
సాక్షి, గుంటూరు : ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఫిర్యాదు చేసింది. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్ తదితరులు ఎస్పీని కలిసి చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. కాగా గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ (ఏప్రిల్ 11) రోజున, పోలింగ్ తర్వాత టీడీపీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప‍్పటికే నిజనిర్ధారణ కమిటీని నియమించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment