
సాక్షి, గుంటూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గుంటూరులో పోలింగ్ సమయంతో వైఎస్సార్‌సీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని తెలియడంతో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఆయన వాహనంపై విచ్చలవిడిగా టీడీపీ నేతలు దాడికి తెగపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై టీడీపీ నేతలు హత్యాయత్నం చేసేందుకు యత్నించారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు న్యాయం జరగాలన్నారు. దొంగ ఓట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు రాకపోతే నా ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైందన్నారు. ఎలక్షన్ టైమ్‌లోనే కేశినేని నాని ఎంపీ, ఏడు కార్లతో తిరిగారని మోదుగుల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment