
సాక్షి, శాంతినగర్ (అలంపూర్): ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో.. ఆదివారం జరగాల్సిన పెళ్లిని ఒక రోజు ముందుగానే చేసేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ రామచంద్రానగర్‌కు చెందిన యూసు చెల్లెలు నిఖా ఆదివారం జరగాల్సి వుంది. జనతాకర్ఫ్యూ దృష్ట్యా తనవంతు బాధ్యతగా యూసుఫ్ శనివారం సాయంత్రం మగ్రిబ్ నమాజ్ తరువాత నిఖా చేశారు. దీంతో స్థానిక ముస్లింలతోపాటు ప్రజలు యూసుఫ్‌ను అభినందించారు. జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే కరోనా మహమ్మారిని దేశంలో లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు.