అలంపూర్: మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అలంపూర్కు చెందిన బీషమ్మ(29) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.