అభ్యర్థులను మార్చాల్సిందే..! బీఆర్ఎస్‌లో ‘సీట్ల’ పంచాయితీ | Telangana BRS Candidates: Seat Dispute In Alampur And Kalwakurthy, Details Inside - Sakshi
Sakshi News home page

అభ్యర్థులను మార్చాల్సిందే..! బీఆర్ఎస్‌లో ‘సీట్ల’ పంచాయితీ

Published Wed, Aug 30 2023 10:57 AM | Last Updated on Wed, Aug 30 2023 11:40 AM

Brs Party: Seat Dispute In Alampur And Kalwakurthy - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: అధికార బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల పంచాయితీ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో సీట్ల గొడవ ఎంతకీ తెగడం లేదు. అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి గళాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలంపూర్, కల్వకుర్తి అభ్యర్థులను మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు.

అలంపూర్‌లో విభేదాలు తారా స్థాయికి చేరగా, ఎమ్మెల్యే అబ్రహం అనుకూల, వ్యతిరేక వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో పార్టీ క్యాడర్‌లో గందరగోళం పరిస్థితి నెలకొంది. కల్వకుర్తి సీటు విషయంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement