
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): అడవిలో ఆకులు, అలములు తింటున్న ఆ కొండముచ్చుకి బోర్ కొట్టినట్టుంది.. అందుకే కొండ సమీపంలో ఉన్న ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్‌ను పట్టుకెళ్లింది. కొండపై కూర్చుని ఎంచక్కా ఆ మొబైల్‌తో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది.. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణానికి చెందిన ఎస్‌కే చాంద్‌బాషా ఇంట్లోకి సోమవారం ఓ కొండముచ్చు చొరబడి.. ఆయన చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కెళ్లింది. దీంతో చాంద్‌బాషా దానిని వెంబడించాడు. తినుబండారాలు వేస్తే ఫోన్ వదిలేస్తుందని భావించి.. అరటిపళ్లు వేశాడు. తాపీగా వాటిని తీనేసిందిగానీ సెల్ మాత్రం వదల్లేదు. ఆ ఫోన్‌కు కాల్ చేయగా.. రింగవుతున్న ఆ మొబైల్‌ను రెండుచేతులతో పట్టుకుని మరింత ఆసక్తితో చూస్తోంది తప్ప వదలడం లేదు. రెండు గంటలు ప్రయత్నించి విసిగిపోయిన చాంద్‌బాషా చివరికి కొండముచ్చుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం కిందటే రూ.12 వేలతో ఫోన్ కొనుగోలు చేశానని పోలీసుల ఎదుట వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment