సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల వేళ అధికార పార్టీ ఇప్పటికే స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ తొలి విడతలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను ప్రకటించే ప్లాన్ చేస్తోంది. ఇక, బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాల ప్రకారం.. ఈ నెలాఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలని మూడుచోట్ల నుంచి యాత్రలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం, బాసర, ఆలంపూర్ నుంచి యాత్రలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల్లో స్థానిక బీజేపీ నేతలు, లీడర్లు ఆ మార్గాల్లోనే పాల్గొననున్నారు. సుమారు 18 రోజులు పాటు బీజేపీ నేతల యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఒక్కో రూట్‌లో 36 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ రూపకల్పన చేశారు.
ఇక, బీజేపీ నేతల యాత్ర ప్రారంభం నుంచే ప్రతీరోజు రెండు నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కమలం పార్టీ యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. అయితే, యాత్ర ముగింపు సభను సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీని కూడా ముగింపు సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన ముగింపు సభ కన్నా ముందే ఉండే నేపథ్యంలో యాత్రలు కూడా ముందుగానే ముగించాలనుకుంటున్నట్టు బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: పవన్. చిరంజీవిపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment