ALAMPUR
-
తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పోటాపోటీగా సాగునీరు విడుదల
-
మల్లికార్జున్ ఖర్గే అలంపూర్ స్పీచ్
-
ఎమ్మెల్యేకు షాక్.. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు నామినేషన్లు, ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ నెలకొనగా.. మరోవైపు టికెట్ కేటాయించి బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా అలంపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారు. తొలుత అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఆయనకు బీ-ఫామ్ ఇవ్వలేదు. మంగళవారం అనూహ్యంగా స్థానిక నేత విజయుడికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఫామ్ ఇచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి అబ్రహం తప్పుకున్నట్లే అయ్యింది. అబ్రహంను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ మొదటి జాబితాలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే అబ్రహం అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలో మొదట్నుంచీ వ్యతిరేకత వస్తోంది. దీనికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం సైతం అభ్యంతరం తెలిపింది. అభ్యర్థిని తప్పనిసరిగా మార్చాల్సిందేనన్న డిమాండ్ పెరగడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో చివరికి అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకే బీఆర్ఎస్ సిద్ధమైంది. చదవండి: అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ మంగళవారం రోజు మొత్తం తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేశారు. వారిలో అలంపూర్ నుంచి విజేయుడు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాల- పంపిణీ కార్యక్రమం పూర్తయింది. మంగళవారం బీ-ఫామ్‌లు అందుకున్నవారు.. ► ఎం సీతారాంరెడ్డి – చాంద్రాయణ గుట్ట ►సామా సుందర్ రెడ్డి – యాకత్ పురా ►ఇనాయత్ అలీబాక్రి -- బహదూర్‌పురా ►తీగల అజిత్ రెడ్డి – మలక్ పేట్ ►అయిందాల కృష్ణ -- కార్వాన్ ►సలావుద్దీన్ లోడి – చార్మినార్ ►సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ - నాంపల్లి ►నందకిషోర్ వ్యాస్ – గోషామహల్ ►విజేయుడు – అలంపూర్ -
సబ్‌ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
ఆసక్తిరేపుతోన్న అలంపూర్ రాజకీయ పరిణామాలు
-
ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో?
సాక్షి, జోగుళాంబ గద్వాల: అలంపూర్ రాజకీయ పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంకు బీఫామ్ ఇంకా అందలేదు. చల్లా వర్గీయుడు విజేయుడు, ఎమ్మెల్యే అబ్రహం వేర్వేరుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. మరో వైపు,తన తనయుడు శ్రీనాథ్‌కు సీట్ ఇవ్వాలంటూ మంద జగన్నాథ్ పట్టుబడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అటు ఎమ్మెల్యే అబ్రహం, ఇటు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు శుక్రవారం పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. బీఫాం విషయంలో ఎవరూ అపోహలకు గురి కావద్దని, తనకే వస్తుందని, మహిళలు, వృద్ధులు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, తనను ఆదరించాలని ఎమ్మెల్యే అబ్రహం కోరారు. ఈమేరకు వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి విజేయుడు ఉండవెల్లి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే, ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రత్యర్థులకు తీసిపోనట్లుగా పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత అయోమయం నెలకొంది. చదవండి: ‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్! -
అలంపూర్, పాత బస్తీ మినహా!.. మిగిలిన అందరికీ బీఫాంలు ఇచ్చేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులందరికీ బీఫాంల పంపిణీ పూర్తి కావస్తున్నా.. హైదరాబాద్ పాతబస్తీలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థికి బీఫాంలు ఇప్పటివరకు అందించలేదు. రెండు నెలల కిందటే అభ్యర్థులను స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించి, ఈ నెల 15వ తేదీ నుంచి బీఫాంల పంపిణీ ప్రారంభించారు. అలంపూర్‌లో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ... మరోవైపు అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరును ఆగస్టు 21న ప్రకటించిన జాబితాలో ఖరారు చేసినా నేటికీ బీఫాం ఇవ్వలేదు. గతంలో టీడీపీ నుంచి ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఆయనకే మరోమారు పోటీ అవకాశం ఇస్తూ ఆలంపూర్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కేటీఆర్‌ను తరచూ ప్రగతిభవన్, తెలంగాణలో భవన్లో కలిసి బీ ఫారం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అలంపూర్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రామ్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన అనుచరుడు విజయుడుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా ప్రతిపాదించినట్లు తెలిసింది. అబ్రహంకు టికెట్ ఇస్తే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర క్షేత్ర స్థాయి నాయకులు పార్టీని వీడుతారని ఎమ్మెల్సీ చల్లా పార్టీ అధిష్టానానికి చెప్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహం మాత్రం పార్టీ కేడర్ తన వెంటే ఉందని ఇటీవల కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో అలంపూర్ టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తొమ్మిది సీట్లు మినహా.. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ కేసీఆర్ సహా 110 మంది అభ్యర్థులు బీ ఫాంలు కూడా అందుకున్నారు. నర్సాపూర్ అభ్యర్థి పేరుపై కూడా రెండు నెలలుగా కొనసాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫాం అందజేశారు. పాతబస్తీలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను నాంపల్లి, గోషామహ ల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), అయిందాల కృష్ణ (కార్వాన్), ఇబ్రహీంలోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అలీ బాఖ్రీ (బహదూర్‌పురా) కు టికెట్లు ఖరారు చేసినా బీ ఫాంలు జారీ చేయలేదు. ఇక నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి బీజేపీ టికెట్ ఇచి్చన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రతివ్యూహానికి పదును పెడుతోంది. చదవండి: రాజగోపాల్ బాటలో డీకే అరుణ కూడా? -
అబ్రహంకు బీఫామ్ ఇవ్వని కేసీఆర్.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సొంతపార్టీలోనే అసమ్మతి తారస్థాయికి చేరుకోవడం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు వార్ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారాయి. అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రకటించిన లిస్ట్‌లో అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్రహం పేరు ఉన్నా, ప్రస్తుతం ఆయనకు బీఫామ్ దక్కలేదు. అబ్రహాంకు కాకుండా వేరే అభ్యర్థికి బీఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజేయుడుకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. మరో వైపు, తెలంగాణ భవన్‌కు వచ్చిన అబ్రహంను కలవకుండా కేటీఆర్ కారెక్కి వెళ్లిపోయారు. వచ్చే ఎసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత అందరికంటే ముందుగా ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలుండగా.. అంతటా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో అలంపూర్, మక్తల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ అసమ్మతి పెల్లుబికింది. అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి తొలుత పలు మండలాల్లో చల్లా వర్గీయులుగా ముద్రపడిన అసంతృప్త నాయకులు సమావేశాలు నిర్వహించినా.. ఆ తర్వాత సద్దుమణిగింది. ఇక బీఫాంలు అందజేస్తారు అన్న క్రమంలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడం.. పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలవడం.. అభ్యర్థిని మార్చాలంటూ వినతిపత్రం అందజేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీనే ఎన్నికల ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు తెలిసింది. అలంపూర్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. చదవండి: రాహుల్ బైక్ ర్యాలీలో అపశ్రుతి..కొండా సురేఖకు గాయాలు -
TS Election 2023: ‘కారు’లో కిరికిరి.. ‘అలంపూర్’లో అలజడి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు.. మరో ముఖ్యనేత అసమ్మతి రాగం వెరసి ‘కారు’లో కీచులాటలు తారస్థాయికి చేరాయి. శుక్రవారం ప్రగతిభవన్‌కు చేరిన అలంపూర్ పంచాయితీయే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇవ్వొద్దని.. అభ్యర్థిని మార్చాలని వందలాది వాహనాల్లో తరలివెళ్లిన పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మరోవైపు గులాబీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథం సైతం పార్టీ అభ్యర్థిని మార్చాలని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారగా.. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ‘చల్లా’రుతాయా.. లేక.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. వచ్చే నెల మూడో తేదీన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. త్వరలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అలంపూర్‌లో చల్లారినట్లే చల్లారిన అసమ్మతి సెగలు మళ్లీ భగ్గుమనడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి నేతలు భేటీకి అలంపూర్‌ను ఎంచుకున్నప్పటికీ.. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లికి మార్చారు. ఎమ్మెల్సీ చల్లా సూచనతోనే సమావేశ వేదికను మార్చినట్లు సమాచారం. సమావేశం అనంతరం అసమ్మతి నేతలు హైదరాబాద్‌కు వెళ్లి అలంపూర్ అభ్యర్థిని మార్చాలని ఏకవాక్య తీర్మానంతో వినతిపత్రం సమర్పించిన క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ‘మీరు ఏదైతే వినతిపత్రం ఇచ్చారో యథాతథంగా సీఎం కేసీఆర్‌కు అందజేస్తాను. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీ మనోభావాలను మీరు స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.. వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు.’అని వెల్లడించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థిని మార్చని పక్షంలో చల్లా నిర్ణయం ఏవిధంగా ఉంటుందోననే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అప్పటి నుంచి పెరిగిన గ్యాప్.. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు చల్లా వెంకట్రామిరెడ్డిని పార్టీలో చేర్చుకుని.. ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జోగుళాంబ ఆలయ చైర్మన్, తదితర పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, ఆయన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకోగా.. ఎమ్మెల్యే అబ్రహానికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇప్పించేందుకు చల్లా ప్రయత్నించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ జాబితా ప్రకటించగా.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు అబ్రహానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. వీటి వెనుక ఎమ్మెల్సీ చల్లా హస్తం ఉందని ఎమ్మెల్యే సైతం పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. -
అభ్యర్థులను మార్చాల్సిందే..! బీఆర్ఎస్లో ‘సీట్ల’ పంచాయితీ
సాక్షి, మహబూబ్‌నగర్: అధికార బీఆర్ఎస్లో టిక్కెట్ల పంచాయితీ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో సీట్ల గొడవ ఎంతకీ తెగడం లేదు. అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి గళాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలంపూర్, కల్వకుర్తి అభ్యర్థులను మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు. అలంపూర్‌లో విభేదాలు తారా స్థాయికి చేరగా, ఎమ్మెల్యే అబ్రహం అనుకూల, వ్యతిరేక వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో పార్టీ క్యాడర్లో గందరగోళం పరిస్థితి నెలకొంది. కల్వకుర్తి సీటు విషయంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల వేళ అధికార పార్టీ ఇప్పటికే స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ తొలి విడతలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను ప్రకటించే ప్లాన్ చేస్తోంది. ఇక, బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ఈ నెలాఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలని మూడుచోట్ల నుంచి యాత్రలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం, బాసర, ఆలంపూర్ నుంచి యాత్రలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల్లో స్థానిక బీజేపీ నేతలు, లీడర్లు ఆ మార్గాల్లోనే పాల్గొననున్నారు. సుమారు 18 రోజులు పాటు బీజేపీ నేతల యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఒక్కో రూట్లో 36 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ రూపకల్పన చేశారు. ఇక, బీజేపీ నేతల యాత్ర ప్రారంభం నుంచే ప్రతీరోజు రెండు నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కమలం పార్టీ యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. అయితే, యాత్ర ముగింపు సభను సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీని కూడా ముగింపు సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన ముగింపు సభ కన్నా ముందే ఉండే నేపథ్యంలో యాత్రలు కూడా ముందుగానే ముగించాలనుకుంటున్నట్టు బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: పవన్. చిరంజీవిపై కేఏ పాల్ సంచలన కామెంట్స్ -
మహా శివరాత్రికి ముస్తాబవుతున్న అలంపూర్ క్షేత్రం
-
జోగుళాంబ సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి రాజీవ్ షక్దీర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్‌కుమార్, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో, చైర్మన్లు అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. -
అలంపూర్ కారులో కుస్తీలాట
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు స్దాయికి చేరుకున్నాయి. నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పార్టీనేతలు, కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆది నుంచి గ్రూపు రాజకీయలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం, ఎమ్మెల్యే అబ్రహంకు చాలాకాలంగా వైరం కొనసాగుతోంది. పార్టీలో ఇద్దరూ చెరో గ్రూప్ నడుపుతున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితది మరో గ్రూపు. ఇలా ఎవరికి వారు అధిపత్యం కోసం పోరాడుతున్నారు. అజయ్ అత్యుత్సాహంతో పార్టీకి డ్యామేజ్? ఎమ్మెల్యే అబ్రహం ఏకపక్ష పోకడలు..ఆయన తనయుడు అజయ్‌కుమార్ మితిమీరిన జోక్యం పార్టీలో తొలినుంచీ పనిచేస్తున్నవారికి ఇబ్బందికరంగా మారుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్యేతో పలు అంశాలపై విభేదిస్తున్న స్దానిక నేతలు తమ ప్రజాప్రతినిధిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు ఎమ్మెల్యే పాల్గొన్న సమావేశాలను సైతం అడ్డుకున్న ఘటనలు జరిగాయి. నియోజక వర్గంలోని శాంతి నగర్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమంలో గొడవ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, గాయకుడు సాయిచంద్ పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సాయిచంద్, ఆయన పీఏ, గన్‌మెన్‌పై స్దానిక టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. దాడిలో సాయిచంద్‌తోపాటు గన్‌మెన్‌కు కూడా గాయలయ్యాయి. ఈ దాడికి ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్‌కుమార్ కారణమని సాయిచంద్ ఆరోపించారు. పెద్దల ఆశీస్సులతోనే సాయిచంద్ ప్రచారం? ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అలంపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అబ్రహంను విభేదించే సెకండ్ లెవెల్ క్యాడర్‌తో సాయిచంద్ టచ్ లో ఉండటంతో పాటు, అలంపూర్ భవిష్యత్ ఎమ్మెల్యే తానే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తనను ఆలంపూర్లో పనిచేసుకోమని..ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పినట్లు సాయిచంద్ ప్రచారం చేసుకోవడంపై ఎమ్మెల్యే అబ్రహం శిబిరం ఆగ్రహంగా ఉంది. సాయిచంద్ పిఏ కూడా పలువురు మండల స్థాయి నాయకులకు ఫోన్ చేసి సాయిచంద్ కు మద్దతుగా నిలవాలని కోరడం వంటి పలు ఘటనలు ఆయనపై దాడికి కారణమైనట్లు తెలుస్తోంది. కొడుకు కోసం ప్రయత్నం ఎమ్మెల్యే అబ్రహం వచ్చే ఎన్నికల్లో తన కూమారుడు అజయ్ ను బరిలో దింపేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే అలంపూర్‌లో అబ్రహం కూమారుడు అజయ్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎంపి మందా జగన్నాదం, మాజీ జడ్పిచైర్మన్ బండారి భాస్కర్ లు ఆలంపూర్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో పక్క గద్వాల జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య దంపతులు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారనే టాక్ కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇది చాలదన్నట్టు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అలంపూర్ టికెట్ పై కన్నేసి అక్కడి టిఆర్ఎస్ శ్రేణులతో టచ్ లోకి వెళ్లడం వివాదస్పదంగా మారింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా కూడ ఎమ్మెల్యే తనయుడు అజయ్ అత్యుత్సాహం వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందనే వాదనలు అప్పట్లో వినిపించాయి. మంచి గాయకుడిగా పేరున్న సాయిచంద్‌కు పార్టీ అధినేతతోపాటు కీలక నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయటం ద్వారా సాయిచంద్ పార్టీ పెద్దల దగ్గర పలుకుబడి సంపాదించుకున్నాడు. పెద్దల ఆశీస్సులతోనే సాయిచంద్ ఆలంపూర్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే గందరగోళంగా మారిన ఆలంపూర్ నియోజకవర్గంలో పరిస్థితిని గులాబీ పార్టీ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి. -
పొలిటికల్ కారిడార్ : అలంపూర్ గులాబీలో గ్రూపులు
-
మూడు పట్టణాలకు ‘స్వచ్ఛత’ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు స్వచ్ఛత అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) పోటీల్లో రాష్ట్రంలోని పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు ఈ అవార్డులు సాధించాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. ఈ నెల 17న ఐఎస్ఎల్ పోటీని నిర్వహించగా, దేశంలోని 1,850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణకు మూడు అవార్డులు రాగా, ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వచ్చిన 16 అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కినట్లయింది. ఐఎస్ఎల్ పోటీల్లో భాగంగా అన్ని పట్టణాలు తాము చేపట్టిన ఫ్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు. మూడు కేటగిరీల్లో అవార్డులు జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా జరిగిన పోటీలో 15వేల లోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో అలంపూర్ అవార్డుకు ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈ నెల 30న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డులు పొందిన పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కె.తారకరామారావు అభినందనలు తెలిపారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా... కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ అవార్డులు సాధించిందని మంత్రి అన్నారు. కాగా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, అభివృద్ధి చేస్తున్న సీఎంలకు సహకరిస్తే దేశం బాగుపడుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదని... అధికారం ఉన్నపుడు మంచి చేస్తే చరిత్రలో నిలుస్తారన్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రానికి అవార్డులకు బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు.. రహస్య భేటీ..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ప్రధానంగా పాలనా వ్యవహారాల్లో ఆయన తనయుడు జోక్యం చేసుకోవడం.. పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చదవండి👉: కేసీఆర్ సుముఖత.. టీఆర్ఎస్ వెంట పీకే టీమ్ నియోజకవర్గ పరిధిలోని పలువురు అసంతృప్త నేతలు ఇటీవల రహస్యంగా సమావేశమై పోరు కార్యాచరణ పథకం రచించారు. ఇందుకనుగుణంగా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కారులో కిరికిరి తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. పాలమూరులో ఒకవైపు బీజేపీ ప్రజాసంగ్రా మ యాత్ర కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ సైతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరుబాట పట్టింది. ఈ క్రమంలో అలంపూర్‌లో అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గులాబీలో అంతర్గత పోరు రచ్చకెక్కిన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని చర్చ జోరుగా సాగుతోంది. ఇలా ముదిరింది.. 2009 డీలిమిటేషన్లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా వీఎం అబ్రహం బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ గెలుపొందారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ నుంచి అబ్రహం పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలం తర్వాత స్థానిక నేతలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఆయన తనయుడు అజయ్ పొలిటికల్ ఎంట్రీకి అబ్రహం సన్నాహాలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచే వారసత్వం పుచ్చుకోనున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో పాటు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడం.. అందినా చివరి నిమిషంలో కబురు రావడం వంటి సంఘటనలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తిని రగిల్చాయి. దళితబంధు, ఇతర పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత నిప్పు రాజేసినట్లు సమాచారం. దీంతో పలువురు అసమ్మతి నేతలు ఇప్పటికే నాలుగైదు పర్యాయాలు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అయితే పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే ఉద్దేశంతో తగిన సమయం కోసం వేచిచూసినట్లు తెలుస్తోంది. అయిజలో రహస్య భేటీ.. ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్న నేతలు మొదట్లో ఎమ్మెల్యే అబ్రహంతో సఖ్యతగానే ఉన్నారు. ఎప్పుడైతే తన కొడుకు అజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం.. అధికారిక కార్యక్రమాలతో పాటు తమ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో జరిగే వివిధ కార్యకళాపాల్లో అజయ్ పెత్తనం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సోమవారం అయిజలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమై పోరు కార్యాచరణపై చర్చించారు. కేటీఆర్ వద్దకు పంచాయితీ.. ఓ నిర్ణయానికి వచ్చిన అసంతృప్త నేతలు సమావేశం అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే అబ్రహం తీరుతో తమకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. స్పందించిన వారు ‘అలాగేనని.. ప్లీనరీ ఉంది.. తర్వాత కలిసి మాట్లాడదాం’ అని అసంతృప్త నేతలను సముదాయించినట్లు తెలిసింది. ఎక్కడ కూడా బహిర్గతం కావొద్దని.. అంతర్గతంగానే పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పంచాయితీ కేటీఆర్ వద్దకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లీనరీ తర్వాత దీనిపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అలంపూర్‌లో గట్టి పట్టు ఉన్న టీఆర్ఎస్ నేత తిరుమల్‌రెడ్డి మృతిచెందడం.. మరోవైపు గెలుపోటములను శాసించే చల్లా వెంకట్రామరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండడం.. ఈ క్రమంలో టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశాలుగా మారాయి. అలంపూర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన అధికార పారీ్టలో కొందరు నేతలు ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇసుకదందాలో తనయుడి మితి మీరిన జోక్యంతోనే ఎమ్మెల్యేపై అసమ్మతి సెగ రాజుకుందనే అభిప్రాయాలు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. -
‘ప్రజాసంగ్రామ యాత్ర’ .. బీజేపీలోకి చల్లా వెంకట్రామ్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా జిల్లా ముఖ్యనేతలతోపాటు సంజయ్ తరఫు ప్రతినిధులు జరిపిన చర్చలకు వెంకట్రామ్రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కుమార్తె కుమారుడు) వెంకట్రామ్కు ఆలంపూర్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచిపట్టు ఉంది. ఇప్పుడు ఆయన వనపర్తి నుంచి పోటీచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వెంకట్రామ్తోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరికొందరు నేతలు కూడా సంజయ్ పాదయాత్ర ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో లేదా మే 14న జరిగే ముగింపు సమావేశానికి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం. -
అలంపూర్ లో ఆసుపత్రి కోసం ఆందోళన
-
ఆసుపత్రి కోసం ఆందోళన
-
వాగులో గర్భిణి గల్లంతు
-
కరోనా పరీక్షలు చేస్తారనే భయంతో
ఉండవెల్లి (అలంపూర్): చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మార్గమధ్యలో ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోగా.. అందులో ప్రయాణిస్తున్న మహిళ గల్లంతైంది. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగ సింధూరెడ్డి (28)కి హైదరాబాద్‌కు చెందిన శివశంకర్‌రెడ్డితో ఏడాది క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, భార్యాభర్తలతో పాటు శివశంకర్‌రెడ్డి స్నేహితుడు జిలానీ బాషా కలసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి తెలంగాణ రాష్ట్రంలోని పుల్లూరు చెక్‌పోస్టు సమీపం వరకు వచ్చారు. అయితే, చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమో అనే భయంతో పాటు ఆలస్యమవుతుందని భావించి డ్రైవింగ్ చేస్తున్న జిలానీబాషా జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతి తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదుగా కారుని పోనిచ్చాడు. జోరువాన.. పైగా చీకట్లో కలుగొట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతికి కారు అదుపుతప్పి కొట్టుకుపోయింది. నిద్రలో ఉన్న సింధూరెడ్డి వాగులో పడి నీటిలో మునిగిపోగా.. శివశంకర్‌రెడ్డి, జిలానీబాషా డోర్ తెరుచుకొని ముళ్లకంప సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సింధూను పట్టుకునే ప్రయత్నం చేసినా.. చీకటి, మరోవైపు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఆమె గల్లంతైంది. గాలింపు చర్యలు వేగవంతం సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్‌రతన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి వివరాలు సేకరించారు. ప్రొక్లెయినర్ సాయంతో కారును బయటికి తీయించారు. మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ వాగు, మరో పెద్దవాగు అయిన బొంకూరు గుండా వాహనాలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఘటన చోటుచేసుకన్న కలుగొట్ల వాగు నుంచి తుంగభద్ర నది 500 మీటర్ల దూరం మాత్రమే ఉంది. కాగా, ఎమ్మెల్యే అబ్రహం బాధితులను పరామర్శించారు. నిత్యం వాహనాలు ఇదే రోడ్డులో తిరుగుతాయని, ఇంతవరకు ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. సింధూ గర్భవతి ఇదిలా ఉండగా, తన కూతురు నాగసింధు ప్రస్తుతం గర్భిణి అని ఆమె తండ్రి రామాంజనేయ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటున్న అత్తగారింటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తుంగభద్ర నది అధికంగా ప్రవహిస్తుండటంతో గల్లంతైన మహిళ ఆచూకీ దొరకడం లేదని,, గాలింపు చర్యలు ముమ్మరం చేశామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. -
జనతా కర్ఫ్యూతో ముందే పెళ్లి
సాక్షి, శాంతినగర్ (అలంపూర్): ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో.. ఆదివారం జరగాల్సిన పెళ్లిని ఒక రోజు ముందుగానే చేసేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ రామచంద్రానగర్‌కు చెందిన యూసు చెల్లెలు నిఖా ఆదివారం జరగాల్సి వుంది. జనతాకర్ఫ్యూ దృష్ట్యా తనవంతు బాధ్యతగా యూసుఫ్ శనివారం సాయంత్రం మగ్రిబ్ నమాజ్ తరువాత నిఖా చేశారు. దీంతో స్థానిక ముస్లింలతోపాటు ప్రజలు యూసుఫ్‌ను అభినందించారు. జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే కరోనా మహమ్మారిని దేశంలో లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు. -
ఒక్క ఓటు, మూడు ఓట్లతో లక్కీవీరులు..
సాక్షి, నారాయణపేట: ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న మాటను ఈ సంఘటన నిజం చేస్తున్నట్లుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థికన్నా ఒక్కటంటే ఒక్కటే ఓటు ఎక్కువ రావడంతో విజయం వరించింది. నారాయణపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్‌సలీం సమీప అభ్యర్థి చలపతిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించి లక్కీ వీరుడుగా నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 310 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సలీంకు 311ఓట్లు వచ్చాయి. ఒక ఓటుతో గెలుపొందారని అధికారులు వెల్లడించారు. బీజేపీ వారు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్ చేశారు. సలీంకు ఒక్క ఓటు అధికంగా రావడంతో ధ్రువీకరించి సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మహ్మద్‌సలీం మాట్లాడుతూ కౌన్సిలర్‌గా గెలవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దొంగఓట్లు వేయడాన్ని తాను అడ్డుకోవడం వల్లే గెలుపు సాధ్యమైందని చెప్పారు. మూడు ఓట్లతో గెలుపు శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థి ఎన్.అజయ్‌కుమార్ మూడంటే.. మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేదవతికి 358 ఓట్లు రాగా.. అజయ్‌కుమార్‌కు 361ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేదవతి ఓట్లు రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరింది. అభ్యర్థి కోరిక మేరకు రెండో పర్యాయం అధికారులు ఓట్లు లెక్కించారు. రెండోసారి లెక్కించినప్పటికి 3 ఓట్లు ఆధిక్యత లభించడంతో అజయ్‌కుమార్‌ను విజేతగా అధికారులు ప్రకటించారు. -
8 ఏళ్లకే 87 సార్లు రక్తం ఎక్కించారు..
సాక్షి, అలంపూర్: ఆ బాలుడి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే.. కానీ, మాయదారి జబ్బు సోకడంతో జీవితానికి ఎదురీదుతున్నాడు.. రక్తపిపాసి తలసేమియా సోకడంతో ఇప్పటికే 87 సార్లు రక్తం ఎక్కించారు.. వ్యాధి శాశ్వత నివారణకు ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి సంతానమే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డికి చెందిన భాస్కర్, లక్ష్మీదేవిల మొదటి సంతానంగా జన్మించిన హేమంత్‌కుమార్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉండటం వల్ల శరీరంలో రక్తం పెరగదు. దీంతో తల్లిదండ్రులు బాబుకు ఏడాదిన్నర వయస్సు నుంచి వైద్యుల సూచన మేరకు నిర్ణీత రోజులకొకసారి రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ చిన్నారి బాబుకు 87 సార్లు రక్తం ఎక్కించారు. ఇలా ఎక్కువగా రక్తం ఎక్కించడం వల్ల శరీరంలోని ప్రతి అవయవంలో ఐరన్ ఎక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బాబుకు అవయవాల్లో ఐరన్ ఎక్కువ కావడంతో, దాని కోసం కూడా మందులు వాడుతున్నారు. బాబు కోసం గ్రామం వదిలి.. తమ కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు మారుమూల గ్రామం మాన్‌దొడ్డి నుంచి జడ్చర్లకు తమ నివాసాన్ని మార్చారు. తండ్రి భాస్కర్ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో వైద్యం తీసుకునేందుకు, హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి దగ్గరవుతుందని జడ్చర్లలోనే ఉంటున్నామని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. బాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు ఆపరేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అందుకు రూ.10 లక్షల అవసరం కాగా.. ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని, కడుపు కట్టుకుని రూ.2 లక్షలు పోగు చేసుకున్నామని, మిగతా డబ్బును దాతలు ఎవరైనా అందిస్తే తమ కుమారుడికి నిండు జీవితాన్ని అందించినవారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం చేయదలిచిన వారు 8985548806 గూగుల్ పే నంబర్ ద్వారా, స్టేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 32383343535 శాంతినగర్ శాఖ ద్వారా కానీ సహాయం చేయాలని, పూర్తి వివరాలకు సెల్ నం. 85550 40715ను సంప్రదించాలని హేమంత్ తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బడగులు కావడంతోనే ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్
సాక్షి, అలంపూర్: అత్యాచారాలు, హత్యలు చేసిన నిందితులకు శిక్షల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం సాయంత్రం అలంపూర్ చౌరస్తా చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన అలంపూర్ చౌరస్తా లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దిశ’ నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వారికి కోర్టు ద్వారా శిక్ష వేయాల్సిన పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. దిశ నిందితుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ తమ పిల్లలు తప్పు చేసి ఉంటే కోర్టు ద్వారా శిక్ష పడాలని కోరుకున్నారన్నారు.కోర్టు కంటే ముందే శిక్ష వేశారన్నారు. నిందితులు బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్నారు. కులం, మతం తేడా చూడొద్దు గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచారాలు, హత్యల కేసులు నమోదైనా.. ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదని మంద కృష్ణ అన్నారు. హాజీపూర్ ఘటనలో నలుగురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డిని, జడ్చర్లలో బాలికను హత్య చేసిన నిందితుడిని ఎందుకు శిక్షించలేదన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ నెల 24న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
సీఎం దృష్టికి తీసుకెళ్తాం: స్మితా సబర్వాల్
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్) : తుమ్మిళ్ల ఎత్తిపోతలలో చేపట్టాల్సిన పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ చెప్పారు. మంగళవారం ఉదయం రాజోళి మండలంలోని ఈ పథకాన్ని ఆమె పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్లో తుమ్మిళ్లకు చేరుకున్న ఆమెకు జెడ్పీచైర్‌పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ శశాంక స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం తీసుకున్న ఆమె పథకం పనులను పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తుమ్మిళ్ల పథకంలోని జీరో పాయింట్ వద్దకు రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ అనంతారెడ్డిలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది నుంచి అప్రోచ్ కెనాల్లోకి నీరు వచ్చే విధానాన్ని పరిశీలించారు. తుంగభద్ర నదిలో వరద నీరు ఎన్ని రోజులు కొనసాగుతుందో, నది అవతలివైపు ఉన్న గ్రామాలపై అధికారులతో ఆరా తీశారు. సమీపంలోని సుంకేసుల బ్యారేజీ, కేసీ కెనాల్ వివరాలను అడిగారు. ఈ లిఫ్టులో ప్రస్తుతం రెండు 5.5 హెచ్‌పీ, మరొకటి 10.5హెచ్‌పీ మోటార్లు ఉన్నాయని అధికారులు బదులిచ్చారు. ప్రస్తుతం మొదటి విడత పనులు పూర్తి కాగా, ఒక 5.5హెచ్‌పీ మోటార్ ద్వారా మాత్రమే నీటి పంపింగ్ అవుతోందన్నారు. అనంతరం తనగల వద్ద ఉన్న ఆర్డీఎస్ కెనాల్ డి–23 వద్దకు ఆమె వెళ్లి లిఫ్ట్ నుంచి నీరు చేరుకోవడాన్ని పరిశీలించారు. రెండో దశ పనులపైనా.. ఈ ఎత్తిపోతలలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన రిజర్వాయర్లకు స్థల సేకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే దానిపై స్మితాసబర్వాల్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. 1.1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు సంబంధించి సుమారు వంద ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. మిగతా భూమిని సేకరించేందుకు అధికారులు సన్నద్ధమైతే రైతులు తప్పకుండా సహకరిస్తారన్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా శాశ్వత ప్రయోజనాలు కలగాలంటే రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బాగా వర్షాలు కురవడం, ఎగువ నుంచి తుంగభద్రకు వరద నీరు రావడం వల్ల నీరు సమృద్ధిగా ఉందన్నారు. ఏటా ఇలాగే ఉంటుందని భావించలేమని, దీనిని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత త్వరగా రిజర్వాయర్లు నిర్మించి, ఆర్డీఎస్ కెనాల్‌ను ఆధునికీకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రేణుక, నీటిపారుదలశాఖ ఎస్ఈ రఘునాథ్‌రావు, ఈఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాస్, ఏఈఈలు శివరాజు, అంజనేయులు, వరుణ్ పాల్గొన్నారు. ఆర్డీఎస్ కెనాల్ వద్ద డెలివరీ సిస్టర్న్‌లో నీటి విడుదలను పరిశీలిస్తున్న అధికారులు పకడ్బందీగా ‘ప్రణాళిక’ పనులు గ్రామాల్లో ‘ప్రణాళిక’ పనులు పకడ్బందీగా నిర్వహించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. తుమ్మిళ్ల పంప్‌హౌస్ సమీపంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం, ప్రణాళిక పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, వీటి ద్వారా భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ ఏఈఈ శివరాజ్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆ డబ్బు మోదీజీ వేశారనుకున్నా..!
భోపాల్ : విదేశాల నుంచి బ్లాక్ మనీని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకున్నారని హుకుం సింగ్ అనుకున్నాడు. తన ఖాతాలో నెలనెలా వచ్చిపడుతున్న డబ్బులు మోదీజీయే ఇస్తున్నారని దర్జాగా ఖర్చు చేసుకున్నాడు. తీరా చూస్తే.. అవి తన పేరుతోనే ఉన్న మరొకరివని, బ్యాంకు అధికారుల పొరపాటుతో తన ఖాతాలోకి వచ్చిన సొమ్ము అని తేలడంతో అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్ లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరగడం రోజూ చూస్తునే ఉన్నాం.. అకస్మాత్తుగా అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవడం.. అనుకోకుండా డబ్బులు జమ అవ్వడం సర్వసాధారణమైన విషయంగా మారింది. తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బింద్ జిల్లా రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లాడు. అక్కడ తను సంపాదించిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆరు నెలల్లో మొత్తం రూ. 140,000 వేలు జమచేశాడు. అనంతరం ఊరికి తిరిగి వచ్చిన సదరు వ్యక్తికి డబ్బులు విత్ డ్రా చేద్ధామని ప్రయత్నించగా అకౌంట్లో కేవలం రూ. 35,400 ఉన్నట్లు కనిపించడంతో కంగుతిన్నాడు. వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై బ్యాంకు అధికారులు విచారించగా.. ఒకే అకౌంట్ నెంబర్‌పై రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో హుకుం సింగ్(రురై గ్రామం).. హుకుం సింగ్ (రోనీ గ్రామం). ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు ఒకే బ్రాంచ్ ఆలంపూర్లో అకౌంట్ తీయడంతోపాటు ఇద్దరు పేర్లు కుడా ఒకటే అవ్వడంతో కంగారుపడ్డ బ్యాంకు మేనేజర్ ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్ కేటాయించాడు. ఇక రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ ఖాతాలో వేసిన డబ్బులు..రోనీ గ్రామానికి చెందిన హుకుం సింగ్ విత్ డ్రా చేశాడని నిర్ధారణకు వచ్చిన బ్యాంకు అదికారులు ఈ తప్పిదమంతా బ్యాంకు మేనేజర్ రాజేష్ సోంకర్ వల్లే జరిగిందని అంగీకరించారు. అనంతరం అతడిని పిలిచి బ్యాంకు అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎన్నికల సమయంలో నల్లధనాన్నివెనక్కి తీసుకు వచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తానని అప్పట్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రస్తుతం తమ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని అనుకున్నానని సదరు వ్యక్తి తెలిపాడు. అందుకే ప్రతి నెల అకౌంట్లో వచ్చిన డబ్బులను తీసుకున్నానని, అవి తనకు చాలా అవసరమయ్యాయని వెల్లడించాడు. ఆరు నెలల్లో దాదాపు రూ.89,000 వేలు విత్‌డ్రా చేశానని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. చివరికి వాస్తవం తెలుసుకున్న హుకుం సింగ్ నిరాశపడ్డాడు. అయితే తమ తప్పిదాన్ని అంగీకరించిన బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రయత్నించారని బాధితుడు ఆరోపించాడు. ఇక ఈ సమస్యను బ్యాంకు అదికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి!.. -
ఊరు మోడైంది.. కన్నీరు తోడైంది
అలంపూర్: ఓ శుభకార్యం కోసం వెళ్లి వస్తూ.. ఊహించని రోడ్డు ప్రమాదంలో విగత జీవులై తిరిగొచ్చిన తమ వాళ్లను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఊరంతా కదిలొచ్చి వెల్దుర్తి రోడ్డు ప్రమాద మృతులకు కడసారి వీడ్కోలు పలికారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 16 మందిలో 15 మంది జోగుళాంబ గద్వాల జిల్లా వాసులే. వీరిలో 14 మంది వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామస్తులే ఉండటంతో భౌతిక కాయాలను ఒకే చోట ఖననం చేశారు. ఆదివారం వీటి కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేసింది. రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మన్న కుమారుడు శ్రీనాథ్ వివాహం నిశ్చయం చేసుకుని అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి తిరిగి వస్తుండగా.. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. శాంతినగర్‌లో ధర్నా మృతదేహాలు ఉన్న అంబులెన్స్‌ను ఆదివారం శాంతినగర్ వద్ద నిలిపివేసి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు విద్య సౌకర్యం, రైతు బీమాతో పాటు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇప్పించాలని ఎమ్మెల్యే అబ్రహంను ఘెరావ్ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీలపై స్పష్టమైన ప్రకటన చేయడం వీలుపడదని, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని గద్వాల ఆర్డీఓ రాములు హామీనివ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాతో అలంపూర్–రాయిచూరు రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. ఎస్పీ లక్ష్మినాయక్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్ హుసేన్ ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మృతదేహాలు ఉన్న అంబులెన్స్‌లను అక్కడి నుంచి తరలించారు. ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు.. జోగుళాంబ గద్వాల కలెక్టర్ శశాంక ఆదేశాల మేర కు రామాపురం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో ఒక ఎకరం పొలం ఎంపిక చేసి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అంబులెన్స్‌లో వచ్చిన మృతదేహాలను వారి నివాసాలకు కాకుం డా ప్రత్యేకంగా వేసిన టెంట్ల వద్దకు చేర్చారు. అక్కడే అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసి కొత్తగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలో ఖననం చేశారు. అంత్యక్రియల్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు. బాధిత కుటుం బాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రులు డీకే అరు ణ, రాములు, ఢిల్లీలో ప్రభుత్వ అధికారి ప్రతినిధి మందా జగన్నాథం, నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీజే పీ అభ్యర్థి బంగారు శ్రుతి పరామర్శించారు. -
నగల కోసమే చంపేశారా?
సాక్షి, అలంపూర్/ గోపాల్పేట (వనపర్తి): నగల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉండవెల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం హత్యకు గురై దహనమైన వృద్ధురాలి ఆచూకీని కుటుంబ సభ్యులు, ఆమె ఆనవాళ్ల సహాయంతో గుర్తించినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి ఉండవెల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ విషయమై సోమవారం పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. పత్రికల్లో కథనాలు చూసిన గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన కొమ్ము నర్సయ్య ఆయన కుమారులు పెద్ద సుబ్బయ్య, చిన్న సుబ్బయ్యలు కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐతో మాట్లాడి తమ వివరాలు తెలిపారు. తన తల్లి కొమ్ము రాజమ్మ(72) కనిపించడం లేదని చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రిలో ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని చూపించారు. మృతురాలి శరీరంపై ఉన్న పులిపిరి, వేసుకున్న జాకెట్, చేతికి ఉన్న సాధారణ ఉంగరం, మెట్టలు, తల వెంట్రుకల కొప్పు విధానం చూసి తమ తల్లిగా గుర్తించారు. ఈ నెల 16వ తేదీన మందుల తెచ్చుకొనేందుకు వనపర్తికి వెళ్లిందని ఆ రోజు నుంచి ఇంటికి రాలేదన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలు చూసి అనుమానంతో ఇక్కడికి వచ్చి పరిశీలించడంతో తమ తల్లిగా నిర్ధారించుకున్నట్లు వివరించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షాకీర్‌హుసేన్, సీఐ రాజు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వారిచ్చిన ఆధారాల మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజమ్మ ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగల కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. -
కాలానికి నిలిచిన ‘గడియారం’ కృషి
అతడు నిజంగానే అనేక యుద్ధములలో ఆరితేరిన వృద్ధమూర్తి. జీవించింది ఎనభై ఏడేళ్ళు. స్వాతంత్య్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, సంఘ సంస్కరణ, నిజాం వ్యతిరేక పోరాటం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన ఉద్యమాల్లో పాల్గొన్న వజ్ర సంకల్ప సదృశ నాయకత్వం, కవితా రచన, పత్రికా రచన, శాసన పరిశోధన, కావ్యాలంకార నాటక వ్యాకరణాది శాస్త్ర పాండిత్యం, అనువాదం, నాటక సమాజస్థాపన, నటన, దర్శకత్వం వంటి సాంస్కృతికాభ్యుదయ శాఖల్లో సాంద్రతరమైన కృషితో తాను సంచరించిన తెలంగాణను వెలిగించిన బహుముఖీన ప్రతిభామూర్తి గడియారం రామకృష్ణశర్మ. 1919 మార్చి 6 న అనంతపురం జిల్లాలో జన్మించారు. బాల్యదశలోనే తెలంగాణలోని ఆలంపురం వచ్చారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య సాఫీగా సాగలేదు. 4వ తరగతిలో లెక్కల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఆగిపోయింది. కానీ ఆ కాలంలో తెలుగుమీద విశేషమైన అభిమానాన్ని ఏర్పరుచుకొని నవలలు, కాశీమజిలీ కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన ప్రబంధాలు అధ్యయనం చేశారు. 16 ఏండ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. సంçస్కృతంలో కావ్య, నాటక, అలంకార శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి పదేళ్లు తానే సంస్థ నిర్వాహకునిగా, నాటక దర్శకునిగా, ప్రధాన పాత్రల నటునిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్ర మహాసభకు తాలూకా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పల్లెల్లో గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలల స్థాపన, స్థానికంగా, రాష్ట్రస్థాయిలో జరిగే సభలు, సమావేశాలకు వెళ్ళడంతో ముఖ్య నాయకునిగా రూపొందారు. 1942 మే నెలలో వరంగల్ సమీపంలోని ధర్మవరంలో నవమ ఆంధ్ర మహాసభ, 1943 మేలో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో దశమాంధ్ర మహాసభ జరిగాయి. అప్పుడే ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రారంభమైంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా బులెటిన్లు విడుదల చేస్తూ ‘భాగ్యనగర్ రేడియోను’ ప్రారంభించి ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా నిడుజురాలో పదేళ్ళ వయసు గల బాల వితంతువుకు పునర్వివాహం చేయించారు. అట్లా 5–6 వితంతు పునర్వివాహాలు చేయించడమే గాక స్వయంగా వితంతువును వివాహం చేసుకున్నారు. కులబహిష్కార దండనను ధైర్యంగా ఎదు ర్కొని నిలిచారు. 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆలంపురంలో సప్తమ మహాసభలు జరుపుకున్నది. సభల్లో 30వేల మంది పాల్గొనడం ఒక రికార్డు. 1953లో గడియారం ‘సుజాత’ పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్ళపాటు నడిపారు. తెలంగాణ ప్రత్యేక సంచికను వెలువరించారు. లిపిశాస్త్రం, శాసన శాస్త్రాలపై ప్రావీణ్యం సముపార్జించారు. బ్రహ్మీ, వేంగీ లిపి, తెలుగన్నడ లిపి, తెలుగు లిపి, నాగరిలిపులను నేర్చుకున్నారు. ఆలంపూరులోని దాదాపు అన్ని శాసనాలకు పాఠాలు తయారు చేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలిలో వున్న శాసన ప్రతి కృతులను చదివి తెలంగాణ శాసనాల రెండో భాగానికి సంపాదకత్వం వహిం చారు. ‘ఆలంపూరు శిథిలాలు’, ‘ఆలంపూరు చరిత్ర’, ‘దక్షిణ వారణాసి’, ‘దిమాన్యుమెంట్స్ ఆఫ్ ఆలంపూరు’, ‘ఉమామహేశ్వర చరిత్ర’, ‘బీచుపల్లి క్షేత్ర చరిత్ర’, ‘అనిమెల సంగమేశ్వర చరిత్ర’ రాశారు. పరిషత్తు విద్యార్థులకోసం ‘భారతదేశ చరిత్ర’ను నూతన దృక్పథంతో రాశారు. దేవాలయ నిర్మాణ రీతులను అధ్యయనం చేసి ‘భారతీయ వాస్తు విజ్ఞానము’, ‘మన వాస్తు సంపద’, ‘ఆంధ్రుల వాస్తు వైభవం’ గ్రంథాలను ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. విశిష్ట సభ్యునిగా గౌరవించబడ్డారు. మంచన ‘కేయూర బాహు చరిత్ర’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లను పరిష్కరించి విపుల పీఠికలు రాశారు. కన్నడలోని ‘కవి గదాయుద్ధ’ కావ్యాన్ని, ‘కన్నడ సణ్ణక తెగళ్ళు’ అనే గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తెలుగులోకి అనువాదం చేశారు. గదాయుద్ధానికి అనువాద పురస్కారం లభించింది. కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు. (తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నేడు గడియారం శతజయంతి సమాపనోత్సవం) వ్యాసకర్త: డా, జె.చెన్నయ్య తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి -
రైతు బాంధవుడు కేసీఆర్
సాక్షి, అలంపూర్: రైతు బాంధవుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వీఎం అబ్రహం కొనియాడారు. అలంపూర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉండవెల్లి మండలం మెన్నిపాడుకు చెందిన మాజీ సర్పంచ్ మహేందర్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అబ్రహం వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అభివృద్ధికి సహకరించిన టీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అలంపూర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆశీర్వదిస్తే అలంపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోరారు. రామకృష్ణ, గిడ్డయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఈదన్న, కృష్ణ, నరేష్, రాఘవేంద్ర, మహేష్, మహాలక్ష్మి, మారెమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం.. రాజోళి: రానున్న ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అబ్రహంను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటేశ్వరమ్మ గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని తుమ్మలపల్లెలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 150 మంది టీఆర్ఎస్లో చేరారు. మాజీ సర్పంచ్ మోచి హుస్సేన్, మాణిక్య రెడ్డి, విక్రమసింహా రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి మానవపాడు: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. గురువారం మండలంలోని జల్లాపురం, పల్లెపాడు, చండూరు గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం అబ్రహంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథం మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతోనే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. త్వరలో ఆర్డీఎస్ ద్వారా సాగునీటిని అందించనున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ను ఆదరిస్తున్నారన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసి చూపిందన్నారు. శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆత్మలింగారెడ్డి, రాజశేఖర్, రోశన్న, మురళీధర్‌రెడ్డి, అయ్యన్న, లింగారెడ్డి పాల్గొన్నారు. -
అయ్యో దేవుడా..!
సాక్షి,ఇటిక్యాల (అలంపూర్): కుటుంబ సభ్యులు, బంధువులంతా కలిసి కారులో వెళ్లి.. తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్నారు.. సంతోషంగా తిరుగు ప్రయాణమైన వారిని అతివేగం, నిద్రమత్తు రూపంలో మృత్యువు వెంటాడింది.. వేగంగా దూసుకొచ్చిన కారు.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న ఓ గొర్రెల కాపరిపైకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరితోపాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని వేముల గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆయువు తీసిన అతివేగం సికింద్రాబాద్‌లోని లాలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు స్వాతి, స్వప్న, వారి భర్తలు మహేష్, యాదగిరి, పిల్లలు స్వీటి, వైష్ణవి, నితిన్‌లతో కలిసి తిరుపతికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున కారులో సికింద్రాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని వేముల స్టేజీ వద్ద జాతీయ రహదారిపై యాదగిరి వేగంగా కారు నడుపుతూ.. నిద్రమత్తులోకి జారుకున్నాడు. వెంటనే కారు రోడ్డు పక్కన గొర్రెలు మేపుతున్న రాధాకృష్ణ పైకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి రాధాకృష్ణ(46)తోపాటు కారులో ప్రయాణిస్తున్న మహేష్(52), ఆయన కుమార్తె వైష్ణవి(14), యాదగిరి కుమార్తె స్వీటి(8) మృతి చెందారు. యాదగిరి, స్వప్న, స్వాతి, నితిన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అలంపూర్ సీఐ రజితారెడ్డి, ఇటిక్యాల ఎస్ఐ జగదీశ్వర్, పోలీసు లు హైవే అంబులెన్స్‌లో క్షతగాత్రులను కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. రాధాకృష్ణది ఇటిక్యాల మండలంలోని కోదండాపురం స్వగ్రామం. రాధాకృష్ణకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
సాక్షి, అలంపూర్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సతీమణి మహాలక్ష్మి అన్నారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపురంలో గురువారం తాజా మాజీ సతీమణి సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడ్డాకుల రాము, రుక్ముద్దిన్, ఇంతియాజ్ అలీ ఉన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫీ వర్తింపజేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంతప్‌కుమార్ అన్నారు. అలంపూర్ మండలంలోని లింగనవాయి, క్యాతూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాముడు, జయరాముడు పాల్గొన్నారు. శాంతినగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు చేసిందేమిలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అన్ని విధాలా చేయూతనందిస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి అన్నారు. వడ్డేపల్లి మండలంలోని బుడమొర్సులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సతీమణి మాట్లాడారు. ఏడాదికి ఆరు సిలిండర్లు, ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటు తదితర పథకాలను వివరించారు. పేదల పక్షపాతి.. ఇటిక్యాల: పేదలకు అన్ని విధాలుగా అండదండలు అందించేది కాంగ్రెస్ పార్టీయేనని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఉదండాపురం, సాతర్ల, వావిలాల, శివనాం పల్లి, పెద్దదిన్నె, గోపాల్ దిన్నె గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వీఎస్టీ కంపెనీ స్టేజీ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మండలంలో పలు గ్రామాల యువత సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రిజర్వాయరును నిర్మిస్తాం... వచ్చే డిసెంబరు మాసంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని అప్పుడు సాగునీటికి పెద్దపీట వేస్తామని అన్నారు. ఆయన వెంట లక్ష్మినారయణ రెడ్డి, అనంతరెడ్డి, సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి, పరమేశ్వరెడ్డి, ఎర్రసత్యం, నర్సింహులు ఉన్నారు. మానవపాడు: మండల పరిధిలోని పెద్దపోతులపాడులో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. బోరవెల్లి శేషిరెడ్డి, జగన్మోహన్, రవి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అయిజ: కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని యాపదిన్నె, గుడుదొడ్డి, వెంకటాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు మేలు రాజోళి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల నుంచి వృద్ధుల సంక్షేమం వరకు అందరి కోసం చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురుంచి తెలిపారు. జయన్న, దస్తగిరి, సుధాకర్ రెడ్డి, షాలు, చల్లా యూత్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి, హసన్ పాల్గొన్నారు. -
నాలుగు కేజీల స్వర్ణాభరణాలు స్వాధీనం
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం రవాణాను నియంత్రించడానికి తెలంగాణ – ఏపీ రాష్ట్రాల కు సరిహద్దుగా ఉన్న పుల్లూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్–2 బృందం అధికారి పాండురంగరావు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన తనిఖీల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న నరసింహారావు, అమర్నాథ్ కారును పరిశీలించగా బంగారు ఆభరణా లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సరైన పత్రా లు లేకపోవడంతో 4 కిలోల బంగారు ఆభరణా లను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
తల్వార్ దూసిన జానా, విజయశాంతి..!
సాక్షి, గద్వాల : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీ కాంగ్రెస్ నేతలు గురువారం ఆలంపూర్లోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు జానారెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం కాంగ్రెస్ నేతలు లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలంపూర్లో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ నేతలు పలు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బ్యాండ్ వాయించగా.. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క శంఖం పూరించారు. ఇక, సీనియర్ నేత జానారెడ్డి తనదైన శైలిలో తల్వార్ దూసి.. ఫొటోలకు పోజు ఇవ్వగా.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, సీనియర్ నేత డీకే అరుణ సైతం తల్వార్ ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారభేరీని మోగించారు. ఆలంపూర్ నుంచి శాంతినగర్, వడ్డేపల్లి, ఐజల మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ కాంగ్రెస్ నేతలు సాయంత్రానికి గద్వాల చేరుకున్నారు. గద్వాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీని రద్దుచేసి.. ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుండగా.. లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ గద్వాల సభతో ప్రచార పర్వానికి తెర తీస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, మహాకూటమి అవసరాన్ని ప్రజలకు చాటిచెప్పడం, కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టడం లక్ష్యంగా గద్వాల బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
వాట్సాప్ అడ్మిన్లూ జాగ్రత్త!
అలంపూర్ రూరల్ : మండలంలోని ఉట్కూరుకు చెందిన ప్రవీణ్ తన వాట్సాప్‌కు ఎవరో మెసేజ్ పంపారని చెప్పి ‘పిల్లలను ఎత్తుకెళుతున్నారు.. చంపేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి..’ అంటూ వాయిస్ మెసేజ్ ఫొటోలు అనేక మందికి పంపి ఆందోళనకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐ రంజితారెడ్డి బుధవారం సాయంత్రం ఆ గ్రామానికి వెళ్లి సదరు యువకుడిని పిలిపించి మందలించారు. ఆ పోస్ట్ చేసింది నీవేనా? ఎందుకు చేశావ్.. అని ప్రశ్నించారు. తనకు ఎవరో పంపారని అందరినీ అప్రమత్తం చేసేందుకు తాను ఫార్వర్డ్ చేశానని తెలపగా మరోసారి ఇలా చేయొద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. ముఖ్యంగా వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. సోషల్ మీడియాను మంచికి మాత్రమే వాడాలని ఆమె సూచించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగడం లేదని అందరూ ప్రశాంతంగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శరణప్ప తదితరులు ఉన్నారు. -
అన్నదాతల ఆక్రోశం
అయిజ (అలంపూర్) : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. రైతులు తాము పండించిన పంటలను దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం, హాలియా నాఫెడ్ వారి ఆధ్వర్యంలో హాకా ద్వారా గిట్టుబాటు ధరకు కందులు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 1న అయిజ మార్కెట్ సబ్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇక్కడ మద్దతు ధర రూ.5,250 కాగా బోనస్ రూ.200 కలిపి మొత్తం రూ.5,450కు కొ నుగోలు చేయాలి. ఈ మేరకు సబ్ యార్డుకు రైతులు ప్రతిరోజు సుమారు 300 నుంచి 500 క్విం టాళ్ల కందులు తెస్తుండగా 250 నుంచి 300 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 200 క్వింటాళ్ల కందులు మి గిలిపోతున్నాయి. సంచుల కొరత ఎక్కువగా ఉండడంతో కందుల కొనుగోళ్లు సైతం మందగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేయింభవళ్లు పడిగాపులు.. ఇదిలా ఉండగా హమాలీలకు హాకా నుంచి సుమారు రూ.90 వేలు కూలీలు చెల్లించాల్సి ఉంది. దీంతో హమాలీలు మార్కెట్ యార్డులో పనిచేసేందుకు నిరాసక్తి చూపుతున్నారు. దాని వలన వేల క్వింటాళ్ల కందులు మార్కెట్ యార్డులో పోగవుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కందులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు రేయింభవళ్లు కందుల కుప్పల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఆగ్రహించిన రైతులు గురువారం ఏకంగా నగరపంచాయతీలోని పాతబస్టాండ్ చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండుగంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అధికారులతో మాట్లాడుతామని, రోడ్డుపై నుంచి వెళ్లిపోవాలని రైతులను కోరారు. దానితో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు. ఐదురోజుల నుంచి కాపలా.. ఆదివారం అయిజ మార్కెట్ యార్డుకు 40 సంచులు కందులు తెచ్చా. ఇంతవరకు కొనలేదు. రాత్రీపగలు కందుల వద్ద కాపలా ఉంటున్నాం. తిండి తినడానికి కూడా కష్టమైంది. రాత్రిపూట చలికి వణికిపోతున్నా. అధికారులను బతిమలాడినా కందులు కొనకపోవడంతో రోడ్డుమీదకు వచ్చాం. – రాముడు, రైతు, తాండ్రపాడు, రాజోళి మండలం సమస్యలను పరిష్కరిస్తాం.. తేమశాతం ఎక్కువ ఉండడంతో కొంతమంది రైతుల కందులు కొనుగోలు చేయలేదు. సంచుల కొరత ఉన్నందుకు కొంత మేరకు పనులు మందగించాయి. హమాలీలకు కూలీలు చెల్లించకపోవడంతో వారు పనులకు సరిగా రావడంలేదు. సంచుల కొరత లేకుండా చేసి, హమాలీలకు కూలీలు చెల్లించేలా కృషిచేస్తాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ -
అక్షరాలా పండుగే..
దేవరకద్ర రూరల్: అరవై నాలుగేళ్ల క్రితం రవాణా సౌకర్యాలు కూడా లేని పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతంలో రాష్ట్రస్థాయి సాహిత్య సభలను దిగ్విజయంగా నిర్వహించారంటే ఆశ్చర్యం కలగక మానదు! ఇప్పటి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 1953లో ఈ సభలు జరిగాయి. ఈ సభల కోసం ఉపరాష్ట్రపతినే ఆహ్వానించడం, అలంపూర్ సభలకు వచ్చే సాహిత్య ప్రముఖుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం, 4 వేల మందికి పైగా హాజరైన అతిథులకు ఎలాంటి లోటు లేకుండా భోజన, వసతి కల్పించడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గడియారం రామకృష్ణ శర్మ రాసిన శతపత్రం పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. ఆ విశేషాలు ఇవీ... వంటకాల్లో లడ్డూ, పులిహోర సభలకు వచ్చే అతిథులకు చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీశైలం నుంచి 13 మంది వంట మనుషులను రప్పించారు. పూటకు 4 వేల మంది భోజనం చేస్తారని భావించగా.. 30 వేల మంది వరకు హాజరయ్యారు. అయినా ఎక్కడా లోటు లేకుండా భోజనాలు సమకూర్చారు. అది సంక్రాంతి సమయం కావడంతో ఆహూతులందరికీ లడ్డూ, పులిహోరా వడ్డించారు. ప్రత్యేక రైలుకు రూ. 5వేలు ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు సభలకు హాజరయ్యారు. ఇందుకు రూ.5 వేలు చెల్లించి ప్రత్యేకంగా రైలు బుక్ చేశారు. నిజాం నవాబు ఉపయోగించే ప్రత్యేక బోగీలో ఉపరాష్ట్రపతి సర్వేపల్లితో పాటు మంత్రిమండలి సభ్యులు హాజరయ్యారు. అలంపూర్‌కు చేరిన సర్వేపల్లికి సాహితీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఈ రైల్లో వచ్చిన 700 మందిని ట్రక్కుల్లో అలంపూర్ చేర్చారు. అనంతరం సర్వేపల్లి సభలను లాంఛనంగా ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశానికి గడియారం రామకృష్ణశర్మ స్వాగతం పలకగా సర్వేపల్లి తెలుగులో స్వాగత వచనాలు పలకడం విశేషం. నాలుగు రోజులు అంగరంగవైభవంగా 1953 జనవరి 11, 12, 13, 14వ తేదీల్లో నాలుగు రోజుల పాటు ఆంధ్రసారస్వత పరిషత్ ఏడో వార్షికోత్సవ సభలను నిర్వహించారు. అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామానుజరావు.. ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ సభలకు హాజరయ్యేలా ఒప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్టారావు పూర్తిగా సహకరించారు. నెలరోజుల పాటు సమాచార శాఖకు సంబంధించి మినీ బస్సులు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. 200 సినిమా హాళ్ల ద్వారా ప్రచారం ఈ సభల నిర్వహణ సమాచారం తెలిసేలా ఉమ్మడి రాష్ట్రంలోని రెండు వందల సినిమా హాళ్లలో స్లైడ్ల ద్వారా ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోడపత్రికలు, కరపత్రాలను పంపిణీ చేశారు. కాళోజీ ‘నా గొడవ’ ఆవిష్కరణ ఈ సభల్లోనే ప్రజాకవి కాళోజీ రాసిన ‘నా గొడవ’ కవితా సంపుటిని ప్రముఖ కవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. సాహిత్య చర్చలతో పాటు ప్రముఖుల రాకతో సభా ప్రాంగణాలు కళకళలాడాయి. -
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: చాడ
సాక్షి, హైదరాబాద్: ‘‘అక్టోబర్ 2009లో నీటి ఉధృతికి అలంపూర్‌లోని పాకలివీధిలో దాదాపు 800 ఇళ్లు కూలిపోయి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, 2015లో ముఖ్యమంత్రి హోదాలో మీరు అలంపూర్‌కు వచ్చినప్పుడు అక్కడి నిర్వాసితులు మీకు విజ్ఞాపన పత్రం ఇచ్చి మూడేళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది’’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు 10వ బహిరంగ లేఖ రాశారు. -
అదిగో అలంపురం
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల్ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. నవబ్రహ్మ ఆలయాలు ఇవి ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండటం, వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడం కూడా విశేషం. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. నవబ్రహ్మల ఆలయాలన్నీ శివాలయాలే. బ్రహ్మ ప్రతిష్ఠించిన కారణంగా ఆ పేరు వచ్చింది. ప్రధాన ఆలయంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వరుడు వెలసి ఉన్నారు. అక్కడ కాశీ... ఇక్కడ హేమలాపురం. అలంపురం పూర్వనామం హేమలాపురం. అయితే ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ హేమలాపురం, హతంపురం, యోగుళాపురం, జోగుళాపురం అని రూపాంతరం చెందుతూ ప్రస్తుతం అలంపురం క్షేత్రంగా వ్యవహారంలోకి వచ్చింది. కాశీలో ఉత్తరవాహిని గంగానది... అయితే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్రా నది. కాశీలో ఉన్నట్లే అలంపురంలో కూడా 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా జోగుళాంబ దేవి అలంపురంలో వెలసి ఉన్నారు. గోష్పాద ముద్రిత లింగం! సర్వసాధారణంగా లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ అలంపుర క్షేత్రంలో మాత్రం బాలబ్రహ్మేశ్వరుడు గోష్పాద ముద్రిత రసాత్మక లింగంగా వెలసి ఉన్నాడు. ఆవుపాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలసి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహంలో అనేకమైన రసాలు వెలువడుతుండగా రస సిద్ధులు కొందరు ‘పరశువేది’ అనే మూలికసహాయంతో ఆ రసాలను మిళితం చేస్తూ ఈ విగ్రహంలో నుండి బంగారాన్ని తయారు చేశారు. తద్వారా ఆ బంగారంతో ప్రధాన ఆలయానికి శైవక్షేత్రాలకు తలమానికంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవటం వెలసి ఉన్నాయి. దాదాపు 14 వందల సంవత్సరాల క్రితం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల వంశంలో రెండవ పులకేశి ఈ ఆలయాలను నిర్మించినట్టు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. షణ్మతాలకు నిలయంగా ఇక్కడ సౌర, శాక్తేయ, కౌమార, గాణపత్య, ౖÔð వ, వైష్ణవ వైదికాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. బాలబ్రహ్మేశ్వరుడు పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మకారణం చేత పరమేశ్వరుడు వెలసినందుకు ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడు అని, విగ్రహం చిన్నదిగా ఉన్నందున బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. ఈ విగ్రహానికి ఆనుకుని విష్ణువుకు ప్రతిరూపమైన సాలగ్రామం వెలసింది. అందుకే శివాయ విష్ణు రూపాయ... శివరూపాయ విష్ణవే...అంటూ ఈ శైవæక్షేత్రంలో ధనుర్మాస పూజలు కూడా నిర్వహిస్తారు. పాప వినాశి తీర్థం! అలంపురానికి దక్షిణాన అరమైలు దూరంలో 24 ఆలయాల సముదాయమైన పాపనాశిని తీర్థం ఉన్నది. అది అష్టాదశ తీర్థాలలో ఎంతో ప్రాముఖ్యతగలది. మిగిలిన తీర్థాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. 24 ఆలయాల సముదాయం... ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతలో తులతూగుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ చిన్న, చిన్న గుడులు నిర్మించారు. ద్రావిడ, వేసర సంప్రదాయాలకు చెందిన ఆలయాలుగా వీటిని గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తర, దక్షిణ మూలలలో చక్కని ఆలయాలు, మంటపాలు ఉన్నాయి. వాటిలో స్తంభాల పైన రామాయణ గాథ శిల్పాలు, క్షీరసాగర మథనం, అపూర్వ రమణీయతలను చాటుతున్నాయి. ఈ తీర్థం శ్రీశైలం ప్రాజెక్టు మునకలో పోయినందున అక్కడి నుండి కిలోమీటర్ దూరంలో ఈ పాప వినాశిని పునః నిర్మాణం చేశారు. ‘‘లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం‘‘ అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన స్తోత్రంలో ఈ ధ్యాన శ్లోకాన్ని పేర్కొన్నారు. పూర్వం దక్షప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో అందరి ముందు శివనింద చేయడంతో అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్ని కల్పించుకుని తాను దేహత్యాగం చేసుకుంటుంది. ఈ విషయాన్ని పరివారగణం ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై వచ్చి అక్కడి యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజ స్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. పరమేశ్వరుడి కోపాగ్ని చల్లార్చేందుకు శ్రీ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 శకలాలుగా విభజిస్తారు. ఆ భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడగా ఆది శంకరాచార్యుల వారు వాటికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అవే నేడు 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. అందులో అలంపూర్‌లో దంతపంక్తి పైభాగం పడింది. అదే జోగుళాంబ శక్తిపీఠం. నవబ్రహ్మ ఆలయాలు ప్రధాన ఆలయ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, పద్మ, సర్గ బ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల మీద అష్ట దిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు, ముగ్ధ మనోహరంగా భావ గాంభీర్యం చెడకుండా సృష్టించబడ్డాయి. ఈ శిల్ప సౌందర్యం దేశ విదేశ విద్వాంసులు నుంచి ప్రశంసలు పొందింది. గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుషాది మూర్తులు చూపరులకు రమణీయంగా నిలిచాయి. ఇక్కడి శిల్పాల పైన మానవ మిథునాలు, పంచతంత్ర కావ్య కథా శిల్పాలు ఆదిత్యహృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార , నయన, ప్రియన్, శ్రీ కంఠాచార్యన్ తదితర శిల్పాచార్యుల పేర్లు నేటికి కనబడుతాయి. సమీపంలో... యోగనారసింహస్వామి ఆలయం ఉంది. దీనిని ప్రహ్లాద రాయలు నిర్మించారు. లక్ష్మీదేవి, గణపతి, ఆళ్వారులు, అనంత పద్మనాభస్వామి, ఆంజనేయస్వామి వెలసి ఉన్నారు. 14వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. – దిండిగల్ ఆనంద్‌శర్మ, సాక్షి అలంపూర్ -
నేడే యూపీ ఐదో దశ పోలింగ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని 51 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎస్పీ అభ్యర్థి కనౌజియా మరణంతో ఆలంపూర్ స్థానంలో పోలింగ్ వచ్చేనెల 9న జరగనున్నది. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆదివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
జోగులాంబ జిల్లా సమగ్ర స్వరూపం
జోగులాంబ (గద్వాల) జిల్లా కలెక్టర్: రజత్‌కుమార్ షైనీ ఎస్పీ: విజయ్‌కుమార్ ఇతర ముఖ్య అధికారులు జాయింట్ కలెక్టర్: సంగీత అడిషనల్ ఎస్పీ: శ్రీనివాసరావు డీఈవో: వేణుగోపాల్ డీఎంహెచ్‌వో: కష్ణ డీటీవో: లెక్కల కష్ణయ్య జిల్లా ప్రాజెక్టుల సీఈ: ఖగేందర్ పశు సంవర్ధకశాఖ జేడీ: ధన్‌రాజ్ మండలాలు: 12 గద్వాల, కేటీదొడ్డి (కొత్త), ధరూరు, గట్టు, మల్దకల్, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయిజ, రాజోళి (కొత్త), ఉండవెల్లి (కొత్త). రెవెన్యూ డివిజన్: గద్వాల మున్సిపాలిటీలు: గద్వాల, అయిజ(నగర పంచాయతీ), గ్రామ పంచాయతీలు: 190 భారీ పరిశ్రమలు: గద్వాల, అయిజ చుట్టూ పత్తి విత్తనోత్పత్తి డీలింట్ పరిశ్రమలు, ఎస్ఎన్ఎస్ స్టార్చ్ పరిశ్రమ, బీచుపల్లిలో పొట్టుతో విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమ సాగునీటి ప్రాజెక్టులు: జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల, తుమ్మిళ్ల, గట్టు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాలు ఎంపీ: నంది ఎల్లయ్య(నాగర్‌కర్నూలు) ఎమ్మెల్యేలు: డీకే అరుణ (గద్వాల), సంపత్‌కుమార్ (అలంపూర్) పర్యాటకం, దేవాలయాలు అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు. బీచుపల్లి ఆంజనేయస్వామి, చింతరేవుల ఆంజనేయస్వామి, మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, గద్వాల జమ్మిచేడు జములమ్మ, జూరాల ప్రాజెక్టు, గద్వాల కోట, నిజాంకొండ జాతీయ రహదారి: 44 (బీచుపల్లి–పుల్లూరు) రైల్వేలైన్: గుంతకల్ డివిజన్లో గద్వాల రైల్వేస్టేన్ జంక్షన్‌గా ఉంది. గద్వాల–రాయచూర్ మధ్య 55 కి.మీ రైల్వేలైన్ గద్వాల నుంచి హైదరాబాద్‌కు: 180 కి.మీ. ఖనిజ సంపద: రాతి గుట్టలు -
జోగులాంబకు పట్టువస్ట్రాలు సమర్పించిన కలెక్టర్
కర్నూలు న్యూసిటీ: అలంపూర్‌లోని జోగులాంబ దేవికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ శనివారం రాత్రి పట్టువస్ట్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గాయత్రి దేవి, ఎల్లమ్మ దేవాలయం ఈవో రామాంజనేయులు, కర్నూలు ఈవో దినేష్, నందికొట్కూరు ఈవో వీఆర్‌కె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్‌ను వనపర్తిలో కలపొద్దు
హైపవర్ కమిటీకి ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌ల వినతి సాక్షి, హైదరాబాద్: రెండు నదుల మధ్య ఉన్న అలంపూర్, గద్వాల (నడిగడ్డ) నియోజకవర్గాలను యథాతథంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, రాజకీయ ప్రయోజనాల కోసం అలంపూర్‌ను వనపర్తి జిల్లాలో చేర్చితే చారిత్రక తప్పిదమవుతుందని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సభ్యులకు, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌కు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ, జోగులాంబ జిల్లా కోసం ఉద్యమాలు చేసి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయితే అలంపూర్ నియోజకవర్గంతోపాటు కొత్తగా ఏర్పాటు కానున్న ఉండవల్లి మండలాన్ని వనపర్తిలో కలుపుతున్నారని వచ్చిన వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దేవాలయం ఉన్న అలంపూర్ లేకుండా జోగులాంబ జిల్లా ఏర్పాటు చారిత్రక తప్పిదమవుతుందన్నారు. తప్పిదాలకు తావులేకుండా గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాకు సరైన రూపం ఇవ్వాలని ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించామన్నారు. సంపత్‌కుమార్ మాట్లాడుతూ, అలంపూర్‌ను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారనే వార్తలతో.. జోగులాంబ జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్న సంతోషం నాలుగు రోజుల్లో మటుమాయమైందన్నారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను సంపూర్ణంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, అలా చేయని పక్షంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేసినట్లవుతుందని అన్నారు. -
శ్రమజీవుల హక్కులకు భంగం
– అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం అలంపూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన విధానాలతో శ్రమ జీవుల హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత రంగాన్ని అసంఘటిత రంగంగా మార్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయన్నారు. కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను ఉగ్యోగంలోకి తీసుకోవడాన్ని కాంట్రాక్టర్లకు కట్టెబెట్టిందన్నారు. దీని వలన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేకుండా చేసిందన్నారు. ఇదే విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తూ వారికి తక్కువ వేతనాలు ఇస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్న చట్టాలలో 44 చట్టాలను నాలుగు విభాగాలుగా విభజించి వాటిని సవరణలు చేసి కార్మికుల హక్కులను కాలరాయలని చూస్తోందన్నారు. 15 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సెప్టెంబర్ సమ్మెలో పాల్గొని తమ నిరసన గళం వినిపించారన్నారు. అయినా ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకుని ఉద్యోగ, కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించకపోగా కార్మిక వర్గంపై మరిన్ని దాడులకు తెగబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా 2016 సెప్టెంబర్ 2వ తేదిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు చిర్రా రవి, డీటీఎఫ్ నాయకులు రామ్మోహన్, శ్రీనివాస్, హరి నరోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా అలంపూర్ ఉర్సు
అలంపూర్/అలంపూర్‌రూరల్: షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉర్సు రెండవ రోజు సర్ ముభార్ దర్గాలో శుక్రవారం చిన్న కిస్తి పోటీలు జరిగాయి. మొక్కులు తీర్చుకోనే వారు కిస్తిల్లో పలావ్, మిఠాయిలను వేయగా అక్కడే ఉన్న పహిల్వాన్లు వాటిని వీక్షకులపై విసిరారు. సరదగా సాగిన ఈ కిస్తి పోటీలను వీక్షించడానికి చట్టు పక్కల గ్రామాలు, సూదూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ఉర్సు సందర్భంగా ప్రధాన వీధుల్లో దుకాణాలు, రంగల రట్నాలు వెలిశాయి. ఉర్సు మూడవ రోజు ధడ్ ముభారక్ దర్గాలో పెద్ద కిస్తి పోటీలు జరగనున్నాయి. -
25 నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు
– ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత అలంపూర్ : ఈ నెల 25వ తేది నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు దర్గా అభివద్ధి కమిటీ సభ్యులు చైర్మన్ సయ్యద్ షా అహ్మద్ ఒవైసీ ఖాద్రి, కమిటీ అధ్యక్షుడు ఖ్వాజ రుక్ముద్దిన్, ఉపాధ్యాక్షులు షఫీ అహ్మద్, ముక్తార్ బాష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముజీబ్, కార్యదర్శులు ఎండీ జాఫర్, ఖాసీమ్ మియ్యలు ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కలిసి ఉర్సు ఉత్సవాలకు వసతులు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ జయరాముడుకు సైతం ఉర్సు ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 25వ తేదిన షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవం ఉంటుందని వారు పేర్కొన్నారు. 26వ తేదిన సర్ ముభార్ దర్గాలో చిన్న కిస్తీలు, 27వ తేది ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు, 28వ తేది మహిళల ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగియనున్నట్లు వారు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా భక్తులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించాలని తహసీల్దార్ మంజులను కలిసి విన్నవించారు. -
అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌పై టీఆర్‌ఎస్‌నజర్!
* పుష్కర పర్యటన పొడవునా ఆయనకు ప్రాధాన్యమిచ్చిన సీఎం * అలంపూర్‌కు వరాలు... సంపత్ విజ్ఞప్తి వల్లేనంటూ వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు పర్యటన ఆసాంతం అధిక ప్రాధాన్యమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం బస చేసిన స్థానిక పర్యాటక శాఖ అతిథి గృహానికి వెళ్లిన సంపత్‌కు ఊహించని ఆదరణ లభించింది. సీఎంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గ సమస్యలను నివేదించారు. మంత్రులు, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరితోనూ పర్యటనలో సీఎం ఇలా ప్రత్యేకంగా భేటీ కాలేదు. సంపత్‌కు ఆయన ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై పలు ఊహాగాలు వెలువడుతున్నాయి. సంపత్ తన అలంపూర్ నియోజకవర్గ సమస్యలపై పలు వినతిపత్రాలను సీఎంకు అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. సీఎం స్థాయి నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యలు తదితరులు ఇలా వినతిపత్రాలివ్వడం పరిపాటే అయినా, సంపత్ వినతుల్లో చాలావాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి కేసీఆర్ మొగ్గుచూపారు! అంతేగాక అక్కడికక్కడ విలేకరుల సమావేశంలోనే అలంపూర్‌పై వరాల జల్లు కురిపించడం మరింత ఆసక్తి రేపుతోంది. అంతేకాదు... అలంపూర్‌కు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించిన సీఎం, ఈ విషయాన్ని సంపత్ తన దృష్టికి తెచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు! అలాగే, ‘‘సంపత్ కోరినట్టుగా ఆర్టీసీ డిపో మంజూరు చేయలేం. కాకపోతే ఆయన కోరినట్టుగా ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ నుంచి సాగునీరు అందజేస్తాం’’ అంటూ విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సంపత్ పేరును సీఎం పదేపదే ఉటంకించారు. అంతేగాక మీడియా సమావేశం ప్రారంభమవగానే సంపత్‌ను సీఎం తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇది కూడా సీఎం ఆయనకిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమేనని అంటున్నారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ సమస్యలను సీఎం ప్రస్తావిస్తూ వీలైనప్పుడల్లా సంపత్ పేరును ఉటంకించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేత అని, పలు అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని కూడా అన్నారు. ఇదంతా భావి రాజకీయ పరిణామాలకు సూచికేనని టీఆర్ఎస్ శ్రేణులే అంటుండటం విశేషం! అయితే సంపత్ మాత్రం తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాననని, పేదల సమస్యలను విన్నవించడం తప్ప తమ భేటీకి మరో ప్రాధాన్యమేమీ లేదని కొందరు పాత్రికేయులతో అనడం విశేషం. -
సకల సౌభాగ్యాలు ప్రసాదించు తల్లీ
– జోగుళాంబ అమ్మవారిని దర్శించి పూజించిన సీఎం కేసీఆర్ – ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుటుంబ సమేతంగా రాక అలంపూర్ / అలంపూర్‌రూరల్/ మానవపాడు : ‘అమ్మా జగజ్జననీ.. లోకపావనీ రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అలంపూర్‌లోని ఐదోశక్తి పీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను కుటుంబ సమేతంగా సీఎం హోదాలో తొలిసారిగా దర్శించుకున్నారు. అంతకుముందు వారిని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఏసీ కష్ణ, ఈఓ గురురాజ, ఆలయ అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదట బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు. వారికి ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ క్షేత్ర ప్రాశస్థ్యాన్ని తెలియ జేసి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. కరపత్రం లేదా? అమ్మవారి ఆలయాన్ని తెలియజేసే బ్రోచర్, పుస్తకం, కరపత్రం వంటి వాటిని ముద్రించలేదా..? అని సీఎం కేసీఆర్ అర్చకులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఏసీ కష్ణ వెంటనే ఆలయ చరిత్రను తెలియజేసే కరప్రతాలను సీఎంకు అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయాలను అభివద్ధిచేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన జనం సీఎంను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భద్రత కారణాల దష్ట్యా సెక్యూరిటీ బయటి వారిని లోపలికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆలయంలో సీఎం సుమారు గంట పాటు ఉన్నారు. -
పాత హామీలతో సరి!
– నిరాశపరిచిన సీఎం పర్యటన – అడుగడుగునా పోలీసుల ఆంక్షలు – ప్రజలను పలకరించని కేసీఆర్ అలంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ క్షేత్రానికి రావడంతో ఈ ప్రాంత అభివద్ధిపై ఆశలు చిగురించాయి. నల్లగొండ జిల్లాలోని యాదాద్రిని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్న సీఎం అదే తరహాలో శక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారి క్షేత్రాన్ని అభివద్ధిపరుస్తారని ఆకాంక్షించారు. సీఎం హోదాలో మొదటిసారి అలంపూర్ ఆయన వచిన్నా పర్యటన సాదాసీదాగా ముగిసింది. కేసీఆర్ ఎలాంటి వరాల జల్లులు కురిపించలేదు. ఆలయాల అభివద్ధికి అడ్డంకిగా ఉన్న పురావస్తు నిబంధనల సడలింపునకు యత్నిస్తానని మాత్రమే పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల పాలనలో అలంపూర్ క్షేత్రం నిరాదరణకు గురైందని చెప్పిన కేసీఆర్ స్వయంపాలనలో ప్రత్యేక నిధులు విదల్చకపోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇక ఆర్డీఎస్ నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య. దీని పరిష్కారానికి ఉన్న రెండు మార్గాలు గత ప్రభుత్వాల హయాం నుంచి చెబుతున్న హామీలే. ప్రస్తుత సీఎం సైతం తుమ్మిళ్ల ఎత్తిపోతలతో రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలంపూర్‌లో ఆర్టీసీ బస్‌డిపో లేదు. రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బస్సుల నిర్వహణ సమస్యగా మారింది. దీంతో డిపో ఏర్పాటు చేయాలని స్థానికంగా విన్నపాలు ఉన్నాయి. ఇదిసాధ్యం కాదని గతంలోనే కంట్రోల్ పాయింట్ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. ఇప్పుడూ అదే పరిశీలిస్తామని సీఎం చెప్పారు. అలంపూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నా హామీ సైతం గతంలోనే మంత్రులు ప్రకటించిందే. ఇదిలాంటే సీఎం రాక సందర్భంగా అలంపూర్‌లో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. దాదాపు వేయి మందితో సీఎం బందోబస్తు ఏర్పాటుచేశారు. రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు కేసీఆర్‌ను చూడానికి స్థానికులు, ప్రజాప్రతినిధులు టూరిజం హోటల్‌కు చేరుకున్నారు. అయితే లోపలికి ఎవరినీ అనుమతించలేదు. సీఎం బయటికి వచ్చిన సమయాల్లో కనీసం పలకరించడానికి, వారిని కలవడానికి, అభివాదం వంటివి చేయకపోవడం నిరాశ పర్చింది. సీఎం రాక, కష్ణా పుష్కరాలను పురస్కరించుకుని మీడియాకు డీపీఆర్ఓ ద్వారా పాస్‌లు జారీ చేసినా కవరేజీకి అనుమతించలేదు. -
పుష్కరాలకు శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి
-
పుష్కరాలకు శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి
- అలంపూర్ మహా పుణ్యక్షేత్రంలో విస్తృత సౌకార్యాలు సాక్షి,సిటీబ్యూరో కృష్ణాపుష్కరాలను పురష్కరించుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీశైలం, అలంపూర్ పుణ్యక్షేత్రాల్లో భక్తుల ర ద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా శక్తిపీఠం, అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం ఉన్నాయి. దీంతో భక్తులు మొదటి చూపు ఆ ప్రాంతాలపై ఉంది. రెండు ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లును చేశారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. శ్రీశైలంలో మూడు పుష్కర నగర్లు, ఘాట్లతో పాటు భక్తులకు స్వామి అమ్మవారి దర్శనం, అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్లో దర్శనం సులువుగా కల్గేటట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు మార్గం సుగమం చేశారు. పుష్కర నగర్లు - 1: శ్రీశైలంలోని యజ్ఞవాటిక ప్రదేశం వద్ద పుష్కర్ నగర్ -1 ఏర్పాటు చేశారు. బస్సుల్లో ఇతర ప్రాంతాల నంచి వచ్చిన భక్తులు ఇక్కడే దిగ వలసి ఉంటుంది. ఈ ప్రదేశం నుంచే తెలంగాణ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ పుష్కర్ నగర్ వద్ద భక్తుల సౌకర్యార్థం వసతి, క్లాక్ రూం, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. పుష్కర్ నగర్- 2: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక వైపు పుష్కర్ నగర్ - 2 ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో భక్తులకు వసతి ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుడ్స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. రుచికరమైన వివిధ రకాల వంటను నోరారా భుజించవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్‌షో భక్తులను ఆకట్టుకొనుంది. ఆ సమీపంలోనే రాష్ట్రంలోని ప్రముఖ నమునా దేవాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. యాత్రీకుల సౌకర్యార్థం ఇక్కడ క్లాక్‌రూం, దుకాణాలు అందుబాటులో తీసుకవచ్చారు. పార్కింగ్ కూ అవకాశం కల్పించారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు ఉంటాయి. పుష్కర నగర్ - 3 : పాతాళ గంగకు వెళ్లే మార్గంలోని కాటేజి నెం. 111 ఎదురుగా యాత్రికుల వసతి సముదాయ షెడ్లను పుష్కర్ నగర్ - 3 గా ఏర్పాటు చేశారు. ఇక్కడ అధిక సంఖ్యలో వసతి పొందటానికి సౌకర్యం సమకూర్చారు. అన్న దాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం స్నానపు గదులు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. పుష్కర ఘాట్లు... శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద రోప్‌వే వైపు కొత్తగా నిర్మించిన భ్రమరాంబ పుష్కర్ ఘాట్, ఆ ప్రక్కనే మల్లికార్జున ఓల్డ్ పుష్కర ఘాట్, లింగాల గట్టు లో లెవల్, హైలెవెల్ రెండు పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్య స్నానం చేయవచ్చు. మల్లమ్మ కన్నీరు వద్ద పార్కింగ్... శ్రీశైలానికి వచ్చిన జీపులు, కార్లు వంటి వాహనాలను టోల్గేట్, యజ్ఞవాటిక, వలయమార్గం మీదుగా మల్లమ్మ కన్నీరు ఆలయానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి మళ్లిస్తారు. పుష్కర్ నగర్ -2 వద్ద వహనాలు నిలుపుకోవటానికి అవకాశం ఉంది. అలంపూర్ గొందిమళ్ల ఘాట్... మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం 55 పుష్కర ఘాట్లు ఉన్నాయి. కానీ అలంపూర్‌కు 9 కి.మీ దూరంలో గొందిమళ్ల వద్ద శ్రీజోగులాంబ అమ్మవారిగా ఘాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుక్రవారం ఉదయం 5.50 నిమిషాలకు సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానాలు చేస్తారు. అనంతరం భక్తులు స్నానాలు చేస్తారు. అమ్మవారి ఆలయానికి దగ్గరగా ఉన్న ఘాట్ ఇదే. దర్శనం ఏర్పాట్లు... శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు భక్తులకు ఉచిత, శ్రీఘ్ర, అతి శ్రీఘ్ర దర్శనాన్ని దేవస్థానం కల్పించింది. శ్రీఘ్ర దర్శనానికి రూ. 200, అతి శ్రీఘ్ర దర్శనానికి రూ. 1000 టిక్కెట్టు ధర నిర్ణయించారు. సిఫార్సు లేఖలు, ముఖ్య అతిధులకు అతి శ్రీఘ్ర దర్శనం టికెట్లు విక్రయించనున్నారు. వేర్వేరు చోట్ల రెండు లడ్డు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దర్శనం కోసం క్యూ లైన్లలో వచ్చే భక్తులకు ఒక లడ్డు కేంద్రం, విడిగా వచ్చిన భక్తుల కోసం మరో లడ్డు విక్రయ కేంద్రం అందుబాటులో ఉంటుంది. వైద్య, వలంటీర్ల సేవలు ఏర్పాట చేశారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వీఐపీ టికెట్ రూ. 500, సాధారణ టికెట్ రూ. 100 ధర నిర్ణయించారు. -
వేయిమంది గజ ఈతగాళ్లు
అలంపూర్ : జిల్లాలోని ప్రధాన ఘాట్ల వద్ద వేయిమంది గజ ఈతగాళ్లను నియమిస్తునట్టు మత్స్య శాఖ ఏడీ ఖదీర్‌అహ్మద్ అన్నారు. మంగళవారం అలంపూర్ మండలం గొందిమల్లలోని జోగుళాంబ ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ణా పుష్కరాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనంగా వందమందిని ఎంపిక చేశామన్నారు. వీరికి 400లైఫ్ జాకెట్స్, 200లైఫ్‌బాయ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన ఘాట్ల వద్ద పది బోట్లు అందుబాటులో ఉంటాయన్నారు. సోమశిల, మంచాలకట్ట, బీచుపల్లి, రంగాపురం, గొందిమల్ల, క్యాతూర్lఘాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నారు. పుష్కరాలకు వందమంది మత్స్య శాఖ సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. జోగుళాంబ ఘాట్ వద్ద బోటు, తెప్ప ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ 30మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. -
పుష్కర దర్శనం
అలంపూర్‌రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరస్నానం చేసిన భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. ఇందుకోసం కష్ణానది తీరంలో 32ఘాట్ల వద్ద 32ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో మాగనూరు మండలం తంగడిలోని శ్రీ వల్లభేశ్వరస్వామి ఆలయం, కష్ణ గ్రామంలో దత్తాత్రేయ ఆలయం, కష్ణా రైల్వే బ్రిడ్జి సమీపంలో శ్రీ క్షీరలింగేశ్వర స్వామి ఆలయం, గూడెబల్లూరులోని స్వయంభూ లక్ష్మి వేంకటేశ్వరస్వామి, మక్తల్ మండలంలోని పంచదేవ్‌పహాడ్ (దత్తాత్రేయస్వామి), పారేవుల (శ్రీశంకరలింగేశ్వరస్వామి), ఆత్మకూరు మండలం నందిమల్ల (శివాలయం), మూలమల్ల (శ్రీఆంజనేయస్వామి), జూరాల (పాత శివాలయం), పెబ్బేరు మండలంలోని రంగాపూర్(రంగనాయకస్వామి), ఇటిక్యాల మండలం బీచుపల్లి (శ్రీ ఆంజనేయస్వామి), వీపనగండ్ల మండలం పెద్దమారూరు (ఈశ్వర ఆలయం), చర్లపాడు (శివాలయం), జటప్రోలు (మదన గోపాలస్వామి ఆలయం, అగస్తేశ్వర ఆలయం), కొల్లాపూర్ మండలంలోని మంచాలకట్ట (శ్రీరామతీర్థస్వామి ఆలయం), సోమశిల (లలిత సోమేశ్వరస్వామి ఆలయం), అమరగిరి (అమరేశ్వరస్వామి ఆలయం), ధరూర్ మండలంలోని ఉప్పేరు (శివ ఆంజనేయస్వామి ఆలయం), రేవులపల్లి (శివాంజనేయస్వామి), పెద్దచింతరేవుల(ఆంజనేయస్వామి ఆలయం), రేకులపల్లి (అభయాంజనేయస్వామి), గద్వాల మండలం నది అగ్రహారం(రామావదూత మఠం), బీరెల్లి (చెన్నకేశవస్వామి ఆలయం), అలంపూర్ జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, క్యాతూరులో వెంకటేశ్వరస్వామి ఆలయం, అమ్రాబాద్ మండలం పాతాళగంగ దత్తాత్రేయస్వామి ఆలయాల్లో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పకళా నిలయం రంగనాథ ఆలయం శ్రీరంగాపూర్ ఆలయం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన శిల్పసంపదతో పాటు ఎంతో విలువైన అపురూప చిత్రపటాలు ఇక్కడ ఉన్నాయి. రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద రంగనాయకస్వామి ఆలయం నిర్మించడంతో కొర్విపాడు గ్రామం శ్రీరంగాపూర్‌గా మారింది. కొర్విపాడు(నేటి శ్రీరంగాపూర్)లో సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు(క్రీ.శ.1670) కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఐదోశక్తి పీఠం జోగుళాంబ నవబ్రహ్మల క్షేత్రంగా విరాజిల్లుతున్న అలంపూర్ ఆలయాల్లో శ్రీ జోగుళాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ జరిపినట్లు పురాణం చెబుతోంది. 1400ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాలను బాదమీ చాళుక్యుల కాలంలో రెండో పులకేశి నిర్మించారు. గ్రామ దేవతను మొదలుకుని పార్వతి, పరమేశ్వరుyì వరకు ముక్కోటి దేవతలను అలంపూర్‌లో దర్శించవచ్చు. ప్రస్తుతం అలంపూర్ ఆలయాలు జిల్లాకే గర్వకారణంగా నిలిచాయి. సోమశిలలో సోమేశ్వరుడి ఆలయం కొల్లాపురం మండలంలోని సోమశిలలో శ్రీలలిత సోమేశ్వరుడి దర్శనం కలుగుతుంది. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాలతో పాటుగా జ్యోతిర్లింగాలయాలను అతి సుందరంగా నిర్మించారు. ప్రస్తుతం వీటిని పర్యాటక శాఖ అభివద్ధి చేస్తుంది. ప్రతి సోమవారం ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. బీచుపల్లి అభయాంజనేయుడు కొలిచినంతనే కొండంత అండగా మనోధైర్యాన్ని ప్రసాదించే దైవం బీచుపల్లి ఆంజనేయస్వామి. కష్ణా తీరాన వ్యాసరాయుల ప్రతిషి్ఠంచిన ఆంజనేయుడు జిల్లావాసులకే కాక ఇరు రాష్ట్రాల భక్తులకు ఆరాధ్యదైవం. బోయవారి చేత ప్రతి నిత్యం స్వామివారు సంప్రదాయరీతిలో పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో ఇటీవల సర స్వతి, హయగ్రీవ, రామాలయాలు నిర్మించారు. ఇక్కడి ఆలయాల్లో వైష్ణ ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు జరుగుతున్నాయి. ఆనాటి జటాయిపురమే జటప్రోల్ వీపనగండ్ల: జటప్రోల్లో వెలసిన దేవాలయాలు శిల్పకళకు నిలయం. రావణుడు సీతాదేవిని లంకకు ఎత్తుకెళుతున్న సమయంలో జటాయువు అనే ప„ì ఎదిరించింది. రావణుడు ఆ పక్షిని వధించాడని, అందుకు గుర్తుగా జటేశ్వర క్షేత్రం వెలసిందని, కాలక్రమేణా ఇది జటప్రోల్గా మారినట్లు పురాణం చెబుతోంది. ప్రధాన ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన మదనగోపాలస్వామి ఆలయంతో పాటు 16వ శతాబ్దానికి చెందిన 21 అగస్తేశ్వరుల ఆలయాలు కూడా ఉన్నాయి. మదనగోపాలస్వామి గోపుర ఆలయాన్ని వల్లభరాయుడు అనేరాజు కట్టించారని, ఈ గోపురంపై జటాయువు పక్షులు, కోతులను, పెద్ద పెద్ద జడలు గల రుషుల విగ్రహాలను మలిచారు. అగస్తేశ్వర ఆలయంతో పాటు జటేశ్వర ఆలయం, భ్రమరాంబ, మల్లేశ్వర ఆలయం, వీర భద్రాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, తదితర 21ఆలయాలు ఇక్కడ వెలిశాయి. -
హాస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ సైకిల్‌యాత్ర
అలంపూర్‌రూరల్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ వసతి గహాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవు తున్నాయిని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. జిల్లాలోని 64 మండలాల్లోని సంక్షేమ వసతిగహాలపై తాము సర్వే చేస్తూ అక్కడి సమస్యలపై అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ఈ సైకిల్ యాత్ర అలంపూర్‌కు చేరింది. అనంతరం గాంధీచౌక్ వద్ద మాట్లాడారు. జిల్లాలో వసతిగహాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. అలంపూర్‌లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్లో సరైన రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, ఆది, కుర్మయ్య, సుబాన్, నవీన్, రామకష్ణ, శేఖర్, నాగన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, అయ్యప్ప పాల్గొన్నారు. -
సిద్ధమవుతోంది..!
కొలిక్కి వస్తున్న వీఐపీ ఘాట్ నిర్మాణం నిర్మాణంలోనే రెండో ఘాట్ నత్తనడకన రోడ్డు నిర్మాణాలు అలంపూర్: కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న వీఐపీ ఘాట్ పనులు కొలిక్కి వస్తున్నాయి. అలంపూర్ క్షేత్రానికి అతి సమీపంలోని గొందిమల్లలో వీఐపీలకు, సాధారణ భక్తుల కోసం ఘాట్ నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో నీటి ప్రవాహాల అంచనాలకు అనుగుణంగా రెండు ఘాట్లను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఒక ఘాట్ నిర్మాణాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. కానీ నీటి ప్రవాహం పెరిగినా పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా నిర్మిస్తున్న రెండోఘాట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు కేవలం 14రోజుల గడువు మాత్రమే ఉండటంతో పనుల హడావుడి పెరిగింది. రెండేసి ఘాట్ల నిర్మాణం.. గొందిమల్లలో నీటి నిల్వల హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకుని రెండు ఘాట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకటి లో–లెవల్ ఘాట్ మరొకటి హై–లెవల్ ఘాట్లను రూ.3.17 కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పుష్కర స్నానాలు ఆచరించడానికి వీలుగా నిర్మిస్తున్నారు. 30మీటర్ల వెడల్పు, 90 మీటర్ల పొడవుతో దీని నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా ఘాట్ పనులు పూర్తి చేసి, ఘాట్‌కు రంగు బిల్లలు వేసే పనులు కొనసాగుతున్నాయి. అయితే నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ఘాట్‌కు దాదాపు 30మీటర్ల దూరంలో నీళ్లు ప్రవహిస్తాయి. ఇటీవల ఘాట్ పరిశీలనకు వచ్చిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ఈ విషయమై చర్చించారు. నీళ్లు ఘాట్‌కు దూరంగా ఉంటంతో మరో 20అడుగుల ఘాట్‌ను నదిలో నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో అదనంగా పెంచాల్సిన ఘాట్ పనులపై సందిగ్ధం నెలకొంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వలు పెరిగితే ప్రస్తుతం నిర్మిస్తున్న ఘాట్ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయంగా హైలెవల్ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ ఎత్తు నుంచి ఈ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జోగుళాంబ ఘాట్‌గా నామకరణం.. అలంపూర్ క్షేత్రానికి అతీ సమీపంలో గొందిమల్లలో నిర్మిస్తున్న ఘాట్‌కు జోగుళాంబ పేరుతో పిలవనున్నారు. ఇటీవల పుష్కరఘాట్ల సందర్శనకు వచ్చిన కలెక్టర్ టీకే శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించే భక్తులు నేరుగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వస్వామి క్షేత్రాన్ని సందర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఘాట్‌కు జోగుళాంబ ఘాట్‌గా నామకరణం చేశారు. యాత్రికులు ఒక మార్గంలో వచ్చి రెండో మార్గంలో వెళ్లడానికి వీలుగా ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇతర సదుపాయాలపైనే ఆయా శాఖలు పనుల్లో నిమగ్నమయ్యాయి. -
పుష్కరాలకు నిరంతర విద్యుత్
అలంపూర్ రూరల్ : పుష్కరాలు మొదలు నుంచి ముగిసేవరకు నిరంతర విద్యుత్ అందిస్తామని టీఎస్‌సీపీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బీచుపల్లి, గొందిమల్ల పుష్కరఘాట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పుష్కర సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలంపూర్ గొందిమల్ల ఘాట్ దగ్గర 100కేవీ, 25 కెవీ సామర్థ్యంతో మూడు ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈఓ గురురాజ, సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య ఆచారి అధికారికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. శ్రీనివాస్‌రెడ్డి వెంట ఎస్ఈ రాముడు, డీఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ ఏడీఈ సుబ్బారాయుడు, ఏఈ నరసింహప్రసాద్, జూనియర్ లైన్మెన్ రవి తదితరులు ఉన్నారు. -
'నా ఇంటి పైకి కప్పను తోస్తావంటూ..'
అలంపూర్‌రూరల్: తగవు పెట్టుకోవాలనుకుంటే పెద్ద కారణాలేం అక్కర్లేదు..చిన్నదైనా చాలు. తన ఇంటి ఆవరణలోకి వచ్చిన కప్పను ఆ ఇంటావిడ పక్కింటి వైపు తోసేసింది. ఇంకేముంది పక్కంటామే కయ్యిమంది.. తన ఇంట్లోకి ఎందుకు నెట్టావంటూ గొడవకు దిగింది. చివరికి ఈ గొడవ పోలీసుల వద్దకు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ విడ్డూరం వివరాలివీ.. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలం గంధిమల్లలోని ఓ ఇంటి ఆవరణలోకి మంగళవారం ఉదయం కప్ప ఒకటి గెంతుతూ వచ్చింది. దీంతో ఆ ఇంటి మహిళ పక్కింటి పైకి తోసింది. గమనించిన పక్కింటి మహిళ కప్పను తిరిగి వారి ఇంటిపైకి తోసింది. ‘నా ఇంటికిపైకి కప్పను తోస్తావా’ అంటూ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఇద్దరు సిగపట్లు పట్టారు. చివరకు పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. గ్రామపెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరు మహిళలను మందలించి తీసుకెళ్లారు. -
తుంగభద్రలో పడి కర్నూలువాసి మృతి
అలంపూర్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తూ తుంగభద్ర నదిలో పడి మృతిచెందాడు. కర్నూలు వివేక్నగర్కు చెందిన రమేష్‌బాబు(52), శారద(47) దంపతులు జోగులాంబ దర్శనార్థం ఆదివారం అలంపూర్ వచ్చారు. తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు దిగిన రమేష్‌బాబు ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడ్డాడు. వెంటనే ఒడ్డున కూర్చున్న శారద కేకలు వేయడంతో అక్కడున్నవారు రమేష్‌బాబును కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. రమేష్‌బాబు కర్నూలు జిల్లా కానాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య శారద అదే గ్రామంలో టీచర్‌గా పనిచేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం
అలంపూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్‌కు చెందిన బీషమ్మ(29) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలంపూర్ మండలం గుండిమల్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శైలజ(28) తన కూతురు మాధురి(2)పై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రగాయాలతో మృతిచెందారు. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని సమాచారం. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్
ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్ రూరల్ (మహబూబ్‌నగర్) : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని చండీహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. మరోవైపు స్థానిక రేణుకా దేవి ఆలయంలో మంగళవారం సంతానలక్ష్మి పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాలో సంతాన లక్ష్మి పూజలు నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈవో గురురాజ తెలిపారు. -
పడవ బోల్తా: ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ తుంగభద్ర నదిలో మంగళవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీట మునిగి మరణించారు. ఈ రోజు ఉదయం జాలర్లు తుంగభద్రలో చేపల వేటకు వెళ్లారు. ఆ క్రమంలో నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జాలర్లు నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సహచర జాలర్లు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో సహచర జాలర్లు నది ఒడ్డుకు చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరు జాలర్ల మృతదేహాలను తుంగభద్ర నుంచి వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతుల్లో ఒకరు స్థానికుడు కాగా, మరోకరు కర్నూలు జిల్లాకు చెందిన వాడని సహాచర జాలర్లు తెలిపారు. -
జోగుళాంబ ఆలయం ముస్తాబు
నేటినుంచి దక్షిణకాశీలో శరన్నవరాత్రి ఉత్సవాలు అలంపూర్: తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతుండటంతో అలంపూర్ ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. జోగుళాంబ ఆలయంలో పదిరోజుల పాటు జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నరహరి గురురాజ పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్‌వరణం, మహాకలశ స్థాపన, సాయంత్రం అంకురారోపణము, ధ్వజారోహణం పూజలు నిర్వహించనున్నారు. నవావరణ అర్చనలు, చండీహోమాలు వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. గురువారం రాత్రి అమ్మవారు శైలపుత్రి దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుమారి, సువాసిని పూజలు, మహా మంగళహారతి, మంత్రపుష్ప పూజలు చేస్తారు. festivals, alampur -
అటకెక్కిన పునరావాసం
2009 అక్టోబర్‌లో భారీ వరదలు వడ్డేపల్లిలో ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఇళ్లు మద్దూరులో స్థలానికి అతీగతి లేదు కృష్ణమ్మ, తుంగభద్ర నదులు ఉగ్రరూపం దాల్చాయి.. వరద బీభత్సంలో ఇళ్లు, ఊళ్లు కొట్టుకుపోయాయి. ఇది జరిగి సుమారు ఐదేళ్లు గడిచింది. 2009 అక్టోబర్ నాటి వరద బాధితులకు నేటికీ పునరావాసం అందనిద్రాక్షగానే మారింది. ప్రభుత్వాలు మారినా..పాలకులు మారినా వారి గూడుగోస మాత్రం తీరడం లేదు. తుంగభద్ర, కృష్ణానదులు ఉప్పొంగడంతో అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర తీరంలోని అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, కృష్ణానది తీరంలో ఉన్న ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లోని 28 గ్రామాలు వరద ప్రవాహంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రికిరాత్రే సంభవించిన వరదల నుంచి ప్రాణాలు దక్కితే చాలనుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య ముంపుగ్రామాలను పునఃనిర్మిస్తామని భరోసాఇచ్చారు. అందులో భాగంగానే చేపట్టిన పునరావాస పనులు ఐదేళ్లుగా ఓ కొలిక్కిరావడం లేదు. వడ్డేపల్లి మండలంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలంపూర్ పట్టణ బాధితుల కోసం సేకరించి సుమారు 44 ఎకరాల్లో ముళ్లపొదలు మొలిశాయి. మద్దూరు మండలంలో ఇప్పటికీ స్థలసేకర ణ జరగలేదు. చేనేతకు పుట్టినిల్లు రాజోలి నేతన్నను ఆదుకునేదిక్కులేదు. ఆరేళ్లుగా అసంపూర్తిగానే..! వరద బాధితుల పునరావాస పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. అలంపూర్, మద్దూరులో ఇళ్ల నిర్మాణం ఊసేలేదు. అయిజ మండలంలోని కుట్కనూరు, ఇటిక్యాలం మండలంలోని ఆర్.గార్లపాడు గ్రామాల్లో పునరావాసం పనులు జరగడం లేదు. రాజోలిలో 212 ఎకరాల స్థలాన్ని సేకరించి 3048 ఇళ్లను ప్రతిపాదించగా.. 2625 నిర్మాణాలను మాత్రమే చేపట్టారు. వీటిలో ప్రముఖ ఇన్ఫోసిస్ స్వచ్ఛంద సంస్థ 600 ళ్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ కూడా 483 ఇళ్లను పూర్తిచేయగా..117ఇళ్లను మొదలుపెట్టలేదు. ఆర్డీటీ అనే స్వచ్ఛంద సంస్థకు 700 ఇళ్లు అప్పగించగా 692 నిర్మాణాలను పూర్తిచేయగలిగింది. పడమటి గార్లపాడు నిర్వాసితులకు రాజోలిలోనే 72 ఇళ్లు మంజూరుచేశారు. కానీ స్థానికులు తమ గ్రామంలోనే ఇళ్లు నిర్మించాలని కోరడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు. మరో వరద గ్రామం తూర్పుగార్లపాడులో 251 ఇళ్లను గాను 248 ఇళ్లకు స్లాబ్‌లు పూర్తిచేశారు. చాలాచోట్ల నిర్మాణాలు పూర్తయినా.. ఇళ్లకు తలుపులు, కిటికీలు, బండ పరుపు వంటి పనులు జరగ లేదు. అలంపూర్ పట్టణ నిర్వాసితులకు 44 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. మానవపాడు మండలం మద్దూ రు లో సుమారు 500 కుటుంబాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయాయి. కానీ స్థలం కొరతను సాకుగా చూపుతూ ఇప్పటికీ స్థలసేకరణ చేయలేదు. నేతన్నకు చేయూత కరువు రాజోలి, అలంపూర్‌లోని చేనేతకార్మికులకు ప్రభుత్వపరంగా ఆదరణ కొరవడిం ది. రాజోలిలో 764 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నేత పనిద్వారానే ఎక్కువమంది ఉపాధిపొందుతారు. వరదల్లో చేనేత కార్మికులు ఇళ్లతోపాటు జీవనాధారమైన మగ్గాలు కొట్టుకుపోయాయి. చేనేత కుటుంబాలకు ఇళ్లతోపాటు షెడ్డు ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకోసం రూ.42,500 ఆర్థికసాయం ఇస్తామని ప్రభుత్వం హామీఇచ్చింది. అయితే నిర్మాణాల్లో జాప్యం జరగడంతో నిర్మాణవ్యయం రెండింతలు పెరిగింది. షెడ్డులు నిర్మించుకున్న 53 మంది ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
అలరించిన టీఎల్ఎం మేళా
అలంపూర్, ప్రభుత్వ పాఠశాలల బోధనోపకరణాల మేళా అట్టహాసంగా కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ హరిజన వాడ పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉపాధ్యాయ, విద్యార్థుల అభ్యసనసామర్థ్య మేళా సోమవారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అబ్రహాం ప్రారంభించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సామాజిక అంశాలు, సౌరకుటుంబ వ్యవస్థ, నివాసాలు, పండుగల ప్రత్యేకతల న మూనాలు, సహజ వనరులు వంటి అం శాలను ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులతో కలిసి వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహకంతో నిర్వహిచిన ఈ సామర్థ్య మేళా ఎంతగానో ఆకట్టుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ మేళాలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అశోక్‌కుమార్, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, జాన్, అల్లాబఖష్, జేఏసీ నాయకులు వెంకట్రామయ్యశెట్టి, ప్రభాకర్, రమేష్, వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధాయులు ఆనందం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం మేళాలలో వివిధ అంశాలపై ప్రదర్శన ఇచ్చిన పాఠశాలలకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేయ డం జరిగింది. తెలుగు విభాగంలో పీఎస్ లింగనవాయి, పీఎస్ శేరుపల్లి, ఇంగ్లీష్‌లో పీఎస్ హరిజన వాడ అలంపూర్, పీఎస్ బాలుర పాఠశాల క్యాతూర్, గణిత విభాగంలో లో పీఎస్ న్యూప్లాట్స్ అలంపూర్, యూపీఎస్ ప్రాగటూరు, పరిసరాల విజ్ఞానంలో యూపీఎస్ మారమునగాల, యూపీఎస్ గొందిమల్లా, ఉర్దూమీడియంలో పీఎస్ అలంపూర్ పాఠశాలలు విజేతలుగా ఎంపికయ్యాయి. గ్రామ సర్పంచ్ జయరాముడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆనందం, దశరథరెడ్డి, రాజకుమా ర్, అనిల్‌కుమార్, అనితాబాయి వ్యవహరించారు. నిర్వాహకులు వెంకట్రామయ్యశెట్టి, రమేష్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ పాల్గొన్నారు. ఇటిక్యాల: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు పరిశీలనాత్మకంగా విద్యను బోధిస్తేనే సులభంగా అర్థమవుతుందనే ఉద్ధేశంతో ఉపాధ్యాయులు స్వయంగా పరికరాలను తయా రు చేసి విద్యాబోధన చేయడం మంచి పద్ధతి అని ఇటిక్యాల ఎంపీడీఓ మల్లికార్జున్ అన్నారు. సోమవారం మండలంలోని ఏపీఎస్పీ పదవ బెటాలియన్‌లో మండల స్థాయి విద్యా బోధనోపకరణల ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రదర్శన ఎంఈఓ రాజు ఆధ్వర్యంలో కొనసాగింది. ప్రదర్శనలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెం దిన ఉపాధ్యాయులు, జలవిద్యుత్‌ఉత్పత్తి కేంద్రం, రోలింగ్ బోల్డు, తదితర ప్రయోగాత్మక పరికరాలను ప్రదర్శించి ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తల ప్రశంసలు పొందారు. అనంతరం ప్రదర్శన లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతోపాటు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మండలంలోని పీఎస్, యూపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు. అయిజలో.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన టీఎల్ఎం ( బోధన అభ్యసన సామాగ్రి ) మేళా అందరినీ ఆకట్టుకుం ది. మండల పరిధిలోని ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలలతోపాటు మం డంల కేంద్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్‌ఫేర్‌ను నిర్వహిం చారు. ఈకార్యక్రమంలో భాగంగా మానవ శరీరంలోని అవయవాల పని తీరు, అక్షరాల ప్రాధాన్యం, వివిధ చిరు ధాన్యాలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ పంట లు ఎక్కువ పండుతాయి, వివిధ వస్తువుల ప్రాధాన్యత, ఆధునిక పరిజ్ఞానం గురించి సందర్శకులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘హంద్రీ’... ఆగిందోచ్..!
రైలు ప్రయాణీకులకు శుభవార్త సోమవారం రాత్రి తొలి హాల్ట్ అలంపూర్, న్యూస్‌లైన్ : జోగుళాంబ హాల్ట్ కల ఎట్టకేలకు నెరవేరింది. దాదాపు ఎనిమిది నెలలుగా దోబూచులాడుతున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్(ఇంటర్సిటీ) రైలు ఎట్టకేలకు సోమవారం రాత్రి ఆగింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో జోగుళాంబ హాల్ట్ వద్దకు చేరుకున్న రైలు నిలిచింది. రైల్వే ఉన్నత శాఖ నుంచి స్థానిక స్టేషన్లకు హాల్ట్ సమాచారం అందింది. ఉదయం కర్నూలులో 6.05 గంటలకు బయల్దేరే ఈ ట్రైన్....జోగుళాంబ హాల్ట్‌కు ఉదయం 6.15 నిమిషాలకు చేరుకొని ఆగాల్సి ఉండేది. కానీ ఎప్పటిలాగే స్టాప్‌లేకుండా దూసుకెళ్లింది. మధ్యాహ్నం సమయంలో సీసీఐ ద్వారా హైద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో వచ్చే హంద్రీ అగుతుందని స్పష్టమైన సందేశం వచ్చింది. ప్రయాణీకులకు టికెట్లు సైతం అందుబాటులో ఉంచాలనే సమాచారం అందింది. దీంతో టికెట్ నిర్వాహకుడు రాజేశ్వర్‌రెడ్డి అందుకు చర్యలు తీసుకున్నారు. ఇలా ప్రయాణికులతో వచ్చిన రైలు రాత్రి 10 గంటల సమయంలో జోగుళాంబ హాల్ట్‌లో ఆగి అందర్నీ ఆనందపరిచింది. హైదరబాదు నుంచి ఈ రైలులో వచ్చిన మానవపాడు మండలం ఏ-బూడ్దిపాడు గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి, శ్రీనువాసులు అనే ఇద్దరు ప్రయాణికులు ఇక్కడే దిగారు. తమకు విషయం తెలియక కర్నూలు వెళ్లాలనుకున్నామని...తీర ఇక్కడ రైలు ఆగడంతో దిగామన్నారు. ప్రశాంతంగా ఇంటికి వెళ్లడానికి అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ధ్వజారోహణం
అలంపూర్, న్యూస్‌లైన్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగవైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి మూలవిరాట్ వద్ద ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య హారతులు సమర్పించారు. శివసంకల్ప స్తోత్రాన్ని పఠిస్తూ ఆగమ పద్ధతులతో ఆనతి స్వీకరించారు. అర్చకస్వాములు ఉత్సవమూర్తిని మంగళవాయుద్యాల మధ్య అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఈఓ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. యాగశాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉత్సవ సంకేతంగా ధ్వజారోహణం చేశారు.