
దారుణంగా మోసం చేశారు: టీడీపీ ఎమ్మెల్యే
కేబినెట్ విస్తరణ టీడీపీలో చిచ్చు రేపింది. తమకు పదవులు దక్కకపోవడంతో సీనియర్ నాయకులు అలకబూనారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ టీడీపీలో చిచ్చు రేపింది. తమకు పదవులు దక్కకపోవడంతో సీనియర్ నాయకులు అలకబూనారు. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తనను దారుణంగా మోసం చేశారని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వారికి, నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని, కన్నా లక్ష్మీనారాయణపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీయిచ్చారని వెల్లడించారు. మరోవైపు మోదుగులకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు.