అలంపూర్ జోగుళాంబ అమ్మవారి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగవైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి మూలవిరాట్ వద్ద ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య హారతులు సమర్పించారు.
అలంపూర్, న్యూస్‌లైన్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగవైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి మూలవిరాట్ వద్ద ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య హారతులు సమర్పించారు. శివసంకల్ప స్తోత్రాన్ని పఠిస్తూ ఆగమ పద్ధతులతో ఆనతి స్వీకరించారు.
అర్చకస్వాములు ఉత్సవమూర్తిని మంగళవాయుద్యాల మధ్య అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఈఓ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. యాగశాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉత్సవ సంకేతంగా ధ్వజారోహణం చేశారు.