
సాక్షి, హైదరాబాద్: విజన్ లేని కాంగ్రెస్ పార్టీ.. విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్ లో రూ.5 భోజనం పెడతామని కాంగ్రెస్ చెబుతోందని.. ప్రభుత్వం ఐదేళ్లుగా రూ.5 భోజనం అమలు చేస్తోందన్నారు. అనేక మంది పేద వారి కడుపు నింపుతుందని పేర్కొన్నారు.
చెరువులు సుందరీకరణ చేస్తామని చెబుతున్నారని.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరణ పనులు చేపడుతుందని వెల్లడించారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఇప్పటికే ఉన్నాయని.. ఆ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్ఎస్ పూర్తి చేసిన పనుల్ని కాంగ్రెస్ చేస్తానంటోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులందరితోనూ కేటీఆర్ మాట్లాడారని, అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థుల ప్రచార సరళిపై ఆరా తీశారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment