విజయమ్మ వైఎస్సార్ జనభేరి రేపు | Today janabheri in Y. S. Vijayamma | Sakshi
Sakshi News home page

విజయమ్మ వైఎస్సార్ జనభేరి రేపు

Published Thu, May 1 2014 12:41 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

విజయమ్మ వైఎస్సార్ జనభేరి రేపు - Sakshi

విజయమ్మ వైఎస్సార్ జనభేరి రేపు

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్నారు. భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో పలువు సంఘాలతో జరిగే ప్రత్యేక సమావేశాల్లో విజయమ్మ పాల్గొంటారన్నారు.
 
 పర్యటన షెడ్యూల్
 శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరతారు.
     
 9.30 గంటలకు మధురవాడ చేరుకుంటారు. అక్కడి జంక్షన్‌లో బహిరంగ సభ.
     
 10 గంటలకు ఆనందపురం పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నగరానికి వస్తారు.
     
 మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సమావేశం
     
 2 గంటలకు హోటల్ మేఘాలయలో మేధావులతో సమావేశం
     
 3 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో చాంబర్ ప్రతినిధులతో భేటీ
     
 4 గంటలకు గాజువాకలో బహిరంగ సభ
     
 5 గంటలకు పరవాడలో బహిరంగ సభ
     
 6 గంటలకు అనకాపల్లిలో బహిరంగ సభ
     
 7 గంటలకు నర్సీపట్నంలో బహిరంగ సభ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement