Y. S. Vijayamma
-
'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని... పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైఎస్ఆర్లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైఎస్ఆర్ సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన తపించారని చెప్పారు. వైఎస్ఆర్కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు. -
కాయ్ రాజా.. కాయ్!
సాక్షి, విశాఖపట్నం : కాయ్ రాజా.. కాయ్..! ఒకటికి పది.. వందకు వెయ్యి.. లక్షకు పది లక్షలు..! ఇదేదో కోడి పందాల జోరనుకుంటే.. ఈవీఎంల్లో కాలేసినట్టే..! ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ల జోరుకు నిదర్శనమిది. సాధారణ కార్మికుడు/ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి వ్యాపారుల వరకు ఇదే తీరు. బుధవారం ఓటింగ్ ముగిసిన వెంటనే బెట్టింగ్‌ల జోరు మొదలయింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని ఒకటికి పది రెట్లు చెల్లించేందుకు కూడా బెట్టింగ్ వీరులు పిలుపునివ్వడం గమనార్హం. విజయమ్మ మెజార్టీపై బెట్టింగ్‌ల జోరు ఇప్పటి వరకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసే బెట్టింగ్ రాయుళ్ల దృష్టి ఎన్నికల ఫలితాలపై పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై జోరుగా పందేలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బెట్టింగ్ వీరులు ఎక్కువగా దృష్టి సారించారు. అందులోనూ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మెజార్టీపై ఎక్కువ మంది దృష్టి సారించారు. లక్ష ఓట్లు.. రెండు లక్షల ఓట్ల మెజార్టీపైనే బెట్టింగ్‌ల జోరుంది. ఇతర జిల్లాల నుంచి కూడా బెట్టింగ్ రాయుళ్లు విశాఖపై కన్నేశారు. దీనికి విజయమ్మ విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడమే కారణం. రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఈ స్థానంపై బెట్టింగ్ వేస్తున్నట్టు తెలిసింది. ఐపీఎల్ బెట్టింగ్ ఏజెన్సీలన్నీ ఇపుడు క్రికెట్ మ్యాచ్‌లను పక్కనెట్టి.. ఎన్నికల ఫలితాలపైనే దృష్టిసారించాయి. వైఎస్సార్ సీపీకి 100 సీట్లు దీంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 100 సీట్లు వస్తాయన్న అంశంపైనా బెట్టింగ్ పోటీ తీవ్రంగా ఉంది. ఈ అంశంలో 1ః2/1ః3 నిష్పత్తిలో బెట్టింగ్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వంద సీట్లు రావనేవాళ్లు రూపాయి కడితే.. వంద సీట్లకుపైనే వస్తాయనుకునేవాళ్లు రూ.2/రూ.3 కూడా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఎక్కువగా విశాఖతో సంబంధం లేనివాళ్లే ఆన్లైన్/ఫోన్లైన్ల ద్వారా ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికల బెట్టింగ్ రాష్ట్రమంతా విస్తరించింది. చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే జరిగేలా ఎక్కువ మంది మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. స్థానిక సీట్లపై ‘లోకల్’ మరోవైపు స్థానిక సీట్లపై కూడా బెట్టింగ్‌లు జోరుగానే ఉన్నాయి. అయితే ఇవి రూ.వేలల్లోనే పరిమితమవుతున్నాయి. నగరంలో ఎక్కువగా విశాఖ తూర్పు, ఉత్తరం నియోజకవర్గాలపై బెట్టింగ్ జోరందుకుంది. ఈ స్థానాల్లో టీడీపీ, బీజేపీ నేతలు అంచనాలకు మించి డబ్బులు వెదజల్లడం వల్లే స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఎక్కడ నలుగురు గుమిగూడినా.. ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? అన్న అంశాల ప్రాతిపదికగా బెట్టింగ్ వేస్తున్నారు. -
విశాఖతో ఆత్మీయానుబంధం
ఇక్కడి ప్రజలు విజ్ఞులు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఘనవిజయం తథ్యం వైఎస్‌పై వారికెంతో ప్రేమానురాగాలున్నాయి ఆయన ఆకాంక్ష మేరకు విశాఖను అభివృద్ధి చేస్తా సాక్షి ఇంటర్వ్యూలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆశాభావం వ్యక్తపరిచారు. ఇదివరకటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే అది ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. విశాఖ కేంద్రంగా అటు ఉభయగోదావరి జిల్లాల్లో, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అవిశ్రాంతంగా ఉవ్వెత్తున ఎన్నికల ప్రచారం సాగించిన వై.ఎస్.విజయమ్మ ప్రచారాలకు చివరి రోజైన సోమవారం సాక్షి ప్రతినిధికి చ్చిన ఇంటర్వూలో పలు అంశాలను ప్రస్తావించారు...ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ఆ ఆత్మీయత మరువలేను... నా ప్రచారంలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది. వైఎస్ అన్న పేరు పలికినా, ఆయన పెట్టిన పథకాల గురించి చెప్పినా వారిలో కనిపించిన అనుభూతి, స్పందన మాటల్లో చెప్పనలవికాదు. ఆయన భార్యగా నన్ను చూసేందుకు ప్రతిచోట జనం చూపిన ఆతృత, ఆదరణ బాగా కదిలించింది. వారి కళ్లలోని వెలుగు చూశాక నాపై మరింత బాధ్యత పెరిగిందనిపించింది. ఇక్కడే ఎందుకు పోటీ అంటే... వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈ ప్రాంతమంటే ఎంతో ప్రేమానురాగాలుండేవి. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని, అరకు, భీమిలి ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని ఎప్పుడూ భావించేవారు. ఆయన ఈ ప్రాంతానికి అనేకరకాల ప్రాజెక్టులను రూపకల్పన చేయించారు. అవన్నీ కార్యరూపం దాల్చాల్సిన అవసరముంది. వైఎస్ ఉంటే పోలవరం ఈపాటికి పూర్తయ్యేదే. దీని ద్వారా విశాఖకు 25 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు వచ్చేది. విశాఖను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా... ఇక్కడి ప్రజలతో నాది ఆత్మీయానుబంధం. ఈ ప్రాంతాభివృద్ధికోసం వైఎస్ అనుకున్నవన్నీ జగన్ తన మేనిఫెస్టోలో చేర్చారు. దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. కేవలం ఓటు వేయించుకొని వెళ్లిపోయే దాన్ని కాదు. ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో ఒక వ్యక్తిగా ఉంటాను. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాను. వారి సమస్య వ్యక్తిగతం కావచ్చు, లేదా సామాజికమైన దైనా కావచ్చు ఏ సమయంలో వచ్చి అయినా చెప్పుకోవచ్చు. మెట్రోరైలుతో పాటు అన్ని సదుపాయాలూ ఏర్పరిచి విశాఖను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాను. అరకులో పర్యటించినప్పుడు అక్కడి కొండలపై ఉన్న ప్రజల అవస్థలు నా దృష్టికి వచ్చాయి. వారందరికీ ఉచిత విద్య, వైద్యంతో సహా అన్ని ఏర్పాట్లు కల ఆదర్శగ్రామాలను ఏర్పాటు చేయించాల్సిన అవసరముంది. ప్రజల కోసం నిలబడినందుకే దుష్ర్పచారాలు... ప్రజలకు మేలు చేయాలని తపించినందుకే వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై తెలుగుదేశం అనేక ఆరోపణలు, దుష్ర్పచారాలు చేసింది. ప్రజల కోసం నిలబడినందుకే జగన్‌నూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ కుమ్మక్కు అయి ఎన్నో రకాలుగా వేధించారు. 16 నెలలు జైలులో పెట్టించారు. ప్రభుత్వ విధానాల ప్రకారమే వై.ఎస్.రాజశేఖరరెడ్డి పరిశ్రమలు తీసుకువచ్చారు. అయినా తప్పు పట్టారు. చంద్రబాబు హయాంలో రూ.లక్ష మూలధనం ఉన్న ఐఎంజీ సంస్థకు హైదరాబాద్ నగరం నడిబొడ్డున 850 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబుపై ఆరోపణలను నెలరోజుల్లోగా విచారించాలని కోర్టు ఆదేశించినా సీబీఐ తన వద్ద సిబ్బంది లేరని చేతులెత్తి మౌనంగా ఉండిపోయింది. అదే జగన్ విషయానికి వచ్చేసరికి అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఏకంగా కొన్ని బృందాలను రంగ ంలోకి దించి సోదాలు చేశారు. మహిళలకు అండగా ఉంటాం వైఎస్ మాదిరిగానే జగన్ మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటారు. ఓదార్పుయాత్రలో వారు చూపిన ఆదరణ మరువలేనిది. అందుకే అమ్మ ఒడి, వృద్ధులకు పింఛన్ల మొత్తం రూ.700లకు పెంపు, మహిళల పేరిట ఇళ్లస్థలాలు, బ్యాంకు రుణాలు, డ్వాక్రా రుణాల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశ్వసనీయతే మా బలం ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, కుళ్లు కుతంత్రాలకు మధ్య జరిగే పోరాటం. విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలకు ఈ ఎన్నికల్లో విజ్ఞప్తి చేశాం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాట ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకొనే వారు. అదే స్ఫూర్తిగా ప్రజలకిచ్చిన మాటపై నిలబడడానికి జగన్ ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలందరూ చూశారు. అధికారం కోసం ఏనాడూ తాపత్రయపడలేదు. తనను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడారు. అందుకే తమ సమస్యలను పరిష్కరించే సత్తా జగన్‌కే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రథమ లక్ష్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నవ్యాంధ్రప్రదేశ్ కోసం నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అయితే దానికి మూలకారకుడు చంద్రబాబు. జగన్ ఏనాడూ సమైక్యాన్ని వీడలేదు. జగన్ దీక్షలతో ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటేనే వైఎస్ ఆశయాల సాధన సాధ్యమని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. -
అమ్మను దీవించండి
సాక్షి, విశాఖపట్నం : చుర్రుమనిపించే సూరీడు.. నిప్పు సెగలు రేగుతున్న నేల. పైనా కిందా ఒకటే మంట. అయినా ఒక ఆత్మీయ చూపు కోసం నిరీక్షించారు. ఒక ఆత్మీయ పలకరింపు కోసం ఎదురు చూశారు. మనసుకు కలిగే ఆనందం ముందు మేనుకు కలిగే కష్టం ఏమాత్రమనుకున్నారు. మండుటెండనుసైతం లెక్కచేయకుండా షర్మిల, విజయమ్మల వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారానికి జనాలు పోటెత్తారు. ప్రచారం ఆరంభాన ఎంత అభిమానం చూపారో.. ముగింపు రోజున అంతకు మించిన అభిమాన సాగరంలో ముంచెత్తారు. తమ అభిమాన నేత వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పార్టీ తరఫున విశాఖ ఎంపీగా ఎన్నికల బరిలో నిలిచిన వై.ఎస్.విజయమ్మకు అత్యధిక మెజార్టీతో పట్టాభిషేకం చేస్తామని చాటిచెప్పారు. సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి విజయమ్మతోపాటు షర్మిల భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో రోడ్ షో నిర్వహించారు. పార్టీ స్థానిక అభ్యర్థి కర్రి సీతారాం వెంటరాగా.. అక్కడ సభలో భారీగా తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి మళ్లీ నగరానికి చేరుకుని క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవ నాయకుల సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు. భోజన విరామం తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కోలా గురువులుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. డాల్ఫిన్ హోటల్ జంక్షన్లో అశేషంగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటరాగా ఆరిలోవ లో రోడ్ షో నిర్వహించారు. భారీగా జనాలు బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. రెండో వార్డు అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో షర్మిల ప్రసంగానికి యువత ఉర్రూతలూగింది. పవన్ కల్యాణ్, బాలకృష్ణ గురించి అడిగి మరీ షర్మిల నోట కౌంటర్లు విని ఆనందించారు. అనంతరం ఆరిలోవ నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక్కడ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొద్దిసేపే షర్మిల మాట్లాడినా.. మీరంతా జగనన్న వదిలిన బాణాలంటూ.. వారిని అక్కున చేర్చుకున్నారు. విజయమ్మ మాట్లాడుతూ.. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల రూపకల్పన వెనక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తపన, దీక్షను పథకాల వారీగా వివరించారు. మహిళల ఆదరణను చూరగొన్నారు. రోడ్ షోలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు తైనాల విజయ్‌కుమార్, తోట రాజీవ్, పార్టీ నేతలు కోరాడ రాజబాబు, పీలా ఉమారాణి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘విజయ’భేరి
నేడు విశాఖలో విజయమ్మ, షర్మిల ప్రచారం సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్.విజయమ్మ, పార్టీ నాయకురాలు షర్మిల నగరంలో సోమవారం నిర్వహించనున్నారు. భీమిలి నియోజక వర్గంలో రోడ్‌షో, సభల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ రాజకీయాల వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ ఆదివారం తెలిపారు. పర్యటన షెడ్యూల్ ఉదయం 9 గంటలకు మధురవాడ (స్వాతి నగర్)లో రోడ్డు షో, సభ మధ్యాహ్నం ఒంటిగంటకు ఫోర్ పాయింట్స్ షెరటాన్‌లో పాస్టర్లతో సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ఆరిలోవ రెండో వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద సభ సాయంత్రం 4 గంటలకు డాల్ఫిన్ హోటల్ జంక్షన్ వద్ద సభ సాయంత్రం 4.40కు వైఎస్సార్సీపీ మహిళా సెల్ సమావేశం -
జన తరంగం
విజయమ్మ రోడ్‌షోలకు అద్భుత జన స్పందన ప్రసంగాలపై వెల్లువెత్తిన ప్రజా ప్రశంసలు వివిధ వర్గాలతో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి భేటి సింహాద్రి అప్పన్న దీవెనలతో మొదలై భీమిలి సాగరహోరు సాక్షిగా, చినవాల్తేరులో జనవాహిని కదలిరాగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ ఆదివారం ఎన్నికల ప్రచార యాత్ర అనూహ్యరీతిలో అద్భుతంగా సాగింది. మండువేసవిలో చల్లదనాన్ని అందిస్తున్నట్లు ఫ్యానుగాలి నగరాన్ని మలయమారుతంలా తాకింది. విజయమ్మ సింహాచలం, భీమిలి, విశాఖ నగర పరిధిలోని చినవాల్తేరు,రాంనగర్, హెచ్‌బీ కాలనీ సభల్లో చేసిన ప్రసంగాలకు అద్భుత స్పందన లభించింది. రోడ్‌షోలలో అడుగడుగునా జనం ఆమెకు నీరాజనాలు పట్టారు. వివిధ వర్గాల ప్రముఖులతో ఆమె సమావేశమై చేసిన ఆలోచనాత్మక, ఆచరణాత్మక సూచనలు అందరి కితాబులందుకున్నాయి. సాక్షి, విశాఖపట్నం : ‘‘మీకు నేను తోడుంటా. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. ఎంపీగా గెలిచాక మీ కష్టసుఖాలు నాతో పంచుకోండి. మహానేత వైఎస్‌కు విశాఖ అంటే ప్రాణం. ఇక్కడ సహజసిద్ధ ప్రకృతి అందాలు ఆయనకు బాగా ఇష్టం. ఎప్పుడూ నాతో అనేవారు. విశాఖపట్నం బాగుంటుందని..అక్కడి ప్రజలు చాలా మంచి వాళ్లని. మీ అందరినీ చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది’’ విజయమ్మ భావోద్వేగంతో చెప్పిన మాటలివి.. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మ సింహాచలం, భీమిలి, చినవాల్తేరు, రాంనగర్ రోడ్డు, హెచ్‌బీ కాలనీల్లో రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. విజయమ్మను చూసేందుకు జనం పరుగులు తీశారు. ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. ఆమె చెప్పిన ప్రతిమాటను ఆసక్తిగా విన్నారు. విశాఖ నగరంలోకి కాన్వాయ్ రాగానే పూలతో ఆమెకు స్వాగతం పలికారు. వీరందరిని చూసి విజయమ్మ పులకరిం చారు. జగన్ అధికారంలోకి రాగానే అయిదు సంతకాలతో ప్రతి ఒక్కరి సమస్య లు పరిష్కరిస్తారని చెప్పడంతో చప్పట్లు చరిచారు. జై జగన్..జై జగన్ అంటూ యువత నినదించింది. ఎంపీగా పోటీ చేస్తున్న తనను ఆదరించండంటూ పిలుపునిచ్చారు. విశాఖను అంతర్జాతీయస్థాయి నగరంగా మార్చుకుందామన్నారు. విశాఖలో చాలామంది యువతకు ఉద్యోగావకాశాలు లభించడం లేదని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమల విస్తరణ చేపట్టి స్థానికులకు ఎక్కువ అవకాశం కల్పిస్తారని చెప్పారు. మరోపక్క ఉదయం, మధ్యాహ్నం విజయమ్మ ఐటీ నిపుణులు, రైతు సంఘాల నేతలు, మత్స్యకార వర్గాలు,వైశ్యులతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలు విన్నారు. -
స్వర్ణవిశాఖ
విశాఖపై జగన్ వాగ్దానాల జల్లు.. అభివృద్ధికి విశిష్ట ప్రణాళిక హర్షధ్వానాల మధ్య వివరించిన జననేత అమ్మకు అండగా నిలవాలని వినతి జనసంద్రంగా మారిన బీచ్సభ స్వర్ణ విశాఖ అవతరణే లక్ష్యం..హరిత నగర రూపకల్పనే ధ్యేయం..ఐటీలో మేటిగా తీర్చిదిద్దటమే సంకల్పం.. తాము అధికారంలోకి రాగానే మహా నగరాన్ని మహోన్నతంగా ఎలా తీర్చిదిద్దుతామో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తున్నప్పుడు జన కడలి ఆనంద తరంగితమైంది. జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం ఆర్కే బీచ్ వద్ద వైఎస్సార్ జనభేరి బహిరంగ సభలో చేసిన ప్రసంగానికి అద్భుత జన స్పందన లభించింది. సాక్షి, విశాఖపట్నం : ‘విశాఖను ఒక బంగారు నగరంగా తీర్చి దిద్దుతా. విశాఖపట్నం అంటే నాకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ప్రేమ లేకపోతే ఇక్కడి నుంచి నా తల్లినే ఎంపీగా నిలబెడుతున్నా. విశాఖ అభివృద్ధి దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే జరిగింది. గుజరాత్‌తో పోటీపడేలా విశాఖను తీర్చి దిద్దుతా. విశాఖలో అమ్మ అవసరం ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం విశాఖ తీరంలో రోడ్‌షో అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నాన్ని తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పారు. వైఎస్సార్ వల్లే విశాఖ అభివృద్ధి చంద్రబాబు చూశారు గానీ ఏనాడూ చేసింది లేదు. ఎవరేం చేసినా అది తానే చేసినట్టు చెప్పుకుంటూ.. జనాల జ్ఞాపకశక్తితో ఆడుకోవడం చంద్రబాబుకు అలవాటు. వైఎస్సార్ చెప్పేది తక్కువ.. చేసింది ఎక్కువ. విశాఖలో విప్రో వచ్చినా.. ఐబీఎం వచ్చినా.. సెజ్ వచ్చినా అది వైఎస్సార్ చలవే. రూ.2 వేల కోట్ల మేర సాఫ్ట్వేర్ ఎగుమతులు, అంతర్జాతీయ స్థాయికి విమానాశ్రయం, రాత్రిపూట విమానాల ల్యాండింగ్‌కు బీజం వేసింది వైఎస్సారే. విశాఖ విమానాశ్రయం రన్‌వే సైజ్ పెంపు, రెండో టెర్మినల్ కట్టిందీ వైఎస్సార్ హయాంలోనే. విశాఖలో బీఆర్టీఎస్ ప్రారంభించి, 80 శాతం పనులు పూర్తి చేసింది వైఎస్సారే. మిగిలిన 20 శాతం పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వాలు నానా యాతనలు పడుతున్నాయి. అపెరల్ పార్కు ఏర్పాటుతో పది వేల మందికి ఉద్యోగాలు రావడానికి వైఎస్సారే కారణమని జగన్ అన్నారు. గ్రీన్ విశాఖ విశాఖపట్నంలో పోర్టు కాలుష్యం, స్టీల్‌ప్లాంట్ కాలుష్యం ఎక్కువ. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించి గ్రీన్ సిటీగా చేయాల్సిన అవసరం ఉంది. విశాఖకు ఐటీ ఎగుమతుల జోన్ తీసుకొస్తాం. ఇవాళ రూ.2 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులున్నాయి. రాబోయే రోజుల్లో కుప్పలుతెప్పలుగా ఐటీ ఎగుమతులు జరిగేలా చేస్తా. పోలవరం తీసుకొచ్చి నీటి కొరత తీరుస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ విశాఖపై వరాల జల్లు కురిపించారు. విశాఖ ఎంపీగా తన తల్లి విజయమ్మతోపాటు, అనకాపల్లి ఎంపీ గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్(తూర్పు), కోలా గురువులు(దక్షిణం), చొక్కాకుల వెంకటరావు(ఉత్తరం), దాడి రత్నాకర్(పశ్చిమం), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), కర్రి సీతారాం(భీమిలి), రొంగలి జగన్నాథం(ఎస్.కోట)ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సమావేశంలో జగన్ వెంట పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, పార్టీ నేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తదితరులున్నారు. -
విజయమ్మ వైఎస్సార్ జనభేరి రేపు
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్నారు. భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో పలువు సంఘాలతో జరిగే ప్రత్యేక సమావేశాల్లో విజయమ్మ పాల్గొంటారన్నారు. పర్యటన షెడ్యూల్ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరతారు. 9.30 గంటలకు మధురవాడ చేరుకుంటారు. అక్కడి జంక్షన్లో బహిరంగ సభ. 10 గంటలకు ఆనందపురం పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నగరానికి వస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సమావేశం 2 గంటలకు హోటల్ మేఘాలయలో మేధావులతో సమావేశం 3 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో చాంబర్ ప్రతినిధులతో భేటీ 4 గంటలకు గాజువాకలో బహిరంగ సభ 5 గంటలకు పరవాడలో బహిరంగ సభ 6 గంటలకు అనకాపల్లిలో బహిరంగ సభ 7 గంటలకు నర్సీపట్నంలో బహిరంగ సభ -
జిల్లా అంతా ఫ్యాన్....
విజయమ్మ రెండు రోజుల పర్యటనతో ఉత్సాహం 12 నియోజక వర్గాల్లో పర్యటన విజయవంతం ప్రసంగాలకు ముగ్ధులైన జిల్లావాసులు కష్టాలు తీరుస్తారని అన్ని వర్గాల్లో నమ్మకం వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి వెంటే జనం ఫ్యాన్ గాలి జోరుకు ప్రత్యర్థులు బెంబేలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైఎస్సార్సీపీ గాలి వీస్తోంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ ప్రచారం రెండు దశల్లో హోరెత్తడంతో ప్రత్యర్థి శిబిరాలు డీలా పడుతున్నాయి. విజయమ్మ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరికీ ధైర్యం చెబుతూ ప్రచారంలో తనదైన శైలి కొనసాగించడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి జిల్లాలో విజయమ్మ రెండు విడతల్లో ఇప్పటివరకూ 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయవంతంగా పర్యటించారు. నామినేషన్ వేసిన మరుసటిరోజు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, భీమిలి, గాజువాక, ఎస్.కోట నియోజక వర్గాలను చుట్టేశారు. ప్రతిచోటా రోడ్‌షో నిర్వహించి శ్రేణులను ఉత్తేజపరిచారు. జనం బాగా స్పందించారు. మహానేత సతీమణి స్వయంగా ఇక్కడి నుంచి పోటీచేస్తుండడంతో జనాదరణ పోటెత్తింది. విజయమ్మ ప్రచారం ఫలితంగా జిల్లాలో అన్ని స్థానాల్లో ఫ్యాన్ గాలి రెట్టింపైంది. విజయమ్మ ప్రతి చోటా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తుండడంతో ప్రజలు ఆమెను గుండెల్లో పెట్టుకుంటున్నారు. జగన్ వస్తే తమ కష్టాలకు ముగింపు దొరుకుతుందని భావిస్తున్నారు. దీంతో తమ కష్టాలు కడతేర్చే జననేత తరపున విజయమ్మ రావడంతో ప్రతి ఒక్కరు ఆమెతో తమ బాధలు పంచుకుంటున్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వారికిచ్చే ఎక్స్‌గ్రేషియా, బియ్యం, డీజిల్ సబ్సిడీ పెంచుతామని చెప్పినప్పుడు మత్స్యకార వర్గాలు తమను ఆదుకునే దేవత వచ్చిందని సంబరపడ్డారు. గాజువాక, ఎస్.కోట, విశాఖలోని నాలుగు నగర నియోజక వర్గాల్లో స్థానికంగా పరిశ్రమలను ప్రోత్సహించి ఉన్న పరిశ్రమల విస్తరణ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పన చేస్తామని భరోసా ఇవ్వడంతో యువతరం స్పందిస్తున్నారు. శనివారం, ఆదివారం జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాడేరు, అరకు నియోజక వర్గాల్లో మలివిడత కింద ప్రచారం నిర్వహించారు. పాడేరు, అరకులో గిరిజనుల సమస్యలను గుర్తించి అక్కడ యువతకు స్థానిక పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఉద్యోగాలు, కొండకుమ్మర్లకు రిజర్వేషన్ సౌకర్యం, గిరిజనులు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. యలమంచిలిలో అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ద్వారా తలెత్తే సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో అక్కడ వేలాదిమంది విజయమ్మకు నీరాజనాలు పలికారు. రెండు విడతలుగా సాగిన విజయమ్మ ప్రచారంతో గ్రామీణ, నగర విశాఖలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. -
నేడు విజయమ్మ వైఎస్సార్ జనభేరి
పాడేరు, అరకు, ఎస్.కోట, విశాఖ దక్షిణ నియోజకవర్గాలలో పర్యటన సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగాజిల్లాలో వైఎస్సార్ జనభేరి రెండో విడత రెండో రోజూ కొనసాగించనున్నారు. ఆదివారం పాడేరు, అరకు, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయమ్మ ప్రచారం నిర్వహిస్తారని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడేరు, అరకు, ఎస్.కోట నియోజకవర్గాల్లో ఒక్కో చోట నిర్వహించే బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాత్రం రోడ్ షో నిర్వహిస్తారని వెల్లడించారు. పర్యటన షెడ్యూల్ ఉదయం 10 గంటలకు పాడేరు నియోజకవర్గంలోని పాడేరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు అరకు నియోజకవర్గంలోని అరకు సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్తవలస బహిరంగ సభలో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ దక్షిణ నియోజక వర్గంలోని రెల్లివీధి, 6 గంటలకు కోటవీధి మీదుగా రోడ్ షో నిర్వహించి రాత్రి 7 గంటలకు మనోరమ థియేటర్‌కు చేరుకుని అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడటంతో ఆదివారంనాటి పర్యటనను ముగిస్తారు. -
నేడు విజయమ్మవైఎస్సార్ జనభేరి
అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ప్రచారం నాలుగుచోట్ల బహిరంగ సభలు సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశా ఖ లోక్‌సభ ఆపార్టీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మ శనివారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి నిర్వహించనున్నారు. ఇప్పటికే విశాఖ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారం మూడు రోజులు నిర్వహించారీమె. రెండో విడత శనివారం జిల్లాలోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి ఓ చోట జరిగే బహిరంగ సమావేశాల్లో ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగిస్తారన్నారు. పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాల్ని వివరిస్తారన్నారు. పర్యటన షెడ్యూల్ ఉదయం 11 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గంలోని అడ్డురోడ్డులో బహిరంగసభ మధ్యాహ్నం 2 గంటలకు యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురంలో బహిరంగసభ సాయంత్రం 4 గంటలకు చోడవరం నియోజకవర్గంలోని వడ్డాదిలో బహిరంగసభ సాయంత్రం 6 గంటలకు మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లిలో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ పాల్గొంటారు. -
ప్రచారంలో విజయోత్సాహం
కదం తొక్కుతున్న పార్టీ శ్రేణులు మద్దతుగా వివిధ సంఘాలు భారీ మెజారిటీ పైనే దృష్టి సాక్షి, విశాఖపట్నం : విశాఖ లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మకు విశా ఖ లోక్‌సభ స్థానం నుంచి అత్యధిక మె జార్టీతో పట్టం కట్టేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. విశాఖ లోక్‌సభ పరిధిలోని పార్టీ నేతలు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీల్లో గుబులు రేపుతున్నారు. ఇపుడు విజయమ్మకు అం డగా నిలిచేందుకు పలు ఎన్జీవో ప్రతిని ధులు కూడా ముందుకొస్తున్నారు. మరోవైపు పార్టీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. అన్ని పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కేడర్ విజయమ్మ పక్షాన నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. విశాఖ ఎంపీగా విజయమ్మ విజయంపై ఎవరికీ సందేహాల్లేవని.. విశాఖలో ఇప్పటి వరకు ఏ అభ్యర్థీ సాధించనంత మెజార్టీ కోసమే తమ ప్రయత్నమని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ పరిధిలోని విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తర, దక్షిణం, గాజువాక, భీమిలి నియోజకవర్గాలతోపాటు, విజయనగరంలోని ఎస్.కోట నియోజకవర్గాలలో ఆమె అఖండ విజయం కోసం పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. వివిధ స్థాయిల్లో నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంగళ బుధవారాల్లో విశాఖ నగర పరిధిలోని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తమ ప్రచారంలో విజయమ్మ గెలుపుకోసం ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. అభ్యర్థుల సతీమణులు కూడా ఇప్పటికే రంగ ప్రవేశపెట్టి విజయమ్మను గెలిపించాలని గడప గడపకూ తిరిగి మహిళలకు చెబుతున్నారు. సాక్షాత్తూ వైఎస్ సతీమణి పోటీ చేస్తున్నందున ఆమెను మంచి మెజారిటీలో పార్లమెంటుకు పంపాలని కోరుతున్నారు. విజయమ్మ గెలుపునకు చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. -
ఫ్యాన్ జోరు
దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ విజయమ్మ రాకతో కొత్త ఉత్సాహం అభ్యర్థుల ప్రకటన కలిసొచ్చిన అంశం టీడీపీలో తొలగని ఇంటిపోరు ప్రచారంలో చతికిలపడ్డ సైకిల్ విశాఖ జిల్లాలో ఇప్పుడు అన్ని దిక్కులా వీస్తున్నది ఫ్యాను గాలే. సార్వత్రిక ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తోంది. రాజన్న రాజ్యం సుప్రతిష్ఠితం చేయాలన్న జగనన్న ఆకాంక్షలను ఆహ్వానించే జనకోటి ఆశీస్సులు.. మహానేత సతీమణి విశాఖ ఎంపీ అభ్యర్థిగా స్వయంగా బరిలోకి దిగటం.. విజయమ్మ రోడ్‌షోలకు లభించిన అఖండ ఆదరణ, ప్రత్యర్థుల స్వయంకృతాపరాధాలు, కీలక తరుణంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తల నిర్లిప్తతతో ప్రచారంలో ఆ పార్టీల డీలా, ‘సైకిల్’ గుండెల్లో రె‘బెల్’ రైళ్లు..ఇలా బోలెడు కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలమంతా కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. సాక్షి,విశాఖపట్నం: ఎన్నికల ఘట్టంలో కీలకమైన ప్రచార పర్వం ఊపందుకుంది. వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. టీడీపీ ఇంకా అసమ్మతిసెగలు, నిరసనలు,తిరుగుబాటుదారులతో అవస్థలు పడుతూనే ఉంది. వైఎస్సార్సీపీ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశం. ఎక్కడా అసమ్మతి కనిపించలేదు. లోక్‌సభ అభ్యర్థిగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీచేస్తుండడంతో వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకు పోతోంది. ఆమె రోడ్‌షోల ప్రభావంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్‌గాలి ఉవ్వెత్తున వీస్తోంది. జిల్లా మొత్తానికే ఎన్నికల ప్రచారం జోష్ పెరిగింది. ఆమె ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలోని విశాఖ తూర్పు,పశ్చిమ,ఉత్తరం,దక్షిణం,గాజువాక,భీమిలి తదితర నియోజకవర్గాల్లో రోడ్షోలద్వారా ప్రజలను పలకరించి మొత్తం నియోజకవర్గాన్ని చుట్టేశారు. తద్వారా ప్రచారంలో వైఎస్సార్సీపీ పైచేయి సాధించింది. అసమ్మతి సెగలతో టీడీపీ నేల చూపులు ప్రచారంలో టీడీపీ బాగా వెనుకబడింది. అభ్యర్థులను ప్రకటించే విషయంలోనూ అనేక పేచీలు తలెత్తాయి. 15 నియోజకవర్గాల్లో రెండు బీజేపీకి ఇచ్చేయగా, సుమారు ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి రెబల్స్ బెడద తీవ్రంగా వేధిస్తోంది. గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, పాడేరు, అరకు, ఉత్తరం,భీమిలి తదితర స్థానాల్లో టిక్కెట్లు దక్కించుకున్న టీడీపీ అభ్యర్థులు రెబల్స్ నుంచి మద్దతులేక నేలచూపులు చూస్తున్నారు. ప్రచారానికి వెళ్లాలా? అసంతృప్తులను బుజ్జగించుకోవాలా? అనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కొందరు అభ్యర్థులైతే ప్రచారం మాట దేవుడెరుగా రెబల్స్‌ను దారికితెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరికి డబ్బుల ఎరచూపించి దారికి తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల మొక్కుబడి ప్రచారం చేస్తున్నారు. యలమంచిలి, గాజువాక, భీమిలి,పాయకరావు పేట,అరకు ఇలా దాదాపు అన్నిచోట్లా సొంత పార్టీ నుంచే మద్దతు లేకపోతుండడంతో ప్రచారంలో అభ్యర్థులు వెనుకబడిపోయి కంగారుపడుతున్నారు. విశాఖ లోక్‌సభ పరిధిలో బీజేపీ ప్రచారం కూడా మందకొడిగా ఉంది. ఉత్తరంలో నామినేషన్ల ఘట్టం వరకూ అభ్యర్థి తేలకపోవడం ఈ పార్టీ ప్రచారానికి మైనసయింది. దీనికితోడు కలిసిరాని టీడీపీ క్యాడర్ వీరికి పెనుసవాలయింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసే నేతలే లేకపోవడంతో దొరికిన కొత్త మొఖాలకు టిక్కెట్లిచ్చి మమ అనిపించింది. మొత్తానికి అసెంబ్లీ,లోక్‌సభ అభ్యర్థుల జాబితా తేలిపోవడం,నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జిల్లాలో అభ్యర్థులంతా ఇప్పుడు సమయం ప్రచారానికే ఉపయోగిస్తున్నారు. అయితే వీరికి విభజన సెగలు అడుగడుగునా తగులుతూ అభ్యర్థులకు చెమటలు పోయిస్తున్నాయి. -
శ్రమైక జీవనభాగ్యం
పరవశించిన పారిశ్రామిక ప్రాంతం అడుగడుగునా జన హారతులు గాజువాక, పశ్చిమ నియోజకవర్గాలలో విజయమ్మ రోడ్‌షోకు అపూర్వ స్పందన ఎనిర్వాసిత కాలనీల నీరాజనం సాక్షి, విశాఖపట్నం: విశాఖ పారిశ్రామిక ప్రాం తం పులకించింది. విజయమ్మ రాకతో పరవశించింది. ‘విశాఖ లోక్‌సభ బరిలో నిలిచి న తాను సదా మీ కందరికీ అందుబాటు లో ఉండి ప్రతి ఒక్క సమస్య పరిష్కారాని కి కృషిచేస్తా’నని విజయమ్మ ఇచ్చిన భరోసాతో ఆనందించింది. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో భాగం ఆదివారం విజయ మ్మ నిర్వహించిన వైఎస్సార్ జనభేరి రోడ్ షోకు జనం మద్దతు వెల్లువెత్తింది. ఈ సం దర్భంగా విజయమ్మ పారిశ్రామిక ప్రాంత ప్రగతికి వరాల వర్షం కురిపించారు. అనునిత్యం అండగా ఉంటా విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న రాజశేఖరరెడ్డి ఆశయాల కొనసాగింపుగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల్ని విజయ మ్మ వివరించారు. బీహెచ్‌పీవీని చంద్రబా బు నాయుడు ప్రయివేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తే.. వైఎస్సార్ దాన్ని పరిరక్షించేం దుకు చేపట్టిన చర్యల్ని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ విస్తరణకు వైఎస్సార్ కృషి ఎనలేనిదన్నారు. మూడు వేల మంది నిర్వాసితులకు ఆయన చొరవ వల్లే ఉపాధి దక్కిన విషయం చెప్తూ.. మిగిలిన వారికి కూడా జగన్ ప్రభుత్వంలో ఉపాధి దక్కుతుందన్న భరోసా ఇచ్చారు. హౌస్ కమిటీ వివాద పరిష్కా రం వైఎస్సార్ మరణంతో ఆగిపోయిందని, జగన్‌బాబు పాలన లో దాన్ని పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ రూపకల్ప న, రోడ్లు, మౌలిక వసతుల ఏర్పాటు, రూ.40 వేల కోట్లతో హెచ్‌పీసీఎల్ ప్లాంట్ విస్తరణ తదితర ప్రతి అభివృద్ధి వైఎస్సార్ ముద్ర కనిపిస్తోంద ని, ఆయన మరణంతో కుంటుపడిన అభివృద్ధి జోరందుకోవాలంటే జగన్‌బాబును ఆశీర్వదించండంటూ ప్రజలను కోరారు. వైఎస్సార్‌పై ఇక్కడి ప్రజలకున్న అభిమానమే తనను ఇక్కడికి తీసుకొచ్చినట్టుందన్నారు. ఎంపీగా గెలిచాక ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రోడ్ షో జరిగిందిలా.. గాజువాక నియోజకవర్గ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి వెంటరాగా.. షీలానగర్ నుంచి రోడ్ షో ప్రారంభమైంది. అక్కడి నుంచి నాతయ్యపాలెం, పాతగాజువాక, చినగంట్యాడ, శ్రీనగర్, వడ్లపూడి, కణితి కాలనీ, రాజులపాలెం, కూర్మన్నపాలెం జంక్షన్, రాజీవ్‌నగర అగనంపూడి నిర్వాసిత కాలనీ, కొండయ్యవలస, డొంకాడ, ఫార్మాసిటీ కాలనీ మీదుగా పెదగంట్యాడ వరకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. తిరిగి సాయంత్రం పశ్చిమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ వెంటరాగా జింక్ గేట్ నుంచి రోడ్ షో మొదలయింది. ఆంజనేయస్వామి గుడి, ములగాడ హౌసింగ్ కాలనీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, బర్మా కాలనీ, దుర్గా టెంపుల్ రోడ్, ఇందిరా కాలనీ పార్క్ రోడ్, జనతా కాలనీ, అంబేద్కర్ కాలనీ, గుడివాడ అప్పన్నకాలనీ, త్రినాథపురం, క్రాంతినగర్, దుర్గానగర్, మల్కాపురం పోలీస్ స్టేషన్ రోడ్, నౌసేనాబాగ్, కల్యాణి ఆస్పత్రి రోడ్, మల్కాపురం మెయిన్ రోడ్, రామకృష్ణాపురం రోడ్, శ్రీహరిపురం మెయిన్‌రోడ్, నక్కవానిపాలెం రోడ్ మీదుగా గాజువాక డిపోతో పశ్చిమ నియోజకవర్గ రోడ్ షో ముగిసింది. అక్కడి నుంచి మళ్లీ గాజువాక నియోజకవర్గంలో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి బయలుదేరారు. విజయమ్మ వెంట పార్టీ నియోజకవర్గ అభ్యర్థులతోపాటు నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ ఆద్యంతం ఉండి, రోడ్ షో సంధాన కర్తగా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మాతృమూర్తిని మన కుటుంబంలో ఒకరిగా చేస్తూ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారని, దానికి ప్రతిఫలంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో విజయమ్మను, పార్టీ అభ్యర్థులు తిప్పల నాగిరెడ్డి, దాడి రత్నాకర్‌ను గెలిపించాలని పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్ షోలో విజయమ్మతోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, సీఈసీ సభ్యులు భూపతిరాజు శ్రీనివాసరాజు, దామా సుబ్బారావు, అధికార ప్రతినిధి పీలా ఉమారాణి, మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీసెల్ కన్వీనర్ పక్కి దివాకర్, ప్రచార కమిటీ కన్వీనర్ రవిరెడ్డి, మైనార్టీసెల్ కన్వీనర్ నౌషద్, ఉత్తరాంధ్ర మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు జి.వి.రవిరాజు, సత్తి రామకృష్ణారెడ్డి, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు విజయమ్మ రోడ్ షో
గాజువాక, పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటన పెదవాల్తేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి వైఎస్.విజయ మ్మ ఆదివారం గాజువాక, పశ్చిమ నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంట లకు గాజువాక నియోజక వ ర్గం షీలానగర్ నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్‌షో వివరాలను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ శనివారం వెల్లడించారు. షీలానగర్ నుంచి అయ్యప్పస్వామి ఆలయం, నాతయ్యపాలెం, బీహెచ్‌పీవీ జంక్షన్, పాత గాజువాక, శ్రీనగర్ జంక్షన్, వడ్లపూడి, దువ్వాడ, అగ నంపూడి, ఫార్మాసిటీ ఏరియాల్లో రోడ్ షో నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రేడ్ యూనియన్ సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4.30 గంటలకు పశ్చిమ నియోజక వర్గం జింక్ గేట్, ఆంజనేయస్వామి ఆలయం, ములగడ హౌసింగ్ కాలనీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, బర్మా కాలనీ, శ్రీదుర్గా ఆలయం రోడ్డు, ఇందిరా కాలనీ పార్కు రోడ్డు, జనతా కాలనీ, అంబేద్కర్ కాలనీ, గుడివాడ అప్పన్న కాలనీ, త్రినాథ్‌పురం, క్రాంతి నగర్, మల్కాపురం పోలీస్‌స్టేషన్ రోడ్డు, నౌసేనా బాగ్, కల్యాణి ఆస్పత్రి రోడ్డు, మల్కాపురం మెయిన్‌రోడ్డు, రామకృష్ణపురం రోడ్డు, శ్రీహరిపురం మెయిన్‌రోడ్డు, నక్కవానిపాలెం రోడ్డు, గాజువాక ఆర్టీసీ డిపో ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాత్రి 7 గంటల నుంచి గాజువాక నియోజక వర్గం కొత్త గాజువాక జంక్షన్, దయాళ్‌నగర్ జంక్షన్, పెద గంట్యాడ టీఎన్ఆర్ స్కూల్ జంక్షన్, బాలచెరువు ఆర్క్ జంక్షన్, పెదగంట్యాడ ఏరియాల్లో విజయమ్మ రోడ్ షో ఉంటుంది. -
వైఎస్ విజయమ్మకుజననీరాజనం
పశ్చిమ కృష్ణా జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు.. దారిపొడవునా ప్రజల నీరాజనాలు నడుమ మండుటెండను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో వైఎస్సార్ జనభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కోసం నిరీక్షించిన ప్రజలను ఉద్దేశించి పలుచోట్ల ప్రసంగిస్తూ జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల శంఖారావం పూరించారు. సోమవారం జిల్లాలోని జగ్గయ్యపేట నియోజవర్గంలో ప్రారంభమైన యాత్ర మైలవరం నియోజకవర్గంలో ముగిసింది. -
నేటి నుంచి జనభేరి
జిల్లాకు వైఎస్ విజయమ్మ రాక రెండు రోజుల పాటు ఐదు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభలు పెనుగంచిప్రోలులో ప్రారంభం.. జి.కొండూరులో ముగింపు సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ సోమవారం నుంచి రెండు రోజులపాటు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్సార్ జనభేరి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం విజయమ్మ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఆదివారంతో యాత్ర ముగించుకొని సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రెండు రోజుల పాటు ఐదు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించేలా నేతలు షెడ్యూలు రూపొందించారు. ఇందులోభాగంగా సోమవారం జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించి రోడ్‌షో, పలుచోట్ల సభల్లో ఆమె ప్రసంగిస్తారు. మంగళవారం గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. తొలిరోజు ఉదయం 10 గంటలకు పెనుగంచిప్రోలులో యాత్ర ప్రారంభించి రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడినుంచి అనిగండ్లపాడు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శివాపురం, జొన్నలగడ్డ, కొణతమాత్మకూరు, దాములూరులో రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలంలోకి యాత్ర చేరుకుంటుంది. పల్లంకి, వెల్లంకి, జమ్మవరం, అన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరులో రోడ్‌షో సాగుతుంది. అల్లూరు గ్రామంలో సభలో మాట్లాడతారు. అనంతరం పెద్దాపురంలో రోడ్‌షో నిర్వహించి అక్కడ నుంచి మైలవరం నియోజకవర్గంలోని గూడెం మాధవరం చేరుకుంటారు. ఉగ్గిరాలపాడు, గంగినేని, సున్నంపాడు, మునగపాడు, చెరువుమాధవవరం, జి.కొండూరులో రోడ్‌షో నిర్వహించి మొదటిరోజు యాత్ర ముగిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని వివరించారు. -
ముంపు బాధితులను పరామర్శించిన విజయమ్మ
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ముంపు బాధితులను వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విజయమ్మకు తమ ఆవేదనను చెప్పుకునేందుకు ఉదయం నుంచి ఎస్సీ కాలనీకు చెందిన ముంపు బాధితులు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. విజయమ్మను చూడగానే మహిళలు ఉద్వేగంతో ఆమె వద్దకు పరుగులు తీసారు. అనంతరం రామచంద్రపురం మండలంలో విజయమ్మ తుల్యాబాగ డ్రై యిన్ వలన ముంపు ప్రాంతాల పంట పోలాలను పరిశీలించారు. -
వై.ఎస్.విజయమ్మ పర్యటన రేపు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాల కారణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటించనున్నారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజ యకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాల తోపాటు శ్రీకాకుళం పట్టణంలో నీట మునిగిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. విజయవంతం చేయండి: కృష్ణదాస్ జిల్లాలో విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలోను, నష్టాలను అంచనా వేయటంలోను అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. -
మూడో రోజూ కొనసాగిన విజయమ్మ ఆమరణ దీక్ష
సాక్షి, గుంటూరు : ప్రజలకు సమన్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష ఉద్యమమే ఊపిరిగా సాగుతోంది. ‘సమన్యాయమే’ లక్ష్యంగా, ప్రజల ఆశీస్సులే ఆలంబనగా సమరస్ఫూర్తిని నింపుతోంది. సోమవారం ప్రారంభమైన విజయమ్మ సమరదీక్ష బుధవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసపడినప్పటికీ, తన కోసం తరలి వస్తున్న వృద్ధులు, మహిళల్ని చూసి కూడదీసుకున్న సత్తువతో విజయమ్మ పలకరిస్తూ, ప్రతి నమస్కార చేస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. పల్లెలు, పట్టణాల నుంచి వేలాదిగా వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, వివిధ వృత్తుల్లో కొనసాగేవారు విజయమ్మను కలిసేందుకు వస్తూనే ఉన్నారు. ప్రధానంగా బుధవారం మహిళా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదయం 10 గంటల సమయంలో విజయమ్మను ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. ఆ తరువాత పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిలు కొద్దిసేపు విజయమ్మతో మాట్లాడారు. దీక్షా శిబిరానికి వచ్చిన కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కూడా కొద్దిసేపు మాట్లాడారు. ‘కడప సంగతులేంటని’ విజయమ్మ ప్రశ్నించారు. ఆపైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నాయకుల్ని విజయమ్మకు పరిచయం చేశారు. సంఘీభావం తెలిపిన న్యాయవాదులు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఆవరణ నుంచి ర్యాలీగా శిబిరానికి తరలి వచ్చారు. ఒక్కొక్కరుగా విజయమ్మను కలసి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి ప్రసంగించారు. అనంతరం న్యాయవాదులతో కలసి విజయమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే కృష్ణాడెల్టా ఎడారిగా మారే ప్రమాదముందనీ, వేల కోట్లతో నిర్మించిన పులిచింతలకు గుక్కెడు నీరు కరువయ్యే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని ఆ వినతి పత్రంలో వివరించారు. అనంతరం పెదకాకాని నుంచి వచ్చిన గుంటూరు కృష్ణా జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆర్కే తల్లిదండ్రులు ఆళ్ల దశరథరామిరెడ్డి. వీరరాఘవమ్మలు విజయమ్మను కలసి ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన తల్లి పెదకాకాని సర్పంచ్‌గా విజయం సాధించినట్టు ఆర్కే వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో సుమారు 20 మంది మహిళా సర్పంచ్‌లు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విజయమ్మను కలసి తమ మద్దతు ప్రకటించారు. విజ్ఞాన్ కళాశాల విద్యార్థినులు తమ సంఘీభావం తెలిపారు. అంతకుముందు చిన్నపాటి స్వరంతో కొద్దిసేపు విజయమ్మ ప్రసంగించారు. కొవ్వొత్తులతో సంఘీభావం.. బుధవారం రాత్రి దీక్షా శిబిరంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. విజయమ్మతో పాటు పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. అనంతరం గుంటూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త షౌకత్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. గుడివాడ ఎమ్మె ల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రసంగించారు. శిబిరంలో పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ,అంబటి రాంబాబు, ఎమ్మెల్యే లు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ల రేవతి, ఎస్టీ విభాగం కన్వీనర్ హనుమంత్‌నాయక్, పార్టీ సమన్వయకర్తలు కోన రఘుపతి, మందపాటి శేషగిరిరావు, నసీర్ అహ్మద్, షౌకత్, రావి వెంకటరమణ, గుదిబండి చినవెంకటరెడ్డి, విద్యార్థి విభాగం నేత నర్సిరెడ్డి, పురుషోత్తం, నాయకులు గులాం రసూల్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, దోసపాటి నాగేశ్వరరావు, ముస్తఫా, నెల్లూరు జెడ్పీమాజీ చైర్మన్ బాలచెన్నయ్య, విజయవాడ నగర నేత గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.