సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులందరికీ బీఫాంల పంపిణీ పూర్తి కావస్తున్నా.. హైదరాబాద్ పాతబస్తీలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థికి బీఫాంలు ఇప్పటివరకు అందించలేదు. రెండు నెలల కిందటే అభ్యర్థులను స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించి, ఈ నెల 15వ తేదీ నుంచి బీఫాంల పంపిణీ ప్రారంభించారు.
అలంపూర్‌లో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ...
మరోవైపు అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరును ఆగస్టు 21న ప్రకటించిన జాబితాలో ఖరారు చేసినా నేటికీ బీఫాం ఇవ్వలేదు. గతంలో టీడీపీ నుంచి ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఆయనకే మరోమారు పోటీ అవకాశం ఇస్తూ ఆలంపూర్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
దీంతో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కేటీఆర్‌ను తరచూ ప్రగతిభవన్, తెలంగాణలో భవన్‌లో కలిసి బీ ఫారం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అలంపూర్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రామ్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన అనుచరుడు విజయుడుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా ప్రతిపాదించినట్లు తెలిసింది.
అబ్రహంకు టికెట్ ఇస్తే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర క్షేత్ర స్థాయి నాయకులు పార్టీని వీడుతారని ఎమ్మెల్సీ చల్లా పార్టీ అధిష్టానానికి చెప్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహం మాత్రం పార్టీ కేడర్ తన వెంటే ఉందని ఇటీవల కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో అలంపూర్ టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆ తొమ్మిది సీట్లు మినహా..
119 అసెంబ్లీ స్థానాలకు గానూ కేసీఆర్ సహా 110 మంది అభ్యర్థులు బీ ఫాంలు కూడా అందుకున్నారు. నర్సాపూర్ అభ్యర్థి పేరుపై కూడా రెండు నెలలుగా కొనసాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫాం అందజేశారు. పాతబస్తీలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను నాంపల్లి, గోషామహ ల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), అయిందాల కృష్ణ (కార్వాన్), ఇబ్రహీంలోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అలీ బాఖ్రీ (బహదూర్‌పురా) కు టికెట్లు ఖరారు చేసినా బీ ఫాంలు జారీ చేయలేదు. ఇక నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి బీజేపీ టికెట్ ఇచి్చన నేపథ్యంలో ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రతివ్యూహానికి పదును పెడుతోంది.
చదవండి: రాజగోపాల్ బాటలో డీకే అరుణ కూడా?
Comments
Please login to add a commentAdd a comment