేవరచేన్లు -
ఆరు నెలల్లో కుప్పంలో ప్రతి ఇంటికీ గ్యాస్
రూ.500 కోట్లతో గుడివంక సుబ్రమణ్యస్వామి ఆలయ అభివృద్ధి ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మిస్తా నియోజకవర్గంలోనాలుగు కోల్డ్ స్టోరేజీలు కుప్పాన్ని దేశంలో నంబర్ వన్ చేస్తా గుడివంక సభలో సీఎం చంద్రబాబు చిత్తూరు:రాబోయే ఆరు నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం గుడుపల్లె మండలం గుడివంకలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో ఇంకా 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ గ్యాస్ అందిస్తామన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్లను నిర్మిస్తామన్నా రు. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలు చెల్లిస్తుందన్నారు. టమాటాతో పాటు రైతులు పండించే ఇతర కాయగూరలు నిల్వ ఉంచుకునేందుకు నాలుగు మండలాల్లో ఒక్కో కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామన్నారు. అలాగే టమాట జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్నారు. పోటాటో (బంగాళాదుంప) చిప్స్ పరిశ్రమ కోసం పెప్సీ కంపెనీతో మాట్లాడుతున్నట్లు సీఎం వెల్లడించారు. రూ.300 కోట్లతో పలమనేరు-కృష్ణగిరి రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. వాడియంబాడీ వయా వి.కోట రోడ్డు సైతం నిర్మిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గం నుంచి విదేశాలకు 20 వేల మందికి పైగా వెళ్తున్నారని, అందరి సౌకర్యం దృష్ట్యా విమానాశ్రయాన్ని నిర్మించి కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తానని సీఎం చెప్పారు. అలాగే గుడివంకలోని ఇంటర్ మీడియట్ కాలేజీకి పూర్తిస్థాయిలో కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ అతిథి గృహాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.500 కోట్లతో 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడివంక సుబ్రమణ్యస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్కులు, రిసార్ట్స్ నిర్మిస్తామన్నారు. గుడుపల్లెలో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు కుప్పం అభివృద్ధికి అహర్నిశలు పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జడ్పీ చైర్‌పర్శన్ గీర్వాణీ, చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జడ్పీ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయకుమార్‌లతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. హంద్రీ-నీవా పనుల వేగవంతం కోసం సీయం సమీక్ష జిల్లాలో హాంద్రీ-నీవా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కుప్పం ఆర్అండ్బీ అతిథి భవనంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమతో పాటు పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. పనుల పురోగతిపై సమీక్షించారు. త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ కంపెనీకి ప్రతినిధులకు, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. -
నీళ్లే లేవు-విమానమేల?
* బీళ్లుగా మారిన పంట పొలాలు * కుప్పంలో పనుల్లేక వలసపోతున్న జనం * ఎయిర్పోర్ట్ ఏర్పాట్లలో అధికారులు బిజీ * సర్వేల కోసం నిధులు ఖర్చుపెడుతున్న వైనం కుప్పం: సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. సమస్య పరిష్కరించి వారికి అండగా నిలవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు, అధికార యంత్రాంగం విమానాశ్రయ ఏర్పాటు పనుల్లో నిమగ్నం కావడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే వర్షాలు లేక పనులు దొరక్క వేలాది కుటుంబాలు వలసబాట పట్టాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గుక్కెడు నీళ్లిచ్చి, పనులు కల్పించి బతుకుదారి చూపుతారనే ఆశతో కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు. సర్వేల కోసం నిధుల మంజూరు కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ స్థలం సర్వే చేసేందుకు రూ.14 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రామకుప్పం మండలం అమ్మేరుపేట, కీలకపాడు గ్రామాలకు సంబంధించిన స్థలాలను ఎంపిక చేశారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారుల రికార్డుల మేరకు 210 గ్రావూల్లో నీటిసవుస్య తీవ్రంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నాలుగేళ్లుగా వర్షాలు పడకపోవడంతో కుప్పం కరువు కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గంలోని 570 చెరువులు పూర్తిగా ఎండిపోయూయి. కుప్పంలో 2.55 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 21 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు లేక 80 శాతం భూములు బీళ్లుగా మారాయి. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో నీళ్లు కావాలంటే 1250-1500 అడుగుల లోతు వరకు బోరు వేయాల్సిందే. కూలి పనుల కోసం నిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు 18 వేల వుంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో వివూనాశ్రయూలు నిర్మించే పనిలో పడింది. రెండు గ్రామాలు ఖాళీ విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన స్థలం వల్ల రెండు గ్రావూల ప్రజల జీవితాలు కష్టాల్లో పడనున్నాయి. 30 ఏళ్ల క్రితం బడుగు, బలహీన వర్గాల కోసం అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుతో భూములను స్వాధీనం చేసుకోనుంది. విమానాశ్రయం అవసరమా? కుప్పం ప్రాంతంలో పండుతున్న పంటలను ఎగుమతి చేసేందుకు డెమో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం కుప్పం లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులంతా వ్యవసాయుం వదలి పనుల కోసం పట్టణాలకు తరలి వెళుతున్నారు. వ్యవసాయు బోర్లు ఎండిపోయాయి. నీటి సౌకర్యంపై దృష్టి పెట్టకుండా విమానాశ్రయం అవసరమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
చంద్రబాబు నియోజకవర్గంలో ఆకలి చావు
తిండిలేక నీరసించి వృద్ధుడి కన్నుమూత గుడుపల్లె: ఆదరవుగా ఉన్న పింఛను నాలుగు నెలలుగా అందడం లేదు. వారం నుంచి ఆకలికి తాళలేని ఓ వృద్ధుడు శుక్రవారం తనువు చాలించాడు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం కనమనపల్లెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కనమనపల్లెకు చెందిన ముష్టపల్లె మునెప్ప (76)ను పదేళ్ల క్రితం ఆయన భార్య వదిలి వెళ్లింది. ఒక్కగానొక్క కుమారుడు మద్యానికి బానిసై ఎటో వెళ్లిపోయాడు. ఎనిమిదేళ్లుగా వస్తున్న పింఛన్‌తో కాలం గడుపుతున్నాడు. మతిస్థితిమితం లేని మనమరాలు రోజా (14)ను పోషిస్తున్నాడు. రేషన్‌కార్డులో వయసు సరిగా లేదని నాలుగు నెలల క్రితం పింఛను నిలిపివేశారు. ఆ తర్వాత ఎవరైనా చుట్టుపక్కల వారు ఏదైనా పెడితే మునెప్ప, ఆయన మనుమరాలు తిని కాలం గడిపేవారు. పింఛన్ కోసం గ్రావు సభలు, కార్యాలయూల చుట్టూ తిరిగాడు. నెల క్రితం వయసు నిర్ధారణ కోసం డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని అధికారులకు అందజేశాడు. ఆ తర్వాత ఇంకా పింఛను రాలేదు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా తిండి లేక ఆకలితో అలమటించాడు. నీరసించి శుక్రవారం మృతి చెందాడు. ఈ సంఘటనపై తహసీల్దారు ముని నారాయణను వివరణ కోరగా మునెప్ప దరఖాస్తును స్వీకరించి జిల్లా ఉన్నతాధికారులకు పంపామన్నారు. ఎంపీడీవో పోస్టు ఖాళీగా ఉండడం వల్ల సమాచారం ఆలస్యంగా వచ్చిందన్నారు. వచ్చే నెలలో ఆయనకు పింఛను వచ్చి ఉండేదని తెలిపారు. -
సీమలో దాహం..దాహం..!
* ప్రమాద ఘంటికలు * వేసవిని తలపిస్తున్న తాగునీటి ఎద్దడి * కనిష్ట స్థాయికి పడిపోయిన భూగర్భ జలమట్టం * బోర్లు ఎండిపోయి నిరుపయోగంగానీటి పథకాలు..! * 1,811 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న దుస్థితి ఈ ఫోటో చూశారా..కుప్పం నియోజకవర్గంలో కుంజేగానూరుకు చెందిన మహిళలు బిందెడు నీళ్ల కోసం పడుతున్న కష్టాలు. రోజూ నాలుగు కి లోమీటర్ల దూరంలోకి వ్యవసాయ బోరు బావినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలో 250కి పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. సీమ వ్యాప్తంగా అధిక శాతం గ్రామాల్లో ఇదే దుస్థితి. మగవాళ్లు వ్యవసాయ పనులకు వెళితే, మహిళలు, పిల్లలు తాగునీటి కోసం మైళ్ల దూరం వెళుతున్నారు. దినమంతా వారు దీని కోసమే అష్టకష్టాలు పడుతున్నారు. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నా అధికారులు మాత్రం ముందుస్తు ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టడంలేదు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష సీమలో తాగునీటి ఎద్దడి అప్పుడే వేసవిని తలపిస్తోంది. వర్షాలులేక భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. బోర్లు ఎండిపోవడంతో రక్షిత నీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఇప్పటికే 1,811 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 1,453 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే 198 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ ప్రాంతమైన రాయలసీమపై వరుణుడు మరో సారి పగబట్టాడు. సాధారణం కన్నా 43.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో సీమలో వరుసగా ఐదో ఏటా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లాలో 18.35 మీటర్లు, అనంతపురంలో 19.12 మీటర్లు, వైఎస్సార్ జిల్లాలో 18.32 మీటర్లు, కర్నూలు జిల్లాలో 16.85 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ప్రస్తుతం ప్రతి నెలా భూగర్భ జలమట్టం పడిపోతూ వస్తోంది. దీంతో వ్యవసాయ బోరు బావులతో పాటు రక్షిత మంచినీటి పథకాల బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దాంతో బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరంలోని వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. * చిత్తూరు జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు ఉన్నాయి. 40 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. జిల్లాలో 1,453 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 212 గ్రామాలకు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే వేసవిలో మరో 1,700 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. * అనంతపురం జిల్లాలో 1,006 పంచాయతీల పరిధిలో 3,385 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి చేరడంతో 60 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. ఇప్పటికే 288 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానూ.. వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. * వైఎస్సార్ జిల్లాలో 818 పంచాయతీల పరిధిలో 4,241 గ్రామాలు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతోండటంతో ఇప్పటికే 35 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. 180 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారానూ.. మరో 92 గ్రామాలకు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తున్నారు. * కర్నూలు జిల్లాలో 898 పంచాయతీల పరిధిలో 1,526 గ్రామాలు ఉన్నాయి. దుర్భిక్షం వల్ల భూగర్భ జలమట్టం పడిపోవడంతో 20 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం 125 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారానూ.. వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తుండటం గమనార్హం. -
‘ఛీ’హెచ్‌సీలు వైద్యం పూజ్యం
సాక్షి, చిత్తూరు: పేదలకు వైద్యసేవలు అందించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అధ్వాన్నంగా ఉన్నారు. అన్ని జబ్బులకు ఒకే మందు అన్నట్లు రెండు మూడు రకాల మాత్రలు ఇచ్చి పంపడం మినహా మరెలాంటి వైద్యసేవలు అందడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ఏఎన్ఎంలే వైద్యం చేస్తున్నారు. మంచాలు కూడా లేక రోగులకు ఆరుబయట ప్రదేశాల్లోనే సెలైన్ ఎక్కించే పరిస్థితి నెలకొంది. వందలాది పీహెచ్‌సీలకు సొంత భవనాలు లేవు. సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరాయి. ఏఎన్ఎంలు లేకపోవడంతో సబ్‌సెంటర్లు మూతపడుతున్నారుు. జిల్లాలో 94 పీహెచ్‌సీలు,644 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వైద్యులతో పాటు సిబ్బంది పోస్టులు 2302 ఉండగా, 1718 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 584 ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలు, ఒక కమ్యూనిటి హెల్త్ సెంటర్ ఉన్నారు. ఆరు డాక్టర్, 11 ఏఎన్ఎం, రెండు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. తంబళ్లపల్లెలో ఎక్స్‌రే యూనిట్ ఆరేళ్లుగా మూతపడి ఉంది. మూడునెలలకొకసారి రూ.1.25 లక్షల మందులు కేటాయించాల్సి ఉన్నా, కేవలం రూ.80 వేల వరకు మాత్రమే మందులను కేటాయిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది పీహెచ్‌సీలు, 56 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. 26 ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడుపల్లె, కుప్పంలలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో ఆరు పీహెచ్సీలో ఉన్నాయి. రేగల్లులో మినహా మిగిలిన పీహెచ్సీలో డాక్టర్లు అందుబాటులో లేరు. కేవీపల్లెలో మూడు డాక్టర్ పోస్టులుంటే ముగ్గురూ లేరు. కలికిరిలో కొత్త భవనం కట్టినా ప్రారంభం కాలేదు. పుంగనూరు నియోజకవర్గంలోని తొమ్మిది పీహెచ్‌సీల్లో డాక్టర్లతో పాటు సిబ్బంది కొరత ఉంది. ఏఎన్ఎంలు లేరు. సదుం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేరు. పులిచెర్లలో నర్సుల కొరత ఉంది. పూతలపట్టు నియోజకవర్గంలోని పి.కొత్తకోట, బంగారుపాళెంల్లో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన పీహెచ్‌సీల్లో ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే విధులకు వస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులోని 100 పడకల ఆస్పత్రితో పాటు ఏడు పీహెచ్‌సీలు ఉన్నాయి. పత్తికొండ పీహెచ్సీలో డాక్టర్ లేరు. ఐదు ఏఎన్ఎం పోస్టు ఖాళీగా ఉన్నాయి. బెరైడ్డిపల్లెలో రెండు పీహెచ్‌సీలకు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎనిమిది పీహెచ్‌సీలు ఉన్నాయి. వెదురుకుప్పం పీహెచ్సీలో వైద్యాధికారి లేరు. పెనుమూరు పీహెచ్సీలో ఇద్దరికి ఒక్కరే ఉన్నారు. జీడీ నెల్లూరులో మూడు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నారుు. చంద్రగిరి నియోజకవర్గలోని ఏడు పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత ఉంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ఏడుగురికి ఇద్దరే ఉన్నారు. నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నారుు. రామచంద్రాపురంలో పది పడకల ఆస్పత్రిలో సరిపడా మంచాలు లేవు. మదనపల్లె నియోజకవర్గంలో ఏడు పీహెచ్‌సీలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ ఆస్పత్రులకు మదనపల్లెకు రిఫర్ చేస్తున్నారు. వైద్యులు సమయపాలన పాటించడం లేదు. రామసముద్రం, నిమ్మనపల్లెలలో ఏఎన్ఎంలు వైద్యం చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. నగరి రూరల్ పీహెచ్సీ సొంత భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. విజయపురంలో ఆరుగురు నర్సుల కొరత ఉంది. నిండ్రలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఫార్మాసిస్టు విధులకు రాకపోవడంతో ఎఎన్ఎంలే మందులిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో రెండు పీహెచ్‌సీలు ఉన్నాయి. సత్యవేడు ఆస్పత్రికి డాక్టర్‌తో పాటు సిబ్బంది లేటుగా వస్తున్నారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. పాండూరు పీహెచ్సీ శిథిలావస్థకు చేరింది. ముగ్గురు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు బీఎన్‌ఆర్‌పేట ప్రాథమిక ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. స్టాఫ్ నర్సు, ఎంహెచ్వో, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఐదు పీహెచ్‌సీలున్నాయి. ఏంపేడు, పాపానాయుడుపేట పీహెచ్‌సీల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. ప్రతి ఒక్కరినీ తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. -
ఏమీ చేయని బాబును నిలదీయండి
కుప్పం నియోజకవర్గ ప్రజలకు షర్మిల పిలుపు 25 సంవత్సరాలుగా కుప్పంలో గెలుస్తున్నాడు.. ఇన్నేళ్లలో కుప్పానికి ఏమి చేశాడని ప్రశ్న తిరుపతి: ‘‘ఒకసారి కాదు.., రెండు సార్లు కాదు. ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా, వుంత్రిగా, వుుఖ్యవుంత్రిగా, ప్రతిపక్ష నాయుకుడిగా ఉన్నావు. అంటే 25 సంవత్సరాలు కుప్పం నుంచి గెలిచావు. ఇన్నేళ్లలో కుప్పానికి ఏమి చేశావు? కనీసం ఒక ప్రభు త్వ డిగ్రీ కాలేజీ తెచ్చావా? పరిశ్రమలు తెచ్చావా? ఉపాధి అవకాశాలు పెంచావా? తాగు నీటి సవుస్య తీర్చావా? ఒక ప్రాజెక్టు కట్టించావా? ఎందుకు మీకు ఓటేయూలి అని చంద్రబాబును నిలదీయుండి’’ అం టూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు జిల్లా ములకలచెరువు, తంబళ్లపల్లె, కుప్పం, వీ కోట, బంగారుపాళ్యంలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో ఆమె వూట్లాడారు. ఆమె ప్రసంగం ఆమె వూటల్లోనే... రైతులు, మహిళలకు ఇచ్చిన రుణాలకు చంద్రబాబు రూపారుు వడ్డీ వసూలు చేస్తే, రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఎంతోవుంది వుహిళలు బ్యాంకుల్లో డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడగలిగారు.ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రవూలను అమలు చేసినా, రాజశేఖరరెడ్డి ఏ ఒక్క చార్జీ పెంచలేదు. ఒక్క రూపారుు ఏ పద్దు పెంచినా ఆ భారం పేదప్రజలపై, అక్కాచెల్లెళ్లపై పడుతుంది. అది నాకిష్టంలేదనేవాడు. వున దురదృష్టంకొద్దీ రాజశేఖరరెడ్డి వెళ్లిపోయూరు. ఆయన రెక్కల కష్టంమీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్లిపోయిన తర్వాత ప్రతి పథకానికీ తూట్లు పొడిచింది. అన్ని చార్జీలు, పన్నులు పెంచింది. పాలకపక్షం ఇష్టానుసారం పనిచేస్తుంటే సపోర్టు చేసినవాడు ప్రధాన ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబు. ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీని నిలదీశాడా? రాజశేఖరరెడ్డిగారిని పులివెందుల ప్రజలు 30 ఏళ్లు గెలిపించారు. అక్కడి ప్రజలను వైఎస్ఆర్ వునస్ఫూర్తిగా గౌరవించారు. అక్కడ పరిశ్రవులు పెట్టారు. వేల వుందికి ఉపాధి కల్పించారు. అవుటర్ రింగ్‌రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రవూలు చేసి పులివెందుల రూపురేఖలు వూర్చారు. ఈ సారి ఓటేసే వుుందు ఆలోచించండి. మీ కోసం ఏదీ చేయుని చంద్రబాబును తిప్పి పంపండి. మీ ఓటును వృథా చేయుకండి. రెండెకరాలతో జీవితం మొదలుపెట్టాడు చంద్రబాబు. ఈ రోజు ఆయనకు, ఆయున కొడుక్కు దేశ విదేశాల్లో ఆస్తులు ఉన్నారుు. ఐఎంజీ అని ఒక బోగస్ సంస్థకు హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలు ఇచ్చాడు. ఎకరా రూ.4 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.50 వేలకు కట్టబెట్టాడు. ఆయున, ఆయున కొడుకు రైతులు, పేదల గురించి ఆలోచించిన పాపానపోలేదు. మీ భవిష్యత్ కలను సాకారం చేసే రాజన్న రాజ్యాన్ని తెచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయుండి. -
కుప్పం బోగస్ ఓట్లపై విచారణ
10లోపు నివేదిక ఇవ్వాలని సబ్‌కలెక్టర్ ఆదేశం కుప్పం, న్యూస్‌లైన్: కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక రూపొందించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ నారాయణగుప్ప తహశీల్దార్లను ఆదేశించారు. 10వ తేదీ లోపు బోగస్, దొంగ ఓట్లపై పూర్తిస్థారుులో సవుగ్ర నివేదికను అందించాలన్నారు. కుప్పంలో 43వేల బోగస్ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సబ్ కలెక్టర్ నారాయణగుప్ప ఆదివారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహశీల్దార్లతో సమావేశమయ్యారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారికి కుప్పంలో అధికంగా ఓట్లు ఉన్నాయుని వస్తున్న ఫిర్యాదులపై పూర్తిస్థారుులో విచారణ జరపాలని సూచించారు.