అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన మోదుగుల, ఉండవల్లి
న్యూఢిల్లీ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకునేందు సీమాంధ్ర ప్రాంత నేతలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు బుధవారం అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్ మీరాకుమార్కు అందించారు. ఇక నుంచి ప్రతిరోజు సభలో ఒకో సభ్యుడు పేరుమీద నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోవైపు నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ .... నోటీసును స్పీకర్కు అందచేశారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ బిల్లును ఇంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో ...కేంద్రమంత్రి కమల్నాథ్ భేటీ కానున్నారు.