Ceiling fan
-
భరించలేను.. నన్ను క్షమించండి
జగిత్యాలక్రైం: వస్త్రవ్యాపారంలో నష్టాలు రావడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెందిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి గాజుల నరహరి(55) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నరహరి పట్టణంలో హోల్‌సేల్ వ్యాపారి. దందా బాగా సాగేందుకు బ్యాంక్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తెలిసినవాళ్ల వద్ద మరికొంత అప్పు చేశాడు. అయితే, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, వాటిని తీర్చేదారిలేకపోవడంతో ఆయన తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఉదయం పట్టణంలోని జగిత్యాల క్లబ్‌కు వెళ్లాడు. ఇంటినుంచి తెచ్చుకున్న తాడును సీలింగ్ ఫ్యాన్‌కు కట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులకు వడ్డీ కట్టలేక, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించండని రాసిన లేఖ మృతుడి జేబులో లభించింది. కాగా, క్లబ్ స్వీపర్ గదులు శుభ్రం చేస్తుండగా నరహరి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు, క్లబ్ సెక్రటరీ నారాయణరెడ్డికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ నటేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సచిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య ఉంది. కూతురు అమెరికాలో ఉంటోంది. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు జాప్యమయ్యే అవకాశం ఉంది. -
వరునిపై పడిన సీలింగ్ ఫ్యాన్.. తరువాత?
ఒక రోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. తన గదిలో పూలతో అందంగా అలంకరించిన మంచంపై పడుకున్నాడు. ఉన్నట్టుండి పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఆ యువకునిపై ధడాలున పడింది. అంతే అతను బాధతో కేకలు పెట్టాడు. అంతవరకూ ఆనందం తాండవమాడిన ఆ ఇంటిలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఆందళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఒక యువకుని మెడ తెగిపోయింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ యువకునికి తక్షణ చికిత్సనందిస్తూ, మొత్తం 26 కుట్లు వేసి, అతని ప్రాణాలు కాపాడారు. ఒకరోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. మక్రానా పరిధిలోని గౌడాబాస్ ప్రాంతంలో ఉంటున్న యువకునిపై సీలింగ్ ఫ్యాన్ పడింది. ఈ ఘటనలో ఆ యువకుని గొంతుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మార్బల్ వ్యాపారి రమ్జాన్ సిసోడియా కుమారుడు ఇక్రామ్(27)కు జూన్ 9న వివాహం జరిగింది. అనంతరం సంప్రదాయంలో భాగంగా వధువు జన్నత్ తన పుట్టింటికి వెళ్లింది. వరుడు విశ్రాంతి తీసుకుంటుండగా... ఇక్రామ్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి ఇక్రామ్ బాధతో కేకలుపెట్టాడు.వెంటనే కుటుంబ సభ్యులు ఆ గదిలోకి వెళ్లి చూడగా, ఇక్రామ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని గొంతు, చేయికి తీవ్రంగా రక్తసస్రావం అవుతోంది. సీలింగ్ ఫ్యాన్ కిందపడివుంది. వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ అతనిమీద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఇక్రామ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ ఫారూక్ మాట్లాడుతూ బాధితుని గొంతుకు ఇరువైపుల గల రక్తనాళాలు తెగిపోయాయి. వాటి నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అతనిని ఆపరేషన్ చేశాం. తెగిపోయిన రక్తనాళాలను తిరిగి జోడించాం ఇందుకోసం 26 కుట్లు వేయాల్సివచ్చింది. బాధితుని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే మక్రానా పోలీస్టస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్రామ్ వాంగ్మూలం తీసుకున్నారు. తరువాత అతని ఇంటిలో ఇక్రామ్ పడుకున్న గదిని పరిశీలించారు. ఇక్రామ్ పంజాబ్‌లోని అంబాలాలో మార్బల్ వ్యాపారం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లుధియానాలో రూ. 7 కోట్ల దోపిడీ -
ట్రిపుల్ ఐటీలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఇటీవలే కళాశాల భవనంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే బాయ్స్ హాస్టల్–2లోని ఓ గదిలో శనివారం రాత్రి నడుస్తున్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ ఊడిపడటంతో గదిలో పడుకున్న విద్యార్థి మెడ భాగంలో గాయాల య్యాయి. వెంటనే ఇతర విద్యార్థులు అధికా రులకు సమాచారం ఇవ్వడంతో వారు వర్సిటీ లోని ఆస్పత్రిలో విద్యార్థికి ప్రథమ చికిత్స చేయించారు. ఫ్యాన్ తలపై పడి ఉంటే ఘోరం జరిగేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
ఉస్మానియాలో కలకలం: డ్యూటీ డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఓపీలో డెర్మటాలజీ విభాగంలో.. విధులు నిర్వర్తిస్తున్నడాక్టర్ భువనశ్రీపై ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ క్రమంలో భువనశ్రీ తలకి తీవ్ర గాయమైంది. తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ -
ఉస్మానియాలో కలకలం: డ్యూటి డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
-
ఫ్యాన్ మీద పడింది.. బుడ్డోడు బచాయించాడు
ఒక్కోసారి మనం ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు పిచ్చి ఆలోచనలు రావడం సహజం. ఉదాహరణకు మనం ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు.. లేదా భోజనం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ మన మీద పడుతుందేమో భ్రమపడతాం. అది మీద పడితే ఇక అంతే సంగతులు అని ఊహించుకుంటాం. ఒక్కోసారి ఇలాంటి భ్రమలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. తాజాగా మనం చెప్పుకునే ఘటన అలాంటిదే. చదవండి: రోడ్డు లేని ఊరు.. దారేది బాబు..! ఇక విషయంలోకి వెళితే.. ఆ ఇంట్లో అంతా కలిసి ఆనందంగా భోజనం చేస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ హాయిగా భోజనం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న చిన్నపిల్లాడిపై ఒక్క ఉదుటన మీది నుంచి సీలింగ్ ఫ్యాన్ పడింది. దీంతో దెబ్బకు భయపడిపోయిన పిల్లాడి తల్లి తన బిడ్డను దగ్గరుకు తీసుకొని తలకు ఏమైనా అయిందా అన్నట్లుగా నిమిరింది. అయితే అదృష్టవశాత్తూ పిల్లాడి తల పక్క నుంచి ఫ్యాన్ పడడంతో పెద్ద గండం తప్పినట్లయింది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ''వైరల్ హోగ్'' యూట్యూబ్ చానెల్లో షేర్ చేశాడు. ఇంకేముంది షేర్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది.'' బుడ్డోడు బచాయించాడు.. అదృష్టం అంటే ఇదే..'' అంటూ క్యాప్షన్ జత చేశారు. మీరు ఈ వీడీయోను ఒక లుక్కేయండి. చదవండి: Viral Video: తాబేలు వేట ఫస్ట్ టైం.. పాక్కుంటూ పిల్ల పక్షిని మింగింది -
వైరల్: ‘కరోనా కాదు.. ఫ్యాన్ చంపేసేలా ఉంది’
భోపాల్: దేశంలో కోవిడ్ విజృంభణతో మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో.. దేశ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో మన ప్రభుత్వాలు ఎంత వెనకబడి ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆస్పత్రుల్లో బెడ్ల కొరత.. ఆక్సిజన్ నిల్వలు నిండుకున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే వీటికి భిన్నమైన దృశ్యం ఒకటి మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సీలింగ్ ప్యాన్ కరోనా కన్న ఎక్కువగా రోగులను భయపెడుతుంది. దయచేసి.. ఈ ఫ్యాన్‌ను మార్చండి అంటూ రోగులు అభ్యర్థిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ చింద్వారా ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న ఓ రోగి వీడియోలో తమ ఫ్లోర్లో సీలింగ్‌కు వేలాడుతున్న ఫ్యాన్‌ను చూస్తే తనకు చాలా భయం వేస్తుందని.. అది ఎప్పుడు ఊడిపోయి ఎవరి నెత్తిన పడుతుందో అర్థం కాక ఫ్లోర్లో ఉన్నవారందరు భయంతో వణికిపోతున్నారని తెలిపాడు. అది ఎప్పుడు ఊడి కింద పడుతుందో అర్థం కాక రాత్రిళ్లు సరిగా నిద్ర కూడా పోవడం లేదని వివరించాడు. ‘‘దీన్ని రిపేర్ చేయడం లేదా.. దాని స్థానంలో కొత్తదాన్ని పెట్టమని ఆస్పత్రి సిబ్బందిని కోరాము.. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వీడియో చూసి అయినా మా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు. ఈ వీడియో చూసిన వారు ‘‘నిజమే కోవిడ్ కన్నా ఎక్కువ ఈ ఫ్యానే భయపెడుతుంది’’... ‘‘కరోనా కన్నా ముందే ఈ ఫ్యానే వారిని చంపేసేలా ఉంది’’.. ‘‘అది ఊడి కిందపడిపోయేలోపు నీవు కోలుకుని డిశ్చార్జ్ కావాలని ఆశిస్తున్నాను’’ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. చదవండి: కరోనా: ‘బాలాజీని ప్రార్థించి, కొబ్బరికాయ కొట్టండి’ -
గాంధీ ఆస్పత్రిలో త్రుటిలో తప్పిన ప్రమాదం
గాంధీఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం త్రుటిలో తప్పింది. తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి బెడ్‌పై చికిత్స పొందుతున్న కరోనా రోగులపై పడింది. వివరాలు.. గాంధీఆస్పత్రి ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హుక్ నుంచి ఊడి అమాంతం కిందపడింది. ఈ ఘటనలో బెడ్‌పై చికిత్స పొందుతున్న ఇరువురు రోగులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పటికే మానసికంగా కుంగిపోయామని, ఈ హఠాత్పరిణామంతో మరింత భయాందోళనకు గురయ్యామని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి పాలన యంత్రాంగం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావును వివరణ కోరగా.. ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. -
ఈ ఫ్యాన్‌కు ఉరేసుకోలేరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవాలనే విద్యార్థుల ప్రయత్నాలను అడ్డుకోవడంపై చెన్నై ఐఐటీ దృష్టి సారించింది. ఉరేసుకునేందుకు వీలు లేకుండా సీలింగ్ ఫ్యాన్‌లో ప్రత్యేక స్ప్రింగ్ అమర్చేందుకు పరిశో«ధనలు జరుగుతున్నాయి. ఐఐటీల్లో ప్రొఫెసర్ల వల్ల, జాతి, మత, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో కొందరు విద్యార్థులు మధ్యలోనే ఐఐటీని వదిలి వెళ్లిపోతుండగా, మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. చెన్నై ఐఐటీలో 2016 నుంచి ఈ ఏడాది వరకు ఒక మహిళా ప్రొఫెసర్ సహా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనలపై మానవవనరులశాఖ చెన్నై ఐఐటీని మందలించింది. దీంతో ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆత్మహత్యల్లో ఎక్కువశాతం మంది సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఫ్యాన్‌లో స్ప్రింగ్ లాంటి పరికరాన్ని అమర్చేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. ఎవరైనా ఊగినా, అదనపు బరువుతో వత్తిడి కలగజేసినా ఆ స్ప్రింగ్ సాగిపోయి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఉరివేసుకున్న వారు సీలింగ్ ఫ్యాన్‌తో సహా కిందకు పడిపోతారు. -
ఉస్మానియా..యమ డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఇన్‌పేషంట్లు చికిత్స పొందే పాతభవనంలోని పలు వార్డులు ఇప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడిపడుతుండగా, తాజాగా గురువారం తెల్లవారుజామున ఓపీ భవనంలోని జనరల్ సర్జరీ విభాగం ఇన్‌పేషంట్ వార్డులో సీలింగ్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు రోగులకు స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో పైన ఉన్న సీలింగ్ ఒక్కసారిగా కూలి కిందపడటంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారికి సహాయంగా ఉన్న బంధువులు, చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రోగులను వెంటనే మరో వార్డుకు తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
విద్యార్థి తలపై ఊడిపడ్డ సీలింగ్ ఫ్యాన్..!
న్యూఢిల్లీ : సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పే ప్రభుత్వాలు.. ముందుగా మెరుగైన సౌకర్యాలు, నిరంతర పర్యవేక్షణపై దృష్టి పెట్టడం మంచిది. తరగతి గదిలో క్లాస్ నడుస్తుండగా.. ఓ విద్యార్థి తలపై అకస్మాత్తుగా ఫ్యాన్ ఊడిపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. త్రిలోక్‌పురిలోని సర్వోదయ బాలవిద్యాలయలో హర్ష్ (13) ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం టీచర్ ఫయాజ్ అహ్మద్ పాఠాలు చెప్తుండగా.. ఒక్కసారిగా సీలింగ్ ప్యాన్ ఊడి అతని తలపై పడింది. దీంతో తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహుటిన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. హర్ష్ స్పృహలోకి వచ్చాడని, అపాయమేమీ లేదని అతని మామ వెల్లడించారు. పాఠశాల నిర్లక్ష్య వైఖరిపై ఆయన మండిపడ్డారు. ‘హర్ష్‌కి ప్రమాదం జరిగిందని తెలియగానే.. స్కూల్ వద్దకు పరుగెత్తుకెళ్లాను. అతన్ని ఆస్పత్రికి తరలించాక.. స్కూల్లో పరిస్థితులు చూద్దామని అక్కడికి వెళ్లాను. కానీ, సిబ్బంది నన్ను లోనికి రానీయలేదు. పిల్లాన్ని మేమే ఆస్పత్రికి తరలించాం. ఇంతవరకు స్కూల్ నుంచి ఏ టీచరూ వచ్చి చూడలేదు. చాలీచాలని జీతంగా బతుకులు వెళ్లదీసే మాకు.. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మాకు భారమే’అని వాపోయారు. ఫ్యాన్ అంతవరకూ బాగానే పనిచేసిందని, ఎలాంటి శబ్దం రాలేదని క్లాస్ టీచర్ ఫయాజ్ చెప్పారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పిల్లాడి తలపై పడడంతో షాక్‌కు గురయ్యామని అన్నారు. ఇక ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ మనోజ్‌తివారి మాట్లాడుతూ... పాఠశాల భవనాల నిర్మాణంలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ భారీ కుంభకోణానికి పాల్పడిందని.. అందుకనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
స్మార్ట్ సీలింగ్ ఫాన్స్.. స్పెషల్ ఏంటి?
సాక్షి, చెన్నై: దక్షిణ కొరియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఎల్జీ సీలింగ్ ఫ్యాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. భారత్ మార్కెట్లో స్మార్ట్‌ఫీచర్లతో ప్రీమియం సీలింగ్ ఫ్యాన్లను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి చెన్నైలో లాంచ్ చేసింది. వీటిని త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సీలింగ్ ఫ్యాన్ ధరను రూ. 13,990గా నిర్ణయించింది. దేశంలో గృహోపకరణాలు, ఎయిర్ సొల్యూషన్స్ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారత మార్కెట్లో సీలింగ్ ఫ్యాన్ విభాగంలోకి ఎంట్రీ ఎచ్చింది ఎల్జీ. అత్యాధునిక ఫీచర్లను జోడించి ప్రీమియం ధరల్లో 5 రకాల సీలింగ్ ఫ్యాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. వై-ఫై ఆధారితంగా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో లాంచ్ చేశామని ఎల్జీ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ టక్నాలజీకి అనుసంధించామనీ, ఐఓటి ప్లాట్‌ఫామ్ ద్వారా తీసుకొచ్చిన ఎల్జి స్మార్ట్థింక్యూ మొబైల్‌తో పాటు ఇతర మొబైల్ ఫోన్ల ద్వారా రిమోట్‌గా నియంత్రించుకోవచ్చని పేర్కొంది. ప్రత్యేకతలు వై ఫై ఆధారితం అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ అనుసంధానం వాతావరణానికి అనుకూలంగా స్పీడ్ కంట్రోల్ , తక్కువ శబ్దం, రిమూవబుల్ పార్ట్స్, రిమోట్ సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం -
క్లాస్‌రూమ్‌లో విద్యార్థిపైన పడిన సీలింగ్ ఫ్యాన్
-
లాలూకు తప్పిన ముప్పు
-
లాలూకు తప్పిన ముప్పు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ప్రమాదం నుండి బయటపడ్డారు. శుక్రవారం ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. అయితే ఆ ఫ్యాన్ లాలూకి కొంచం పక్కగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్న ఓ ప్రచార సభలో వేదిక కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలలో లాలూ క్షేమంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఫ్యాన్ ప్రభంజనం
రెండు లోక్‌సభ స్థానాల్లోనూ స్పష్టమైన ఆధిక్యత అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీకే జగన్‌కు పట్టం కట్టిన పల్లె, పట్టణ ఓటర్లు గెలుపు ధీమాలో ఆ పార్టీ శ్రేణులు సాక్షి, విజయవాడ : జిల్లాలో బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ‘ఫ్యాన్’ ప్రభంజనం సాగింది. ప్రజల అంచనాలకు అనుగుణంగా, ప్రతిపక్ష పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ, సమస్యలపై రాజీలేని పోరాటం చేసే నేతలను ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు చేసిన మేలును, వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంపై ప్రజల్లో విశ్వాసం, పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపిన అంశాలుగా ఉన్నాయి. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు, అత్యధిక అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. గవర్నర్‌కు నివేదిక ఇచ్చే ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు కూడా జిల్లాలో ఫ్యాన్ గాలి బాగా వీచిందని నివేదించినట్లు సమాచారం. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలుపుపై భరోసాతో ఉన్నారు. బారులు తీరిన ఓటర్లు... గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు ఉదయం నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ముఖ్యంగా జిల్లాలో ఈ పర్యాయం కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. నూతన ఓటర్లు సుమారు 80 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అంచనా. విజయవాడ నగరం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సగటున 75 శాతం పైనే పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా నూజివీడులో అత్యధికంగా 87 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఆ తర్వాత మైలవరం, అవనిగడ్డ, పెడన, నూజివీడు, గన్నవరం, తిరువూరు, గుడివాడ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటలో 80 శాతం పైగా పోలింగ్ నమోదైంది. పామర్రు, పెనమలూరులో మాత్రమే 75 శాతం పోలింగ్ జరిగింది. విజయవాడ తూర్పులో 65.40 శాతం, పశ్చిమలో 67 శాతం, సెంట్రల్ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యల్పంగా 65.33 శాతం పోలింగ్ నమోదైంది. అధినేతల విస్తృత ప్రచారం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ పార్టీ అధినేతలు జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇది పార్టీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో కలిసొచ్చింది. వాస్తవానికి జిల్లాలో మూడు రోజులు మాత్రమే ఎన్నికల పర్యటన నిర్వహించేలా జగన్ షెడ్యూల్ ఖరారు అయింది. అయితే ఆ తర్వాత మూడు రోజుల షెడ్యూలు కాస్తా ఆరురోజులకు పెరిగింది. జిల్లాలోని గన్నవరం, అవనిగడ్డ, పెడన, కైకలూరు, పామర్రు, పెనమలూరు, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్ జనభేరి నిర్వహించారు. అంతకుముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అధినేతల ప్రచారం పార్టీ అభ్యర్థులకు వరంలా మారింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకు పల్లె ఓటర్లు ఓటేసేందుకు వెల్లువెత్తారు. వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ప్రజల వెన్నంటే నేతలు... నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజలు పట్టంకట్టినట్లు సమాచారం. ముఖ్యంగా గత మూడున్నరేళ్లుగా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలతోనే పార్టీ నేతలు పయనం సాగించారు. దీంతో పాటు దివంగత మహానేత జిల్లాకు చేసిన మేలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు వెరసి అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించే అంశాలుగా మారాయి. దీంతో విజయవాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జిల్లాలో పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగటం మరో కలిసొచ్చే అంశం. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాలు పోలింగ్ సరళిపై దృష్టి సారించాయి. జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కుతాయని, ప్రతిపక్ష టీడీపీ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని నివేదిక పంపినట్లు సమాచారం. మొత్తంమీద ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగేవరకు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడాల్సిందే. -
జననేతకు బ్రహ్మరథం
జిల్లాలో ఆరు రోజులు 10 నియోజకవర్గాల్లో పర్యటన ప్రతిచోటా వెల్లువెత్తిన అభిమానం జనం కష్టాలు విని... కన్నీళ్లు తుడిచిన జగన్ రాజన్య రాజ్యంతో బాధలుండవని భరోసా పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : మండటెండల్ని సైతం లెక్కచేయలేదు. చిమ్మచీకటికి వెనకాడలేదు. రాజన్న బిడ్డను చూసేందుకు, తమ కష్టాలు చెప్పుకొనేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలుస్తామని చాటిచెప్పారు. గత నెల 29న జిల్లాలోని గన్నవరంలో ప్రారంభమైన జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జనభేరి ప్రచార యాత్ర ఆదివారం రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో ముగిసింది. ఆరు రోజులపాటు జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన జననేత పది నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, బంటుమిల్లి, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు జనం పోటెత్తారు. ఈ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలలో జగన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. వారి కష్టాలు విన్నారు. బాధలు తెలుసుకున్నారు. నేనున్నా.. భయపడొద్దంటూ భరోసా ఇచ్చారు. కష్టాలు.. కన్నీళ్లు... ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జీవితాలు దుర్భరంగా మారాయని పలు నియోజకవర్గాల్లో జనం ఏకరువు పెట్టారు. కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నామని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక తమ పిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ అందడం లేదని, పింఛన్లు సక్రమంగా రావడం లేదని, మద్యం మహమ్మారి కుటుంబాలను కూల్చేస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. సొంతిల్లు కలగా మారిందని, డ్వాక్రా రుణాలు రావడం లేదని మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. గత పాలకులు వ్యవసాయాన్ని దండగలా మార్చేశారని రైతన్నలు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దక్కడం లేదని యువత ఆవేదన వెలిబుచ్చింది. నేనున్నానని... జనం కష్టాలు విన్న జననేత మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. కొద్దిరోజుల్లో రాజన్య రాజ్యం వస్తోందని, అప్పుడు మీ బాధలు తీరతాయని ఓదార్చారు. ధరల స్థిరీకరణ నిధి, ప్రత్యేక విపత్తు నిధులతో వ్యవసాయాన్ని పండగ చేస్తానని చెప్పారు. రూ.100కే 150 యూనిట్ల కరెంట్ వస్తోందని, ఆరోగ్య సిరులు కురిపిస్తానని, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చెల్లెమ్మలకు, అక్కయ్యలకు కొత్త రుణాలు అందిస్తానన్నారు. అమ్మ ఒడితో పిల్లలందరినీ ఒడికి పంపిస్తానని, బాగా చదివించి డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.200 చొప్పున ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.700కు పెంచుతానని స్పష్టం చేశారు. ఆ మొత్తం ఠంచనుగా అందే ఏర్పాటు చేస్తానన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మద్యం బెల్ట్‌షాపుల్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతానురాగాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు. ప్రత్యర్థులకు హడల్... జిల్లాలో జననేత సుడిగాలి పర్యటన టీడీపీ నాయకుల్ని హడలెత్తించింది. జగన్ సభలకు జనం వెల్లువెత్తడంతో ఇక తమ పని ఖాళీ అవుతుందనే భయం వారిని వెంటాడుతోంది. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలకు మొక్కుబడిగా జనం రావడం, గత నెల విజయవాడలో నిర్వహించిన టీడీపీ మహిళా గర్జన అట్టర్‌ఫ్లాప్ కావడం వంటివాటిపై వారు మధనపడుతున్నారు. జన సునామీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగన్మోహన్రెడ్డి సభల్ని చూసి టీడీపీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. -
జన తరంగం
విజయమ్మ రోడ్‌షోలకు అద్భుత జన స్పందన ప్రసంగాలపై వెల్లువెత్తిన ప్రజా ప్రశంసలు వివిధ వర్గాలతో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి భేటి సింహాద్రి అప్పన్న దీవెనలతో మొదలై భీమిలి సాగరహోరు సాక్షిగా, చినవాల్తేరులో జనవాహిని కదలిరాగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ ఆదివారం ఎన్నికల ప్రచార యాత్ర అనూహ్యరీతిలో అద్భుతంగా సాగింది. మండువేసవిలో చల్లదనాన్ని అందిస్తున్నట్లు ఫ్యానుగాలి నగరాన్ని మలయమారుతంలా తాకింది. విజయమ్మ సింహాచలం, భీమిలి, విశాఖ నగర పరిధిలోని చినవాల్తేరు,రాంనగర్, హెచ్‌బీ కాలనీ సభల్లో చేసిన ప్రసంగాలకు అద్భుత స్పందన లభించింది. రోడ్‌షోలలో అడుగడుగునా జనం ఆమెకు నీరాజనాలు పట్టారు. వివిధ వర్గాల ప్రముఖులతో ఆమె సమావేశమై చేసిన ఆలోచనాత్మక, ఆచరణాత్మక సూచనలు అందరి కితాబులందుకున్నాయి. సాక్షి, విశాఖపట్నం : ‘‘మీకు నేను తోడుంటా. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా. ఎంపీగా గెలిచాక మీ కష్టసుఖాలు నాతో పంచుకోండి. మహానేత వైఎస్‌కు విశాఖ అంటే ప్రాణం. ఇక్కడ సహజసిద్ధ ప్రకృతి అందాలు ఆయనకు బాగా ఇష్టం. ఎప్పుడూ నాతో అనేవారు. విశాఖపట్నం బాగుంటుందని..అక్కడి ప్రజలు చాలా మంచి వాళ్లని. మీ అందరినీ చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది’’ విజయమ్మ భావోద్వేగంతో చెప్పిన మాటలివి.. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మ సింహాచలం, భీమిలి, చినవాల్తేరు, రాంనగర్ రోడ్డు, హెచ్‌బీ కాలనీల్లో రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. విజయమ్మను చూసేందుకు జనం పరుగులు తీశారు. ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. ఆమె చెప్పిన ప్రతిమాటను ఆసక్తిగా విన్నారు. విశాఖ నగరంలోకి కాన్వాయ్ రాగానే పూలతో ఆమెకు స్వాగతం పలికారు. వీరందరిని చూసి విజయమ్మ పులకరిం చారు. జగన్ అధికారంలోకి రాగానే అయిదు సంతకాలతో ప్రతి ఒక్కరి సమస్య లు పరిష్కరిస్తారని చెప్పడంతో చప్పట్లు చరిచారు. జై జగన్..జై జగన్ అంటూ యువత నినదించింది. ఎంపీగా పోటీ చేస్తున్న తనను ఆదరించండంటూ పిలుపునిచ్చారు. విశాఖను అంతర్జాతీయస్థాయి నగరంగా మార్చుకుందామన్నారు. విశాఖలో చాలామంది యువతకు ఉద్యోగావకాశాలు లభించడం లేదని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమల విస్తరణ చేపట్టి స్థానికులకు ఎక్కువ అవకాశం కల్పిస్తారని చెప్పారు. మరోపక్క ఉదయం, మధ్యాహ్నం విజయమ్మ ఐటీ నిపుణులు, రైతు సంఘాల నేతలు, మత్స్యకార వర్గాలు,వైశ్యులతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలు విన్నారు. -
జజ్జనకరి జనాలే..
జగన్ జనభేరి హుషారే తిరువురులో తిరుగులేని సత్తా మైలవరంలో ప్రత్యర్థులకు కలవరం జనంతో పోటెత్తిన రెండు సభలు 46 కిలోమీటర్లకు పైగా సాగిన రోడ్‌షో దారిపొడవునా ఆప్యాయపు పలకరింపులే సాక్షి ప్రతినిధి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నిర్వహించిన తిరువూరు, మైలవరం బహిరంగ సభలు నేల ఈనిందా అన్నట్టు జనంతో పోటెత్తాయి. జననేత జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఊళ్లన్నీ సభాప్రాంతానికి దారులు తీశాయి. రాజన్నకు అచ్చమైన వారసుడు జగనన్నను చూసేందుకు తరలివచ్చిన జనం తిరువురులో తిరుగులేని సత్తా చాటి.. మైలవరంలో ప్రత్యర్థుల గుండెల్లో కలవరం రేపి.. వైఎస్సార్ జనభేరిని హుషారెత్తించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 46 కిలోమీటర్లు పైగా జననేత జగన్ మండే ఎండలోనే రోడ్ షో నిర్వహించారు. తిరువూరులో కొత్త చరిత్ర... తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్మోహన్రెడ్డి సభ జరిగింది. వేలాది మంది ప్రజలు తరలిరావడంతో తిరువూరు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మండే ఎండలోనూ తరలివచ్చిన జనం జగన్మోహన్రెడ్డి ఉపన్యాసంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సభ సీమాంధ్ర కమిటీ ప్రతినిధులు జగన్మోహన్రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. జగన్‌కు తాము అండగా ఉంటామంటూ సభలో ఆయనకు గొర్రెపిల్లను బహూకరించారు. యాదవ మహాసభ ప్రతినిధులు లాకా వెంగళరావు యాదవ్, గంపాల నాగేశ్వరరావు, గొరిపర్తి రామకృష్ణలు జననేతను కలిసినవారిలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధికి ఓటేసి గెలిపించాలని జగన్మోహన్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 46 కిలోమీటర్ల రోడ్‌షో.. దారిపొడవునా జనం బారులు ఒకటి రెండు కాదు ఏకంగా 46 కిలోమీటర్ల మేర జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో దారిపొడవునా జనం బారులు తీరారు. తమ అభిమాన నాయకుడు వస్తాడని గంటల తరబడి నిరీక్షించారు. తీరా ఆయనే తమ వద్దకు వచ్చేసరికి ఆనందంతో ఘనస్వాగతాలు పలికారు. అక్క, చెల్లి, అవ్వ, తాత, అన్న, తమ్ముడు.. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. బాగున్నారా అని క్షేమ సమాచారం తెలుసుకుంటూ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగారు. రోడ్‌షోలో లక్ష్మీపురం, కాకర్ల, పోలిశెట్టిపాలెం, గోపాలపురం, కంభంపాడు, ఏ కొండూరు, కృష్ణారావుపాలెం, చీమలపాడు, రామచంద్రపురం గ్రామాల్లో ప్రజల నుంచి జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా తన కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. మైలవరంలో జన జాతర.. మైలవరంలో నిర్వహించిన జగన్మోహన్రెడ్డి సభ జన జాతరను తలపించింది. ప్రత్యర్థులను సైతం కలవరపెట్టే స్థాయిలో మైలవరం సభ విజయవంతమైంది. ఈ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఉపన్యాసం ప్రజలను ఆకట్టుకుంది. ఐదు సంతకాలతో పదకొండు పనులు చేసి రాష్ట్ర దశ దిశ మార్చేస్తానంటూ ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బీజేపీ నేతల అవకాశవాద ధోరణులు, చంద్రబాబు మోసపూరిత హామీలను జగన్మోహన్రెడ్డి తూర్పారబట్టారు. ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్‌లను గెలిపించాలని జగన్ కోరారు. మైలవరం ప్రచార కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కాజా రాజ్‌కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ జోగి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నేతల మద్దతు... గురువారం రాత్రి తిరువూరు చేరుకున్న జగన్మోహన్రెడ్డిని నియోజకవర్గానికి చెందిన ఆర్యవైశ్య ప్రతినిధులు కలిసి మద్దతు పలికారు. శుక్రవారం ఉదయం జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. తిరువూరులోని జామియా మసీదు ఇమామ్ మౌల్వి రజ్వి వచ్చి జననేతను కలిసి ఆయనకు కండువా కప్పి సీఎం కావాలని దీవించారు. ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు. రాజన్న సంక్షేమ రాజ్యం తెచ్చేందుకు జగనన్న సీఎం కావాలని మహిళలు ఆకాంక్షించారు. సమైక్యాంధ్ర సంరక్షణ సమితి నేతలు నరహరశెట్టి శ్రీహరి, కొణిజేటి రమేష్‌లు జగన్మోహన్రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన చాంపియన్‌గా జగన్‌కు నైతిక మద్దతిచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి సీమాంధ్రలోని అన్ని సమైక్యాంధ్ర పోరాట జేఏసీలు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్వరరావు వచ్చి జగన్మోహన్రెడ్డిని కలిసి వైఎస్సార్సీపీ గెలుపుకోసం పాటుపడతానని ప్రకటించారు. సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పైలా సోమినాయుడు, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాతపాటి సర్రాజు జగన్మోహన్రెడ్డిని వేర్వేరుగా కలిశారు. నేడు జగ్గయ్యపేటలో జనభేరి సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం జిల్లాలోని జగ్గయ్యపేటలో జనభేరి యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సభ, రోడ్‌షో జరుగుతాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. అనంతరం జగన్మోహన్రెడ్డి నేరుగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు పయనమవుతారని వారు వివరించారు. -
పిలుపే ప్రభం‘జనం’
మండే ఎండలోనూ జగన్ జనభేరి జిల్లా పరిస్థితిని ప్రస్తావించిన జననేత బాబు పాలనలో నిర్లక్ష్యం.. వైఎస్ పాలనతో వైభవం రెండో పంటకు నీరిచ్చిన రైతు బాంధవుడు వైఎస్ చేనేత.. మత్స్యకారులను ఆదుకుంటానని హామీ తీరంలో సమస్యలు పరిస్కారిస్తానని భరోసా 25 ఎంపీలు గెలిపించుకుంటే కొల్లేరు కుదింపు సాధించుకోవచ్చని పిలుపు ప్రజల చల్లని దీవెనల ముందు మండే భానుడు చిన్నబోయాడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం గంటల సమయాన్ని సైతం నిమిషాలు, క్షణాలుగా గడిపేసిన జనం తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉక్కపోతను సైతం లెక్కచేయక అభిమాన నేత కోసం ఎదురుచూసి జననేత చూపిన అభిమాన జడిలో తడిసి ముద్దయ్యారు. జనభేరి సభల్లో జగన్ జిల్లా వాసుల ఇబ్బందులను సమస్యలపై స్పష్టమైన హామీలిచ్చారు. పేదోడి క్షేమం కోరే తమ ప్రభుత్వంవస్తుందని, మళ్లీ వైఎస్ సంక్షేమ రాజ్యం తేస్తానని భరోసా ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో వైఎస్సార్ జనభేరి మూడోరోజైన గురువారం పెడన నియోజకవర్గం బంటుమిల్లి నుంచి ప్రారంభమైంది. సింగరాయపాలెం మీదుగా కైకలూరు వరకు సాగింది. బంటుమిల్లి, కైకలూరులో జరిగిన సభల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్‌షోలో భాగంగా దారిపొడవునా ఆయన వృద్ధులను, యువకులను, మహిళలను పలుకరిస్తూ ముందుకు సాగారు. జగన్మోహన్రెడ్డి వెంట మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థులు కొలుసు పార్థసారథి, తోట చంద్రశేఖర్, పెడన, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థులు బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రామ్‌ప్రసాద్, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఉన్నారు. రెండో పంటకు నీరిచ్చిన వైఎస్... జనభేరి సభల్లో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కనీసం ఒక పంటకు కూడా సరిగా నీరివ్వకపోవడంతో అన్నదాతలు వలస కూలీలుగా మారిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. పూలమ్మినచోటే కట్టెలు అమ్మలేక పొరుగు ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన అన్నదాతల అవస్థలు వైఎస్ గుర్తించారని చెప్పారు. అందుకే జిల్లాలో రైతుల కష్టాలను తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్ రెండో పంటకు కూడా సకాలంలో నీరిచ్చారన్నారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సమస్య రాకుండా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ ఎంతో కృషిచేశారని తెలిపారు. తీర ప్రాంత రైతుల సాగునీటి సమస్య తనకు తెలుసునని, రానున్న కాలంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కనుగొనే దిశగా కృషిచేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో చేనేత, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారని,వారి భవిత బాగుండేలా తన హయాంలో ప్రత్యేకంగా కృషి చేస్తానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తీరం సమస్యలు.. కొల్లేరు వాసుల వెతలు తీరుస్తా... తీర ప్రాతంలోని పలు సమస్యలను పెడన ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ జననేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తేవడంతో ఆయన వాటిపై స్పందించారు. జిల్లాలో ఉన్న సువిశాల తీర ప్రాంతంలో ప్రజలు పడుతున్న సాగు, తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కైకలూరులో కొల్లేరు సమస్యను ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రామ్‌ప్రసాద్‌లు జగన్మోహన్రెడ్డి దృష్టికి తెచ్చారు. కొల్లేరు వాసుల కష్టాలను తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్ కాంటూరును ఐదు నుంచి మూడుకు కుదిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 మంది ఎంపీలనూ గెలిపించుకుందామని, కేంద్రంలో మనమే కీలకంగా ఉందామని జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 25 మంది ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కొల్లేరు కాంటూరు కుదింపు బిల్లును కేంద్రానికి పంపి కచ్చితంగా సాధించుకుందామని ఆయన తెలిపారు. డీఎన్నార్‌కు మొదటి ఎమ్మెల్సీ... కైకలూరులో కొన్ని కారణాలతో దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోయామని, ఇక్కడ ఉప్పాల రామ్‌ప్రసాద్‌ను గెలిపించుకోవడం ద్వారా డీఎన్నార్‌కు సముచిత స్థానం ఇస్తామని జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తాము అధికారం చేపట్టిన వెంటనే జిల్లా నుంచే మొదటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి డీఎన్నార్‌ను శాసనమండలిలో కూర్చోబెడతానని ఆయన హామీ ఇచ్చారు. ఉదయం 12 గంటలకే జననేత వస్తారని ప్రకటించడంతో కైకలూరు సెంటర్‌కు తరలివచ్చిన వేలాది మంది మండే ఎండలోనూ వేచిచూశారు. జగన్మోహన్రెడ్డి రాత్రి 7 గంటలకు కైకలూరు సెంటర్‌కు చేరుకునే వరకు ఏడు గంటలపాటు వేలాది మంది ప్రజలు ఆయనపై అభిమానంతో ఎదురుచూడటం విశేషం. జగన్మోహన్రెడ్డికి మద్దతు... రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలికారు. టీడీపీ మైనార్టీ సెల్ మచిలీపట్నం నాయకులు షకీర్ అహ్మద్, ఎస్కే మునీరు, మహ్మద్ అక్బర్లు వైఎస్సార్సీపీలో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ పంచికర్ల శివశంకరరావు, మాజీ సర్పంచ్ శ్యాంసన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అంగర రామ్మోహన్రావు, మల్లేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.నారాయణరెడ్డి, పెనమలూరు సమన్వయకర్త పడమట సురేష్‌బాబు, బంటుమిల్లి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఊరా రాంపండు, సబ్బిశెట్టి హరనాథబాబు, సబ్బిశెట్టి విఠల్, సీహెచ్ గాంధీలు కలిసి మద్దతు తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. -
నేటి జనభేరి రూట్‌మ్యాప్ ఇదీ..
బంటుమిల్లి నుంచి ప్రారంభం పెడన, కైకలూరు, విజయవాడ సెంట్రల్లో రోడ్‌షోలు, సభలు సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడోరోజైన గురువారం జనభేరి యాత్ర కొనసాగించనున్నారు. పెడన, కైకలూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. బుధవారం రాత్రికి యాత్ర ముగించుకొని బంటుమిల్లి వెళ్లి రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లిలో జనభేరి యాత్ర ప్రారంభించి రోడ్‌షోగా ప్రధాన సెంటర్‌కు చేరుకుని ప్రసంగిస్తారు. అక్కడ నుంచి జానకిరామయ్యపురం, జయపురం, పెద్దతుమ్మిడి, మలపరాజుగూడెం, కొత్తపల్లి అడ్డరోడ్డు, సింగరాయపాలెం, శ్రీహరిపురం, ముదినేపల్లి, కానుకొల్లు, లింగాల, చెరికెగూడెం, మండవల్లి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం కైకలూరు చేరుకొని అక్కడ రోడ్‌షో నిర్వహించి సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి విజయవాడ నగరానికి చేరుకొని సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్‌షో, సభ నిర్వహిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్లు ఒక సంయుక్త ప్రకటనలో వివరించారు. -
జన ఉప్పెన
ఆరు నెలల్లో పోర్టు పనులు జనభేరి సభలో జగన్ హామీ దివిసీమ నుంచి ఉయ్యూరు వరకు జనభేరి అడుగడుగునా విశేషాదరణ అందరినీ పలకరిస్తూ సాగిన జగన్ ఎన్నికల ప్రచారం సీఎం అయిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు చేపడతామని హామీ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జననేత వైఎస్ సువర్ణయుగాన్ని తెచ్చేలా ఐదు సంతకాలు, ఆరు పనులు చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరులో పోటెత్తిన జనం అవును.. అది నిజంగా ఉప్పెనే.. జన ఉప్పెన.. మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సముద్ర ఉప్పెన ప్రజలను కలవరపెడితే.. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి కోసం వచ్చిన జన ఉప్పెన ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో గుబులు పుట్టించింది. మండుటెండను సైతం లెక్కచేయక అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి సెంటర్లో పోటెత్తిన ఈ ఉప్పెన పామర్రును తాకుతూ పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు వరకు సాగింది. దాదాపు మూడు నియోజకవర్గాల్లో 18 ప్రాంతాలను తాకుతూ 41 కిలోమీటర్ల మేర ఎన్నికల జనభేరి మోగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం అపూర్వ స్వాగతం పలికారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల జనభేరి రెండోరోజైన బుధవారం కూడా అపూర్వ జనాదరణ మధ్య సాగింది. దారిపొడవునా ఆయన కారుకు అడ్డుపడిన వృద్ధులు, మహిళలు, యువకులు జననేతకు కరచాలనం, పలకరింపు కోసం పోటీపడ్డారు. చల్లపల్లిలోని సన్‌ఫ్లవర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ‘కాబోయే సీఎంకు బెస్ట్ ఆఫ్ లక్, వైఎస్ సువర్ణయుగం-జగనన్నకే సాధ్యం’ అనే ప్లకార్డులతో జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. జనభేరి యాత్ర ప్రారంభానికి ముందు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్మోహన్రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం ఇక్కడికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు సభల్లో ప్రసంగించిన జగన్మోహన్రెడ్డి దాదాపు 41 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించి తన కోసం ఎదురుచూసిన జనాన్ని ఆప్యాయంగా పలకరించారు. అన్నా మీకే ఓటేస్తామంటూ మహిళలు, యువత ఆయనకు భరోసా ఇచ్చారు. ‘మీ అయ్య చేసిన మంచి పనులు కొనసాగించేందుకు నీకే ఓటేస్తాం బాబా’ అంటూ వృద్ధులు నిండు మనస్సుతో దీవించారు. దారి పొడవునా పూల జల్లులతో స్వాగతం పలికిన జనం హారతులు పట్టి.. చేతిలో చేయేసి గెలుపు నీదేనంటూ భరోసా ఇవ్వడం విశేషం. ఆకట్టుకున్న ప్రసంగం.. మూడు నియోజకవర్గాల్లో జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆల్ ఫ్రీ బాబుగా గుర్తింపు పొందిన చంద్రబాబు మరోమారు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన మీ ముందుకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఐదు సంతకాలతో ఆరు పనులు చేసి మొత్తం పదకొండు పనులు చేస్తానని చెప్పారు. జననేత వెంట పార్టీ బందరు లోక్‌సభ అభ్యర్థి కేపీ సారథి, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, బందరు, పెడన నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సింహాద్రి రమేష్, ఉప్పులేటి కల్పన, కేవీఆర్ విద్యాసాగర్, పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలల్లో పోర్టు పనులు.. తాను ముఖ్యమంతి అయిన ఆరునెలల్లో ఈ ప్రాంతానికి అతి కీలకమైన బందరు పోర్టు పనులు ప్రారంభిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బందరు ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని అన్న తనను ఒక కోరిక కోరాడని, అన్నా మీరు బందరు పోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వాలని అడిగాడని చల్లపల్లి సభలో జగన్మోహన్రెడ్డి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజల ప్రగతి కోసం కచ్చితంగా తాను బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టి తీరుతానని జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. బందరు పోర్టు నిర్మాణంతో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బందరు పోర్టును రాజకీయ కోణంలో కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చూడాలన్నారు. అందుకే నాని అన్న కోరిక మేరకు తాను బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టి చూపిస్తానని జగన్మోహన్రెడ్డి అన్నారు. -
‘దేశం’ కోటలకు బీటలు
‘ఫ్యాన్’గాలికి ‘సైకిల్’ కకావికలం ముదురుతున్న వర్గవిభేదాలు తన్నుకుంటున్న తమ్ముళ్లు! ‘కోనేరు’ మెజారిటీపై టీడీపీ నాయకుల పందేలు! బాబుకు నివేదిక ఇచ్చిన నేతలు జిల్లాలో టీడీపీ కోటలకు బీటలు వారుతున్నాయి. ఆ పార్టీలో నెలకొన్న వర్గవిభేదాల కారణంగా ‘సైకిల్’ కదల్లేకపోతోంది. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. ఇదే విషయం తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు నిర్వహించిన సర్వేల్లోనూ తేలింది. సాక్షి, విజయవాడ : టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారని, రెండు ఎంపీ సీట్లను కోల్పోవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేతలు నిర్వహించిన సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానాల్లోనూ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలు సైతం ‘ఫ్యాన్’ గాలిలో ఎదురీత తప్పట్లేదని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆ నివేదికను జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు తనను సానుభూతి గట్టెక్కిస్తుందని పెద్దగా ప్రచారం చేయడం లేదని ఆ నేతలు గుర్తించారు. వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ గెలుస్తారని, ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే విషయంపై టీడీపీ నేతలే జోరుగా పందేలు కడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీటు కోసం జరిగిన రగడ, ఆ తర్వాత పరిణామాలతో కేశినేని నానికి సొంత పార్టీలోని నేతలే సహకరించడం లేదని స్పష్టంచేశారు. - పెనమలూరులో తన్నులాట పెనమలూరులో వర్గపోరు రోడ్డున పడింది. ద్వితీయశ్రేణి నాయకులు అభ్యర్థుల ముందే తన్నుకుంటున్నారు. బోడే ప్రసాద్‌కు సీటు దక్కడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్ తనకు ఇంకెక్కడైనా బాధ్యతలు ఇప్పించాలని చంద్రబాబును కోరారు. హిందూపురంలో పోటీ చేస్తున్న బాలకృష్ణకు సహకరించేందుకు ఆయన వెళ్లిపోయూరు. చలసాని పండు వర్గం కూడా సహాయ నిరాకరణ చేస్తోంది. మరోవైపు ఆదివారం రాత్రి తెలుగు తమ్ముళ్లు కాటూరులో ‘నువ్వెంత.. అంటే నువ్వెంత..’ అంటూ ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ ఎదుటే తన్నుకున్నారు. దీంతో ఒక వర్గం పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. - మైలవరంలో ఎదురీత మైలవరం నియోజకవర్గంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరావు పూర్తి వెనకంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ నుంచి రెండోసారి బరిలోకి దిగిన ఆయనకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు చంద్రబాబుకు నివేదికలు వెళ్లాయి. దీంతో ఉమ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరిపి గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పనులు చేపట్టటంలో విఫలమయ్యారనే అభిప్రాయంతో ఉన్న ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశాల్లో ప్రచారం కోసం ఆరాటపడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలారనే విమర్శలు వినపడుతున్నాయి. - ‘పేట’లోనూ అదే తంతు..! జగ్గయ్యపేట నియోజకవర్గంలో రెండోసారి బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా ఎదురీతలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన కనపడతోంది. సొంత వ్యాపారాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారం వైపు చూపకపోవడంతో ప్రజల్లో తాతయ్యపై వ్యతిరేకత పెరిగింది. - నందిగామలో వెన్నుపోటుకు సిద్ధం! నందిగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కూడా కష్టాల్లో పడినట్లు సమాచారం. అనారోగ్యం కారణం చూపించి తంగిరాలకు సీటు రాకుండా దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తారుు. పైకి కలిసి పనిచేస్తున్నా.. తంగిరాలకు వెన్నుపోటు పొడవడానికి ఉమా వర్గం సిద్ధమైంది. - గన్నవరంలో ఏకమైన వంశీ ప్రత్యర్థులు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వంశీని సొంత పార్టీ నేతలే ఓడించే పనిలో నిమగ్నమయ్యూరు. ఆయన వ్యతిరే కులంతా ఏకమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు వర్గం సహాయ నిరాకరణ చేయడమేకాకుండా ఓడించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తోంది. - అవనిగడ్డలో వర్గపోరు అవనిగడ్డ నియోజకవర్గంలో వర్గపోరు వల్ల టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ బాగా వెనకంజలో ఉన్నారు. బుద్ధప్రసాద్ చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. దీంతో పార్టీ శ్రేణులు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇక్కడ సీటు ఆశించిన కంఠమనేని రవిశంకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి చివరి నిమిషంలో తప్పుకున్నా అంటీముట్టనట్లు ఉండటమే కాకుండా మండలి ఓటమికి తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క కాంగ్రెస్ నేతలు మండలి వెంటరాకపోవడం.. మరోపక్క టీడీపీ నేతలు సహకరించకపోవడంతో మండలి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. - బందరులో కొరవడిన సమన్వయం మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తమను కలుపుకొని వెళ్లడం లేదంటూ సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుకు, కొల్లు రవీంద్రకు మధ్య సమన్వయం కొరవడింది. దీంతో ఇరువురు నేతల మధ్య ద్వితీయ శ్రేణి నాయకులు నలిగిపోతున్నారు. -
వైఎస్ఆర్ ఆశయ సాధనకు కదలిరండి
డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు భక్తవత్సలరెడ్డి ఓటర్లతో పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి మేనల్లుడు ముఖాముఖి 7న పోలింగ్ ప్రక్రియకు తరలిరావాలని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి బెంగళూరు, న్యూస్‌లైన్ : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనలో భాగంగా మే 7న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పోలింగ్ ప్రక్రియలో కచ్చితంగా పాల్గొని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రవాసాంధ్రులకు కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు బి.భక్తవత్సల రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు ఉద్యమించాలని అన్నారు. స్థానిక ఎలక్ట్రానిక్ సిటీలోని దొడ్డతోగూరులో ఆదివారం నిర్వహించిన ప్రవాసాంధ్ర ఓటర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ సీపీకి దక్కుతున్న ప్రజాదరణ చూసి నటుడు బాలకృష్ణకు పిచ్చిపట్టి ఏమి మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాకుండా ఉందని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన చూసిన, వినిన వారెవ్వరూ మళ్లీ టీడీపీకి ఓటెయ్యరని అన్నారు. పుట్టపర్తి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి మేనల్లుడు, అధ్యాపకుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు మే 7న జరిగే ఓటింగ్ ప్రక్రియకు తరలి రావాలని ప్రవాసాంధ్రులను కోరారు. వైఎస్ పాలనను, పథకాలను బంధువులకు, స్నేహితులకు వివరించి వారితో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలంటే 20కి పైగా లోక్‌సభ స్థానాలను వైఎస్ఆర్ సీసీకి అందించాలన్నారు. సమావేశంలో రెండు వేలకు పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అంతకు ముందు దివంగత నేత శోభానాగిరెడ్డికి నివాళులర్పించారు. పోలింగ్ ప్రక్రియకు తరలి వెళ్లేవారు బత్తుల అరుణాదాస్ (9535119942), ఎస్.రాజశేఖరరెడ్డి(9448854651), డి.ఎల్.రంగారెడ్డి(9845744847), లోకేశ్వరరెడ్డి(9986531659), భక్తవత్సలరెడ్డి(888002288)ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి కొండా దామోదరరెడ్డి, ప్రవాసాంధ్రులు నాగరాజరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ఉమాపతిరెడ్డి, రాజారెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు షర్మిల పర్యటన
ఉదయం 10 గంటలకు కదిరిలో రోడ్ షో, సభ 11 గంటలకు ఓబుళదేవరచెరువులో రోడ్ షో, సభ సాయంత్రం 4 గంటలకు మడకశిరలో రోడ్ షో, సభ సాయంత్రం 5.30 గంటలకు హిందూపురంలో రోడ్ షో, సభ సాక్షి, అనంతపురం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నేడు (గురువారం) జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 10 గంటలకు కదిరిలో రోడ్ షో నిర్వహించి, సభలో ప్రసంగిస్తారు. 11 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవరచెరువులో రోడ్‌షో నిర్వహించి.. మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు మడకశిర, 5.30 గంటలకు హిందూపురంలో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాత్రికి కదిరిలో బస చేసి.. శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లాకు వెళతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, షర్మిల కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ హరికృష్ణ తెలిపారు. షర్మిల రాకతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.