ఏమీ చేయని బాబును నిలదీయండి | babu does nothing in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏమీ చేయని బాబును నిలదీయండి

Published Mon, Apr 28 2014 1:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM

ఏమీ చేయని బాబును నిలదీయండి - Sakshi

ఏమీ చేయని బాబును నిలదీయండి

కుప్పం నియోజకవర్గ ప్రజలకు షర్మిల పిలుపు
25 సంవత్సరాలుగా కుప్పంలో గెలుస్తున్నాడు.. ఇన్నేళ్లలో కుప్పానికి ఏమి చేశాడని ప్రశ్న

 
తిరుపతి: ‘‘ఒకసారి కాదు.., రెండు సార్లు కాదు. ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా, వుంత్రిగా, వుుఖ్యవుంత్రిగా, ప్రతిపక్ష నాయుకుడిగా ఉన్నావు. అంటే 25 సంవత్సరాలు కుప్పం నుంచి గెలిచావు. ఇన్నేళ్లలో కుప్పానికి ఏమి చేశావు? కనీసం ఒక ప్రభు త్వ డిగ్రీ కాలేజీ తెచ్చావా? పరిశ్రమలు తెచ్చావా? ఉపాధి అవకాశాలు పెంచావా? తాగు నీటి సవుస్య తీర్చావా? ఒక ప్రాజెక్టు కట్టించావా? ఎందుకు మీకు ఓటేయూలి అని చంద్రబాబును నిలదీయుండి’’ అం టూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు జిల్లా ములకలచెరువు, తంబళ్లపల్లె, కుప్పం, వీ కోట, బంగారుపాళ్యంలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో ఆమె వూట్లాడారు. ఆమె ప్రసంగం ఆమె వూటల్లోనే...
 రైతులు, మహిళలకు ఇచ్చిన రుణాలకు చంద్రబాబు రూపారుు వడ్డీ వసూలు చేస్తే, రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఎంతోవుంది వుహిళలు బ్యాంకుల్లో డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడగలిగారు.ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రవూలను అమలు చేసినా, రాజశేఖరరెడ్డి ఏ ఒక్క చార్జీ పెంచలేదు. ఒక్క రూపారుు ఏ పద్దు పెంచినా ఆ భారం పేదప్రజలపై, అక్కాచెల్లెళ్లపై పడుతుంది. అది నాకిష్టంలేదనేవాడు.
 
వున దురదృష్టంకొద్దీ రాజశేఖరరెడ్డి వెళ్లిపోయూరు. ఆయన రెక్కల కష్టంమీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన వెళ్లిపోయిన తర్వాత ప్రతి పథకానికీ తూట్లు పొడిచింది. అన్ని చార్జీలు, పన్నులు పెంచింది. పాలకపక్షం ఇష్టానుసారం పనిచేస్తుంటే సపోర్టు చేసినవాడు ప్రధాన ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబు. ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీని నిలదీశాడా?

 రాజశేఖరరెడ్డిగారిని పులివెందుల ప్రజలు 30 ఏళ్లు గెలిపించారు. అక్కడి ప్రజలను వైఎస్‌ఆర్ వునస్ఫూర్తిగా గౌరవించారు. అక్కడ పరిశ్రవులు పెట్టారు. వేల వుందికి ఉపాధి కల్పించారు. అవుటర్ రింగ్‌రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రవూలు చేసి పులివెందుల రూపురేఖలు వూర్చారు. ఈ సారి ఓటేసే వుుందు ఆలోచించండి. మీ కోసం ఏదీ చేయుని చంద్రబాబును తిప్పి పంపండి. మీ ఓటును వృథా చేయుకండి.

 రెండెకరాలతో జీవితం మొదలుపెట్టాడు చంద్రబాబు. ఈ రోజు ఆయనకు, ఆయున కొడుక్కు దేశ విదేశాల్లో ఆస్తులు ఉన్నారుు. ఐఎంజీ అని ఒక బోగస్ సంస్థకు హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలు ఇచ్చాడు. ఎకరా రూ.4 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.50 వేలకు కట్టబెట్టాడు. ఆయున, ఆయున కొడుకు రైతులు, పేదల గురించి ఆలోచించిన పాపానపోలేదు. మీ భవిష్యత్ కలను సాకారం చేసే రాజన్న రాజ్యాన్ని తెచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయుండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement