dissidence
-
టీడీపీ తొలి జాబితా: బండారు, గంటాకు హ్యాండ్!
సాక్షి,విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు లాంటి బడా నేతలతో పాటు పల్లా శ్రీనివాస్‌కు కూడా తొలి జాబితాలో చంద్రబాబు మొండిచేయి చూపించారు. మరోపక్క అనకాపల్లిలో పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ అనకాపల్లిలో సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. అసలు బలమేలేని జనసేనకు అనకాపల్లి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కిమిడి వర్గానికి షాక్ .. తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది. కళా వెంకట్రావు వర్గాన్ని మొత్తం బాబు దూరం పెట్టినట్లు చెబుతున్నారు. కొణతాలకు టికెట్టా..? జనసేన సీనియర్ల ఆగ్రహం కాగా, ఉమ్మడి విశాఖలో అటు జనసేనకు చెందిన పలువురు సీనియర్లు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. వీరిలో పంచకర్ల రమేష్, తమ్మిరెడ్డి శివశంకర్, బోలిశెట్టి సత్య, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, వంశి, కోన తాతారావు తదితరులున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు కేటాయించడంపై టికెట్ దక్కని జనసేన నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇదీ చదవండి.. టీడీపీ తొలి జాబితా.. కిమిడి వర్గానికి షాక్ -
టీడీపీ తొలి జాబితా: విజయనగరంలో ‘కిమిడి’ వర్గానికి షాక్
సాక్షి,విజయనగరం: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో జాబితాలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి చంద్రబాబు షాకిచ్చారు. జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు. రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది. టీడీపీ రాజాం టికెట్‌ను మాత్రం కొండ్రు మురళీమోహన్ సాధించుకున్నారు. జిల్లాలోని చీపురుపల్లి సెగ్మెంట్లోనూ కిమిడి కళా వెంకటరావు తమ్ముడి కుమారుడు కిమిడి నాగార్జునను టీడీపీ అధిష్టానం పక్కనపెట్టడంపై కిమిడి వర్గం నేతలు పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కిమిడి వర్గం నేతలుగా ముద్ర పడ్డ ఎవరికీ తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై ఆయన క్యాడర్ మొత్తం టీడీపీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తొలి జాబితాలో జిల్లాలోని గజపతినగరం టీడీపీ టికెట్ కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును టీడీపీ హై కమాండ్ పక్కన పెట్టింది. అధిష్టానం తీరుతో అప్పలనాయుడు వర్గం భగ్గుమంటోంది. జిల్లాలోని నెల్లిమర్ల స్థానం జనసేనకు కేటాయించడంపై టీడీపీ శశ్రేణులు భగ్గుమంటున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నేత శివరామకృష్ణ ఆశాభంగం చెందారు. జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామికి కూడా తొలిజాబితాలో చోటు దక్కలేదు. ఇదీ చదవండి.. టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పావలా వంతు కూడా ఇవ్వలేదు -
అభ్యర్థులను మార్చాల్సిందే..! బీఆర్ఎస్లో ‘సీట్ల’ పంచాయితీ
సాక్షి, మహబూబ్‌నగర్: అధికార బీఆర్ఎస్లో టిక్కెట్ల పంచాయితీ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో సీట్ల గొడవ ఎంతకీ తెగడం లేదు. అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి గళాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలంపూర్, కల్వకుర్తి అభ్యర్థులను మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు. అలంపూర్‌లో విభేదాలు తారా స్థాయికి చేరగా, ఎమ్మెల్యే అబ్రహం అనుకూల, వ్యతిరేక వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో పార్టీ క్యాడర్లో గందరగోళం పరిస్థితి నెలకొంది. కల్వకుర్తి సీటు విషయంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
టీడీపీ మినీ మహానాడు వేదికగా అసమ్మతి నేతల బహిరంగ సవాల్
సాక్షి, చిత్తూరు: నగరి టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ మినీ మహానాడు వేదికగా అసమ్మతి నేతలు బహిరంగ సవాల్ విసిరారు. స్మగ్లర్, ఇసుక, లిక్కర్ మాఫియా నాయకుడు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, లేదంటే తెలంగాణలో మాదిరిగా ఏపీ టీడీపీ తయారవుతుందని మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో వలస నేతల నాయకత్వం వద్దంటూ తీర్మానం చేశారు. చదవండి: మేకవన్నె పులి బాబూ! -
కాంగ్రెస్‌లో అసమ్మతి.. రుచి గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సినీయర్ నేతలు పార్టీ నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిలో రుచి గుప్తా కూడా చేరారు. విద్యార్థుల విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీకి ఇంచార్జీగా తన పదవికి రుచి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రుచి గుప్తా ఓ సందేశం విడుదల చేశారు. పార్టీ సంస్థాగత మార్పులలో జాప్యం కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీని విడానన్నారు. ‘ప్రియమైన అందరికి.. నేను రాజీనామ చేసినట్లు ప్రకటించడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను. పార్టీలో ముఖ్యమైన సంస్థాగత మార్పులు చాలా కాలం నుంచి పెండింగ్‌లో పడుతున్న విషయం తెలిసిందే. దాదాపు 1 సంవత్సరం 3 నెలలుగా దీనిపై జాతీయ కమిటీ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు నెలల తరబడి పెండింగ్‌లో పడుతూనే ఉన్నాయి. (చదవండి: అసమ్మతి నేతలతో సోనియా భేటీ) కొత్త కార్యకర్తలకు పార్టీలో స్థానం కల్పించేందుకు ఇతర రాష్ట్ర యూనిట్లు వేచి చూస్తున్న క్రమంలో జీఎస్(ఓ) నిరంతర జాప్యాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు పదే పదే జాప్యం చేయడం కూడా సరైనది కాదు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రుచి గుప్తా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. సంస్థాగత మార్పులు తరచూ వాయిదా పడటానికి అతడే ప్రధాన కారణమని గుప్తా ఆరోపించారు. అయినప్పటికీ ఈ విషయం పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఎప్పటికి చేరలేవన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని సోనియా గాంధీకి సినీయర్ నాయకులు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగతంపై చర్చిందుకు పార్టీ సినీయర్ నాయకులతో సోనియా ఇవాళ భేటి అయ్యారు. (చదవండి: పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత) -
అసమ్మతి నేతలతో సోనియా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పార్టీలో ప్రక్షాళన జరగాలని అధిష్టానానికి వ్యతిరేకంగా ఇటీవల కీలక వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ నేతల అసంతృప్తిని చల్చార్చే ప్రయత్నానికి కాగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీలో ప్రక్షాళన జరగాలంటూ పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంచలనం రేపింది. చదవండి: కాంగ్రెస్ తీరు మారినట్టేనా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, సీడబ్ల్యూసీ సభ్యత్వ పదవులకు అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని 23 మంది సీనియర్ నాయుకులు అసమ్మతి గళం వినిపించారు. ఎట్టకేలకు అసమ్మతి నేతలతో భేటీ అయిన సోనియా, సీనియర్ నేతల మధ్య కమల్‌నాథ్ సంధాన కర్తగా వ్యహరిస్తున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లోట్, అంబికా సోని, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, వివేక్ తంఖా, శశి థరూర్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా, పీ. చిదంబరం పాల్గొన్నారు. అసమ్మతి నేతలతో జరుగుతున్న ఈ భేటీ పాధాన్యత సంతరించుకుంటోంది. -
సబ్బం హరికి అసమ్మతి సెగ
సాక్షి, విశాఖపట్నం: అధికార టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సబ్బం హరి పేరు ఖరారు చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సబ్బం హరికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత కోరాడ రాజబాబుతో సహా పలువురు నేతలు మంగళవారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరకుండానే అధిష్ఠానం సబ్బం హరికి టికెట్ ఇవ్వడం దారుణమని టీడీపీ నాయకులు వాపోతున్నారు. బాబూరావు గరం గరం కనిగిరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, కదిరి బాబురావు టీడీపీ అధిష్టానంపై రగిలిపోతున్నారు. పార్టీకి సేవ చేసిన తనను పక్కన పెట్టి టీడీపీకి ఏమాత్రం సంబంధం లేని ఉగ్రనరసింహరెడ్డికి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి దర్శికి వెళ్లేది లేదని బాబూరావు తెగేసి చెప్తున్నారు. అవసరమయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాబురావుకి కనిగిరి టికెట్ ఇవ్వాల్సిందే అని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద నిరసన జ్వాలలు అమరావతిలోని సీఎం నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. మాచర్ల టిక్కెట్ అంజిరెడ్డికి కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసానికి భారీగా తరలివచ్చి నిరసన చేపట్టారు. అంజిరెడ్డికి సీటు ఇస్తే నామినేషన్ వేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తే పార్టీ కోసం కష్ట పడిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. -
టీడీపీలో అసమ్మతి సెగలు
-
టీడీపీలో అసమ్మతి సెగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా తిరుపతి టీడీపీలో అసమ్మతి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మకు టిక్కెట్ ఇవొద్దంటూ వ్యతిరేక వర్గం గట్టిగా గళమెత్తింది. ఆమెకు వ్యతిరేకంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సహా 50 డివిజన్ల అసమ్మతి నాయకులు శనివారం సమావేశమయ్యారు. సుగుణమ్మ వైఖరితో పార్టీ నష్టపోతుందని అసమ్మతి వర్గం నేతలు పేర్కొన్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. రెండు వర్గాల అధిపత్యపోరుతో టీడీపీలో లుకలుకలు వీధికెక్కాయి. ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతాయని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. మరోవైపు తిరుపతి అసెంబ్లీ టిక్కెట్‌ను అధినేత చంద్రబాబు ఎవరికీ కేటాయిస్తారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. (పెరుగుతున్న వైఎస్సార్సీపీ బలం) -
పరిటాల సునీతకు షాక్
సాక్షి, అనంతపురం/కడప: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. అధినాయకత్వం వ్యవహార శైలితో తెలుగు దేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండటాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీలో ఉండలేమంటూ బయటకు వెళ్లిపోతున్నారు. (కాంగ్రెస్ టీడీపీల మధ్య సీక్రెట్ బట్టబయలు..) నలపరెడ్డి రాజీనామా అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నియోజకవర్గం రాప్తాడుకు చెందిన నాయకుడు నలపరెడ్డి శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, సునీత తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా నలపరెడ్డి ఆరోపించారు. రాప్తాడులో పరిటాల సునీత అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. (‘కాల్వ’కు ఎదురుదెబ్బ!) టీడీపీకి బాలకొండయ్య గుడ్‌బై వైఎస్సార్ జిల్లా కడప టీడీపీలోనూ అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. జిల్లా టీడీపీ నాయకత్వ తీరు నచ్చక ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ ఓర్సు బాలకొండయ్య నేడు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో నాయకుల దగ్గర నీతితో కూడిన విలువలు లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. (అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ) -
అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకొద్దు!
గుంటూరు, ఈపూరు(వినుకొండ): అభివృద్ధి చేయని ఎమ్మెల్యే మాకొద్దు అంటూ వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన టీడీపీ అసమ్మతి నేతలు గురువారం ముక్తకంఠంతో నినదించారు. ఈపూరు మండలంలోని ఆరేపల్లి ముప్పాళ్లలో దాదాపు 300 మంది టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. దాదాపు 1600 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే జీవీ క్షేత్రస్థాయిలో అవి ఏమేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయో తెలుసుకోలేకపోవడంపై నిరసనలు వ్యక్త మయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వినుకొండ ఎమ్మెల్యే సీటు ఎట్టి పరిస్థితులలో జీవీ ఆంజనేయులుకు ఇవ్వవద్దని వారు విజ్ఞప్తిచేయడం గమనార్హం. ప్రభుత్వ నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ పర్సంటేజిలు ఇవాల్సిన దుస్థితి నెలకొందని, లేనిపక్షంలో బిల్లులు ఆపించడం ఎమ్మెల్యేకు అలవాటైన పని అని కొందరు నాయకులు వాపోయారు. ఇటీవల జన్మభూమి సభలో మా గ్రామానికి మీరు ఏం చేస్తున్నారని ఒక కార్యకర్త ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్ట్ చేయించారని చెప్పారు. ఎమ్మెల్యే బావమరిది బొల్లాపల్లి మండలంలో చేస్తున్న భూ ఆక్రమణలు, అడంగల్, ఆన్లైన్లో పేర్లు మార్చటాలపై దిగువ బొల్లాపల్లి మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సన్నిహితుడైన ఓ న్యాయవాది, ఓ దళారీ చేస్తున్న భూమాపియా, రేషన్‌మాఫియా వంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయన్నారు. వేసిన సిమెంట్ రోడ్లు నాసిరకంగా ఉండి పగుళ్లు ఇవ్వడం, తారు రోడ్లు వేసిన మూడు గంటలకే కుంగటంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారని, దీనికి కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే కుమ్మక్కు కావడమే కారణమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీలో సభ్యత్వం లేనివారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెటడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో వర్గాలను ప్రోత్సహించడం వలనే పార్టీలో సంక్షోభం ముదిరినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలు నూతన అభ్యర్థి అన్వేషణలో ఉన్నారని సీనియర్ నాయకులు ఒకరు చెప్పారు. జీవీని తప్పించి మంత్రి లోకేష్‌కు వినుకొండ అసెంబ్లీ సీటు కేటాయించాలని ముఖ్యమంతిని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. కొసమెరుపు జరుగుతున్న సమావేశం వద్దకు ఎమ్మెల్యే తన ప్రతినిధులుగా ముగ్గురిని పంపించారు. వారు వచ్చి పార్టీ కోసం పనిచేయాలని సూచించగా అదేదో ఎమ్మెల్యేనే ఇక్కడకు వచ్చి సమస్యలు పరిష్కరించమని కార్యకర్తలు కోరారు. దీంతో సమాధానం చెప్పలేక వారు వెనుదిరిగారు. సమావేశంలో మోదుగుల సత్యం, మోదుగుల నరసింహా రావు, విడపలపాటి హనుమయ్య, కట్టా కోటయ్య,బుచ్చారావు,రామసుబ్బయ్య, ముండ్రు హనుమంతరావు, శాఖమూరి రామమూర్తి, కోటా నాయక్, వజ్రాల సోమిరెడ్డి, కట్టా వలరాజు, కంచేటి చంద్రరావు, కన్నెదారి బ్రహం,కాకాని శ్రీనివాసరావు, పాలడుగు శివయ్య, జాస్తి సీతయ్య, గోగినేని సుధాకర్ పాల్గొన్నారు. -
టీడీపీలో రాజుకున్న టిక్కెట్ల లొల్లి
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ ముదురుతోంది. పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు బల ప్రదర్శనలకు దిగుతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగం వెళ్లగక్కుతున్నారు. వర్గాలుగా విడిపోయి వీధిపోరాటాలకు దిగుతున్నారు. కొందరు నేరుగా అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. తాటికొండలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ‘జగ్గంపేట’పై పీఠముడి టీడీపీలో జగ్గంపేట సీటు వివాదం రాజుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరుతూ ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులు మంగళవారం చంద్రబాబును కలిశారు. అనారోగ్యం కారణంగా ఎంపీ స్థానానికి పోటీ చేయలేనని చంద్రబాబుకు నరసింహం తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్యకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. గతంలో జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిశానని, ఇప్పటికి తమకు అక్కడ బలమైన కేడర్ ఉందని వివరించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో తమ కేడర్ ఇబ్బంది పడినా సర్దుకుపోయామని తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. కొవ్వూరు టీడీపీలో కాక పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేధాలు తారాస్దాయికి చేరుకున్నాయి. మంత్రి జవహర్‌కు టిక్కెట్ కేటాయింపుపై టీడీపీ రెండు వర్గాలగా విడిపోయింది. జవహర్‌కు టిక్కెట్ ఇస్తే పనిచేసేది లేదని కొన్ని రోజుల క్రితం అధిష్టానానికి వ్యతిరేక వర్గం తేల్చి చెప్పింది. రెండు రోజుల క్రితం మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పోటీగా జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో జవహర్ అనుకూల వర్గం వంద కార్లలో అమరావతికి బయలుదేరింది. జవహర్కే టిక్కెట్ కేటాయించాలంటూ చంద్రబాబును కలవనుంది. వర్గపోరుతో ఇప్పటికే కొవ్వూరులో రెండు టీడీపీ కార్యాలయాలుగా కొనసాగుతోంది. వెంకటపాలెంలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ శ్రావణ్‌కుమార్‌పై చెలరేగిన అసమ్మతి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై సొంత పార్టీలోనే అసమ్మతి చెలరేగింది. వచ్చే ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని, తమ మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే మాయనను ఓడిస్తామని స్థానిక టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటపాలెంలో మంగళవారం శ్రావణ్‌కుమార్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. (ఆయనకు టికెట్ ఇవ్వొద్దు; అమరావతిలో ఉద్రిక్తత) టీటీడీ పదవి వద్దు వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే సీటు తన కుమారుడికి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబును కలిశారు. తన కుమారుడికి టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవి వద్దని అధినేతకు చెప్పారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పాలకొండ రాయుడు టెన్షన్‌గా ఉన్నారు. -
తప్పుకున్నారు
-
తప్పిన రెబెల్స్ బెడద
సాక్షి, హైదరాబాద్: రెబెల్స్ బెడద పెద్దగా లేకపోవడంతో ప్రధాన రాజకీయపార్టీలు ఊపిరిపీల్చుకున్నాయి. అసంతృప్త నేతలను బుజ్జగించడంలో ఆయా పార్టీలు దాదాపు సఫలీకృతమయ్యాయి. టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు తిరుగుబాటు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉండటంతో అక్కడ స్నేహపూర్వకపోటీలు అనివార్యమయ్యాయి. మొత్తం మీద కూటమి పక్షాలు– కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3 చోట్ల బరిలో నిలిచాయి. ఫలించిన కేటీఆర్ దౌత్యం టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేత లను బుజ్జగించడంలో మంత్రి కేటీఆర్ సఫల మయ్యారు. వారి భవిష్యత్తుపై హామీలిచ్చి పోటీలో ఉండకుండా నివారించగలిగారు. దాదాపు 25 స్థానాల్లో తిరుగుబాట్లకు అవకాశముండగా, ఆరు మాత్రమే మిగిలాయి. కోరుకంటి చందర్ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), జి.వినోద్ (బెల్లంపల్లి), మన్నె గోవర్ధన్‌రెడ్డి (ఖైరతాబాద్), గజ్జెల నగేశ్ (కంటోన్మెంట్), తోకల శ్రీనివాస్‌రెడ్డి (రాజేంద్రనగర్)లు టీఆర్ఎస్ రెబల్స్‌గా పోటీలో నిలిచారు. వీరిలో కోరుకంటి చందర్, సత్యనారాయణరావు, శ్రీనివాస్‌రెడ్డిలు ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి సింహం గుర్తుపై, మన్నె గోవర్దనరెడ్డి, జి.వినోద్ బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏనుగు గుర్తుపై బరిలో ఉన్నారు. గజ్జెల నగేశ్ మాత్రం ఇండిపెండెంట్‌గానే పోటీలో ఉన్నారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించేందుకు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానమే హైదరాబాద్‌కు చేరుకుంది. సోనియా, రాహుల్ మినహా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలంతా మూడు, నాలుగురోజులుగా ఇక్కడే మకాం వేసి రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. కీలక నేతలు అహ్మద్‌పటేల్, జైరాం రమేశ్, డి.కె.శివకుమార్, జైపాల్‌రెడ్డితోపాటు మధుయాష్కీగౌడ్, వి.నారాయణస్వామి, మల్లాడి కృష్ణమూర్తి, సుబ్బిరామిరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తిరుగుబాటు అభ్యర్థుల ఇండ్లకు, కార్యాలయాలకు వెళ్లి వారి భవిష్యత్తుపై హామీలిచ్చారు. దీంతో చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో శేరిలింగంపల్లి, మేడ్చల్, అంబర్‌పేట, వరంగల్ వెస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, చేవెళ్ల, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, కోరుట్ల, పెద్దపల్లి తదితర నియోజకవర్గాలున్నాయి. అలకవీడని బిల్యానాయక్ (దేవరకొండ), ఎన్.రత్నాకర్ (నిజామాబాద్ అర్బన్), ఎ.చంద్రశేఖర్ (వికారాబాద్), ఊకె అబ్బయ్య (ఇల్లెందు), బోడ జనార్దన్ (చెన్నూరు), శివకుమార్‌రెడ్డి (నారాయణపేట), మద్దెల రవీందర్ (ధర్మపురి) రెబల్స్‌గా బరిలో ఉన్నారు. నాలుగు అటు, నాలుగు ఇటు కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేయాల్సిన కాంగ్రెస్ 99 చోట్ల పార్టీ గుర్తుపై బరిలో నిలిచింది. అంబర్‌పేటలో లక్ష్మణ్‌యాదవ్, వర్దన్నపేటలో కాంగ్రెస్ కొండేటి శ్రీధర్ కూడా పోటీ నుంచి వైదొలిగారు. మద్దుల నాగేశ్వర్‌రెడ్డి (దుబ్బాక), వద్దిరాజు రవిచంద్ర(వరంగల్ఈస్ట్)లు బరిలోనే ఉన్నారు. కాంగ్రెస్ పోటీచేస్తున్న స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు మిర్యాలగూడ, చెన్నూరు, మెదక్, అశ్వారావుపేటలలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్‌రాథోడ్‌పై బీంరావు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుపై విజయ్‌లు టీజేఎస్ తరపున బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ కేటాయించిన మహబూబ్‌నగర్‌లో టీజేఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి సామరంగారెడ్డి (టీడీపీ)పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. మూడింట రెండు చోట్ల... పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన బెల్లంపల్లి, హుస్నాబాద్, వైరా స్థానాల్లో రెబల్స్ బెడద తప్పలేదు. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి వినోద్, వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాములునాయక్ పోటీలో నిలిచారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ రెబల్‌గా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ వేసినప్పటికీ దాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో సీపీఐ ఊపిరిపీల్చుకుంది. ఆ మూడు చోట్ల... బీజేపీతోపాటు బీఎల్ఎఫ్, సమాజ్‌వాదీ పార్టీలకు ఈసారి ఎన్నికల్లో చిన్న షాక్‌లు తగిలాయి. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత షాద్‌నగర్‌లో మాజీ మంత్రి శంకర్రావు (సమాజ్‌వాదీ పార్టీ), కుత్బుల్లాపూర్‌లో కాసాని వీరేశం (బీజేపీ), ముషీరాబాద్‌లో నగేశ్ ముదిరాజ్ (బీఎల్ఎఫ్)లు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ రెబల్స్ ఉన్న నియోజకవర్గాలు: వికారాబాద్, ఇల్లెందు, నారాయణపేట, చెన్నూరు, దేవరకొండ, నిజామాబాద్ (అర్బన్), ధర్మపురి టీఆర్ఎస్ రెబల్స్: రామగుండం, భూపాలపల్లి, బెల్లంపల్లి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కంటోన్మెంట్ కాంగ్రెస్ వర్సెస్ టీజేఎస్: దుబ్బాక, వరంగల్ (ఈస్ట్), ఖానాపూర్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ రెబల్ వర్సెస్ టీడీపీ: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రెబల్ వర్సెస్ సీపీఐ: వైరా కూటమిలో నామినేషన్లు ఉపసంహరించుకున్న నియోజకవర్గాలు మిర్యాలగూడ(టీజేఎస్), అంబర్‌పేట(కాంగ్రెస్), చెన్నూరు (టీజేఎస్), మహబూబ్‌నగర్ (టీజేఎస్), మెదక్ (టీజేఎస్), అశ్వారావుపేట (టీజేఎస్). -
గులాబీలో సమ్మతిరాగం..
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఫలించింది. అభ్యర్థుల ప్రకటనపై భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్చలు ఫలప్రదం కావడంతో దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ సమ్మతి రాగం వినిపిస్తోంది. భవిష్య త్తులో వచ్చే అవకాశాలపై అధిష్టానం తరఫున హామీ ఇవ్వడంతో అసంతృప్త నేతలు సైతం పార్టీ అభ్యర్థులతో కలసి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇక అసమ్మతికి తెరపడినట్లేనని టీఆర్ఎస్ భావిస్తోంది. చెన్నూరుతో మొదలు... రాజకీయ ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ వారిని సైతం ఆశ్చర్యపరుస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో ఏదైనా కారణంతో అభ్యర్థులను మారు స్తారనే ఆశతో పలువురు ఆశావహులు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేయడం, మరికొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించింది. టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చర్చల వ్యూహం మొదలుపెట్టారు. చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో చర్చలు ఫలించాయి. అనంతరం అన్ని జిల్లాలకు ఇదే సూత్రం అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎక్కువ నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతలకు మధ్య తొలుత అంతరం నెలకొంది. ఉప్పల్‌లో అభ్యర్థిని మార్చాలని కార్పొరేటర్లు గట్టిగా డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ విషయాల్లోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమన్వయం చేసి ఈ సెగ్మెంట్ల అసమ్మతి నేతలను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అందరూ కలసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిన స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, మహబూబాబాద్, ఖమ్మం, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, అలంపూర్, నిర్మల్, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, ముథోల్, మంథని, మానకొండూరు, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, నర్సాపూర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, తుంగతుర్తి సెగ్మెంట్ల అసమ్మతి విషయంలోనూ కేటీఆర్ ఇదే సూత్రం అమలు చేశారు. మొత్తంగా ఎన్నికల నోటిఫిషన్‌కు పది రోజుల ముందే టీఆర్ఎస్లో అసమ్మతులకు దాదాపుగా ముగింపు పలికినట్లయింది. ఇక రామగుండం, భూపాలపల్లి విషయంలోనూ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసి దీన్ని పూర్తి చేయనున్నారు. కల్వకుర్తిలోనూ కథ సుఖాంతం... కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అసమ్మతి సెగ సమసిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్ పేరును ప్రకటించడంతో ఇక్కడ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో పార్టీలో చేరి పోటీ చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తుండటంతో ఆ దిశగానూ ఆలోచించారు. దీంతో నారాయణరెడ్డి, ఆయన అనుచరులు జైపాల్ యాదవ్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. నారాయణరెడ్డితో మంత్రి కేటీఆర్ గురువారం చర్చలు జరిపారు. అభ్యర్థుల మార్పు ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని నారాయణరెడ్డికి సూచించారు. భవిష్యత్తులో కచ్చితంగా మంచి అవకాశం కల్పిస్తామని నారాయణరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. దీంతో తాను పార్టీ మారాలనే ఆలోచన చేయలేదని, టీఆర్ఎస్ అభ్యర్థితో కలసి ప్రచారం చేస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్‌తో కలసి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కల్వకుర్తిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు వెళ్లారు. దీంతో కల్వకుర్తి టీఆర్ఎస్లో అసమ్మతి ముగిసిపోయింది. అధిష్టానం నిర్ణయం శిరోధార్యం: శంకరమ్మ టికెట్ కేటాయింపులో టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మాహుతికి పాల్పడిన శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారన్నారు. -
కన్నడ నాట పదవుల కీచులాట...!
కన్నడ నాట ‘సంకీర్ణ రాజకీయాలు’ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జేడీ(ఎస్)–కాంగ్రెస్ ఉమ్మడి సర్కార్‌లో భాగస్వాములుగా మారిన నేపథ్యంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ‘రాజకీయ డ్రామా’గా రక్తి కట్టిస్తున్నాయి. బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఈ రెండుపక్షాలు చేతులు కలిపినా, అప్పటి నుంచి ప్రతీరోజు ఏదో ఒక రూపంలో వీటి మధ్య లేదా ఆయా పార్టీల్లో అంతర్గత కీచులాటలు బయటపడుతున్నాయి. తాజాగా కర్ణాటకలో కేబినెట్ విస్తరణ అసమ్మతిని రాజేసేందుకు కారణమవుతోంది. ఎన్నికల అనంతరం కుదుర్చుకున్న పొత్తుతో ఏర్పాటైన ఈ ప్రభుత్వం ఇప్పుడు మంత్రిపదవుల కేటాయింపుల రూపంలో బాలారిష్టాలు ఎదుర్కుంటోంది. కేబినెట్ కూర్పులో భాగంగా కాంగ్రెస్‌కు 15, జేడీ–ఎస్‌కు 10 పోస్టులు దక్కాయి. కులం,వర్గం, సీనియర్, జూనియర్, తదితర పరిమితుల్లో పదవులు దక్కని ఇరుపార్టీల నేతలు అసమ్మతి కుంపటిని రాజేసే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు వార్తలొస్తున్నాయి. కొందరు నేతలైతే తమ నాయకత్వాలపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటివి అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత ఎక్కువగానే ఉన్న కాంగ్రెస్‌లో మరీ అధికంగా కనిపిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు వారాలే దాటిన నేపథ్యంలో ఇరుపార్టీలు ‘అసమ్మతి’ని మొగ్గలోనే తుంచేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నిరసన జ్వాలలు... మంత్రివర్గ జాబితా సిద్దమైందో లేదో దాంట్లో పేర్లు లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో విడిగా సమావేశమయ్యారు. మైసూరు, గడగ్, విజయపుర, కలబురగి తదితర ప్రాంతాల్లోని ఈ ఎమ్మెల్యేల మద్దతుదారుల నిరసనలు మిన్నంటాయి. ఇప్పటివరకు కేవలం జేడీఎస్ నుంచి సీఎం హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర మాత్రమే ప్రమాణం చేశారు. దాదాపు రెండువారాల పాటు సాగిన విస్తరణ కసరత్తు తర్వాత కేబినెట్‌కు ఓ రూపునిచ్చేందుకు జరిగిన ప్రయత్నం కాస్తా పలువురు నేతలకు అసంతృప్తిని మిగిల్చింది. కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, ఆర్.రామలింగారెడ్డి, ఆర్. రోషన్‌బేగ్, హేచ్కే పాటిల్, శమనూరు శివశంకరప్ప, సతీష్ జర్కిహోళి వంటి వారికి ఇందులో చోటు దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితోనే ఉన్నామని ఏఐసీసీ కార్యదర్శిగానూ ఉన్న జర్కిహోళి పేర్కొన్నారు. ‘కేబినెట్ విస్తరణపై చర్చించిన తాము జరిగిన తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్ర, జాతీయ నాయకత్వాల దృష్టికి సమర్థుల పేర్లను తీసుకెళతాం. దీనిపైనే రెండుసార్లు చర్చించాం. మరోసారి కూడా చర్చిస్తాం’ అని వెల్లడించారు. పార్టీ నేతలతో తాను సమావేశం కావడంలో తప్పేముందని, తాను ఆత్మగౌరవానికే అధిక ప్రాధాన్యతనిస్తానని, ఇది పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందంటూ మాజీమంత్రి పాటిల్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నాయకత్వం కూడా కార్యకర్తల కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మంత్రుల జాబితాలో చోటు దక్కలేదని తెలుసుకున్న ఎంసీ మనుగులి మద్దతుదారులు హేచ్‌డీ దేవగౌడ ఇంటి వద్ద నిరసన వ్యక్తంచేశారు. రొటేషన్ చక్రవర్తులు...! పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించడంతో పాటు మంత్రిమండలిలో మరి కొంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు వీలుగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్మూలా తెరపైకి తీసుకొచ్చింది. ఈ రొటేషన్ ప్రణాళికలో భాగంగా మూడు పాయింట్ల ఫార్మూలా అమలుచేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి ఆవకాశం కల్పించడం... మంత్రుల శాఖల నిర్వహణపై ప్రతీ ఆరునెలలకు ఒకసారి పనితీరు ఆధార సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలుకడం...ప్రస్తుతానికి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్ పోస్టులు భర్తీ చేయకుండా అట్టే పెట్టడం... ఈ విధంగా మంత్రులను కార్యోన్ముఖులను చేయడంతో పాటు, ప్రతిభ చూపని వారి స్థానంలో మరికొందరికి మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు. నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి పేర్లను భవిష్యత్ విస్తరణలో పరిగణలోకి తీసుకోమంటూ పనిలో పనిగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే సిద్ధరామయ్య కేబినెట్లో కీలక సభ్యుడిగా ఉన్న కురుబ నేత హేచ్ఎం రేవణ్ణకు ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. మరోవైపు ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ వేచిచూస్తోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంగ్రెస్ పరిస్థితి ఇక క్రాస్ రోడ్డేనా?
టెన్ జనపథ్ .... ఒకప్పుడు కాంగ్రెస్సీయులకు ఇదే దేవాలయం. అక్కడి కనుసైగ వారికి ఆదేశం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందా? శ్రేణులు అగ్ననేతల మాట వినడం లేదా? అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్ ఎందుకు మార్చలేకపోతోంది? కాంగ్రెస్ పరిస్థితి ఇక క్రాస్ రోడ్డేనా? గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ లో బహిరంగ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఇక పశ్చిమాన మహారాష్ట్ర లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నారాయణ రాణే వైదొలగితే, తూర్పున అస్సాంలో ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌పై మంత్రి, సీనియర్ నేత హిమంత బిశ్వాస్ దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రుల్ని మార్చాలని తిరుగుబాటు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలే కాదు. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. దానితో పాటు బెంగాల్, జార్ఖండ్, అసోంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుగుబాట్లు తలెత్తడంతో... కాంగ్రెస్ నాయకత్వం తలపట్టుకుంటోంది. మహారాష్ట్రలో మహా తిరుగుబాటుః ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించనందుకు నిరసనగా మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, పృథ్వీరాజ్ చవాన్ కేబినెట్లో పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే పదవి నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి చవాన్ పనితీరుపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించారు. పృధ్వీరాజ్ చవాన్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్‌కు ... లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన దుస్థితి ఎదురవుతుందని విరుచుకుపడ్డారు. ఆ ఓటమిలో తాను భాగస్వామి కాలేనని ప్రకటించారు. అస్సాంలో అల్లకల్లోలం - ఇక అసోంలో సీనియర్ మంత్రి హిమంత బిశ్వ శర్మ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవి తనకివ్వాలన్నది ఆయన డిమాండ్. పార్టీకి వ్యతిరేకంగా తాను వ్యవహరించనని హిమంతా అంటున్నా... ఆయనకు మద్దతిస్తున్న 31 మంది ఎమ్మెల్యేలు తాము నిర్మాణత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అసోంలో తరుణ్ గొగయ్ది గడ్డు పరిస్థితే. 126 మంది ఎమ్మెల్యేలున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 77. ఇప్పుడు ఒకరిద్దరూ అటు ఇటైనా అసోంలో కాంగ్రెస్ సర్కారు కూలడం ఖాయం. అటు బెంగాల్లోనూ కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో దూరిపోయారు. అటు నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ లాల్‌సింగ్ రాజీనామా చేశారు. ఇంకో వైపు హర్యానా సీఎం మార్పు కోరుతూ నిరసన గళాలు జోరందుకున్నాయి. రాహుల్ పై అపనమ్మకమా? రాహుల్ గాంధీ నాయకత్వం పై కాంగ్రెస్ లో నిరాశా నిస్పృహలు వ్యక్తమౌతున్నాయి. యూత్ కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ ఓ ప్రయోగశాలగా భావించి ప్రయోగాలు చేసి దాన్ని నాశనం చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపీ గుఫ్రాన్ ఆజం ఈ మధ్యే విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటముల నుంచి కాంగ్రెస్ ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదని కాంగ్రెస్ మిత్రపక్షం కేరళకు చెందిన ముస్లిం లీగ్ తన పార్టీ పత్రిక చంద్రికలో విమర్శించింది. కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించి మోడీ హైటెక్ ప్రచారానికి కాంగ్రెస్ పావుగా మారిందని ఆరోపించింది. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్ గడ్డుకాలమే. ఢిల్లీలోనూ కాంగ్రెస్ కళతప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద భారత రాజకీయాల గ్రాండ్ ఓల్డ్ లేడీ కాంగ్రెస్ మంచం పట్టింది. దానికి మందూ మాకూ ఇస్తారా లేక, మంచం దింపేస్తారా అన్నది కాంగ్రెస్ నేతృత్వం నిర్ణయించుకోవాలని, నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని విశ్లేషకులు అంటున్నారు. -
మరో ముఖ్యమంత్రికి ఎసరు
వరుసపెట్టి ముఖ్యమంత్రులను మార్చిపారేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస పెద్దలు.. ఇప్పుడు అసోం సీఎం తరుణ్ గొగోయ్ పదవికి కూడా ఎసరు పెడుతున్నారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గొగోయ్ మీద ప్రజల్లో వ్యతిరేకత మాట ఎలా ఉన్నా.. అంతర్గతంగా ఆయన మంత్రివర్గంలోనే వ్యతిరేకత రావడంతో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర విద్య, ఆరోగ్యశాఖల మంత్రి హిమంత విశ్వశర్మ నాయకత్వంలో గొగోయ్ వ్యతిరేక శిబిరం ఇటీవలి కాలంలో బాగా చురుగ్గా వ్యవహరిస్తోంది. పదమూడేళ్లుగా సీఎంగా ఉన్న గొగోయ్.. ఈసారి తమ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సొంత పార్టీని పెద్దగా గెలిపించుకోలేకపోయారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు మాత్రమే వచ్చాయి. దాంతో ఆయన మీద వ్యతిరేకత మరింత పెరిగింది. 2016 సంవత్సరంలో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువల్ల ఈ రెండేళ్ల పాటు కొత్త ముఖాన్ని తీసుకొస్తే ఫలితం ఏమైనా ఉండచ్చేమోనని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. -
మోడీ, కెసీఆర్ లకు లేనిది... చంద్రబాబుకు ఉన్నది....
ఒక నాయకుడి బలం తెలుసుకోవాలంటే ఆ నాయకుడిని ఆయన అనుచరులు ఎంత బలంగా నమ్ముతున్నారో తెలుసుకుంటే చాలు. దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కరుణానిధిని ఆయన అనుచరులు విడిచిపోలేదు. జయలలిత అధికారంలో ఉన్నా లేకున్నా ఆమె అనుచరులు ఆమె వెన్నంటే ఉంటారు. నరేంద్ర మోదీ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పక్కనబెట్టారు. బండారు దత్తాత్రేయ వంటి బలమైన నేతలను పక్కనపెట్టారు. కానీ పార్టీలో ఎలాంటి తిరుగుబాటూ లేదు. అదే విధంగా కొద్ది పాటి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రి వర్గం విషయంలోనూ అసంతృప్తులు ఉన్నా బయటకి రావడం లేదు. ఎవరూ తిరుగుబాటు ప్రకటించలేదు. అదే చంద్రబాబు విషయానికి వచ్చే సరికి ఆయనకు అసెంబ్లీలో తగినంత బలం ఉంది. కెసీఆర్ తో పోలిస్తే ఆయన పరిస్థితి మరింత సురక్షితం. ఆయనకు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉంది. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు ఉంది. ఇన్ని ఉన్నా ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తే అసమ్మతి సెగలు ఎందుకు రగులుతున్నాయి? ఎందుకు ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు నిరాహార దీక్షలకు దిగుతున్నారు? ఎందుకు వారు పార్టీ పదవులకు బై చెబుతున్నారు? ఉత్తరాంధ్రలో ఏడు సార్లు ఎన్నికలు గెలుస్తూ వచ్చిన పతివాడ నారాయణ స్వామి, కష్టకాలంలోనూ పార్టీని వెన్నంటి ఉన్న కళా వెంకటరావు అసంతృప్తితో ఉన్నారు. దాన్ని వారు దాచుకోవడం లేదు. మరో వైపు విశాఖపట్నంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు దూతగా వచ్చి బుజ్జగించినా ఆయన మాట వినడం లేదు. తూర్పు గోదావరిలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాజమండ్రిలో మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న కాగిత వెంకట్రావు మధుమేహ వ్యాధి పీడితుడై ఉండీ నిరాహార దీక్ష చేసి, ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఇక గుంటూరులోనైతే గత పదేళ్లుగా పార్టీకి నోరుగా పనిచేసిన ధూళిపాళ నరేంద్ర కు మంత్రి పదవి దక్కనందుకు ఆయన అనుచరులు ఆయనను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లవద్దని నిర్బంధించారు. ఇంకోవైపు మోదుగుల అనుచరులు టీడీపీ కార్యాలయంపైనే దాడి చేసి, కసి తీర్చుకున్నారు. అనంతపురంలో పెనుకొండ ఎమ్మెల్యే బీకె పార్థసారధి అనుచరులు పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ తిరుగుబాటు చంద్రబాబు ఊహించి ఉండరా? కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలు, గతం నుంచి వెన్నంటి ఉండిన వారికి మధ్య సయోధ్య ఎందుకు కుదర్చలేదు? పార్టీ నేతలతో ఆయన ముందస్తుగా చర్చించి, బుజ్జగించడానికి ప్రయత్నించలేదా? వారికి వేరే పదవులు ఇస్తామని హామీ ఇచ్చారా లేదా? రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సీమాంధ్రను మళ్లీ పునర్నిర్మించే బాధ్యత ఉన్న నేతగా ఆయన తన లీడర్ షిప్ ను ప్రదర్శించాల్సిన సమయంలో ఎందుకు విఫలమయ్యారు? ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన పరిస్థితిలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్టుంది. ఇప్పటికే రుణమాఫీ తలకు చుట్టుకుంటోంది. మిగతా వాగ్దానాలూ ఇలాగే ఉండబోతున్నాయా? ప్రస్తుతం ఓటర్లు ఎక్కువకాలం వేచి చూసే మూడ్ లో లేరు. తాము నమ్మి నాయకత్వం, అధికారం కట్టబెట్టిన నేత తప్పటడుగులు వేసినా కొద్దికాలం సహిస్తారేమో కానీ, తప్పుటడుగులు వేస్తున్నారన్న అనుమానం వస్తే చాలు శిక్షించేందుకు రెడీ అవుతారు. కేవలం అయిదులక్షల ఓట్లు ఎక్కువగా వచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశాన్ని శిక్షించేందుకూ వోటర్లు వెనుకాడరు. -
గుచ్చుతున్న గులాబి ముళ్లు
ఉద్యమ పార్టీ నుంచి నూటికి నూరుశాతం రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్లో టిక్కెట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి వరకు పార్టీలో ఉన్నవారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేనివారికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ బంపర్ అఫర్ ఇస్తున్నారు. తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పార్టీలో టిక్కెట్ల అంశం తలనొప్పిగా మారుతోంది. మహబూబ్‌నగర్ టిక్కెట్‌ను శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించడంపై స్థానిక టీఆర్ఎస్ నేత ఇబ్రహీం అగ్రహంతో ఉన్నారు. మరోవైపు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు సీనియర్ నేత కడియం శ్రీహరి పోటిపడుతున్నారు. మహబుబ్‌నగర్ జిల్లా నారాయణపేట టిడీపీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డిని చేర్చుకోవడంతో పాటు మక్తల్ సీటును అయనకు కేటాయించడంతో అప్పటివరకు ఇంచార్జ్‌గా ఉన్నదేవరమల్లప్ప అసంతృప్తితో ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. పార్టీలో వివాదం పెద్దది కావడంతో టిక్కెట్టు రాని నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కేసీఆర్ ఆశలు కల్పిస్తున్నారు. మరో వైపు అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు కేటాయించడం లేదని కేసీఆర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణ కోసం అత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తనకు పాలకుర్తి సీటు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్టుపై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అమె నిరసనకు దిగారు. తాను సైతం ఆత్మాహుతి చేసుకుంటానని కూడా అన్నారు. ఇలా గులాబి పార్టీలో ముళ్లు ఎక్కువవుతున్నాయి.