modugula venugopala reddy
-
మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు
-
మోదుగుల వాహనంపై టీడీపీ నేతల దాడి
సాక్షి, గుంటూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గుంటూరులో పోలింగ్ సమయంతో వైఎస్సార్సీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని తెలియడంతో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఆయన వాహనంపై విచ్చలవిడిగా టీడీపీ నేతలు దాడికి తెగపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై టీడీపీ నేతలు హత్యాయత్నం చేసేందుకు యత్నించారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు న్యాయం జరగాలన్నారు. దొంగ ఓట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు రాకపోతే నా ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైందన్నారు. ఎలక్షన్ టైమ్‌లోనే కేశినేని నాని ఎంపీ, ఏడు కార్లతో తిరిగారని మోదుగుల తెలిపారు. చదవండి: ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ -
ఇల్లు వదిలి బయటికి రావడం లేదు: మోదుగుల
-
టీడీపీకి వచ్చే సీట్లు 13కు ఎక్కువ.. 25కు తక్కువ
పట్నంబజారు(గుంటూరు): రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి 13 సీట్లకు ఎక్కువ.. పాతికకు తక్కువగా ఉండగా.. 130 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కనపడదని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోనున్నారని చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం, పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో వన్‌సైడ్ వార్ నడిచిందన్నారు. వైఎస్ జగన్‌ను విమర్శించడమా?! టీడీపీ పాలనలో హోంమంత్రిగా వ్యవహరించిన నిమ్మకాయల చినరాజప్ప కనీసం హోంగార్డు పోస్టింగ్ కూడా మార్చలేదని.. ఎక్కడైనా హోంమంత్రికి డీజీపీ సెల్యూట్ చేస్తారని, అయితే డీజీపీకి సెల్యూట్ చేసే చినరాజప్ప వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మోదుగుల అన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ దాడులు చేసిందని వ్యాఖ్యలు చేస్తున్న చినరాజప్ప.. ప్రతిపక్షం దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చున్నారా.. అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో విఫలమైన చినరాజప్ప రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసరంగా చంద్రబాబు సీఆర్డీఏ అధికారులతో చేపట్టిన సమావేశం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకేనని మోదుగుల విమర్శించారు. -
‘దోచిన డబ్బు పంచేస్తున్నారు’
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో గెలవడానికి గుంటూరులో గల్లా జయదేవ్, మంగళగిరిలో నారా లోకేష్ వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని గుంటూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో కనీస అవగహన, పరిపక్వతలేని వారితో తాను పోటీపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. మైనార్టీలు, దళితుల నుంచి తమ పార్టీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. గుంటూరు లోక్‌సభ సీటు, మంగళగిరి అసెంబ్లీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమాన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 25వేల భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోదుగులు అభిప్రాయపడ్డారు. గుంటూరులో గల్లా జయదేవ్‌కు భారీ ఓటమి తప్పదని అన్నారు. ఎంపీతో పాటు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొంది తీరుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి ఒక్కరోజులోనే చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని మోదుగుల వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు సిద్ధమైన్నట్లు ఆళ్ల రామకిృష్ణరెడ్డి తెలిపారు. అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయలేదని, వేల ఎకరాలు భూమిని కాజేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను బలవంతంగా లాగుక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. అక్రమంగా సంపాధించిన వేలకోట్ల రూపాయలను నారా లోకేష్ ఈ ఎన్నికల్లో తన గెలుపుకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యంకోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని అభిప్రాయడ్డారు. -
విజిటింగ్ ప్రొఫెసర్ గల్లా.. గుల్లే..!
సాక్షి, మంగళగిరి : విజిటింగ్ ప్రొఫెసర్లా ఏడాదికి ఒకసారి గుంటూరుకు వచ్చే గల్లా జయదేవ్ ఈసారి పరాజయదేవ్‌గా పేరు మార్చుకోక తప్పదని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)తో కలిసి ఆయన నిన్న నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శ్రీకోదండ రామసమేత శ్రీమద్వీరాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ దుర్యోధన, దుశ్శాసనుల్లాంటి నారా లోకేష్, గల్లా జయదేవ్‌లకు కృష్ణార్జునుల్లాంటి మోదుగుల, ఆర్కే చేతిలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు. లోకేష్‌లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాలేదని, అలాంటి సచ్ఛీలుడిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగస్వాములమై పోటీ చేస్తున్న ఆర్కేతో తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే మాట్లాడుతూ లోకేష్‌కి మంగళగిరి నియోజకవర్గ సరిహద్దులు తెలుసా? మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నానని చెప్పుకుంటున్న లోకేష్ ఏ రోజైనా మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో తాగునీరు వస్తుందా అని ప్రజలను అడగడం కానీ, అధికారులతో సమీక్ష కానీ చేశారా అని ప్రశ్నించారు. చేనేత కార్మికుల సమస్యలపై కానీ, లేక మరే సమస్య పైన అయినా ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పలకరించారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే నిధులు అడగడం లేదని లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారని, దానిపై మీ సమాధానమేంటని విలేకరులు ప్రశ్నించగా, ఆర్కే లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి అభివృద్ధికి ఏఏ ప్రాజెక్టుకి ఎంత కావాలో విపులంగా జాబితా తయారుచేసి, రూ.7కోట్లు నిధులు కావాలని లోకేష్ బాబుని అడిగానో లేదో ఇంటికి వెళ్లి రాత్రికి కనుక్కోవాలన్నారు. రూ.7కోట్లు నిధులు కావాలని విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబును కలిస్తే మీరు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచారు, మేం నిధులు ఇవ్వం అని చెప్పడం తెలియదా? తెలియకపోతే లోకేష్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు కొబ్బరికాయలతో, టెంకాయలతో అభ్యర్థులకు దిష్టితీయగా, మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి హారతులతో స్వాగతం పలికారు. -
వైఎస్సార్సీపీలోకి జోరుగా చేరికలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. శనివారం పలువురు ప్రముఖులు ఆ పార్టీలో చేరారు. పారిశ్రామికవేత్త, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ మాజీ అధ్యక్షుడు బుక్కచర్ల నల్లప్పరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్వర్మతోపాటుగా అనంతపురం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. నేతల చేరికల నేపథ్యంలో తరలివచ్చిన వారి అనుచరగణంతో హైదరాబాద్‌లోని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాస పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచీ ఒక్కొక్కరుగా తమ అనుచరగణంతో తరలివచ్చిన ఈ నేతలు జగన్‌ను కలుసుకున్నారు. ఆయన వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరభద్రరావు పార్టీలో చేరిన సందర్భంగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, అదీప్‌రాజు, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావులు ఉన్నారు. మోదుగుల పార్టీలో చేరినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫాలు పాల్గొన్నారు. దాసరి జైరమేష్ వెంట పెద్దసంఖ్యలో ఆయన శ్రేయోభిలాషులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పార్టీలో చేరిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎం.అరుణ్‌కుమార్ ఉన్నారు. ప్రజలకు అర్థమైంది.. చంద్రబాబు ఏం చెప్పినా వారు వినరు: మోదుగుల సీఎం చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఇక ఆయనేం చెప్పినా నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మీడియాతో అన్నారు. పార్టీలో చేరడానికి ముందు ఆయన టీడీపీకి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమ ఆశాజ్యోతి జగన్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరానని, పల్నాడులో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ఎంపీగా అయినా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనకు టీడీపీలో సరైన న్యాయం చేయలేదన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ తనపైన మాట్లాడాల్సిన మాటలు కాదని, టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు తనపై విమర్శలు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదని తెలిసి వైఎస్సార్సీపీలో చేరానన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానన్నారు. గతంలో పార్లమెంటులో తనపై దాడి చేస్తే తనకు మద్దతుగా నిలవకపోగా నిందలు వేశారని ఆవేదన వెలిబుచ్చారు. తనలాంటి వ్యక్తికి టీడీపీలో టికెట్ లేదనడం వారికే సిగ్గుచేటన్నారు. గల్లా గుంటూరుకు అతిథిలాంటివారని, ఆయనకు బ్యాలెట్ పేపర్‌తో బుద్ధి చెపుతామని అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చామని, జగన్ గెలుపు ఖాయమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం: దాడి నాలుగేళ్ల తర్వాత వైఎస్సార్సీపీలోకి రావడం సొంతగృహానికి వచ్చినట్టుగా ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మంచి పాలనను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. పాలనను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రజలు గుర్తుకొచ్చి పప్పు, బెల్లాలు పంచి ఓట్లు పడతాయని ఆశిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రజలు తెలివితక్కువ వారని, గతం మరుస్తారని, తనను నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజలు ఇలాంటివి చాలా చూశారు. విజయభాస్కరరెడ్డి హయాం నుంచి చూస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీ పెడుతున్నపుడు రూ.2 కిలో బియ్యం అంటే కోట్ల విజయభాస్కరరెడ్డి రూ.1.90కి కిలో బియ్యం ఇస్తానన్నా ప్రజలు ఆయన జిమ్మిక్కులను నమ్మలేదు’’ అని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు తెలుగు కాంగ్రెస్‌గా మార్చారని, కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి విమర్శించారు. టీడీపీని ఎవ్వరు పరిపాలిస్తున్నారో అర్థం కావట్లేదని టీడీపీ అభిమానులు బాధపడుతున్నారన్నారు. టీడీపీ జాతీయ గౌరవాధ్యక్షులుగా రాహుల్ ఉన్నారా, చంద్రబాబు ఉంటారా.. అనుమానంగా ఉందన్నారు. ఏ క్షణంలోనైనా టీడీపీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పాలన పోవటం, జగన్ పాలన రావటం చరిత్రాత్మక అవసరమన్నారు. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల పార్టీకి దూరంగా ఉన్నానని, ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో తానుగానీ, తన కుమారుడు రత్నాకర్గానీ బరిలో ఉంటామన్నారు. మంత్రి సునీతకు షాక్ అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కచర్ల నల్లప్పరెడ్డి, ఆయన సోదరులు వీరారెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. గణనీయమైన అనుచరగణం గల ఈ సోదరులు టీడీపీని వీడటం మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ నాలుగోతరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు యు.కుళ్లాయప్ప, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్‌యాదవ్ కూడా పార్టీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
-
వైఎస్సార్సీపీలో చేరిన మోదుగుల
సాక్షి, హైదరాబాద్: ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక టీడీపీని వదిలిపెట్టినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కండువా వేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. తనకు వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. హైదరాబాద్‌ను రాష్ట్రానికి దూరం చేసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. గుంటూరుకు గల్లా జయదేవ్ గుంటూరుకు అతిథిలాంటి వారని ఎద్దేవా చేశారు. గుంటూరు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని, బ్యాలెట్ ద్వారా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తనలాంటి నాయకుడిని వదులుకోవడం టీడీపీ ఖర్మ అని పేర్కొన్నారు. మోదుగుల వేణుగోపాలరెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. చదవండి: వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ ‘ఏ క్షణమైనా కాంగ్రెస్‌లో టీడీపీ నిమజ్జనం’ -
మోదుగుల టీడీపీని వీడినట్లే
సాక్షి, నగరంపాలెం(గుంటూరు): గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. (ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!) నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వారికే పార్టీ, నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేశారన్నారు. దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు. సీఎం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల రాకపోవటంతో పార్టీని వీడుతునట్లు స్పష్టమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు. -
ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలకు టికెట్లు ఇస్తే దగ్గరుండి ఓడిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి జవహర్‌కు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచీ పార్టీకి సేవలు చేసిన వారికి కాకుండా ఫిరాయింపుదారులకు ప్రాధాన్యమిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నాయకులు పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. ఇప్పుడు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా లేకపోవడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలో సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసిన తనను అవమానిస్తున్నారని ఆయన ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ స్థానం అభ్యర్థి ఎంపికలో తన పేరు లేకపోవడం పట్ల పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో నరసారావు పేట లోక్‌సభ స్థానం నుంచి మోదుగుల గెలుపొందిన విషయం తెలిసిందే. టీడీపీ మోదులకు టికెట్ ఇవ్వడం లేదా..! గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు చర్చించారు. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి.. ఆలపాటి రాజా, తాడికొండ.. తెనాలి శ్రవణ్‌కుమార్‌కు కేటాయించినట్టు సమాచారం. కాగా, గుంటూరు పశ్చిమ స్థానానికి కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్ కృష్ణ, చందు సాంబశివరావు, గుంటూరు తూర్పు స్థానానికి మద్దాలి గిరి.. ముస్లిం వర్గానికి చెందిన ఇంకో ముఖ్యనేత పేరు పరిశీలనలో ఉన్నాయి. పత్తిపాడు నియోజకవర్గానికి రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంళగిరి స్థానానికి కాండ్రు కమల కుటుంబ సభ్యుల్లో ఒకరు, తిరువీధుల శ్రీనివాసరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. -
‘కాంగ్రెస్ బలపడితే బీజేపీదే బాధ్యత’
గుంటూరు: ప్రత్యేక హోదా అనేది ఫుల్‌ప్టాప్ పెట్టే అంశం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజల కోరికను ప్రధాని నరేంద్ర మోదీ మన్నించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడితే బీజేపీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనమే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కట్టుబట్టలతో బయటకు పంపి ఇవాళ రాష్ట్ర పర్యటనకు వస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేకహోదా భరోసా సభను ప్రజలు బహిష్కరించాలని కోరారు. -
దారుణంగా మోసం చేశారు: టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ టీడీపీలో చిచ్చు రేపింది. తమకు పదవులు దక్కకపోవడంతో సీనియర్ నాయకులు అలకబూనారు. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తనను దారుణంగా మోసం చేశారని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వారికి, నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని, కన్నా లక్ష్మీనారాయణపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీయిచ్చారని వెల్లడించారు. మరోవైపు మోదుగులకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. -
బాబు వద్దకు 'తమ్ముళ్ల పంచాయితీ'
చంద్రబాబు వద్దకు చేరిన ‘పంచాయితీ’ అందరినీ కలుపుకొని వెళ్లాలంటూఎమ్మెల్యే మోదుగులకు సీఎం సూచన జనచైతన్య యాత్రల్లోనూ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ డివిజన్ అధ్యక్షుల నియామకంలోనూ విభేదాలు కొత్త ముఖాలకు స్థానం కల్పిస్తున్నారంటూ నిరసనలు గుంటూరు : నగరంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. డివిజన్ అధ్యక్షుల ‘పంచాయితీ’ సీఎం వద్దకు చేరింది. తక్షణం విజయవాడ రావాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తన కార్యక్రమాలను రద్దు చేసుకొని గురువారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. పార్టీలో అసమ్మతి రాకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలంటూ ఈ సందర్భంగా సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు నగర టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... ఎమ్మెల్యే మోదుగులపై మాజీ కార్పొరేటర్లు, డివిజన్లలో కార్యకర్తలు, నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్రల్లో సైతం మోదుగులకు అసమ్మతి సెగ తగిలింది. అనేక సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న తమను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త ముఖాలకు డివిజన్లలో కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నాశ నం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మోదుగుల పనిచేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ పటిష్టతతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ విజయానికి డివిజన్లలో పట్టు నిలుపుకొనేందుకు మోదుగుల ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గం వాదిస్తోంది. చిచ్చురేపిన డివిజన్‌స్థాయి నియామకాలు ... పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులను నెల రోజులు క్రితం ఎమ్మెల్యే మోదుగుల ప్రకటించారు. మరోవైపు నగర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ వారం రోజుల క్రితం నగర కమిటీని ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో అధ్యక్షుల నియామకం బోనబోయిన, ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేపింది. ముఖ్యంగా 42వ డివిజన్ అధ్యక్షునిగా గణేష్‌ను ఎమ్మెల్యే నియమించారు. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో మాజీ కార్పొరేటర్ ఎలుకా వీరాంజనేయులు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన గణేష్‌ను డివిజన్ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ బుధవారం నల్లరిబ్బన్లతో కార్యకర్తలు నిరసన తెలిపారు. 30వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి భర్త దాసరి రమణను కాదని వేరొకరికి అధ్యక్షునిగా ఇచ్చారు. అలాగే 45వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మద్దిరాల మ్యానీని కాదని వేరొకరికి పదవిని కట్టబెట్టారు. అలాగే 44వ డివిజన్ అధ్యక్షునిగా ఆంజనేయులు పదేళ్ళుగా కొనసాగుతుండగా వేరొకరిని ఎంపిక చేశారు. ఇలా 42, 36, 32 డివిజన్లలో అధ్యక్షుల నియామకం పార్టీలో చిచ్చురేపింది. -
...ఈ పాటికి ఫొటోకు దండలేసేసే వాళ్లు!
''ఏదో మేం క్షేమంగా దిగాం కాబట్టి మీతో ఫోన్లో మాట్లాడగలుగుతున్నాం.. లేకపోతే గాల్లోనే చనిపోయేవాళ్లం. ఈపాటికి ఫొటోకు దండలు వేసి, ఒక విచారణ జరిపేవారంతే''.. ఎయిరిండియా విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత దాన్నుంచి బయటపడిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి స్పందన ఇది. విమానం ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయనను 'సాక్షి టీవీ' ఫోన్లో సంప్రదించింది. జరిగిన ఘటన గురించి అడిగినప్పుడు ఆయన తీవ్రంగానే స్పందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ''నిన్న ఇది రెండు గంటలు ఆలస్యంగా వెళ్లింది. ఈరోజు కూడా ఆలస్యంగానే విజయవాడకు బయల్దేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అన్నారు. బాగా పాత విమానాలను వాడుతున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రణాళిక ప్రకారం పాత విమానాలను స్క్రాప్‌లోకి నెట్టేయాల్సిన అవసరం ఉంది. డీజీసీఏ తప్పనిసరిగా ప్రతి ఏడాది విమానాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మన దేశంలో పేదరికం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో మూలపడిన విమానాలను కూడా వాడుతున్నారు. మన విమానాల్లో చాలామంది ప్రముఖులు, సినిమా నటులు, నాయకులు, సామన్యులు అందరూ వెళ్తుంటారు. అయినా సరిగా పట్టించుకోవడం లేదు.'' -
'బాబు హామీ ఇచ్చినా పదవి రాలేదు'
హైదరాబాద్ : ఎంపీగా పార్లమెంట్లో ఎంతో పోరాటం చేశానని, ఈసారి ఎమ్మెల్యేగా గెల్చిన తనకు కెబినెట్లో అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా పదవి రాలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిన్న అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజున ఒక్క మూడు నిమిషాల ముందు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను వినియోగించి ఉంటే రాష్ట్ర విభజన బిల్లు ఆగేదన్నారు. సోనియాగాంధీ తెలంగాణ విషయంలో చాలా కమిట్మెంట్తో వ్యవహరించారని, తాత్కాలికంగా అప్పటికి ఆగినా ఏదోలా ఆమె బిల్లును ఆమోదింపచేసేవారేనని మోదుగుల అన్నారు. -
రాయపాటి ఇన్ .. మోదుగుల ఔట్?
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ :నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు నేడు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అదే ముహుర్తానికి మోదుగుల టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ, లేదా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్‌సభలో ఎంపీ మోదుగుల తన వాణి గట్టిగా వినిపించారు. లోక్‌సభలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ లోకసభ సభ్యుల దాడికి సంబంధించిన వీడియోలను ఆయన ఆదివారం విడుదల చేశారు. తనపై దాడి చేయటమే కాకుండా తాను పార్లమెంటులోకి కత్తిని తీసుకువచ్చానని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంతో తీరని అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నారు. దీంతో అయన లోక్‌సభకు వెళ్లి తన పరువును నిలుపుకోవాలని భావించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బావ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బరిలో ఉండటంతో చంద్రబాబు మోదుగులకు టిక్కెట్టు ఇచ్చేది లేదని తేల్చారు. ఆ స్థానం నుంచి ఎంపీ రాయపాటికి అవకాశం కల్పించారు. దీంతో పార్టీలో తన అభిప్రాయాలకు తగిన గుర్తింపు లేదని మోదుగుల భావించారు. తానెప్పుడు తన బావపై పోటీ చేయనని ప్రకటించలేదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ తనను విశ్వసించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సోమవారం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేసేది లేదని ఆయన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. -
'పార్లమెంట్ చరిత్రలో చీకటి అధ్యాయం'
న్యూఢిల్లీ: విభజనకు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై సీమాంధ్ర ప్రాంత నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లుకు ఆమోదం తెలిపిన తీరును తప్పుబట్టారు. దేశ ప్రజలను చీకట్లోఉంచి లోక్‌సభ నడిపిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు చీకటి అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నిరకుశంగా పనిచేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్దంగా కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సీమాంధ్రుల గొంతుకోసిందని టీడీపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు తమకు శత్రువులేనని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులకు ఈ పార్లమెంట్ ద్రోహం చేసింది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని చెప్పారు. ఈ పార్లమెంట్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మరో ఎంపీ ఎన్ శివప్రసాద్ అన్నారు. -
జాతికి క్షమాపణ చెప్పండి : మోదుగుల
స్పీకర్ మీరాకుమార్‌కు మోదుగుల లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు భిన్నంగా అధికార పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్న స్పీకర్ మీరాకుమార్ తన పదవి నుంచి తప్పుకుని జాతికి క్షమాపణ చెప్పాలని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్పీకర్‌కు మూడు లేఖలు పంపారు. ‘అవిశ్వాసంపై మేము పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పుడు.. సభ సజావుగా సాగడంలేదని స్పీకర్ అనుమతివ్వలేదు. మరి విభజన బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభ సజావుగా సాగుతుందా?’ అని మోదుగుల ప్రశ్నించారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు న్యాయనిపుణుల సలహాను కోరిన రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని గుర్తు చేస్తూ.. లోక్‌సభలో కనీస విలువలు పాటించలేదని స్పీకర్‌ను దుయ్యబట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. 13వ తేదీన లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ దృశ్యాలను బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. శరద్ యాదవ్, తంబిదొరైలతో భేటీ తెలంగాణ ప్రాంత టీడీపీ నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ ప్రాంత నేతల బృందం సోమవారం రాత్రి జేడీయూ అధినేత శరద్‌యాదవ్, ఏఐఏడీఎంకే నేత తంబిదొరైలను వేర్వేరుగా కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది. నామా వెంట టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ యర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు. -
అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన మోదుగుల, ఉండవల్లి
న్యూఢిల్లీ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకునేందు సీమాంధ్ర ప్రాంత నేతలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు బుధవారం అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు అందించారు. ఇక నుంచి ప్రతిరోజు సభలో ఒకో సభ్యుడు పేరుమీద నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ .... నోటీసును స్పీకర్‌కు అందచేశారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ బిల్లును ఇంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో ...కేంద్రమంత్రి కమల్‌నాథ్ భేటీ కానున్నారు. -
ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రక్రియ ఆగింది: లగడపాటి
తెలంగాణ ప్రక్రియ తమ ఒత్తిడి వల్లే ఆగిందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. తాము సాధించిన మొదటి విజయంగా ఆయన పేర్కొన్నారు. మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పడే సమ్మెకు దిగాల్సిన అవసరం లేదన్నారు. సమ్మె అనే బ్రహ్మాస్త్రాన్ని ముందు ముందు ఉపయోగించాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగులకు లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా సూచించారు. అయితే మేం సమైక్యాంధ్రను కోరడం లేదని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి న్యూఢిల్లీలో పేర్కొన్నారు. మా ప్రాంతంలోని ప్రజలకు నీరు, విద్యుత్, విద్య, ఉపాధి అవకాశాల కల్పనే తమ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. తమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని యూపీఏ సర్కార్‌ను ఆయన డిమాండ్ చేశారు. ఆ క్రమంలో న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. కాగా ఇరుప్రాంతాల ప్రజలు బాగుండాలనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని మోదుగుల వేణుగోపాలరెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.