నేడు విజయమ్మవైఎస్సార్ జనభేరి | today Y. S. Vijayamma YSR Janabheri | Sakshi
Sakshi News home page

నేడు విజయమ్మవైఎస్సార్ జనభేరి

Published Fri, Apr 25 2014 11:49 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

నేడు విజయమ్మవైఎస్సార్ జనభేరి - Sakshi

నేడు విజయమ్మవైఎస్సార్ జనభేరి

  • అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ప్రచారం
  •  నాలుగుచోట్ల బహిరంగ సభలు
  • సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశా ఖ లోక్‌సభ ఆపార్టీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మ శనివారం జిల్లాకు  రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి నిర్వహించనున్నారు. ఇప్పటికే విశాఖ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారం మూడు రోజులు నిర్వహించారీమె.

    రెండో విడత శనివారం జిల్లాలోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి ఓ చోట జరిగే బహిరంగ సమావేశాల్లో ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగిస్తారన్నారు. పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాల్ని వివరిస్తారన్నారు.
     
     పర్యటన షెడ్యూల్
     ఉదయం 11 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గంలోని అడ్డురోడ్డులో బహిరంగసభ
     
     మధ్యాహ్నం 2 గంటలకు యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురంలో బహిరంగసభ
     
     సాయంత్రం 4 గంటలకు చోడవరం నియోజకవర్గంలోని వడ్డాదిలో బహిరంగసభ
     
     సాయంత్రం 6 గంటలకు మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లిలో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ పాల్గొంటారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement