
నేడే యూపీ ఐదో దశ పోలింగ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని 51 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎస్పీ అభ్యర్థి కనౌజియా మరణంతో ఆలంపూర్ స్థానంలో పోలింగ్ వచ్చేనెల 9న జరగనున్నది.
సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆదివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.