ప్రచారంలో విజయోత్సాహం | Victorious campaign | Sakshi
Sakshi News home page

ప్రచారంలో విజయోత్సాహం

Apr 24 2014 12:50 AM | Updated on May 29 2018 4:06 PM

ప్రచారంలో విజయోత్సాహం - Sakshi

ప్రచారంలో విజయోత్సాహం

విశాఖ లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మకు విశా ఖ లోక్‌సభ స్థానం నుంచి అత్యధిక మె జార్టీతో పట్టం కట్టేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి.

  •      కదం తొక్కుతున్న పార్టీ శ్రేణులు
  •      మద్దతుగా వివిధ సంఘాలు
  •      భారీ మెజారిటీ పైనే దృష్టి
  •  సాక్షి, విశాఖపట్నం : విశాఖ లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మకు విశా ఖ లోక్‌సభ స్థానం నుంచి అత్యధిక మె జార్టీతో పట్టం కట్టేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. విశాఖ లోక్‌సభ పరిధిలోని పార్టీ నేతలు ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీల్లో గుబులు రేపుతున్నారు. ఇపుడు విజయమ్మకు అం డగా నిలిచేందుకు పలు ఎన్‌జీవో ప్రతిని ధులు కూడా ముందుకొస్తున్నారు. మరోవైపు పార్టీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. అన్ని పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కేడర్ విజయమ్మ పక్షాన నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి.

    విశాఖ ఎంపీగా విజయమ్మ విజయంపై ఎవరికీ సందేహాల్లేవని.. విశాఖలో ఇప్పటి వరకు ఏ అభ్యర్థీ సాధించనంత మెజార్టీ కోసమే తమ ప్రయత్నమని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ పరిధిలోని విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తర, దక్షిణం, గాజువాక, భీమిలి నియోజకవర్గాలతోపాటు, విజయనగరంలోని ఎస్.కోట నియోజకవర్గాలలో ఆమె అఖండ విజయం కోసం పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి.
     
    వివిధ స్థాయిల్లో నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంగళ బుధవారాల్లో విశాఖ నగర పరిధిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ ప్రచారంలో విజయమ్మ గెలుపుకోసం ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. అభ్యర్థుల సతీమణులు కూడా ఇప్పటికే రంగ ప్రవేశపెట్టి విజయమ్మను గెలిపించాలని గడప గడపకూ తిరిగి మహిళలకు చెబుతున్నారు. సాక్షాత్తూ వైఎస్ సతీమణి పోటీ చేస్తున్నందున ఆమెను మంచి మెజారిటీలో పార్లమెంటుకు పంపాలని కోరుతున్నారు. విజయమ్మ గెలుపునకు చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement