
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఇటీవలే కళాశాల భవనంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే బాయ్స్ హాస్టల్–2లోని ఓ గదిలో శనివారం రాత్రి నడుస్తున్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.
విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ ఊడిపడటంతో గదిలో పడుకున్న విద్యార్థి మెడ భాగంలో గాయాల య్యాయి. వెంటనే ఇతర విద్యార్థులు అధికా రులకు సమాచారం ఇవ్వడంతో వారు వర్సిటీ లోని ఆస్పత్రిలో విద్యార్థికి ప్రథమ చికిత్స చేయించారు. ఫ్యాన్ తలపై పడి ఉంటే ఘోరం జరిగేదని విద్యార్థులు పేర్కొంటున్నారు.