municapl elections
-
కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారు: సజ్జల
సాక్షి, అమరావతి: కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తుది వీడ్కోలు పలికారని అన్నారు. కుప్పం ప్రజలు బాబుకు దండం పెట్టేశారని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారని అన్నారు. చదవండి: Kuppam Municipal Election Results: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు చంద్రబాబును నమ్మలేదని తెలిపారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు. వరుస ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ పట్టం కడుతున్నారని తెలిపారు. పలు ఎన్నికల్లో టీడీపీకి జనసేన బహిరంగంగానే మద్దుతు ఇచ్చిందని అన్నారు. 100 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 97 శాతం స్థానాల్లో విజయం సాధించామని సజ్జల పేర్కొన్నారు. కాలం గడిచే కొద్దీ సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. బద్వేల్ ఎన్నికల్లోనూ టీడీపీ.. బీజేపీకి మద్దతు పలికినా అందరూ ఏకమైనా ఆ మెజారిటీ వచ్చిందని ఎద్దేవా చేవారు. 2019లో 50శాతం ఓట్లతో ప్రారంభమైన యాత్ర ఇప్పుడు 90 శాతాన్ని మించిందని అన్నారు. దౌర్జన్యాలు జరిగినట్లు చూపించాలని నానా యాగీ చేశారని, ఎదో విధంగా అలజడి సృష్టించి ఎన్నిక ఆపాలని చూశారని తెలిపారు. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని పండగ చేసుకుంటున్నారని, కళ్లు మూసుకుని తమదే విజయం అంటుంటే జాలి పడాల్సిందేనని అన్నారు. కుప్పం ప్రజలు బాబు చెర నుంచి విముక్తులైనందుకు అభినందనలు తెలిపారు. తమ పార్టీని అక్కడ ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తమకు ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ ప్రజలకు మోయలేని బరువైందని, అందుకే ప్రజలు దించేశారని అన్నారు. కుప్పం కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయ్యిందని, వైఎస్సార్, జగన్ కుప్పాన్ని అబివృద్ది చేశారని తెలిపారు. ఒక్క చంద్రబాబే దాన్ని వదిలేశాడని అన్నారు. ప్రజలు ఓటు వేయకపోతే చంద్రబాబు వాళ్లని నిందిస్తాడు కానీ సీఎం జగన్ తమ లోపం ఎక్కడ ఉందో సమీక్షించుకుంటాడని సజ్జల పేర్కొన్నారు. -
కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ ఓవరాక్షన్
తాడేపల్లి రూరల్ : కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు పురస్కరించుకుని టీడీపీ నాయకులు సోమవారం ఎక్కడాలేని అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అధినేతను ఇంట్లో నుంచి బయటకు రానీయడంలేదని నానా యాగీ చేశారు. కానీ, చివరికి చంద్రబాబే తన కుప్పం పర్యటనను రద్దుచేసుకుంటే పార్టీ శ్రేణులు ఓవరాక్షన్ చేసి హంగామా సృష్టించారు. అసలేమైందంటే.. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండగా అక్కడకు వస్తానని స్థానిక నాయకులకు సమాచారమిచ్చారు. ఆయన సోమవారం అక్కడకు వెళ్లాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తూ ప్రభుత్వం తమ అధినేతను ఇంట్లో నుంచి కదలనీయకుండా అడ్డుకుంటోందని టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, వాస్తవానికి చంద్రబాబు తనే కుప్పం పర్యటనను రద్దుచేసుకుని అక్కడి నాయకులతో టెలి కాన్ఫరెన్స్‌లో పరిస్థితులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఉ.11గంటల అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. కానీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందని, చంద్రబాబును కుప్పం వెళ్లకుండా అడ్డుకుంటోందని హోరెత్తించారు. -
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేఖ కలకలం
సాక్షి,తిరుపతి: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయవద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సామాజిక మాథ్యమాల్లో లేఖ పోస్ట్ చేశారన్న విషయం పట్టణంలో కలకలం రేపింది. ఎక్కడ చూసినా ఈ లేఖపైనే విస్తృత చర్చలు జరిగాయి. ‘కుప్పం గడ్డపై అన్న ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈ రోజు టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించకుండా రెండుసార్లు మనపై దాడి చేయించాడు. ఇప్పుడు గాయపడిన ప్రతి జూనియర్ అభిమానికి సమయం వచ్చింది. చదవండి: టీడీపీకి ఓటు వేయనన్నందుకు దళితుడిపై దాడి మన దెబ్బకు లోకేష్ పర్యటించిన అన్ని వార్డుల్లోనూ టీడీపీని ఓడించి మన ప్రతీకారం రుచి చూపిద్దాం. ఎన్టీఆర్ అభిమాని అనేవాడు దెబ్బతినడమే కాదు, తన సమయం వస్తే కోలుకోలేని దెబ్బ కొట్టగలడు. అని చూపిద్దాం.’ అంటూ లేఖలో పేర్కొన్న విషయంపై ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు టీడీపీకి ఓటు వేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేఖ విడుదల చేశారన్న సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో దుమారం రేపింది. పరిస్థితి తమ కొంప ముంచే ప్రమాదం ఉందని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఏ మాథ్యమాల్లో అయితే లేఖ వైరల్ అవుతోందని ప్రచారం జరుగుతోందో అక్కడే అందులోని సమాచారం అవాస్తవమని సమర్థించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేఖ వాస్తవమా.. అవాస్తవమా అనే విషయం పక్కన పెడితే ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. -
Kuppam: ‘బంగారు’ బాతుపై..చంద్రబాబు ఖడ్గం
చంద్రబాబు జమానాలో.. అంటే ఆయన కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరే.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారనే విషయం తెలిసిందే. ఏదీ రాకపోతే పోయింది.. కనీసం ఉన్న ఫ్యాక్టరీ కూడా మూతపడటం.. వందలాది కార్మికులు ఆధారపడ్డ ఆ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కనీస చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రాంతంపై ఆయన నిర్లక్ష్యానికి, వివక్షకు అద్దంపడుతోంది. కేంద్రంలో నేను చక్రం తిప్పుతున్నా అని పదేపదే చెప్పుకున్న 2001లోనే కుప్పంలోని చిగురుకుంట, బిసానత్తం బంగారు గనులు లాకౌట్ అయ్యాయి. వందలాది కార్మికులు, ఆధారపడ్డ వేలాది మంది జనం రోడ్డున పడ్డారు. కేంద్రం అధీనంలో ఉన్న సంస్థతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి ఫ్యాక్టరీ తెరిపించాల్సిందిగా కార్మికులు ఎన్నోమార్లు బాబును బతిమాలుకున్నారు. కానీ కుప్పానికి ‘గెస్ట్’ లీడర్‌గా వచ్చే ఆయనకి కార్మికుల గోడు ఏమాత్రం పట్టలేదు. దీంతో ఇరవై ఏళ్లుగా ఆ ఫ్యాక్టరీ లాకౌట్లోనే ఉండిపోయింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్).. ఆ మధ్య ఈ బంగారు గనుల నేపథ్యంపై కల్పిత గాథతో వచ్చిన ఓ కన్నడ సినిమా భారత చలనచిత్ర చరిత్రలోనే ఓ సంచలనం. అయితే వాస్తవంగా కుప్పంకు సమీపంలోని కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కేజీఎఫ్‌కు బంగారపు ముడి పదార్థం వెలికి తీసి మూడు దశాబ్దాలపాటు అందించింది మన గుడుపల్లె మండలంలోని చిగురుకుంట, బిసానత్తం గనులే. దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశానికే తలమానికంగా ఓ వెలుగు వెలిగిన ఆ గనులు బాబు జమానాలోనే మూతపడ్డాయి. గుడుపల్లె మండలంలోని బిసానత్తం గనిని ఎంఈసీఎల్(మినరల్ ఎక్సప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) 1968లో ప్రారంభించగా, చిగురుకుంట గనిని 1978లో ప్రారంభించింది. ఈ సంస్థలు క్వార్డ్జ్(బంగారు ముడిపదార్థం) వెలికి తీసి బీజీఎంఎల్(భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్) సారథ్యంలో ఉన్న కర్ణాటకలోని కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్)కి అందజేస్తూ వచ్చాయి. కాలక్రమేణా ఎంఈసీఎల్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఆయా గనులను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన బీజీఎంఎల్ 1982లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు నిరాటంకంగా బంగారు ముడి ఖనిజం వెలికితీత కొనసాగింది. కేజీఎఫ్ నష్టాల సాకుతో.. 2000 సంవత్సరంలో కేజీఎఫ్‌లోని చాంపియన్ గని నష్టాల్లో కూరుకుపోవడంతో మూతపడింది. కేజీఎఫ్ నష్టాల సాకుతో అప్పట్లో కొంతమంది మన రాష్ట్రంలోని చిగురుకుంట, బిసానత్తం గనులు కూడా భవిష్యత్తులో నష్టాల్లో కూరుకుపోతాయని లెక్కలు చూపడంతో అప్పటికి లాభాల్లోనే ఉన్న ఆయా గనులను అర్ధంతరంగా (2001 జనవరి 15న) లాకౌట్ చేశారు. దీంతో ఆయా గనుల్లో బంగారం వెలికి తీసే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఫలితంగా బిసానత్తం గనిలో పనిచేస్తున్న 500 మంది, చిగురుకుంట గనిలో పనిచేస్తున్న మరో 1000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. బాబు ఎందుకు పట్టించుకోలేదో..? సరిగ్గా అప్పుడే బాబు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.. కేంద్రంలో చక్రం తిప్పుతున్నానంటూ గొప్పకుపోయిన కాలమది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఒకే ఒక పెద్ద ఫ్యాక్టరీ మూత పడి కార్మికులు రోడ్డున పడితే బాబు తీవ్రంగా స్పందిస్తారని అందరూ ఆశించారు. కేంద్రంతో మాట్లాడి.. బీజీఎంఎల్(భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్)తో చర్చలు జరిపి ఫ్యాక్టరీలు తెరిపిస్తారని భావించారు. కానీ ఆయన ఈ విషయమై కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. టెండర్ పూర్తయినా ప్రారంభం కాని పనులు విచిత్రమేమిటంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఫ్యాక్టరీలు తెరిచే సన్నాహాలకు బ్రేక్ పడ్డాయి. జియో సంస్థ నివేదిక ఆధారంగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయా గనులకు సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగసంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్( ఎన్ఎండీసీ) బిడ్‌ను దక్కించుకుంది. దీంతో త్వరలోనే కంపెనీలు ప్రారంభమవుతాయని, మళ్లీ తమకు ఉపాధి లభిస్తుందని కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్యాక్టరీ తలుపులు తెరుచుకోలేదు. ► రెండు దశాబ్దాలుగా గనుల మూతతో ఆ ప్రాంతంలోని భారీ జనరేటర్లు, లిప్టులు, ట్యాంకులు, మోటార్లు తుప్పుపట్టాయి. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇందులో రెండు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి.. మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటకు తీయడానికి వినియోగించేవారు. ప్రస్తుతం సొరంగ మార్గానికి వినియోగించే భారీ టవర్లు తుప్పుపట్టి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. బాబు అస్సలు పట్టించుకోలేదు 2001 సంక్రాంతి వేళ గనుల కార్మికుల జీవితాల్లో చీకటి అలుముకుంది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును అతికష్టం మీద కలిసి ఎలాగోలా ఫ్యాక్టరీలు తెరిపించాలని వేడుకున్నాం. కానీ ఇన్నేళ్ల కాలంలో అస్సలు పట్టించుకోలేదు. – సుబ్రమణ్యం, కార్మికుడు, చిగురుగుంట ఫ్యాక్టరీ వైఎస్సార్ హయాంలో మళ్లీ సర్వే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఆ కార్మికుల ఆశలకు ఊపిరివచ్చింది. వైఎస్సార్ హయాంలోనే ఆస్ట్రేలియాకి చెందిన ఓ కంపెనీ ఈ ప్రాంతంలో సర్వే చేసింది. బంగారు నిక్షేపాల లభ్యత ఏమేరకు ఉందని పరిశీలించేందుకు 40బోర్లతో డ్రిల్లింగ్ చేపట్టి.. శాంపిల్ కూడా సేకరించింది. ఇక్కడి నిక్షేపాల్లో బంగారు శాతం 60నుంచి 70 వరకు ఉందని తేల్చింది. ఆ మేరకు నివేదిక అందించింది. అయితే 2009లో మహానేత వైఎస్ హఠాన్మరణంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సర్వే చేపట్టాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. ఆ మేరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి కేంద్రానికి నివేదిక అందజేశారు. లోక్‌సభలో ప్రస్తావించా కుప్పం పట్ల చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ బంగారు గనులే. కేజీఎఫ్ మూతపడటంతో ఇవి కూడా మూతపడాలని ఎందుకనుకున్నారో ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నేను లోక్‌సభలో ఆయా గనుల పునరుద్ధరణను ప్రత్యేకంగా ప్రస్తావించా. త్వరలో ఎన్ఎండీసీ అధికారులతో కూడా మాట్లాడి మళ్లీ గనులను తెరిపించేందుకు శక్తివంచన లేని కృషి చేస్తాం. – రెడ్డెప్ప, చిత్తూరు ఎంపీ కచ్చితంగా గనులు తెరుస్తాం 2018లో మేం బిడ్ దక్కించుకున్న మాట వాస్తవమే. అయితే కొన్ని సాంకేతికపరమైన, పాలనాపరమైన, న్యాయపరమైన సమస్యల వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కొలిక్కి వస్తున్నాయి. కచ్చితంగా త్వరలోనే గనులు మొదలవుతాయి. – జయ ప్రకాష్, ఎన్ఎండీసీ డీజీఎం -
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైస్ఆర్సీపీ
-
స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్ వన్ సైడే
-
మోదుగుల వాహనంపై టీడీపీ నేతల దాడి
సాక్షి, గుంటూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గుంటూరులో పోలింగ్ సమయంతో వైఎస్సార్సీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని తెలియడంతో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఆయన వాహనంపై విచ్చలవిడిగా టీడీపీ నేతలు దాడికి తెగపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై టీడీపీ నేతలు హత్యాయత్నం చేసేందుకు యత్నించారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు న్యాయం జరగాలన్నారు. దొంగ ఓట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు రాకపోతే నా ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైందన్నారు. ఎలక్షన్ టైమ్‌లోనే కేశినేని నాని ఎంపీ, ఏడు కార్లతో తిరిగారని మోదుగుల తెలిపారు. చదవండి: ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ -
బీజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు..
సాక్షి, చౌటుప్పల్: కేవలం ఎంఐఎం పార్టీపై మాత్రమే తమ పోరాటమని.. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, ఓవైసీ బ్రదర్స్ కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెజార్టీ మున్సిపాలిటీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని... లక్ష మంది ఓవైసీలు, కేసీఆర్ లు వచ్చినా బీజేపీ హవా అడ్డుకోలేరని కిషన్ రెడ్డి తెలిపారు. -
ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..
సాక్షి, హైదరాబాద్: విజన్ లేని కాంగ్రెస్ పార్టీ.. విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్ లో రూ.5 భోజనం పెడతామని కాంగ్రెస్ చెబుతోందని.. ప్రభుత్వం ఐదేళ్లుగా రూ.5 భోజనం అమలు చేస్తోందన్నారు. అనేక మంది పేద వారి కడుపు నింపుతుందని పేర్కొన్నారు. చెరువులు సుందరీకరణ చేస్తామని చెబుతున్నారని.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరణ పనులు చేపడుతుందని వెల్లడించారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇప్పటికే ఉన్నాయని.. ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్ఎస్ పూర్తి చేసిన పనుల్ని కాంగ్రెస్ చేస్తానంటోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులందరితోనూ కేటీఆర్ మాట్లాడారని, అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థుల ప్రచార సరళిపై ఆరా తీశారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. -
మనమే ‘పుర’పాలిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15 తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న మున్సి పల్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరో నాలుగైదు రోజు ల్లో నగారా మోగుతుందన్న సంకేతాల నేపథ్యంలో.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా పురపోరుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కావాలనే వ్యూహంతో టీఆర్ఎస్, కనీస సీట్లను దక్కించుకుని గౌరవాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్‌ను కొనసాగిస్తూ వీలున్నన్ని స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో కమలనాథులు ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి సమయం కూడా లేకపోవడంతో ఇప్పుడు ఈ మూడు పార్టీలు రంగంలోకి దిగాయి. వామపక్షాలతో పాటు టీజేఎస్, టీడీపీ లాంటి పార్టీ్టలు కూడా అక్కడక్కడా పోటీ చేసే అవకాశాలున్నా కార్యాచరణతో ముందుకెళుతున్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ కసరత్తు షురూ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రంలోని అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీనే ముందుగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఎన్నికల కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. పొన్నం ప్రభాకర్, సంపత్, వంశీచందర్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ రెండు సార్లు భేటీ అయి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సూచనల మేరకు ఇప్పటికే జిల్లా స్థాయిలో సమావేశాలు కూడా పూర్తయ్యాయి. ఈనెల 13, 14, 15 తేదీల్లో మున్సిపాలిటీల స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, మాజీలంతా హాజరు కావాలని, వార్డుల వారీగా చర్చించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కూడా ఆయన ఆదేశాలిచ్చారు. కేవలం ఇద్దరు ఆశావహుల పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాల వారీ ఇంచార్జీలను నియమించి వారికే సమావేశాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మొత్తంమీద ఈసారి ఎట్టి పరిస్థితుల్లో.. కనీస స్థాయిలో మున్సిపాలిటీల్లో పాగా వేసేలా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు క్షేత్రస్థాయి యంత్రాంగమంతా మున్సిపల్ ఎన్నికల్లో నిమగ్నమయింది. కమలనాథులూ కదిలారు! పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మంచి ఊపు మీదున్న రాష్ట్ర బీజేపీ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బోణీ కొట్టడం ద్వారా తెలంగాణలో తాము రాజకీయ శక్తిగా అవతరించామనే సంకేతాలిచ్చే వ్యూహం తో పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే బూత్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్న కమలనాథులు కీలక నేతలకు జిల్లాల వారీ బాధ్యతలు అప్పజెప్పారు. వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ మున్సిపాలిటీల వారీగా పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గౌరవప్రదమైన స్థాయిలో వార్డులు, చైర్మన్ పీఠాలు దక్కించుకోవాలని ఆశిస్తోంది. అందు లో భాగంగానే అసంతుష్టులు, ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ వారిని పార్టీలో చేర్చుకుంటోంది. మొత్తంమీద మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఓట్లు, సీట్లు ఆధారంగానే తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం అడుగులు వేయొచ్చనే అంచనాతో వ్యూహాలు రచి స్తూ లక్ష్మణ్ సేన మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇక, మిగిలిన పక్షాలైన వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయా లని భావిస్తున్నాయి. వీటిలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. మళ్లీ స్వీప్ చేయాల్సిందే! -
అభ్యర్థులేరీ..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. అభ్యర్థుల ఆశావహుల జాబితాతో హైదరాబాద్ రావాలని జిల్లా నాయకులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నుంచి పిలుపు రావడంతో జిల్లా నుంచి నేతలు హైదరాబాద్‌కు బయలుదేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కరువవడంతో తృతీయ శ్రేణి నాయకుల జాబితాతో జిల్లా నేతలు వెళ్లినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ప్రస్తుత ఒంగోలు నగర అధ్యక్షునిగా ఉన్న జడా బాల నాగేంద్రం డీసీసీ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల నాగేంద్రం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్ గురువారం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. వీరు బొత్సతో శుక్రవారం భేటీ అయి మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. వారికే బీఫామ్‌లు కూడా ఇచ్చి అభ్యర్థులను పోటీకి దింపాలని బొత్స కోరనున్నట్లు సమాచారం. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలోనే ఆదుకోవాలని, ఇతర నేతల్లాగా పార్టీలు మారడం సరికాదని వీరికి నచ్చజెప్పే యత్నం కూడా బొత్స చేయనున్నారు. జిల్లాలో పార్టీ చతికిలపడిందనే భావన రాకుండా, అన్ని వార్డుల్లో అభ్యర్థులుండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చైర్మన్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ హయాంలో వైభవాన్ని చాటిన కాంగ్రెస్ పార్టీ, నేడు అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉండటంతో జిల్లాలో పార్టీకి దశ, దిశ కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా బాల నాగేంద్రంని నియమించే అవకాశ ం ఉన్నట్లు తెలిసింది. జిల్లా పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించడానికి బొత్స నిర్ణయించుకున్నట్లు సమాచారం.