శ్రీనగర్: నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు సన్నాహాలు జరుగున్నాయి. దీనిలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొననున్నారు. అయితే ఇంతలో జమ్ము పోలీసులకు ఎంఏఎం స్టేడియంపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్టేడియంలో అణువణువునా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కశ్మీర్ లోయలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కశ్మీర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె విర్ది మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను సురక్షితంగా నిర్వహించడానికి భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయని అన్నారు.
దేశవ్యాప్తంగా నేడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని భారత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతుంది.
ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment