మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
మహబూబాబాద్ అర్బన్ : ఓ భార్య తన భర్తకు దగ్గర ఉండి మరో వివాహం చేసింది. తాను ఇష్టపడుతున్న యువతితో ఏడు అడుగులు వేయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ దేవాలయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేశ్, సరిత దంపతులకు కొన్ని ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ, వీరస్వామి దంపతుల చిన్న కుమారై సంధ్య వరుసకు సురేశ్‌కు మరదలు అవుతుంది.
సంధ్య మానసిక దివ్యాంగురాలు. సంధ్యను ఇష్టపడుతున్నట్లు సురేశ్ తన భార్య సరితకు చెప్పడంతో ఆమె భర్త రెండో వివాహనికి అంగీకరించింది. దీంతో బుధవారం ఇరువర్గాల పెద్దలు, భార్య సరిత సమక్షంలో పట్టణంలోని భక్తమార్కండేయ దేవాలయంలో వివాహం జరిపించారు. కాగా, భర్తకు రెండో వివాహం జరిపించిన విషయం సోషల్ మీడియాలో, జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. దీనిపై సరితను వివరణ కోరగా సంధ్యను తన భర్త సురేశ్ ఇష్టపడ్డాడని, సంధ్య మానసిక దివ్యాంగురాలు అన్నారు. పిల్లల మనసత్వం కలదని, తన పిల్లల మాదిరిగానే చూసుకుంటానని చెప్పింది.
పోలీసులకు ఫిర్యాదు..
వివాహం జరగకముందు సంధ్య సోదరి భర్త నాగరాజు ఉదయం 11 గంటలకు తన మరదలు మానసిక దివ్యాంగురాలు కావొచ్చన్నారు. కానీ రెండో వివాహం చేయడం నేరమని గొడవకు దిగి 100 డయల్‌కు కాల్ చేశాడు. బ్లూకోర్టు సిబ్బంది వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకుని ఆధార్ కార్డు పరిశీలించారు. పెళ్లికూతురు మేజరని, ఇరువురి ఇష్టపూర్వకంగా వివాహం జరుగుతుందని తెలిపారు. 100 డయల్‌కు కాల్ చేసిన వ్యక్తిని మందలించి అక్కడి నుంచి పంపించారు. ఇదిలా ఉండగా రెండో వివాహాన్ని పోలీసులే ప్రోత్సహించారని పలువురు పెద్దలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment