సాక్షి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషం. వేదనలు, రోదనలతో బాధపడిన పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం చేశామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాము. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. గురుకులాలను ఇంకా పెంచుతాము. చాలా కష్టపడి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. కంటివెలుగు ఓట్ల కోసం తెచ్చింది కాదు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తీసుకువచ్చిందే. తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నాము. సంస్కరణ అనేది అంతం కాదు. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాము. గతంతో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment