దిత్వీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక టీడీపీని వదిలిపెట్టినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువా వేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.