సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో రెండవరోజూ టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. టీడీపీ కార్యకర్తలు కర్రలు, ఇనుపరాడ్లతో వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మండల పరిషత్ కార్యాలయంపై రాళ్లదాడికి దిగారు. మొదట వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపేసి అనంతరం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. టీడీపీ అల్లరి మూకల దాడిలో మండల పరిషత్ అధ్యక్షురాలు అశ్వినితో పాటు జూనియర్ అసిస్టెంట్ వినయ్‌కి గాయాలయ్యాయి.
టీడీపీ నేతల నుంచి ప్రాణహాని
నన్ను చంపడానికి టీడీపీ గుండాలు వచ్చారని.. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని మండల పరిషత్ అధ్యక్షురాలు అశ్విని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సమక్షంలోనే దాడి జరిగిందని ఎంపీపీ అశ్విని తెలిపారు.
రామకుప్పం: కుప్పం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలం రోజురోజుకూ పుంజుకుంటున్న నేపథ్యంలో జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పచ్చనేతలు దాడులు చేశారు.
చదవండి: (చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం.. కీలక అరెస్టులు)
తొలుత కొంగనపల్లి చంద్రబాబు రోడ్‌షో ప్రారంభించే క్రమంలోనే వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఇళ్ల వద్ద నానా హంగామా చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని దూషిస్తూ వీరంగం సృష్టించారు. దీనిని అడ్డుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు జై జగన్ అంటూ ప్రతి స్పందించారు. దీంతో మూకుమ్మడిగా తెలుగు తమ్ముళ్లు ఆ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. మహిళలు అడ్డుపడినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా వెంబడించి కొట్టారు. అయితే పోలీసులు రంగ ప్రవేశంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అనంతరం చంద్రబాబు రోడ్‌షో చెల్లిగానిపల్లి వరకు చేరుకుంది. అక్కడా తమ్ముళ్లు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ జెండా, బ్యానర్లను పీకేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు వారిని అడ్డుకున్నారు.
అదునుకోసం వేచి చూస్తున్న తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పింది. పచ్చనేతలు ఒక వైపు సీఎం డౌన్ డౌన్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీనికి ప్రతి స్పందనగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి చేయి దాటి పోయింది. ముందుగా టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు.
ఈ రాళ్ల దాడిలో కొంగనపల్లికి చెందిన భయ్యారెడ్డికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇతనితోపాటు వాణి రెండేళ్ల చిన్నారి గాయపడింది. ఇదంతా శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజల్లో సానుభూతి పొందాలనే డీటీపీ ఈ కుట్రకు పాల్పడిందనే వాదనలు గట్టిగా వినిపించాయి. కుప్పంలో డీటీపీ నేతలు టార్గెట్ చేసి వైఎస్సార్‌సీపీపై దాడులు చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment