సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా తిరుపతి టీడీపీలో అసమ్మతి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మకు టిక్కెట్ ఇవొద్దంటూ వ్యతిరేక వర్గం గట్టిగా గళమెత్తింది. ఆమెకు వ్యతిరేకంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సహా 50 డివిజన్ల అసమ్మతి నాయకులు శనివారం సమావేశమయ్యారు. సుగుణమ్మ వైఖరితో పార్టీ నష్టపోతుందని అసమ్మతి వర్గం నేతలు పేర్కొన్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు.
రెండు వర్గాల అధిపత్యపోరుతో టీడీపీలో లుకలుకలు వీధికెక్కాయి. ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతాయని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. మరోవైపు తిరుపతి అసెంబ్లీ టిక్కెట్‌ను అధినేత చంద్రబాబు ఎవరికీ కేటాయిస్తారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది.
కాగా, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. (పెరుగుతున్న వైఎస్సార్‌సీపీ బలం)
Comments
Please login to add a commentAdd a comment