
సూర్యాపేట:
సూర్యాపేట జిల్లాలో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించారు. చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో కలెక్టర్ సమీకృత భవనాల నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. అక్కడే ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కాగా, నూతన జిల్లా కలెక్టర్ భవనాన్ని ప్రజా సౌకర్యం కోసం కాకుండా అధికార పార్టీ నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపార లాభాల కోసమే కుడకుడలో నిర్మించడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలో ఆర్యవైశ్య సంఘం నేత, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రసేనగుప్తా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం సూర్యాపేటలోని యాదవ్ నగర్లో నిర్మించిన 192 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారుల చేత గృహ ప్రవేశం చేయించారు.