collectarate office
-
‘ఎలాంటి తెలంగాణ కోసం పోరాటం చేశామో ఆ దిశగా ముందుకెళ్తున్నాము’
సాక్షి, మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషం. వేదనలు, రోదనలతో బాధపడిన పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉంది. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం చేశామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నాము. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. గురుకులాలను ఇంకా పెంచుతాము. చాలా కష్టపడి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. కంటివెలుగు ఓట్ల కోసం తెచ్చింది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తీసుకువచ్చిందే. తెలంగాణలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు మేలు జరగాలనే చేస్తున్నాము. సంస్కరణ అనేది అంతం కాదు. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాము. గతంతో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కష్టాలకు కాలంచెల్లేదెన్నడో?
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోనూ, కుందుర్పి మండలం కేంద్రాల్లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమాల్లో ప్రజల నుం చి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఈ రెండు చోట్ల మొత్తం వివిధ సమస్యలపై 786 అర్జీలు వచ్చాయి. అనంతపురంలో డీఆర్ఓ ఎస్.రఘునాథ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, పాలనాధికారి విజయలక్ష్మి, సెక్షన్ తహసీల్దారులు హరికుమార్, నాగరాజు, ఏడీఏ విద్యావతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇక్కడ వివిధ సమస్యలపై 260 అర్జీలు వచ్చాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ‘మీ కోసం’లో ప్రజల నుంచి 526 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలు ఇలా.. ♦ ఆలయం భూమిలో (సర్వేనంబర్‌లో 547లో 8.20 ఎకరాల భూమి) శ్మశానవాటిక ఏర్పాటుకు సిద్ధపడ్డారని, ఈ చర్యను నిలుపుదల చేయిం చాలని విడపనకల్లు మండలం విడపనకల్లు గ్రామానికి చెందిన ఎం.శివరుద్రస్వామి విన్నవించారు. ♦ తన భూమి (సర్వే నంబర్లు 145, 146, 139లో)ని ఆన్లైన్లో నమోదు చేయడం లేదని నల్లమాడకు చెందిన పి.ఖాదర్‌బాషా ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు. ♦ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆపాస్ (ఏపీ ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరప్రసాద్, టి.నారాయణస్వామి విన్నవించారు. ♦ సర్వే నెంబరు 442–3ఎలో తమకు 3.22 ఎకరాల భూమి ఉందని, మోటారు, పైప్‌లైన్ కోసం ఎస్టీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని నూతిమడగు పంచాయతీ తిప్పేపల్లికి చెందిన ఇ.కదిరయ్య ఫిర్యాదు చేశాడు. ♦ ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన తనకు మాజీ సైనికుల కోటాలో వ్యవసాయ భూమిని మంజూరు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని పెనుకొండ మండలం వెంకట రెడ్డిపల్లికి చెందిన మాజీ సైని కోద్యోగి కె.భాస్కర్ ఫిర్యాదు చే శాడు. ♦ ఏడాదిన్నర క్రితం విశాఖపట్నంలో సెలక్షన్స్‌లో త్రిపుర స్టేట్ రైఫిల్స్‌కు ఎంపికయ్యామని, అయినా నియామక ఉత్తర్వులు అందలేదని నీలకంఠ, సురేశ్, ప్రశాంత్, కిరణ్‌కుమార్, శ్రీనివాసులు విన్నవించారు. ♦ ఇతని పేరు మేకల గంగన్న. బత్తలపల్లిలో నివాసముంటున్నాడు. ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో ఇతనికి 827 సర్వే నంబరులో 4.35 ఎకరాలు, 429–4లో 3.03 ఎకరాల భూమి పిత్రార్జితంగా వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన సోదరులు డెత్ సర్టిఫికెట్ ఉంచి తనకు రావాల్సిన భూమికి పట్టాపుస్తకాలు చేసుకున్నారని వాపోయాడు. ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరించాలంటూ ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అప్పటి నుంచి తహసీల్దారు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నాడు. -
విన్నపాలు వినవలె..!
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సానా వెంకట లక్ష్మిదేవి. చింతకొమ్మదిన్నె మండలం మూలవంక. భర్త సానా ప్రసాద్ లారీడ్రైవరుగా పనిచేస్తుండేవారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. దీంతో కడుపు చేతపట్టుకుని కువైట్ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. జూన్ 13వ తేదీ మృతి చెందారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే ఇక్కడికి పంపారు. భర్త శవంగా మారి రావడంతో భార్య వెంకట లక్ష్మిదేవి కన్నీరుమున్నీరైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నారు. ఊరిలో సొంత ఇల్లు కూడా లేదు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే పట్టుదలతో ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లీషు చదువుతోంది. కమలాపురంలో బీఈడీ కూడా చేస్తోంది. ఈ మధ్యకాలంలో కర్నూలులో పోలీసు సెలెక్షన్లకు కూడా వెళ్లింది. ప్రిలిమ్స్, ఈవెంట్స్‌లో ఉత్తీర్ణురాలైంది. మెయిన్స్‌లో నెగ్గలేక పోవడంతో వెనుదిరిగి వచ్చింది. తన భర్త మృతి చెందాడు గనుక కువైట్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఆమెకు రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఓమారు కలెక్టర్‌కు మొర పెట్టుకుంది. త్వరగా తమ ఫైలు పైకి పంపి నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. కడప సెవెన్‌రోడ్స్: స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ఎన్ని సార్లు అర్జీలు సమర్పించినా పింఛన్లు అందలేదని కొందరు, వస్తున్న పింఛన్లను అర్ధాంతరంగా ఆపివేశారని మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రేషన్‌కార్డులు, చంద్రన్న బీమా, వ్యవసాయ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఎన్టీఆర్ గృహాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని, సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని.. ఇలా వివిధ రకాల సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. పెన్షన్ నిలిపేశారు నా కుమారుడు నాగసుబ్బయ్య మానసిక వికలాంగుడు. కుమారుని అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకోవాలి. మాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నా కుమారునికి రూ.1500 పెన్షన్ వస్తుండేది. ఎనిమిది నెలల నుంచి నిలిపివేశారు. ఎందుకిలా చేశారని అధికారులను అడిగాను. ఇప్పటికే నీకు వితంతు పెన్షన్ వస్తోంది గనుక నీ కుమారుడి పెన్షన్ నిలిపివేశామని చెప్పారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్ ఇవ్వరాదనే నిబంధన ఉన్నప్పుడు నా పెన్షన్ తొలగించి కుమారుని పెన్షన్ పునరుద్ధరించాలని కోరేందుకు వచ్చాను. – వీరమ్మ, బాలిరెడ్డిపల్లె, కమలాపురం మండలం ఇంటి స్థలాలు క్రమబద్ధీకరించాలి 19 ఏళ్ల నుంచి కడప తిలక్‌నగర్‌లో మేము కాపురముంటున్నాము. మాతోపాటే చాలా కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. అందరూ కూలీ పని, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మేము అక్కడ నివాసమున్నట్లు నిర్ధారించే విద్యుత్ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు అన్నీ ఉన్నాయి. మాకు ఇళ్ల స్థలా పట్టాలు మాత్రం లేవు. ఈ విషయంపై అనేక ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. 1994లో అప్పటి తహసీల్దార్ టి.కృష్ణమూర్తి ఇచ్చిన లే అవుట్ రద్దు చేయలేదు గనుక మేము మీ ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించలేమని తహసీల్దార్ అంటున్నారు. నిబంధనలు అంగీకరించనపుడు గతంలో తహసీల్దార్‌గా పని చేసిన నాగరాజు కొంత మందికి పొసెషన్ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని మేము ప్రశ్నించగా, అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి జీఓ నంబర్ 388 ప్రకారం ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరేందుకు వచ్చాము. – ఎస్.మోహన్‌కుమార్, తిలక్‌నగర్, కడప పింఛన్ ఇప్పించి ఆదుకోండి నేను కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. వయసు పైబడడంతో ఇప్పుడు పనులు చేయడానికి శరీరం సహకరించే పరిస్థితిలో లేదు. నాకు ఆస్తిపాస్తులు గానీ, వెనకా ముందు గానీ ఎవరూ లేరు. ప్రభుత్వం కనీసం వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తే ఏదో కొంత ఆసరాగా ఉంటుంది. ఇప్పటికి పది సార్లు పెన్షన్ కోసం అర్జీలు సమర్పించాను. అయితే ఇంత వరకు మంజూరు కాలేదు. ఈ విషయాన్ని కిందిస్థాయి అధికారులను అడగ్గా, వారు సరైన సమాధానం చెప్పడం లేదు. నా సమస్యను కలెక్టర్ అయినా పట్టించుకుంటారనే ఆశతో వచ్చాను. – చెన్నప్ప, ఆజాద్‌నగర్, కడప. -
కలెక్టరేట్ భవన సముదాయానికి సీఎం శంకుస్థాపన
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించారు. చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో కలెక్టర్ సమీకృత భవనాల నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. అక్కడే ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, నూతన జిల్లా కలెక్టర్ భవనాన్ని ప్రజా సౌకర్యం కోసం కాకుండా అధికార పార్టీ నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపార లాభాల కోసమే కుడకుడలో నిర్మించడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలో ఆర్యవైశ్య సంఘం నేత, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రసేనగుప్తా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం సూర్యాపేటలోని యాదవ్ నగర్లో నిర్మించిన 192 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారుల చేత గృహ ప్రవేశం చేయించారు. -
ఉద్యమం తరహాలో ఉత్సవాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవ వేడుకలను గొప్పగా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నీ మర్చిపోయి ప్రజలంతా ఒక్కటై ఏ విధంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నిర్వహించారో... జూన్ నుంచి 2నుంచి జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లోనూ అదే విధంగా పాల్గొనాలి’ అని రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అడిషనల్ జారుుంట్ కలెక్టర్ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్ఓ వీరబ్రహ్మయ్యలతో కలిసి ఈటల తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు. జూన్ 2న ఉదయం 8.15 గంటలకు గ్రామ, మండల, మున్సిపాలిటీ, నగర పంచాయ తీ, కార్పొరేషన్లలో తెలంగాణ తల్లి విగ్రహా లకు, అమరవీరుల స్థూపాలకు సెల్యూట్ చేయడంతో రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లాలోని అన్ని ప్ర భుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం. తెలంగాణ సాధన కోసం పాటుపడిన ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పిస్తాం. సాయంత్రం జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, తెలంగాణ వంటకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం. జూన్ 3 నుంచి 7 వరకు ప్రతిరోజూ అన్నిచోట్ల రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, క్రీడలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. ప్రతిరోజు సాయంత్రం తెలంగాణ కళారూపాలు, బాగోతాలు, తెలంగాణ వంటకాల కార్యక్రమాలుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరిస్తాం. మండల స్థాయిలో 10, నగర పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో 15, కార్పొరేషన్ స్థాయిలో 20, జిల్లాస్థాయిలో 30 మంది చొ ప్పున వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిం చిన వారిని ఎంపిక చేసి నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తాం. ఇందుకోసం మం డల, నగర, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.10,116, జిల్లాస్థాయిలో ఎంపికైన వారికి రూ. 50,116ల చొప్పున నగదు అందజేస్తాం. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల నిర్వహణ కోసం జిల్లాకు రూ.1.2 కోట్లు కేటాయించినప్పటికీ... అందులో రూ.90 లక్షలు అవార్డులకుపోగా, మిగిలిన రూ.30 లక్షలు ప్రచారానికి ఖర్చవుతుంది. మిగిలిన కార్యక్రమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, ఇతరులు సాయం అందించాలి. కరీంనగర్ సర్కస్ మైదానంలో జూన్ 3న ముషాయిరా, 5న ఖవ్వాళీ, కవి సమ్మేళనాలు నిర్వహిస్తాం. ఆరు రోజులపాటు తెలంగాణ వంటకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని జిల్లాలకంటే కరీంనగర్లో రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి రాష్ట్ర అవతరణ వేడుకలలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి విజ యవంతం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ అంతకుముందు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో తెలంగాణ పాటల సీడీలోని పాటలు ప్రజలకు వినిపించాలన్నారు. ముఖ్యమంత్రి సందే శం ప్రతులు గ్రామాలలో పంపిణీ చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మం డల, డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ప్రతి రోజు సాంస్కతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమ వివరాలు ప్రతి రోజు జిల్లా కేంద్రానికి పంపాలని సూచించారు. -
బదిలీల జాతర
♦ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సందడి ♦ బదిలీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గురువారం మొదలైంది. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బదిలీలు చేపట్టిన కలెక్టరేట్ కార్యాలయం, జెడ్పీ, డీఆర్డీఏ, కార్యాలయాలను కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షించారు. మొదటి రోజులో భాగంగా వీఆర్ఓలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 57, 58 ప్రకారం ఒకే కార్యాలయంలో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు, మూడేళ్ల కాకపోయినా ప్రత్యేక కారణాలతో బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆధారాలను జతచేసి బదిలీ కోరుతూ జిల్లా అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఆప్షన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో సంక్షేమశాఖలు, ప్రణాళికశాఖకు చెందిన ఉద్యోగులు పెన్నార్ భవన్, పంచాయితీరాజ్ శాఖ ఉద్యోగులు జిల్లా పరిషత్ హాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీ, సమాచార పౌరసంబంధాల శాఖ, పరిశ్రమలు, శాఖలకు చెందిన ఉద్యోగులు డ్వామా హాల్లో, వ్యవసాయశాఖ దాని అనుబంధ శాఖల ఉద్యోగులు, వ్యవసాయశాఖ జెడీ కార్యాలయంలో, రెజఠన్యూ మిగిలిన ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు రెవిన్యూ భవన్లో తమ ఆప్షన్లకు సంబంధిత అధికారులకు సమర్పించారు. జిల్లా అధికారుల తో ఉద్యోగుల ఆప్షన్ వివరాలను శుక్రవారం పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. జెడ్పీలో బదిలీల కోలాహలం అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల బదిలీలు గురువారం జెడ్పీ మీటింగ్ హాలులో నిర్వహించారు. మొత్తం 630 మంది ఉద్యోగులు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు జెడ్పీ సీఈఓ రామచంద్ర తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాలులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ కోన శశిధర్, జాయింట్‌కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామచంద్ర, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. జేడీఏ కార్యాలయంలో అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం గురువారం ఉద్యోగులతో కిటకిటలాడింది. వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యాన, పట్టుపరిశ్రమ, పాడి పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్, మత్స్యశాఖలకు సంబంధించి బదిలీ ఆప్షన్ల ప్రక్రియ కార్యక్రమం జేడీఏ కార్యాలయంలోనే వేర్వేరుగా శిబిరాల్లో నిర్వహించారు. ఏఈవో, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్స్, డ్రైవర్లు, అటెం డర్లు, వాచ్మెన్లు తదితర కిందిస్థాయి సిబ్బందికి సంబంధించి బదిలీల ఆప్షన్లు తీసుకున్నారు. వ్యవసాయశాఖలో 76 మంది, పట్టు పరిశ్రమశాఖలో 177 మంది, ఉద్యానశాఖలో ఇద్దరు, మార్కెటింగ్‌శాఖలో 18 మంది, పాడి, పశుసంవర్ధకశాఖలో 112 మంది నుంచి ఐదు ఆప్షన్లు తీసుకున్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, జేడీఎస్ అరుణకుమారి, జేడీఏహెచ్ డాక్టర్ వి.శ్యాంమోహన్రావు, డీడీ డాక్టర్ కె.జయకుమార్, డీడీహెచ్ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీహెచ్ సీహెచ్ శివసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.