mangalarigi
-
వాగును పూడ్చి కార్యాలయాన్ని కట్టి
సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా కరకట్టపై అక్రమ భవనాన్ని నివాసంగా మార్చుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని సైతం వాగును పూడ్చి, పట్టా భూమిని ఆక్రమించి నిర్మాణం చేశారు. వాగు పోరంబోకుతోపాటు రైతులకు పట్టాలిచ్చిన భూములను ఆక్రమించి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించడంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విచారణకు తిరస్కరించింది. దీనిపై ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మంగళవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఎకరం రూ.వెయ్యి లీజుతో... 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం మంగళగిరి మండలం ఆత్మకూరులోని కొండ, కాలువ పోరంబోకు స్థలాన్ని చంద్రబాబు ఎంపిక చేశారు. పక్కన ఉన్న కాలువలను పూడ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు పట్టాలిచ్చిన భూములను కూడా ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారి వెంట సర్వే నెంబర్ 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం 99 ఏళ్ల పాటు గత సర్కారు లీజుకు కేటాయించింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని ఏడాదికి ఎకరాకు రూ.1,000 లీజుపై కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేసింది. మరోవైపు అప్పటికే అదే భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేరుతో 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరుతో 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరుతో 1.75 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం. రైతుల ఆక్రోశం.. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమిని అధికారం అండతో బలవంతంగా లాక్కుని టీడీపీ కార్యాలయానికి కేటాయించారని రైతులు ఆక్రోశించినా గత సర్కారు పట్టించుకోలేదు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించగా స్టే ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోకుండా గత సర్కారు ఏకపక్షంగా భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. ఇదే భూమిలో చిన్నపాటి నిర్మాణాలకు అనుమతించాలని రైతులు కోరితే వాగు పోరంబోకులో నిర్మాణాలు చేపట్టరాదని, కొండపై నుంచి వచ్చే నీటికి ఆటంకం కల్పించరాదని అభ్యంతరం తెలిపిన నీటి పారుదల శాఖ అధికారులు టీడీపీ కార్యాలయం కోసం భారీ భవనానికి ఎలా అనుమతులు మంజూరు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్రమంగా ఏడంతస్తులు.. కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ టీడీపీ కార్యాలయం కోసం భారీ భవనాన్ని నిర్మించారు. స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నాయని రైతులు ఎంత మొర పెట్టుకున్నా ఆలకించలేదు. టీడీపీ కార్యాలయానికి 3.65 ఎకరాలను కేటాయించగా పక్కనే ఉన్న బొమ్ము రామిరెడ్డికి చెందిన 0.65 సెంట్ల భూమితోపాటు వాగును పూర్తిగా పూడ్చి నిర్మాణం చేపట్టారు. మరోవైపు భవన నిర్మాణ నిబంధనలను కూడా అతిక్రమించడం గమనార్హం. రెండు బేస్మెంట్లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్మెంట్లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తుండడం గమనార్హం. మొత్తం ఏడంతస్తుల నిర్మాణం జరుగుతోంది. ఇచ్చింది వెయ్యి గజాలు.. ఆక్రమణ 1,500 గజాలు రాష్ట్ర విభజన అనంతరం తొలుత గుంటూరు అరండల్‌పేటలోని పిచుకుల గుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి పార్టీ భవనాన్ని నిర్మించారు. జీ ప్లప్ –1కి అనుమతి తీసుకుని జీప్లస్ –2 భవన నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ స్థలాన్ని సాధారణంగా లీజుకు ఇవ్వరు. టీడీపీ హయాంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్ తీర్మానం చేసి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నారు. భవనానికి, ఆక్రమించిన స్థలానికి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. -
కొండముచ్చుకు ఫోన్ నచ్చింది!
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): అడవిలో ఆకులు, అలములు తింటున్న ఆ కొండముచ్చుకి బోర్ కొట్టినట్టుంది.. అందుకే కొండ సమీపంలో ఉన్న ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్‌ను పట్టుకెళ్లింది. కొండపై కూర్చుని ఎంచక్కా ఆ మొబైల్‌తో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది.. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణానికి చెందిన ఎస్కే చాంద్‌బాషా ఇంట్లోకి సోమవారం ఓ కొండముచ్చు చొరబడి.. ఆయన చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కెళ్లింది. దీంతో చాంద్‌బాషా దానిని వెంబడించాడు. తినుబండారాలు వేస్తే ఫోన్ వదిలేస్తుందని భావించి.. అరటిపళ్లు వేశాడు. తాపీగా వాటిని తీనేసిందిగానీ సెల్ మాత్రం వదల్లేదు. ఆ ఫోన్‌కు కాల్ చేయగా.. రింగవుతున్న ఆ మొబైల్‌ను రెండుచేతులతో పట్టుకుని మరింత ఆసక్తితో చూస్తోంది తప్ప వదలడం లేదు. రెండు గంటలు ప్రయత్నించి విసిగిపోయిన చాంద్‌బాషా చివరికి కొండముచ్చుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం కిందటే రూ.12 వేలతో ఫోన్ కొనుగోలు చేశానని పోలీసుల ఎదుట వాపోయాడు. -
‘దోచిన డబ్బు పంచేస్తున్నారు’
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో గెలవడానికి గుంటూరులో గల్లా జయదేవ్, మంగళగిరిలో నారా లోకేష్ వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని గుంటూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో కనీస అవగహన, పరిపక్వతలేని వారితో తాను పోటీపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. మైనార్టీలు, దళితుల నుంచి తమ పార్టీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. గుంటూరు లోక్‌సభ సీటు, మంగళగిరి అసెంబ్లీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమాన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 25వేల భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోదుగులు అభిప్రాయపడ్డారు. గుంటూరులో గల్లా జయదేవ్‌కు భారీ ఓటమి తప్పదని అన్నారు. ఎంపీతో పాటు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొంది తీరుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి ఒక్కరోజులోనే చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని మోదుగుల వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు సిద్ధమైన్నట్లు ఆళ్ల రామకిృష్ణరెడ్డి తెలిపారు. అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయలేదని, వేల ఎకరాలు భూమిని కాజేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భూములను బలవంతంగా లాగుక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. అక్రమంగా సంపాధించిన వేలకోట్ల రూపాయలను నారా లోకేష్ ఈ ఎన్నికల్లో తన గెలుపుకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యంకోసం ప్రజలు ఎదురు చేస్తున్నారని అభిప్రాయడ్డారు. -
చేనేత ప్రచారకర్తగా పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చేనేత సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు ప్రచారకర్తగా ఉండేందుకు ఆయన అంగీకరించారు. చేనేత సంఘాల నాయకులు మంగళవారం పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చలు జరిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను పవన్ కు వివరించారు. రెండున్నరేళ్లలో 45 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చేనేత కార్మికుల జీవన పరిస్థితులు మెరుగపరిచేందుకు సహరించాలని కోరారు. చేనేత మన జాతి సంపద అని, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ హామీయిచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే చేనేత కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వచ్చే నెలలో మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు.