అలరించిన టీఎల్‌ఎం మేళా | clebration of tlm | Sakshi
Sakshi News home page

అలరించిన టీఎల్‌ఎం మేళా

Published Tue, Feb 25 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

అలరించిన టీఎల్‌ఎం మేళా

అలరించిన టీఎల్‌ఎం మేళా


 
 అలంపూర్,
 ప్రభుత్వ పాఠశాలల బోధనోపకరణాల మేళా అట్టహాసంగా కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ హరిజన వాడ పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉపాధ్యాయ, విద్యార్థుల అభ్యసనసామర్థ్య మేళా సోమవారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అబ్రహాం ప్రారంభించారు.

 

మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు  తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సామాజిక అంశాలు, సౌరకుటుంబ వ్యవస్థ, నివాసాలు, పండుగల ప్రత్యేకతల న మూనాలు, సహజ వనరులు వంటి అం శాలను ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులతో కలిసి వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహకంతో నిర్వహిచిన ఈ సామర్థ్య మేళా ఎంతగానో ఆకట్టుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ  మేళాలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అశోక్‌కుమార్, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, జాన్, అల్లాబఖష్, జేఏసీ నాయకులు వెంకట్రామయ్యశెట్టి, ప్రభాకర్, రమేష్, వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధాయులు ఆనందం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 విజేతలకు బహుమతులు ప్రదానం
 

 

మేళాలలో వివిధ అంశాలపై ప్రదర్శన ఇచ్చిన పాఠశాలలకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేయ డం జరిగింది. తెలుగు విభాగంలో పీఎస్ లింగనవాయి, పీఎస్ శేరుపల్లి, ఇంగ్లీష్‌లో పీఎస్ హరిజన వాడ అలంపూర్, పీఎస్ బాలుర పాఠశాల క్యాతూర్, గణిత విభాగంలో లో పీఎస్ న్యూప్లాట్స్ అలంపూర్, యూపీఎస్ ప్రాగటూరు, పరిసరాల విజ్ఞానంలో యూపీఎస్ మారమునగాల, యూపీఎస్ గొందిమల్లా, ఉర్దూమీడియంలో పీఎస్ అలంపూర్ పాఠశాలలు విజేతలుగా ఎంపికయ్యాయి. గ్రామ సర్పంచ్ జయరాముడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆనందం, దశరథరెడ్డి, రాజకుమా ర్, అనిల్‌కుమార్, అనితాబాయి వ్యవహరించారు. నిర్వాహకులు వెంకట్రామయ్యశెట్టి, రమేష్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ పాల్గొన్నారు.
 

 

ఇటిక్యాల: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు పరిశీలనాత్మకంగా విద్యను బోధిస్తేనే సులభంగా అర్థమవుతుందనే ఉద్ధేశంతో ఉపాధ్యాయులు స్వయంగా పరికరాలను తయా రు చేసి విద్యాబోధన చేయడం మంచి పద్ధతి అని ఇటిక్యాల ఎంపీడీఓ మల్లికార్జున్ అన్నారు. సోమవారం మండలంలోని ఏపీఎస్‌పీ పదవ బెటాలియన్‌లో మండల స్థాయి విద్యా బోధనోపకరణల ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రదర్శన ఎంఈఓ రాజు ఆధ్వర్యంలో కొనసాగింది. ప్రదర్శనలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెం దిన ఉపాధ్యాయులు, జలవిద్యుత్‌ఉత్పత్తి కేంద్రం, రోలింగ్ బోల్డు, తదితర ప్రయోగాత్మక పరికరాలను ప్రదర్శించి ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తల ప్రశంసలు పొందారు. అనంతరం ప్రదర్శన లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతోపాటు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మండలంలోని పీఎస్, యూపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

 

అయిజలో..

 

 మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన టీఎల్‌ఎం ( బోధన అభ్యసన సామాగ్రి ) మేళా అందరినీ ఆకట్టుకుం ది. మండల పరిధిలోని ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలలతోపాటు మం డంల కేంద్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్‌ఫేర్‌ను నిర్వహిం చారు. ఈకార్యక్రమంలో భాగంగా మానవ శరీరంలోని అవయవాల పని తీరు, అక్షరాల ప్రాధాన్యం, వివిధ చిరు ధాన్యాలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ పంట లు ఎక్కువ పండుతాయి, వివిధ వస్తువుల ప్రాధాన్యత, ఆధునిక పరిజ్ఞానం గురించి సందర్శకులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement