ysr janabheri
-
కాంగ్రెస్‌కు మద్దతు ప్రసక్తే లేదు: వైఎస్సార్ సీపీ
► రాష్ట్ర ప్రయోజనాలే కొలబద్దగా కేంద్రంలో పాత్ర ► తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా వ్యవహరిస్తాం ► చంద్రబాబులా సాగిలబడే తత్వం మాది కాదు ► జాతీయ స్థాయిలో మా విధానం స్పష్టం ► కేంద్రంలో మద్దతుపై వక్రీకరించడం సరికాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వాటిని పట్టుబట్టి సాధించుకుంటామని పేర్కొంది. కేంద్రంలో మోడీ ఉండొచ్చు, మరెవరైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే మద్దతునిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు సత్యదూరమని ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు... ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో పైచేయి సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చునని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి పట్టుబట్టి సాధించుకోవచ్చని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అనేకమార్లు ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. చంద్రబాబులా ఢిల్లీలో సాగిలపడిపోం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తామని పోలింగ్ ముగిసిన తరువాత పులివెందులలో జరిగిన పత్రికా సమావేశంలోనూ విస్పష్టంగా ప్రకటించారు. ► చంద్రబాబు రాష్ట్రంలో మోడీని చూపి ఓట్లు అడగ్గా జగన్మోహన్రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతామంటూ ప్రజా మద్దతు కోరిన విషయం అందరికీ తెలుసు. ఈ అంశాలను పట్టించుకోకుండా ఆంగ్ల మీడియా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై తోచిన రీతిలో కల్పితాలతో కథనాలు ఇవ్వడం సమంజసం కాదు. ► రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. 25 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికగా మా మద్దతు మోడీకా, మల్లయ్యకా, ఎల్లయ్యకా అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్మోహన్రెడ్డి పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ప్రజల్లో భయాందోళనలు, సందిగ్ధతను సృష్టిం చేందుకు పార్టీ వైఖరిని వక్రీకరిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలి. జగన్‌ను కలిసిన పార్టీ నేతలు పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, బాలశౌరి తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పోలింగ్ సరళి గురించి వారు పార్టీ అధినేతకు వివరించారు. -
వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రచారం
-
చేతులెత్తేసిన బాలయ్య
జగన్ ‘జనభేరి’కి పోటెత్తిన జనం ఉదయం నుంచే హిందూపురం వీధులన్నీ కిటకిట జన ప్రభంజనాన్ని చూసి బయటకు రాని బాలకృష్ణ సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు రెండ్రోజుల ముందే నందమూరి నటసింహం చేతులెత్తేసింది. ‘జనభేరి’కి పోటెత్తిన జనాన్ని చూసి కనీసం బయటకు వచ్చే సాహసం కూడా చేయలేదు. ఇప్పటికే పార్టీ నేతల గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య.. జగన్ ప్రభంజనం ముందు వెలవెలబోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం హిందూపురం వచ్చారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం బహిరంగ సభ ఉంటుందని తెలియడంతో ఉదయం నుంచి పుర వీధులన్నీ కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడాయి. ఈ జన ప్రభంజనాన్ని చూసి హిందూపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు ముచ్చెమటలు పట్టాయి. కనీసం పట్టణంలో ప్రచారం చేసే సాహసం చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తుండడంతో బాలయ్య ప్రచారానికి స్పందన కరువైంది. ప్రచారానికి వెళ్తున్నా ప్రతి రోజూ ఓటర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ‘జనభేరి’కి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి ఇక తాను ప్రచారానికి వెళ్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని గ్రహించి ప్రచారానికి ఆఖరి రోజని తెలిసినా వెళ్లలేదు. ప్రచారం చేయలేదనే సంకేతాలు బయటకు వెళ్తే బగోదని చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. జన స్పందన కన్పించకపోవడంతో తిరుగు ముఖం పట్టారు. పట్టణంలోని మురికివాడల్లో బాలయ్య సతీమణి వసుంధరా దేవి, కుటుంబ సభ్యులు ఉదయం మాత్రమే ప్రచారం చేసి ఆ తర్వాత కన్పించలేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్లారు. ఎక్కడకు వెళ్లిన ఆయన్ను ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ఉంటున్న నాయకుడికే పట్టం కడతామని ఓటర్లు స్పష్టం చేస్తుండడంతో బాలయ్య గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక గ్రూపుల వారీగా తెలుగుదేశం పార్టీ నేతలు విడిపోవడం కూడా బాలయ్యకు తలనొప్పిగా మారింది. పైగా ఆయనపై స్థానికేతరుడి ముద్ర ఉండడంతో ఈ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ‘జనభేరి’ సభ అనుకున్న సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా జరిగినా ఒక్కరు కూడా పక్కకు వెళ్లకుండా జగన్ రాకకోసం ఎదురు చూశారు. ‘అన్నీ ఉచితంగా ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అమలు చేయలేదో మీకు ఓట్లు అడిగేందుకు వస్తున్న బాలకృష్ణను నిలదీయండి’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో ప్రజలకు సూచించారు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచివాడు అయిన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డిని, గట్టివాడయిన హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. జగన్ ప్రసంగం సాగుతున్నంత సేపు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఈలలు, కేకలు వేశారు. చివరి రోజూ బాలయ్య చిందులు చివరి రోజు ప్రచారంలో కూడా బాలయ్య అభిమానులపై చిర్రుబుర్రలాడారు. బ్రహ్మేశ్వరంపల్లిలో జనం ఎవరూ కనిపించక పోవడంతో నాయకులందరూ ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పూలదండ వేసేందుకు ప్రచార రథం వద్దకు రాగా.. నీ దండ అక్కర లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుచన్నంపల్లి వద్ద రోడ్ షో ముగించుకుని ప్రచార రథం నుంచి కారులోకి మారుతుండగా స్థానిక నేతలు పలుకరించేందుకు వె ళ్లగా ‘ఏయ్ వెళ్లండి’ అంటూ బాలయ్య కస్సుబుస్సులాడారు. -
జననేతకు బ్రహ్మరథం
జిల్లాలో ఆరు రోజులు 10 నియోజకవర్గాల్లో పర్యటన ప్రతిచోటా వెల్లువెత్తిన అభిమానం జనం కష్టాలు విని... కన్నీళ్లు తుడిచిన జగన్ రాజన్య రాజ్యంతో బాధలుండవని భరోసా పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : మండటెండల్ని సైతం లెక్కచేయలేదు. చిమ్మచీకటికి వెనకాడలేదు. రాజన్న బిడ్డను చూసేందుకు, తమ కష్టాలు చెప్పుకొనేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తామని చాటిచెప్పారు. గత నెల 29న జిల్లాలోని గన్నవరంలో ప్రారంభమైన జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జనభేరి ప్రచార యాత్ర ఆదివారం రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో ముగిసింది. ఆరు రోజులపాటు జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన జననేత పది నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, బంటుమిల్లి, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు జనం పోటెత్తారు. ఈ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలలో జగన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. వారి కష్టాలు విన్నారు. బాధలు తెలుసుకున్నారు. నేనున్నా.. భయపడొద్దంటూ భరోసా ఇచ్చారు. కష్టాలు.. కన్నీళ్లు... ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జీవితాలు దుర్భరంగా మారాయని పలు నియోజకవర్గాల్లో జనం ఏకరువు పెట్టారు. కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నామని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక తమ పిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ అందడం లేదని, పింఛన్లు సక్రమంగా రావడం లేదని, మద్యం మహమ్మారి కుటుంబాలను కూల్చేస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. సొంతిల్లు కలగా మారిందని, డ్వాక్రా రుణాలు రావడం లేదని మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. గత పాలకులు వ్యవసాయాన్ని దండగలా మార్చేశారని రైతన్నలు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దక్కడం లేదని యువత ఆవేదన వెలిబుచ్చింది. నేనున్నానని... జనం కష్టాలు విన్న జననేత మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. కొద్దిరోజుల్లో రాజన్య రాజ్యం వస్తోందని, అప్పుడు మీ బాధలు తీరతాయని ఓదార్చారు. ధరల స్థిరీకరణ నిధి, ప్రత్యేక విపత్తు నిధులతో వ్యవసాయాన్ని పండగ చేస్తానని చెప్పారు. రూ.100కే 150 యూనిట్ల కరెంట్ వస్తోందని, ఆరోగ్య సిరులు కురిపిస్తానని, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చెల్లెమ్మలకు, అక్కయ్యలకు కొత్త రుణాలు అందిస్తానన్నారు. అమ్మ ఒడితో పిల్లలందరినీ ఒడికి పంపిస్తానని, బాగా చదివించి డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.200 చొప్పున ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.700కు పెంచుతానని స్పష్టం చేశారు. ఆ మొత్తం ఠంచనుగా అందే ఏర్పాటు చేస్తానన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మద్యం బెల్ట్‌షాపుల్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతానురాగాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు. ప్రత్యర్థులకు హడల్... జిల్లాలో జననేత సుడిగాలి పర్యటన టీడీపీ నాయకుల్ని హడలెత్తించింది. జగన్ సభలకు జనం వెల్లువెత్తడంతో ఇక తమ పని ఖాళీ అవుతుందనే భయం వారిని వెంటాడుతోంది. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలకు మొక్కుబడిగా జనం రావడం, గత నెల విజయవాడలో నిర్వహించిన టీడీపీ మహిళా గర్జన అట్టర్‌ఫ్లాప్ కావడం వంటివాటిపై వారు మధనపడుతున్నారు. జన సునామీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగన్మోహన్రెడ్డి సభల్ని చూసి టీడీపీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. -
చేతులెత్తేసిన బాలయ్య
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు రెండ్రోజుల ముందే నందమూరి నటసింహం చేతులెత్తేసింది. ‘జనభేరి’కి పోటెత్తిన జనాన్ని చూసి కనీసం బయటకు వచ్చే సాహసం కూడా చేయలేదు. ఇప్పటికే పార్టీ నేతల గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య.. జగన్ ప్రభంజనం ముందు వెలవెలబోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం హిందూపురం వచ్చారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం బహిరంగ సభ ఉంటుందని తెలియడంతో ఉదయం నుంచి పుర వీధులన్నీ కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడాయి. ఈ జన ప్రభంజనాన్ని చూసి హిందూపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు ముచ్చెమటలు పట్టాయి. కనీసం పట్టణంలో ప్రచారం చేసే సాహసం చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తుండడంతో బాలయ్య ప్రచారానికి స్పందన కరువైంది. ప్రచారానికి వెళ్తున్నా ప్రతి రోజూ ఓటర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ‘జనభేరి’కి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి ఇక తాను ప్రచారానికి వెళ్తే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని గ్రహించి ప్రచారానికి ఆఖరి రోజని తెలిసినా వెళ్లలేదు. ప్రచారం చేయలేదనే సంకేతాలు బయటకు వెళ్తే బగోదని చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. జన స్పందన కన్పించకపోవడంతో తిరుగు ముఖం పట్టారు. పట్టణంలోని మురికివాడల్లో బాలయ్య సతీమణి వసుంధరా దేవి, కుటుంబ సభ్యులు ఉదయం మాత్రమే ప్రచారం చేసి ఆ తర్వాత కన్పించలేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్లారు. ఎక్కడకు వెళ్లిన ఆయన్ను ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానికంగా ఉంటున్న నాయకుడికే పట్టం కడతామని ఓటర్లు స్పష్టం చేస్తుండడంతో బాలయ్య గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక గ్రూపుల వారీగా తెలుగుదేశం పార్టీ నేతలు విడిపోవడం కూడా బాలయ్యకు తలనొప్పిగా మారింది. పైగా ఆయనపై స్థానికేతరుడి ముద్ర ఉండడంతో ఈ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ‘జనభేరి’ సభ అనుకున్న సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా జరిగినా ఒక్కరు కూడా పక్కకు వెళ్లకుండా జగన్ రాకకోసం ఎదురు చూశారు. ‘అన్నీ ఉచితంగా ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అమలు చేయలేదో మీకు ఓట్లు అడిగేందుకు వస్తున్న బాలకృష్ణను నిలదీయండి’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో ప్రజలకు సూచించారు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచివాడు అయిన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డిని, గట్టివాడయిన హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. జగన్ ప్రసంగం సాగుతున్నంత సేపు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఈలలు, కేకలు వేశారు. చివరి రోజూ బాలయ్య చిందులు చివరి రోజు ప్రచారంలో కూడా బాలయ్య అభిమానులపై చిర్రుబుర్రలాడారు. బ్రహ్మేశ్వరంపల్లిలో జనం ఎవరూ కనిపించక పోవడంతో నాయకులందరూ ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పూలదండ వేసేందుకు ప్రచార రథం వద్దకు రాగా.. నీ దండ అక్కర లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుచన్నంపల్లి వద్ద రోడ్ షో ముగించుకుని ప్రచార రథం నుంచి కారులోకి మారుతుండగా స్థానిక నేతలు పలుకరించేందుకు వె ళ్లగా ‘ఏయ్ వెళ్లండి’ అంటూ బాలయ్య కస్సుబుస్సులాడారు. -
జనసంద్రం
ఊరు ఏదైనా అదే అభిమానం.. ‘అనంత’ ఆప్యాయత. అవ్వలూ.. తాతలూ.. తమ్ముళ్లూ.. అక్కలూ.. అన్నలూ.. స్నేహితులూ అంటూ జననేత నోటి నుంచి ఒక్కో మాట వెలువడుతుంటే అంబరమంటేలా జనతరంగం కేరింతలు.. పోటెత్తిన జనప్రవాహం తమ అభిమాన నేత, ఆత్మబంధువును అక్కున చేర్చుకుని ఘన స్వాగతం పలికింది. మండుటెండను సైతం లెక్కచేయక కనుచూపు మేర రోడ్డు కిరువైపులా బారులు తీరిన జనం చిక్కటి చిరునవ్వుతో ఆత్మీయ నేతకు అండగా ఉంటామంటూ నినదించారు. ‘వైఎస్ఆర్ జనభేరి’లో భాగంగా సోమవారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మడకశిర, హిందూపురంలో పర్యటించారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో ఉప్పొంగిన హిందూపురంలో.. మీ ఓటుతో సువర్ణ యుగానికి నాంది పలకండంటూ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. సాక్షి, అనంతపురం : జనం ఉప్పెనలా కదిలారు. అనుకున్న సమయానికి జననేత చేరుకోకపోయినా ఆయన కోసం ఆతృతగా ఎదురు చూశారు. గంటల తరబడి ఎండను లెక్కచేయలేదు. ఆకలి దప్పిక మరచి రాజన్న తనయుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మడకశిర, హిందూపురానికి రావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఫుల్‌జోష్ కనిపించింది. మడకశిరలో మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏ మాత్రం లెక్క చేయకుండా జగన్ రాక కోసం జనం వేచి చూశారు. వీధులన్నీ జనమయమయ్యాయి. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విశ్వసనీయతకు కట్టుబడి వుండే నాయకున్నే ఎన్నుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరినప్పుడు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలన్నీ తిరిగి అమలు కావాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలంటూ జనం ఆకాంక్షించారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలు దేరి హిందూపురం సభకు హాజరు కావాల్సి వుండగా సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ ఆగిపోవడంతో రోడ్డు మార్గం గుండా వచ్చారు. అప్పటికే మూడు నాలుగు గంటల పాటు వేచి చూచిన అభిమానులు ఆయన రాక కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా తీవ్రమైన ఎండలోనే వుండిపోయారు. ప్రచారం ముగిసే సమయానికి 20 నిమిషాల ముందు జగన్మోహన్రెడ్డి హిందూపురం చేరుకుకునే సరికి పట్టణంలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ‘‘కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నా ఈ ప్రాంతానికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేక పోయారు. వైఎస్ హయాంలో దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు చేసి పీఏబీఆర్ డ్యాం నుంచి తాగునీటిని తీసుకొచ్చి హిందూపురం పట్టణ ప్రజల దాహార్తి తీర్చారు’’ అని వైఎస్ జగన్ గుర్తు చేసినప్పుడు పెద్ద ఎత్తున స్పందన కన్పించింది. నెరవేర్చలేని హామీలు ఇస్తున్న చంద్రబాబును నమ్మొద్దని ఇప్పుడిస్తున్న హామీలను ఆయన హయాంలో ఎందుకు అమలు చేయలేకపోయారో ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలక్రిష్ణ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు నిలదీయండని జగన్ పిలుపునివ్వడంతో జనమంతా కరతాళ ధ్వనులు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రచార సమయం ముగియడంతో హిందూపురం నుంచి తాడిపత్రికి వెళ్లలేకపోయారు. అప్పటికే తాడిపత్రిలో జగన్ రాక కోసం వేలాది మంది సాయంత్రం 7 గంటల వరకు వేచి చూశారు. ఆయన పర్యటన రద్దు అయ్యిందని తెలిసి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు జగన్‌ను చూడకుండానే వెనుదిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెలికాప్టర్ మొరాయించడం వల్ల ఆయన రాలేకపోయారని తెలుసుకుని.. ‘ఆయన రాకపోయినా ఫరవాలేదు.. ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. మొత్తానికి చివరి రోజు వైఎస్ జగన్ పర్యటనతో పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తాడిపత్రిలో పోటెత్తిన జనం జేసీ సోదరుల రాజకీయ కంచుకోటగా భావించే తాడిపత్రిలో జగన్ కోసం జనం పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే జనం రోడ్లపైకి వచ్చి.. ఈలలు.. కేకలు.. నృత్యాలు చేస్తూ.. ప్రచారం హోరెత్తించారు. ఒట్టి పోయిన పెన్నా నదిలో నదీప్రవాహం కనిపిస్తే ఎలా పరవశించి పోతారో అంతకన్నా ఎక్కువగా ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాజన్న తనయుడు జగనన్న వస్తున్నాడని తెలుసుకునిసంబరపడిపోయారు. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా తమ అభిమాన నేత తాడిపత్రికి రాలేకపోయారన్న వార్త అందుకున్న జనం ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. జననేత పంపిన సందేశాన్ని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనంత వెంకట్రామిరెడ్డి, వీఆర్రామిరెడ్డిల ద్వారా విని సంతోషించారు. జగనన్న రాకపోయినా పర్వాలేదు.. ఆయన పంపిన సందేశమే మాకు శిరోధార్యం అంటూ నినదించారు. అయితే జగన్ రాకపోయినా ఆయన కోసం తరలివచ్చిన జనసంద్రాని చూసిన జేసీ సోదరులకు కళ్లు బైర్లు కమ్మి..దిమ్మదిరిగి..మైండ్ బ్లాంక్ అయిపోయినట్లయింది. ఇన్నాళ్లు గెలుపుపై ధీమాతో ఉన్న జేసీ సోదరులు ఇప్పుడు జగన్ సభకు తరలివచ్చిన జనాన్ని చూసి ఇప్పుడేం చేయాలబ్బా..అంటూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది. సభల్లో ఆకట్టుకున్న జగన్ ప్రసంగం ‘‘రాజకీయమంటే ప్రతి పేదవాడి మనసెరగడం.. రాజకీయమంటే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం ఆరాటపడటం.. ఇది నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నిజంగా నాన్న ప్రతి పేదవాడి గురించి అంతగానే పట్టించుకునే వారు. కులం..మతం..ప్రాంతం ఏమీ పట్టించుకోలేదు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి పేదవారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు’’ అంటూ జగన్ వైఎస్సార్ పేరు ప్రస్తావించినపుడల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మీ చల్లని దీవెనలు కావాలి.. ఎలాంటి నాయకత్వానికి ఓటు వేస్తున్నామని మీరే ప్రశ్నించుకోండి అంటూ జగన్ అనగానే మా ఓటు ఫ్యాన్‌గుర్తుకే, కాబోయే సీఎం మీరే అంటూ జనం పెద్ద ఎత్తున స్పందించారు. విశ్వనీయత, విలువలకు పట్టం కట్టేలా జగన్ చేసిన ప్రసంగం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చి ధీమా కల్పించింది. అవ్వా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్ జగన్ ఆయా సభల్లో ప్రసంగాల్లో చివర్లో ‘మనది కొత్తపార్టీ.. అందరికీ మన పార్టీ గుర్తు తెలిసి ఉందో లేదో.. మన పార్టీ గుర్తు తెలిసిన వాళ్లు చేతులు ఎత్తండి’’ అని అనగానే సభికులు అందరూ ఒక్కసారిగా చేతులు పెకైత్తారు. స్పందించిన జగన్ గుర్తు తెలిసిన వారు తెలియని వారికి చెప్పాలని సూచించారు. అవ్వా ఫ్యాన్.. అక్కా ఫ్యాన్.. తమ్ముడూ ఫ్యాన్.. తాతా ఫ్యాన్ అంటూ సీలింగ్ ఫ్యాన్‌ను తిప్పుతూ జగన్ చూపడంతో ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అంటూ సభికులు నినాదాలతో హోరెత్తించారు. -
మీ ఓటుతో రాజన్న రాజ్యం: వైఎస్ జగన్
► ఎన్నికల ప్రచారం ముగింపు సభల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ► బాబు మోడీ కోసం ఓటడుగుతున్నారు.. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటడుగుతున్నాను ► రూ. 1.27 లక్షల కోట్ల రైతు రుణ మాఫీ అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోన్న చంద్రబాబును నిలదీయండి ► ఈ ఎన్నికల్లో విశ్వసనీయత కలిగిన నాయకుడినే సీఎంగా ఎన్నుకోండి ► సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఐదు సంతకాలు, ఆరు పనులతో రాష్ట్ర దశ, దిశ మారుస్తా.. చెప్పినవే కాదు.. చెప్పనివీ చేస్తా సాక్షి ప్రతినిధి, కర్నూలు/అనంతపురం: ‘‘మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మన తలరాతలు మార్చే ఆ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. ఏ నాయకుడైతే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో.. ఏ నాయకుడైతే నిరుపేదల మనసెరిగి ప్రవర్తిస్తాడో.. ఏ నాయకుడైతే చని పోయినా పేదవాడి గుండెల్లో సజీవంగా బతికి ఉండగలడో అలాంటి నాయకుడినే ముఖ్యమంత్రిని చేయండి. అధికారం కోసం పచ్చి అబద్ధాలు చెప్పే.. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చే చంద్రబాబును తరిమితరిమి కొట్టండి.. మీకు నేను చేసే విజ్ఞాపన ఒక్కటే. విశ్వసనీయతకు ఓటేయండి.. వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుం దాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు సోమవారం ఆయన కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లా మడకశిర, హిందూపురంలో రోడ్ షో నిర్వహించి ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు.. దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు ఎందరో ముఖ్యమంత్రులు పనిచేశారు. ఆ నేత వెళ్లిపోయిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ.. ఇప్పటికీ కూడా వైఎస్ ఎక్కడ ఉన్నా రు అంటే ప్రజలు నేరుగా కుడిచేతిని తమ గుండెలవైపు తీసుకెళ్లి.. మా గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నారని చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా నాకు ఏమైనా వచ్చిందంటే అది ఒక్క విశ్వసనీయతే. వైఎస్ వెళ్లిపోయాక ఈ వ్యవస్థ చెడిపోయింది. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక మనిషిని లేకుండా చేయాలనుకున్నారు, ఒక పార్టీని లేకుండా చేయాలనుకున్నారు, ఒక మనిషిని జైలుకు పంపారు, రాష్ట్రాన్ని చీల్చడానికీ వెనుకాడలేదు. చంద్రబాబూ ఆ తొమ్మిదేళ్లూ ఎందుకు చేయలేదు? చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేసిన పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు అధికారం కోసం అది ఫ్రీగా ఇస్తా.. ఇది ఫ్రీగా ఇస్తా అంటూ మీ ముందుకొస్తున్నాడు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానని చెబుతోన్న హామీల్లో ఏ ఒక్కటైనా తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేకపోయావు అంటూ చంద్రబాబును గట్టిగా నిలదీయండి. నీ భయానక పాలనలో అధిక ఫీజులు చెల్లించలేక.. చదువుకోవడానికి అవస్థలు పడుతున్న విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఏ ఒక్క రోజైనా ఆ విద్యార్థుల దగ్గరకు వెళ్లి మాట్లాడావా?కేన్సర్, గుండెపోటు, ప్రమాదాలకు గురైన వారు మెరుగైన చికిత్సలు చేయించుకోవాలంటే రూ.2 నుంచి రూ.3 లక్షలు వెచ్చించా ల్సి వస్తే.. ఆ పేద ప్రజలు ఆ మొత్తాన్ని రూ.3 నుంచి రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చి చికిత్స చేయించుకున్న దుస్థితిపై ఏనాడైనా ఆరా తీశావా చంద్రబాబూ..? తొమ్మిదేళ్లలో రైతుల రుణమాఫీ గుర్తుకు రాలేదా? ఉచిత విద్యుత్ గుర్తుకురాలేదా? ఆ తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియాలా ఎందుకు చేయలేదు? ఓట్ల కోసం, సీట్ల కోసం ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయా? అని చంద్రబాబును నిలదీయండి. రుణ మాఫీపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు.. రుణమాఫీ.. ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ.1.27లక్షల కోట్ల రుణాలున్నాయని నిర్ధారిస్తే.. చంద్రబాబు మనుషులు టీవీల వద్దకు వెళ్లి ఒకాయన రూ.20 వేల కోట్లు, మరొకరు రూ.30 వేల కోట్లు, ఇంకొకరు రూ.10 వేల కోట్లని చెబుతున్నారు. అంటే రూ. 1.27 లక్షల కోట్లున్న రైతు రుణాలను వీళ్లంతట వీళ్లే, అది అమలు కాకముందే తక్కువ చేసి చూపిస్తున్నారంటే.. వీళ్ల చిత్తశుద్ధి ఏమిటో ఇప్పుడే అర్థమవుతోంది. చంద్రబాబు చెబుతున్న రైతు రుణ మాఫీకి రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా రుణ మాఫీకి రూ.20 వేల కోట్లు కలిపి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చవుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.1.25 లక్షల కోట్లయితే రూ.1.5 లక్షల కోట్ల రుణాలను ఈయనెలా మాఫీ చేస్తాడని అడుగుతున్నా. అంతేకాదు, రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లుంటే చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని అబద్ధమాడుతున్నాడు. రాష్ట్రంలో అన్నీ కలిపి 20 లక్షల ఉద్యోగాలే ఉంటే.. చంద్రబాబు మాత్రం 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు 65 ప్రభుత్వ సంస్థలను మూయించి 26వేల మందిని నడిరోడ్డున నిలబెట్టిన ఘనుడు చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఒక మాట, అయ్యాక మరో మాట మాట్లాడటం బాబుకు అలవాటే.’’ హిందూపురంలో ఎన్నికల ఆఖరి సభ సోమవారం కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాలలో రోడ్ షో నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న జగన్.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లో పర్యటించాలని భావించారు. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించాలనుకున్నారు. కానీ కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా మడకశిరకు వచ్చి ప్రచారం ముగిసిన వెంటనే హెలికాప్టర్లో హిందూపురం బయలుదేరేందుకు ప్రయత్నించారు. కానీ.. హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో మడకశిర నుంచి హిందూపురానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. హిందూపురంలో సభ ముగిసే సరికే సాయంత్రం ఆరు గంటలైంది. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచార గడు వు పూర్తవడంతో తాడిపత్రి సభను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా.. సాగిలపడే సర్కారు కావాలా? సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే.. పార్లమెంటులో పూర్తిగా మద్దతిచ్చిన నరేంద్ర మోడీ, చంద్రబాబు.. ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి అయినా తింటారు. వీళ్లెవరికీ మన మీద, మన రాష్ట్రం మీద ప్రేమ లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. చంద్రబాబు నరేంద్ర మోడీకి ఓటేయాలని అడుగుతున్నారు. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటేయాలని అడుగుతున్నాను. మనకు ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా? ఢిల్లీకి సాగిలపడే ప్రభుత్వం కావాలా? మీరే నిర్ణయించుకోండి. 25 ఎంపీ సీట్లు మనకున్నాయి. తెలుగుజాతి భవిష్యత్తు కోసం వాటన్నింటినీ మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత మోడీని ప్రధానిని చేద్దామా.. ఎల్లయ్యను చేద్దామా.. పుల్లయ్యను చేద్దామా అన్నది ఆ రోజు ఆలోచిద్దాం. ఎవరైతే మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని మనకు నమ్మకం కలుగుతుందో అలాంటి వ్యక్తినే ప్రధానిని చేద్దాం. - వైఎస్ జగన్ -
అమ్మను దీవించండి
సాక్షి, విశాఖపట్నం : చుర్రుమనిపించే సూరీడు.. నిప్పు సెగలు రేగుతున్న నేల. పైనా కిందా ఒకటే మంట. అయినా ఒక ఆత్మీయ చూపు కోసం నిరీక్షించారు. ఒక ఆత్మీయ పలకరింపు కోసం ఎదురు చూశారు. మనసుకు కలిగే ఆనందం ముందు మేనుకు కలిగే కష్టం ఏమాత్రమనుకున్నారు. మండుటెండనుసైతం లెక్కచేయకుండా షర్మిల, విజయమ్మల వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారానికి జనాలు పోటెత్తారు. ప్రచారం ఆరంభాన ఎంత అభిమానం చూపారో.. ముగింపు రోజున అంతకు మించిన అభిమాన సాగరంలో ముంచెత్తారు. తమ అభిమాన నేత వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పార్టీ తరఫున విశాఖ ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచిన వై.ఎస్.విజయమ్మకు అత్యధిక మెజార్టీతో పట్టాభిషేకం చేస్తామని చాటిచెప్పారు. సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి విజయమ్మతోపాటు షర్మిల భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో రోడ్ షో నిర్వహించారు. పార్టీ స్థానిక అభ్యర్థి కర్రి సీతారాం వెంటరాగా.. అక్కడ సభలో భారీగా తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి మళ్లీ నగరానికి చేరుకుని క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవ నాయకుల సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు. భోజన విరామం తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కోలా గురువులుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. డాల్ఫిన్ హోటల్ జంక్షన్లో అశేషంగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటరాగా ఆరిలోవ లో రోడ్ షో నిర్వహించారు. భారీగా జనాలు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. రెండో వార్డు అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో షర్మిల ప్రసంగానికి యువత ఉర్రూతలూగింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ గురించి అడిగి మరీ షర్మిల నోట కౌంటర్లు విని ఆనందించారు. అనంతరం ఆరిలోవ నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక్కడ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొద్దిసేపే షర్మిల మాట్లాడినా.. మీరంతా జగనన్న వదిలిన బాణాలంటూ.. వారిని అక్కున చేర్చుకున్నారు. విజయమ్మ మాట్లాడుతూ.. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల రూపకల్పన వెనక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తపన, దీక్షను పథకాల వారీగా వివరించారు. మహిళల ఆదరణను చూరగొన్నారు. రోడ్ షోలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు తైనాల విజయ్‌కుమార్, తోట రాజీవ్, పార్టీ నేతలు కోరాడ రాజబాబు, పీలా ఉమారాణి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘాటుగా స్పందించిన షర్మిల
ఒక సిద్దాతం, ఒక విధానం, రాజకీయాలపై ఒక స్పష్టమైన అవగాహన లేకుండా బిజెపి-టిడిపి కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీహీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తాను ప్రచారం చేసే కూటమి గెలిస్తే రాష్ట్రానికి ఏం చేస్తుందో చెప్పకుండా కేవలం వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా ఆయన ప్రసంగాలు సాగాయి. రాజకీయ నేతగా కాకుండా ప్రచారంలో వైఎస్ జగన్‌ను విమర్శించే పాత్రను పోషించడానికే ఆయన కాల్షీట్లు ఇచ్చినట్లు అర్ధమవుతోంది. వైఎస్ఆర్ జనభేరి సభలలో షర్మిల మాట్లాడుతూ పవన్ ప్రసంగాలకు ధీటుగా సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ పేరుకు తగినట్లే గాలి మాటలు, సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రోజుకో మాట, పూటకో బాట పడుతున్న తలతిక్క పవన్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు షర్మిల పిలుపున ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాటలు ఆయన అభిమానులకే అర్ధంకావడంలేదని చెప్పారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబును అవినీతి పరుడని తిట్టిన పవన్ ఇప్పుడు ఆయకే ఓటు వేయమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్‌కున్న విశ్వసనీయత అది అన్నారు. ఆయన విభజనవాదులతో కలిసి డ్యూయట్లు పాడుతున్నారని, చిందులు వేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు పిచ్చివాడికి తేడా లేదుని చెప్పారు. ‘‘మీ ఊరికి పిచ్చోడు వచ్చి ఒక సెంటర్లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్లు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? ఆ పిచ్చోడికి పవన్ కల్యాణ్‌కు తేడా లేదు. ఆయన మొదట ఒక ఆడిటోరియం తీసుకొని పెద్ద సభ పెట్టాడు. జనసేన అనే పార్టీ పెట్టానని ఆర్భాటంగా ప్రకటించాడు. ప్రస్తుతం పోటీ చేయడం లేదు, మీ ఇష్టమొచ్చినవారికి ఆత్మసాక్షిగా ఓట్లు వేసుకోండని చెప్పాడు. వారం రోజులు కూడా తిరక్కుండానే... లేదు, లేదు నేను మోడీని కలిసొచ్చాను... మీరంతా మోడీకి ఓట్లేయండని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు ఓట్లేయమని చెబుతున్నాడు. పూటకో మాట మార్చే ఈ పవన్ కల్యాణ్‌కు విలువల్లేవు.. విశ్వసనీయత లేదు. ఆయనకు ఉన్నదంతా ఒకటే... లెక్కలేనంత తిక్క. ఆ తిక్కంతా ఆయన మాటలు, చేతలు, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది’’ అని షర్మిల చెప్పారు. ఆమె తన ప్రసంగాలలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కూడా దుయ్యబట్టారు. చంద్రబాబుకు వైఎస్ఆర్ కటుంబాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదని చెప్పారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కోలేక మహా కూటమి అన్న చంద్రబాబు, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్నను ఎదుర్కొనేందుకు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీని తెచ్చుకున్నారని విమర్శించారు. అదీ చాలక పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఊసరవెల్లికంటే వేగంగా రంగులు మారుస్తారని ఓటర్లను హెచ్చరించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ ఎన్నికల ప్రచారంలో కొత్తగా పెళ్లైన మొగుడు పెళ్లాంల మాదిరి ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారని వ్యగ్యోక్తులు విసిరారు. ఆమె తన ప్రసంగాలలో సినిమా హీరో బాలకృష్ణను కూడా వదిలిపెట్టలేదు. తన బావ, వియ్యంకుడు చంద్రబాబు ఎక్కడ మీసం మెలేయమంటే అక్కడ బాలకృష్ణ మెలేసేస్తారని చెప్పారు. అంతేగాకుండా ఆయన ఎక్కడ తొడ కొట్టమంటే అక్కడ తొడకొడతారని కూడా అన్నారు. బాలకృష్ణకు మతిస్థిమితం లేదని అనుకేనేరు, పవన్ కళ్యాణ్‌కు కూడా తిక్క ఉందని, ఆ తిక్కకు లెక్కలేదని చెప్పారు. ఎంతమంది కలిసినా జగనన్నను ఎదుర్కొనే శక్తి ఎవరికీలేదని షర్మిల స్పష్టం చేశారు. విజయం వైఎస్ఆర్ సిపిదేనని ధీమా వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
కర్పూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్, అనంతరం హెలికాప్టర్లో అనంతపురం జిల్లా మడకశిరకు వెళ్లారు. అక్కడ జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లేందుకు బయల్దేరారు. కాగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడంతో మడకశిర నుంచి రోడ్డు మార్గం ద్వారా హిందూపురం పయనమయ్యారు. -
నంద్యాల జనభేరిలో జగన్ ప్రసంగం
-
'చెప్పిన పనులే కాదు... చెప్పనవి కూడా చేస్తా '
-
బాబు అప్పుడు రుణ మాఫీ ఎందుకు చేయలేదు!
-
తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటు
-
జన ఉప్పెన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కావలి పట్టణం జనసంద్రంగా మారింది. నియోజకవర్గం నలుమాలల నుంచి జగన్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన సభ దాదాపు 5 గంటలు ఆలస్యమైనా జనం జగ న్ కోసం ఎదురుచూశారు. సాయంత్రం 4:30 గంటలకు జగన్ హెలికాప్టర్లో కావలికి చేరుకున్నారు. అప్పటికే కావలి వీధులతో పాటు మిద్దెలు, మేడలు జనంతో కిక్కిరిశాయి. మండుటెండను సైతం లెక్కచేయక వృద్ధులు, మహిళలు, యువకులు , చిన్నారులతో పాటు అన్ని వర్గాల వారు జన నేత జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనను చూడగానే జనం కేరింతలు కొట్టారు. పూలతో ఘనస్వాగతం పలికారు. సాక్షి, నెల్లూరు: జగనన్న జిందాబాద్, ముఖ్యమంత్రి జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో కావలి పట్టణాన్ని హోరెత్తించారు. కిక్కిరిసిన జనాన్ని చూసిన జగన్ హెలిప్యాడ్ నుంచి సభ జరిగే కూడలి వరకూ కాన్వాయ్‌లో వస్తూ అడుగడుగునా అందరినీ బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేయాలని విన్నవించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజపూరితంగా సాగింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై జగన్ విమర్శల దాడి జనాన్ని ఆలోచింపజేయడంతో పాటు ఉర్రూత లూగించింది. తనను ముఖ్యమంత్రిని చేస్తే అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఇవన్నీ ఎందుకు చేయలేదంటూ జగన్ ప్రశ్నలు సంధించారు. బాబు హయాంలో ఉన్నత విద్య, వైద్యం పేదలకు ఖరీదుగా మారాయన్నారు. ఆనాడు ఆయన ఎందుకు పట్టించుకోలేదని జగన్ వేసిన ప్రశ్న జనాన్ని ఆలోచింప చేసింది. కిలో రెండురూపాయల బియ్యాన్ని రూ.5కు పెంచిన ఘనత చంద్రబాబుది కాదా అని జగన్ జనాన్ని ప్రశ్నించారు. అలాగే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బెల్టుషాపులు పెట్టి మహిళల ఉసురుపోసుకున్న వ్యక్తి టీడీపీ అధినేత కాదా అంటూ జగన్ ప్రశ్నలు కురిపించి జనంతోనే సమాధానాలు చెప్పించారు. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని జగన్ ధ్వజమెత్తారు. ఇవాళ అధికారం కోసం సెల్ఫోన్లు, టీవీలు, లక్షా 27కోట్ల రుణమాఫీ, 20 వేల కోట్ల డ్వాక్రా రుణాల రద్దు, ఇంటికొక ఉద్యోగమంటూ అమలుకాని హామీలను గుప్పిస్తున్నాడని, తొమ్మిదేళ్ల పాలనలో ఇవన్నీ బాబుకు ఎందుకు గుర్తురాలేదని జగన్ ప్రశ్నించగా ‘బాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడు’ అని అంటూ జనం ఈలలు, కేకలతో స్పందించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు ఆడనని, విశ్వసనీయతలేని రాజకీయాలు చేయనంటూ జగన్ చెప్పారు. ఎన్నికల తర్వాత బాబు ఉండడు, ఆ పార్టీ ఉండదంటూ పేర్కొనడంతో సభకు వచ్చిన జనం పెద్ద ఎత్తున స్పందించారు. తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రమాణ స్వీకారం రోజే ఐదు సంతకాలు, ఆరు పనులు కలిపి మొత్తం 11 పనులను చేస్తానని చెప్పడంతో జనం ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీకి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని, మనం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ఓటేయాలని జగన్ పిలుపునిచ్చారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి ప్రధాని కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిద్దామని జగన్ పేర్కొనడం జనంలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అలాగే చేస్తాం.. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామంటూ జనం స్పందించారు. అరగంటపాటు సాగిన జగన్ ప్రసంగం జనాన్ని మరింత ఉత్తేజితులను చేసింది. సభ ముగిసినా జనం మాత్రం కదలకపోవడం విశేషం. మొత్తంగా కావలి ఎన్నికల ప్రచారసభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్థానిక నేతలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేకపాటి తండ్రి సమానుడిగా నాకు అండగా నిలిచారు నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తాను తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రాజమోహన్‌రెడ్డి తండ్రి సమానుడిలా తన వెన్నంటి నడిచారని జగన్ పేర్కొన్నారు. కావలి వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకం తనకుందన్నారు. రామిరెడ్డిని సైతం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. జగన్ ఫ్యాన్ గుర్తు ప్రచారం ‘అవ్వా మన గుర్తు ఫ్యాన్, తల్లీ మన గుర్తు ఫ్యాన్, అన్నా మన గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తును మరవద్దన్నా’ అంటూ కావలి సభలో జగన్ ఫ్యాన్చేత బట్టి అందరినీ ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ‘బిల్డింగ్‌పై ఉన్న తాతా మన గుర్తు ఫ్యాన్, గోడపైనున్న అన్నా మన గుర్తు ఫ్యాన్, మిద్దెపైనున్న అక్కయ్యలు మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నయ్యా’ అంటూ జగన్ చేసిన ప్రచారం అందరినీ మరింతగా ఆకట్టుకుంది. కావలి కెనాల్ పూర్తి చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల పరిధిలోని కావలికెనాల్ను పూర్తిచేసి ఈ ప్రాంత వాసులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. కావలి ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే కావలి కెనాల్‌తో పాటు మిగిలిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవు తాయన్నారు. జగన్ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆయన పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కావలిలో ఆదివారం జరిగిన జగన్ ఎన్నికల ప్రచార సభలో మేకపాటి ప్రసంగించారు. రాష్ట్రాన్ని పాలించే నేతలు సద్గుణం కలిగి ఉండాలన్నారు. అలాగే ధీరోదాత్తుడిగా, ఆరోగ్యవంతుడిగా ఉండాలని, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని మేకపాటి అన్నారు. చంద్రబాబుకు సద్గుణం లేదు, ధీరోదాత్తుడు కాదు, ఆరోగ్యవంతుడు కాదన్నారు. అందుకే బాబుకు పాలించే అర్హత లేదని మేకపాటి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి అందరి మన్ననలు పొందిన మహానేత వైఎస్ తనయుడిగా జగన్‌కు అన్ని అర్హతలతో పాటు ప్రజాభిమానం మెండుగా ఉందన్నారు. -
బుడమేరు ముంపు సమస్యకు పరిష్కారం
సాక్షి, విజయవాడ : అదే జన హోరు.. అదే అభిమానం.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం రాత్రి జననేత జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వైఎస్సార్ జనభేరికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన దానికంటే నాలుగు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైనా విసుగు చెందక.. అభిమాన నేతను కనులారా వీక్షించాలని.. గెలుపుపై పూర్తి మద్దతు ప్రకటించాలని.. ప్రతి ఒక్కరి కళ్లలో ఉప్పొంగిన ఉత్సాహం కనిపించింది. సభ రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాలకు ప్రారంభమైనా జనం జననేత రాకకోసం ఎదురుచూశారు. ఆయన ప్రతి మాటకు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రెండో పెద్ద నగరం. దీన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ‘నా తమ్ముడు వంగవీటి రాధా పార్టీలో చేరే సమయంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అంశాన్ని నా ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు గజం వంద రూపాయలకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే గజం రూ.50 కే రిజిస్ట్రేషన్ చేస్తానని ఆ సభలో ప్రకటించాను. అది ఇంకా గుర్తుంది. దాన్ని నెరవేరుస్తా’ అని ప్రకటించారు. ‘విజయవాడ మున్సిపల్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. వారు జీతాలు సమయానికి ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న సమయంలో నేను స్వయంగా వారి వద్దకు వెళ్లాను. వారు.. అన్నా మా జీతాలు గ్రీన్ ఛానల్ (010 పద్దు) ద్వారా ఇవ్వకపోవడం వల్ల జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇది చాలా చిన్న సమస్య. దీని కోసం ఉద్యోగులను ఇంతకాలం వేధించడం సరికాదు. నెలరోజుల్లోనే వీరి సమస్యను పరిష్కరిస్తాను’ అని స్పష్టం చేశారు. మరో మూడు రోజుల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, సెంట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పూనూరు గౌతంరెడ్డి, వంగవీటి రాధాకృష్ణ, జలీల్‌ఖాన్‌లను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తును గుర్తుపెట్టుకుని ఓటేయాలని కోరారు. మున్సిపల్ ఉద్యోగుల మద్దతు తాము గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నామని, ఇప్పటి వరకు జగన్మోహన్రెడ్డి తప్ప మరో నాయకుడు తమకు అండగా నిలబడలేదని మున్సిపల్ జేఏసీ నాయకుడు డి.ఈశ్వర్ అన్నారు. ఆదివారం సాయంత్రం తమ సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సభలో జగన్మోహనరెడ్డి నెలరోజుల్లో మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. -
నేడు ‘అనంత’లో జననేత జనభేరి
మధ్యాహ్నం 1 గంటకు మడకశిరలో సభ మధ్యాహ్నం 2.30 గంటలకు హిందూపురంలో.. సాయంత్రం 4 గంటలకు తాడిపత్రిలో సభ సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (నేడు) జిల్లాకు రానున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సభ ముగించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో ఆయన మడకశిర చేరుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు హిందూపురం చేరుకుని అంబేద్కర్ సర్కిల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు తాడిపత్రి బహిరంగ సభలో పాల్గొంటారని ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ఉరకలేస్తున్న ఉత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానుండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిల నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. పైగా ప్రచార పర్వంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దూసుకెళ్తుండడంతో టీడీపీ అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ప్రచారాలకు వెళ్తే కనీసం ఇళ్లలో ఉన్న వారు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వారు ప్రలోభాలకే పరిమితమైపోయారు. గత నెల 30న అనంతపురంలో జరిగిన బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా జనం మాత్రం కరువయ్యారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు వైఎస్ జగన్ జిల్లాకు వస్తుండడంతో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పిలుపునిచ్చారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. -
నేడు జననేత జగన్ జనభేరి
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (నేడు) జిల్లాకు రానున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సభ ముగించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో ఆయన మడకశిర చేరుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు హిందూపురం చేరుకుని అంబేద్కర్ సర్కిల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు తాడిపత్రి బహిరంగ సభలో పాల్గొంటారని ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ఉరకలేస్తున్న ఉత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానుండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిల నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. పైగా ప్రచార పర్వంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దూసుకెళ్తుండడంతో టీడీపీ అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ప్రచారాలకు వెళ్తే కనీసం ఇళ్లలో ఉన్న వారు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వారు ప్రలోభాలకే పరిమితమైపోయారు. గత నెల 30న అనంతపురంలో జరిగిన బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా జనం మాత్రం కరువయ్యారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు వైఎస్ జగన్ జిల్లాకు వస్తుండడంతో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పిలుపునిచ్చారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. -
పవన్ కు పిచ్చోడికి తేడా లేదు
వైఎస్సార్ జనభేరి సభల్లో విరుచుకుపడ్డ షర్మిల కాకినాడ: ‘‘మీ ఊరికి పిచ్చోడు వచ్చి ఒక సెంటర్లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్టు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? ఆ పిచ్చోడికి పవన్ కల్యాణ్‌కు తేడా లేదు. పేరుకు తగ్గట్టుగా పవన్‌వి అన్నీ గాలిమాటలే.. అన్నీ సొల్లు మాటలే. ఆయన మొదట ఒక ఆడిటోరియం తీసుకొని పెద్ద సభ పెట్టాడు. జనసేన అనే పార్టీ పెట్టానని ఆర్భాటంగా ప్రకటించాడు. ప్రస్తుతం పోటీ చేయడం లేదు, మీ ఇష్టమొచ్చినవారికి ఆత్మసాక్షిగా ఓట్లు వేసుకోండని చెప్పాడు. వారం రోజులు కూడా తిరక్కుండానే... లేదు, లేదు నేను మోడీని కలిసొచ్చాను... మీరంతా మోడీకి ఓట్లేయండని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు ఓట్లేయమని చెబుతున్నాడు. పూటకో మాట మార్చే ఈ పవన్ కల్యాణ్‌కు విలువల్లేవు.. విశ్వసనీయత లేదు. ఆయనకు ఉన్నదంతా ఒకటే... లెక్కలేనంత తిక్క. ఆ తిక్కంతా ఆయన మాటలు, చేతలు, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజైన ఆదివారం కోరుకొండ, రంపచోడవరం, కరపల్లో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తాడు... ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడు. ఆనాడు రాజశేఖరరెడ్డిగారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక రాష్ర్టంలోని మిగిలిన పార్టీలతో కలసి మహాకూటమి పెట్టుకున్నాడు. కానీ తెలుగు ప్రజలు తెలివైనవారు... చంద్రబాబు మహాకూటమిని నమ్మలేదు. మాట తప్పని, మడమ తిప్పని మహానేతకే పట్టం కట్టారు. ఇప్పుడు ఆ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీని, మోడీని, వెంకయ్య నాయుడిని తీసుకొచ్చాడు. ఇవే ఆఖరి ఎన్నికలు కదా... పాపం తెచ్చుకున్నాడులే అనుకోవచ్చు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కాళ్లు కూడా పట్టుకున్నాడంటే చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడడని అర్థమవుతోంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంతే’’ అంటూ దుయ్యబట్టారు. వైఎస్సార్ పాలన సుభిక్షం ‘‘రాజశేఖరరెడ్డి మన రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు రాష్ర్టం ఎంత సుభిక్షంగా ఉండేదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రైతులు, చేనేతలు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు... ఇలా ప్రతి వర్గానికీ భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. కులాలకు.. మతాలకు.. ప్రాంతాలకు.. పార్టీలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కృషి చేసిన మహానేత మన రాజన్న. దురదృష్టంకొద్దీ వైఎస్సార్ మరణం తర్వాత అధికారం చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి అని పథకాలకు తూట్లు పొడిచారు’’ అని షర్మిల వివరించారు. -
బొడ్డు, జక్కంపూడిలను గెలిపించండి
సాక్షి, రాజమండ్రి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మికి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఓటేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ‘వైఎస్సార్ జనభేరి’లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ఆదివారం కోరుకొండ బస్టాండ్‌సెంటర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. మహానేత మరణానంతరం తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలపాల్జేసిన తరుణంలో జక్కంపూడి కుటుంబం తమకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. దుశ్శాసన పాలనకు చరమగీతం అంతకుముందు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల దుశ్శాసన, దుర్యోధన, దుర్వినీతి పాలనకు చరమగీతం పాడి రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి సుపరిపాలన అందిం చారన్నారు. ఆయన మరణానంతరం ప్రజలు మళ్లీ దుర్మార్గపు పాలన చవిచూశారన్నారు. రాజన్న తెచ్చిన సువర్ణయుగం మళ్లీ తీసుకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నడుం కట్టారని పేర్కొన్నారు. తాను జైల్లో ఉండి కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఆమరణ దీక్ష చేసిన నేతను మన మందరం గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇది ధర్మయుద్ధం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మయుద్ధం అని ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. జగన్మోహన్రెడ్డిని జైల్లో ఉంచి, విజయమ్మను అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టించిన దుష్టపరిపాలనపై సాగుతున్న పోరాటమిదని అన్నారు. జగనన్న వదిలిన బాణం షర్మిలకు తోడుగా కార్యకర్తలు, అభిమానులు లక్షలాది, కోట్లాది బాణాలై ఆయనను అధికారంలోకి తేవాలని కోరారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, బొల్లిన సుధాకర్, మునగాడ ఫణి, అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత, రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎం. షర్మిలా రెడ్డి పాల్గొన్నారు. -
కుప్పంనే బాగు చేయలేదు!
బాబు రాష్ట్రాన్నేం బాగుచేస్తారు: వైఎస్ విజయమ్మ విశాఖపట్నం: ‘‘తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానంటున్నాడు చంద్రబాబు. మరి తన సొంత నియోజకవర్గమైన కుప్పం పాతికేళ్లుగా పంచాయతీగానే మిగిలిపోయింది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న వ్యక్తి కనీసం తన నియోజకవర్గాన్ని మునిసిపాల్టీ కూడా చేయలేక పోయారు. అసలు కుప్పంనే బాగుచేయలేని చంద్రబాబు రాష్ట్రాన్నేం బాగుచేస్తారు? ఆయన చెప్పే మాటలోను, ఇచ్చే హామీలోనూ ఏ కోశానా నిజాయితీ కనిపించదు. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ నెత్తినే చెయ్యేసే రకం. రాష్ట్రాన్ని విడగొట్టండి అని లేఖ ఇచ్చింది ఆయనే. మళ్లీ ఇప్పుడు అన్యాయంగా విభజించారు అంటూ మొసలికన్నీరు కార్చేదీ ఆయనే. రెండు నాల్కల ధోరణి ఈయనకు అలవాటే’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సింహా చలం, భీమిలి, విశాఖ నగర పరిధిలోని చినవాల్తేరు, రాంనగర్, హెచ్‌బీ కాలనీ సభల్లో విజయమ్మ ప్రసంగించారు. -
ఫుల్ స్వింగ్‌లో వైఎస్సార్ సీపీ
కేడర్‌లో జోష్ నింపిన జగన్, షర్మిల పర్యటనలు వందలాది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీలు అమలాపురం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫుల్‌జోష్‌తో ఉంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిల పర్యటన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. అమలాపురం పార్లమెంట్ పరిధిలో శనివారం పి.గన్నవరంలోజగన్మోహన్రెడ్డి నిర్వహించిన జనభేరి సభకు వేలాదిగా జనం పోటెత్తారు. అలాగే షర్మిల రాజోలు నియోజకవర్గం పరిధిలో మలికిపురం, కొత్తపేటల్లో నిర్వహించిన జనభేరి సభలు సైతం విజయవంతమయ్యాయి. ఒకేరోజు అన్నా, చెల్లెళ్లు చేసిన ఎన్నికల ప్రచారం పార్టీ కేడర్‌లో మనోస్థైర్యాన్ని నింపింది. పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ తనపరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తొలుత పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో శుక్రవారం ఆయన అసెంబ్లీ అభ్యర్థులు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి వంతెన వద్ద నుంచి ఆరంభమైన రోడ్ షో పలు గ్రామాల మీదుగా రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఆదివారం అమలాపురం నియోజకవర్గంలో రోడ్ షో జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి విశ్వరూప్, అసెంబ్లీ అభ్యర్థి గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయిల ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో సైతం విజయవంతమైంది. అమలాపురం చిట్టబ్బాయి ఇంటి వద్ద మొదలైన ఈ రోడ్‌షో హైస్కూల్ సెంటరు, గోఖలే సెంటరు, భూపయ్య అగ్రహారం, ఎత్తురోడ్డు, కొంకాపల్లి, గడియారస్తంభం, ఆర్టీసీ బస్టాండ్, ముమ్మిడివరంగేట్, నల్లవంతెన, ఎర్రవంతెన మీదుగా తిరిగి హైస్కూల్ సెంటరుకు చేరుకుంది. ఈ రోడ్‌షోకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో అమలాపురం పార్టీ జెండాలతో నిండిపోయింది.ఆయా ప్రాంతాల్లో విశ్వరూప్, బాబూరావుల ప్రచారానికి మంచి స్పందన లభించింది. పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జంపన రమేష్‌రాజు, నిమ్మకాయల హనుమంతశ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కుడుపూడి బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఐ.వి.సత్యనారాయణ, డీసీసీబీ డెరైక్టర్ ఇళ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేకువకు ముందు వేగు చుక్కాల్లా
మలమలమాడ్చే ఎండలో కేవలం నాలుగు నిమిషాలు నిలబడ్డ వారైనా.. నీడ కోసం తపిస్తారు. మరి.. నాలుగున్నరేళ్లుగా ‘కాల్చుకు తింటున్న’ పాలనతో విలవిలలాడుతున్న ప్రజలు..మాటకు కట్టుబడే నిబద్ధుల చెంతకు; కష్టాల నుంచి గట్టెక్కించే సమర్థుల చెంతకు..పల్లానికి నీరులా ఉరికితే ఆశ్చర్యమేముంది? జననేత జగన్, ఆయన సోదరి షర్మిల పాల్గొన్న ‘వైఎస్సార్ జనభేరి’ సభలు దిగ్విజయం కావడంతో వింతేముంది? వారి రాకతో వైఎస్సార్ సీపీ శ్రేణులసమరోత్సాహం పదింతలు, మంచిరోజులు తథ్యమన్న ప్రజల నమ్మకం వందరెట్లు అయ్యాయి. సాక్షి, కాకినాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్దుబిడ్డలైన వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిల జిల్లాలో కోనసీమ, మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల సమరోత్సాహం ద్విగుణీకృతమైంది. ప్రచారం ముగింపు దశలో వారి పర్యటన పార్టీ గెలుపును మరింత నల్లేరుపై నడక చేసిందన్న నమ్మకం నాయకులు, కార్యకర్తల్లో తొణికిసలాడుతోంది. జగన్ సుడిగాలి పర్యటనలో భాగంగా శనివారం పి.గన్నవరంలో వైఎస్సార్ జనభేరిలో పాల్గొని తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించి వెళ్లారు. శనివారమే జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు, మోడీల కుట్రలు కుత్రంతాలపై నిప్పులు చెరుగుతూనే నటుడు పవన్‌కల్యాణ్ తిక్కను తనదైన శైలిలో తూర్పారబట్టారు. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరంలో సాగిన షర్మిల పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రత్యర్థులపై ఆమె సంధించిన వాగ్బాణాలకు ప్రజల నుంచి అనూహ్యస్పందన వచ్చింది. ప్రత్యర్థులపై షర్మిల మాటల ఈటెలు షర్మిల కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో శనివారం ప్రారంభించిన ప్రచారం ఆదివారం కాకినాడ రూరల్ మండలం కరపతో ముగిసింది. మలికిపురం, కొత్తపేట, కోరుకొండ, రంపచోడవరం, కరపలలో జనభేరి సభలలో పాల్గొన్న షర్మిల కుట్ర, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబు తీరును ఎండగట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో నిర్లక్ష్యం చేసిన వ్యవసాయం, విద్య, విద్యుత్ తదితర రంగాలను ఇప్పుడు ఉద్ధరిస్తానంటూ చెబుతున్న మాయమాటలు, సొల్లు కబుర్లు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని.. ఎత్తిచూపినప్పుడు జనం హోరెత్తారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక్కడినే ఎదుర్కొనలేక మహాకూటమి పెట్టిన చంద్రబాబును కాదని ప్రజలు మహానేతకు పట్టం గట్టిన విషయాన్ని గుర్తు చేసినప్పుడు జేజేలు పలికారు. ఇప్పుడు జగనన్నను ఒక్కడినే ఎదుర్కొనే దమ్ము లేక మోడీ, పవన్‌కళ్యాణ్‌లతో జత కట్టారని, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మొగుడూ పెళ్లాల్లా.. ఒకరి గురించి ఒకరు గొప్ప చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసినప్పుడు జనం కేరింతలు కొట్టారు. చంద్రబాబు నుంచి మోడీ, చిరంజీవి, పవన్, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా నేతలను కడిగి పారేసిన షర్మిల మాటలకు జనం విశేషంగా స్పందించారు. కోరుకొండ సభలో మాట్లాడుతూ.. ఈ జిల్లా ప్రజలు తమ కుటుంబానికి ప్రతి కష్టంలో అండగా ఉన్నారని, దివంగత నేత జక్కంపూడి, వైఎస్‌ల అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు జక్కంపూడి, వైఎస్‌లకు జోహార్లతో సభాస్థలి మార్మోగింది. జనభేరి సభలలో షర్మిల ప్రసంగం జిల్లాలో అన్ని వర్గాల ప్రజల మనస్సులను హత్తుకుంది. షర్మిల రంపచోడవరంలో విల్లును ఎక్కుపెట్టి, మహానేత గిరిజనులకు భూములపై హక్కు కల్పించిన విషయాన్ని గుర్తు చేసినప్పుడు గిరిపుత్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. రంపచోడవరంలో గిరి‘జనఝరి’ మలికిపురం మొదలు కరప వరకు ఒకదాని మించి మరొకటి అన్నట్టు జనం ఉత్తుంగ తరంగాల్లో జనభేరి సభలకు పోటెత్తారు. మండేఎండను సైతం లెక్కచేయకుండా పిల్లా పాపలతో గంటల తరబడి నిరీక్షించి, షర్మిలను చూసి, ఆమె పలుకులు ఆలకించి మంత్రముగ్ధులయ్యారు. రంపచోడవరంలో శనివారం జరిగిన చంద్రబాబు పర్యటనకు ముఖం చాటేసిన గిరిబిడ్డలు.. ఆదివారం షర్మిల జనభేరికి వెల్లువెత్తారు. లోతట్టుప్రాంతాల నుంచి ఉదయాన్నే తరలిరావడంతో డివిజన్ కేంద్రమైన రంపచోడవరం వెళ్లే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. ప్రచారపర్వం చివరి దశలో అన్నాచెల్లెళ్లు జిల్లాలో నిర్వహించిన ఆరు జనభేరి సభలు దిగ్విజయం కావడం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత చిరంజీవి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకులు జిల్లాలో నిర్వహించిన ప్రచారాలు పేలవంగా సాగడం ఆ పార్టీలపై జిల్లావాసులకున్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. -
జయం మనదే
‘నమస్తే అక్కా.. నమస్తే అన్నా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే అవ్వా..తాతా రాష్ట్రాన్ని కమ్మేసిన చీకట్లు తొలగిపోయేందుకు ఎంతో సమయంలేదు. గత కాలపు వైభవం తిరిగి వచ్చేందుకు ఎన్నో రోజులు పట్టవు. నవ్య సీమాంధ్ర నిర్మాణం కోసం అడుగులు ముందుకేసేందుకు మరెన్నో గంటలు అవసరంలేదు. రాష్ట్రాన్ని విభజించిన కర్కశులను శాశ్వతంగా ఇంటికి పరిమితం చేసేందుకు.. పేదలు.. దీనులతో ఆటలాడుకున్న దుర్మార్గులను తరిమికొట్టేందుకు.. ద్వంద్వ విధానాలను సమూలంగా పెకిలించేందుకు.. సుదీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సిన అవసరం లేదు.. ఐదు సంతకాలు మీ జీవితాల్లో నూతన వెలుగులు ప్రసరింపజేస్తాయి ప్రతి ఇంటిలో ఆనందాలు వెల్లివిరుస్తాయి...’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజలకు ఆదివారం భరోసా ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ‘మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండ మండిపోతున్నా ఖాతరు చేయడం లేదు. అనుకున్న దానికన్నా, దాదాపు మూడు నాలుగు గంటలు ఆలస్యంగా జరుగుతోంది. అయినా ఏ ఒక్కరి ముఖంలోను చికాకు కనిపించడం లేదు. ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా, ఎండ ఇంత తీక్షణంగా ఉన్నా, ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కారణాలు వెతుక్కోలేదు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను కనబరుస్తున్నారు. ఇంతటి ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితునికి మీ ఆప్యాయతలకు చేతులు జోడించి, పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కనిగిరివాసులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించగానే వేలాది మంది ఉదయం పది గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 12 నుంచి 2 గంటల వరకు తీవ్రంగా ఎండకాసింది. అయినా జనం కాలు కదపకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక కోసం నిరీక్షించారు. దాదాపు 2.30 గంటలకు కనిగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్బన్ కాలనీ ప్రాంతంలో జగన్మోహన్రెడ్డి వస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అప్పటి వరకు దూరంగా ఉన్న అభిమానులు హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, వారిని దూరంగా పంపించారు. జగన్‌కు ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి, జిల్లా కన్వీనరు డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, కన్వీనర్లు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ, విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్య, జిల్లా మైనారిటీ విభాగం నాయకుడు సయ్యద్ ఖాజా తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఓపెన్ టాప్ బస్సులో బయలుదేరిన జగన్ దారి పొడవునా నిల్చున్న వారిని పలకరిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బస్సుపై నుంచే ఆయన వేలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆల్‌ఫ్రీ హామీలపై విరుచుకుపడ్డారు. విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం సీట్ల కోసం సోనియా గాంధీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు కలసి బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. చివరగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తానని, అది పూర్తి చేసి, మళ్లీ మీ దగ్గరకు వస్తానని హామీఇచ్చారు. అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞాపన: ‘నా పక్కన మదుసూదన్ యాదవ్ ఉన్నాడు. మంచివాడు.. యువకుడు.. ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. మనస్ఫూర్తిగా దీవించండని సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా కుడి పక్కన సుబ్బారెడ్డి ఉన్నారు. వరుసకు నాకు చిన్నాన్న అవుతారు. మంచివారు మీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ చల్లటి ఆశీస్సులు ఇవ్వండి.. ఆదరించండి. ఆప్యాయతలు చూపించాల్సిందిగా పేరు పేరునా చేతులు జోడించి కోరుతున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాను గుర్తుకు ఓటేసే వారు చేతులెత్తమని అడగడంతో, అక్కడున్న వారందరూ చేతులెత్తారు. తిరిగి అక్కడ నుంచి బస్సులోనే హెలిప్యాడ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో బస్సుదిగి, కారులోకి మారి, హెలిప్యాడ్ చేరుకున్నారు. అక్కడ నుంచి కావలికి ఆయన బయలుదేరారు. చీరాలలో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి వరికూటి అమృతపాణి, చీరాల అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీలను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు రెహమాన్ ఖాన్‌తోపాటు జిల్లా సేవాదళ్ నాయకుడు ఆవుల చంద్రశేఖర్ రెడ్డి, చిన్న పరిశ్రమల విభాగం కన్వీనరు ఉడుముల లక్ష్మీ నారాయణరెడ్డి, ఎస్సీసెల్ నాయకుడు నల్లా సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు జననేత జగన్
* కర్నూలు, నంద్యాలలో పర్యటన * ప్రత్యేక హెలికాప్టర్లో రాక ఉదయం 9.30 గంటలకు కర్నూలు * కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగసభ * 11.30 గంటలకు నంద్యాల పొట్టిశ్రీరాములు సర్కిల్లో జనభేరి కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాజన్న బిడ్డ రాక కోసం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్రను సృష్టించేందుకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆయన రాక ప్రత్యేకతను సంతరించుకుంది. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగేందుకు.. తన విశ్వసనీయతను ప్రజలకు వివరించేందుకు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానున్నారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌షో నిర్వహించి.. ఉదయం 9.30 గంటలకు కొండారెడ్డి బురుజు వద్ద జనభేరి సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో నంద్యాలకు వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు అక్కడి పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు రోడ్‌షో ద్వారా చేరుకుని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లోనే అనంతపురం జిల్లాకు వెళ్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ జగన్ జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో పత్తికొండ, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన జనభేరి సభలకు జనం నీరాజనం పలికారు. తొమ్మిదేళ్ల టీడీపీ, వైఎస్ మరణానంతరం నాలుగున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించడంతో ప్రజలను ఆలోచింపజేసింది. విశ్వసనీయత చుట్టూ సాగిన ఆయన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరో విడత ఆయన జిల్లాలో పర్యటించనుండటం శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతోంది. జనభేరి సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వసన్నద్ధమవుతున్నారు. జనభేరికి తరలిరండి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జనభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎస్.వి.మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9.30 గంటలకే జనభేరి బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. -
తెలుగుజాతి భవిష్యత్తుకు ఓటేయండి
బాబు మోడీ కోసం ఓటడుగుతున్నారు.. నేను తెలుగుజాతి భవిత కోసం ఓటడుగుతున్నా: జగన్ ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే.. మరోవైపు కుళ్లు, కుతంత్రాలు పోటీపడుతున్నాయి కేంద్రం మెడలు వంచే ప్రభుత్వం కావాలో.. చంద్రబాబులా కేంద్రం వద్ద మోకరిల్లే ప్రభుత్వం కావాలో తేల్చుకోండి తెలుగుజాతి పౌరుషాన్ని చూపించండి.. ప్రజలకు జగన్మోహన్రెడ్డి పిలుపు ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కోసం ఓటడుగుతున్నారు. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటడుగుతున్నాను. తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఓటేయండి.. తెలుగుజాతి పౌరుషం చూపించండి. మనకు కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రభుత్వం కావాలో లేక చంద్రబాబు నాయుడిలా కేంద్రం వద్ద మోకరిల్లి ఢిల్లీకి సలాం చేసే ప్రభుత్వం కావాలో మీరే తేల్చుకోండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే.. మరోవైపు కుళ్లు, కుతంత్రాలు పోటీపడుతున్నాయని, ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేసి.. వైఎస్ సువర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ‘‘నరేంద్ర మోడీ, చంద్రబాబు, సోనియా... వీరెవ్వరికీ మన మీద కాని, మన రాష్ట్రం మీదకాని ప్రేమ లేదు. వీళ్లకు కావల్సిందల్లా ఓట్లు, సీట్లు మాత్రమే. వాటి కోసం ఏ గడ్డి అయినా తింటారు వీళ్లు. అందుకే రాష్ర్టంలో 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుని మన రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. ఆ ప్రధాని నరేంద్ర మోడీనా, ఎల్లయ్యా, పుల్లయ్యా అనేది తర్వాత చూద్దాం. మరో మూడు రోజుల్లో మీ ఓటుతో మన తలరాతలు మార్చుకోబోతున్నాం. ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి మనసెరిగి వారికోసం పనిచేస్తారో, ఏ వ్యక్తి అయితే చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉండాలనుకుంటాడో అలాంటి వ్యక్తిని మనం సీఎం చేసుకోవాలి. అప్పుడే మన తలరాతలు మారతాయి’’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా కనిగిరి, చీరాల, కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో జగన్ ఆదివారం ప్రచారం నిర్వహించి ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. ఆయా సభలకు పోటెత్తిన ప్రజలనుద్దేశించి ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మండుటెండను, ఉక్కపోతనూ లెక్కచేయకుండా తన కోసం వేచి ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. అసలు వీళ్లు మనుషులేనా? ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు ఎక్కడ ఉన్నాయో టార్చిలైటు వేసి వెతికినా కనపడని పరిస్థితి. రాజకీయ నాయకులు ఈ రోజు ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడటం లేదు. రాజకీయాన్ని చదరంగంలా తయారు చేశారు. ఓట్లు, సీట్ల కోసం ఒక మనిషి మీద తప్పుడు కేసులు పెట్టడానికి, జైలుకు పంపడానికి, చివరికి రాష్ట్రాన్ని చీల్చడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ వ్యవస్థను మార్చాలి.. ఈ వ్యవస్థలో నిజాయితీ తీసుకుని రావాలి. విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకుని రావాలి. మొన్నటికి మొన్న సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడతా ఉంటే, ఆమెకు చంద్రబాబు, ఈ బీజేపీ నాయకులే మద్దతు పలికారు. తెలంగాణలో ప్రచారం నిర్వహించినంతసేపూ.. తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మోడీ, చంద్రబాబు చెప్పుకొచ్చారు. 30వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికలు ముగియగానే మాట మార్చేశారు. ఏడు గంటలకు తిరుపతిలో సభ పెట్టి.. రాష్ట్రం ముక్కలు కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డే అని నా మీద అభాండాలు వేశారు. వీళ్లు మనుషులేనా అని అడుగుతున్నా. ఈ వ్యవస్థలో నిజాయితీ ఉందా? ఇటువంటి వాళ్లు ఏం పాలిస్తారు? ఏ నిజాయితీతో రాజకీయాలు చేస్తారు? ఏ విశ్వసనీయతతో రాజకీయం చేస్తారు? ఆల్ ఫ్రీ అంటున్న బాబును అక్కడే నిలదీయండి.. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న తరుణంలో చంద్రబాబు మీ ముందుకు వస్తాడు. అది చేస్తా, ఇది చేస్తా, అన్నీ ఫ్రీగా ఇస్తా అని చెబుతాడు. ఆయన్ను అక్కడే నిలదీయండి. ఇవాళ ఫ్రీగా ఇస్తానంటున్న వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో ఎందుకు ఇవ్వలేదూ అని నిలదీయండి. రూ.2 కిలో బియ్యాన్ని రూ.5.25 చేసింది మీరు కాదా? మద్య నిషేధం అని చెప్పి గ్రామ గ్రామాన బెల్టుషాపులు తెచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించండి. ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేసింది మీరు కాదా? మీ హయాంలో ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి ప్రజల వైద్యం కోసం, ఉన్నత చదువుల కోసం డబ్బులు ఎలా తెస్తున్నారని అడిగారా? అని ప్రశ్నించండి. రైతు రుణ మాఫీ అంటూ బాబు పచ్చి అబద్ధాలు.. చంద్రబాబు ఒకరోజు ఆడవాళ్లకు సెల్ఫోన్లు ఫ్రీగా ఇస్తానంటాడు. మరుసటి రోజు టీవీలు ఇస్తానంటాడు. ఆ మరుసటి రోజు రైతు రుణాలు మాఫీ చేస్తానంటాడు. ఆ తర్వాత రోజు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానంటాడు. ఆ పక్క రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ పూటకో పచ్చి అబద్ధం చెబుతున్నాడు. మన రాష్ట్ర బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు.. అయితే చంద్రబాబు రైతు రుణాల మాఫీ భారం రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి రూ.20 వేల కోట్లు కలిపి లక్షా యాభై వేల కోట్ల రూపాయల మేర హామీలిచ్చారు. రాష్ట్రంలో రైతుల పంట రుణాలు రూ.1.27 లక్షల కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు మీటింగ్‌లో చెబితే చంద్రబాబు తన పార్టీ నుంచి తమకు కావాల్సిన టీవీల దగ్గరకు వక్తలను పంపి ఆ రుణాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వక్తల్లో ఒకరు రైతు రుణాలు రూ.10 వేల కోట్లనీ, ఇంకొకరు రూ.20 వేల కోట్లనీ, మరొకరు రూ.30 వేల కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే.. రైతు రుణ మాఫీ మీద చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడున్నర కోట్ల ఉద్యోగాలా.. ఈయన మనిషేనా? చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో చంద్రబాబుకు తలుసా? మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. ఆయన సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో 65 ప్రభుత్వ రంగ సంస్థల్లోని 20 వేల మంది కార్మికులను వీధిపాలు చేశాడు. స్వాతంత్య్రం వచ్చిన 60 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఉంటే చంద్రబాబు మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తాడు? అసలు ఈయన మనిషేనా? చంద్రబాబులా నువ్వు కూడా ఆ హామీలిచ్చేయన్నా.. ఎన్నికల తర్వాత చూసుకుందాం అని నాతో కొందరు చెప్పారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అధికారం కోసం ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. నేను చంద్రబాబు కంటే పాతికేళ్లు చిన్నవాడిని. విశ్వసనీయతతో మరో 30 ఏళ్లు రాజకీయం చేయాల్సిన వాడిని. అందుకే చంద్రబాబు లాగా నేను అబద్ధాల హామీలు ఇవ్వలేను.’’ -
జ(గ)న సంద్రం
-
విజయవాడ జనభేరీలో జగన్ ప్రసంగం
-
భీమిలి జనభేరీలో విజయమ్మ ప్రసంగం
-
కరప జనభేరిలో షర్మిళ ప్రసంగం
-
తెలుగుజాతి పౌరుషం కోసం ఓటెయ్యండి
కనిగిరి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ కోసం ఓటెయ్యమని అడుగుతున్నారని, తాను మాత్రం తెలుగుజాతి పౌరుషం కోసం ఓటెయ్యమని అడుగుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తుంటే ఈ చంద్రబాబు,ఈ మోడీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీడీపీ నేతలు తెలంగాణాలో ఒకతీరుగా, సీమాంధ్రలో మరో తీరుగా రాష్ట్ర విభజపై మాట్లాడుతున్నారని చెప్పారు. అక్కడ తెలంగాణకు అనుకూలంగా తాము ఓటేశామని చెప్పారు. ఇక్కడ రాష్ట్రం విడిపోవడానికి తాను కారణం అని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ విషయంలో పెద్దమ్మని ఒక్కదాన్నే కాకుండా చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోవాలన్న బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్న మాటలను గుర్తు చేశారు. రాజకీయం అనేది ఓ చదరంగంలా మార్చారని బాధపడ్డారు. ఓట్లు, సీట్లకోసం ఓ వ్యక్తిని జైలుకు పంపేందుకు వెనకాడడంలేదని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాధ్యంకాని హామీలిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్‌కు మించిన హామీలిస్తూ పట్టపగలే మోసం చేస్తున్నారని చెప్పారు. మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలున్నాయని, మనం వేసే ఓటుతో మన తలరాతలు మార్చుకుందాం అన్నారు. ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యండని విజ్ఞప్తి చేశారు. ఏ నాయకుడైతే ప్రజల మనసు తెలుసుకుంటాడో ఆ వ్యక్తినే మీ నాయకునిగా ఎన్నుకోండని సలహా ఇచ్చారు. ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా? ఢిల్లీకి సాగిలపడే చంద్రబాబు కావాలా? అని ఆయన అడిగారు. ప్రజా సేవ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించమని జగన్ కోరారు. -
తెలుగుజాతి పౌరుషం కోసం ఓటెయ్యండి
-
''ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము బాబుకు లేదు''
-
రేపు కర్నూలు, అనంతలో వైఎస్ జగన్ ప్రచారం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సోమవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కర్పూలు, ఆ తర్వాత అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తారు. ఉదయం 9.30 గంటలకు కర్నూలులో, 11.30 గంటలకు నంద్యాలలో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలలో పాల్గొంటారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా మడకశిరలో మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు హిందూపురం, సాయంత్రం 4.30 గంటలకు తాడిపత్రిలో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలలో పాల్గొని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. -
కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కావలిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ కార్యాలయం సెంటర్లో జరిగే వైఎస్సార్ జనభేరి బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి తొలివిడతగా గత నెల 19, 20 తేదీల్లో వెంకటగిరి నియోజకవర్గం రాపూ రు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం వింజ మూరులో ఏర్పాటుచేసిన జనభేరి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పొదలకూరు, సంగం, దుత్తలూరు మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. నిర్ణీత సమయం కంటే జగన్మోహన్రెడ్డి పర్యటన నాలుగైదు గంటలు ఆలస్యంగా సాగినా ఆయన కోసం జనం ఎదురుచూసి సాదరస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో రెండో విడతగా జగన్మోహన్రెడ్డి ఆదివారం కావలికి వస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు, శ్రేణులు రంగంలోకి దిగాయి. -
ముంచెత్తిన మమత
పి.గన్నవరంలో జగన్; మలికిపురం, కొత్తపేటల్లో షర్మిల ఎన్నికల ప్రచారం అన్నాచెల్లెళ్లకు బ్రహ్మరథం పట్టిన కోనసీమ అడుగడుగునా పరవళ్లు తొక్కిన అభిమానం మండుటెండలోనూ గంటల తరబడి నిరీక్షణ సాక్షి, కాకినాడ :వైఎస్సార్ జనభేరి పేరుతో ఓ పక్క వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి, మరోపక్క ఆయన సోదరి షర్మిల శనివారం జరిపిన పర్యటన కోనసీమవాసుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మరో మూడు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయం కోసం అన్నాచెల్లెళ్లు కోనసీమలోని రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్నారు. ఇద్దరూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి కోనసీమలోకి అడుగు పెట్టారు. సమయం లేకపోయినా కోనసీమవాసులపై ఉన్న అభిమానంతో జగన్మోహన్రెడ్డి పి.గన్నవరంలో జరిగిన వైఎస్సార్ జనభేరిలో పాల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన పశ్చిమలో పర్యటన ముగించుకొని జిల్లాలోని పి.గన్నవరంలో వైఎస్సార్ జనభేరిలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో బయలుదేరి విశాఖ వెళ్లాలి. పశ్చిమగోదావరి నుంచి బయలుదేరేసరికే నాలుగుగంటలు దాటడంతో పి.గన్నవరం పర్యటన రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గన్నవరంలో జగన్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది తమ అభిమాన నాయకుడిని చూడలేకపోతామేమోనని కలవరపడ్డారు. సమయం మించినా..గన్నవరం వచ్చిన జననేత అయితే గన్నవరంలో వేలాది మంది అభిమానులు మండు టెండను సైతం లెక్క చేయకుండా తన కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారని తెలుసుకున్న జననేత ఎంత ఆలస్యమైనా గన్నవరం వచ్చాకే విశాఖ వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో పాలకొల్లు నుంచి సాయంత్రం 4.10 గంటలకు పి.గన్నవరం చేరుకున్నారు. ఆకాశంలో హెలికాప్టర్‌ను చూడగానే జనం ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. జగన్ రాకతో వందలాది మంది యువకులు భారీ జెండాలు, బైకు ర్యాలీలతో హోరెత్తించారు. గన్నవరం సెంటర్ నుంచి మూడువైపులా రహదారులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయాయి. సుమారు 25 నిమిషాల పాటు సాగిన జగన్ ప్రసంగానికి అడుగడుగునా ప్రజలు జేజే ధ్వానాలు పలికారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్ విశ్వసనీయతకు పట్టం గట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ ‘జోహార్ వైఎస్సార్.. జై జగన్’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. మలికిపురం తరలి వచ్చిన‘రాజోలు దీవి’ ఇక జగన్ సోదరి షర్మిల పశ్చిమగోదావరి జిల్లా గణపవరం నుంచి నేరుగా మలికిపురం చేరుకున్నారు. రాజోలు దీవి నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. షర్మిల తన ప్రసంగంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లు పట్టం గట్టిన కుప్పం పంచాయతీని కనీసం మున్సిపాలిటీ కూడా చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. సుదీర్ఘంగా చేసిన షర్మిల ప్రసంగంలో ప్రతి పలుకుకూ జనం స్పందించారు.అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఆలోచించని బాబు ఇప్పుడు వారిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని, దాన్ని నమ్మితే నట్టేట ముంచుతాడని హెచ్చరించారు. ‘జగనన్నకు ఒక్కసారి అవకాశమిస్తే జీవితాన్ని మీకు అంకితం చేస్తా’డన్నప్పుడు ప్రజలు జేజే ధ్వానాలు పలికారు. మలికిపురం వైఎస్సార్ జనభేరి ముగించుకున్న షర్మిల తిరిగి పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వెళ్లారు. అక్కడ జనభేరి అనంతరం రాత్రి 9.15 గంటలకు తిరిగి రావులపాలెం మీదుగా కొత్తపేట చేరుకున్నారు. జనం పోటెత్తిన కొత్తపేట.. సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వేలాదిగా జనం పోటె త్తడంతో కొత్తపేట కిక్కిరిసిపోయింది. అటు అంబాజీపేట, ఇటు రావులపాలెం రహదారులు జనంతో కిటకిటలాడాయి. షర్మిల రాగానే వేలాది మంది ఎదురేగి మరీ స్వాగతం పలికారు. కొత్తపేటలో కూడా షర్మిల సుమారు ముప్పై నిమిషాల పాటు ప్రసంగించారు. ఇక్కడ కూడా చంద్రబాబు తీరును ఎండగడుతూ జగన్ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు. ఐదు సంతకాలతో రాష్ర్ట దశదిశలను జగనన్న మార్చబోతున్నాడన్నప్పుడు హర్షధ్వానాలు మార్మోగాయి. అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు అసెంబ్లీ అభ్యర్థులు కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, బొంతు రాజేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, పార్టీ నేతలు మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్‌రాజు పాల్గొన్నారు. -
జయం మనదే
జగన్‌కు జనం ఆశీస్సులు రైతులు, మహిళలు, యువత,వృద్ధుల బ్రహ్మరథం జనసాగరంలా జగ్గయ్యపేట జనభేరి జిల్లాలో ఊపందుకున్న ‘ఫ్యాన్’ స్పీడ్ సాక్షి ప్రతినిధి, విజయవాడ : ముస్లింలు పెద్దఎత్తున వచ్చి వైఎస్సార్ సీపీలో చేరారు. వేదపండితులు ఎదురొచ్చి ఆశీస్సులు అందించారు. క్రైస్తవులు నిండు మనస్సుతో ప్రార్థనలు చేశారు. జననేత వైఎస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ.. వారంతా ధీమా వ్యక్తంచేశారు. మహిళలు, యువత, వృద్ధులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయం మనదేనంటూ.. జగన్మోహనరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ‘వైఎస్సార్ సీపీ జనభేరి’ కార్యక్రమం శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్‌షోకు, బహిరంగ సభకు అపూర్వ స్పందన లభించింది. వృద్ధులు, పిల్లలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు వేలాదిగా తరలిరావడంతో జగ్గయ్యపేట జనసాగరాన్ని తల పించింది. సామినేని ఉదయభాను ఇంట్లో బస చేసిన జగన్మోహనరెడ్డిని ముస్లింలు కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. గట్టు భీమవరం ఉప సర్పంచి షేక్ ఇమాం ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన ముస్లింలు జగన్మోహనరెడ్డిని కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. గోపినేనిపాలెంలో అక్బర్, ఎస్కే రఫీ ఆధ్వర్యాన పది కుటుంబాల ముస్లింలు ఆ పార్టీలో చేరారు. ముస్లింలను ఊచకోత కోసిన నరేంద్రమోడీతో చంద్రబాబు జట్టు కట్టడం దారుణమని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ముస్లింలు ఓడిస్తారని పలువురు పెద్దలు ప్రకటించారు. జగన్‌ను కలిసిన నేతలు వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రెహ్మాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నాల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు తదితరులు జగన్మోహనరెడ్డిని కలిశారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం సారసింహపల్లి సర్పంచి రవికుమార్‌రెడ్డి, పీవీ శివారెడ్డి, లక్ష్మీపతిరెడ్డి, రాజేంద్రరెడ్డిలతోపాటు ఆ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నూర్‌బాబా కూడా జగన్‌ను కలిశారు. ఐదు రోజులు.. వైఎస్సార్ జనభేరి పేరుతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అందరినీ ఆకట్టుకున్నారు. ఎండలు మండిపోతున్నా... క్షణం విశ్రమించక ఆయన ప్రజల్లోకి వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించిన ప్రచారానికి అద్భుత ప్రజాదరణ లభించింది. ఐదు రోజులపాటు జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తొలి రోజున గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన జగన్ మిగిలిన నాలుగు రోజులు చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, బంటుమిల్లి, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేటలలో సభలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఆయన నిర్వహించిన రోడ్‌షోలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. సభలకు వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు ఎంపీ అభ్యర్థులు కొలుసు పార్థసారథి, కోనేరు రాజేంద్రప్రసాద్, తోట చంద్రశేఖర్‌లను గెలిపించాలని జగన్మోహనరెడ్డి కోరారు. గన్నవరం, అవనిడ్డ, పామర్రు, పెనమలూరు, పెడన, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థులు దుట్టా రామచంద్రరావు, సింహాద్రి రమేష్‌బాబు, ఉప్పులేటి కల్పన, కేవీఆర్ విద్యాసాగర్, బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రామ్‌ప్రసాద్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జోగి రమేష్, సామినేని ఉదయభానును గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. జగన్మోహనరెడ్డి తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ జిల్లాలో మిగిలిన మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, నందిగామ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలోనూ ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండింది. జిల్లా అంతటా జగన్మోహనరెడ్డి ప్రచార ప్రభావం పడటంతో ఫ్యాన్‌గాలి మరింత వేగం పెరిగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రోజుల్లో మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన చేసిన ఎన్నికల పర్యటనతో ఫ్యాన్ గాలి మరింత పెరిగింది. వాడివేడిగా ఉపన్యాసం.. నడినెత్తిన మండుతున్న ఎండను తలపిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి ఉపన్యాసం వాడివేడిగా సాగింది. జగ్గయ్యపేట సభలో ప్రచండభానుడిలా జగన్మోహనరెడ్డి తన ఉపన్యాసంలో మోడీ, చంద్రబాబు, సుష్మస్వరాజ్లపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తెచ్చింది తామేనని అక్కడ చెప్పిన చంద్రబాబు, చిన్నమ్మను గుర్తుపెట్టుకోవాలంటూ పార్లమెంటు సాక్షిగా కోరిన సుష్మస్వరాజ్ ఇప్పుడు మాట మార్చి రాష్ట్ర విభజన పాపం తనకు అంటగడుతున్నారని మండిపడ్డారు. సోనియా, మోడీ, సుష్మ, చంద్రబాబు ఓట్లు.. సీట్ల కోసం ఏ గడ్డి అయినా కరుస్తారని, రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీలుస్తారని, ఎంతకైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. విలువలు, విశ్వసనీయత ఒకవైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జయం మనదేనని ప్రకటించారు. తనకు అవకాశం ఇస్తే దివంగత వైఎస్ ఆశీస్సులతో రాష్ట్ర దశ దిశ మారుస్తానని చెప్పారు. ఐదు సంతకాలతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు అన్నివర్గాల వారి తలరాత మారుస్తానని జగన్ మోహనరెడ్డి భరోసా ఇచ్చారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయభానుకు ఓటేసి గెలిపిస్తే ఐదేళ్లు నిస్వార్థ సేవచేస్తారని తెలిపారు. -
పులకించిన పల్లెలు
ఏ పల్లె గడప తొక్కినా అంతులేని అభిమానం... ఏ ఊరు పొలిమేరల్లో అడుగుపెట్టినా అనంతమైన ఆప్యాయత... ఎటు చూసినా జనం... వెరసి మహానేత సతీమణి విజయమ్మకు అభిమాన నీరాజనం. శృంగవరపు కోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి పల్లె పోటెత్తింది. విజయమ్మను అక్కున చేర్చుకుని పులకరించిపోయింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఎస్.కోట నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం దారులన్నీ జనగోదారులయ్యా యి. ఆత్మీయ అతిథి కోసం ప్రజలు ఆత్రుతతో ఎదురు చూశారు. తమ వద్దకు వచ్చిన ఆ మాతృమూర్తికి నీరాజనాలు పట్టారు. త నను చూసేందుకు వచ్చిన ప్రజలను విజ యమ్మ ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం పా ర్లమెంట్ అభ్యర్థి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎస్.కోట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. రోడ్‌షో ద్వారా దాదాపు మూడు మండలాలను చుట్టేశారు. ఎస్.కోటలో బహిరంగ స భతో ప్రారంభమైన రోడ్‌షో ఓబల్లయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట మీదు గా ఎల్.కోట మండలంలోకి ప్రవేశించింది. ఈ మండలంలో గొలజాం, సోంపురం జంక్ష న్, లక్కవరపుకోట, చందులూరు, భూమిరెడ్డిపాలెం, లక్ష్మీంపేట, రేగ, కళ్లేపల్లి వరకు సాగింది. ఎస్.కోటలో జరిగిన బహిరంగ స భకు అశేష జనవాహిని హాజరైంది. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. ఈ సం దర్భంగా వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేస్తూనే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిం చారు. అలాగే చంద్రబాబు తొమ్మిదేళ్ల భ యానక పాలనను ప్రజలకు గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాల్లా తన బినామీలైన నామా నాగేశ్వరరావు, రామోజీరావు, సత్యం రామలింగరాజు, ము రళీమోహన్, సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరులకు కట్టబెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించినప్పుడు సభికుల్లో మంచి స్పందన కనిపించింది. ఎస్.కోట పురవీధుల గుండా ప్రారంభమైన రోడ్‌షోకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బారులు తీరి, హారతులతో స్వాగతం పలికారు. తమ గ్రామంలో ప్రసంగించాలని ప్రతీచోటా పట్టుబట్టారు. ఓబల్లయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట, గొలజాం, సోంపురం జంక్షన్, లక్కవరపుకోట, చందులూరు, లక్ష్మీంపేటలో విజ యమ్మ ప్రసంగించారు. లక్కవరపుకోటలోనైతే సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎవర్నీ నిరుత్సాహం పరచకుండా, అందర్నీ కలుస్తూ ముందుకు సాగారు. ముకుందపురంలో స ర్పంచ్ దమర సింగి సత్యవతి, మాజీ సర్పం చ్ నాగిరెడ్డి కనకరాజు, పాల సంఘం అధ్యక్షుడు ఏరువాక సత్యం, కంచెర్ల స్వామినాయుడు, జామి మహేశ్వరరావు, ఏరువాక రామకొండ, గోపిశెట్టి సత్యనారాయణ, ము త్యాలనాయుడు, నాగిరెడ్డి బైరాగినాయుడుతో పాటు ఆరుగురు వార్డు మెంబర్లు విజ యమ్మ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరా రు. అలాగే జగ్గయ్యపేటలో సింగరాయ మా జీ సర్పంచ్ నిరుజోగి సత్యవతి, రాయవరపు పైడితల్లి, సోంపురం గ్రామానికి చెంది న పద్మశాలి చేనేత సహకార సంఘం మం డల అధ్యక్షుడు కొటంశెట్టి గణపతి తదితరులు పార్టీలో చేరారు. ఈ విధంగా విజ యమ్మ వెళ్లిన ప్రతీచోట పార్టీలో చేరేందుకు అనేక మంది ఆసక్తి చూపారు. కాకపోతే, సమయాభావంతో ఆమె సమక్షంలో చేరలేకపోయారు. కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మె ల్యే అభ్యర్థి రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు, నియోజకవర్గ నేతలు అల్లు కేశవ వెంకట జోగినాయుడు, వేచలపు చినరామునాయుడు, వల్లూరి జయప్రకాష్‌బాబు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, నెక్కల నాయుడుబాబు, కోళ్ల గంగాభవానీ తదితర నాయకులు పాల్గొన్నారు. ‘ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు’ శృంగవరపుకోట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్.కోట వచ్చిన వైఎస్ విజయమ్మ పోలీసుల తీరుతో కాసింత ఇబ్బంది పడ్డారు. శనివారం మధ్యాహ్నం వేళ వచ్చిన విజ యమ్మ కాన్వాయ్‌ని స్థానిక నేతలు షిర్డీ సాయి ఆలయం వద్ద నిలిపారు. కాగా అదే సమయంలో రోడ్‌షోకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్ వెనుక ఉండిపోవటంతో స్థానిక పోలీ సులు విజయమ్మ కాన్వాయ్‌ను కాస్త ముందుకు తీయాలంటూ కోరారు. దీంతో కాన్వాయ్ కాస్త ముందుకు తీసి శ్రీనివాసకాలనీ జంక్షన్లో నిలిపారు. అనంతరం రోడ్‌షోలో విజ యమ్మ మాట్లాడుతుండగా మరోమారు సీఐ లక్ష్మణమూర్తి, ఎస్.కోట ఎస్.ఐ ఎస్.కె.ఎస్ ఘనీలు వచ్చి కాన్వాయ్ తీయాలని అన్నారు. దీనిపై స్పందించిన విజయమ్మ ‘పోలీసుల కు దండం పెడతా. మమ్మల్ని ఎందుకు అన్నా ఇబ్బందులు పెడతారు. రాజకీయ పార్టీగా ప్రచారం చేసుకునే హక్కు, బాధ్యత మాకున్నాయ్. ఎలక్షన్ కమిషన్ రాత్రి 10గంటల వరకూ ప్రచారం చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఎక్కడా లేని రూల్స్ ఇక్కడ పెట్టకం డి. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి’ అంటూ కోరారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గా రు. జరిగిన ఘటనపై ఎస్.కోట ఎస్ఐ ఎస్.కె.ఎస్.ఘనీని వివరణ కోరగా ఎవ్వర్ని ఇబ్బం దులు పెట్టలేదని తెలిపారు. టూర్ షెడ్యూల్ కూడా ముందుగానే ఇచ్చారని అన్నారు. పేదలకు వరం ‘అమ్మఒడి’ వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో ప్రస్తావించిన ‘అమ్మఒడి’ పథకం పేదలకు వరం వంటిది. రోజు కూలీలు, నిరుపేదల కుటుంబాల్లోని చిన్నారులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేయడం శుభ సూచకం. ఆమె గెలుపుతో విశాఖ ఎంపీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. - షేక్ సలీమ్, ఎస్.కోట భారీ మెజారిటీ ఖాయం మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంట్ సభ్యురాలిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చడం ఖాయం. ఆమెను గెలిపించేందుకు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు చక్కగా ఉపయోగపడతాయి. - అల్లు శ్రీనివాసరావు, ధర్మవరం రాబోయేది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యే. విలువలు, విశ్వసనీయతతో యువనేత జగనన్న ప్రజల సంక్షేమం కోరుతూ గతంలో అనేక ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేస్తుండడం ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ సీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. - కొప్పాక లక్ష్మణరావు, ధర్మవరం -
స్వర్ణవిశాఖ
విశాఖపై జగన్ వాగ్దానాల జల్లు.. అభివృద్ధికి విశిష్ట ప్రణాళిక హర్షధ్వానాల మధ్య వివరించిన జననేత అమ్మకు అండగా నిలవాలని వినతి జనసంద్రంగా మారిన బీచ్సభ స్వర్ణ విశాఖ అవతరణే లక్ష్యం..హరిత నగర రూపకల్పనే ధ్యేయం..ఐటీలో మేటిగా తీర్చిదిద్దటమే సంకల్పం.. తాము అధికారంలోకి రాగానే మహా నగరాన్ని మహోన్నతంగా ఎలా తీర్చిదిద్దుతామో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తున్నప్పుడు జన కడలి ఆనంద తరంగితమైంది. జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం ఆర్కే బీచ్ వద్ద వైఎస్సార్ జనభేరి బహిరంగ సభలో చేసిన ప్రసంగానికి అద్భుత జన స్పందన లభించింది. సాక్షి, విశాఖపట్నం : ‘విశాఖను ఒక బంగారు నగరంగా తీర్చి దిద్దుతా. విశాఖపట్నం అంటే నాకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ప్రేమ లేకపోతే ఇక్కడి నుంచి నా తల్లినే ఎంపీగా నిలబెడుతున్నా. విశాఖ అభివృద్ధి దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగింది. గుజరాత్‌తో పోటీపడేలా విశాఖను తీర్చి దిద్దుతా. విశాఖలో అమ్మ అవసరం ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం విశాఖ తీరంలో రోడ్‌షో అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నాన్ని తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పారు. వైఎస్సార్ వల్లే విశాఖ అభివృద్ధి చంద్రబాబు చూశారు గానీ ఏనాడూ చేసింది లేదు. ఎవరేం చేసినా అది తానే చేసినట్టు చెప్పుకుంటూ.. జనాల జ్ఞాపకశక్తితో ఆడుకోవడం చంద్రబాబుకు అలవాటు. వైఎస్సార్ చెప్పేది తక్కువ.. చేసింది ఎక్కువ. విశాఖలో విప్రో వచ్చినా.. ఐబీఎం వచ్చినా.. సెజ్ వచ్చినా అది వైఎస్సార్ చలవే. రూ.2 వేల కోట్ల మేర సాఫ్ట్వేర్ ఎగుమతులు, అంతర్జాతీయ స్థాయికి విమానాశ్రయం, రాత్రిపూట విమానాల ల్యాండింగ్‌కు బీజం వేసింది వైఎస్సారే. విశాఖ విమానాశ్రయం రన్‌వే సైజ్ పెంపు, రెండో టెర్మినల్ కట్టిందీ వైఎస్సార్ హయాంలోనే. విశాఖలో బీఆర్టీఎస్ ప్రారంభించి, 80 శాతం పనులు పూర్తి చేసింది వైఎస్సారే. మిగిలిన 20 శాతం పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వాలు నానా యాతనలు పడుతున్నాయి. అపెరల్ పార్కు ఏర్పాటుతో పది వేల మందికి ఉద్యోగాలు రావడానికి వైఎస్సారే కారణమని జగన్ అన్నారు. గ్రీన్ విశాఖ విశాఖపట్నంలో పోర్టు కాలుష్యం, స్టీల్‌ప్లాంట్ కాలుష్యం ఎక్కువ. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించి గ్రీన్ సిటీగా చేయాల్సిన అవసరం ఉంది. విశాఖకు ఐటీ ఎగుమతుల జోన్ తీసుకొస్తాం. ఇవాళ రూ.2 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులున్నాయి. రాబోయే రోజుల్లో కుప్పలుతెప్పలుగా ఐటీ ఎగుమతులు జరిగేలా చేస్తా. పోలవరం తీసుకొచ్చి నీటి కొరత తీరుస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ విశాఖపై వరాల జల్లు కురిపించారు. విశాఖ ఎంపీగా తన తల్లి విజయమ్మతోపాటు, అనకాపల్లి ఎంపీ గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్(తూర్పు), కోలా గురువులు(దక్షిణం), చొక్కాకుల వెంకటరావు(ఉత్తరం), దాడి రత్నాకర్(పశ్చిమం), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), కర్రి సీతారాం(భీమిలి), రొంగలి జగన్నాథం(ఎస్.కోట)ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సమావేశంలో జగన్ వెంట పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, పార్టీ నేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తదితరులున్నారు. -
ఫ్యాన్ ప్రభంజనం
‘ఆయనకు అరవై ఐదేళ్ల వయసొచ్చింది. ఏదోరకంగా పదవిలోకొస్తే చాలనుకుంటున్నా డు. ప్రజలు.. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నాడు. అందుకే.. ఆల్ ఫ్రీ హామీలతో మభ్యపెడుతున్నాడు. వాస్తవాలు గమనించండి. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుంచుకోండి. నీతి.. నిజాయితీ.. విశ్వసనీయతకు ఓటేయండి. సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి మన పార్టీ అభ్యర్థులను గెలిపించండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పాలకొల్లులో శనివారం నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభ జన సునామీని తలపించింది. ‘ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటు వేసేముందు ఒక్కసారి వైఎస్‌ను గుర్తు చేసుకోండి. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకండి’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. నారాయణపురం, మార్టేరు సెంటర్లలో ఆమె నిర్వహించిన ‘జనభేరి’ సభలకు జనం పోటెత్తారు. ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయన సోదరి షర్మిల నిర్వహిం చిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలతో ‘పశ్చిమ’ హోరెత్తింది. క్షీరపురి పట్టణం ‘జగన్’ ఉత్సాహంతో ఉప్పొంగి పోగా..ఉంగుటూరు మండలం నారాయణపురం, పెనుమంట్ర మండలం మార్టేరులో సమర శంఖారావం పూరించిన షర్మిల మాటల తూటాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారుు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందంటూ కార్యకర్తలు జోరు పెం చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయ న సోదరి షర్మిల శనివారం జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఎక్కడ చూసినా వైఎస్సార్ సీపీ జెం డాల రెపరెపలు.. కార్యకర్తలు, అభిమానుల సందడి కనిపించింది. జనసంద్రమైన క్షీరపురి పాలకొల్లులో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన జనభేరి సభకు ప్రజలు సునామీలా తరలివచ్చారు. పట్టణంలోని రోడ్లన్నీ జనసంద్రమయ్యూరుు. రహదారులన్నీ కిక్కిరిసిపోయూరుు. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు వైఎస్ జగన్ రాక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అభిమానానికి వైఎస్ జగన్ పులకించిపోయూరు. వైఎస్ పథకాలను జగనన్న పక్కాగా అమలు చేస్తారు : షర్మిల ‘జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ పథకాలన్నిటినీ బ్రహ్మాం డంగా అమలు చేస్తారు. పేదల కష్టాలు తెలిసిన జగనన్న ప్రతి పేదవాడికి న్యాయం చేస్తారు. ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే తిరగరాసేందుకు జగనన్న పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయలేదు. అందుకే ఏ పథకాన్నీ కొనసాగిస్తానని చెప్పలేకపోతున్నారు. రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేశారు గనుక తానూ చేస్తానంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీ సం వడ్డీ కూడా మాఫీ చేయలేదు చంద్రబాబు. వైఎస్ ఉచిత విద్యుత్ ఇచ్చారు గనుక బాబు కూడా ఇస్తానంటున్నారు. చంద్రబాబు మోసపుమాటలు నమ్మొ ద్దు’ అని షర్మిల పిలుపునిచ్చారు నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీం ద్రనాథ్, ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, పాలకొల్లు అభ్యర్థి మేకా శేషుబాబు, నరసాపురం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు, భీమవరం అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, ఉండి అభ్యర్థి పాతపాటి సర్రాజు, ఉంగుటూరు అభ్య ర్థి పుప్పాల వాసుబాబు, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, అల్లు సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, గుబ్బల తమ్మయ్య, మేడిది జాన్సన్, కండిబోయిన శ్రీనివాసరావు, ఎంఎస్ రెడ్డి, గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. పేదల గుండెల్లో స్థానం సంపాదించాలి : వైఎస్ జగన్ ‘ఓటు వేసేముందు మనమంతా ఆలోచన చేయాలి. ఎటువంటి నాయకుడు మనకు కావాలి. ఎటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి అనేది ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో... ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి మనసు తెలుసుకుంటాడో.. ఏ వ్యక్తి అయితే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండేందుకు ఆరాటపడతాడో అటువంటి వ్యక్తినే మనం నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తినే మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. ఇవాళ మీ అందరితో ఒకే విషయాన్ని చెబుతున్నా.. ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మనం మళ్లీ తెచ్చుకునేందుకు కలసికట్టుగా పనిచేద్దాం’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలకొల్లు సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. -
విశాఖకు అమ్మ అవసరముంది: వైఎస్ జగన్
విశాఖపట్నం: అమ్మలాంటి మంచి మనషిని ఎవర్నీ చూడలేదని, విశాఖపట్నానికి అమ్మ అవసరం ఎంతో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో జగన్ ప్రసంగిస్తూ.. అమ్మ ఏదైనా పట్టుకుంటే సాధించేకా వదిలిపెట్టరని అన్నారు. ఈ సభలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. గుజరాత్‌ను తలదన్నేలా పోటీ పడుతూ విశాఖను అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశాఖకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ఐటీ, ఎయిర్‌పోర్టు అభివృద్ది, ఆరు వేల కోట్లతో బీఆర్టీ అభివృద్ధి, అపెరల్ పార్క్ గురించి వివరించారు. విశాఖను బంగారు నగరంగా మార్చాలంటే కాలుష్యాన్ని నిర్మూలించాలని, గ్రీన్ సిటీగా చేస్తానని జగన్ చెప్పారు. విశ్వసనీయతకు ఓటు వేయాలని, రాజన్న సువర్ణయుగం తెచ్చుకుందామని వైఎస్ జగన్ కోరారు. దివంగత మహానేత వైఎస్ఆర్ సువర్ణ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు భయానక పాలన సాగేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. అప్పుడు ప్రజలు ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం పరిగెత్తిన రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అంతకుముందు జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఏ ఒక్కరోజూ సీఎం హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోలేదన్నారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో కూడా చంద్రబాబు తెలుసుకోలేదని చెప్పారు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ భయానక రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు. విశ్వసనీయత,నిజాయతీలకు అర్థం తెలినీ రోజులవని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనేంటన్న రీతిలో చంద్రబాబు మాట మారుస్తారని విమర్శించారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలుగా పట్టపగలే అబద్ధాలు ఆడుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ దేముడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చంద్రబాబు చేయలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. -
పవన్ కల్యాణ్ కు లెక్కలేని తిక్క ఉంది: షర్మిల
మల్కిపురం: పవన్ కల్యాణ్‌కు లెక్కలేని తిక్క ఉందని, ఆయన మాటలు, చేష్టలే చెబుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ, టీడీపీల పొత్తు కొత్త సీసాలో పాతమందు వంటిదని, ఈ కూటమికి ఓట్లు దండుకోవాలనే తపన తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో శనివారం జరిగిన సభలోనూ, అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో శనివారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. జగనన్నకు మీ మొహంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమన, ఓదార్పు అనే ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం సోనియాను ఎదిరించి ప్రజల కోసం పోరాడారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేసి, రాజన్న రాజ్యానికి నాంది పలుకుదామని, జగనన్న నాయకత్వంలో నడుద్దామని షర్మిల కోరారు. ఛార్జీలు, సర్ ఛార్జీలంటూ 32 వేల కోట్ల రూపాయిల భారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలపై మోపిందని, ప్రతిపక్ష నేతగా నిలదీయాల్సిన చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కయ్యారని షర్మిల మండిపడ్డారు. విభజన పాపంలో టీడీపీ, బీజేపీలకు సమాన భాగముందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం దక్కించుకోవడం కోసమా లేక రాహుల్‌ను ప్రధానిగా చేయడం కోసమా? అంటూ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల ఉసురు కాంగ్రెస్‌కు తగులుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామంటూ మోసం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, బీజేపీ, టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని షర్మిల తప్పుపట్టారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమంటే చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కరినీ పట్టించుకోలేదని, ఇప్పుడు వైఎస్ఆర్ పథకాలనే అమలు చేస్తానంటూ రాష్ట్రమంతా చంద్రబాబు తిరుగుతున్నాడని షర్మిల వ్యాఖ్యానించారు. -
బీజేపీ, టీడీపీల పొత్తు.. కొత్త సీసాలో పాతమందు
మల్కిపురం: బీజేపీ, టీడీపీల పొత్తు కొత్త సీసాలో పాతమందు వంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. ఈ కూటమికి ఓట్లు దండుకోవాలనే తపన తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో శనివారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఛార్జీలు, సర్ ఛార్జీలంటూ 32 వేల కోట్ల రూపాయిల భారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలపై మోపిందని, ప్రతిపక్ష నేతగా నిలదీయాల్సిన చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కయ్యారని షర్మిల మండిపడ్డారు. విభజన పాపంలో టీడీపీ, బీజేపీలకు సమాన భాగముందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం దక్కించుకోవడం కోసమా లేక రాహుల్‌ను ప్రధానిగా చేయడం కోసమా? అంటూ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల ఉసురు కాంగ్రెస్‌కు తగులుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామంటూ మోసం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటూ బీజేపీ, టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని షర్మిల తప్పుపట్టారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమంటే చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కరినీ పట్టించుకోలేదని, ఇప్పుడు వైఎస్ఆర్ పథకాలనే అమలు చేస్తానంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాడని షర్మిల వ్యాఖ్యానించారు. -
ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: జగన్
పి.గన్నవరం: దివంగత మహానేత వైఎస్ఆర్ సువర్ణ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు భయానక పాలన సాగేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. అప్పుడు ప్రజలు ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం పరిగెత్తిన రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఏ ఒక్కరోజూ సీఎం హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోలేదన్నారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో కూడా చంద్రబాబు తెలుసుకోలేదని చెప్పారు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ భయానక రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు. విశ్వసనీయత,నిజాయతీలకు అర్థం తెలినీ రోజులవని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనేంటన్న రీతిలో చంద్రబాబు మాట మారుస్తారని విమర్శించారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలుగా పట్టపగలే అబద్ధాలు ఆడుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ దేముడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చంద్రబాబు చేయలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. -
'వాళ్లిద్దరూ స్వర్గాన్ని తీసుకువస్తారట!'
-
నారాయణపురంలో వైఎస్ షర్మిల ప్రసంగం
-
ధర్మయుద్ధంలో వైఎస్సార్ కాంగ్రెస్‌దే విజయం
కొవ్వూరు సభలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణచౌదరి కొవ్వూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ఈ ధర్మయుద్ధంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణచౌదరి అన్నారు. కొవ్వూరు విజయవిహార్ సెంటర్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఆయన కోరారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ విజయమ్మను కంటతడి పెట్టించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు గుణపాఠం చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. వైఎస్ విజ యమ్మ పార్లమెంట్ సభ్యురాలిగా గెలుపొంది దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నట్టు తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 30మంది ఎంపీలను విజయమ్మకు తోడుగా పంపించి రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొవ్వూ రు ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి సమర్థవంతంగా అమలు కావాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. జగనన్నపై ప్రేమతో, వైఎస్సార్‌పై అభిమానంతో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు శ్రమించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకునే స్వభావం షర్మిలమ్మకు ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందన్నారు. పేదల ప్రభుత్వం రాబోతుందన్నారు. సభలో చిరుజల్లులు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతుండగా ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. చిరుజల్లులు కురిశాయి. ప్రజలు కేరింతలు కొడుతూ రాజన్నరాజ్యం రాబోతుందనడానికి ఈ జల్లులు సంకేతమన్నారు. జోరు గాలి వీయడంతో ఫ్యాన్ గాలి జోరందుకుందని వ్యాఖ్యానించారు. -
నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి
విశాఖపట్నం,న్యూస్‌లైన్: వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం విశాఖ లోక్‌సభ పరిధిలోని గాజువాక, ఎస్.కోట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ తెలిపారు. ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. ఉదయం 8.30 గంటలకు స్టీల్‌ప్లాంట్ గేట్ వద్ద సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 11 గంటలకు జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం విశాఖ బీచ్‌రోడ్‌లో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు. -
టీడీపీని చూస్తే జాలేస్తోంది
అధికారం కోసం పవన్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు: షర్మిల ధ్వజం ఏలూరు: ‘‘ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అన్ని పక్షాలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా గెలవలేకపోయాడు. ఇప్పుడు రాజశేఖరుని కొడుకుని కూడా ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేకుండా పోయింది. అందుకే ఎక్కడి నుంచో మోడీని, ఇక్కడ నుంచి సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్‌ని తెచ్చుకున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు మోడీ కాళ్లు పట్టుకున్నారంటే అర్థం ఉంది. కానీ చివరికి పవన్ కల్యాణ్ కాళ్లు కూడా పట్టుకున్నారు. తెలుగుదేశం నాయకులను చూస్తే పాపం అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చంద్రబాబును విమర్శించారు. బోడీ మోడీ, పవన్ లేకుంటే చంద్రబాబు బయటకే రారన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కొవ్వూరులో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ఆమె మాట్లాడారు. ‘‘పీఆర్పీ పెట్టిన చిరంజీవి రూ.70 కోట్లకు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయాడు. ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్ ఇప్పుడు ఎంతకు అమ్ముడుపోయాడో తెలియాల్సి ఉంది. ఒక్క మంత్రి పదవి కోసం ఆయన అన్నగారు పార్టీని మూసేశారు. ఈయన ఏ మంత్రి పదవి వస్తుందని బీజేపీ, టీడీపీ పక్కన చేరారో తేలాల్సి ఉంది. సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఊరుకోనని చిందులు తొక్కుతున్న పవన్ కల్యాణ్.. 2009లో పీఆర్పీ మేనిఫెస్టో లో తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు ఎందుకు ప్రకటించారు? ఇక్కడి ప్రజల గొంతు కోసిన బీజేపీ, టీడీపీ నేతలనే ఈయన కౌగిలించుకుని నీతులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ చెప్పేదంతా సొల్లే. చంద్రబాబుకు ఓటేయవద్దని గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చెప్పలేదా? ఇప్పుడు ఆయనకు ఓటేయాలని ఎలా చెబుతున్నాడు?’’ అని షర్మిల దుయ్యబట్టారు. -
మంచి నేతతోనే మంచి పాలన
విశాఖ ఎన్నికల ప్రచారంలో వైఎస్‌విజయమ్మ విశాఖపట్నం: ‘‘కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దివంగతనేత రాజశేఖరరెడ్దిదే. వైఎస్సార్ సువర్ణయుగంలో ఒక్కో కుటుం బానికి నాలుగైదేసి సంక్షేమ పథకాలందాయి. విద్యుత్, ఆర్టీసీ, మున్సిపల్, నీటి పన్నులేవీ పెంచలేదు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మందికి ఉచిత ఆపరేషన్లు. దేశం మొత్తంమీద ఐదేళ్లలో 47 లక్షలఇళ్లు నిర్మిస్తే.. అదేకాలంలో ఒక్క మన రాష్ట్రం లోనే 48లక్షల ఇళ్లు నిర్మించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లతో రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మంచినేతను ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని నిరూపించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం నగరంలోని మధురవాడ, ఆనందపురం, గాజువాక, పరవాడలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో తాము ఎన్నో అవమానాలకు గురయ్యామని చెప్పారు. ‘‘వైఎస్ మరణం తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చుతానని నల్లకాలువలో ఇచ్చిన మాటకోసం జగన్‌బాబు పదవిని కాదనుకున్నాడు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చాక మా కుటుంబంపై కక్ష సాధింపు మొదలైంది. అయినా జగన్‌బాబు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాడు. ఫీజుపోరు, జన దీక్ష, జల దీక్ష, రైతు దీక్ష, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారు. నేనూ వారం రోజులు నిరాహార దీక్ష చేశా. ఓదార్పుయాత్రకు వచ్చిన ఆదరణచూడలేక... చేయని తప్పుకు జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను 16నెలల వరకు అడ్డుకున్నారు. అయినా తన పోరాటం ఆపలేదు. తనను నమ్ముకున్న వారికి అండగా ఉండాలనే నన్ను, షర్మిలను మీ ముం దుకు పంపించారు. మాటకు కట్టుబడే కుటుంబం మాది. ఫ్యాను గర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీని గెలిపించండి. మేనిఫెస్టోలో ప్రకటించివన్నీ నెరవేరుస్తాం’’ అని భరోసానిచ్చారు. -
‘జనభేరి’ ఏర్పాట్ల పరిశీలన
పి.గన్నవరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పి.గన్నవరంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. పి.గన్నవరం మూడు రోడ్ల సెంటర్లో జరిగే ఈ సభకు కోనసీమ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. మూడు రోడ్ల సెంటర్ సమీపంలో ఉన్న లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను చిట్టబ్బాయి, పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పి.గన్నవరం అసెంబ్లీ అభ్య ర్థి కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. చిట్టబ్బాయి మాట్లాడు తూ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ఇక్కడకు చేరుకుంటారని తెలిపారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి పర్యటించిన ప్రతీచోటా ఇసుకేస్తే రాలనంత జనం తరలివస్తున్నారన్నారు. మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ సభకు అంబాజీపేట మీదుగా వచ్చే వాహనాలను విశాఖ డెయి రీ వద్ద లేఅవుట్ స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు. జి.పెదపూ డి వైపు వచ్చే వాహనాలను హెలిపాడ్ సమీపంలోని ఖాళీ స్థలం లోను, రాజోలు నుంచి వచ్చేవి ఎల్.గన్నవరం వద్ద పార్కింగ్ చేయాలన్నారు. పార్టీ నాయకులు మంతెన రవిరాజు, అడ్డగళ్ల వెంకట సాయిరామ్, దొమ్మేటి వెంకట శివరామన్, కొక్కిరి రవికుమార్, పిల్లి సత్యనారాయణ, అన్నాబత్తుల నాయుడు, యన్నాబత్తుల ఆనంద్, చొల్లంగి చిట్టిబాబు పాల్గొన్నారు. షర్మిల సభను విజయవంతం చేయండి రంపచోడవరం : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల నాలుగో తేదీన స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహిస్తున్న వైఎస్సార్ జనబేరి సభను విజయవంతం చేయాలని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ కోరారు. ఉదయం 10 గంటలు జరిగే ఈ సభకు కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్‌లు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రభంజనం
-
ఆ ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?
* 1999 - 2004 మధ్య టీడీపీ-బీజేపీ ఒక్కటై రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పారుగా.. అప్పుడేం చేశారు? వైఎస్ జగన్ * పోలవరం, గాలేరు-నగరి, హంద్రీనీవా నాడు గుర్తుకు రాలేదే? * సీమాంధ్రకు వెయ్యి కి.మీ. తీరముందంటున్న మోడీకి నాడు అది గుర్తురాలేదేం? * మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు.. * మన గ్యాస్‌లో మనకు కోటా ఇవ్వకుండా.. దేశాన్ని అభివృద్ధి చేస్తాననడం న్యాయమేనా? * 25 మంది ఎంపీలను గెలిపించుకుందాం.. అప్పుడు ప్రధాని మోడీనా.. ఎల్లయ్యా.. పుల్లయ్యా అన్నది మనమే నిర్ణయిద్దాం ‘వైఎస్ఆర్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మొన్న తిరుపతి సభలో నరేంద్ర మోడీ, చంద్రబాబు మాట్లాడుతూ తామిద్దరం కలిస్తే ఆకాశం నుంచి స్వర్గాన్ని అలా అలా కిందికి తీసుకొచ్చేస్తామని చెప్పారు. సీమాంధ్రను ఎక్కడికో తీసుకుపోతామన్నారు. వాళ్లను నేను ఒక్కటే అడుగుతున్నా.. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఒక్కటై ఇటు రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ నేతలు చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు చెప్పగలరా? ఆ రోజు మీకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలేదా? పులిచింతల ప్రాజెక్టు, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు గుర్తుకు రాలేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కాబట్టి గుర్తొచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం కృష్ణా జిల్లా తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి.. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. వేలాది మంది ఈ కార్యక్రమాలకు తరలివచ్చారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దాం.. ‘‘తిరుపతి సభలో నరేంద్రమోడీ అంటారు... రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉంది.. చంద్రబాబుకు ఓటెయ్యండి.. గొప్పగా బాగు పరుస్తారని చెప్పారు. ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబు నాయుడులను ఒకటి అడగదలచుకున్నా. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మన గ్యాస్‌లో మనకు వాటా ఇవ్వకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎంతవరకు న్యాయం? అని అడగదలచుకున్నా. వీరికి మన మీద ప్రేమ లేదు. వీరికెవ్వరికి మన భాష రాదు.. ఆప్యాయత లేదు. వీరికి కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. అందుకోసం ఏ గ డ్డి అయినా తింటారు. వీళ్లను ఎవరూ నమ్మొద్దు. ఈ ప్రాంతంలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్క సీటు కూడా పక్కకు పోకుం డా 25 సీట్లను మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దామా.. ఎల్లయ్యను చేద్దామా.. పుల్లయ్య ను చేద్దామా అన్నది ఆ రోజు నిర్ణయం తీసుకుందాం. ఎవరైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మనకు నమ్మకం ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తిని మనం ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. ఆరోజు ప్రధాని సీటులో కూర్చునే వ్యక్తి మనకు ఏం కావాలో దానికి ఒప్పుకుంటేనే ఆ కుర్చీ మీద కూర్చోబెడదాం. జగన్‌పై బురదజల్లడమే ఎజెండా.. ఈ రోజు రాజకీయ వ్యవస్థ ఎంతగా చెడిపోయిందంటే.. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారు. బీజేపీ ఆ విభజనకు మద్దతు పలికింది. దానికి చంద్రబాబు నాయుడి ఎంపీల తోడు ఉండబట్టే రాష్ట్రాన్ని విభజించగలిగారు. తెలంగాణలో ఎన్నికలు జరిగే వరకు ఈ మాటలే అక్కడ చెబుతూ వచ్చారు. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అయితే పెద్దమ్మ సోనియా గాంధీతోపాటు చిన్నమ్మనైన తాను సహకరిస్తేనే రాష్ట్రాన్ని విభజించారని ఆమె అన్నారు. నిస్సిగ్గుగా నరేంద్రమోడీ నుంచి సుష్మాస్వరాజ్ దాకా తాము సహాయం చేయకపోతే విభజన జరిగేది కాదని తెలంగాణలో అన్నారు. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లినప్పుడు నిస్సిగ్గుగా తానిచ్చిన లేఖతోనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. వీరందరి పరిస్థితి ఎలా ఉందంటే ‘అడ్డంగా ఒక మనిషి కాలు నరికేసి... ఆయింట్మెంటు పెట్టడానికి నేనున్నానంటూ ముందుకు వస్తున్నట్లు’ ఉంది. తెలంగాణలో ఎన్నికలు 30వ తేదీన అయిపోయాయి. ఆ రోజు సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అయిపోయి గంట కూడా తిరగకముందే ఏడు గంటలకు తిరుపతిలో ఒక మీటింగ్ జరిగింది. బీజేపీ నుంచి మోడీ, వెంకయ్య నాయుడు, తెలుగుదేశం నుంచి చంద్రబాబు, వీళ్లతోపాటు చాలామంది తోకలు అందరూ నిస్సిగ్గుగా మాట్లాడారు. అందరిదీ ఒకే లక్ష్యం.. అదేంటంటే జగన్‌కు ప్రజల్లో ఆదరణ ఉంది.. జగన్‌పై బురద జల్లండి అన్న ఒకే ఒక ఎజెండాతో మాట్లాడారు. వీళ్లు మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగా గుండె బరువెక్కింది. నిజాయితీలేని మాటలు మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించింది. ఆ వేదిక మీద రాష్ట్రాన్ని విడగొట్టింది జగన్ అంటూ అభాండాలు వేయడానికి చూశారు.’’ బాబు కావాలా? నేను కావాలా? అబద్ధాలు, వెన్నుపోట్లకు మారుపేరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావాలో, విశ్వసనీయత, నిజాయితీ కలిగిన తాను కావాలో ప్రజలే తేల్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల్లో నాతో చంద్రబాబు పోటీ పడుతున్నారు. చంద్రబాబు నాయుడి గత చరిత్రను ఒకసారి తిరగేయండి. చంద్రబాబు భయానక పరిపాలనను గుర్తు తెచ్చుకోండి’’ అని సూచించారు. ‘‘విశ్వసనీయత లేని, నిజాయితీ లేని చంద్రబాబు కావాలా?’’ అని మైలవరం సభలో ప్రశ్నించగా.. ప్రజలు ముక్తకంఠంతో ‘నో’ (వద్దు) అంటూ చేతులు పెకైత్తారు. చంద్రబాబుకు వినపడేలా చెప్పాలని జగన్ అనే సరికి సభా ప్రాంగణం మొత్తం ‘నో’ అంటూ నినదించింది. ‘విశ్వసనీయతకే మారుపేరుగా నిలబడిన నేను కావాలా?’ అని జగన్ అడిగినప్పుడు అందరూ ‘యస్’ అంటూ గళమెత్తి చాటారు. గట్టిగా చెప్పాలని మరోసారి జగన్ కోరగా మైలవరం మొత్తం మార్మోగిపోయింది. నాలుగు జిల్లాల్లో నేడు జగన్ ప్రచారం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శనివారం నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం హెలికాప్టర్లో బయలుదేరి తొలుత కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉదయం 9.30, పశ్చిమగోదావరిలోని పాల కొల్లులో ఉదయం 11.00, తూర్పుగోదావరిలోని పి.గన్నవరంలో మధ్యాహ్నం 1.00, విశాఖపట్టణంలోని జగదాంబ సెంటర్లో సాయంత్రం 5.00 గంటలకు జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. సీమాంధ్రలో ప్రచారం ముగిసే వరకూ జగన్ ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్‌ను వినియోగిస్తారని ఆయన వివరించారు. -
ఆ ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?
-
కోట్లాదిమందికి ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్దే: విజయమ్మ
విశాఖపట్నం: రాష్ట్రంలో కోట్లాదిమందికి ఉచితంగా వైద్యం అందించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా పరవాడలో జరిగిన సభలో విజయమ్మ ప్రసంగించారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేసింది వైఎస్ఆర్ అని చెప్పారు. అటువంటి వైఎస్ఆర్ పాలన కోసం ఆలోచన చేయాలని విజయమ్మ ప్రజలను కోరారు. ఎన్టీఆర్ పథకాలనే చంద్రబాబు అమలు చేయలేకపోయారని, ఆ పాలన ఒక పీడకలని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు పాలను ఏ రైతూ మర్చిపోడని విజయమ్మ పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను చంద్రబాబు తన అనుచరులకే ధారాదత్తం చేశాడని విమర్శించారు. మీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు తీసేసారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంను అభివృద్ధి చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్‌గా ఎలాచేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజయమ్మ ప్రజలను కోరారు. -
'అన్నీ ఫ్రీ.....ఫ్రీ... ఆల్ ఫ్రీ.... అట!'
జంగారెడ్డి గూడెం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే జగనన్న తన జీవితాన్ని అంకితం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటు వేసే ముందు వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పాలక పక్షంతో కుమ్మక్కై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. విభజనలో కాంగ్రెస్‌తో పాటు చంద్రబాబు నాయుడు ప్రధాన కారకులని షర్మిల విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు లెక్కలేనంత తిక్క అని ఆయనే చెప్పుకుంటారు అని ఆమె ఎద్దేవా చేశారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, పూర్తి మద్యపానం నిషేధం అన్నారని, అయితే ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని షర్మిల వ్యాఖ్యానించారు. ఏనాడు పేదల పక్షాన మాట్లాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అధికార దాహంతో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ... మహిళలకు బంగారు మంగళసూత్రాలు, అమ్మాయి పుడితే రూ.5వేలు నగదు, బాలికలకు సైకిళ్లు, పీజీ వరకూ ఉచిత విద్య, యువతకు కోటి ఉద్యోగాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఇంటికో ఉద్యోగం, ఫ్రీగా సెల్ఫోన్లు ....అంటూ అన్ని ఉచితం...ఉచితం.. అంటూ చంద్రబాబు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
ఆ ముగ్గురూ జోగులే !: షర్మిల
► గుంటూరు జనభేరిలో మోడీ, వెంకయ్య, పవన్‌లపై షర్మిల ధ్వజం ►జగన్ ఒక్కడిని ఎదుర్కోలేక చంద్రబాబు వీళ్లను తెచ్చాడు ►జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే ►విభజన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముంది ►మోడీ మాటలు నమ్మడానికి సీమాంధ్ర ప్రజలు పిచ్చివాళ్లు కాదు సాక్షి, గుంటూరు: ‘‘టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అందరితో కలసి మహాకూటమిగా ఏర్పాటు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి వెళ్లిపోయినా.. ఆయన కొడుకును కూడా ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఈ చంద్రబాబుకు లేదు. అందుకనే బీజేపీకి చెందిన నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్‌లను మూకుమ్మడిగా తీసుకొచ్చాడు. అయినా ఫరవాలేదు. జోగీజోగీ రాసుకుంటే బూడిదే రాలుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శిం చారు. తిరుపతి సభలో ఈ ముగ్గురూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ వారిని కడిగిపారేశారు. తెలుగు ప్రజలను విడగొట్టిన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముందన్నారు. కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే.. ‘కొబ్బరికాయ ముక్కల్లా విభజించండి’ అని చంద్రబాబు మద్దతు పలికారని, చట్టసభల్లో విభజనకు బీజేపీ బేషరతుగా మద్దతిచ్చిందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు, తాడికొండ, పెదకాకానిలో గురువారం జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. మూడురాష్ట్రాల్లో ఏం చేశారు..? ‘‘చంద్రబాబు మూకుమ్మడిగా తెచ్చిన మోడీ, వెంకయ్య, పవన్ కల్యాణ్.. ఈ జోగులంతా తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టారు. అందరిదీ ఒక్కటే టార్గెట్ జగన్. అందరూ మనస్ఫూర్తిగా జగన్‌ను ఆడిపోసుకున్న తరువాత, ‘సీమాంధ్రను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము.. హైదరాబాద్ లాంటి రాజధానిని మళ్లీ సీమాంధ్రలో కడతాము.. అదిగదిగో చందమామ..’అని మోడీ సీమాంధ్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బీజేపీ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడూ ఇదే వాగ్దానాలు చేసింది. కనీసం ఒక్కో రాష్ట్రానికి రూ. 500 కోట్లయినా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, కనీసం చెప్పుకోదగ్గ మంచి ఆస్పత్రి కూడా లేదు. అలాంటిది మోడీ నిన్న వచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కడతామంటే నమ్మడానికి తెలుగు ప్రజలు అమాయకులనుకుంటున్నారా.. లేక పిచ్చివాళ్లనుకుంటున్నారా..? ఇంకొకరు వెంకయ్యనాయుడు ఈయన సొంత నియోజకవర్గంలో, సొంత వార్డుల్లో ఒక్క వార్డు మెంబరును కూడా గెలిపించుకోలేరు. పవన్ సేవ చేస్తారట.. ఇంకొకరు ఆయన పక్కనే నిల్చున్నారు, పవన్ కల్యాణ్ అట. ఈ పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం అనే ఓ పార్టీ పెట్టారు. అన్నా తమ్ముడు ఇద్దరూ కలిసి రూ. 70 కోట్లకు ఆ పార్టీని అమ్మేసుకుని మంచం కింద ఆ డబ్బు దాచి పెట్టుకుని కేసులు జరగకుండా మేనేజ్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లు అదే మంచంమీద ఇద్దరూ తొంగున్నారు. ప్రజారాజ్యం పెట్టేటప్పుడు పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ప్రచారం చేశారు, హామీలు కూడా ఇచ్చారు. ప్రజారాజ్యంలో యువసేన అనే దానికి అధ్యక్షునిగా ఉన్నారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీకే పార్టీని అమ్మేసుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఒక్క సమాధానమైనా చెప్పారా ఈ పవన్ కల్యాణ్. ఈయన సేవ చేస్తారట.. సేవ అనే పేరుతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ పెట్టి.. కోట్ల కొద్దీ విరాళాలు కూడా సేకరించారు. ఆ సంస్థ ఏమైందో, ఆ విరాళాలను ఏం చేశారో ఎప్పుడైనా చెప్పారా? ఎంత మంది ప్రజలకు సేవ చేశారో ఎప్పుడైనా చెప్పారా? అంత హడావుడిగా కోట్ల రూపాయలు సేకరించి స్థాపించిన సంస్థ కదా.. కనీసం ఇప్పుడది బతికి ఉందా, చచ్చిందా.. అదైనా చెప్పారా పవన్ కల్యాణ్ . చెప్పలేదు. ఈ ఐదేళ్ళల్లో ఎవరికీ ఏ సమాధానం చెప్పలేదు. మొన్న ఆడిటోరియంలో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో ప్రజల కోసం ప్రశ్నించడానికే ముందుకు వచ్చానని చెప్పుకున్నాడు ఈ పవన్ కల్యాణ్. చంద్రబాబుకు అధికారమిస్తే గొయ్యి తవ్వుకున్నట్టే.. వీళ్లందరినీ తెచ్చింది చంద్రబాబు. బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఫలానా గొప్ప పథకాన్ని చేశాను, నేను ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ ఆ పథకాన్ని చేస్తానని చెప్పుకునే ధైర్యం ఈ రోజు చంద్రబాబుకు లేదు. పదేళ్లు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఈ పదేళ్లలో నేను ప్రజలకు వచ్చిన ప్రధాన సమస్యలో ఫలానా పోరాటం చేశాను.. ప్రభుత్వం మెడలు వంచి ఫలానాది సాధించాను.. ఓట్లు వేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంత అసమర్థుడు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కదా అని, అన్ని దొంగ వాగ్దానాలు చేస్తూ తిరుగుతున్నాడు.. ఒక సామెత ఉంది.. పేనుకు పెత్తనం ఇస్తే మొత్తం గొరిగేసినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మొత్తం దోచేస్తాడు. చంద్రబాబు మాటల్లో నిజంలేదు. చంద్రబాబు వాగ్దానాల్లో నిజం లేదు. చంద్రబాబు గుండెల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే. -
పిలుపే ప్రభం‘జనం’
మండే ఎండలోనూ జగన్ జనభేరి జిల్లా పరిస్థితిని ప్రస్తావించిన జననేత బాబు పాలనలో నిర్లక్ష్యం.. వైఎస్ పాలనతో వైభవం రెండో పంటకు నీరిచ్చిన రైతు బాంధవుడు వైఎస్ చేనేత.. మత్స్యకారులను ఆదుకుంటానని హామీ తీరంలో సమస్యలు పరిస్కారిస్తానని భరోసా 25 ఎంపీలు గెలిపించుకుంటే కొల్లేరు కుదింపు సాధించుకోవచ్చని పిలుపు ప్రజల చల్లని దీవెనల ముందు మండే భానుడు చిన్నబోయాడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం గంటల సమయాన్ని సైతం నిమిషాలు, క్షణాలుగా గడిపేసిన జనం తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉక్కపోతను సైతం లెక్కచేయక అభిమాన నేత కోసం ఎదురుచూసి జననేత చూపిన అభిమాన జడిలో తడిసి ముద్దయ్యారు. జనభేరి సభల్లో జగన్ జిల్లా వాసుల ఇబ్బందులను సమస్యలపై స్పష్టమైన హామీలిచ్చారు. పేదోడి క్షేమం కోరే తమ ప్రభుత్వంవస్తుందని, మళ్లీ వైఎస్ సంక్షేమ రాజ్యం తేస్తానని భరోసా ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో వైఎస్సార్ జనభేరి మూడోరోజైన గురువారం పెడన నియోజకవర్గం బంటుమిల్లి నుంచి ప్రారంభమైంది. సింగరాయపాలెం మీదుగా కైకలూరు వరకు సాగింది. బంటుమిల్లి, కైకలూరులో జరిగిన సభల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్‌షోలో భాగంగా దారిపొడవునా ఆయన వృద్ధులను, యువకులను, మహిళలను పలుకరిస్తూ ముందుకు సాగారు. జగన్మోహన్రెడ్డి వెంట మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థులు కొలుసు పార్థసారథి, తోట చంద్రశేఖర్, పెడన, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థులు బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రామ్‌ప్రసాద్, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఉన్నారు. రెండో పంటకు నీరిచ్చిన వైఎస్... జనభేరి సభల్లో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కనీసం ఒక పంటకు కూడా సరిగా నీరివ్వకపోవడంతో అన్నదాతలు వలస కూలీలుగా మారిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. పూలమ్మినచోటే కట్టెలు అమ్మలేక పొరుగు ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన అన్నదాతల అవస్థలు వైఎస్ గుర్తించారని చెప్పారు. అందుకే జిల్లాలో రైతుల కష్టాలను తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్ రెండో పంటకు కూడా సకాలంలో నీరిచ్చారన్నారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సమస్య రాకుండా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ ఎంతో కృషిచేశారని తెలిపారు. తీర ప్రాంత రైతుల సాగునీటి సమస్య తనకు తెలుసునని, రానున్న కాలంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కనుగొనే దిశగా కృషిచేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో చేనేత, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారని,వారి భవిత బాగుండేలా తన హయాంలో ప్రత్యేకంగా కృషి చేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తీరం సమస్యలు.. కొల్లేరు వాసుల వెతలు తీరుస్తా... తీర ప్రాతంలోని పలు సమస్యలను పెడన ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ జననేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తేవడంతో ఆయన వాటిపై స్పందించారు. జిల్లాలో ఉన్న సువిశాల తీర ప్రాంతంలో ప్రజలు పడుతున్న సాగు, తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కైకలూరులో కొల్లేరు సమస్యను ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రామ్‌ప్రసాద్‌లు జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. కొల్లేరు వాసుల కష్టాలను తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్ కాంటూరును ఐదు నుంచి మూడుకు కుదిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 మంది ఎంపీలనూ గెలిపించుకుందామని, కేంద్రంలో మనమే కీలకంగా ఉందామని జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 25 మంది ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కొల్లేరు కాంటూరు కుదింపు బిల్లును కేంద్రానికి పంపి కచ్చితంగా సాధించుకుందామని ఆయన తెలిపారు. డీఎన్నార్‌కు మొదటి ఎమ్మెల్సీ... కైకలూరులో కొన్ని కారణాలతో దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోయామని, ఇక్కడ ఉప్పాల రామ్‌ప్రసాద్‌ను గెలిపించుకోవడం ద్వారా డీఎన్నార్‌కు సముచిత స్థానం ఇస్తామని జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తాము అధికారం చేపట్టిన వెంటనే జిల్లా నుంచే మొదటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి డీఎన్నార్‌ను శాసనమండలిలో కూర్చోబెడతానని ఆయన హామీ ఇచ్చారు. ఉదయం 12 గంటలకే జననేత వస్తారని ప్రకటించడంతో కైకలూరు సెంటర్‌కు తరలివచ్చిన వేలాది మంది మండే ఎండలోనూ వేచిచూశారు. జగన్మోహన్రెడ్డి రాత్రి 7 గంటలకు కైకలూరు సెంటర్‌కు చేరుకునే వరకు ఏడు గంటలపాటు వేలాది మంది ప్రజలు ఆయనపై అభిమానంతో ఎదురుచూడటం విశేషం. జగన్మోహన్రెడ్డికి మద్దతు... రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలికారు. టీడీపీ మైనార్టీ సెల్ మచిలీపట్నం నాయకులు షకీర్ అహ్మద్, ఎస్కే మునీరు, మహ్మద్ అక్బర్లు వైఎస్సార్సీపీలో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ పంచికర్ల శివశంకరరావు, మాజీ సర్పంచ్ శ్యాంసన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అంగర రామ్మోహన్రావు, మల్లేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.నారాయణరెడ్డి, పెనమలూరు సమన్వయకర్త పడమట సురేష్‌బాబు, బంటుమిల్లి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఊరా రాంపండు, సబ్బిశెట్టి హరనాథబాబు, సబ్బిశెట్టి విఠల్, సీహెచ్ గాంధీలు కలిసి మద్దతు తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. -
సీబీఐ విచారణకు సిద్ధమేనా?: వైఎస్ విజయమ్మ
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్ బొబ్బిలి (విజయనగరం జిల్లా)/ శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు హయామంతా స్కామ్‌లమయమే. ఏలేరు కుంభకోణం, మద్యం కుంభకోణం, నకిలీ స్టాంపుల కుంభకోణం, తెల్గీ కుంభకోణం, స్కాలర్‌షిప్‌ల కుంభకో ణం, ఐఎంజీ, ఎల్ అండ్ టీ, రహేజా తదితర కుంభకోణాలకు చంద్రబాబు పాల్పడ్డాడు. పనికి ఆహార పథకం, ఇంకు డు గుంతలు, నీరు-మీరు పథకాల్నీ వదల్లేదు. తుఫాన్ నిధుల్ని దిగమింగేశాడు. చంద్రబాబుపై దర్యాప్తు చేయమం టే నెల రోజుల పాటు జాప్యంచేసి సిబ్బంది లేరని కోర్టుకు చెప్పారు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ. ఈలోగా దాదాపు 18 కుంభకోణాల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడు. అటువంటి అవినీతిపరుడా... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్మోహన్రెడ్డిని విమర్శించేది? చంద్రబాబూ.. నువ్వే తప్పూ చేయలేదనుకుంటే, నీకంత ధైర్యముంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా?’’ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ మ్మ విరుచుకుపడ్డారు. ఆమె గురువారం విజయనగరం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, పార్వతీపురం, కురుపాం.. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం, పొందూరు పట్టణాల్లో జరి గిన వైఎస్సార్ జనభేరి బహిరంగసభల్లో ప్రసంగించారు. పాలకొం డ, రాజాంలలో భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయలేదు. పార్టీలో 15 వేల కుటుంబాల చేరిక మక్కువ మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, రంగునాయుడుల ఆధ్వర్యంలో 15 వేల కుటుంబాలు గురువారం కాంగ్రెస్‌ను వీడి విజ యమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. డీసీసీబీ డెరైక్టరు మావుడి తిరుపతిరావుతో పాటు 11 మంది సర్పంచ్‌లు, 42 మంది వివిధ స్థాయిల్లో ఉండే ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు. -
తెలంగాణలో ఓటింగ్ అవగానే మాట మార్చారు
విజయవాడ: తెలంగాణలో ఓటింగ్ అయిపోయి గంట సేపయినా కాకుండానే ఆ నలుగురు మాట మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని చీల్చింది వైఎస్ జగనే అంటూ వారు నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారన్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ - చంద్రబాబు కుమ్మక్కై నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విభజనకు అనుకూలంగా ఓటేసి ఈ రోజు తమని విమర్శిస్తున్నారని చెప్పారు. తానిచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణలో చంద్రబాబు చెబుతారు. సీమాంధ్రలో రాష్ట్రాన్ని విభజించింది వైఎస్ఆర్ సీపీ అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, టీడీపీ కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు. 1999లో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నది రెండు ఎకరాలు. ఈ రోజు ఆయనకు వేలకోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని జగన్ ప్రశ్నించారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ - బీజేపీ కలిసి రాష్ట్రానికి చేసిన మేలు ఎంటో చెప్పాలన్నారు. బిజెపి విభజించిన మూడు రాష్ట్రాల్లో కనీసం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా లేదన్నారు. రాయపూర్‌కు 10 వేల కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. కేవలం రూ. 400 కోట్లు ముష్టి వేసి చేయి దులుపుకున్నారని గుర్తు చేశారు. 25 ఎంపీ సీట్లు మనమే గెల్చుకుని రాష్టాన్ని అభివృద్ధి దిశగా మనమే నడిపించుకుందాం అన్నారు. చందద్రబాబులా సాధ్యంకాని హామీలు తాను ఇవ్వలేను. విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. నిజాయితీలేని మాటలు మాట్లాడలేనని చెప్పారు. కారణం తనకు వారసత్వంగా వైఎస్ఆర్ నుంచి వచ్చింది విశ్వసనీయతేనన్నారు. మరో 6 రోజుల్లో మన తలరాత మార్చే ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర దశ-దిశ మార్చే 11 సంతకాలు చేస్తానని చెప్పారు. -
వర్షంలోనూ కొనసాగిన విజయమ్మ ప్రసంగం
పాలకొండ: జోరున వర్షం కురుస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ జనభేరి సభకు హజరైన జనం ఒక్కరు కూడా కదలకుండా ఆమె ప్రసంగం విన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆమె ఇక్కడకు వచ్చారు. ఆమెకు జనం ఘనస్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నప్పటికీ విజయమ్మ సభకు జనం భారీగా హాజరయ్యారు. తడుస్తూనే ఆమె ప్రసంగం విన్నారు. సభలో ఆమె మాట్లాడుతూ తాను వైజాగ్‌లో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని చెప్పారు. సభలో ఆమె మాట్లాడుతూ తాను వైజాగ్‌లో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని చెప్పారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నేడు సరిగా నడవటం లేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని చెప్పారు. జిల్లాకో పరిశ్రమ స్థాపించి, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి భద్రత కల్పిస్తామని చెప్పారు. మీ ప్రతి కష్టంలోనూ వైఎస్ జగన్ అండగా ఉంటారన్నారు. చంద్రబాబు మాయమాటలను నమ్మొద్దన్నారు. చంద్రబాబు వస్తే సీఎంగా, ప్రతిపక్షనేతగా ఏంచేశావని నిలదీయండని చెప్పారు. 25 ఏళ్లుగా కుప్పంకు ఏమీ చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా సింగపూర్ చేస్తావని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచి, వైఎస్ జగన్‌ను ఆశీర్వదించమని విజయమ్మ కోరారు. -
చంద్రబాబు ఎంతమంది ఉద్యోగాలు తీసేశారు?
విజయనగరం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాలనలో ఎంతమంది ఉద్యోగాలు తీసివేశారో చెప్పాలని వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. ఈ రోజు కురుపాంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతున్న చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమంది ఉద్యోగాలు తీసేశారో చెప్పాలన్నారు. లాభాల్లో ఉన్న పరిశ్రమలను బాబు తన అనుచరులకే కట్టబెట్టారన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్ నీతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు మంచి, మర్యాద తెలియదన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించింది వైఎస్ఆర్ అని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని విజయమ్మ చెప్పారు. మీరు విజ్ఞులు, అభివృద్ధి చేసే వారికే పట్టం కడతారన్నారు. వైఎస్ వారసుడిగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. -
'పవన్‌కు ఉన్నదంతా లెక్కలేనంత తిక్క'
గుంటూరు : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌కు ఉన్నదంతా లెక్కలేనంత తిక్క మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గురువారం గుంటూరు జిల్లా క్రోసూరులో ప్రసంగించారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు పలు ప్రశ్నలు సంధించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి 70 కోట్లకు ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నారని షర్మిల విమర్శించారు. చిరంజీవి కూతురి ఇంట్లో మంచం కింద ఆ 70 కోట్లు పట్టుబడితే కేసులు లేకుండా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన ప్రజారాజ్యాన్ని అన్న కాంగ్రెస్‌లో కలిపేస్తుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. సేవ పేరిట పవన్ కల్యాణ్ కోట్ల కొద్దీ విరాళాలు సేకరించాడని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్కడని షర్మిల ప్రశ్నించారు. ఆ విరాళాలతో పవన్ ఏం చేశాడో ఎక్కడైనా చెప్పాడా అన్నారు. ఎంతమంది ప్రజలకు సేవ చేశాడో పవన్ ఎప్పుడైనా చెప్పాడా అని అడిగారు. తన సంస్థ బతికుందో లేదో పవన్ ఎన్నడైనా చెప్పాడా అన్నారు. ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న పవన్ తొలుత తన అన్నను ప్రశ్నించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజారాజ్యాన్ని ఎందుకు అమ్మేసుకున్నాడో చిరంజీవిని ప్రశ్నించాలని సూచించారు. ఎన్నికల ముందు పవన్‌కు ప్రజలు గుర్తొచ్చారా అని ఎద్దేవా చేశారు. విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి పవన్ అని అన్నారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయారన్నారు. అలాంటి చంద్రబాబు మాటలను నమ్మితే అధోగతేనని షర్మిల అన్నారు. ఇక సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్‌ను కూడా గెలిపించుకోలేని వ్యక్తి వెంకయ్య నాయుడు అని ఆమె ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన వెంకయ్య వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక వెంకయ్య తలాతోక లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. -
కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జగన్ జనభేరి
-
విశ్వసనీయత.. కుళ్లు కుతంత్రాల మధ్య పోటీ
ఈ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపు.. కుళ్లు కుతంత్రాలు మరోవైపు నిలబడి పోటీ చేస్తున్నాయని, విశ్వసనీయతకే ఓటు వేసి సుపరిపాలన తెచ్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి, పెడన ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ కూడా పాల్గొన్నారు. సభలో జగన్ ఏమన్నారంటే... ''రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు కాగడాతో వెతికినా కనిపించడంలేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు వచ్చి అదిచేస్తాను, ఇది చేస్తాను, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను, ఇంటికే వచ్చి ఇస్తానంటారు. ఆయన్ను ఒక్కటి అడగండి. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి, వాటిలో ఒక్కటైనా ఎందుకు చేయలేదని నిలదీయండి. రెండు రూపాయల కిలోబియ్యాన్ని 5.25 చేసింది నువ్వు కాదా అని నిలదీయండి. మద్యనిషేధం విధిస్తామని చెప్పి, తర్వాత నిషేధం ఎత్తేయడమే కాదు.. ఏకంగా గ్రామగ్రామాన బెల్టుషాపులు పెట్టించారు. అడ్డగోలుగా సోనియాగాంధీ మన రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఒకవైపు అన్యాయమని, మరోవైపు మీ ఎంపీలతో విభజనకు అనుకూలంగా ఎందుకు ఓటేయించి రాష్ట్రాన్ని విభజించావని అడగండి. సాధ్యం కాని హామీలను ఇప్పటికీ ఇలాగే చంద్రబాబు ఇస్తున్నారు. చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడను, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయను. ఆయనలా అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పను. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఎన్నికలు అయిన తర్వాత తానుండను, తన పార్టీ కూడా ఉండదన్న భావనతోనే ఆయన ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు ఏదైనా వారసత్వంగా వచ్చిందంటే అది విశ్వసనీయత మాత్రమే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో.. ఇదే కృష్ణా డెల్టామీద ఆధారపడిన రైతన్నకు కనీసం ఒక్క పంటను కూడా సరిగా ఇవ్వలేదు. అదే రాజశేఖరరెడ్డి వచ్చాక పులిచింతల ప్రాజెక్టు పూర్తిచేసి వందల ఎకరాలకు నీళ్లిచ్చిన నాయకుడు దివంగత రాజశేఖరరెడ్డి. చేతలు చేయలేని చంద్రబాబు.. మాటలు మాత్రం పెద్దగా చెబుతుంటాడు. చేనేత, మత్స్యకార సోదరులకు ఒక్కటే హామీ ఇస్తున్నా. ప్రతి పేదవాడి ముఖంలోను చిరునవ్వు చూసే రోజు తీసుకొస్తా. ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపుంటే, మరోవైపు కుళ్లు, కుతంత్రాలున్నాయి. విశ్వసనీయతకు ఓటేసి, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెచ్చుకుందాం. మీ చల్లని ఆశీస్సులు వేదవ్యాస్, పార్థసారథి ఇద్దరికీ సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా అందించాలని సవినయంగా చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నా.'' -
పక్కాఇళ్లు.. వాటికి పావలా వడ్డీకే రుణం
పక్కా ఇళ్లు కట్టించడమే కాదు..వాటిపై పావలా వడ్డీకి 30 వేల రూపాయల రుణం ఇప్పిస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019 నాటికి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు . ఏడాదికి 10 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే..రాష్ట్రంలో మహానేత ఒక్కరే 48 లక్షల ఇళ్లు కట్టించారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో వైఎస్ జగన్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమైక్య ఉద్యమంలో విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు వైఎస్ విజయమ్మ. వైఎస్ఆర్ మరణం తమకు తీరని లోటని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల్లో కలిసిపోతారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. -
బాలకృష్ణకు మతిస్థిమితం ఉందా.. లేదా?
గతంలో ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన బాలకృష్ణను పిచ్చివాడు అనాలా.. సైకో అనాలా అంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. మతిస్థిమితం లేని వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఆమె గుర్తు చేశారు. తనకు మతి స్థిమితం లేదని అప్పట్లో వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. ఒకవేళ ఆయనకు ఇప్పుడు మతి స్థిమితం ఉందంటే అప్పట్లో దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నందుకు బాలకృష్ణపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా గురజాలలో షర్మిల అభిమానులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఈ ప్రశ్నలు సంధించారు. -
విజయం నిశ్చయం:వైఎస్ విజయమ్మ
ప్రశాంతమైన వదనం....కల్మషం లేని హృదయం....ఆమె చిరునవ్వు.... అభాగ్యులకు భరోసా కల్పించింది. కష్టాలకొలిమిలో కాలిపోతున్న జనాలకు ఆమె పలకరింపు మలయమారుతమై సుతారంగా తాకింది. కపటనేతల కుటిలయత్నాలపై ఆమె మాటల తూటాలను పేల్చారు. అబద్ధాల బాబు తొమ్మిదేళ్ల చీకటి పాలన గురించి సోదాహరణంగా వివరించారు. ఆమె వాగ్ధాటి, సంధించిన ప్రశ్నల శరాలు జన ప్రవాహంలో చైతన్య తరంగాలను సృష్టించాయి. మరో వైపు ఆమె పర్యటన వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ప్రబోధాత్మక ప్రసంగం వారిలో కదనకుతూహలాన్ని రగిలించింది. మండుటెండలోనూ పోటెత్తిన జనాలను చూసిన ప్రత్యర్థుల గుండెల్లో ఓటమి గుబులురేగింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించి, బహిరంగ సభల్లో ప్రసంగించారు. జిల్లాపై వరాల జల్లుకురిపించారు. అధికారంలోకి వచ్చినతరువాత చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. వైఎస్ఆర్ సీపీ విజయం నిశ్చయమని, ప్రజల కష్టాలు తీరే రోజులు మరెంత దూరంలో లేవని భరోసా ఇచ్చారు. ప్రజా వాహిని కదిలింది విజయం మీదేనంటూ ప్రతీ గళం పలికింది మద్దతు మీకేనంటూ అడుగు అడుగునా అభిమానం కురిపిస్తూ మాట మాటకూ మహానేతను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రతి పల్లె పలకరించింది... ఆ ఆత్మీయ స్పర్శకు పులకరించి విజయ గీతిక ఆలపించింది.వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలోని పూసపాటిరేగ, గరివిడి, విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి చోటా అభిమానం ఆమెపై పూల వానై కురిసింది. ఆమె మాట్లాడిన ప్రతిచోటా ప్రజా స్పందన మిన్నంటింది. -
నాడు గ్లోబల్స్ ..నేడు రామోజీ
చంద్రబాబు చెప్పే అబద్ధాలు ప్రచారం చేయడమే ఆయన పని గుంటూరు జిల్లా వైఎస్సార్ జనభేరిలో దుయ్యబట్టిన షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీ కోసం అసైన్డ్ భూముల్ని మింగేశారు మార్గదర్శి ద్వారా రూ. 2,600 కోట్ల డిపాజిట్లు అక్రమంగా స్వీకరించారు కళాంజలి దుకాణం ద్వారా స్మగ్లింగ్ చేసినట్లు ఆర్కియాలజీ విభాగం నిర్ధారించింది తోడల్లుడు, కొడుకే ఆయన డబ్బు పిచ్చిని ఈసడించుకున్నారు అలాంటి రామోజీ అవినీతిపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది సొంత మామను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు నిర్మాతపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన మరో సైకో బాలకృష్ణ కుప్పంను మునిసిపాలిటీగా మార్చలేదు, రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తాడట పన్నులేయని సంక్షేమరాజ్యాన్ని అందించింది వైఎస్సార్ ఒక్కరే జగనన్నకు ఒక్క అవకాశమిస్తే తన జీవితాన్నే అంకితమిస్తాడు గుంటూరు: ‘‘నాడు జర్మనీ నియంత హిట్లర్ తరఫున గోబెల్స్ ఎలా అబద్ధ ప్రచారాలు చేస్తూ జనాన్ని మోసగించారో... నేడు చంద్రబాబుకు రామోజీ అలా తయారయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోతుంటే... విజయాలమీద విజయాలు సాధిస్తుందని అబద్ధాలు ప్రచారం చేయడానికి గోబెల్స్ అనే ఓ మంత్రిని పెట్టుకున్నారట హిట్లర్. చంద్రబాబు కూడా ఆయనగారి అబద్ధాలను ప్రచారం చేయడానికి రామోజీ అనే గోబెల్స్‌ను పెట్టుకున్నారు. రాష్ట్రం తగలబడిపోతున్నా, కాంగ్రెస్‌పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నా వారికేం పట్టదు. రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే వారి పని. జగన్మోహన్రెడ్డిపై పేజీలకు పేజీలు అబద్ధాలు రాయడమే వారి ఉద్యోగం. విచిత్రంగా చంద్రబాబుకూ హిట్లర్‌కూ చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ ఏప్రిల్ 20 తేదీనే పుట్టారు. హిట్లర్‌లానే చంద్రబాబూ నియంత... బెదిరిస్తూ మాట్లాడతాడు’’ అని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ధ్వజమెత్తారు. ‘‘మరోవైపు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడంకోసం పదవులు కాదనుకున్నాడు జగనన్న. విలువలు విశ్వసనీయతే ముఖ్యమనుకున్నాడు. ఆఖరికి చెయ్యని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో బోనులో ఉన్నా సింహం సింహమేనని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నకరికల్లు, శిరిగిరిపాడు, గురజాలలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్ జనభేరి ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... రామోజీరావు... ఓ 420 ఊసరవెల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు రంగులు మారుస్తుంటే రామోజీరావు మాత్రం స్వార్థంకోసం రంగులు మార్చేస్తున్నారు. ఆయనో పెద్ద భూబకాసురుడు. రామోజీ ఫిల్మ్ సిటీకోసం ప్రభుత్వ భూములని మింగేశారు. అసైన్డ్ భూముల్ని మింగేశారు. ఆఖరికి గ్రామాలకు గ్రామాలు సైతం మింగేశారు. రామోజీరావు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. ఈనాడు పత్రికకు రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఏదైనా భూమిని లీజుకు ఇస్తే అది వెనక్కిచ్చిన దాఖలాలు లేవు. ఆదిత్యవర్మ అని విశాఖపట్నంలో ఒకాయన రూ.130 కోట్ల విలువచేసే భూమిని రామోజీరావుకు లీజుకు ఇస్తే ఆయన్ను నానారకాలుగా హింసించారు రామోజీరావు. ఆఖరికి ఆయన భూమిని 800 గజాలు ప్రభుత్వం రోడ్ విస్తరణకింద తీసుకుంటే రామోజీరావు ఆ స్థలం తనదని తప్పుడు నివేదికలిచ్చి పరిహారం కాజేశారు. దీనిపై 420 కేసు కూడా పెట్టారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రూ.2,600 కోట్ల డిపాజిట్లు అక్రమంగా స్వీకరించి, ఆస్తులు కూడబెట్టుకున్నారని, స్వయంగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియానే హైకోర్టుకు చెప్పింది. సినిమాలను, సీరియళ్ళను తీసి మళ్ళీ ఆయనే వాటిని కొనుక్కున్నట్లు రూ. 800 కోట్లకు తప్పుడు లెక్కలు చూపిస్తే.. ఇవి దొంగలెక్కలని ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ ఆయనగారి మీద కేసు కూడా పెట్టింది.కళాంజలి అనే ఒక దుకాణం పెట్టి పురాతన వస్తువులను స్మగ్లింగ్ చేసుకుంటూ అమ్ముకుంటున్నారని ఢిల్లీలో ఆర్కియాలజీ డిపార్టుమెంట్ కేసు పెట్టింది. మొత్తంమీద రామోజీరావు మీద 200 కేసులు ఉన్నాయి. హైకోర్టు చరిత్రలోనే ఒక మనిషి మీద ఇన్నేసి కేసులు ఉండటం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సొంత తోడల్లుడైన అప్పారావునే ముంచేశాడు. లంకా దహనం ఎలా అయిందో అలాగే ఒకరోజు రామోజీ దహనం కూడా జరగడం ఖాయమని అప్పారావు తల్లి రామోజీరావుకు శాపనార్థాలు కూడా పెట్టింది.ఆయనకు బంధువులు, మానవత్వం పట్టవు... వట్టి డబ్బు మనిషి. ఒంట్లో ఉన్న కేన్సర్‌ను అధిగమించగలం కానీ ఇంట్లో ఉన్న కేన్సర్‌ను ఎలా అధిగమిస్తామని రామోజీరావు సొంత కొడుకు సుమన్ తండ్రి తీరును దుయ్యబట్టారు. అడుగడుగునా అవినీతిలో కూరుకుపోయిన రామోజీరావు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత అసహ్యంగా ఉంది. చంద్రబాబును మించిన సైకో ఎవరున్నారు? పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంద న్నట్లు సైకో చంద్రబాబుకు అందరూ సైకోల్లా కనిపిస్తున్నారు. సొంతమామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబుకు మించిన సైకో ఎవరైనా ఉన్నారా లోకంలో? విద్యుత్‌చార్జీలు తగ్గించాలంటూ రైతులు ఉద్యమిస్తే పిట్టల్లా కాల్పించిన సైకో చంద్రబాబు. జీతాలు పెంచమని అడిగిన అంగన్వాడీ ఆడపడుచులను గుర్రాలతో తొక్కించిన సైకో చంద్రబాబు. గ్రామంలో పింఛన్ అందుకుంటున్న వారిలో ఒకరు మరణిస్తేనే ఆ స్థానంలో వేరొకరికి పింఛన్ వస్తుందని చెప్పిన బాబుకంటే పెద్ద సైకో ఎవరున్నారు రాష్ట్రంలో? అన్నంపెట్టిన నిర్మాతపై ఆరురౌండ్లు కాల్పులు జరిపిన మరో సైకో బాలకృష్ణ. తర్వాత నిమ్స్‌కు వెళ్లి తనకు మతిస్థిమితం లేదంటూ సర్టిఫికెట్ తెచ్చుకుని కేసునుంచి బయటపడ్డారు. ఆ సర్టిఫికెట్ ప్రకారం ఆయనకు మతిస్థిమితం లేకపోతే ఎన్నికల్లో పోటీచేసే అర్హతలేదు. మతి స్థిమితం ఉంటే దొంగ సర్టిఫికెట్తో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆయనపై కేసు పెట్టాలి.తన అవినీతి ఆరోపణల మీద విచారణ జరగకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని తన భుజాన మోశాడు చంద్రబాబు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ ప్రభుత్వానికి రక్షణ కవచంలా కాపాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీలుస్తుంటే కొబ్బరికాయలా ముక్కలు చేసుకోండని విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. దాదాపు 25 ఏళ్లుగా తనను గెలిపిస్తున్న కుప్పం పంచాయతీని మునిసిపాలిటీగా మార్చలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, జపాన్‌లా చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన మాటల్లో నిజం లేదు, వాగ్దానాల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే.అప్పుడు రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసిన బాబు ఈ రోజు నిస్సిగ్గుగా ఉచిత విద్యుత్ ఇస్తానని ఎలా చెప్పగలుగుతున్నాడు? అప్పట్లో రైతులను పురుగుల్లా చూసి, ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటూ అబద్ధాలు చెప్తున్నాడు. -
పోటెత్తిన పల్నాడు
జగనన్న వదిలిన బాణాన్ని చూసేందుకు పల్నాడు ప్రజలు పోటెత్తారు. జనభేరి రథం నుంచి ఆమె సంధిస్తున్న వాగ్భాణాలకు కేరింతలు కొట్టారు. రాజన్న తనయ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల బుధవారం సత్తెనపల్లి, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా గురజాల సభలో షర్మిల ప్రసంగం వింటున్న అశేష జనవాహినిలో ఒక భాగమిది. అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్: జనభేరి ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన ఆత్మీయ బంధువుకు అపూర్వ స్వాగతం లభించింది... అడుగడుగునా ప్రజాభిమానం వెల్లివిరిసింది.. మహానేత రాజన్న తనయ, జననేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలను చూసి జిల్లావాసులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ ఆడబిడ్డ వచ్చిందంటూ ఆనందంతో కేరింతలు కొట్టారు. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని షర్మిల చెప్పగా అభిమానులు అందుకు అనుగుణంగా తమ స్వరాలను జతచేసి జై..జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నరసరావుపేటలోని రామిరెడ్డి గెస్ట్‌హౌస్ నుంచి వైఎస్సార్ జనభేరి ప్రచార రథంపై బుధవారం షర్మిల రోడ్‌షో ప్రారంభించారు. నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు రోడ్‌షోలో పాల్గొన్నారు. రావిపాడు మీదగా శాంతినగరం, నకరికల్లు అడ్డరోడ్డుకు ప్రచార రథం చేరగానే పార్టీ సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అశేష జనవాహినితో ఎదురేగి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నకరికల్లు మండలం చల్లగుండ్ల చేరుకోగానే అభిమానులు బైక్ ర్యాలీతో రోడ్‌షోను అనుసరించారు. పులివెందుల ఆడపడుచు షర్మిల నకరికల్లుకు వస్తోందన్న వార్త తెలుసుకున్న పలు గ్రామాల ప్రజానీకం ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. మండుటెండలోనూ రాజన్న బిడ్డ కోసం జాతీయ రహదారిపై బారులుతీరారు. నకరికల్లు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు వాగ్దానాలను నమ్మవద్దని, రామోజీ, చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అనంతరం దేవరంపాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన బస కేంద్రానికి చేరుకున్నారు. రాయవరం వద్ద అఖండ స్వాగతం.. భోజన విరామానంతరం పిడుగురాళ్ల చేరుకున్న ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బ్రాహ్మణపల్లి, దాచేపల్లి, గురజాల, రెంటచింతల మీదగా రాయవరం అడ్డరోడ్డు వద్దకు రోడ్‌షో చేరుకోగానే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో ఎదురేగి స్వాగతం పలికారు. మాచర్ల, వెల్దుర్తి మీదుగా శిరిగిరిపాడుకు చేరుకున్న రాజన్న తనయపై అభిమానులు పూల జల్లులు కురిపించారు. అక్కడ బహిరంగ సభలో షర్మిల ప్రసంగానికి మంచి స్పందన లభించింది. అక్కడ లంబాడీ మహిళలు షర్మిలకు తమ సంప్రదాయ వస్త్రాలను అలంకరించి అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి నుంచి మాచర్ల పట్టణం చేరిన ప్రచార రథం జమ్మలమడక గ్రామం మీదగా తుమృకోట, పాల్వాయి మీదగా రెంటచింతల చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా గురజాలకు చేరుకున్న షర్మిలకు స్థానిక అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి తమ కార్యకర్తలు, నాయకులతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. అక్కడి బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు షర్మిల చేరుకొనే సరికి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఓటువేసే సమయంలో ఒక్కసారి మహానేత రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె ప్రజలను కోరారు. అక్కడి నుంచి దాచేపల్లిలో రాత్రి బసకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, పార్టీ ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ హనుమంత్‌నాయక్, దర్శనపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి జనభేరి రూట్‌మ్యాప్ ఇదీ..
బంటుమిల్లి నుంచి ప్రారంభం పెడన, కైకలూరు, విజయవాడ సెంట్రల్లో రోడ్‌షోలు, సభలు సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడోరోజైన గురువారం జనభేరి యాత్ర కొనసాగించనున్నారు. పెడన, కైకలూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. బుధవారం రాత్రికి యాత్ర ముగించుకొని బంటుమిల్లి వెళ్లి రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లిలో జనభేరి యాత్ర ప్రారంభించి రోడ్‌షోగా ప్రధాన సెంటర్‌కు చేరుకుని ప్రసంగిస్తారు. అక్కడ నుంచి జానకిరామయ్యపురం, జయపురం, పెద్దతుమ్మిడి, మలపరాజుగూడెం, కొత్తపల్లి అడ్డరోడ్డు, సింగరాయపాలెం, శ్రీహరిపురం, ముదినేపల్లి, కానుకొల్లు, లింగాల, చెరికెగూడెం, మండవల్లి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం కైకలూరు చేరుకొని అక్కడ రోడ్‌షో నిర్వహించి సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి విజయవాడ నగరానికి చేరుకొని సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్‌షో, సభ నిర్వహిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్లు ఒక సంయుక్త ప్రకటనలో వివరించారు. -
జన ఉప్పెన
ఆరు నెలల్లో పోర్టు పనులు జనభేరి సభలో జగన్ హామీ దివిసీమ నుంచి ఉయ్యూరు వరకు జనభేరి అడుగడుగునా విశేషాదరణ అందరినీ పలకరిస్తూ సాగిన జగన్ ఎన్నికల ప్రచారం సీఎం అయిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు చేపడతామని హామీ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జననేత వైఎస్ సువర్ణయుగాన్ని తెచ్చేలా ఐదు సంతకాలు, ఆరు పనులు చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరులో పోటెత్తిన జనం అవును.. అది నిజంగా ఉప్పెనే.. జన ఉప్పెన.. మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సముద్ర ఉప్పెన ప్రజలను కలవరపెడితే.. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి కోసం వచ్చిన జన ఉప్పెన ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో గుబులు పుట్టించింది. మండుటెండను సైతం లెక్కచేయక అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి సెంటర్లో పోటెత్తిన ఈ ఉప్పెన పామర్రును తాకుతూ పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు వరకు సాగింది. దాదాపు మూడు నియోజకవర్గాల్లో 18 ప్రాంతాలను తాకుతూ 41 కిలోమీటర్ల మేర ఎన్నికల జనభేరి మోగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం అపూర్వ స్వాగతం పలికారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల జనభేరి రెండోరోజైన బుధవారం కూడా అపూర్వ జనాదరణ మధ్య సాగింది. దారిపొడవునా ఆయన కారుకు అడ్డుపడిన వృద్ధులు, మహిళలు, యువకులు జననేతకు కరచాలనం, పలకరింపు కోసం పోటీపడ్డారు. చల్లపల్లిలోని సన్‌ఫ్లవర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ‘కాబోయే సీఎంకు బెస్ట్ ఆఫ్ లక్, వైఎస్ సువర్ణయుగం-జగనన్నకే సాధ్యం’ అనే ప్లకార్డులతో జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. జనభేరి యాత్ర ప్రారంభానికి ముందు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్మోహన్రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం ఇక్కడికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు సభల్లో ప్రసంగించిన జగన్మోహన్రెడ్డి దాదాపు 41 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించి తన కోసం ఎదురుచూసిన జనాన్ని ఆప్యాయంగా పలకరించారు. అన్నా మీకే ఓటేస్తామంటూ మహిళలు, యువత ఆయనకు భరోసా ఇచ్చారు. ‘మీ అయ్య చేసిన మంచి పనులు కొనసాగించేందుకు నీకే ఓటేస్తాం బాబా’ అంటూ వృద్ధులు నిండు మనస్సుతో దీవించారు. దారి పొడవునా పూల జల్లులతో స్వాగతం పలికిన జనం హారతులు పట్టి.. చేతిలో చేయేసి గెలుపు నీదేనంటూ భరోసా ఇవ్వడం విశేషం. ఆకట్టుకున్న ప్రసంగం.. మూడు నియోజకవర్గాల్లో జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆల్ ఫ్రీ బాబుగా గుర్తింపు పొందిన చంద్రబాబు మరోమారు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన మీ ముందుకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఐదు సంతకాలతో ఆరు పనులు చేసి మొత్తం పదకొండు పనులు చేస్తానని చెప్పారు. జననేత వెంట పార్టీ బందరు లోక్‌సభ అభ్యర్థి కేపీ సారథి, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, బందరు, పెడన నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సింహాద్రి రమేష్, ఉప్పులేటి కల్పన, కేవీఆర్ విద్యాసాగర్, పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలల్లో పోర్టు పనులు.. తాను ముఖ్యమంతి అయిన ఆరునెలల్లో ఈ ప్రాంతానికి అతి కీలకమైన బందరు పోర్టు పనులు ప్రారంభిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బందరు ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని అన్న తనను ఒక కోరిక కోరాడని, అన్నా మీరు బందరు పోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వాలని అడిగాడని చల్లపల్లి సభలో జగన్మోహన్రెడ్డి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజల ప్రగతి కోసం కచ్చితంగా తాను బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టి తీరుతానని జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. బందరు పోర్టు నిర్మాణంతో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బందరు పోర్టును రాజకీయ కోణంలో కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చూడాలన్నారు. అందుకే నాని అన్న కోరిక మేరకు తాను బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టి చూపిస్తానని జగన్మోహన్రెడ్డి అన్నారు. -
చంద్రబాబు అబద్ధాలకోరు
విజయనగరం జిల్లా వైఎస్సార్ జనభేరిలో వైఎస్ విజయమ్మ ధ్వజం నెల్లిమర్ల(విజయనగరం) : ‘‘చంద్రబాబు ఓ అబద్ధాలకోరు.. తొమ్మిదేళ్ల ఆయన హయాంలో ఎన్నో కంపెనీలను తన బినామీలైన సీఎం రమేష్, సుజనాచౌదరి, బిల్లీరావులాంటివాళ్లకు అప్పనంగా కట్టబెట్టాడు. ఎన్నో కంపెనీలను మూయించి ఏడున్నర లక్షలమంది కార్మికులను రోడ్డున పడేశాడు. 26 వేలమందిని ఉద్యోగాల నుంచి తీసేశాడు. అటువంటి చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నాడు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొత్తం మూడున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసి, పలు కంపెనీలను మూసివేయించి 7.5 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్తే ఎవరూ నమ్మబోరు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ‘‘చంద్రబాబూ... రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం రూ.1.2 లక్షల కోటు.్ల రైతుల రుణాలు మాఫీ చేయాలంటే 1.5 లక్షల కోట్లు కావాలి. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తావు? కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను జైల్లో పెట్టించిన నువ్వు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. 2004లో రుణమాఫీ కోసం రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే కేంద్రాన్ని ఒప్పించేందుకు మూడేళ్లు పట్టిందన్నారు. కే ంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి 60 వేల కోట్లు రుణమాఫీగా ప్రకటిస్తే, అందులో రాష్ట్రానికి 12వేల కోట్లు కేటాయించారని చెప్పావు. అప్పట్లో రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా అప్పటికే చెల్లించిన రైతులకు వైఎస్సార్ అయిదు వేల రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారని గుర్తు చేశారు. విజయమ్మ బుధవారం విజయనగరంలో, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ, ఒమ్మి, సతివాడ గ్రామాల్లో వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రసంగించారు. -
విజయమ్మ వైఎస్సార్ జనభేరి రేపు
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్నారు. భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో పలువు సంఘాలతో జరిగే ప్రత్యేక సమావేశాల్లో విజయమ్మ పాల్గొంటారన్నారు. పర్యటన షెడ్యూల్ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరతారు. 9.30 గంటలకు మధురవాడ చేరుకుంటారు. అక్కడి జంక్షన్లో బహిరంగ సభ. 10 గంటలకు ఆనందపురం పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నగరానికి వస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సమావేశం 2 గంటలకు హోటల్ మేఘాలయలో మేధావులతో సమావేశం 3 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో చాంబర్ ప్రతినిధులతో భేటీ 4 గంటలకు గాజువాకలో బహిరంగ సభ 5 గంటలకు పరవాడలో బహిరంగ సభ 6 గంటలకు అనకాపల్లిలో బహిరంగ సభ 7 గంటలకు నర్సీపట్నంలో బహిరంగ సభ -
పామర్రులో వైఎస్ జగన్ ప్రసంగం
-
‘స్కాం’ల బాబూ.. విచారణకు సిద్ధమేనా?
చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్ శ్రీకాకుళం, ‘‘చంద్రబాబూ... నీ తొమ్మిదిన్నరేళ్ల రాక్షస పాలన ప్రజలందరికీ తెలుసు. నీ దుష్ట పరిపాలనలో అన్నీ కుంభకోణాలే కదా.. మద్యం, ఏలేరు, తెల్గీ, నీరు-మీరు, ఐఎంజీ, ఎమ్మార్ ఇలా వరుస కుంభకోణాలతో పాలన సాగించావ్.. వీటిపై విచారణల నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాల నుంచి సుమారు 18 స్టేలు తెచ్చుకుని బతుకుతున్నావ్.. ఇది నిజం కాదా?.. వీటిపై విచారణకు నువ్వు సిద్ధమేనా..?’’ అని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సవాల్ విసిరారు. నువ్వు ఏ, తప్పూ చేయకపోతే, నాయకత్వ లక్షణాలుంటే కోర్టుల్లో స్టేలు తొలగింపజేసుకొని నేరుగా విచారణను స్వీకరించాల ని డిమాండ్ చేశారు. ‘‘బాబు హయాంలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనుషులకు తిండి లేదు. ఆఖరికి పశువులకు కూడా మేత లేదు. వలసలు, ఆత్మహత్యలు, అప్పులు.. ఇలా అన్నీ అవస్థలే. ఇక టీడీపీ వ్యవస్థాపకుడు, సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడయ్యాడు. ఎన్టీఆర్ పెట్టిన 2 రూపాయలకే కిలోబియ్యం, మద్య నిషేధం, రైతులకు 50 రూపాయలకే ఒక హార్స్ పవర్ విద్యుత్ పథకాలను ఎత్తేశాడు’’ అని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటూ ఇస్తున్న అడ్డగోలు వాగ్దానాలను నమ్మవద్దన్నారు. ఐదేళ్లపాలనలో రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమరాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. జగన్ సీఎం కాగానే ఐదు సంతకాలతో రాష్ట్రం దశదిశ మారుస్తాడని భరోసానిచ్చారు. ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలాకి, వడ్డితాండ్ర, శ్రీకూర్మం, శ్రీకాకుళం, చిలకపాలెంలో నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు. -
జన సునామీ
గన్నవరం జన ప్రభంజనమైంది. రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. తమ అభిమాన నేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వెల్లువెత్తిన ప్రజాభిమానం జన సునామీని తలపించింది. ఓ పక్క 39 డిగ్రీల ఉష్ణోగ్రత.. భగభగలాడుతూ తన ప్రతాపం చూపుతున్న భానుడు.. అయినా ఖాతరు చేయని జనం జగన్ జనభేరికి పోటెత్తారు.అభిమాన నేతకు అఖండ స్వాగతం పలికారు. సాక్షి, విజయవాడ : వెల్లువెత్తిన అశేష జనాభిమానం, ఉప్పొంగిన జనాభిమానం నడుమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనభేరి ఎన్నికల ప్రచార యాత్ర మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. తొలిరోజు గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో జననేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి విజయవాడ నగరం మీదుగా గుంటూరుకు పయనమయ్యారు. గన్నవరంలో జనహోరు... గన్నవరం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడింది. గన్నవరం రాజకీయ చరిత్రలో ఏ పార్టీ సభలకూ రాని రీతిలో ప్రజలు వేలాదిగా తరలిచ్చారు. పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఇదే గన్నవరంలో జరిగిన భారీ సభ అని పేర్కొనే రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి గన్నవరం మూడు బొమ్మల సెంటర్ జనసంద్రంగా మారింది. తమ అభిమాన నేతను చూసేందుకు యువకులు, మహిళలతో పాటు వృద్ధులు కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11.45 గంటలకు జగన్మోహన్రెడ్డి నేరుగా హైదరాబాదు నుంచి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ నేతలతో కలసి గన్నవరానికి పయనమయ్యారు. మూడు బొమ్మల సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వెలువెత్తిన అశేష జనాభిమానం నడుమ మూడు బొమ్మల సెంటర్‌కు చేరుకున్న జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార రథం పైనుంచి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై జగన్మోహన్రెడ్డి చేసిన విమర్శలకు ప్రజాస్పందన వెల్లువెత్తింది. ప్రత్యక్షంగా మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.. సభ అనంతరం గంటలతరబడి తనకోసం వేచివున్న మహిళలు, వికలాంగులు, వృద్ధులు, రైతులతో జగన్ ప్రత్యక్షంగా మాట్టాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ రోడ్‌షోగా ముందుకు సాగారు. జననేతను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. పింఛను రావటం లేదని చెప్పిన వృద్ధులతో ‘మరో పది రోజులు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. మీ అందరి కష్టాలు తొలగుతాయి’ అని భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలు సావధానంగా విని వారికి అండగా ఉంటానని ఆత్మస్థైర్యం నింపారు. కేసరపల్లి, గూడవల్లి మీదుగా నిడమానూరు చేరుకున్న జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. ‘అయ్యా మా కష్టాలు వినాలి.. మీరు మా ఊళ్లోకి రండి’ అంటూ పట్టుపట్టి మరీ నిడమానూరు గ్రామంలోకి తీసుకెళ్లారు. గ్రామంలో అపూర్వ స్వాగతం పలికి సమస్యలు విన్నవించారు. అక్కడి నుంచి ఎనికేపాడు చేరుకున్న జగన్ రోడ్డుపై తన కోసం నిరీక్షిస్తున్నవారితో మాట్లాడుతూ ఆత్మీయంగా కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ప్రసాదంపాడులో రోడ్‌షో నిర్వహించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌కు చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రామవరప్పాడుతో మొదటిరోజు యాత్ర ముగించుకున్న జగన్మోహన్రెడ్డి వారధి మీదుగా గుంటూరుకు పయనమయ్యారు. పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కె.పార్థసారథి, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దుట్టా రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను, పార్టీ నేతలు తలశిల రఘురామ్, డాక్టర్ శివభరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల తర్వాత బాబు ఉండడు
అందుకే ఎలాగైనా అధికారంలోకి రావాలని అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నాడు: జగన్ ఈవేళ కూడా బాబు అధికారం కోసం సెల్ ఫ్రీ.. టీవీ ఫ్రీ.. ఆల్ ఫ్రీ అంటున్నాడు నేను ఆయనలా అబద్ధాలు ఆడను.. విశ్వసనీయతలేని రాజకీయాలు చేయలేను కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రసంగించిన జగన్ ‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత తానుండడు... తన పార్టీ ఉండదని ఆయనకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వసనీయతలేని రాజకీయాలు చేస్తున్నాడు. ఏదైనా చేసి, ఏమైనా చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు..’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం, పదవుల కోసం ఏ గడ్డి అయినా తింటాడు. ఎన్ని అబద్ధాలైనా ఆడగలడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతాడు.. అధికారం పోయిన తరువాత మళ్లీ అధికారం కోసం రకరకాల అబద్ధాలు ఆడుతుంటాడు. ఇదే చంద్రబాబు ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో మీ దగ్గరకు వస్తాడు. మీటింగులు పెడతాడు. అప్పుడు మీరు ఒక మాట అడగండి. చంద్రబాబూ.. ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు వీటిలో ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు ఆడతావు అని ప్రశ్నించండి?’’ అని జగన్ ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం, గుంటూ రు పట్టణాల్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. వైఎస్ వెళ్లిపోయాక నిజాయితీ కరువైంది.. ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం మన మధ్య నుంచి వెళ్లిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం.. ఆయన తరువాత కూడా ముఖ్యమంత్రులను చూశాం.. కానీ వైఎస్ మాత్రమే ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి’ అని ఈ రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పారు. ఆ దివంగత నేత మన మధ్య లేకపోయినా.. ప్రతి గుండెలో ఆయన బతికే ఉన్నాడు. ఈ రోజున మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్నదే లేకుండా పోయింది. ఆయన చనిపోయిన తరువాత విశ్వసనీయత అనే పదం టార్చిలైటు పట్టి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబును నిలదీయండి.. త్వరలో మీ దగ్గరకు వచ్చి అన్నీ ఫ్రీ అంటూ హామీలిచ్చే చంద్రబాబును అక్కడే నిలదీయండి. చంద్రబాబు నాయుడూ అప్పట్లో ఎన్నికలకు వెళ్లేముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు.. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక ప్రజలతో నాకేం పని ఉందని ఇదే రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా అని ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లేముందు అక్క చెల్లెమ్మల ఓట్ల కోసమని మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పావు.. ఎన్నికలు అయిపోయాక మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం అంతా దివాళా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. అలా రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని నిలదీయండి. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ.30 వేలు ఖర్చవుతుంది. ఆ రూ.30 వేలు కట్టాలంటే తల్లిదండ్రులు పొలమో, ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ అంటూ ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడి హయాంలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, క్యాన్సర్ వచ్చినా ఆ పేదవాడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. డాక్టర్ దగ్గరకు వెళితే రూ. 2 లక్షలో... రూ.3 లక్షలో, రూ.5 లక్షలో అవుతుందని డాక్టర్ చెప్పినప్పుడు రెండ్రూపాయలు, మూడు రూపాయలు, ఐదు రూపాయల వడ్డీలకు అప్పు తెచ్చినప్పుడు నీవు ఏం చేశావు చంద్రబాబూ అని నిలదీయండి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనలో వరుసగా కరువులొచ్చినప్పుడు రైతులందరూ కూడా కరెంటు చార్జీలు తగ్గించండి, కరెంటు ఉచితంగా ఇవ్వండి, రుణాల మీద వడ్డీ మాఫీ చేయండి అని గట్టిగా అడిగితే, నిరాహార దీక్షలు చేస్తే బషీర్‌బాగ్‌లో రైతన్నలను పిట్టల్లా కాల్చలేదా చంద్రబాబు నాయుడూ అని నిలదీయండి. ఒక రోజు సెల్ఫోన్లు.. మరో రోజు టీవీలు.. ఈవేళ కూడా చంద్రబాబు అధికారంలోకి రావడానికి రకరకాల అబద్ధాలు చెబుతున్నాడు. ఒక రోజు సెల్ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. ఒక రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటాడు. ఇంకోరోజు రైతు రుణాలు మాఫీ అంటాడు. ఒక రోజు అక్కాచెల్లెళ్ల రుణాల మాఫీ అంటాడు. మరో రోజు మీరెవరూ ఇంటినుంచి బయటకు రావొద్దు.. మీ ఇంటికే అన్ని ఫ్రీగా ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను చంద్రబాబు నాయుడిలా అబద్ధాలు ఆడలేను. చంద్రబాబు నాయుడిలా విశ్వసనీయతలేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఎందుకంటే చంద్రబాబు కంటే నేను పాతిక సంవత్సరాలు చిన్నవాణ్ణి. మరో 30 సంవత్సరాలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చిన వారసత్వం ఏదైనా ఉందంటే అది విశ్వసనీయత. ఒక్కటైతే చెబుతున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులను చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. చెప్పినవే కాదు.. చెప్పనివీ చేస్తాను. ఈ రోజు ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపున కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీలకు ఓటు వేద్దాం.. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొద్దాం.’’ ఐదు సంతకాలు.. ఆరు పనులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. వాటితోపాటు మరో ఆరు పనులు కూడా చేయబోతున్నాను. వీటితో రాష్ట్ర దశ, దిశ మారుస్తానని మాటిస్తున్నాను. వాటిలో మొదటి సంతకం అక్క చెల్లెమ్మల కోసం చేస్తాను. అక్కచెల్లెమ్మలు ఈ రోజు కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇతరత్రా పనులు చేస్తున్నారు. వంద నూటా యాభై రూపాయల కోసం పనులకు వెళ్తున్నారు. బతుకుదెరువు కోసం పిల్లలను బడి మాన్పించి పనులకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి లేకుండా చేసేందుకు ‘అమ్మ ఒడి’ పథకం తీసుకొస్తున్నాను. మీ పిల్లలను బడికి పంపించండి. వారిని ఇంజినీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తాను. ప్రతీ స్కూలులోనూ ఇంగ్లీషు మీడియం పెడతాను. బడికి పంపించే ప్రతీ పిల్లాడికి రూ. 500 చొప్పున ఇద్దరు పిల్లలకు వెయ్యి నెల నెలా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను. ఆ వెయ్యి రూపాయలుంటే బతుకుపై భయం ఉండదు. ఇక రెండో సంతకం అవ్వా తాతల కోసం పెడతాను. వారు ఆరోగ్యం సహకరించక పోయినా పనులకు వెళ్తున్నారు. వైఎస్ పుణ్యాన రూ. 200 పెన్షన్ వస్తుందని, కానీ అది సరిపోవడం లేదంటున్నారు. వారికి రూ. 700 పెన్షన్ ఇస్తాను. వారికి మంచి మనవడిగా ఉంటాను. మూడో సంతకం రైతన్నల కోసం. పండించిన పంటలకు రేటు ఉండటంలేదు. వారికి మద్దతు, గిట్టుబాటు ధర ఇస్తూ రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను. కరవు, వరద వచ్చినా వారికి అండగా ఉండేందుకు మరో రూ. 2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాను. నాలుగో సంతకం మళ్లీ అక్క చె ల్లెమ్మల కోసమే. డ్వాక్రా రుణాలు తీసుకున్న వారు ప్రతి నెలా ఒకటో తేదీన కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తున్నారు బ్యాంకర్లు. ఈ కష్టాలు తప్పించేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాను. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇల్లు లేదనే పరిస్థితి ఇప్పటికీ వింటున్నాను. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఒక ఆఫీసు తెరుస్తాను. అడిగిన వారికి 24 గంటల్లో ఏ కార్డైనా అందజేస్తాను. ఐదో సంతకం ఈ ఫైలుపైనే చేస్తాను. ఆరో పని చేయబోతున్నా. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలోనే 47 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు. 2019 నాటికి ఎవరూ ఇల్లు లేదు అని అనకుండా చేస్తాను. ఏడాదికి 10 లక్షలు, ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టి ప్రతి నిరుపేదకూ నీడనిస్తాను. 50 లక్షల ఇళ్లే కాదు 50 లక్షల పట్టాలు కూడా మహిళల పేరుమీద ఇవ్వబోతున్నాను. అవసరం వచ్చినప్పుడు లక్షకు పైగా విలువ చేసే ఆ ఇంటిపట్టాను బ్యాంకులో పెట్టి రూ. 30 వేలు రుణం పావలా వడ్డీ కింద తీసుకునే వెసులుబాటు కల్పించేలా బ్యాంకర్లతో మాట్లాడతాను. ఏడో కార్యక్రమం.. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ గర్వపడే విధంగా గొప్పగా అమలు చేస్తాను. గుండెపోటు వచ్చినా... యాక్సిడెంట్ అయి ఆపరేషన్ చేసినా.. డాక్టర్లు రెండు, మూడు, ఒక్కోసారి ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలంటారు. కానీ ఇంటికి వెళ్లిన పేషెంటు పని చేయలేని పరిస్థితుల్లో పస్తులు ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చుతాను. విశ్రాంతి సమయంలో నెలకు రూ. 3 వేల చొప్పున ఇచ్చి వారిని ఆదుకుంటాను. ఎనిమిదో పనికింద మరోటి చేస్తాను. ఈ రోజు ఊళ్లల్లో ఐదారు గంటలు కూడా కరెంటు ఉండటంలేదు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాలుగు గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదు. 2019 నాటికి కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాను. పగటి పూటే రైతులకు ఏడు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తాను. ఈ రోజు వస్తున్న కరెంటు బిల్లులు చూస్తుంటే.. ఏది బిల్లో, ఏది సర్ చార్జ్నో అర్థంకాని పరిస్థితి. రూ.500, రూ.600 వస్తున్న బిల్లులు కట్టలేక పేదలు దొంగ కరెంటు వాడుతున్నారు. ఆ పరిస్థితిని తప్పించేందుకు పేదలకు ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు వెలిగించుకునేందుకు ఖర్చయ్యే 150 యూనిట్ల క రెంటు రూ. 100కే అందించడాన్ని తొమ్మిదో పనిగా చేస్తాను. ఏ గ్రామంలోనూ బెల్టుషాపులు లేకుండా చేస్తాను. అక్రమ మద్యం నియంత్రించేందుకు ప్రతీ గ్రామం నుంచి 10 మంది మహిళలను ఆడ పోలీసులుగా నియమిస్తాను. తాగాలనుకునే వారికి నియోజకవర్గంలో ఒకేచోట మద్యం షాపు ఉంటుంది. ప్రభుత్వమే దీన్ని నడుపుతుంది. రేట్లు షాక్ కొట్టేలా ఉంటాయి. శ్రీమంతులు తాగాలనుకుంటే స్టార్ హోటళ్లలో తాగొచ్చు. అట్నుంచి అటే నేరుగా ఆసుపత్రులకు కూడా వెళ్లొచ్చు. పేదలకు మాత్రం ఆరోగ్యం గ్యారంటీ నేనిస్తాను. ఇంకో కార్యక్రమం కింద చదువుకున్న వారికి ఉద్యోగం వస్తుందన్న ధీమా ఇస్తాను. చంద్రబాబులా ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పను. కానీ గత నాలుగు సంవత్సరాలుగా నన్ను చూశారు. ఇళ్లు విడిచి రాత్రనక పగలనక కష్టపడడం చూశారు. ఎండనక వాననక తిరిగే విధానాన్ని చూశారు. తమ పిల్లలను చదివించే ప్రతీ తల్లికీ, చదువుకునే ప్రతీ పిల్లాడికి ఒకటి చెబుతున్నాను. నా సొంత తమ్ముడి కోసం ఉద్యోగం వెతక వలసి వస్తే ఏ విధంగా నేను కష్టపడతానో అదే స్థాయిలో ప్రతీ పిల్లాడి కోసం కష్టపడతాను. -
జన హోరు
కిటకిటలాడిన స్వర్ణముఖి తీరం షర్మిల రోడ్‌షో, సభలకుభారీ స్పందన టీడీపీకి ఓట్లేస్తే మురిగిపోతాయ్ రైతులకు, మహిళలకు, ఉద్యోగులకు బాబు చేసిందేమీ లేదు బియ్యపు మధు, వరప్రసాద్‌ను గెలిపించాలని షర్మిల పిలుపు సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ, రోడ్డుషోలకు హాజరైన జనంతో స్వర్ణముఖి నదీతీరం పోటెత్తింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. రాజన్న తనయను చూద్దామని భారీగా హాజరైన రైతులు, మహిళలతో పట్టణవీధులన్నీ కిక్కిరిశారుు. ఆదివారం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ రోజు రాత్రి తిరుపతి రూరల్ మండలంలోని గొల్లపల్లెలో బసచేసిన ఆమె సోమవారం ఉదయం 11గంటలకు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. పెండ్లిమండపం జంక్షన్లో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వర ప్రసాద్‌రావును గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఫ్యాను తిప్పుతూ షర్మిల నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్యాను చూపించి ఓటేయాలని కోరినప్పుడు జనం గాలిలోకి చేతులు తిప్పుతూ ఈ గుర్తుకే ఓటేస్తామని స్పందించారు. షర్మిల మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు హయంలో ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు మేలు జరగలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఏడు గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందజేశారన్నారు. రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. పేద విద్యార్థులు తమకు నచ్చిన బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ఏదైనా ఉచితంగా చదివేందుకు ప్రభుత్వం నుంచి ఫీజులు కట్టారన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల నిత్యావసరాల ధరలు, విద్యుత్‌చార్జీలు పెరిగి ఇబ్బందులు పడ్డారన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రూ.325 ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు రూ.450 అయ్యిందన్నారు. అదే సబ్సిడీ లేకుండా గ్యాస్ కొనుగోలు చేయాలంటే పేదలు సిలెండర్‌కు రూ.1000 వరకు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీకి ఓటేస్తే మురిగిపోతుందని, ప్రజలకు మళ్లీ తిరోగమనం తప్పదని షర్మిల హెచ్చరించారు. ‘జగన్మోహన్రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే ఆయన జీవితం మీ కోసం త్యాగం చే స్తారు. మీ బాగోగులు జగనన్నకు ముఖ్యం, చంద్రబాబు విభజనవాది కాంగ్రెస్‌తో కలిసి అడ్డగోలు విభజనకు లేఖ ఇచ్చారు’ అని ఆమె అన్నప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. టీడీపీ, బీజేపీ కూటమని ఎన్నికల్లో ఓడించాలని, రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన పార్టీల్లో బీజేపీ కూడా ఒకటని ఆమె పేర్కొన్నారు. షర్మిలను చూసేందుకు పోటీలు... షర్మిల పట్టణంలోని నాలుగు మాడావీధులతో పాటు, స్వర్ణముఖి బ్రిడ్జి, శ్రీరాంనగర్ కాలనీ మీదుగా పానగల్ వరకు రోడ్డుషో నిర్వహించారు. ఫ్యాను గుర్తు చూపిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లేయాలని అభ్యర్థించారు. షర్మిలను చూసేందుకు మిద్దెలపైన, ఎత్తయిన భవనాలపైన మహిళలు,యువకులు కిక్కిరిసి ఉన్నారు. ఎండకు చెమటలు కారుతున్నా ఆమె ప్రసంగం పూర్తయ్యేవరకు అక్కడి నుంచి కదలలేదు. వైఎస్సార్ సీపీ టోపీలు, జెండాలు చేతపట్టిన కార్యకర్తలు వీధుల్లో, సభాస్థలి వద్ద ఆకర్షణగా నిలిచారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట మండలాల నుంచి ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు షర్మిల బహిరంగసభ, రోడ్డుషోలకు భారీగా హాజరయ్యారు. సభలో తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్‌రావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రసంగించారు. రేణిగుంట మండలానికి చెందిన పలువురు నాయకులు షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. ఆమె కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. -
నేటి నుంచి జగన్ జనభేరి
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో జనభేరి పేరిట ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి, పలుచోట్ల ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి నేరుగా గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్‌షోగా గన్నవరంలోని మూడు బొమ్మల సెంటర్‌కు 10.30 గంటలకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తారు. అనంతరం నియోజకవర్గంలో యాత్ర ముగించుకొని గుంటూరు వెళతారు. ఈ నెల 30వ తేదీ బుధవారం గుంటూరు నుంచి నేరుగా కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం చేరుకుని చల్లపల్లిలో రోడ్‌షో ప్రారంభిస్తారు. అక్కడినుంచి పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహిస్తూ ఉయ్యూరు చేరుకుంటారు. పలుచోట్ల ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగిస్తారు. ఉయ్యూరు సభ అనంతరం విజయవాడ చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో వివరించారు. ఈ నెల ఒకటో తేదీ గురువారం జగన్మోహన్రెడ్డి జిల్లాలో నిర్వహించే పర్యటన టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న జనభేరి రోడ్‌షోను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.