తెలంగాణ ప్రక్రియ తమ ఒత్తిడి వల్లే ఆగిందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. తాము సాధించిన మొదటి విజయంగా ఆయన పేర్కొన్నారు. మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పడే సమ్మెకు దిగాల్సిన అవసరం లేదన్నారు. సమ్మె అనే బ్రహ్మాస్త్రాన్ని ముందు ముందు ఉపయోగించాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉద్యోగులకు లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా సూచించారు.
అయితే మేం సమైక్యాంధ్రను కోరడం లేదని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి న్యూఢిల్లీలో పేర్కొన్నారు. మా ప్రాంతంలోని ప్రజలకు నీరు, విద్యుత్, విద్య, ఉపాధి అవకాశాల కల్పనే తమ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. తమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని యూపీఏ సర్కార్ను ఆయన డిమాండ్ చేశారు. ఆ క్రమంలో న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. కాగా ఇరుప్రాంతాల ప్రజలు బాగుండాలనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని మోదుగుల వేణుగోపాలరెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.
ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రక్రియ ఆగింది: లగడపాటి
Published Thu, Aug 8 2013 1:51 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement