ఫిలింనగర్: జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దులోని బారాముల్లా ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రేమలో విఫలమై ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బారాముల్లా మాలాపొరా ప్రాంతానికి చెందిన ఇరం నబీడార్ (23) షేక్‌పేట గుల్షన్‌కాలనీలో ఓ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గత జనవరి నుంచి పనిచేస్తున్నది.
ఈ నెల 8వ తేదీన ఉదయం ఆమె స్నేహితుడు అబ్దుల్ ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటికే ఆమె తల్లి కూడా అబ్దుల్‌కు ఫోన్ చేసి తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావాలని తెలిపింది. ఆందోళన చెందిన అబ్దుల్ సాయంత్రం 5.30 గంటలకు ఇరం ఉంటున్న గదికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదు. దీంతో పక్కనే ఉన్న వాచ్‌మెన్‌ను పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అబ్దుల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అంతకముందు రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లుగా నిర్థారించారు. ప్రేమ విఫలం కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని విమానంలో కశీ్మర్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment