
సాక్షి, నగరంపాలెం(గుంటూరు): గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. (ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!)
నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వారికే పార్టీ, నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేశారన్నారు. దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు. సీఎం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల రాకపోవటంతో పార్టీని వీడుతునట్లు స్పష్టమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment