rift in TDP
-
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్‌ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్‌తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్‌లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్‌మోహన్‌రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
టీడీపీలో అసమ్మతి సెగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా తిరుపతి టీడీపీలో అసమ్మతి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మకు టిక్కెట్ ఇవొద్దంటూ వ్యతిరేక వర్గం గట్టిగా గళమెత్తింది. ఆమెకు వ్యతిరేకంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సహా 50 డివిజన్ల అసమ్మతి నాయకులు శనివారం సమావేశమయ్యారు. సుగుణమ్మ వైఖరితో పార్టీ నష్టపోతుందని అసమ్మతి వర్గం నేతలు పేర్కొన్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. రెండు వర్గాల అధిపత్యపోరుతో టీడీపీలో లుకలుకలు వీధికెక్కాయి. ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతాయని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. మరోవైపు తిరుపతి అసెంబ్లీ టిక్కెట్‌ను అధినేత చంద్రబాబు ఎవరికీ కేటాయిస్తారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. (పెరుగుతున్న వైఎస్సార్సీపీ బలం) -
బొజ్జల తనయుడి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం సరిగా లేదని మంత్రి పదవి నుంచి తొలగించడం బాగోలేదని మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తనయుడు సుధీర్ అన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం బాధకరమన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి మంత్రి పదవి కొత్తేమి కాదని, తన తాత దగ్గర నుంచి మంత్రులుగా వ్యవహరించారన్నారు. 35 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిని డీ గ్రేడ్ చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. మంత్రులందరి కంటే తన తండ్రి ఎక్కువగా తిరిగారని చెప్పారు. మంత్రిగా పనికిరానప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకని రాజీనామా చేశారన్నారు. తన తండ్రికి మద్దతుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఆలయ కమిటి చైర్మన్ల వరకు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌లకు వివరించామన్నారు. ఇదంతా ప్రశాంత వాతావరణంలో జరిగితే, తన తల్లి వారిపై ఆగ్రహించినట్టుగా సోషల్ మీడియాలో రావడం బాధాకరమన్నారు. ఈ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలోని కార్యకర్తలతో తన తండ్రి సమావేశమవుతారని, తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు. -
‘మాలలను అవమానించిన చంద్రబాబు’
చింతలపూడి: పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించడంపై పశ్చిమగోదావరి జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ సామాజిక వర్గానికి చెందిన సుజాతను కేబినెట్ నుంచి తప్పించడంపై మాలలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడిలో సోమవారం మాలలు ఆందోళనకు దిగారు. 80 లక్షల మంది మాలలను సీఎం చంద్రబాబు అవమానించారని ఆందోళనకారులు మండి పడ్డారు. 2019 ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
‘చంద్రబాబు నన్ను గుర్తించలేదు’
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణతో అధికార టీడీపీలో రేగిన అసంతృప్తి సెగలు చల్లారలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట వేసి తమకు విస్మరించడంతో టీడీపీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. నిబద్ధతతో పనిచేసినా సీఎం చంద్రబాబు తనను గుర్తించలేదని వాపోయారు. రాజకీయాల నుంచి తనకు రిటైర్మెంట్ ప్రకటించారని ఆవేదన చెందారు. మొదట్నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నానని, అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనను విస్మరించారని మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి మంత్రి పనిచేసినా తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడంతో ఆయన అలకబూనారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శివాజీకి మొండిచేయి చూపడాన్ని గౌతు కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఆయన కుమార్తె శిరీష సిద్ధమయ్యారంటూవార్తలు వచ్చాయి. తనకు కాకుండా కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో శివాజీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. -
కమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
టీడీపీలో తిరుగుబాటు నేతలకు చంద్రబాబు హెచ్చరిక సాక్షి, అమరావతి: మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కక తిరుగుబాటు చేసిన టీడీపీ నేతలపై పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రాజీనామాలు చేయడం, పెడన నియోజకవర్గంతోపాటు కొన్ని చోట్ల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం రాత్రి బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా విస్తృతంగా చర్చించాకే ఇచ్చామని, మంత్రివర్గ విస్తరణ కూడా అలాగే జరిగిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవులు కేటాయించామని తెలిపారు. దీనిపై అసంతృప్తి మంచిది కాదని, స్పోర్టివ్‌గా తీసుకోవాలని నేతలకు సూచించారు. పార్టీ విషయాలను అంతర్గత వేదికలపై చర్చించాలని, అంతేగాని పత్రికలకు ఎక్కడం సరికాదని పేర్కొన్నారు.కొలిక్కిరాని శాఖల కేటాయింపు: కొత్త మంత్రులతో ప్రమాణం చేయించినా వారికి శాఖల కేటాయింపులో అనిశ్చితి నెలకొంది. ఆదివారం సాయంత్రానికి శాఖల కేటాయింపు జరగాల్సి వున్నా తెలుగుదేశం పార్టీకి రాజీనామాల సెగ తగలడంతో చంద్రబాబు ఈ అంశంపై ఆలస్యంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆదివారం రాత్రి వరకు దీనిపై చంద్రబాబు అధికారులు, సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. తన కుమారుడు లోకేష్‌కు పంచాయతీరాజ్, ఐటీ శాఖలిచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావుల శాఖల్లో మార్పులుండవని చెబుతున్నారు. అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోంశాఖను కిమిడి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడుల్లో ఒకరికి ఇవ్వొచ్చని పార్టీవర్గాల సమాచారం. అదే జరిగితే చినరాజప్పకు మరో శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శాఖల కేటాయింపు, మార్పులపై ఉత్కంఠ నెలకొంది. -
కేబినెట్ చిచ్చు.. చంద్రబాబుకు చిక్కు
అమరావతి: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో పార్టీలో ఎగసిన అసంతృప్తిని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం సమతమవుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంకావడంతో అగ్రనాయకత్వం తలపట్టుకుంది. సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో ఊహించనివిధంగా వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వయంగా బుజ్జగింపులకు దిగారు. అసంతృప్త నాయకులను తన దగ్గరికి పిలిపించుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి అనూహ్యంగా ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ విప్ పదవిని వదులుకున్నారు. తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రాజీనామా చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ ప్రస్తుత రాజకీయాలు రోత కలిగిస్తున్నాయని ఈసడించారు. ఉత్తరాంధ్ర సీనియర్ ఎమ్మెల్యేలు గౌతు శివాజీ, బండారు సత్యనారాయణ మూర్తి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిరసన గళం విన్పించారు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలకు సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. బొజ్జలకు మూడుసార్లు ఫోన్ చేశారు. బొండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్ లను పిలిపించుకుని మాట్లాడారు. ధూళిపాళను బుజ్జగించే బాధ్యతను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించారు. పల్లె రఘునాథరెడ్డికి మంత్రి పరిటాల సునీత, మండలి బుద్ధప్రసాద్ నచ్చజెప్పారు. -
టీడీపీకి ఊహించని దెబ్బ
-
పార్థసారధి అనుచరుల రాజీనామా
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణతో అధికార టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. సీనియర్ నాయకులకు మొండిచేయి చూపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధిని కేబినెట్ లోకి తీసుకోకపోవడంపై ఆయన అనుచరులు మనస్తాపం చెందారు. పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పెనుకొండ మార్కెట్ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట్రామిరెడ్డి, రొద్దం సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు తమ పదవులకు రాజీనామా చేశారు. -
టీడీపీకి ఊహించని దెబ్బ
విజయవాడ: కేబినెట్ విస్తరణ ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతున్నాయి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఫిరాయింపుదారులకు పెద్దపీట వేయడం పట్ల సీనియర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగేశ్వరపేటలోని తన నివాసంలో మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గౌడ కులంలో పుట్టినందుకే తన మంత్రి పదవి ఇవ్వలేదని వెంకట్రావు వాపోయారు. టీడీపీలో బీసీ నాయకుడిని ఇంతగా అవమానిస్తారని అనకోలేదని, టీడీపీలో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన చెందారు. కాగిత వెంకట్రావుతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రేపు(సోమవారం) పెడన బంద్ కు కాగిత వెంకట్రావు పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు
అమరావతి: తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారంటూ విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవని వ్యాఖ్యానించారు. కాపులకు అన్యాయం జరగడం తొలిసారి కాదని, మాకు కామనైపోయిందంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. సీఎం ఎటువంటి హామీఇవ్వలేదని, అయినప్పటికీ ఆయన చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు 13 జిల్లాల టీడీపీ కార్యకర్తలు బాధ పడ్డారని పేర్కొన్నారు. కొత్త, పాత కలయికలో మంత్రివర్గం ఉందన్నారు. కొత్తవారికి చోటు కోసం నాలాంటి కొందరు త్యాగం చేయాల్సివచ్చిందని వాపోయారు. అయితే ఎమ్మెల్యే బొండాకు కేబినెట్ పదవి రాకుండా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బొండా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని పేర్కొంటున్నారు. -
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా...
శ్రీకాకుళం: ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధిష్టానం కనికరించలేదని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ వాపోయారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తనకు పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో చెప్పాలని శివాజీ కుమార్తె, శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష డిమాండ్ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కనీసం ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేస్తారా అని సూటిగా నిలదీశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో అధికార టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. సీనియర్లను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టడంతో టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని కేబినెట్ లోకి తీసుకోవడంతో అలకబూనారు. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. తమ నాయకుడికి మంత్రి పదవి రాలేదన్న విషయం తెలుసుకున్న మద్దతుదారులు సత్యనారాయణమూర్తి స్వగ్రామం వెన్నెలపాలెంకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. -
దారుణంగా మోసం చేశారు: టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ టీడీపీలో చిచ్చు రేపింది. తమకు పదవులు దక్కకపోవడంతో సీనియర్ నాయకులు అలకబూనారు. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తనను దారుణంగా మోసం చేశారని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వారికి, నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని, కన్నా లక్ష్మీనారాయణపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీయిచ్చారని వెల్లడించారు. మరోవైపు మోదుగులకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. -
'ధూళిపాళ నరేంద్రకు అన్యాయం'
అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అధికార టీడీపీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మంత్రి పదవులు దక్కకపోవడంతో పార్టీ సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నాయకుల మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన మద్దతుదారులు గుంటూరు జిల్లా చింతలపూడిలో రాస్తారోకో చేశారు. మరోవైపు ధూళిపాళ్ల నివాసం వద్ద కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీకి రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ధూళిపాళకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు అభీష్టం మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. దూళిపాళ్లను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయనను బుజ్జగించే బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. -
'విజయశాంతిని తీసుకొచ్చి దాడి చేశారు'
'నామా నాగేశ్వరరావు నాయకత్వం మాకొద్దు'- ఈ మాట అన్నది ఎవరో కాదు ఆయనతో కలిసి లోక్‌సభలో అడుగుపెట్టిన నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి. నాలుగున్నరేళ్లుగా భుజాలు రాసుకుని తిరిగిన నామాపై మోదుగులకు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ పార్లమెంటరీ నాయకుడి పోస్టు నుంచి నామాకు వీడ్కోలు పలకాలని గొంతెత్తారు. నామా నాయకత్వాన్ని అంగీకరించడం లేదని కుండబద్దలు కొట్టారు. పార్లమెంట్ సాక్షిగా తమపై దాడికి పాల్పడిన నామా నాయకత్వంలో ఎలా పనిచేస్తామని మోదుగుల ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలు బాహాబాహికి దిగారు. బిల్లును అడ్డుకునేందుకు మోదుగుల వీరంగం సృష్టించారు. ఆయనను సొంత పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకున్నారు. మోదుగులపై దాడికి దిగారు. తమకు నాయకుడిగా ఉన్న వ్యక్తే దాడి చేయడంతో మోదుగుల అవాక్కయ్యారు. నలుగురు మద్దతుతో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న నామా విచక్షణ కోల్పోయి తమపై దాడికి పూనుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం ఎంపీగా ఆ ప్రాంత ప్రయోజనాలు నామాకు ఎంత ముఖ్యమో, నర్సరావుపేట ప్రాంత ప్రజల ఆకాంక్ష తనకు అంతే ముఖ్యమని మోదుగల స్పష్టం చేశారు. తెలంగాణ ఎంపీలు ఆందోళనను తామెప్పుడూ అడ్డుకోలేదని మోదుగుల గుర్తుచేశారు. తెలంగాణ అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా వ్యతిరేకించలేదని చెప్పారు. సమన్యాయం చేయమని అడుగుతుంటే కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నామా, రాథోడ్- తమపై దాడి చేశారని వాపోయారు. విజయశాంతిని తీసుకొచ్చి పక్కా ప్రణాళికతో వారిద్దరూ తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతం మాత్రమే బాగుపడాలని, మిగతా వారు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న నామా నాయకత్వం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణనే తమ నాయకుడిగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు రెండు ప్రాంతాల బాగు కోరుతున్నారు కాబట్టే ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నామని వివరించారు. విభజన బిల్లు టీడీపీ పార్లమెంట్ సభ్యుల మధ్య చిచ్చు రేపడం అధినేత చంద్రబాబును కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటివవరకు ఇరుప్రాంతాల నేతలతో విభజన నాటకాన్ని రక్తికట్టించిన పచ్చపార్టీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్‌తో కనుకుపట్టడం లేదు. ఇకపై ఆయన ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతలను బాబు ఏవిధంగా బుజ్జగిస్తారో చూడాలి. -
టీడీపీలో విభజన చిచ్చు
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో విభజన చిచ్చు రాజుకుంది. కొంతకాలంగా సీమాంధ్ర, తెలంగాణ నాయకులు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ మధ్య నడుస్తున్న వివాదం పార్టీలో చిచ్చు పెట్టింది. రాష్ట్ర విభజనపై పయ్యావుల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో టీడీపీలో ముసలం మొదలయింది. తెలంగాణ నాయకులు పయ్యావుల చర్యను తీవ్రంగా వ్యతిరేకించగా, సీమాంధ్ర నేతలు ఆయనను వెనకేసుకొచ్చారు. అప్పటినుంచి ఇరుప్రాంతాల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా పయ్యావుల కేశవ్‌పై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశం పెట్టి ఏకిపారేశారు. పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు పార్టీలో చీడ పురుగులంటూ దుయ్యబట్టారు. చీడపురుగులను ఏరివేస్తేనే పార్టీ బాగుపడుతుందని సలహాయిచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పుడు మాటలు తప్పుడు కూస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని ధిక్కరించే దమ్ము పయ్యావులకు ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కోన్ కిస్కా అంటూ ధ్వజమెత్తారు. ప్రధానికి రాసిన లేఖలో సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు కోరారని తెలిపారు. తెలంగాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరలేదని స్పష్టం చేశారు. ఏమరేమన్నా టీడీపీ తెలంగాణ కట్టుబడి ఉంటుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు.