galla aruna
-
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా రాజీనామా
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె గురువారం చంద్రబాబుకు లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నా అరుణ పార్టీలో ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించలేదు. ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కూడా టీడీపీలో గతంలో మాదిరిగా చురుగ్గా ఉండడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా అరుణకుమారి రాజీనామా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. -
మోదుగుల టీడీపీని వీడినట్లే
సాక్షి, నగరంపాలెం(గుంటూరు): గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. (ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!) నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వారికే పార్టీ, నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేశారన్నారు. దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు. సీఎం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల రాకపోవటంతో పార్టీని వీడుతునట్లు స్పష్టమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు. -
గల్లా అరుణకు చేదు అనుభవం
చిత్తూరు: మాజీ మంత్రి గల్లా అరుణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. పాకాల మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రజలు గల్లా వాహనంపై దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టారు. పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారని ఆమెను నిలదీశారు. 20 ఏళ్లుగా అధికారాలు అనుభవించి, నియోజకవర్గానికి ఏం చేశారని ప్రజలు మండిపడ్డారు. స్థానికుల నిరసనకు వ్యతిరేకంగా గల్లా అరుణ రోడ్డుపై బైఠాయించారు. అరుణ చంద్రగిని నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
<b>గుసగుస:</b> సందిగ్ధంలో గల్లా కుటుంబం
రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్‌లో ఉండలేక తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబం ఇపుడు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితులలో ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేయకుండా ఈసారికి ఎన్నికలకు దూరంగా ఉన్నా బాగుండేదని అనుకుంటున్నారట. తెలుంగుదేశంలో చేరి కోరి కోరి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నామా! అన్న ఆలోచనలో తల్లీ తనయులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ - బిజెపిలు అడ్డగోలుగా చీల్చేస్తే గల్లా అరుణ ఏ మాత్రం పట్టించుకోకుండా చివరి నిముషం వరకు శుభ్రంగా మంత్రి పదవిని అనుభవించారన్న విమర్శ ఆమెపై ఉంది. విభజన పాపంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బిజెపి సహకరిస్తే, రాష్ట్రంలో తెలుగుదేశం సహకరించిన సంగతి అందరికీ తెలిసిందే. విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఆ మాటకొస్తే ఒక్క సీమాంధ్రలోనే కాదు తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగడం కష్టమని గమనించిన గల్లా అరుణ తన తనయుడు జయదేవ్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు లేకపోవడంతో ఈ నెల 8న తెలుగుదేశంలో చేరారు. తీరా టిడిపిలో చేరాక కానీ గల్లా కుటుంబానికి వాస్తవం బోధపడలేదు. అటు చంద్రగిరి నియోజకర్గంలోనూ ఇటు గుంటూరులోనూ కూడా టిడిపి పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ఈ ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రావడమో గల్లా కుటుంబానికి అర్ధం కావడం లేదట. దానికితోడు గల్లా జయదేవ్ పారిశ్రామిక వేత్త కావడంతో గుంటూరు తమ్ముళ్లు చీటికీ మాటికీ డబ్బులు అడుగుతున్నట్లు సమాచారం. అయితే వ్యాపారి అయిన జయదేవ్ డబ్బు ఇవ్వవలసినచోట ఆ బాధ్యతలను చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన తనకు నమ్మకస్తులైన వారికే అప్పగిస్తున్నారట. దాంతో మరో కొత్త పేచీ వచ్చింది. తమపై నమ్మకం లేదా అని స్థానిక తమ్ముళ్లు లోలోనే మండి పడుతున్నారట. చంద్రగిరిలోనూ స్థానిక టిడిపి శ్రేణులు గల్లా అరుణతో కలిసి రావడం లేదట. ఇలాగే కొనసాగితే రేపు ఎన్నికల్లో ఎలా గెలవడమా అని తల్లీ కొడుకులు తలలు పట్టుకుంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ దెబ్బతింటే తింది టిడిపిలోకి రాకుండా ఉంటేనే బాగుండేదని గల్లా అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జయదేవ్ కూడా తల్లి ఆందోళనతో ఏకీభవిస్తున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒక్క గల్లా కుటుంబమే కాదు ఇటీవల టిడిపిలో చేరిన కాంగ్రెస్ నేతల్లో మెజారిటీ నాయకుల మనోవేదన ఇదేవిధంగా ఉన్నట్లు వినికిడి. -
టీడీపీలో చేరిన గల్లా అరుణ
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడైన పారిశ్రామికవేత్త గల్లా జయదే వ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఏ రహ్మాన్ (విశాఖ), దేవిశెట్టి మల్లికార్జునరావు (రేపల్లె), మాజీ ఎంపీ గునిపాటి రామయ్య (రాజంపేట), టీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు నేతలు శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఎద్దేవా చేశారు. తరతరాలుగా ఆ పార్టీలో ఉన్నవారు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. ఏడున్నర దశాబ్దాలుగా తాము సొంత ఇమేజ్‌తోనే రాజకీయం చేశామని, సినీ గ్లామర్‌ను నమ్ముకోలేదని గల్లా అరుణకుమారి చెప్పారు. సినీ నటుడు కృష్ణ కుటుంబంతో బంధుత్వం ఉన్నప్పటికీ ప్రచారం చేయాల్సిందిగా వారిపై ఒత్తిడి చేయదలచుకోలేదన్నారు. కాగా, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ శనివారం రాత్రి చంద్రబాబును కలిశారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ఆర్.గాంధీ ఇటీవల వైఎస్సార్సీపీలో చేరటంతో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు కుతూహలమ్మను పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. -
‘విభజన చారిత్రక తప్పిదం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకోవడం చారిత్రక తప్పిదమని మంత్రి గల్లా అరుణ అన్నారు. పొరుగు రాష్ట్రాల నాయకుల కుట్రవల్లే విభజన జరుగుతోందన్నారు. తెలంగాణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ, తెలుగుతల్లి కడుపులో కత్తులు దించుతున్నారని, కళ్లల్లో రక్తం నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ పూర్తిగా వెనుకబడిందని, తాగునీటికీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. మనోభావాల ఆధారంగా రాష్ట్రాన్ని విడదీస్తారా? అని ప్రశ్నించారు. -
రైతులను ముంచేందుకే ఒక్కటయ్యారు
చంద్రగిరి, న్యూస్‌లైన్: రైతులను వురోసారి ముంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, వుంత్రి గల్లా అరుణ ఒక్కటయ్యూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సవున్వయుకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పాకాల వుండలం దావులచెరువులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన స్వంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయూ డెయిరీని మూతవేయించారన్నారు. నేడు పాడి పరిశ్రవును నాశనం చేసి రైతుల నోట్లో వుట్టి కొట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం వూమిడి వ్యాపారంలో గల్లా ఫుడ్స్ ప్రవేశించి వూమిడి రైతులకు వుద్దతు ధర లేకుండా చేస్తున్నారన్నారు. ఇప్పుడు బాబు, గల్లా ఒక్కటైతే పాడిపరిశ్రవు, వూమిడి, నల్లబెల్లం అవ్ముకాలు ఆగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. జగనన్న సీఎం అరుుతే పాకాల వుండలానికి హంద్రీ-నీవా నీళ్లు, చంద్రగిరి వుండలానికి కళ్యాణిడ్యాం నీటిని తీసుకొస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమిచేశారని నిలదీశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి అనేక వూర్లు గెలిచిన గల్లా కూడా ఏమీచేయులేదని వుండిపడ్డారు.