సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో గెలవడానికి గుంటూరులో గల్లా జయదేవ్, మంగళగిరిలో నారా లోకేష్ వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని గుంటూరు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో కనీస అవగహన, పరిపక్వతలేని వారితో తాను పోటీపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. మైనార్టీలు, దళితుల నుంచి తమ పార్టీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. గుంటూరు లోక్‌సభ సీటు, మంగళగిరి అసెంబ్లీ స్థానం వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమాన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 25వేల భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు.
వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోదుగులు అభిప్రాయపడ్డారు. గుంటూరులో గల్లా జయదేవ్‌కు భారీ ఓటమి తప్పదని అన్నారు. ఎంపీతో పాటు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుపొంది తీరుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి ఒక్కరోజులోనే చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని మోదుగుల వెల్లడించారు.
ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు సిద్ధమైన్నట్లు ఆళ్ల రామకిృష్ణరెడ్డి తెలిపారు. అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయలేదని, వేల ఎకరాలు భూమిని కాజేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను బలవంతంగా లాగుక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. అక్రమంగా సంపాధించిన వేలకోట్ల రూపాయలను నారా లోకేష్ ఈ ఎన్నికల్లో తన గెలుపుకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యంకోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని అభిప్రాయడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment