సాక్షి, అలంపూర్: రైతు బాంధవుడు కేసీఆర్ అని టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వీఎం అబ్రహం కొనియాడారు. అలంపూర్ చౌరస్తాలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఉండవెల్లి మండలం మెన్నిపాడుకు చెందిన మాజీ సర్పంచ్ మహేందర్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అబ్రహం వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
అభివృద్ధికి సహకరించిన టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అలంపూర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆశీర్వదిస్తే అలంపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోరారు. రామకృష్ణ, గిడ్డయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఈదన్న, కృష్ణ, నరేష్, రాఘవేంద్ర, మహేష్, మహాలక్ష్మి, మారెమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం..
రాజోళి: రానున్న ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అబ్రహంను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటేశ్వరమ్మ గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని తుమ్మలపల్లెలో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 150 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ సర్పంచ్ మోచి హుస్సేన్, మాణిక్య రెడ్డి, విక్రమసింహా రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
మానవపాడు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. గురువారం మండలంలోని జల్లాపురం, పల్లెపాడు, చండూరు గ్రామాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం అబ్రహంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద జగన్నాథం మాట్లాడారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతోనే టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్నారు. త్వరలో ఆర్డీఎస్ ద్వారా సాగునీటిని అందించనున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ చేసి చూపిందన్నారు. శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆత్మలింగారెడ్డి, రాజశేఖర్, రోశన్న, మురళీధర్‌రెడ్డి, అయ్యన్న, లింగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment