old town
-
అలంపూర్, పాత బస్తీ మినహా!.. మిగిలిన అందరికీ బీఫాంలు ఇచ్చేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులందరికీ బీఫాంల పంపిణీ పూర్తి కావస్తున్నా.. హైదరాబాద్ పాతబస్తీలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థికి బీఫాంలు ఇప్పటివరకు అందించలేదు. రెండు నెలల కిందటే అభ్యర్థులను స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించి, ఈ నెల 15వ తేదీ నుంచి బీఫాంల పంపిణీ ప్రారంభించారు. అలంపూర్‌లో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ... మరోవైపు అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరును ఆగస్టు 21న ప్రకటించిన జాబితాలో ఖరారు చేసినా నేటికీ బీఫాం ఇవ్వలేదు. గతంలో టీడీపీ నుంచి ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఆయనకే మరోమారు పోటీ అవకాశం ఇస్తూ ఆలంపూర్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కేటీఆర్‌ను తరచూ ప్రగతిభవన్, తెలంగాణలో భవన్లో కలిసి బీ ఫారం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అలంపూర్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రామ్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన అనుచరుడు విజయుడుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా ప్రతిపాదించినట్లు తెలిసింది. అబ్రహంకు టికెట్ ఇస్తే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర క్షేత్ర స్థాయి నాయకులు పార్టీని వీడుతారని ఎమ్మెల్సీ చల్లా పార్టీ అధిష్టానానికి చెప్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహం మాత్రం పార్టీ కేడర్ తన వెంటే ఉందని ఇటీవల కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో అలంపూర్ టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తొమ్మిది సీట్లు మినహా.. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ కేసీఆర్ సహా 110 మంది అభ్యర్థులు బీ ఫాంలు కూడా అందుకున్నారు. నర్సాపూర్ అభ్యర్థి పేరుపై కూడా రెండు నెలలుగా కొనసాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫాం అందజేశారు. పాతబస్తీలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను నాంపల్లి, గోషామహ ల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), అయిందాల కృష్ణ (కార్వాన్), ఇబ్రహీంలోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అలీ బాఖ్రీ (బహదూర్‌పురా) కు టికెట్లు ఖరారు చేసినా బీ ఫాంలు జారీ చేయలేదు. ఇక నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి బీజేపీ టికెట్ ఇచి్చన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రతివ్యూహానికి పదును పెడుతోంది. చదవండి: రాజగోపాల్ బాటలో డీకే అరుణ కూడా? -
పాతబస్తీ మెట్రో మార్గంపై డ్రోన్ సర్వే
హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్ మెట్రో రైల్ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఆదివారం డ్రోన్ సర్వే చేపట్టింది. మెట్రో అలైన్మెంట్లో భాగంగా పలు చోట్ల రోడ్డు విస్తరణ చేపట్టవలసి ఉంటుంది. ఈ క్రమంలో మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్ నిరి్మంచేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు సాధారణ సర్వేతో పాటు, ఈ డ్రోన్ సర్వేను ప్రారంభించారు. డ్రోన్ నుంచి సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలు, రియల్ టైమ్ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయా కట్టడాల కొలతలను కచి్చతంగా అంచనా వేయనున్నారు. దారుల్ఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు ఉన్న 103 కట్టడాల పరిరక్షణ కోసం ఈ డ్రోన్ సర్వే దోహదం చేయనుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పులు,తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. మతపరమైన/సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారు.నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. త్వరలో భూసామర్ధ్య పరీక్షలు.... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభించనున్నట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా నుంచి ఈ పరీక్షలను ప్రారంభించనున్నారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ఈ మార్గంలో పనులను ప్రారంభించింది. ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చారి్మనార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐదు స్టేషన్లు... ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి నుంచి దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి.ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. -
పాతబస్తీలో నకిలీ నోటు కలకలం!
చంచల్‌గూడ: దేశంలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆర్బీఐ కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా గత గురువారం పాతబస్తీలోని మాదన్నపేట కూరగాయల మార్కెట్లో నకిలీ రూ. 200 నోటు దర్శనమిచ్చింది. మార్కెట్లో ఓ వ్యాపారి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఆకు కూరలు కొనుగోలు చేసి రూ. 200 నోటు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని జారుకున్నాడు. సదరు వ్యాపారి ఆ రూ.200 నోటును వ్యాపారం చెల్లింపుల్లో భాగంగా మరో వ్యాపారికి ఇవ్వగా నకిలీదిగా గుర్తు పట్టాడు. నోటు సైజ్ తక్కువ, పేపర్ మందం ఎక్కువగా ఉంది. కలర్లో వ్యత్యాసం ఉండటంతో పాటు నోటుపై వాటర్ మార్క్ గాంధీ బొమ్మ కూడా లేకపోవడంతో అది ఫేక్ నోటుగా నిర్ధారించుకున్నాడు. దీంతో అసలైన నోటు అని భావించిన వ్యాపారి తాను మోసపోయినట్లు గుర్తు పట్టారు. వారం క్రితం రూ. 500 నోటు ఇక్కడే ఈ ఘటనకు వారం రోజుల ముందు కూడా ఇలాగే మరో గుర్తు తెలియని వ్యక్తి రూ. 500 నకిలీ నోటు మార్చేందుకు యయత్నంచగా పసిగట్టిన వ్యాపారి సదరు వ్యక్తితో గొడవపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే నగరంలో నకిలీ రూ. 500, 200 నోట్లు చెలామణిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలీసు, ఎన్ఐఏ, బ్యాంక్ అధికారులు మార్కెట్లో నకిలీ నోట్ల గుర్తింపుపై ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే వ్యాపారులు మోసపోకుండా ఉంటారు. మార్కెట్లో పోలీసు స్టేషన్‌కు చెందిన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలోని ఫుటేజీలను మాదన్నపేట పోలీసులు పరిశీలిస్తే నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యేందుకు అవకాశం లేకపోలేదు. అయితే మాదన్నపేట పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుంటారా లేక, బాధితులు ఫిర్యాదు ఇస్తేనే రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. -
శిక్షపడిన మరునాడే విడుదల!
సాక్షి, హైదరాబాద్: నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన పాతబస్తీ వాసి ఒబేదుర్ రెహ్మాన్‌కు ఢిల్లీ కోర్టు గత బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షా కాలం రిమాండ్ పీరియడ్‌లోనే పూర్తి కావడంతో ఆ మర్నాడే ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై బెంగళూరు సీసీబీ పోలీసులు నమోదు చేసిన మరో కేసులోనూ ఇప్పటికే శిక్షపడటం, రిమాండ్‌లోనే అదీ పూర్తవడం జరిగాయి. ఒబేదుర్ రెహ్మాన్ గత శుక్రవారం సిటీకి చేరుకున్నాడు. తొలి కేసు బెంగళూరులో నమోదు... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ డిగ్రీ చదువుతుండగానే ఉగ్రవాద బాటపట్టాడు. ఉగ్రవాద సంస్థ హుజీలో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరులో ఉన్న బీజేపీ నాయకులను, ప్రముఖులను హతమార్చడానికి ఈ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాదులు 2012లో రంగంలోకి దిగారు. ఈ విషయం గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్‌లో ఒబేద్‌తో పాటు నాందేడ్, బెంగళూరు, హుబ్లీలకు చెందిన 11 మందినీ అరెస్టు చేశారు. వీళ్లు జైల్లో ఉండగానే ఐఎం నేతృత్వంలో సాగిన మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీల్లో పేలుళ్ళకు కుట్ర పన్నడంతో అదే ఏడాది ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ మరో కేసు నమోదు చేసింది. ఒబేద్ సహా మరికొందరికి బెంగళూరు జైలు నుంచి 2013లో తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉండగానే రెండు ‘శిక్షలు’ పూర్తి... ఈ రెండు కేసులకు సంబంధించి ఒబేద్ సహా మరికొందరు ఉగ్రవాదులు 2012 నుంచి జైల్లో రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. బెంగళూరు కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు న్యాయస్థానంలో నేరం అంగీకరించారు. దీంతో కోర్టు వీరిని దోషులుగా తేలుస్తూ ఆరేళ్ళ శిక్ష విధించింది. అప్పటికే వీళ్ళు అంతకంటే ఎక్కువే జైలులో ఉండటంతో ఆ కాలాన్ని కోర్టు శిక్షగా పరిగణించింది. ఢిల్లీలో నమోదైన కేసు విచారణ పూర్తి కావడంతో ఈ నెల 7న ఒబేద్ సహా నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు బుధవారం పదేళ్ళ జైలు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ ఉగ్రవాదులు అంతకంటే ఎక్కువ రోజులే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో శిక్షాకాలం పూర్తయింది. దీంతో ఒబేద్ తదితరులు పదేళ్ల శిక్షపడిన మరుసటి రోజైన గురువారమే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇదే కేసులో భత్కల్ తదితరులు... ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ నమోదు చేసిన ఈ కేసులో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీపార్క్ ట్విన్ బ్లాస్ట్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళకు బాధ్యులైన వాళ్ళూ నిందితులుగా ఉన్నారు. ఐఎం ఉగ్రవాదులైన రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ హడ్డీపై విచారణ జరగాల్సి ఉంది. వీరిలో రియాజ్ మినహా మిగిలిన వాళ్ళు అరెస్టు కావడం, నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసుల్లో శిక్షలు పడటం కూడా జరిగింది. ఐఎం కో–ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకు మిగిలిన ఉగ్రవాదులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మానవబాంబులతో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని ఎన్ఐఏ గుర్తించింది. -
పాతబస్తీలో ఘనంగా బోనాలు
సాక్షి, హైదరాబాద్: డప్పు వాయిద్యాలు.. యువకుల కేరింతలు.. పోతరాజుల నృత్యాలు.. అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు.. ఆడపడుచుల బోనాలు.. అమ్మవారికి తొట్టెల సమర్పణ తదితర కార్యక్రమాల మధ్య పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర కన్నుల పండువగా జరిగింది. భక్తులు తెల్లవారుజామునే లాల్‌దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బోనం సమర్పించడానికి క్యూ కట్టారు. అలాగే పాతబస్తీలోని ఇతర మహంకాళి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పటిష్ట భద్రత మధ్య... బోనాల జాతర ఉత్సవాలకు దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దక్షిణ మండలం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ బోనాల జాతర వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ పట్టువస్త్రాలను సమర్పించారు. నేడు సామూహిక ఘటాల ఊరేగింపు... ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు బోనాలు పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాతబస్తీ బోనాలు ఉత్సవంలో భాగంగా లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ఆమె సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. -
ఇది ఒకప్పటి జైలు
స్వాతంత్రో్యద్యమంలో పాలుపంచుకున్న జిల్లాకు చెందిన పలువురు జైలు జీవితం గడిపిన కట్టడం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుతం ఆ కట్టడంలో ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ఆ కట్టడం ఎక్కడుందని అనుకుంటున్నారా? అయితే మీరు అనంతపురంలోని పాతూరు నంబర్ వన్ పాఠశాలను ఒకసారి సందర్శించి తీరాల్సిందే. - అనంతపురం కల్చరల్ రెండు శతాబ్ధాల క్రితం బళ్లారి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న దత్త మండలాల్లో అనంతపురం ఒకటి. ఆ సమయంలో పాలనాపరమైన వ్యవహారాలు చూసేందుకు పాతూరులో ఓ కట్టడాన్ని నిర్మించారు. 1882లో అనంతపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ కార్యాలయాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్నాళ్లు ప్రభుత్వ ఖజానాగా కూడా ఉండేదని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా అప్పట్లో కలెక్టర్ కార్యాలయంలోనే జైలు కూడా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ ఆ భవనంలో చెరశాల రూపురేఖలు కనిపిస్తున్నాయి. ఈ భవనం వెనుక శిక్షలు విధించేవారని, ఆఖరుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉరి కూడా తీసేవారని చెబుతున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాలిక విద్య కోసం ఉద్యమించిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ పోరాట ఫలితంగా ఇదే కట్టడం కొన్ని సంవత్సరాల పాటు బాలికల హాస్టల్‌గా నడిచింది. కాలక్రమంలో పాతూరులో ఉన్న సత్రం బడిని ఇక్కడకు మార్చడంతో రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌గాను, అదే పేరుతో మరో చోట నూతన భవనం నిర్మించడంతో నంబర్ 1 స్కూల్‌గా స్థిరపడిపోయింది. ఈ పాఠశాల లోపలకు వెళ్లి చూస్తే ఆశ్చర్యంతో పులకించని వారుండరంటే అతిశయోక్తి కాదు. -
పాతవూరులో ఉద్రిక్తత..
అనంతపురం: కాలపరిమితి అయిపోయిందని కొత్తగా టెండర్లు పాడిన వారికి షాపులు ఇవ్వాలంటూ నగరపాలక రెవెన్యూ అధికారులు దుకాణ యాజమానులకు తేల్చి చెప్పారు. బుధవారం అనంతపురం నగరం పాతవూరులోని మునిసిపల్ షాపులను మూత వేసే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుకణా యజమానులు, సీపీఎం నేతలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మరో మూడేళ్లు గడువు పెంచాలంటూ వేడుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏవిధంగా పోలీసుల జోక్యంతో మూసేందుకు వస్తారని అక్కడ దుకాణ యజమానులు నరసింహారెడ్డి, ఖాదర్‌బాషా, వెంకటనరసింహ, నరసింహులు, సీపీఎం నేత ముస్కిన్ అన్నారు. అందుకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 25 ఏళ్లు దాటడంతోనే టెండర్లు వేయడం జరిగిందని తదితర అధికారులు చెప్పారు. కాలపరిమితి అయిపోవడంతోనే నూతన గుత్తేదార్లకు షాపులు అప్పజెప్పాలన్నారు. అందుకు వ్యాపారులు టెండర్లు సైతం ఇష్టారాజ్యంగా జరిగాయని, తమకు ఆ విషయాన్ని తెలియజేసింటే తాము టెండర్లలో దిగే వారమన్నారు.